Monday, July 5, 2010

Mahaa-TV స్టూడియోలో N-TV చీఫ్ ఎడిటర్ కొమ్మినేని

మన తెలుగు జర్నలిజంలో ఒక పెద్ద తెగులు ఉంది. ఒక ఛానల్ ఉద్యోగి ఇంకొక ఛానల్ ఆఫీసుకు వెళ్ళడానికి వీల్లేదు. ఒక పత్రిక విలేకరి మంచి పనులు, విజయాలు ఇతర పత్రికలు/ ఛానెల్స్ లో కవర్ చేయబడవు. ఏ పత్రికో, చానెలో ఏదైనా వివాదంలో చిక్కుకుంటే 'బాగయ్యింది...బాగయ్యింది..' అని చంకలు గుద్దుకుంటూ....దాని పేరు ఇతర పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో రాస్తారు కానీ...సాటి పత్రిక లేదా ఛానల్ కు సంబంధించి కమ్మని కబురు ఏదైనా వుంటే...దాని గురించి పిసరంతైనా రాయరు/ చూపరు. ఇది పెద్ద మనసు, విశాల భావం లేకపోవడమనే జబ్బు. ఈ జబ్బు రాచకురుపు స్థాయికి చేరుకోవడానికి కారణం మా 'డాడీ.'

హేమ నుంచి....'Watch Mahaa-TV' అని ఎస్.ఎం.ఎస్. వస్తే...ఒక మిత్రుడితో మాట్లాడుతున్న వాడిని కాస్తా...పరుగు పరుగున వెళ్లి దగ్గరలోని టీ.వీ.కబ్జా చేసి ఛానల్ మార్చాను. N-TV చీఫ్ ఎడిటర్ గా వున్న కొమ్మినేని శ్రీనివాస రావు గారు Mahaa-TV ఛానల్ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు. విషయం: ఆదివారం ఆవిష్కృతమైన ఆయన పుస్తకం...."సంభాషణా చతురుడు...ముఖ్యమంత్రి రోశయ్య." ఇందులో 'ణ' కు దీర్ఘం ఇవ్వడం...తప్పని, అయినా శీర్షికలోనే తప్పేమిటి? అని ఒక సోదరుడు నిట్టూర్పు విడిచాడు. 

"ఇదేమిటి...Mahaa-టీవీ లో కొమ్మినేని మాట్లాడుతున్నారు?" అని మరొక సీనియర్ జర్నలిస్టు అన్నారు. సరే...కొమ్మినేని రోశయ్య గారిని పొగడడం, ఆ చర్చలో పాల్గొన్న ఆస్థాన విద్వాంసుడు తెలకపల్లి రవి గారు తనదైన శైలి లో వ్యాఖ్యలు చేయడం..జరిగింది. చంద్రబాబు ను వదిలి...కొమ్మినేని గారు రోశయ్య గార్ని పట్టుకున్నారేమిటి? అని ఒక క్షణం అనిపించినా....Mahaa-TV వారి పెద్ద మనసు నాకు బాగా నచ్చింది. ఈ నిర్ణయం తీసుకున్న ఐ.వెంకట్రావు గారికి అభినందనలు. 

సాటి జర్నలిస్టు ఒక ప్రయత్నం చేయడాన్ని మీడియా పెద్దలు ప్రోత్సహించాలి. దానిలో లోటుపాట్లను చర్చించాలి. "ఛీ...ఛీ..వేరే పేపర్/ఛానల్ జర్నలిస్టు పేరు మా దాట్లో ఇవ్వడం ఏమిటి?" అన్నది ఫక్తు సంకుచిత బుద్ధి. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలలో మాదిరిగా...జర్నలిస్టును జర్నలిస్టు గా చూడాలి తప్ప అప్పటికి తాను పని చేస్తున్న ఒక మీడియా హౌసు ప్రతినిధిగా చూడకూడదు. మంచిని మంచిగా చెప్పడంలో మనం ఎందుకు సిగ్గు పడాలి? 
ఫ్రీలాన్స్ జర్నలిస్టులు సైతం తమ పత్రికకు మాత్రమే రాయాలని, అదే సమయంలో తాము ప్రతిఫలంగా ఇచ్చే పల్లీ గింజలతో తృప్తి పడాలని 'ఈనాడు' ఒక సంప్రదాయాన్ని సృష్టించింది. అంతే కాదు...దాదాపు ఇరవై ఏళ్ళు తమ సంస్థలో పనిచేసిన యోగేశ్వర రావు గారు ఇప్పుడు 'సాక్షి' లో ఉన్నారు కాబట్టి...తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కుమారుడికి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరంలేదని 'ఈనాడు' పెద్దలు నిర్ణయించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకా నయం...తమ సంస్థను వీడి వెళ్ళిన జర్నలిస్టు కారణాంతరాల వల్ల మళ్ళీ ఉద్యోగం కోసం వస్తే గతంలో శత్రువుని చూసినట్లు చూసే వారు, మళ్ళీ రానిచ్చేవారు కాదు. పరిస్థితి ఇప్పడు కాస్త మారింది. అందరం మనుషులమే అనుకునే బుద్ధి లోపించడం తోనే అసలు సమస్య.      

ఈర్ష్య, ద్వేషం మాని జర్నలిస్టులు సాటి జర్నలిస్టులను ప్రోత్సహించడం భలే కష్టం చాలా మందికి. Mahaa-TV  మొదలుపెట్టిన ఈ సంప్రదాయాన్నిఅన్ని ఛానెల్స్, పత్రికలు కొనసాగించి సంకుచితత్వాన్ని పారదోలాలని కోరుకుందాం. వారు అలా చేయడం నిజంగా నాగరిక లక్షణం, ప్రజాస్వామ్య స్ఫూర్తి. 
అయితే...."వేరే ఛానల్ లో వున్న మనోళ్ళను మాత్రమే స్టూడియోలకు పిలిచి మార్కెటింగ్ చేసిపెడదాం," అని ఛానల్ యజమానులు అనుకోవడం మాత్రం అనాగరికం, అప్రజాస్వామిక మవుతుంది. కాదా? 

16 comments:

Unknown said...

J R Prasad at last joined Andhra Jyothi. Crushed under intense pressure in Deccan Chronicle, the poor man finally settled for a desk job. But Mr P Bhaskar not yet recovered from the stroke he received from DC bosses. Recently K Srinivasa Rao left the organisation to join the Hindu. many employees in DC are now suffering with BP and Sugar, soon we can see more people joining hospital unable to bear the pressure there.

vaanachinuku.blogspot.com said...

We should welcome it.

Anonymous said...

మీ బ్లాగు ద్వారా తెలకపల్లి రవి గారికి ఒక మనవి.సార్ మీరొక్కరే ఆంధ్రా లో మేధావి వర్గానికి ప్రతినిధులా? నేను మిమ్మల్ని దాదాపు అన్ని చానల్స్ లో చర్చలో పాల్గొనటం చూశాను. ఈ వయసులో మీరు అంత ఉత్సాహం గా పాల్గొన వలసిన అవసరం ఉందా? మీకు అన్ని విషయాల మీదా అంతా తెలిసినట్టు మాట్లాడూతు ఉంటె చాలా చీకాకు గా ఉంట్టుంది. మీడియా రంగం బాగు పడాలంటె మీ లాంటి వారు చర్చలో తక్కువగా, ఎంతో అవసరమైతె తప్ప పాల్గోనాలి. ఎప్పుడైతె మీ లాటి వారు పాల్గొనరో టి.వి. వాళ్ళు ప్రోగ్రాం లను తగ్గిస్తారు. కారణం మేధావులు దొరకక. అప్పుడు ప్రజల మీద మీడియా ప్రభావం తగ్గుతుంది.
అదేకాక వామ పక్ష వాదులమంటారు నిరంతరం ప్రైవేట్ టి.వి. చానేల్స్ లో నే గడుపుతారు. ఎప్పుడొ అవసరమైతె ప్రైవేట్ చానేల్స్ లో చర్చల లో పాల్గొంటె అర్థం చేసుకోవచ్చు. మీది శృతి మించిదని పిస్తుంది మీరు వ్యక్తిగత ఇమేజ్ కొరకు పాటు పడుతున్నట్లు అనిపిస్తూ ఉంట్టుంది. ఎందుకంటె మీరు వ్యాసలు రాసే పత్రిక ఎవ్వరు చదవరు కదా అని నా అనుమానం.

Bhajagovindam said...

Bhajagovindam said...
Ee gooti chiluka aa gooti paluke palukutundani oka sameta undi. Adevidhamga Naren Chowdarygaru, Komminenigaru, IVenkataraogarlu okari kastanni marokaru grahistaru,,,okari talentnu marokaru gurtistaru...deenilo pedda vishesham eemi ledu...
Kommineni, IVenkatrao, Radhakrishna,Rajasekhar...Journalistula staai eppudo datipoyyaru...kaabatti varini Industrialists ani andaam...

P.S. Komminenigaru Roshaiahgaari pai raasina pustakam kosam Remunaration enta teesukunnaro telusaa...just 10 lakhs...Ramugaaru meeru Ramoji pai pustakam rayadam waste...Komminenigaripai Pustakam rayandi....Title " Sampadanaa chaturudu KOMMINENI"

All the best GURUVU garu....

kvramana said...

anna
What you said is correct. But in this case it is the owner of a channel and another super senior journalist. Do you think the managements of other media houses allow their employees to be featured in other publications/news papers? In one of my earlier assignments, the editor had allowed me to participate in a panel discussion on a TV channel. On the day I went to him to put in my papers, he told me upfront..."I allowed you to go the TV channel. Now, I can use the same situation to take action against you since there is no evidence on me allowing you to go there. Instead of you quitting, I can terminate you on disciplinary grounds."
Though the spirit of what you said is correct, the bosses and the managements are yet to grow up. (I am sorry to say this and this is not intended to hurt anyone)

చదువరి said...

"దాదాపు ఇరవై ఏళ్ళు తమ సంస్థలో పనిచేసిన యోగేశ్వర రావు గారు ఇప్పుడు 'సాక్షి' లో ఉన్నారు కాబట్టి...తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కుమారుడికి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరంలేదని 'ఈనాడు' పెద్దలు నిర్ణయించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు." - మిగతా విమర్శల సంగతేమోగానీ, మీ ఈ వాదన మాత్రం చిత్రంగా ఉంది. గతంలో తమ దగ్గర పని చేసినంత మాత్రాన, ఇప్పుడు వేరే సంస్థలో పనిచేస్తున్న వ్యక్తిని ఆదుకోవాలనే నియమమేదైనా ఉందా?

kattashekarreddy said...

Ramu garu,
Thank u for your appreciation. But there is no caste angle in this case. We want to be professonal to the extent we are allowed. NTV, TV5, Sakshi excluded AJ from their newspaper reviews. but we are not.though RK demeaned our team many a times here and there. We are doing bokk reviews regularly. IVR also visited in some of NTV debates without hesitation. ofcourse common good being and mutual respect isnecessary for this type of relations.once again I thank u for what u have wrote.
shekar Reddy katta

pl do not publish

ramasai said...

a particular community is supporting Sri Rosaiah to prevent Jagan.
That Community is strongly feels that if Rosaiah continuous for next four years it will become easy for chandrababu to get power in 2014.
Thats all, they have no special PREMA on Rosaiah. Kommineni book is also part and parcel of that idea. nothing but other.

CH.DURGA PRASAD said...

కొమ్మినేని పుస్తకావిష్కరణ సభలో ఆ యాంకరమ్మ కొంచం మర్యాదగా మాట్లాడితె బాగున్ను.

దుర్గాప్రసాద్.సి.హెచ్.

VENKATA SUBA RAO KAVURI said...

తెలకపల్లి విషయం లో మీ వ్యాఖ్యానం వ్యంగ్యంగా అనిపిస్తొంది. పరుసు ప్రతిఫలం అశించకుండా కేవలం సిధ్ధాంత ప్రచారం కోసం కస్టపడటాన్ని తప్పుగా మాట్లాడటం సరికాదు.
వెంకట సుబ్బారావు కావూరి

balu said...

రాము గారు చాలా చక్కగా రాశారు.కొసమెరుపు ఇంకా బావుంది. ఇక కామెంట్లలో బంగర్ రాసింది చదివాక నా మనసంతా బాధతో నిండిపోయింది.జె ఆర్ నా జూనియర్, భాస్కర్, కెసిఆర్ తో కలిసి ఈనాడులో పడ్డ బాధలు అన్నీ ఇన్ని కాదు. అక్కడి నుంచి పారిపోయి ఇంగ్లీష్ జర్నలిజింలో కుదురుకుందామంటే....పరిస్థతి ఇలా ఉంటుంది బతుకు దినదిన గండం అంటే ఇదే...

Krishnarjun said...

కొమ్మినేని గారికి ప్రెస్ అకాడమి ఛైర్మన్ పదవి వచ్చేసినట్టేనన్నమాట.

Krishnarjun said...

జమున గారిని ఏడిపించడానికి ప్రయత్నించినట్టు, కొమ్మినేని గారిని కూడా ఏడిపించడానికి పిలిపించివుంటారు. కానీ కొమ్మినేని గారేమో "సంభాషణా చతురుడాయె". కుదిరుండదు.

Vinay Datta said...

How is Gowtham? Is he recovering?

Vinay Datta said...

I usually read all the comments of every post. Unfortunately sometimes I miss a few like I missed Bhajagovindam garu's comment. Bhajagovindam garu, sorry, I don't mean to hurt you but I donot want to hurt my eyes.

premade jayam said...

ఈ శక్తిని ఏ వెబ్ మీడియా పెట్టడానికో ఖర్చు చేయండి.మా లాంటి వాళ్ళం తలా ఒక చేయి వేస్తాం. వార్తల పరంగా.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి