Friday, April 30, 2010

పీ.ఎఫ్.పై i-news సిబ్బంది దిగులు- పట్టించుకోని యాజమాన్యం

 i-news ఛానల్ లో ఉద్యోగులు....ఆలస్యమవుతున్న  జీతాలతోపాటు గోడకు కొట్టిన సున్నంగా మారినట్లు కనిపిస్తున్న తమ ప్రావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్.) గురించి తీవ్రంగా దిగులు పడుతున్నారు. యాజమాన్యం పే స్లిప్పులు ఇవ్వకుండా...పీ.ఎఫ్.కింద జీతంలో ఇతని కోతపెట్టడంతో జర్నలిస్టులు, సాంకేతిక సిబ్బంది కుమిలిపోతున్నారు. త్వరలో....ఈ అంశంపై మూకుమ్మడి పోరాటం చేయాలని, ముందుగా మానవ హక్కుల సంఘాన్ని కలవాలని  ప్రస్తుత ఉద్యోగులు, అక్కడ పనిచేసి వేరే ఛానెల్స్ కు మారిన మాజీ జర్నలిస్టులు భావిస్తున్నారు. 

ఇది ప్రవాస భారతీయుల ఛానల్ అని రాజశేఖర్ అనే జర్నలిస్టు  నమ్మబలకడంతో దాదాపు నాలుగు వందలకు పైగా ఉద్యోగులు పొలోమంటూ i-news లో ఏడాదిన్నర కిందట చేరారు. యజమానుల నిజస్వరూపం తెలిసి అందులో చాలా మంది వేరే చానెల్స్ కు వెళ్ళిపొయ్యారు....రాజశేఖర్ మహాశయుడితో సహా. డబ్బున్న మారాజు ఆయనకు పర్వాలేదు కానీ....మిగిలిన ఉద్యోగులు తమ జీతంలో నుంచి తమ వాటా కింద, యాజమాన్యం వాటా కింద....మానేజ్మెంట్ కోతపెట్టిన పీ.ఎఫ్.పై ఆశలు పెట్టుకున్నారు. 

"మీ పీ.ఎఫ్.ఎటూ పోదు," అని రాజా వారు నమ్మించడంతో ఉద్యోగులు కిమ్మనకుండా పనిచేసారు...పే స్లిప్లు ఇవ్వకపోయినా. అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం ధోరణి చూశాక ...అసలు పీ.ఎఫ్. ఆఫీసులో సంస్థ అకౌంట్ లో ఈ మొత్తం నెలనెలా జమ అవుతుందా...అన్న అనుమానం కొందరికి కలిగింది. Integrated Broadcasting Company (P) Limited అన్న పేరుతో రాజశేఖర్ ఈ సంస్థను నెలకొల్పాడు. 

'ఇది పెద్ద స్కాం అని నా అనుమానం. ఎవరో ఒకరు దీనిమీద ఆరా తీయాలి, i-news యాజమానులను బుక్ చెయ్యాలి," అని ఆ ఛానల్ లో ఈ మధ్య వరకూ పనిచేసి N-TV లో చేరిన ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించాడు. ఆయన కట్టిన లెక్క ప్రకారం ఇప్పటి వరకూ i-news యాజమాన్యం రెండున్నర కోట్లకు పైగా ఉజ్జోగుల నుంచి పీ.ఎఫ్.కింద వసూలు చేసింది.
ఈ విషయంలో యాజమాన్యం ఉద్యోగులకు భరోసా ఇవ్వకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తంఅవుతున్నది. జర్నలిస్టు సంఘాలు దీనిపై స్పందించి న్యాయం చెయ్యాలని వారు కోరుతున్నారు.

Wednesday, April 28, 2010

వేతన సంఘానికి 'ఈనాడు'పై రెండు ఫిర్యాదులు

హక్కులు, గిక్కుల గురించి పట్టించుకోకుండా...'ఈనాడు' ఇచ్చే జీతం మహాప్రసాదంలా భావించి తృప్తిపడే అమాయక జర్నలిస్టులకు ఇది శుభవార్త.  మనసిన వేజ్ బోర్డ్ చేసిన సిఫార్సులను 'ఈనాడు' యాజమాన్యం ఎలా తుంగలో తొక్కిందీ/ తొక్కుతున్నది, పూర్తి అలవెన్సులు గట్రా ఇవ్వకుండా జర్నలిస్టులను ఎలా మోసం చేస్తున్నదీ కొత్త వేజ్ బోర్డు దృష్టికి తీసుకుపోయారు...మన పోరాట యోధుడు గడియారం మల్లికార్జున శర్మ (జీ.ఎం.ఎస్.).

'ఈనాడు' దౌర్జన్యానికి బలవుతున్న జీ.ఎం.ఎస్. బుధవారం ఉదయం భువనేశ్వర్ లోని శ్రియాచౌక్ ప్రాంతంలో ఉన్న ఒరిస్సా కార్మిక కమిషనర్ కార్యాలయంలో కొత్త వేజ్ బోర్డ్ హియరింగ్ కు హాజరయ్యారు. బోర్డుకు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ (రిటైర్డ్) జీ.ఆర్.మజథియను, ఐదుగురు సభ్యులను కలుసుకున్నారు. పాత వేజ్ బోర్డును సిఫార్సులను 'ఈనాడు' తుంగలో తొక్కిన వైనాన్ని ఒక నివేదిక రూపంలో వివరించారు. 


తన కేసును ఉదహరిస్తూ..తన వేతనం ఏడాదికి ఎంత పెరగాల్సిందీ, ఎంత పెరిగిందీ సవివరంగా ఒక పట్టిక (టేబుల్) రూపంలో వివరించారు. నీతి సూత్రాలు వల్లించే 'ఈనాడు' యాజమాన్యం....'న్యూస్ టుడే' అనే వార్త సంస్థ ముసుగులో జర్నలిస్టులను ఎలా దోచుకుంటూ లాభాపడుతున్నదీ జీ.ఎం.ఎస్. (ఫోటోలో ఎర్ర రంగు బాక్స్ లో ఉన్న వ్యక్తి) వివరించారు. 

ఈ ఫిర్యాదును సమర్పిస్తున్న సందర్భంలోనే....హక్కుల గురించి మాట్లాడిన తనపై 'ఈనాడు' ఎలా కక్ష కట్టిందీ జీ.ఎం.ఎస్. మజథియకు నోటిమాటగా వివరించారు. రెండేళ్లలో మూడు బదిలీలు చేసి, పోస్టు లేని చోట పోస్టింగ్ ఇచ్చి వేధిస్తున్న ఘోరాన్ని వివరించినప్పుడు మజథియ (ఫోటోలో సూటు తో ఉన్న వ్యక్తి) మానవతతో చలించి స్పందించారు. 

"మీరు ఈ వేధింపులపై మరొక పెటిషన్ ఇవ్వండి," అని మజథియ స్వయంగా కోరారు. దాంతో...జీ.ఎం.ఎస్. అక్కడికక్కడ మరొక ఫిర్యాదు తయారు చేసి అందజేశారు. ఇలాంటి ఫిర్యాదులపై స్పందించి శిక్ష వేసే అధికారం వేజ్ బోర్డుకు ఉండదు. అయినా....తాను ఈ విషయాన్ని కార్మిక శాఖ అధికారుల దృష్టికి తెస్తానని మజథియ చెప్పారు. 


"మన వాదనను మజథియ సావధానంగా విన్నారు. ఆయనను కలవడం తృప్తిని ఇచ్చింది. తెలుగు జర్నలిస్టులకు మేలు జరుగుతుంది అన్న ధీమా కలిగింది," అని జీ.ఎం.ఎస్. ఈ బ్లాగర్ కు టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఈనాడు' లో గతంలో కంట్రిబ్యూటర్ పనిచేసిన రమణమూర్తి కూడా మజథియ బృందాన్ని కలిసిన జర్నలిస్టులలో ఉన్నారు. మజథియకు జీ.ఎం.ఎస్. ఇచ్చిన పిటిషన్ మొదటి పేజీ ఈ పక్కన ఇచ్చాం.

ఆర్థిక సహాయానికి జర్నలిస్టులు సిద్ధం 

జీ.ఎం.ఎస్. చేస్తున్న పోరాటంపై ఈ బ్లాగ్ లో వచ్చిన కథనం చూసి పలువురు జర్నలిస్టులు స్పందించారు. ఈ పోరాటంలో ఆర్థికంగా, మానసికంగా  కుంగిపోయిన ఆయనకు సహాయంచేయడానికి ముందుకు వచ్చారు. డబ్బు ఎకాయికి అతని అకౌంట్ లోకి వెళ్ళేలా చేయడమా లేక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లలో ఫండ్ రైజ్ చేసి పంపడమా అన్న అంశంపై ఇంకా ఒక స్పష్టత రాలేదు. ఈ విషయంలో జర్నలిస్టుల సూచనలు, సలహాలకు స్వాగతం.

Tuesday, April 27, 2010

అనుక్షణం క్షోభ పెడుతూ...ఒక జర్నలిస్టుపై 'ఈనాడు' ప్రతాపం

జర్నలిస్టు అంటే...అన్యాయాన్ని ఎదిరించేవాడు...హక్కుల కోసం వాదించేవాడు.
జర్నలిస్టు అంటే...న్యాయం కోసం తపనపడేవాడు...
జర్నలిస్టు అంటే...సత్యం కోసం అన్వేషించేవాడు...
జర్నలిస్టు అంటే...సత్యం, న్యాయం కోసం హింసను భరించేవాడు...
జర్నలిస్టు అంటే...ఒంటరి పోరాటానికి వెరవనివాడు...


---ఇదిగోండి...ఇలాంటి జర్నలిస్టు ఒకడు పొరుగున ఉన్న ఒరిస్సా గడ్డపై ఒక సంస్థ చేతిలో హింసలు భరిస్తున్నాడు. ప్రాణభయంతో తెగించి ఒక వ్యవస్థపై పోరాడుతున్నాడు...అదీ తన తోటి వారి మేలు కోరి. ఆ సంస్థ, ఆ వ్యవస్థే.... 'నిత్యం ఉషోదయంతో సత్యం నినదించు గాక' అని చెప్పుకునే 'ఈనాడు.'

"నాకు ఇది బ్రిటిష్ రాజ్ లో లాగా...ఏకాంత ద్వీప శిక్ష. మెంటల్ టార్చర్. అయినా నో ప్రాబ్లం. నా చివరి క్షణం వరకూ ఎన్ని బాధలు ఓర్చుకుని అయినా నా పోరాటం సాగిస్తా. మనసిన వేజ్ బోర్డు కింద సంస్థ నుంచి దాదాపు వెయ్యి మందికి నాలుగేసి లక్షల చొప్పున అందాల్సిన డబ్బు వచ్చే వరకూ నేను విశ్రమించను," అని ఆ జర్నలిస్టు అంటున్నారు. 

'ఈనాడు' తో నిత్య పోరాటం కావడం వల్ల కుటుంబంలో మనశ్శాంతి కరువయ్యింది. అతని భార్య రెండో సారి...గర్భంలో శిశువును కోల్పోయింది. ప్రాణ భయంతో ఒరిస్సా పోలీసులకు, ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘానికి పిటిషన్స్ పెట్టుకోవాల్సిన దుస్థితి. హక్కుల కోసం వాదిస్తున్న ఈ జర్నలిస్టు తీవ్ర వేధింపులకు గురవుతున్నాడు. అన్యాయాలను ఎదిరించే మనం నోరు, కళ్ళు మూసుకుని...గుండె కు 'ఆల్ ఈజ్ వెల్' అని జోకొడితే...ఇంతకన్నా ఆత్మవంచన ఉండదు. జర్నలిస్టు అని చెప్పుకునే వాళ్లకు ఈ కేసు ఒక సవాల్.

అతని పేరు గడియారం మల్లిఖార్జున శర్మ. ఇతనిది అనంతపురం జిల్లా. ప్రముఖ రచయిత, శాసనకర్త గడియారం రామకృష్ణ శర్మ గారికి దగ్గరి బంధువు. 1995 లో 'ఈనాడు జర్నలిజం స్కూల్' లో డిప్లొమా పొందాడు. 2000-2007 మధ్య వరంగల్ లో పనిచేస్తున్నప్పుడు ఇతని పనితీరును కిరణ్ (రామోజీ గారి కొడుకు, 'ఈనాడు' ఎండీ) మెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. 2007 లో కర్నూలు యూనిట్ లో ఇతను సబ్-ఎడిటర్ గా ఉన్నప్పుడు సెల్ ఫోన్లు తీసుకుని ఆఫీసుకు రావద్దని యాజమాన్యం ఆదేశించింది. "సెల్ ఫోన్స్ లేకుండా ఉండమంటే ఎలా అని ప్రశ్నించాను. అదే సమయంలో ప్రమోషన్స్ గురించి అడిగాను. అక్కడ మొదలయ్యింది...వేధింపుల పర్వం," అని శర్మ ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూలో చెప్పారు. 

ప్రశ్నించే వాడిని వేధించే అలవాటు ఉన్న 'ఈనాడు' వెంటనే శర్మను 2008 జూన్ లో శ్రీకాకుళం బదిలీ చేసింది. ఆ మరుసటి సంవత్సరం సంస్థ ఇవ్వాల్సిన 'స్టాండింగ్ ఆర్డర్' కోసం శర్మ సమాచార హక్కు కింద నోటీసు ఇవ్వడం తో యాజమాన్యం వేధింపులు తీవ్రతరం చేసిందని శర్మ కథనం.

ఎన్ని వేధింపులు పెడుతున్నా...శర్మ సంస్థను అట్టిపెట్టుకుని ఉండడంతో ఈ మధ్య సబ్-ఎడిటర్ హోదాలోనే 'ఈనాడు' అతనిని భువనేశ్వర్ బదిలీ చేసింది. అక్కడ సెక్యూరిటీ లో కూచోబెట్టి అవమానించింది. కార్మిక శాఖలో శర్మ ఫిర్యాదు చేశారు...ఆ గొడవ సాగుతున్నది. శర్మ కూచోడానికి ఇరుకైన గది కేటాయించారు. ఇది అమానుషమైన ఘటన. ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన. ఎవరికీ పట్టని గొడవ.

'న్యూస్ టుడే'  ఏజెన్సీకి 'ఈనాడు' కు సంబంధం లేదని లిఖితపూర్వకంగా చెప్పిన 'ఈనాడు' మానవ వనరుల విభాగం అధిపతి గోపాలరావు మాటలు, చేతలు...
మనసిన వేజ్ బోర్డు కింద ఇవ్వ వలసిన సొమ్ములు ఇవ్వకుండా...'ఈనాడు' జర్నలిస్టులకు చేస్తున్న మోసం....
ప్రమోషన్ అడిగితే...'నువ్వు ఆర్.ఎస్.ఎస్.అట కదా..." అని వాకబు చేసిన ఒక పెద్ద మనిషి తెలివిడి....
భువనేశ్వర్ ఆఫీసులో శర్మకు జరిగిన అవమానం-ప్రాణభయం....ఇవి వింటే..జర్నలిస్టు అన్న వాడికి రక్తం మరుగుతుంది. వ్యూహాత్మక కారణాల వల్ల శర్మ పూర్తి వివరాలు, అతని వాదన ఇక్కడ ఇవ్వలేకపోతున్నాం.  

ఈ పోరాటంలో శర్మకు ఆర్ధిక-మానసిక సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న జర్నలిస్టులు మా మెయిల్ కు రాయండి. ఇది చాలా కీలక పోరాటమని గుర్తించండి, స్పందించండి. 'ఈనాడు' ఉద్యోగులతో పాటు...మాజీ ఉద్యోగులు కూడా స్పందించాల్సిన సమయమిది. శర్మ ఒంటరి వాడు కాదని గుర్తుచెయ్యండి. నిత్యం ఇతరుల హక్కుల గురించి రాసే/వాగే మనం తోటి జర్నలిస్టు కు ధైర్యం ఇద్దాం.

Monday, April 26, 2010

ఎవరీ 'ఈనాడు' విలేకరి? ఏమిటీ న్యాయ పోరాటం??


'ఈనాడు' పై ఒరిస్సా వేదికగా ఒంటరి పోరాటం చేస్తున్న ఆ వీర జర్నలిస్టు ఎవరు?

ఇంతకూ ఈ జర్నలిస్టు చేసిన ఘోర అపరాధం ఏమిటి?

'ఏకాంత ద్వీప శిక్ష': ఇది బ్రిటిష్ రాజ్? లేక 'ఈనాడు' రాజ్?
 
'ఈనాడు' గోపాల్రావా...రావు గోపాల్రావా? 


మనసిన వేజు బోర్డ్ ఎలా ఉల్లంఘనలకు గురయ్యింది? 


ఇప్పుడు కోర్టుకు ఎక్కితే...ఒక్కొక్క జర్నలిస్టుకు ఎంత వస్తుంది??

పిల్లల డాన్సులపై రచ్చ: ఛానెల్స్ సిగ్గుమాలినతనం

సినిమాలలో ముద్దులు హద్దు మీరుతున్నాయంటూ...అన్నిసినిమాలలో ఉన్న ముద్దు సీన్లన్నీ చూపి సిగ్గూ ఎగ్గూ లేకుండా కుతి తీర్చుకునే...తెలుగు ఛానెల్స్ చిన్న పిల్లలను కూడా వదలలేదు. జీ-ఛానల్ లో వచ్చే 'ఆట' అనే రియాల్టీ షో లో చిన్నారుల చేత అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారంటూ...కొన్ని ఛానెల్స్ అలాంటి పిచ్చి సీన్లను ఏరికోరి ప్రసారం చేసాయి. 'డాన్స్ బేబీ డాన్స్..' టైటిల్ కు ప్యారడీ గా సభ్యతను మరిచి 'వాంప్ బేబీ వాంప్..' అన్న శీర్షికను వాడాయి. 

ఈ డ్యాన్స్ ప్రోగ్రాంకు అత్యంత ప్రేక్షకాదరణ తెచ్చిన ఓంకార్ పై పగబట్టినట్లు తన TV-1 లో ప్యారడి ప్రోగ్రామ్స్ చేసిన రవి ప్రకాష్ గారి TV-9 ఈ అంశానికి మితిమీరిన ప్రాధాన్యత ఇచ్చి హంగామా చేసింది. చర్చ మధ్యలో మగ యాంకర్ ను మార్చి ఆడ యాంకర్ ను రంగంలోకి దింపిన N-TV దాదాపు మూడు గంటల పాటు గందరగోళంగా ఒక చర్చ నిర్వహించి ఈ పంచాయితీ నుంచి ఏమైనా లబ్ది చేకూరుతుందేమో అని యత్నించింది. 

Zee ఛానల్ లో పిల్లల డాన్స్ పోటీలకు వేదికగా నిలిచిన ఓంకార్ గారి 'ఆట' ప్రోగ్రాం వివాదాస్పదంగా మారింది. ఆరంభంలో వినూత్నంగా అనిపించిన ఈ కార్యక్రమం తర్వాత శృతిమించి రాగాన పడింది. పట్టుమని పది పన్నెండు సంవత్సరాలైనా లేని చిన్న పిల్లలతో తిక్క డాన్సులు వేయించడం, ఏమి మాట్లాడుతున్నారో తెలియని జడ్జిలతో వెర్రి మాటలు మాట్లాడించడం ఎక్కువయ్యింది. మన వెర్రి జనం...ఎంత బూతు ఉంటే, ఎంత చెత్త ఉంటే...అంతగా ఆస్వాదిస్తారు కాబట్టి...ఈ కార్యక్రమానికి సహజంగానే టీ.ఆర్.పీ.రేటింగ్ పెరిగింది. అది తమ సృజనాత్మకత గొప్పతనం అని ఓంకార్ బృందం మరింత రెచ్చిపోవడంతో వ్యవహారం బెడిసింది. 


ఇలాంటి నృత్యాలు ప్రమాదం అంటూ...ఒక కార్యకర్త (దేవి గారు అనుకుంటా) మానవహక్కుల సంఘానికి ఎక్కడంతో ఈ అంశంపై చర్చ ఆరంభం అయ్యింది. ఓంకార్ కు బాసటగా కొందరు బాల డ్యాన్సర్ల తల్లులు కూడా సంఘం ఛైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారిని కలవడం, ఆయన డజను కెమెరాల సాక్షిగా ఆ తల్లులకు క్లాస్ పీకడంతో కథ రక్తికట్టింది. టైం పాస్ కావడానికి ఇంతకన్నా మసాలా ఏమికావాలి...మన ఛానల్ బాసులకు? 

TV-9 ఈ అంశంపై చర్చ జరిపి పిల్లలను కించపరిచిందని ఆ తల్లిదండ్రుల ఆరోపణ. "అవును...నేను కూడా చూశాను. ఈ ఛానెల్స్ దారుణంగా వ్యవహరించాయి. ఆ పసికూనల పిచ్చి డాన్స్ లను వ్యతిరేకిస్తూ....వాటినే చూపించాయి. ఇది ఘోరం," అని ఈ పరిణామాలు గమనించిన ఒక మిత్రుడు అన్నాడు. "ఈ ప్రోగ్రాం లో ప్రతిభ కనబరిచిన ఒక బాలికను స్ఫూర్తి ప్రదాతగా చూపిన ఛానల్ ఇప్పుడు ఈ ప్రోగ్రాం ను వ్యతిరేకించి పిల్లలను వాంప్ లుగా చూపడం ఏమిటి?" అన్న ప్రశ్నకు ఛానెల్స్ సమాధానం చెప్పాలి.


వుమెన్ ఎలిమెంట్ ఉంటే పై నుంచి కింది దాకా పులకించి...గంటల తరబడి చూపే N-టీవీ ఇదే అదనుగా దాదాపు మూడు గంటల పాటు లైవ్ లో చర్చ జరిపింది. ఒక చలాకీ డాన్సర్ శ్రీ విద్యతో పాటు మరో ఇద్దరు తల్లులు, మన సంధ్య అక్కా స్టూడియోలో దర్శనం ఇచ్చారు. ఎప్పుడూ "మగ వెధవల" దుమ్ము దులిపేసే సంధ్యక్క...మొట్టమొదటి సారిగా పరమ భయంకరమైన దాడికి గురయ్యారు...సాటి స్త్రీల నుంచి. శ్రీ విద్య, సంధ్య కొట్టుకున్నంత పనిచేసారు. 'యే..నువ్వు..ఓయ్...నువ్వు.." అని మాట్లాడుకున్నారు. ఆ తల్లులు సంధ్యక్కను మాట్లాడకుండా నొక్కిపట్టారు. మరొక మహిళా నేత దేవి గారిని, కొందరు కాలర్స్ ను వారు కడిగిపారేశారు.  వాళ్ళ వాదనా మరీ తప్పుపట్టేదిగా లేదు.

"అమ్మా..నువ్వు ఘనంగా మాట్లాడు తున్నావు. చిన్న పిల్లల గురించి ఇష్టం వచ్చినట్లు బూతు మాట్లాడిన ప్రోగ్రాం లో ఎలా పాల్గొన్నావు? నీకు కనీసం ఇది (బుర్ర) ఉండాలి," అని ఒక తల్లి దుమ్మెత్తిపోసింది. 

ఈ ప్రోగ్రాం ఆరంభించిన N-TV యాంకర్ వరప్రసాద్ తలనొప్పితోనో/ వీరితో వేగలేకనో మధ్యలో వెళ్ళిపోగా....'టిన్ గ్లిష్' సుందరి శ్వేత ఒక బ్రేక్ మధ్యలో యాంకర్ గా ప్రత్యక్షమయ్యారు. విషయం సరిగా తెలిసీ, తెలియక శ్వేత తడబడుతూ, పొరబడుతూ, ఆరాటపడుతూ....హాట్ హాట్ చర్చ జరిపారు. ఈ ప్రోగ్రాం ఊళ్ళో బోరింగు దగ్గర అమ్మలక్కలు ఆవేశంగా జుట్టు పీక్కున్నట్టు ఉంది. అయినా...N-TV ఆ పంచాయితీ లో మజా ఆస్వాదించింది.

అసలీ వ్యవహారం చూస్తే....ఈ తెలుగు ఛానెల్స్ కు చిన్న పిల్లల గురించి బాధకన్నా ఓంకార్ మీద ఏడుపు ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది. ఓంకార్ గారూ....మరీ వెర్రి ఆలోచనలకు తావుఇవ్వకుండా...సినిమా బిట్స్ పిచ్చ తగ్గించుకొని...కాస్త పిల్లలతో మంచి ప్రోగ్రామ్స్ ఇప్పించండి. పిల్లల్లో.... సృజనాత్మకత వెలికి తీయండి.

Sunday, April 25, 2010

'ఈనాడు'కు బాండు ఇచ్చి ఇరుక్కున్న జర్నలిస్టులూ.....

ఎంతమంది జర్నలిస్టులు వెళ్ళిపోయినా లెక్క చెయ్యం....లిఫ్టు బాయ్ లతో, కార్ డ్రైవర్ లతో పేపర్ నడుపుతాం....అని బీరాలు పలికిన 'ఈనాడు' గ్రూపు ఇప్పుడు ఆ ఆత్మస్థైర్యం కోల్పోయింది. ఇన్నాళ్ళూ తాను వద్దనుకున్న జర్నలిస్టులను పొమ్మనకుండానే పొగబెట్టి పంపిన 'ఈనాడు'...ఇప్పుడు సంస్థ నుంచి  వలసలను నిరోధించేందుకు 'బాండు' మీద ఆధారపడుతున్నది. 

ఈ 'బాండు' ప్రకారం...సంస్థ నిర్వహించే 'ఈనాడు జర్నలిజం స్కూల్' లో సీటు వచ్చిన వారు...మూడేళ్ళు సంస్థ కోసం పనిచేస్తామని రాసివ్వాలి. ఈ నిబంధన పాటించడంలో విఫలమైతే...లక్ష రూపాయలు చెల్లించాలి.
'మార్గదర్శి' చిట్ పాడుకున్నప్పుడు/ వడ్డీవ్యాపారి దగ్గరకు వెళ్ళినప్పుడు అడిగినట్లు ఈ సంస్థ కొన్ని స్యూరిటీలు అడుగుతుంది.... బాండ్ లో భాగంగా. ప్రభుత్వ ఉద్యోగుల గ్యారెంటీ తీసుకుని...ఉద్యోగులను బంధించి మరీ పనితీసుకుంటుంది. ఇలా బాండు మీద సంతకం చేసి అక్కడ పనిచేయలేకనో...మంచి అవకాశాలు దొరికటంవల్లనో బైటికి వచ్చిన వారు దాదాపు యాభై మందిని 'ఈనాడు' కోర్టు నోటీసులతో ఇబ్బంది పెడుతున్నది. 

'నన్ను డెస్కు లో వేశారు. డీ.టీ.పీ.ఆపరేటర్ లాగా పనిచేయించుకున్నారు. నాకేమో రిపోర్టింగ్ ఇష్టం. ఇక అక్కడ పనిచేయలేక వేరే పత్రిక చూసుకుని జాయిన్ అయ్యాను. ఇప్పుడు నాకు నోటీసులు ఇచ్చి ఈ సంస్థ మానసికంగా వేధిస్తున్నది," అని ఇప్పుడు ఒక ఛానల్ లో పనిచేస్తున్న ఒక మిత్రుడు వాపోయాడు. ఇతనితో పాటు...ఇతనికి స్యూరిటీ ఇచ్చిన వారికి కూడా నోటీసులు పంపుతున్నది...'ఈనాడు.' 

ఇలా బాండు లు రాయించుకోవడం...ఐ.టి.సంస్థలలో కూడా ఉంది కానీ...ఫక్తు రాజకీయ అజెండా తో పనిచేసే ఏ సంస్థ తో అయినా...జర్నలిస్టులు చచ్చినట్లు పనిచేయాల్సిన పనిలేదు. ఈ సంస్థ నిష్పాక్షిక జర్నలిజం ఆచరించడంలేదు కాబట్టి...బాండు ను ఉల్లంఘిస్తున్నట్లు వాదించవచ్చు. అందుకు సాక్ష్యాలు కోకొల్లలు చూపించవచ్చు. 

"శ్రీధర్ అనే వాడు కక్షగట్టి నన్ను పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయించాడు. అక్కడికి పోకుండా...నేను వేరే ఛానల్ లో జాయిన్ అయ్యాను. నాకు నోటీసులు ఇచ్చి హింసిస్తున్నారు," అని ఒక మహిళా జర్నలిస్టు చెప్పారు. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు చేయడానికి ఈ పోస్టు రాస్తున్నాము. 

నిజానికి జర్నలిస్టు బాండుకు కట్టుబడి ఉండాలని పట్టుబట్టడం International Federation of Journalists (IFJ) నియమావళికి వ్యతిరేకం. వందకు పైగా దేశాలలో లక్షల మంది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న ఈ సంస్థను ప్రభుత్వాలు, కోర్టులు గౌరవిస్తాయి. ఇందులో మూడో క్లాజ్ ప్రకారం... రాజకీయంగా, సైద్ధాంతికంగా, మతపరంగా పత్రిక యజమానిలో మార్పు వస్తే...ఉద్యోగి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఉద్యోగం మానెయ్యవచ్చు. పైగా నష్టపరిహారం కూడా డిమాండ్ చేయవచ్చు. అందుకు సంబంధించిన పూర్తివివరాలు http://www.ifj.org/en లో వెతికి సాధించవచ్చు. 


మీ లాయర్లకు ఈ విషయం తెలియకపోవచ్చు కాబట్టి వెంటనే...ఈ విషయాన్ని కోర్టులో వాదనకు ఉపయోగించేందుకు ఉన్న అవకాశాన్ని పరిశీలించమని వారిని కోరండి. అక్కడ పనిచేసే వాతావరణం లేకపోయినా...బలవంతాన పనిచేయాలని బాండు బూచి చూపితే...మీరు పలు అంతర్జాతీయ సంస్థల సహకారం పొందవచ్చు. IFJ మూడో క్లాజ్ ఈ కింది విధంగా ఉంది.

3. CLAUSE OF CONSCIENCE

3.1 Journalists must have the right to act according to their conscience in the exercise of journalism. In case of fundamental change in the political, philosophical or religious line of the employer, a journalist may put an end to his or her contract, without notice, and be paid compensation equivalent to what he or she would have received in case of termination of his or her contract by the employer.

3.2 No journalist should be directed by an employer or any person acting on behalf of the employer to commit any act or thing that the journalist believes would breach his or her professional ethics, whether defined by a code of ethics adopted by journalists collected at national level or that would infringe the international Code of Principles for the Conduct of Journalism as adopted by the IFJ. No journalist can be disciplined in any way for asserting his or her rights to act according their conscience.

మీడియా-ఆత్మశోధన: వేమూరి వారి దివ్య ప్రవచనం

వేమూరి రాధాకృష్ణ గారు మానవుడు, పైగా ఒక పత్రిక, ఛానల్ ఓనర్...కాబట్టి 'దయ్యాలు వేదాలు వల్లించినట్లు..." అనడం పాతకం కానీ...'ఆంధ్రజ్యోతి' పేపర్ లో ఈ రోజు ఆదిత్య అనే పేరుతో 'కొత్త పలుకు' అనే కాలంలో ఆయన పలికిన పలుకులు ఆ నానుడిని గుర్తుకు తెస్తున్నాయి. 'మీడియాకు ఆత్మశోధన అవసరం' అని శీర్షిక పెట్టి మరీ...ఆయన చాలా గొప్ప విషయాలు ప్రవచించారు. ఇంకేమీ పట్టించుకోకుండా...అన్ని పత్రికలు/ఛానెల్స్ యజమానులు ఈ రోజు నుంచి మన వేమూరి గారు రాసిన మాటలు విని తు.చ.తప్పక ఆచరిస్తే...తెలుగు జనం మీడియా ను 'థూ..థూ..ఛీ...ఛీ..' అనడం (అంటే వుమ్మేయ్యడం) వెంటనే ఆపేసి...జర్నలిస్టుల కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకుంటారు. 

మీడియాను స్వప్రయోజనాలకు, స్వకులస్థుల రాజ్యాభిలాషకు, వ్యాపార వృద్ధికి, శత్రుసంహారానికి వాడుకున్న విద్య ఎవడు మొదలుపెట్టగా, ఎవడు(రు)  ఆచరించి కోట్లకు పడగలెత్తాడో (రో)....తెలుగు నేల మీద పుట్టిన ప్రతి అక్షరాస్యుడికి తెలిసిందే. ఇప్పుడు జనమంతా ఈ అంశం గురించే చర్చించుకుంటున్నారు. 


'సూర్య' అధిపతి నూకారపు, TV-5 విలేకరి వల్ల 'మీడియాలో ఉన్న వారికే రోత' పుడుతున్నట్లు ఈ ఆదిత్యుడు రాసాడు. ఒకప్పుడు విలేకరి అంటే...కొంత గౌరవం ఉండేదని...ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాడు. రెండు దశాబ్దాల కిందట 'బ్లాక్ మెయిలింగ్' అన్న పదమే జర్నలిస్టులకు తెలిసేది కాదని సూత్రీకరించాడు. ఇక ఈ వ్యాసంలో మూడో కాలంలో రాసిన ఒక వాక్యం చూసి నాకూ దిమ్మతిరిగింది. అది:
"సమాజాన్ని చదివిన వారు, సామాజిక సమస్యలను ఆకళింపు చేసుకున్న వారు మాత్రమే ఉండవలసిన మీడియాలో వాణిజ్య దృక్పథం మాత్రమే కలిగిన వ్యక్తులు ప్రవేశించడం వల్ల పరిస్ధితులు మరింత వేగంగా క్షీణిస్తున్నాయి." అబ్బ...ఎంత గొప్ప మాట! ఇలా వాణిజ్య దృక్పథం కలిగిన దరిద్రులు, నీచ నికృష్టులు ఐస్లాండ్ వాల్కనోలో పడి మాడిమసై పోవుగాక!?


తాను ప్రసారం చేసిన/ ప్రచురించిన వార్తపై నూకారపు పరివారం 'సూర్య'లో రెచ్చిపోయి దాడి చేయడాన్ని వేమూరి అంతర్లీనంగా మూడు, నాలుగు కాలమ్స్ లో ప్రస్తావించారు, మూగగా రోదించారు. "మీడియా ఆరోపణలకు గురవుతున్న వారు తలదిన్చుకోవలసింది పోయి ఎదురు దాడికి దిగేందుకు సాహసం చేస్తున్నారు. ఇది దుష్ట సంస్కృతి..." అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాసంలో ఒకొక్క లైను ఒకొక్క ఆణిముత్యం. ఒక గౌతమబుద్ధుడు, ఒక గాంధీ, ఒక టీ.ఎన్.శేషన్, ఒక జే.పీ. వంటి వారు...మాత్రమే మీడియా గురించి ఇలా ఆలోచించగలరు. ఇప్పుడు మన వేమూరి ఆలోచిస్తున్నారు, రాస్తున్నారు. ఇది తెలుగు నేలకు శుభ పరిణామం.


"మీడియాలో పరిణామాలు ఇలాగే కొనసాగితే అంతిమంగా నష్టపోయేది సమాజం-ప్రజలే. ఈ ముప్పును నివారించగలిగేది జర్నలిస్టులు మాత్రమే. ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది...పరిస్ధితులు మరింత విషమిస్తే జర్నలిస్టులను అంతరించిపోతున్న జాతిగా గుర్తించవలసిన పరిస్ధితులు ఏర్పడడం తథ్యం,"అని ఆయన ముక్తాయిపు ఇచ్చారు. 

"ఓహ్...రాధాకృష్ణా! అన్నయ్యా...ఎంత గొప్ప మాట చెప్పారు? ఏమిటి మీలో ఈ పరివర్తన? మీరు ఈ వ్యాసం ఏ బోధివృక్షం కింద కూచొని రాసారు?," అని అబ్రకదబ్ర అడిగితే...నవ్వొచ్చింది. జర్నలిస్టులు ఆత్మవిమర్శ చేసుకోనవసరం లేదు బ్రదర్, ఈ రోజు అన్నం తినే ముందు...మీరు ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకోండి. సంస్కరణ మన ఇంటి నుంచే ఆరంభిద్దాం. మీరు ఒక్కరు గుండె మీద చేయివేసుకుని....విశ్లేషించుకుని....ఇవ్వాళ మారితే...అంతరించి పోతుందని మీరు బాధ పడుతున్న జర్నలిస్టుల జాతి అజరామరం, ఆచంద్రతారార్కం అవుతుంది. ఆల్ ది బెస్ట్.
నోట్: 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన ఈ వ్యాసంలో...కనీసం పది చోట్ల 'పరిస్ధితులు' అన్న మాట కనిపిస్తూ...వేమూరి రాధాకృష్ణ గారు ఎంత బాధపడుతూ దీన్నిలిఖించారో తెలియజేస్తుంది.

Saturday, April 24, 2010

'దేవుడి..' పోస్టుపై బాబు గోగినేని గారి స్పందన

మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వాటికి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ, పోరాటం చేస్తున్న వారిలో బాబు గోగినేని గారు ఒకరు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో పేరున్న మానవతావాది, హేతువాది. అలుపెరుగని ఆయన కృషి అభినందనీయం. 

ఒక పోస్టులో ఆయన పాల్గొన్న రెండు టీ.వీ.ప్రోగ్రామ్స్ గురించి నేను ఒక కామెంట్ చేశాను. దానికి ఆయన స్పందించారు. ఆ స్పందనకు కూడా సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని ఇక్కడ ఒక పోస్టుగా పెడుతున్నాను. ముందుగా బాబు గోగినేని (కింది ఫోటో) పంపిన లేఖ చదవండి.

 Dear Sri Ramu,
I discovered in your postings references to me and to two discussions I participated in on TV9 and INews.
I thought I should clarify.

You suggest that it is a waste to participate in studio discussions of TV Channels which depend on advertisements from peddlers of superstition and say "There is no God. What kind of programs are these?". 

 
But, surely, that is not what I said in the course of the discussion?
The TV9 discussion centred around the Vijayawada Durgamma Temple EO's initiative to attract the young from KG to PG to pray so that they would pass exams. That was also the title of the discussion program, not atheism. 

 
My challenge was that there was not the slightest evidence for this claim that prayer would affect the external world. And my question was how praying 'after' the exams would change the results. Of course, some may derive strength from praying before the exam, but praying 'after' the exam is equal to black magic. As regards praying 'before' - since they were not the privileged VIPs - students would have to queue up for many hours which they could instead use to study! My criticism was that a Govt. Officer is doing this in a secular country: the EO is attempting to perform a religious function rather than an administrative one which would be his primary duty and responsibility. The EO, you might remember, also said things about Pushyami Nakshatram and its beneficial effect in conjunction with Brishaspathi on one's education. It was only proper therefore to ask one who spoke so 'knowledgeably' about the subject whether he knew what these nakshatrams were all about. He promptly said his 'swamis' would be able to answer. That was also the intention behind my asking the question: it should have been the swamis saying this. Not that I expect the 'swamis' to have an idea about it either, but that is a different story.

The reason for participating in such programs is to try to offer some resistance to the onslaught of magic and ritualism in public life, and to offer an alternative view point adopting which would take India to her true potential. Further, superstition is not simply harmless belief: there is an elaborate industry exploiting innocent people; there are witch hunts and murders not far from the capital city. And in this, all religions are implied, not just the majority religion.

As to the INews morning discussion, apart from Prof. Nageswar's boorishness, I was struck by the fact that Prof. and MLC Nageshwar, and MLA Sri Kanna Babu were reluctant to define precisely what they would be happy to regulate! My arguments came from the belief that in a democracy the voter/individual needs to be perceived as a more mature person by the lawmakers - afterall it is this same voter who elected them in the first place!

In anycase, I am sure it did not escape your attention that two respected personalities with a record of journalism to their credit were not exactly defending media freedom. The limited freedoms of the media are safer with the journalists than with the police - specially where the law is ambiguous or imprecise.
sincere regards,
Babu Gogineni

బాబు గారూ, మీరు చేస్తున్న అద్భుతమైన కృషిని కించపరచడానికి నేను నా పోస్టులో ఆ వ్యాఖ్యలు చేయలేదు. రెండు ఛానెల్స్ చర్చలలోనూ మీరు మీ మనసులో భావాలను పూర్తిగా వ్యక్తీకరించలేదు. ఇద్దరు యాంకర్స్ కూడా మిమ్మల్ని మీరు explain చేసుకుందుకు సరైన అవకాశం ఇవ్వలేదనే నేను భావిస్తున్నాను. ఈ విషయంపై ఐ-న్యూస్ యాంకర్ గారితో ఆ రోజే మాట్లాడాను. గతానికి భిన్నంగా రెండు స్టూడియోలలో మీరు వ్యంగ్యంగా వ్యాఖ్య చేయాలని చూడడం నాకూ కొద్దిగా ఆశ్చర్యం కలిగించింది. ఇక ఈ కింది విషయాలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. 


1) సమాజ బాధ్యత పెద్దగా పట్టని టీ.వీ.ఛానెల్స్ వాళ్ళు హేతువాదంపై మిమ్మల్ని, స్త్రీవాదం పై సంధ్యగారిని బాగా exploit చేస్తున్నారు. సమాజంలో మూఢ నమ్మకాలు పెరగడానికి, మహిళలపై దాడులు పెరగడానికి పరోక్షంగా టీ.వీ.ఛానెల్స్, ముఖ్యంగా TV-9, కారణం అనడంలో మీకు అభిప్రాయబేధం ఉండదనే అనుకుంటున్నాను.

2) అన్ని ఛానెల్స్ మూఢ నమ్మకాలు పెంచి పోషిస్తున్నాయి, జాతకాల వంటి వాటిని ప్రోత్సహిస్తున్నాయి. 'సంస్కృతి' నుంచి పేరు మారిన ఇదే రవి ప్రకాష్ ఛానల్ TV-1 ఇలాంటి విషయాలలో ముందు ఉంటుంది. జనంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని రాజ్యాంగం, ప్రెస్ కమిషన్ వంటివి చెబుతున్నా..వీళ్ళకు పట్టడం లేదు. ఇలా 'అశాస్త్రీయంగా' వ్యవహరించే ఛానెల్స్ లో మీ లాంటివారి వాదన అరణ్య రోదనే అవుతుందన్నది నా బాధ.

3) భద్రాచలం లో జరిగే సీతారామ కళ్యాణాన్ని రోజంతా చూపుతారు. అది ఒక మహిమాన్వితమైన ఘట్టం అని సమాజానికి ఇంజెక్ట్ చేస్తారు. మరి అదే మోతాదు నమ్మకంతో పల్లెలలో జనం బాణామతి వంటి వాటిని నమ్ముతున్నారు. ఇదేలాగ ఉందంటే...సినిమాలలో ఎంత బూతు చూపినా పర్లేదుగానీ...ఊళ్లలో రికార్డింగ్ డాన్సులు ఉండకూడదన్నట్లు ఉంది.
అందుకే....మీలాంటి వాళ్ళు ముందుగా ఛానెల్స్ ను, ఈ సినిమా వాళ్ళను శుద్ధి చెయ్యాలని నాకూ అనిపిస్తున్నది. 

4) రాష్ట్రంలో EO ల గురించి మీ భావన సరి కాదు. ఈ అధికారులు అందరూ పూజారుల కన్నా మిన్నగా spiritual programmes లో పాల్గొంటున్నారు. ఇక్కడ అధికారి, పూజారి కి తేడా లేదు. (మీ చర్చలో మీరు తన అధికారాలు, పుష్యమి నక్షత్రం గురించి అడిగి వదిలేసారు. అక్కడ సమస్య వచ్చింది. మీరు డిఫెన్సు లో పడినట్లు అయిపోయింది అక్కడ. ఆ రెండు పాయింట్స్ మీరు వివరిస్తే వీక్షకులకు కొంత స్పష్టత వచ్చేది.)

5) ఓటు వేసిన వాడు, లా మేకర్ ఇద్దరూ సమానమే అన్న వాదన పట్ల కూడా నాకూ అభ్యంతరం ఉంది సార్. మన ప్రజలు వ్యవహరిస్తున్న అంత ఫూలిష్ గా ఎవ్వరూ వ్యవహరించరు. బైటికి చెప్పలేం కానీ..జనం పూర్తిగా pollute అయిపోయ్యారు. మంచి ఎవ్వడికి పట్టదు, సమాజం పట్టదు. మంచి చెబితే రాళ్ళు వేస్తారు. కులం, ప్రాంతం అంటగట్టి కుంగతియ్యాలని ప్రయత్నిస్తారు. 

సారా పాకెట్, ఒక రోజు సెలవు ఇస్తే...ఓటు వెయ్యమంటే వేస్తారు, ఇంట్లో ఉండమంటే ఉండిపోతారు. లోక్ సత్తా విషయంలో ఏమి జరిగిందో మీరు చూసారు. రాజకీయ వ్యవస్థ జనాలను బ్రష్టు పట్టించింది, మీడియా వారిని అలా అజ్ఞానం లో ఉంచుతున్నది. కాబట్టి..."జనాలను నిర్ణయం చేసుకోనివ్వండి" అనే మాట బహిరంగ వేదికల మీద చెప్పడానికి బాగుంటుంది కానీ...అది వాస్తవ దూరం. ఆ మాట చెప్పలేక...ఎం.ఎల్.సీ.,ఎం.ఎల్.ఏ.గార్లు ఇబ్బంది పడ్డారు. జన చైతన్యం కోసం అంతమాత్రాన మన యత్నాలు ఆపకూడదనుకోండి.
anyway, thanks for your time.
Wish you good luck
Ramu
Note: Photo courtesy: www.iheu.org

Friday, April 23, 2010

'ఆంధ్రజ్యోతి'పై...'సూర్య'ప్రతాపం: అక్షర యుద్ధం

"నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష..." అన్నట్లు ఉంది 'ఆంధ్రజ్యోతి' పై 'సూర్య' పత్రిక చేసిన ఎదురు దాడి. ఇది... "నువ్వు గులక రాయి వేస్తే...నేను బాంబు వేస్తా"... అన్నట్లు ఉంది. వేమూరి రాధాకృష్ణ గారు తమకు సరిపడని వారిపై అడ్డ దిడ్డంగా అక్షర బాణాలు వదులుతారు, వాక్యాలతో ఉరి వేస్తారు, శీర్షికలతో గొంతు కోస్తారు, ఫోటోలు-కార్టూన్లతో ముక్కలు ముక్కలుగా నరుకుతారు. ఇప్పుడు నూకారపు వారు యథాతథంగా ఆ విద్యనే వేమూరి వారిపై ప్రదర్శించి...తెలుగు నాట జర్నలిజం ఎంతగా దిగజారిందో చూపించారు.... 'సూర్య' పత్రికలో. 

ఒక సెటిల్ మెంట్ లో భాగంగా...కాళేశ్వర్ బాబా మనిషి...'సూర్య' అధిపతి నూకారపు సూర్యప్రకాశ రావుతో చేసిన సంభాషణను 'ఆంధ్రజ్యోతి' పేపర్ మొన్న 'మీడియా మాఫియా' శీర్షికన వేసింది, ఆ పత్రిక ఛానల్ కూడా సూర్య ప్రతాపాన్ని దునుమాడింది. జర్నలిజం ఎంతగా దిగజారిందో అని 'ఆంధ్రజ్యోతి' చాలా బాధపడిపొయ్యింది.


దీనికి స్పందిస్తూ....'సూర్య' చెలరేగిపోయింది. మొదటి పేజీ లో సింహభాగం వేమూరిని బద్నాం చేయడానికి కేటాయించారు. మూడు పెద్ద స్టోరీలు వేసారు. వాటి శీర్షికలు: 
1) బడుగుల బడబాగ్ని: అది 'అంధ'జ్యోతి 
2) వక్రభాషల అక్రమార్కుడిపై సూర్యాగ్ని 
3) బడుగుల పత్రికపై అగ్రకుల విషం 


"బాబా ముసుగులో కాళేశ్వర్‌ చేస్తున్న ఆగడాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెచ్చిన ‘సూర్య’ దిన పత్రికపై అగ్రవర్ణాలకు చెందిన ఆంధ్రజ్యోతి కుట్రపూరిత కథనాలు ప్రచురించడం పట్ల బడుగులు భగ్గుమంటున్నారు. ‘సూర్య’ చైర్మన్‌పై ఆంధ్రజ్యోతి ప్రచురిం చిన కథనాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఏకమవుతున్నారు. ఆంధ్రజ్యోతి ప్రతులను తగలబెట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు," అని రాసారు. "తమ అభిమాన పత్రిక ‘సూర్య’ అధిపతి నూకారపు సూర్యప్రకాశరావుపై ఆంధ్రజ్యోతి పత్రిక బురద చల్లడాన్ని బడుగులు సహించలేకపోయారు," అని వివరించారు. ఒక విషయానికి కావలసినంత ట్విస్టు ఇవ్వడం ఎలాగో నేర్చుకోవచ్చు ఇక్కడ. 

'సూర్య' ప్రచురించిన ఒక వార్త లీడ్ ఇలా వుంది:
"బీసీలు పత్రికలు పెట్టడమే నేరమా?.. సమాజంలో 85 శాతం ఉన్న బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలపై గర్జించడమే పాపమా? కేవలం 15 శాతం ఉన్న అగ్రకులాల దాష్టీకాన్ని ప్రశ్నించడమే తప్పిదమా? బడుగుల బాధలకు అక్షర రూపం ఇచ్చి, బడుగుల ముందు వాటిని ఆవిష్కరించడమే ‘సూర్య’ చేసిన తప్పిదమా? పత్రికలు కేవలం 5 శాతం ఉన్న కమ్మ-రెడ్డి వర్గం చేతిలోనే శాశ్వతంగా ఉండాలా? శతాబ్దాల పత్రికా చరిత్రలో బడుగు వర్గాల కోసం ఒక బీసీ పత్రిక పెడితే, దాన్ని భూస్థాపితం చేసేందుకు ఇన్ని కుట్రలా? అంటే రాష్ట్రంలో అగ్రకులాలకే మీడియా సంస్థలు ఉండాలా? బీసీలకు ఒక్కగానొక్క పత్రిక ఉంటే దానినీ అణగదొక్కేదాకా నిద్రపోరా? గత కొద్దికాలం నుంచి ‘ఆంధ్రజ్యోతి’-ఏబిఎన్‌ ఛానల్‌ యజమాని వేమూరి రాధాకృష్ణ ‘సూర్య’ దినపత్రికపై విషం చిమ్ముతున్న వైనం పరిశీలిస్తే బడుగు, బలహీన వర్గాల్లో వస్తున్న అనుమానాలే ఇవి." బీ.సీ.లకు ఆ వార్తకు ఏమిటి సంబంధం? అన్న అనుమానం రావచ్చు...'కొడితే ఇలాగే కొట్టాలి...' అని వేమూరి వంటి జర్నలిస్టులు జనాలకు నేర్పేసారు.


వేమూరి పై ఆరోపణలు చేస్తూ....."సూర్య’పై విషం చిమ్ముతున్న రాధాకృష్ణ రెండో వేలయిన ఏబిఎన్‌ ఛానల్‌ ఇటీవల హైదరాబాద్‌ నగరంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న జ్యుయలరీ కంపెనీపై స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. ఆ తర్వాత దానిని ప్రసారం చేయకుండా సదరు కంపెనీతో సెటిల్‌మెంట్‌ చేసుకున్న విషయం మీడియా వర్గాల్లో గుప్పుమంటోంది. అదేవిధంగా సింగరేణి గనుల్లో స్క్రాప్‌ అమ్మకాల విషయంలో కూడా ‘ఆంధ్రజ్యోతి’ బ్రోకర్లు సాగించిన బేరాల్లో విజయవంతమయ్యారని తెలుస్తోంది," అని ప్రచురించింది. 

పైగా..."టీవీ ఛానెల్స్ పై ఆంధ్రజ్యోతి కుట్ర" శీర్షికన ఒక చిన్న బిట్ వేసి...ఆసక్తి కరమైన ఈ వార్తాకథనం రేపు చదవమని సూర్య మొదటి పేజీలో చెప్పింది. 

ఇప్పటికే మసకబారిన తెలుగు జర్నలిజాన్ని ఈ ఆరోపణలు మరింతగా పలచన పడేలా చేస్తున్నాయి. మీడియా బలం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. కనీస మర్యాద లేకుండా...దాడి చేస్తే...చిరంజీవి లా కిమ్మనకుండా ఉండడానికి నూకారపు మామూలు మనిషా? ఒక పత్రికాధిపతి. విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ...ఆయన మొత్తం వ్యవహారానికి విజయవంతంగా కులం రంగు పులిమారు. విలువలు లేని మనుషుల చేతిలో మీడియా ఉంటే...ఎంత ప్రమాదమో....ఇప్పుడు జరుగుతున్న అక్షర యుద్ధం ప్రత్యక్ష సాక్షం.

వారెవ్వా.....మీడియా మాఫియా...

'ఆంధ్రజ్యోతి' లో గత రెండు రోజులుగా వస్తున్న కథనాలు మీడియా రంగంలోని వారి నిజస్వరూపాలను బట్టబయలు చేస్తున్నాయి. ఇది మంచి పరిణామం. నిజానికి 'ఆంధ్రజ్యోతి' పత్రిక/ఛానల్తో పాటు అన్ని చానెళ్ళ అధిపతులు, అక్కడి సీనియర్ బాసుల మీద కూడా 'స్టింగ్ ఆపరేషన్స్' చేసి వీళ్ళు అనతికాలంలో ఇంత వినుతికి ఎలా ఎక్కారో, ఎక్కడ విద్యుత్ ప్రాజెక్టులు పెట్టారో, ఏ రాజకీయ పార్టీ నుంచి ఎంత దండుకుంటున్నారో, ఎక్కడ ఎంత భూమి కొన్నారో, ఎందరిని తార్చారో, ఎందరు అమ్మయిల జీవితాలు కడతేర్చారో... ఆరా తీసి, ప్రసారం చేస్తే ఇంకా బాగుంటుంది. 


'సూర్య' పత్రిక అధిపతి నూకారపు సూర్యప్రకాశ రావు, మరొక వివాదాస్పద వ్యక్తి కాళేశ్వర్ బాబా ప్రతినిధి మధ్య డీల్ వార్తను గురువారం 'ఆంధ్రజ్యోతి' బ్యానర్ గా చేసి 'మీడియా మాఫియా' అని పెద్ద వార్త వేసింది. ముందు రోజు ఛానల్ లో దీని గురించి చాలా ఎయిర్ స్పేస్ కేటాయించింది. ఆది నుంచీ వివాదాస్పదుడైన ఈ పత్రికాధిపతి ఒక సామాజిక వర్గానికి వాణి అవుతానని చెబుతూ...పత్రిక పెట్టి ఈ పనిచేసాడు. తక్కువ శ్రమకు వచ్చే ఎక్కువ డబ్బు (ఈజీ మనీ) కోసం ఆత్మలను అమ్ముకునే జర్నలిస్టుల కక్కుర్తి వల్ల మీడియాలో గంజాయి చెట్లు పుట్టుకొస్తున్నాయి.

'ఈనాడు'లో నిత్యం జనాలకు నరకం చూపిన... జర్నలిస్టు ముసుగులోని ఒక మానసిక వికలాంగుడు సూర్యజపం చేస్తూ...ఆ పత్రికలో పబ్బం గడుపుకుంటున్నాడు. ఇలాంటి జర్నలిస్టులు ఆత్మలను, ఆలోచనలను అమ్ముకోబట్టే...థగ్గులు, పుండాకోర్లు, స్టూవర్టుపురం బ్యాచులు ఎడిటర్లు అవుతున్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నారు. 


రేటింగ్ లెక్కల ప్రకారం....TV-9 తర్వాత స్థానంలో ఉన్న TV-5 లో చిన్న ఉద్యోగి ఒకడు ఒక పది లక్షలు డిమాండ్ చేస్తూ  దొరికిపొయ్యాడని రాధాకృష్ణ గారి ఛానల్ చూపింది. ఛానల్ లో పెద్ద తలకాయల మీద కూడా లోతుగా దర్యాప్తు జరగడం అవసరం. ఇక్కడ కూడా జర్నలిస్టులు కాకుండా...భాజాభజంత్రీ బ్యాచు అవకతవకలకు పాలపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 


పెద్ద జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. జిల్లాలలో ఛానెల్స్ కెమెరామెన్ కూడా ఛానెల్స్ ను అడ్డుపెట్టుకుని ఎంతోకొంత వసూలు చేసుకుంటున్నారు. స్వీయ నియంత్రణ, ప్రొఫెషనలిజం లేమి...వల్ల ఈ పరిస్థితి. జర్నలిజం గురించి తెలియని ఛానల్ యజమానులు మీడియా హౌజులలో కూర్చుని....ఏది వార్తో...ఏది కాదో నిర్ణయించే దుస్థితి పోనంత వరకు 'మీడియా మాఫియా' ఇలా వర్ధిల్లుతూనే ఉంటుంది.   

ఇన్వెస్టిగేషన్ పేరిట స్టింగ్ ఆపరేషన్లు చేయడం, వలకు చిక్కిన చేపలతో బేరాలు చేసుకోవడం, చేపలు కోరినంత కక్కితే స్టోరీ ఆపెయ్యడం, లేదంటే...టెలికాస్ట్ చేయడం...ఛానెల్స్ లో సాధారణమని... యాజమాన్యం మనుషులు ఒకరిద్దరు  ఈ పనిమీదనే ఉంటారని సమాచారం. ఈ విషమ పరిస్థితి నేపథ్యంలో...ఛానెల్స్ మధ్య పోటీ పెరిగి మరిన్ని స్టింగ్ ఆపరేషన్లు జరిగి సో కాల్డ్ జర్నలిస్టుల నిజ స్వరూపాలు బైటపడాలి.

Thursday, April 22, 2010

అహ్మద్ పటేల్ తో రవి ప్రకాష్ బృందం భేటీ!

అఖిల భారత కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి, కోర్ కమిటీ సభ్యుడు అహ్మద్ పటేల్ ను TV-9 ఛానల్ సీ.ఈ.ఓ. రవిప్రకాష్ నేతృత్వం లోని బృందం దేశ రాజధానిలో బుధవారం సాయంత్రం కలుసుకుంది. ఢిల్లీ లో నమ్మదగిన సీనియర్ జర్నలిస్టు ఒకరు దీన్ని తెలియజేసారు.

"సాయంత్రం అర్ధగంటకు పైగా ఈ సమావేశం జరిగింది. రవిప్రకాష్ కాక TV-9 యాజమాన్యం తరఫున మరొక ముఖ్య వ్యక్తి ఇందులో పాల్గొన్నారు," అని ఆ జర్నలిస్టు తెలిపారు. ఉత్తరాదిన ఒక హిందీ ఛానల్, తెలుగులో ఒక వినోదాత్మక ఛానల్ తేవాలని ఆలోచనతో ఉన్న రవి బృందం ఆ పనిలో భాగంగా కలిసిందా? లేక రవి రాజకీయ ఆలోచనలకు ఒక రూపును తీసుకొచ్చే క్రమం లో భాగంగా ఈ భేటీ జరిగిందా? అన్నది తెలియరాలేదు. 

అహ్మద్ పటేల్ తో రవి బృందం భేటీ కడప ఎం.పీ, 'సాక్షి' అధిపతి జగన్మోహన్ రెడ్డి శిబిరంలో ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకు మునుపు కూడా ఒకటి రెండు సార్లు రవి ఉన్నత స్థాయి కాంగ్రెస్ నేతలను కలినట్లు ఈ వర్గం తెలుసుకుంది. రవి కదలికలను ఇక మరింత సునిశితంగా గమనిచాలని ఈ వర్గం భావిస్తున్నట్లు దృవపడని సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మెయిల్స్ కు స్పందించే గుణం లేకపోవడం వల్ల రవి వివరణను తీసుకోలేకపోయాము. ఆయన అధికారికంగా ఈ అంశంపై స్పందిస్తే అది మీకు అదిస్తాం.

i-news కు కందుల రమేష్ గుడ్ బై--స్టూడియో-N లో చేరిక

గత నవంబర్ లో TV-5 ను వదిలి అస్తవ్యస్తంగా ఉన్న i-news లో చేరిన సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ ఇప్పుడు అక్కడి నుంచి కూడా జెండా ఎత్తేసారు. i-news చేరిన నాటి నుంచి యాజమాన్యం ధోరణితో విసిగి పోయిన రమేష్ తాజాగా స్టూడియో-ఎన్ లో కీలక పదవిలో చేరారు. ఆయన నిన్న చార్జ్ తీసుకున్నట్లు తెలిసింది కానీ పూర్తి వివరాలు తెలియరాలేదు. 


సంస్థను నెలకొల్పిన రాజశేఖర్ ను తోసిరాజని ఐ-న్యూస్ యాజమాన్యం రమేష్ ను తీసుకోవడంతో అటు ఐ-న్యూస్ కు, ఇటు రమేష్ కు కష్టాలు మొదలయ్యాయి. రాజశేఖర్ N-TV లో చేరిన నాటి నుంచి వారానికి కొందరు  చొప్పున i-news సిబ్బందిని తీసుకుపొయ్యాడు. అది ఆరంభంలో కందుల రమేష్ కు చాలా చికాకు కలిగించింది. పరిస్ధితులు తేరుకునే లోగానే i-news యాజమాన్యం ఆర్ధిక సంక్షోభంలో పడిపోయింది. ఈ పరిణామం...స్వతహాగా సాత్వికుడు అయిన రమేష్ కు మింగుడు పడలేదు. గత బాసులా మాటలతో బురిడీ కొట్టించడం, అబద్ధాలు చెప్పడం, మభ్యపెట్టడం రాని రమేష్ ఒక రకంగా మానసికంగా కుంగిపోయారు.

అప్పట్లో నేను ఒకటి రెండు సార్లు నేను ఆయనను కలిసాను. అయినా మీరు ఈ మునిగిపోయే నావలోకి అడుగుపెట్టారు ఏమిటి? అని అడిగితే..."పరిస్ధితులు అన్నీ సర్దుకుంటాయి అనే అనుకుంటున్నాను," అని అన్నారాయన. ఆయన అక్కడ ఏమాత్రం సంతృప్తితో లేరని నాకు అర్ధమయ్యింది. 

అక్కడ అన్నా-చెల్లి గొడవలో ఒక సారి రమేష్ ను అనకూడని మాట అన్నారని, అప్పుడే ఆయన వెళ్ళిపోవాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి. పరిస్ధితులు మరీ దారుణంగా ఉండడంతో రమేష్ ఒక మంచి ఆఫర్ తో స్టూడియో-ఎన్ లో చేరినట్లు సమాచారం.  

కందుల రమేష్ నిష్క్రమణ తో ఇప్పుడు i-news యాజమాన్యం అంకం రవి, వెంకట్ ల మీద ఆధారపడుతున్నది. రవి ప్రజెంటర్ గా తనను తాను నిరూపించుకోవడం...ఆ ఛానల్ కు గుడ్డిలో మెల్ల లాంటిది. GMR గ్రూపు లాంటి సంస్థలు వాటా తీసుకోకపోతే....ఐ-న్యూస్ మునక ఖాయంలా కనిపిస్తున్నది. రమేష్ వెళ్ళిపోవడం తో ఆ సంస్థ ఉద్యోగులలో ఉన్న అభద్రతాభావం మరింత గా పెరిగే అవకాశం ఉంది.

Wednesday, April 21, 2010

'ఈనాడు' భువనేశ్వర్ విలేకరి... మిత్రమా..నీతోనే మేము

అన్ని ఇతర సంస్థలకన్నా ఎక్కువగా 'ఈనాడు' యాజమాన్యంలో ఒక దుర్లక్షణం ఉంది. బుర్ర, విలువలు, ఆత్మవిశ్వాసం ఉన్న జర్నలిస్టు ఎవరైనా...ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే వాడిని బుర్రతక్కువ, అహంకార బాసులు వెంటాడి వేధిస్తారు. అందులో భాగంగా ముందుగా రిపోర్టింగ్ లో ఉన్న వాడిని, డెస్క్ కు మార్చి సంఘంలో పలచన అయ్యేలా చేస్తారు. మరీ మొండి ఘటం అనుకుంటే...సదరు వ్యక్తిని పనికిరాని వాడు/ సున్నిత మనస్కుడు/ ఒత్తిడి తట్టుకోలేడు...వంటి ముద్ర వేస్తారు. ఈ పని చేయడానికి ఒక కుల సంఘం అక్కడ పనిచేస్తుంది...వేర్వేరు పేర్లతో. 

అయినా....సదరు జర్నలిస్టు పత్రికను వీడి వెళ్ళకపోతే....దూరప్రాంతాలకు బదిలీ చేస్తారు. పెళ్ళాం బిడ్డలకు దూరం చేస్తే సంస్థ వీడతాడని యాజమాన్యం కుటిల పన్నాగం. దీనికి చాలా మంది బలవుతారు. లొంగి పోతారు. కానీ కొందరు ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడికి వెళ్లి యాజమాన్యాన్ని ఆడుకుంటారు...చక్కగా. అలా ఆడుకోవడం రాని నిజాయితీపరులైన అమాయకపు జర్నలిస్టులకు అండగా ఉండడం ఈ బ్లాగ్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఉదయం వచ్చిన ఒక మెయిల్ చూసి ఈ మాటలు రాస్తున్నాను. 
ముందుగా ఈ మెయిల్ చదవండి:

I would like to bring an issue relating to a journalist working for eenadu in Bhuvaneshwar (punishment transfer). He is fighting tooth and nail for his rights. He was denied even a single promotion in his entire career of 13 years and due to his frankness faced the wrath of management. He has put a number of complaints with labour commissioner and none have been pursued. On April 20th he was asked not enter the office premises. that is when he refused to sign on ETV register. Please inquire about him and make a post on the managements attitude and their misdeeds.

ఇది చదివి నాకు చాలా బాధేసింది. కడుపు రగిలిపోయింది. అప్పటి న్యూస్ టుడే ఎం.డీ., ఆ ఉజ్జోగం పొయ్యాక మొన్నటి దాకా 'తెలుగు దేశం' ఆఫీసులో పనిచేసిన రమేష్ బాబు గారు నన్ను కూడా నేను పనిచేసే డెస్కులోకి రానివ్వకుండా...సెక్యూరిటీ లో కూచోబెట్టారు...కోపంతో. దానిపై నేను రాసిన ఒక లేఖకు రామోజీ గారు, కిరణ్ గారు స్పందించి నన్ను బాగా పని చేసే మరొక చోటికి బదిలీ చేశారు. ఉద్యోగులను ఇలా హింసించడానికి రామోజీ గారు వ్యతిరేకమేమో, సెకండ్ రంగ్ బాసులు ఇలాంటి పిచ్చిపనులు చేస్తారేమో అని నాకూ అప్పుడు అనుమానం కలిగింది. అది నిజమో కాదో తెలియదు. 
 
సరే...ఈ పోస్టు చూసిన వారెవరైనా...ఆ భువనేశ్వర్ విలేకరి వివరాలు వెంటనే తెలియజేయండి. ఆ జర్నలిస్టు నీతిమంతుడైతే....తను నిజంగానే అన్యాయానికి బలైతే...'ఈనాడు' పై పోరాటానికి మేము సిద్ధం. ముందుగా...ఈ కేసును పరిశీలించి...కిరణ్ గారి దగ్గరకు వెళ్దాం. తర్వాత యూనియన్ ను సంప్రదిద్దాము. లేబర్ కమిషనర్ ను కలుద్దాం. అయినా న్యాయం జరగకపోతే...లీగల్ పోరాటం తో సహా అన్ని మార్గాలు పరిశీలిద్దాం. ఎం.పీ ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గరకు వెళ్దామని, ఈ పోరాటంలో ధన సహాయానికి సిద్ధమని కొందరు మిత్రులు ఇప్పటికే మాట ఇచ్చారు.  ఇది 'జర్నలిస్టు' అనే బిళ్ళ ఉన్న అందరికీ ఒక సవాల్. మన మిత్రుడిని మనం రక్షించుకుందాం. మన హక్కులు మనం కాపాడుకుందాం.
డియర్ రిపోర్టర్, don't suffer in silence. Fight back. We are with you.

'హిందూస్తాన్ టైమ్స్' లో 'ట్రాకింగ్ హంగర్'

తెలుగు పేపర్స్ చదివి చదివి, తెలుగు ఛానెల్స్ చూసి చూసి....మీడియా మీద నిలువెత్తు అసహ్యం, పీకల్లోతు కోపం ఉన్నవారికి ఒక సలహా. మీరు ఎలాగైనా చేసి...'హిందూస్తాన్ టైమ్స్' ఆంగ్ల పత్రిక చదవండి. నెట్ లో కూడా చదవవచ్చు. వాళ్ళు 'ట్రాకింగ్ హంగర్' అనే లోగో కింద ఇస్తున్న వార్తలు కచ్చితంగా మీకు నచ్చుతాయి. కథనాలు చాలా బాగుంటున్నాయి.


ఇంగ్లిష్ అంటే...మనకెందుకు వచ్చిన గొడవని అనుకునే తెలుగు జర్నలిస్టు మిత్రులారా...మీరు తప్పకుండా ఈ పేపర్ చదవండి. ఇది చాలా ముఖ్యం. ఇందులో భాష చాలా సరళంగా ఉంది. బిగినర్స్ తేలిగ్గా భాషను మెరుగు పరుచుకోవచ్చు. డెస్క్ లో ఉన్న మిత్రులు 'ది హిందూ' చదివినా చదవకపోయినా పర్వాలేదు కానీ...'హిందూస్తాన్ టైమ్స్' తప్పక చూడండి. కాదు...చదవండి. డిజైన్, లే అవుట్ విషయంలో మీకు మంచి అవగాహన వస్తుంది. గత ఇరవై ఏళ్ళుగా అడపా దడపా ఈ పత్రిక చదివిన నాకూ పెద్ద మజా దొరకలేదు కానీ...రోజూ చూస్తుంటే....చాలా తృప్తికరంగా ఉన్నది. రోజు రోజుకూ దానిపై గౌరవం పెరుగుతున్నది. 


ఇందులో సమకాలీన అంశాలపై వ్యాఖ్యలు లేని వార్తలు, విశ్లేషణలు చాలా బాగా ఇస్తున్నారు. 'ది హిందూ', 'టైమ్స్ అఫ్ ఇండియా' లకు మధ్యస్తంగా ఉండి...జర్నలిజం విలువలను పాటిస్తూ ఉన్న పత్రిక ఇదని నాకూ నమ్మకం కుదిరింది. రూరల్ రిపోర్టింగ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నది. వీళ్ళ స్పోర్ట్స్ పేజి డిజైన్, కంటెంట్ చాలా బాగున్నాయి. మీరు ఈ పేపర్ మిస్ కాకుండా చదివితే బాగుంటుంది. వీలయితే...ఏడు, ఆ పైన తరగతులు చదివే మీ పిల్లల చేత కూడా చదివించండి.

'ట్రాకింగ్ హంగర్' కింద ఇస్తున్న స్టోరీ లు చూస్తే...నార్త్ లో చాలా పల్లెలలో ఉన్న నిజమైన పరిస్ధితులు, వారి సమస్యలు, దురవస్థలు చాలా చక్కగా బోధపడతాయి. పాలగుమ్మి సాయినాథ్ రాసే తరహా రిపోర్టులు రోజూ కనిపిస్తున్నాయి. సాయినాథ్ వి కామెంట్స్ తో కూడిన పెద్ద పెద్ద వ్యాసాలు కానీ....'హిందూస్తాన్ టైమ్స్' వాళ్ళు కేవలం వార్తలను వార్తలుగా సంక్షిప్తంగా ఇస్తున్నారు.
----------------------------------------------------
నోట్: ప్రతి విషయాన్ని సంశయం/ అనుమానం అనే కళ్ళజోడు నుంచి చూసే కొందరు మహాశేయులకు (ముఖ్యంగా నా ప్రియ మిత్రులకు) గమనిక: అయ్యా/ అమ్మా...నాకూ ఈ పత్రికకు ఎలాంటి సంబంధం లేదు.  వీడేంటి...ఇంతగా ఈ పత్రిక గురించి రాసాడు....వీడికేమి లాభం అని జుట్టుపీక్కోకండి.
ఒక మంచి విషయాన్ని తెలియజేద్దామనే ఇది రాసాను.

Tuesday, April 20, 2010

TV-9 లో ముందు భక్తిపై...తర్వాత రక్తిపై ప్రోగ్రామ్స్

ఛానెల్స్ అఘాయిత్యాలపై విసిగి...ఈ మధ్య ఒకాయన ఒక కామిడీ బిట్ పంపాడు. అది పోస్ట్ చేస్తే బాగుండదని, మర్యాదకాదని పోస్ట్ చేయలేదు. సుదీర్ఘంగా ఉన్న దాని సారాంశం ఏమిటంటే....

వివిధ పాపాలు (అంటే...భూ కబ్జాలు, తార్పుడు, పరభార్య అపహరణ, పరద్రవ్య తస్కరణ, అవినీతి, దొమ్మీ, దొంగతనం, కులగజ్జి...వగైరా) చేసి నరకంలో పడిన ఒక ఇరవై మంది ఒక సండే నాడు...షికారుకు వెళ్తారు. అది భగభగ మండే ఎండాకాలం. అక్కడ ఒక కొలను దగ్గర వీరు బీరు తాగుతూ సేద దీరి ఉండగా...దాహార్తితో మంచినీళ్ళు తాగడానికి బ్రహ్మ అక్కడకు వస్తాడు. 

పొరపాటున ఆయన కాలుజారి నీళ్ళలో పడతాడు. ఇరవై మందిలో ఇద్దరు వెంటనే...ప్రాణాలకు తెగించి దూకి బ్రహ్మను రక్షించి ఒడ్డుకు చేరుస్తారు. మిగిలిన వారంతా ఆయనకు సపర్యలు చేస్తారు. దీనికి కడు మిక్కిలి సంతసించి బ్రహ్మ ఆ ఇద్దరినీ ఏదైనా వరం కోరుకోండని అంటాడు. 

అందులో కాస్త చూడ చక్కని వాడు..'నేను తెలుగు దేశంలో పుట్టాలి. పెద్ద మీడియా బ్యారెన్ కావాలి,' అని కోరగా...ఇంకొకడు..'నేను ఇండియాను పాలించిన ఇంగ్లాండ్ లో మీడియా బ్యారెన్ కావాలి,' అని కోరుకుంటాడు. 

"తథాస్తు. ఒకడు ఆర్.ఎం.గా ఇంగ్లాండ్ లో, ఇంకొకడు ఆర్.పీ.గా ఆంధ్రాలో పుట్టుగాక. మీడియాను మీరు దున్నుకున్దురు గాక," అని వరం ఇచ్చి బ్రహ్మ అదృశ్యం అయిపోబోతాడు. "మరి మేమేమి పాపం చేసాం..." అని ఆ బ్యాచ్ లో మిగిలిన అందరూ బ్రహ్మను పట్టుకుని పోనివ్వకుండా గొడవ చేస్తారు. అప్పటికే నొప్పులతో బాధపడుతున్న బ్రహ్మ...వారిని కూడా...పాపాలు ఎక్కువైన తెలుగు నేల మీద పేపర్లు, ఛానళ్ళు పెట్టుకుని దున్నుకోండి...అని పంపాడు.

ఇదీ క్లుప్తంగా కథ. ఎర్రటి ఎండలో తిరిగి వచ్చి బుర్ర చెడి మధ్యాన్నం ఒక కునుకు తీసాక చివర్లో అప్రయత్నంగా ఈ కథ గుర్తుకు వచ్చింది. ఇక లాభం లేదని లేచి ఛానెల్స్ మారుస్తూ ఉంటే...TV-9 లో "పూజలు చేస్తే...పాస్ అవుతారా?" అన్న శీర్షికతో ఒక ప్రోగ్రాం వస్తున్నది. అక్కడ స్టూడియోలో గోగినేని బాబు అనే ఒక నాస్తికవాది కనిపించారు. ఆయన పక్కన 'హిందూ ఆలయ పరిరక్షణ సమితి' కి చెందిన కమల్ కుమార్ ఉన్నారు. 

ఛానల్ వాళ్ళు ఒక ఆలయం (బాసర అనుకుంటా) ఈ.ఓ.తో లైవ్ లో మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి నాకు అర్థమయ్యింది ఏమిటంటే..అమ్మవారిని దర్శించుకునేందుకు విద్యార్థులకు ఉచిత అనుమతి ఇస్తున్నారట. దాని మీద చర్చ. అప్పుడు బాబు గారు వ్యంగ్యమైన ప్రశ్నలు అడిగారు..అటువైపు ఉన్న ఆ ఈ.వో.ను.

"తమరు...పూజారి కాదు కదా..అధికారి కదా..పూజారి చెప్పాల్సింది మీరు చెబుతున్నరేమిటి?"
"మీకు religious responsibility ఏమి వుంది?"
"పుష్యమి నక్షత్రం ఎంత దూరంలో ఉంది...సార్?"

...వంటి ప్రశ్నలు గోగినేని బాబు గారు అడిగారు. నేను ఇది విని నవ్వుకున్నా. పొద్దున్నలేస్తే...నవరత్న ఉంగరాలు, జ్యోతిష్యం...వంటి వాణిజ్య ప్రకటనల మీద, బూతు తో పాటు భక్తి కార్యక్రమాల మీద బతికే ఛానెల్స్ వాళ్ళ రూం లో కూర్చుని "దేవుడు లేడండీ...ఇవేమి ప్రోగ్రామ్స్ అండీ..."అని వాదించడం దండగ మాలిన పని. (ఆ మధ్యన... ఎం.ఎల్.సీ. కం మా సారు డాక్టర్ కె.నాగేశ్వర్ కు , బాబు గారికి ఐ-న్యూస్ లో ఒక చర్చలో జరిగిన వాడివేడి మాటల యుద్ధం కూడా గుర్తుకు వచ్చిందీ సందర్భంగా...)

సరే...ఈ భక్తి పంచాయితీ..ముగియగానే..."FILMI GACHIPS" అనే కార్యక్రమం TV-9 ఛానల్ లోనే వచ్చింది. ఇది రక్తి టైం అన్నమాట. అందులో యాంకరమ్మ లేని ఎనర్జీని తెప్పించుకుని....నగ్మా గురించి అందమైన మాటలు చెప్పింది. ఇక నగ్మా పెళ్లి చేసుకోబోతున్నది అని చెబుతూ...ఆమె వివిధ సినిమాలలో చేసి చూపిన బూతు దృశ్యాలను చూపించారు.  

ఆ తర్వాత జాన్ అబ్రహం గురించి ఫక్తు నీలి బూమ్మలు వేసారు. బ్యాక్ గ్రౌండ్ లో పాటలు వస్తుండగా...అబ్రహం సముద్రపు ఒడ్డున...చొక్కా విప్పగానే...ఒక సుందరి వుర్రికి వచ్చి అతని మీదకు ఎక్కడం...ఆ తర్వాత ఇద్దరూ తమకంతో కిందపడి...ఇసుకలో పిచిపిచ్చిగా బిహేవ్ చేయడం...పదే పదే చూపారు. ఓ...బ్రహ్మా...నువ్వు కాలిజారి పడడం వల్లనే కదా...మాకీ శిక్ష!

ప్రొఫెసర్ పై స్టింగ్ ఆపరేషన్ చేసిన ఇద్దరు విలేకరుల అరెస్టు

Aligarh Muslim University ప్రొఫెసర్ శ్రీనివాస్ రామచంద్ర సిరస్ (64) ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆయన స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్న వైనాన్ని షూట్ చేసి, అడ్డుకున్న ఆయనను గాయపరిచిన ఘటనలో ఇద్దరు విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతం తర్వాత అనుమానాస్పద స్థితిలో సిరస్ మరణించారు. ఈ అంశంపై ఈ రోజు 'హిందూస్తాన్ టైమ్స్' ప్రచురించిన కథనం ఇది.

Sting on AMU Prof: 2 TV reporters held
ALIGARH: The police on Monday arrested two local TV reporters who conducted a sting operation on an Aligarh Muslim University professor having consensual sex with another man on February 8. The reporters, Syed Adil Murtaza and Shiraz, were charged with forcibly entering the house of Prof Shrinivas Ramchandra Siras, 64, and causing him physical harm.

The police had earlier refused to register a first information report when Siras complained that the reporters had invaded his privacy and beat him up.

Reacting to the arrests, AMU Teachers' Association President Mukhtar Ahmad said, "We want the police to interrogate the two fairly so that the truth behind the sting operation which culminated in the tragic demise of our colleague is fully unravelled."

Some senior AMU officials, including Siras' colleagues, are also likely to be questioned in connection with the case, said a police official who did not want to be named. Monday's arrests came 12 days after Siras, reader and chairman of AMU's department of Modern Indian Languages, was found dead in his flat under mysterious circumstances on April 7.

He died a few days after he returned from Nagpur, where he owned property worth Rs 3 crore, to which his ex-wife has laid claim. Siras was to retire in September.

Doctors who conducted the postmortem examination on his body did not ascertain the cause of his death, saying consumption of some poisonous substance or a heart attack could have caused it.
They had said a forensic report of his viscera and heart would provide a clearer picture.

Siras was suspended from his post for “gross misconduct“ the day after video clips of the sting operation were shown to the AMU authorities.

Siras then approached the Allahabad High Court, which upheld his plea on April 1 and ordered the university to rein- state him.
(with PTI inputs)

తిక్క వార్తలు....చెత్త ఫోటోలు....పిచ్చి ప్రాధాన్యతలు

"ఇరువురి మధ్య ఘర్షణ"
"భర్తతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిన భార్య"

---ఇవి ఈ రోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్ మినీ లో పన్నెండో పేజీలో వచ్చిన వార్తలు. ఎంత జోనల్ పేజ్ అయితే మాత్రం...ఇవేమి వార్తలు? కథనాలు కూడా మరీ చెత్తగా ఉన్నాయి. మినీలు మొత్తం పార్టీలు/ సంస్థలు/వ్యక్తుల ప్రకటలతో, క్రైం వార్తలతో నిండిపోయాయి. 


దేశాన్ని ఒక కుదుపు కుదిపిన జస్సికా లాల్ కేసులో మనూ శర్మకు విధించిన శిక్షను సుప్రీం కోర్టు సమర్ధించడం ఇటు 'ఆంధ్ర జ్యోతి'కి అటు 'ఈనాడు'కు మొదటి పేజీ వార్త కాలేదు. 'ఈనాడు' అప్రాముఖ్యంగా ఆరో పేజీ మధ్యలో  దీన్ని ప్రచురించగా..."జ్యోతి" లో ఐదో పేజీలో దిగువన పడేసారు. 'సాక్షి' నాలుగో పేజీలో కిందిభాగంలో ఒక కలర్ బాక్స్ లో దీన్ని ప్రచురించింది. 


'ది హిందూ' మొదటి పేజీలో ప్రముఖంగా దీన్ని ప్రచురించింది. జెస్సిక తోబుట్టువు సబ్రిన లాల్ స్పందనను కూడా ఒక వార్త గా వాడింది. 
'ఈనాడు' అధిపతి రామోజీ రావు ను బద్నాం చేయడమే ప్రధాన అజెండాగా ఉన్న 'సాక్షి' వారు ''రామోజీ పై చర్య తీసుకోరూ.." అన్న శీర్షికతో విశాఖ ఈనాడు ఆఫీసు స్థల యజమాని ఫిర్యాదును ఒక వార్తగా పదో పేజీలో వేసారు. ఈ వార్త్ పదో పేజీలో ఉన్నదని సూచిస్తూ....రామోజీ మగ్ షాట్ తో ముందు పేజీలో పై భాగాన ఒక చిన్న బిట్ ప్రచురించారు.  ఇక 'జ్యోతి' వారు ఈరోజు చంద్రబాబు భజనలో నిమగ్నమై మొదటి పేజీలో సింహ భాగాన్ని నారా వారికి కేటాయించారు.

ఈ మధ్య 'ది హిందూ' కూడా బూతుపట్ల ఆకర్షితమవుతున్నది. కాస్త సంసార పక్షంగా ఉంటుందని మన్ననలు అందుకుంటున్న ఈ పత్రిక హైదరాబాద్ ఎడిషన్ రెండో పేజీలో ఈ కింది 'అందాల ఆరబోత' ఫోటో వేసి...."show-stealers"  అని కాప్షన్ ఇచ్చింది. నేనైతే 'ది హిందూ' ఇలాంటి ఫోటోలు వేస్తుందని ఊహించలేదు. ఇదేమి ఫోటోనో మీరే చూడండి...హవ్వ..హవ్వ..


ఇక వేమూరి వారి పత్రికలో వాడినట్లు చెత్త ఫోటోలు ఈ భూమండలంలో ఏ పత్రికలో వాడరని నేను రాసిస్తాను. ఇక్కడ పనిచేసే జర్నలిస్టులకు ఫోటోల వాడకం, ప్రభావం గురించి తెలియదు. పెద్ద ఫోటో వాడడం స్పేస్ వేస్ట్ అనుకునే ముతక ఆలోచన వారిది. ఈ రోజు పెద్ద పేజీలలో లోపల వాడిన ఫోటోలు అన్నీ చాలా చిన్నవిగా ఉన్నాయి. భూతద్దాలు పెట్టుకోనిదే అవి కనిపించవు. డబ్బులు పెట్టి కొన్నందుకు ఇదొక శిక్ష. రెండు రోజులు చూసి పేపర్ బంద్ చేయాలని అనుకుంటున్నా నా మటుకు నేను.

"జ్యోతి" మినీ ఏడో పేజీలో 'మీడియా పోలీసులకు సహకరించాలి' అన్న శీర్షికన ఒక పెద్ద ఫొటోనే వేసారు. 'చిత్రంలో కొమ్మినేని శ్రీనివాస రావు, రాము, మధుసూదన్ రావు...' అని ఫోటో కింద రాసారు. కానీ...అందులో ఒక్కరూ నామమాత్రంగా కాదు గదా...చీమమాత్రంగా అయినా కనిపించడం లేదు. కొమ్మినేని లాంటి సీనియర్ పాత్రికేయుడికి ఇచ్చే గౌరవం ఇదా?

Sunday, April 18, 2010

ఆగకుండా....వెంటాడుతున్న....దంతెవాడ

రోజూ రాసే మీడియా రొచ్చుకు భిన్నంగా...ఏదైనా రాయాలని ఉదయాన్నే అనుకుని...'హిందూస్తాన్ టైమ్స్' మొదటి పేజీ చూస్తే...గుండె తరుక్కు పోయింది. దంతెవాడలో మావోయిస్టులు విచ్చలవిడిగా జరిపిన కాల్పులలో తీవ్రంగా గాయపడిన  సీ.ఆర్.పీ.ఎఫ్.జవాన్లు తమ చివరి క్షణాలలో రక్తమోడుతూ తమ కుటుంబసభ్యులకు తమ మొబైల్స్ నుంచి చేసిన కాల్స్ పై ప్రత్యేక కథనం అది. 


"Dantewada jawans tried to reach out one last time" అనే శీర్షికతో ఉన్న ఆ వార్త హృదయాన్ని కదలించింది. దాని మొదటి పేరా (లీడ్) ఇలా ఉంది:
They wanted to listen to their children's voices one last time and give their wives the courage to carry on.
They wanted to apologise to their parents for deserting them.

The CRPF soldiers wounded in the jungles of Dantewada were using their mobile phones for that final, desperate call.
Life was slipping out of their grasp. Still, the jawans wanted to assure their loved ones that everything would be alright. 

For some, the bell kept ring- ing. For others, the phone was away from their families work- ing in the fields. Here are a few stories of those final moments.

ఒక జవాను పడిన వేదన గురించి వార్త చివర్న ఇలా ఉంది:   


Badly wounded, Ali Hassan, 34, of Khatola Village in Uttar Pradesh's Muzaffarnagar district, called his wife Tasmina.
“Take care of the daughters.
I might not survive as I have two bullets in my body,“ he said.
And then the phone was disconnected, forever.


ఈ కుటుంబాలు చేసిన తప్పు ఏమిటి? అలీ హసన్ కూతుళ్ళకు ఈ శిక్ష ఎందుకు పడాలి? ఈ వార్త చదివి...ఆ దండకారణ్యంలో చివరి క్షణాలలో జవాన్లు పడిన బాధను, కుటుంబం కోసం వారు పడిన వేదనను ఊహించుకుని బాధపడ్డాను. తెలంగాణా పల్లెలలో ఇళ్ళ నుంచి మావోయిస్టు ముద్ర తో యువకులను బలవంతాన తీసుకెళ్ళి పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్లు చేసినప్పుడు కూడా ఇదే బాధ కలిగింది. ఎన్నాళ్ళిలా పోరాటం? ఎంత మంది చావాలిలా? ఎన్ని కుటుంబాలు రోదించాలి ఇలా? 

జవాన్లను అలా చంపడానికి బదులు మావోయిస్టులు ఏదైనా వాయువు ప్రయోగించి వారిని నిర్వీర్యులను చేసి బంధించి తర్వాత వదిలేసే ఏర్పాటు వుండివుంటే ఎంత బాగుండేది? రెండు వర్గాల వారూ చంపుకోవడం కాకుండా...పరస్పరం కసి తీర్చుకోవడానికి మధ్యేమార్గంగా ఏదైనా కనిపెడితే ఎంత బాగుంటుంది? ఒక్క దెబ్బకు 76 మంది నేలకొరిగారు. ఇదే ఆఖరి పోరాటమన్న గ్యారెంటీ లేదు కదా!


ఈ అర్థం లేని పోరాటంలో సమిధలవుతున్న వారిని తలచుకుంటే...గుండె పగులుతుంది. మావోయిస్టులు నిజంగా తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తారా? అంటే...అది దుర్లభం అనిపిస్తుంది. అలాగని...రాజ్య వ్యవస్థను నిలువరించి వారు బతికి బట్టకట్టగలరా అంటే...అదీ ప్రశ్నార్ధకమే. ఇటు చూస్తే...ఈ పోలీసులు, సైన్యం వారిని ఎదుర్కుని పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. వారిది ఒక చచ్చుపుచ్చు వ్యవస్థ. అందువల్లనే....రెండు వైపులా వీరులు నేలకు ఒరుగుతున్నారు. 

అరుంధతి రాయ్ లాంటి ఒక రచయిత్రి స్వేచ్చగా దంతెవాడ వెళ్లి మావోయిస్టులతో గడిపి తీరిగ్గా వెనకకు వచ్చి పెద్ద వ్యాసం రాసారంటే...నిఘా ఏమైనట్లు? పోలీసులు...పై వారి ఆదేశాలను పాటిస్తూ అరణ్యంలో బిక్కుబిక్కున బతుకుతున్నారన్న సమాచారం ఇంకా భయం గొల్పేదిగా ఉంది. విపరీతమైన ప్రజాబలం లేనిదే మావోయిస్టులు ఇన్నాళ్ళు అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడపలేరు. ప్రజల దన్ను ఉన్నంతకాలం ఫేక్ ఎన్కౌంటర్ లు తప్ప పోలీసులు/జవాన్లు వారిని ఏమీ చేయలేరు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? చర్చలకు ఎవరు ముందుకు రావాలి? అసలు దేనిమీద చర్చ జరపాలి?


ఇన్ని ఆలోచనల మధ్య భారమైన హృదయంతో....CNN-IBN ఛానల్ ను సందర్శిస్తే...అక్కడా..."Dantewada Martyrs" అనే హృదయ విదారక కార్యక్రమం వస్తున్నది. అది దృశ్య కావ్యం కావడంతో ఇంకా ప్రభావశీలంగా అనిపించింది. అప్పుడిక లాభం లేదని...తెలుగు ఛానెల్స్ చూస్తే.... సినిమా పాటలు, మసాలా మాటలు కలగలిసిన వార్తలనబడేవి ప్రసారమవుతూ కనిపించాయి. అక్కడే ఫిక్స్ అయి సేద తీరాను...ఈ ఆదివారం ఉదయం.

Saturday, April 17, 2010

మీడియా సానియా మేనియా వల్ల నష్టం ఇంతింత కాదయా!

"ఛానెల్స్ వాళ్ళు ఇష్టంవచ్చిన మసాలా ప్రోగ్రామ్స్, ప్రజా సంక్షేమం పట్టని కార్యక్రమాలు చూపించడం వల్ల జరిగే నష్టం ఏమిటి?" అన్న ప్రశ్న సిల్లీగా అనిపించవచ్చు కానీ...అది ఎంతో కీలకమైనది. రేటింగ్స్ కు, వ్యాపార ప్రకటనలకు సంబంధం ఉంది కాబట్టి...మేము ప్రజల మదిని దోచే/ వారిని రంజింపజేసే కథనాలు ప్రసారం చేయడంలో తప్పు ఏమిటని ఛానెల్స్ సీ.ఈ.వో.లు అంటారు. సినిమా వాళ్ళ మాదిరిగా..."జనం చూస్తున్నారు...మేము చూపుతున్నాం..." అన్న వితండ వాదన చేస్తారు.
 

ఇటీవల మీడియా, ముఖ్యంగా, ఛానెల్స్, మరీ ముఖ్యంగా TV-9, సానియా మానియా లో పడి కొట్టుకోవడం వల్ల కనిపించని నష్టం చాలా జరిగింది. ఇది ఎవ్వరూ పూడ్చలేని నష్టం. సానియా పెళ్లి ప్రకటన చేసిన రోజు నుంచి...ఛానెల్స్ వెర్రి ఎత్తినట్లు ఆ వార్త వెంట పడడం వల్ల కనీసం నాలుగు  ముఖ్యమైన అంశాలు మరుగున పడ్డాయి. ఒక వ్యక్తి పెళ్లి విషయంలో తలదూర్చి...ఆమె ఈసడించుకుంటున్నా...ఆమెకు కవరేజ్ ఇవ్వడం వల్ల జరిగిన నష్టం అపారం. అవి.....

ఒకటి) దంతేవాడ మృతవీరులు స్మరణకు నోచుకోలేదు. ఒక నక్సల్ మరణిస్తే...కనీసం మూడు మానవాసక్తికర వార్తలు ప్రచురించే మీడియా 76 మంది వీర సైనికులకి సంబంధించి కనీసం డజన్ వార్తలైనా ఇవ్వలేదు. ఎలెక్ట్రానిక్ మీడియా పూర్తిగా వీరిని విస్మరించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో...శాంతి స్థాపన కోసం బయలుదేరిన సైనికులు దారుణంగా హత్యకు గురైతే...ఇది మీడియాకు పట్టదా? అన్న ప్రశ్న సహేతుకమైనది. 


ఇలాంటి ఊచకోతలో, మరొక పెద్ద పరిణామాలో జరిగినప్పుడు ప్రజలలో నిర్దిష్ట అభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ సంఘటనల కవరేజ్ వల్ల ప్రజలలో ఒక చర్చ జరుగుతుంది, అది వారిలో అనుకూల/వ్యతిరేక అభిప్రాయం ఏర్పడడానికి దారి తీస్తుంది. అది ప్రజాస్వామ్యానికి కీలకమైనది. ఇప్పుడు మీడియా
సానియా పిచ్చిలో పడి దంతేవాడ ఘటనను విస్మరించడం వల్ల...స్వతంత్ర భారత చరిత్రలో మావోయిస్టు లు సృష్టించిన అతిపెద్ద రక్తపాతం...తేలిగ్గా కనుమరుగు అయ్యింది. మావోల సిద్ధాంతం మంచిదా? కాదా? అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. బాధ్యతాయుతమైన విలేకరులం.... నక్సల్స్ గురించి బాగా పట్టించుకుని.... ట్యాక్స్ పేయర్స్ సొమ్ముతో పనిచేస్తూ హత్యకు గురైన వారిని విస్మరించడం మన మౌలిక సూత్రమైన నిష్పాక్షికతను దెబ్బ తీయడం కాదా?

రెండు) మీరంతా...సానియా పెళ్లి పిచ్చిలో పడి...ఛీ.ఛీ.పొమ్మన్నా...తాజ్ క్రిష్ణ బైట కూర్చొని గంటల కొద్దీ సమయాన్ని దీనికి కేటాయించడం వల్ల మరొక పెద్ద ఘోరం జరిగింది. ఒక అమ్మాయి మీద రాష్ట్రంలో జరిగిన యాసిడ్ దాడి సరిగా కవర్ కాలేదు. ఒకప్పుడు...యాసిడ్ దాడి అన్ని పత్రికలకు, ఛానెల్స్ కు ప్రధాన వార్త. మీడియా సృష్టించిన ప్రజాభిప్రాయానికి రెచ్చిపోయి...ఒక ఎస్.పీ. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఏకంగా ముగ్గురు యువకులను పిట్టల్లా కాల్చిపారేసాడు కూడా. ఇప్పుడు ఒక యువతి అదే దాడికి గురైతే...మీరు, మీ రిపోర్టర్ గణం బిజీ గా వుండడం వల్ల ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు. ఆమెపై దాడి చేసిన వారు ఏ మాత్రం ఒత్తిడికి గురికాలేదు. ఇదే ధోరణి సాగితే...యాసిడ్ దాడులు పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదన్న సామూహిక భావనను మీడియా ప్రజలలో చొప్పించినట్లు అవుతుంది. తెలుగు బూతు సినిమాలు, టీ.వీ.ల బాధ్యతారాహిత్యం వల్లనే ఆడపిల్లలపై అఘాయిత్యాలలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉందని మా ప్రగాఢ విశ్వాసం.

మూడు)  సానియా హడావుడి జరుగుతున్నప్పుడే....హైదరాబాద్ నగరంలో పలు చోట్ల పట్టపగలు చోరీలు జరిగాయి. ఇది నగర పౌరులకు చాలా ముఖ్యమైన విషయం. ఈ దొంగతనాలలో ఒక ప్యాట్రన్ ఉంది. మీడియా దీని గురించి పట్టించుకోకపోవడం వల్ల కనిపించని నష్టం జరిగింది.

నాలుగు) మీడియాలో చాలాభాగం సానియా షాదీకి కేటాయించడం వల్ల....రాష్ట్రంలో వడదెబ్బ మృతులు సరిగా కవర్ కాలేదు. ఇప్పటికే కనీసం 50 మంది వేసవి వల్ల ప్రాణాలు కోల్పోయారు. సానియా పెళ్లి బాజాల మోతలో ఈ చావులు చాలా అప్రధానమై పోయాయి.

మీడియా బాసులు...ఈ అంశాలు ఆలోచించాలి. సానియా వార్త ఇవ్వకూడదని ఎవ్వరూ అనరు. కానీ....వెర్రి పోటీలో పడి స్వీయ నియంత్రణ లేకుండా....ఇలాంటి అంశాలకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మిగిలిన వార్తలకు అన్యాయం జరిగింది. వ్యాపారంతో పాటు ప్రజాహితం కూడా పరమావధి కావాలి. మీడియా సంఘ సేవ లాంటిది అన్న స్పృహ అలవరుచుకుంటే...సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది.

మాజీ 'ది హిందూ' జర్నలిస్టు సాయశేఖర్ కు ఆపరేషన్

'ఈనాడు' తో జర్నలిస్టు జీవితం ఆరంభించి 'ది హిందూ' లో ఒక వెలుగు వెలిగి అర్ధంతరంగా వైదొలిగిన ఎ.సాయశేఖర్ హృదయ సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు శనివారం ఒక సర్జరీ చేస్తారని తెలిసింది అయితే...అది మైనరా? మేజరా? అన్నది తెలియరాలేదు.

'కాస్త అన్ఈజీ గా వుండి ఆసుపత్రికి వెళ్ళిన ఆయన...హార్ట్ ప్రాబ్లం తో ఆసుపత్రిలో మూడు రోజుల కిందగా జాయిన్ అయ్యారు. ఈ రోజు ఆపరేషన్," అని అతని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

వివాదాస్పద పరిస్థితుల నడుమ 'ది హిందూ' నుంచి వెళ్ళిపోయిన సాయ శేఖర్ ఒక బిజినెస్ వెబ్ సైట్ నిర్వహిస్తున్నారు. ఈనాడు, న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్ పేపర్లలో వివిధ హోదాలలో పనిచేసిన సాయ శేఖర్ 'ది హిందూ'లో చేరిన ఆనతి కాలంలోనే పై స్థానాలకు ఎదిగారు. విజయవాడ బ్యూరో చీఫ్ గా ఉన్న ఆయనను యాజమాన్యం హైదరాబాద్ కు బదిలీ చేసింది. ఇక్కడ బిజినెస్ వ్యవహారాలూ చూసిన ఆయన ఒక వివాదంలో చిక్కుకుని చివరకు....'ది హిందూ' నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

మంచి టాలెంట్ గల అతి కొద్దిమంది జర్నలిస్టులలో ఒకరైన సాయశేఖర్ పదునైన నాలుకతో వివాదాలు కొని తెచ్చుకునే వారని మీడియా వర్గాలలో ప్రచారం ఉంది. ఆరోగ్య సమస్యను అధిగమించి సాయశేఖర్ కోలుకోవాలని ఆశిద్దాం.
--------------------------------------

నోట్: సాయ శేఖర్ చేరిన ఆసుపత్రి వివరాలు ఉన్నప్పటికీ....అతని అనుమతి లేకుండా ఇవ్వకూడదని, అది అతని విశ్రాంతి కి భంగం కలగవచ్చన్న అనుమానంతో ఇక్కడ రాయడంలేదు. అతని ఆరోగ్యంపై తాజా వివరాలు అందించే ప్రయత్నం చేస్తాము.     

'జీ-24 గంటలు' లో మానవాసక్తికర కథనం: 'అమ్మ కోసం...'

జర్నలిస్టుకు వార్తపసిగట్టే సామర్ధ్యం (News nose) ఉండాలేగానీ...సామాన్య వ్యక్తులు సాధించే విజయం, వారి జీవితంలో విషాదం, వారి ఆవేదన...అంశంగా చక్కని మానవాసక్తికర కథనం (human interest story) రూపొందించవచ్చు. ఇలాంటి కథనాలు మనసుకు హత్తుకునేలా ఉండడమేకాకుండా...ప్రజలు పూనుకుని ఒక వ్యక్తికో, సమూహానికో మీలు చేసేలా చేస్తాయి. 'జీ-24 గంటలు' ఛానల్ అలాంటి వార్తలు అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. అందుకే కాబోలు....అలాంటి కథనాలను 'జీ-24 గంటలు' ప్రసారం చేసాక కూడా నిర్మొహమాటంగా TV-9 కూడా కాపీ కొట్టి ఫాలోఅప్ చేస్తుంది. 


నిన్న...'అమ్మ కోసం..' శీర్షికన...'జీ-24 గంటలు' ఛానల్ ప్రసారం చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఆ కోవలోనిదే. ఎనిమిదేళ్ళ కిందట అమ్మ మీద అలిగి కేరళ రైలెక్కి అక్కడ డాన్ బాస్కో వారి సంరక్షణలో పెరిగి...ఇప్పుడు మళ్ళీ తన కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఒక పద్నాలుగు ఏళ్ళ అమ్మాయి స్వప్నపై స్టోరీ అది. జీ-ఛానల్ విలేకరులు, డెస్క్ సోదరులు చాలా మనసుపెట్టి మంచి విజువల్ అఫెక్ట్ తో కథనాన్ని అందించారు. ఒక సమస్యకు పరిష్కారం కోసం టీం అంతా కష్టపడడం కనిపించింది. ఇదీ పాజిటివ్ జర్నలిజం.

ఆ అమ్మాయిని వెంట పెట్టుకుని....ఆమె కుటుంబ సభ్యులను విలేకరులు వెతకడం, ఆ అమ్మాయి ఇచ్చిన ఆనవాళ్ల ఆధారంగా....ఆమె చిన్ననాటి ఫోటోను చూపి...ఆమె తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయడం...మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. తెలుగు మరిచిపోయి మలయాళం, ఇంగ్లిషు మాత్రమే వచ్చిన ఆ అమ్మాయి కోసం ఛానల్ పడిన తపన అభినందనీయం. యాంకర్ ఈశ్వర్ కూడా హృద్యంగా మాట్లాడారు.

ఇలాంటి మానవాసక్తికర  కథనాలు చేతికి వస్తే...అక్కడి అవుట్ పుట్ డెస్క్ చూస్తున్న గోపాల రమేష్, మిగిలిన బృందం పడే తపన, హంగామా నేను ఒకప్పుడు స్వయంగా చూశాను.  ఆ ఆమ్మాయి పేరెంట్స్ దొరికే వరకూ వాళ్ళు నిద్రపోరు. Missionary zeal తో వాళ్ళు పనిచేస్తారు. 

నల్గొండ లో ఇదే ఛానల్ కు రిపోర్టర్ గా ఉన్నప్పుడు హేమ ఇలాంటి ఒక స్టోరీ చేసింది.  ఒకామె తన కూతురుగా చెప్పుకుంటున్న బాలికను నానా హింసలు పెడుతున్నదని, బ్లేడుతో కోస్తున్నదని, రోజూ చిత్రహింసలు పెడుతున్నదని  ఒక టీచర్ హేమకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించి...హేమ ఆ అమ్మాయి దురవస్థ చూసి తల్లిపై అనుమానం వచ్చి కలెక్టర్ విజయానంద్ సహాయంతో 'బాల భవన్' కు తరలించింది. 'నిజంగా ఆమె తల్లి కాదేమో? యేమో ఆమె తల్లేమో? కొద్దిగా కోపం తో పిల్లను కొడుతున్నదని తల్లి నుంచి పిల్లను వేరు చేసానేమో!," అని హేమ ఆ రాత్రంతా నిద్రపోలేదు. కానీ మా అందరి గట్ ఫీలింగ్....ఈ తల్లీ బిడ్డలా మధ్య ఏదో కథ దాగివున్నదని.  

 
ఈ స్టోరీని డెస్క్ లో రమేష్ వాళ్ళు అద్భుతంగా మలిచి...ఎంతో అద్భుతమైన స్టోరీగా చేశారు. అది చూసి...హేమ కెమెరా మెన్ సైదులు ఏడ్చాడు కూడా. పదేపదే ప్రసారమైన ఆ స్టోరీ ని టీ.వీ.లో చూసి ఆమె నిజమైన తల్లి విజయవాడ నుంచి నల్గొండ వచ్చి పాపను తీసుకు పోయింది. కొట్టి, బ్లేడుతో కోసిన ఆమె నిజమైన తల్లి కాదని, చిన్నారిని విజయవాడ నుంచి అపహరించి తెచ్చి ఇంట్లో పనికోసం పెట్టుకున్నారని పోలీసు విచారణలో తేలింది. 


రిపోర్టర్ చొరవతో ఆ తల్లీకూతుళ్ళ కలయిక ...ఒక అపూర్వ ఘట్టం, మనసును చలింపజేసే సన్నివేశం. నిజమైన తల్లి హేమను పట్టుకుని విలపించింది.
ఇలాంటి నాటకీయ సంఘటనలు ఆ కుటుంబానికే కాకుండా...రిపోర్టర్ కు, డెస్క్ లో పనిచేసే వారికి చాలా తృప్తిని ఇస్తాయి. కేవలం ఛానల్ చొరవతో కథ సుఖాంతమైన కేసులు ఎన్నో  ఉన్నాయి. స్వప్న విషయంలో కూడా...జీ-24 gantalu శ్రమ ఫలించి, స్వప్న తన కుటుంబాన్ని కలుసుకోవాలని కోరుకుందాం.
తమ్మీ....గోపాల రమేష్! మీ కృషి ఫలించి....స్వప్న స్వప్నం నెరవేరి...కథ సుఖాంతం అయితే...మీ అందరి ఇంటర్వ్యూ కోసం నేను వస్తాను. ఆల్ ది బెస్ట్.   

Friday, April 16, 2010

ఒక పాము---ఐదు పడగలా?: ఇది నిజమా?


ఈ ఇంటర్నెట్ లో మెయిల్స్ రూపంలో భలే గమ్మత్తైన విషయాలు, ఫోటోలు వస్తుంటాయి. ఈ రోజు ఒక జర్నలిస్టు మిత్రుడు ఐదు పడగల పాము ఫోటో పంపాడు. నేను ఊర్లో పాములను చూస్తూ, భయపడుతూ, విస్మయపడుతూ బతికాను. కానీ, ఇలా ఐదు తలకాయల పామును చూడలేదు, ఇది ఉన్నట్లు విననూ లేదు. ఇది ఫోటోషాప్ లో సృష్టించిందో కూడా తెలియదు.

మా ఇంటి దైవం ఈ నాగరాజు గారే అని పెద్దలు చెబుతారు. అమ్మ నాగదేవుడి అంశ వల్ల పుట్టింది కాబట్టి...నాగేశ్వరి అని పేరు పెట్టినట్లు మా అమ్మమ్మ చెప్పేది. అమ్మమ్మ నాగుల చవితి ఎంతో భక్తిశ్రద్ధలతో చేసేది. ఆ రోజున నువ్వులతో మంచి స్వీటు చేసేది. మా ఇంట్లో పూర్వం ఒక నాగు పాము తిరిగేదని, శేషూ...అని పిలిస్తే..వచ్చి పాలు తాగేదని నాయనమ్మ కూడా చెప్పేది. అది నిజమో కాదో తెలియదు. 


ఇప్పటికీ మా వూళ్ళో ఈ పాములు నాకు అర్థంకాని వ్యవహారమే. మా అమ్మ, నాన్నా హైదరాబాద్ వచ్చి వెళ్ళగానే...'డాక్టర్ గారూ...మీ ఇంట్లో పెద్ద తాచును చూసాం..." అని ఊళ్ళో వాళ్ళు చెబుతారు. నేను అదిరిపడతాను. మా వాళ్లకు మాత్రం అది కనిపించదు. అందుకే...నేను ఇంటికి వెళితే...పాము భయంతో చస్తుంటాను. ఈ నాగమయ్య ఇంటి దేవుడుగా మారడం వల్ల...మా ఇంట్లో పుట్టిన అందరి పేరులో ఒక చోట 'నాగ' అని చేరుస్తారు. నా పేరు...'సీతారామశేష తల్పసాయి' అని పెట్టారు కానీ..ఊరి క్లర్కు కు స్పెల్లింగ్ ప్రాబ్లెం ఉంది...కత్తిరించి పారేసాడు. 


విసుక్కోకండి, ఆటలో అరటిపండులా ఈ సొంత డబ్బా. ఇదిలా వుంటే..నిజంగా మీలో ఎవరైనా...రెండు మూడు తలల పాములైనా చూసారా? చూస్తే....సరదాగా మీ అనుభవం రాయండి.

ఒక ఢిల్లీ జర్నలిస్టు స్పందన...ఆవేదన...ఆహ్వానం

విపరీతమైన పని ఒత్తిడి వల్లనో, లేక మరే ఇతర వ్యక్తిగత కారణాల వల్లనో ఒక ప్రొఫెషన్ పైన, ఆ ప్రొఫెషన్ కు చెందిన వారిపైన ఏవగింపు ధోరణి కలిగి ఉండటం సాధారణంగా చాల మందిలో జరిగే విషయమే. బహుశా అలాంటి ఇబ్బందితో బాధపడుతుండటం వల్లనేమో శ్రీ శివ గారికి జర్నలిస్టు సమాజం పైన అక్కరకు రాని ఆగ్రహం పెల్లుబుకుతు ఉండవచ్చు. ఏది ఏమైతేనేమి...భావప్రకటన విషయంలో జర్నలిస్టు సమాజానికి ఎంత వెసులుబాటు ఉందొ, అంతే సౌకర్యం శ్రీ శివ గారికి కుడా ఉందనే కనీస స్పృహ నాకు కూడా ఉంది కాబట్టి ఆయన భావ ప్రకటన స్వాతంత్రాన్నిమనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను.


ఇక విషయం లోకి వస్తే..ఢిల్లీ ఆంధ్రా భవన్ లో తెలుగు మీడియా ప్రతినిధులు పడుతున్న అగచాట్ల విషయంలో ఈ బ్లాగ్ ఒక వ్యాఖ్య పోస్ట్ చేసింది...ఇందులో శ్రీ శివ గారికి అభ్యంతరకమైన అంశాలు ఏవి ఉన్నాయనే దాని మీద నా చిన్ని మెదడు ఎంత ఆలోచించినా ఏమీ అంతు బట్టడం లేదు...శ్రీ శివ గారికి ఒక విషయం మాత్రం వినమ్ర పూర్వకంగా మనవి చేయదలచుకున్నాను. మనకు నచ్చలేదు కాబట్టి అవతలి వాళ్ళందరూ వెధవాయిలు అనే ప్రమాదకరమైన ఆలోచనా ధోరణి నుంచి మీరు బయటపడండి..మీ వయసెంతో..మీరు ఏ వృత్తిలో ఉన్నారో నాకు తెలియదు...కానీ..ఇలా జర్నలిస్టు సమూహం మీద మీ పదునైన అక్షరాలతో దాడి చేసి, భుజాస్ఫాలనం చేసుకుంటే...అది మీ భుజాలకే నొప్పి కలిగించే విషయం.

మీకు ఎదురైన అనుభవాల వల్లనో, లేక మీరు చూసిన కొన్ని సంఘటనల కారణంగానో ...ఇలా ఒక నిశ్చిత అభిప్రాయానికి రావడం అనేది అప్రజాస్వామికం. ఉదాహరణకి మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అయితే...ఎవరో ఒక అధికారి పాల్పడిన అవినీతికి మొత్తంగా ప్రభుత్వ వ్యవస్థనే కుళ్ళు పట్టిన చందాన చిత్రీకరిస్తే...మీ మనసుకెంత గాయమవుతుంది? ఇదంతా కూడా...మిమ్మల్ని సామజిక స్పృహ దిశా గా నడిపించే ప్రయత్నమే కానీ...ఏదో టార్గెట్ (మీకు లాగా) చేసినట్టు మాత్రం అనుకోకండి...


ఢిల్లీ మీడియా ప్రతినిధులే కాదు..ఆ మాటకొస్తే ఏ మీడియా మాన్ కూడా ఆకాశం నుంచో...లేక మీ గంధర్వ లోకం లో నుంచో ఊడి పడలేదు. స్థానికంగా ఇక్కడ ఇబ్బందులు పడుతున్న మీడియా ప్రతినిధులు ఎలాంటి దురవస్థలో ఉద్యోగం చేస్తున్నారో...కనీస పరిజ్ఞానం లేకుండా శ్రీ శివ గారు చేసిన తొందరపాటు వ్యాఖ్యల నేపధ్యంలో ఆయనకు నేనొక విషయం మనవి చేయదలచుకున్నాను.


మన్ని విమర్శించిన వాళ్ళందరూ మన శత్రువులు కారు అన్న విషయం గమనించుకోవటం అతి చిన్న విషయం అని మీరు రాశారు. తమాషా ఏమిటంటే అదే చిన్ని విషయాన్ని మీరు చాలా చాకచక్యంగా విస్మరించటం...లేదా మరో రకంగా చెప్పాలంటే...మనం చేస్తే లౌక్యం..ఎదుటి వాడు చేస్తే మోసం అనే చందాన మీరు మీ వ్యాఖ్యానాలు చేయటం...

"ఇక్కడ సమస్య ఏమిటి?? పోలీసులకు ఒక సమాచారం వచ్చింది మీడియాను వాడుకుంటూ ఒక పెద్దాయన మీద దాడి జరిగే ఆవకాశం ఉన్నది అని. అటువంటి "Intelligence Input" వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమి చేయాలి? పత్రికా విలేఖరులతో సంప్రదించి తాము తీసుకోబోయే కొత్త "Security Measures" అమలు చేయటానికి వారి అనుమతి తీసుకోవాలా? లేదా ఇలా చేద్దామని అనుకుంటున్నాము అని వారికి చెప్పెయాలా? అలా చేస్తే, ఈ విషయాలు అన్ని చేరకూడని చోటుకి చేరవని నమ్మకం ఏమిటి" అని శివగారు అన్నారు. ఇది చాలా మంచి ప్రశ్న ఇది..ప్రభుత్వం జవాబుదారీ తనంతో వ్యవహరించాల్సిన ఒక వ్యవస్థ...నిజంగా ముఖ్యమంత్రి కి ప్రాణ హాని ఉంది...అది కూడా..మీడియా ముసుగులో ఉన్న మావో ఇష్టుల నుంచి అని నిఘా విభాగానికి సమాచారం అంది ఉంటె..అది మీడియా కి చెప్పటానికి వారికి ఉన్న అభ్యంతరమేమిటి? అలా మీడియా వారు అడగకూడదని ఏమైనా రూల్ బుక్ ఉందా? లేదా అలా అడిగిన నేరానికి మీడియా వాళ్ళను అర్రెస్ట్ చేయవచ్చుననే ఒక కొత్త జీ వో ఏమైనా శ్రీ శివ గారి చేత ప్రభుత్వం డ్రాఫ్ట్ చేయించింద?..ఒక వేళ అలా చేయించి ఉంటె...దాని గురించి తెలుసుకునే ప్రాధమిక హక్కు ఒక జర్నలిస్టు కె  కాదు శ్రీ శివ గారి లాంటి సాధారణ `అసామాన్యుల' కు కూడా ఉంటుందనే కనీస స్పృహ మాకు ..అంటే..ఢిల్లీ లో పని చేసే నిబద్ధులైన కొందరు జర్నలిష్టులకు ఉంది..


శ్రీ శివ గారితో వచ్చిన చిక్కల్లా ఏమిటంటే...తానూ టీ వీ లలో చూసిన కొన్ని విపరీత పోకడల్ని..మీడియా మొత్తానికి అన్వయించే ప్రయత్నం చేయటం..ఇదంతా కూడా పరిసరాల విజ్ఞానం లేకపోవటం వల్ల వచ్చే మరొక చిన్నిపాటి ఇబ్బంది. కాస్తంత మనసు చేసుకుంటే...దీన్ని అధిగమించవచ్చు. మీడియా ప్రతినిధులలో ఉన్న పాజిటివ్ కోణాన్ని చూసే ఒక పాజిటివ్ ప్రయత్నం చేయటం మంచిది. అలాంటి ప్రయత్నం చేయటానికి శ్రీ శివ గారికి ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే...మేము ఆయన్ను ఢిల్లీ కి రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే..ఇదంతా కూడా పరిసరాల విజ్ఞానం పెంచుకునే క్రమం లో ఒక భాగమే...శ్రీ శివ గారూ...మీ బదులు కోసం ఎదురు చూస్తున్నాం...
----------------------------------------------------------
నోట్: బ్లాగ్ నడుపుతున్న రాము గారికి ఒక విజ్ఞప్తి..శ్రీ శివ గారు సార్వజనీకరించి చేసిన పరుష పదజాలానికి అసలు రెస్పాన్స్ ఇవ్వ కూడదనే అనుకున్నాను కానీ...శ్రీ శివ గారి విపరీత వ్యాఖ్యల వల్ల మనసు కష్టపడి మరీ ఈ బదులు రాస్తున్నాను.. దీన్ని వ్యాఖ్యలలో పడేయకుండా...కాస్తంత చదువరుల కంట పడే విధంగా ప్రచురించ ప్రార్ధన.....

Thursday, April 15, 2010

ఈ రాజకీయ మీడియాలో..విలువలు ఒక మిథ్య?

'సాక్షి' (పేపర్, ఛానల్)---కాంగ్రెస్ ఆత్మ (సోల్), గళం (మౌత్ పీసు)
ఎన్-టీవీ (ఛానల్)---కాంగ్రెస్ ఆత్మ, గళం
టీ.వీ.-5 (ఛానల్)-- కాంగ్రెస్ ఆత్మ 

వార్త (పేపర్)---కాంగ్రెస్ ఆత్మ, గళం 
ఆంధ్రభూమి (పేపర్)---కాంగ్రెస్ ఆత్మ, గళం
ఆంధ్రప్రభ (పేపర్)---కాంగ్రెస్ ఆత్మ
------------------------------------------------------------
'ఈనాడు' (పేపర్, ఛానల్)---తెలుగుదేశం ఆత్మ, గళం 
'ఆంధ్రజ్యోతి' (పేపర్, ఛానల్)---తెలుగుదేశం ఆత్మ
స్టూడియో-ఎన్ (ఛానల్)--తెలుగుదేశం ఆత్మ, గళం

------------------------------------------------------------
రాజ్ (ఛానల్)---తెలంగాణా రాష్ట్ర సమితి ఆత్మ, గళం
జీ-24 gantalu (ఛానల్)---తెలంగాణా ఆత్మ
హెచ్.ఎం.టీ.వీ. (ఛానల్)---తెలంగాణా ఆత్మ

-----------------------------------------------------------
ప్రజాశక్తి (పేపర్)---సీ.పీ.ఎం.ఆత్మ, గళం
విశాలాంధ్ర (పేపర్)---సీ.పీ.ఐ. ఆత్మ, గళం

------------------------------------------------------------------------------------------------
Operational definitions:

ఆత్మ: సదరు పార్టీ పై గుండెలో భక్తి కలిగి ఉండడం. ఆ పార్టీ లేదా దాని అధినేత అర్జెంటుగా అధికారంలోకి రావాలని కోరిక ఉన్నా...మరీ అంతగా బైటపడకుండా...ఒక రకంగా వ్యవహరించడం. కథనాలు తమ అభిమతానికి అనుగుణంగా ఉండీ ఉండనట్లు చూసుకోవడం. యజమాన్లు వారంలో మూడున్నర రోజులు సదరు పార్టీకి బాకా ఊది, మరొక మూడున్నర రోజులు తమది నిష్పాక్షిక మీడియా అని పోజు కొట్టడం.


గళం: సదరు పార్టీ/ నేత మాటలో మాటై, గుండెలో గుండె అయి, ఆత్మలో ఆత్మ అయి...నిస్సిగ్గుగా, నిర్మొహమాటంగా బాకా ఊదడం. వీలయితే...పార్టీ అధినేత కు మీడియా తెలివిని రంగరించి సలహాలు ఇవ్వడం. వైరి పార్టీల వారిని, తమ పార్టీ నేతకు పడని వారిని ఇరుకునపెట్ట కథనాలు అల్లి పారెయ్యడం.

-------------------------------------------------------------------------------------------------
ఈ లిస్టులో మేము కొన్ని ఛానెల్స్ ను ఇప్పుడే చేర్చలేకపోయాము. గ్రాహకశక్తి లోపం వల్లగానీ, పరిశీలనాశక్తి కొరవడడం వల్లగానీ అది జరిగి ఉండవచ్చు. మా అజ్ఞానాన్ని మీరు ఖండిచవచ్చు లేదా ఈ జాబితాలో మిస్ అయిన వాటిని ప్రస్తావిస్తూ ఎందువల్ల మీరు అలా అనుకుంటున్నారో తెలియజేయవచ్చు. మీడియా ముసుగు వేసుకుని, రాజకీయ అజెండాతో జర్నలిజాన్ని పలచన చేస్తున్నవారి వల్ల మనకీ సమస్య. దాని బదులు...కమ్యునిస్టు పత్రికల్లా తమ  పేపర్స్/ఛానెల్స్ ను ఈ యుగపురుషులు అధికారికంగా తమ రాజకీయ పార్టీల మౌత్ పీసులుగా ప్రకటిస్తే ఈ సమస్యే ఉండదు. రీడర్స్/వ్యూయర్స్ కు ఒక స్పష్టత ఉంటుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు పగ్గాలు చేపట్టాక 'స్టూడియో-ఎన్' ఈనాడును మించిన ఫక్తు 'రాజకీయ జర్నలిజం' ఆరంభించింది. దీని ప్రధాన అజెండా...అర్జెంటుగా చిరంజీవిని బద్నాం చేయడం. ఉదాహరణకు--నిన్న రాత్రి "దుకాణం బంద్" అన్న శీర్షికన 'ఫోకస్' అనే అతి జుగుప్సాకరమైన కార్యక్రమం ప్రసారం చేశారు. అలాగే...ఒక పక్క జగన్ 'ఆత్మీయ యాత్ర' ను 'సాక్షి,' 'ఎన్.టీ.వీ.' అనుక్షణం చూపుతుంటే...'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' తక్కువ చేసి చూపుతున్నాయి. యువ కాంగ్రెస్ ఎం.పీ. టూరుకు సంబంధించి నెగటివ్ షేడ్ ఉన్న కథనాలు మాత్రమే వీటిలో వస్తున్నాయన్న ఆరోపణ ఉంది.  


డబ్బుకు గడ్డి కరిచే ఛానెల్స్/ పేపర్స్ జాబితా తయారవుతున్నది. పైన  జాబితాలో లేని పేపర్స్/ ఛానెల్స్ పత్తిత్తులని కాదని గమనించగలరు. మరి నంబర్ వన్ ఛానల్ TV-9 గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా తెలియజెయ్యండి.  ఇప్పటికే ఒకటీ అర ఎస్.ఈ.జెడ్./ విద్యుత్ ప్రాజెక్ట్ వచ్చిన వాళ్ళు ఒకరకంగా, వస్తుందని ఆశ పడే వాళ్ళు మరొకరకంగా ఆపరేట్ చేస్తున్నారిక్కడ. 

ఇప్పుడు రోశయ్య గారు పిలిచి....మీకో ఎస్.ఈ.జడ్. ఇస్తానన్నా, భారీ లాభం కలిగేలా చూస్తానన్నా ఈ ఛానెల్స్ రెచ్చిపోయి కార్యకర్తలా పనిచేస్తాయి. విలేకరులను కూడా యాక్టివిస్ట్ లుగా మార్చి వాడుకుంటాయి. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు....పత్రికా స్వేచ్ఛ, విలువలు, నీతీ నిజాయితీ ల గురించి మాట్లాడుకోవడం నిజంగానే గొంగళిలో లంచ్ చేస్తూ వెంట్రుక వచ్చిందని భార్య మీద ఎగిరినట్లే. అయినా....మనం పట్టు వదల కూడదు. సత్యమే వజయతే.

రోశయ్య గారికీ ఒక ఛానల్?

ఇప్పుడే అందిన వార్త...ముఖ్యమంత్రి రోశయ్య గారి అనుయాయులు (ముఖ్యంగా వారి కుమారరత్నం) కూడా మీడియా మీద ఒక కన్నేసారని ఒక మిత్రుడు చెప్పాడు. దీన్ని అధికారికంగా దృవీకరించుకోవాల్సి ఉంది. ఇప్పటికే...తప్పుడు సలహాలు విని ఛానల్ పెట్టి...చేతులు కాల్చుకుని...ఉజ్జోగులకు సకాలంలో జీతాలైనా ఇవ్వలేకపోతున్న i-news లో వాటా కోరితే ఎలా ఉంటుందా! అని ఆ వర్గం అనుకుంటూ ఉన్నదని సమాచారం. ఇది త్వరలో తేలుతుంది, అప్పటిదాకా...ఈ అంశాన్ని మీరు ఎవరితో అనకండి. ఇది మనలో మన మాట. 

Wednesday, April 14, 2010

N-TV లో 'ఆపరేషన్ కళావర్ కింగ్': చాన్నాళ్ళకు మంచి స్టోరీ

N-TVలో ఈ మధ్యన అప్పుడప్పుడు కొన్ని మంచి స్టోరీలు తళుక్కున మెరుపులు మెరిపిస్తున్నాయి. మొన్నామధ్య...గుట్టు చప్పుడుకాకుండా...ఫ్లాట్స్ లో జరుగుతున్న సెక్స్ రాకెట్ వైనంపై 'పప్పీ క్లబ్' పేరిట ఒక మంచి పరిశోధన జరిపారు. అది  బాగానే పేలింది. ఈ రోజు క్లబ్బులలో పేకాడి కొంపలు గుల్లచేసుకుంటున్న వారిపై 'ఆపరేషన్ కళావర్ కింగ్' పేరుతో ఒక ధైర్యమైన కథనం ప్రసారం చేశారు. క్లబ్బు రూమ్స్ లో జరిగే కార్యక్రమాలను వెలుగులోకి తెచ్చారు.

అంతకు ముందు ఎప్పుడో...పబ్బులపై ఇదే ఛానల్ లో వరసనగా కొన్ని కథనాలు వస్తే...ఒక టాక్ బయలుదేరింది. 'ఛానల్ హెడ్ కుటుంబసభ్యులలో ఒక యువతి దోస్తులతో పబ్బుల వెంట పిచ్చపిచ్చగా తిరగడం మొదలెట్టింది. అందుకే...పబ్బులపై ఛానల్ కక్ష గట్టింది,' అని ప్రచారం జరిగింది. లోకులు పలు కాకులు కదా!

సరే...ఇవ్వాల్టి  'ఆపరేషన్ కళావర్ కింగ్' మంచి అంశాలు స్పృశించింది. లోపల జరిగే తంతుపై కథనం బాగా సాగింది. ఇది బహుశా స్టింగ్ ఆపరేషన్ అనుకుంటా. చివరకు నిజాం క్లబ్ గురించి కూడా చెప్పారు. దీని వెనుక వున్న  రిపోర్టర్లు, బూతు లేకపోయినా...ప్రసారం చేయనిచ్చిన అక్కడి పెద్దలు అభినందనార్హులు. 
ఈ హైదరాబాద్ క్లబ్బులు...చాలా మంది కొంపలు కొల్లేరు చేసాయి, చేస్తున్నాయి. జిల్లాలలో బాగా బలిసిన మహారాజులు ఇక్కడకు వారాంతం లో వచ్చి పేకలో లక్షలు తగలేసో, కాజేసో ఆదివారం రాత్రికి లేదా సోమవారం ఉదయం ఇళ్ళకు చేరతారు. నాకు తెలిసిన ఒక లాయరు...నల్గొండ నుంచి వచ్చి...పేకల మీద పేక మేడలు  కాకుండా...నిజమైన మేడలు కట్టాడు. "సారు...వారానికి రెండు లక్షలైనా కొట్టుకొస్తారు," ఆయన భాజాభజన్త్రీ గాళ్ళు అక్కడ ప్రచారం చేసేవారు. 

గుర్రపుపందాలు, పేకాట, బెట్టింగు, మందు, సానికొంపలు--వీటి చుట్టూ తమ జీవితాలను తిప్పుతూ నాశనమైపోయే బ్యాచులు చాలానే ఉన్నాయి. మీడియా ఇలాంటి స్టోరీలు ఇస్తే....వ్యక్తులకు, సమాజానికి ఎంతో మంచిది. సానియా పెళ్లి, శోభనం వివరాల కన్నా ఆసక్తిగా జనాలు ఇలాంటి స్టోరీలు చూస్తారని గమనించాలి. 
టీ.వీ.బాబులూ...ఈ ఐ.పీ.ఎల్. క్రికెట్ పుణ్యాన రాష్ట్రంలో చాలాచోట్ల బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. వీటిపై కూడా ఒక కన్ను వెయ్యండి స్వామీ. పిచ్చి జనం...బెట్టింగ్ యావలో పడి ఇళ్ళలో పెళ్ళాం, బిడ్డలను పట్టించుకోవడం లేదట.

"మీడియా వారు గంధర్వలోకం నుంచి రాలేదు"

మీడియా ధోరణులు, టీ.వీ.లలో పిచ్చి ప్రోగ్రామ్స్, తరిగిపోతున్న విలువల గురించి తరచూ చర్చించే బ్లాగర్స్ లో శివ గారు ఒకరు. ఏ.పీ. భవన్ దగ్గర విలేకరులు, కెమరా మెన్ పడుతున్న బాధల గురించి నేను మొన్న పోస్ట్ చేసిన దానికి స్పందనగా ఆయన ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. అది నాకు సమాచారం ఇచ్చిన ఒక ఢిల్లీ విలేకరికి కోపం కలిగించింది. 'ఈ శివ గారికి విలేకరులు అంటే ఎందుకు అంత మంట?" అని నా సోర్సు ప్రశ్న వేసారని నేను కామెంట్స్ కాలంలో రాసాను. దానికి స్పందనగా శివ గారు పంపిన కామెంట్ ను ఇక్కడ ఇస్తున్నాను---రాము 
---------------------------------------------------------------------
"....ఈ శివ గారికి విలేకరులంటే ఎందుకు అంత మంట?," అని ఆ పెద్దాయన నన్ను అడిగారు..."
మొట్టమొదట మీడియాలో ఉన్నవారు తామేదో గంధర్వలోకం నుంచి దిగివచ్చామన్న భ్రమలోనుంచి బయటపడాలి. ఒక చర్చలో తమకు ప్రతికూలమైన పాయింటు చెప్పిన వారిని "ఈ శివ" (This Siva?) అనే అలవాటు మానుకోవాలి.

ఇక విషయానికి వస్తే, నాకేమీ విలేఖరులమీద కక్ష లేదు కోపం లేదు. కాని విలేఖరులమని, మీడియా పేరుతొ నానా రభస చేస్తూ Press Freedom ను హాస్యాస్పదం చేస్తున్న వారిని చూస్తె "చీకాకు". ఇలాటి ఓవర్ ఏక్షన్ వల్ల Press Freedom ని మనం కోల్పోయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఇక్కడే (కామెంట్స్ కాలంలో) చూడండి దాదాపు అందరూ "విలేకరుల తిక్క కుదిరింది" అన్నట్లుగానే వ్యాఖ్యలు చేసారు.


ఇంతకు ముందు అనేక సార్లు నేను వ్యాఖ్యానించినట్టు, మీడియా మీద ప్రజలలో ప్రస్తుతం ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని దన్నుగా తీసుకుని, పత్రికా స్వాతంత్రం మీద ఆంక్షలు విధిస్తే ఏమి జరుగుతుంది. ప్రజలు వ్యతిరేకిస్తారా?? మన్ని విమర్శించిన వాళ్ళందరూ మన శత్రువులు కారు అన్న విషయం గమనించుకోవటం అతి చిన్న విషయం. కొంత ఆత్మవిమర్శ చేసుకుంటే, మీడియా అంటే సామాన్య జనానికి, ముఖ్యంగా ఈ న్యూస్ చానెళ్ళు వచ్చాక, ఎందుకు అంత "కోపమో" తెలుస్తుంది.

మీరు అన్న మరో విషయం ".. సమస్యను సమస్యగా తీసుకోకుండా విలేకరుల తిక్క కుదిరింది అన్నట్లు మాట్లాడితే ఎలా సార్?...."

ఇక్కడ సమస్య ఏమిటి?? పోలీసులకు ఒక సమాచారం వచ్చింది మీడియాను వాడుకుంటూ ఒక పెద్దాయన మీద దాడి జరిగే ఆవకాశం ఉన్నది అని. అటువంటి "Intelligence Input" వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమి చేయాలి? పత్రికా విలేఖరులతో సంప్రదించి తాము తీసుకోబోయే కొత్త "Security Measures" అమలు చేయటానికి వారి అనుమతి తీసుకోవాలా? లేదా ఇలా చేద్దామని అనుకుంటున్నాము అని వారికి చెప్పెయాలా? అలా చేస్తే, ఈ విషయాలు అన్ని చేరకూడని చోటుకి చేరవని నమ్మకం ఏమిటి.

మీ వ్యాఖ్య మరొకటి, "..........నిజంగా విలేకరులలో నక్సల్స్ ఉంటె...చట్టం ప్రకారం చర్య తీసుకోవాలి గానీ......"

ఎలా? ఎవరు ఏమిటో ఎలా తెలుస్తుంది. సామాన్య ప్రజలం రోడ్డు మీద వెడుతుంటే, ఒక ప్రముఖుని కారు ఆ దారిన వెళ్ళాలంటే, మమ్మల్ని అందరినీ ఆ కారు వెళ్ళేదాకా నిలబెట్టేయటం లేదా? అక్కడ కూడా ఇదేమి పని మేము సహకరించం మేమేమన్నా టెర్రరిస్టులమా? కావాలంటే దర్యాప్తు చేసి అలా ఉన్నవారిని నిలబెట్టండి అని ప్రజలు అంటే ఏమవుతుంది? అరాచకమే కదా. ఇప్పుడు దాదాపు అన్ని కార్యాలయాల్లోనూ మెటల్ డెటెక్టర్లు, బాగేజి స్కానర్లు ఏర్పాటు చేశారు, వారి వారి ఉద్యోగులను కూడ తనిఖీ చేసే పంపుతున్నారు, ఇదంతా మాకు "అవమానం", మమ్మల్నే శంకిస్తున్నారా మేము సహకరించము అంటే?
ఇక్కడ కూడా పోలీసులకు వచ్చిన సమాచారం ప్రకారం ఎవరిని ఆపాలి? దర్యాప్తు జరిపి ఆపాలి, ఈలోగా?? కాబట్టి సెక్యూరిటీ ఏర్పాట్లను తప్పనిసరిగా ఎవరైనా సరే పాటించాలి, మనకు బాధ, అసౌకర్యం కలిగినా సరే.

ఒకవేళ పత్రికా విలేఖరుల కళ్ళ పడకుండా తమ అకృత్యాలను కొనసాగించుకోవటానికి ఈ సెక్యూరిటీ ఏర్పాట్లను వాడుకుంటూ ఉంటే, పూర్తి ఆధారాలతో ఒక మంచి రిపోర్టు వ్రాస్తే/చూపిస్తే అద్భుతంగా ఉంటుంది, ప్రజలకు తెలియ చేసిన వాళ్ళు అవుతారు, ప్రజలు హర్షిస్తారు. వ్యాఖ్యలలో ఒకరు పైవారికి చెబుతూ ఉన్నట్టుగా వ్రాసారు. మీడియాకు తెలిసినప్పుడు పైవారికి చెప్పటం ఎందుకు? పేపర్లో ప్రచురించ వచ్చు కదా లేదా టి వి లో చూపించ వచ్చుకదా. ఈ నాన్చుడు దేనికి.

ద్వంద్వ వైఖరి ఎప్పుడూ ప్రమాదమే. పోలీసులకు తెలిసిన సెక్యూరిటీ విషయం దర్యాప్తు చేసి చర్య తీసుకోవాలి మరి అదే విధంగా పత్రికా విలేఖరులకు ఎ పి భవన్లో జరిగే అకృత్యాల గురించి వ్రాసే బాధ్యత లేదా, ఇలా తమను బయటకు పంపగానే గొణుక్కునే బదులు. ఏ విషయానికి అయినా పలు కోణాలు ఉంటాయి
.

వామ్మో...పెళ్లయినా...మీకెంత ఎనర్జీ?: TV-1 యాంకర్

దాని పేరు TV-1 ఛానల్. 'సంస్కృతి' పేరిట రవిప్రకాష్ పెట్టిన ఛానల్. 
రక్తిలో వచ్చినట్లు భక్తిలో డబ్బులేదన్న తత్వం గ్రహించి ఆయన 'సంస్కృతి'ని మూసేసి...TV-1 గా అవతారం మార్చారు. 
'సాక్షి ఛానల్' ని ఇంత ఎత్తుకు తీసుకువచ్చిన ఒక మిత్రుడికి ఈ ఛానల్ బాధ్యత ఇచ్చి...సృజనాత్మకతతో దున్నుకో...నీ ఇష్టం అన్నాడు. ఈ చానెల్ సంక్షిప్త చరిత్ర ఇది. ఇక ఇప్పుడు అసలు కథ.
అది మంగళవారం రాత్రి. 
ఆ ప్రోగ్రాం పేరు: రూప్ తేరా మస్తానా...
చదివితే, గిదివితే ఇంటర్ చదవాల్సిన ఒక అమ్మాయి (పేరు అర్చన అనుకుంటా) తెరమీదికి వచ్చింది. 
ప్రముఖుల ఫోటో చూపీచూపనట్లు చూపి ఫోన్ చేసిన కాలర్స్ కు కొన్ని క్లూస్ ఇచ్చి ఫోటోలో దాక్కున్న వ్యక్తిని కనుక్కుంటే బహుమానం ప్రకటించే ప్రోగ్రాం ఇది. రాత్రి ఒకామె తో ఈ యాంకర్ అర్చన చేసిన సంభాషణ ఇది. ఉరకలు వేసే ఉత్సాహంతో అర్చన నిజానికి నవ్వుతూ...ఆకట్టుకుంటుంది. తెలుగు మాటలను పంపర పనసను తరిగినట్లు తరిగి...ఇంగ్లిష్  తో తాలింపు వేసి జివ్వుమనిపించే చిలిపి మాటలు, ముఖ కవలికళతో అర్చన కమ్మగా వడ్డిస్తుంది. 

యాంకర్: హలో..హలో...ఎవరు మాష్లాడుతున్నారు?
కాలర్: నళిని...
యాంకర్: ఆ..ఏమిటి...నలిని?

కాలర్: అవును...నళిని..(హ  హ హా...ఒకటే నవ్వులు)
యాంకర్: హాయ్...నళిని ...చెప్పండి..
కాలర్: హ..హ.హ..(నవ్వులు)

యాంకర్: వావ్..నళిని గారు మీరు స్టూడెన్టా?
కాలర్: కాదు..
యాంకర్: కాదా? వోవ్...కాదా? మరి మీలో ఎంత ఎనర్జీ వుంది!
కాలర్: హౌజ్ వైఫ్
యాంకర్: వావ్...మీరు హౌజ్ వైఫ్ ఆ....హో...
కాలర్: హ.హ.హా..
యాంకర్: ఓహో..న్యూలీ మారీడా? కొత్తగా పెల్లయ్యిందా?
కాలర్: హ..హ..లేదు బేటా..పెల్లీడుకు వచ్చిన నీలాంటి కూతురు వుంది.

యాంకర్: ఓ...గాడ్...మీకు పెళ్ళయ్యిందా? అసలేంటి? మీలో ఎనర్జీ లెవల్స్? ఎంత బాగున్నాయి?

..........ఇలా సరసంగా, రసమయంగా, ఉల్లాసంగా సాగుతుంది సంభాషణ. ఏదో..జనాలను ఉత్సాహపరిచే మాటలు మాట్లాడవచ్చు గానీ...వివాహిత మహిళలలో ఎనర్జీ ఉండదని, స్టూడెంట్స్, కొత్తగా పెళ్ళైన వారికి మాత్రమే ఎనర్జీ ఉంటుందని...ఈ సిటీ పాపాయ్ ఇంత చిన్న వయస్సులోనే...ఒక నిర్ధారణకు వచ్చి కూసేస్తుంది. ఇది విని నమ్మేసే జనం మన దగ్గర లేకపోలేదు. అసలీ ఎనెర్జీ, సినర్జీ ఏమిటో? 

Archanaa, చిట్టి తల్లీ, నాకు ఎందుకో నిన్ను చూస్తే బాధేస్తోందమ్మా. నవ్వుతూ పులుల ప్రపంచంలో ఉన్నావ్. ఈ బుల్లితెర మాయాజాలంలో పడి చదువు చెడగొట్టుకోకు. కాస్త పద్దతిగా ఒకటి రెండు షోలు చేసుకుని, పుస్తకాలు చదువుకుని, జీవితంలో పైకెదుగు తల్లీ. నీ ఎనర్జీ లెవెల్స్ చూస్తే అర్థమవుతున్నది ఏమిటంటే...నువ్వు చదువు మీద ఫోకస్ చేస్తే...ఎంతో ఎత్తుకు ఎదిగి పోతావని. All the best.

Tuesday, April 13, 2010

మితిమీరిన ప్రచారంతో సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న జగన్

పత్రికల యజమానులకు ప్రచార కండూతి ఉండే అవకాశం పుష్కలంగా ఉందని, వారు ఆ దురద తీర్చుకునేందుకు ప్రెస్ ను వాడుకుంటారని మొదటి ప్రెస్ కమిషన్ 1952 లోనే ఊహించింది. పత్రికల యజమానులు...తమ వార్తలు, ఫోటోలు అచ్చేసుకోవడం అభిలషణీయం కాదని అది సూచించింది. 'సాక్షి' పేపర్లో, ఛానల్ లో ఆ గ్రూపు అధిపతి, కాంగ్రెస్ ఎం.పీ.జగన్మోహన్ రెడ్డి గురించి గత కొన్ని రోజులుగా భరించశక్యం కానివిధంగా ఊదర కొట్టడం చూసి ప్రెస్ కమిషన్ సిఫార్సు గుర్తుకు వచ్చింది. 

'ఈనాడు' కు దీటుగా వస్తున్నమంటూ దూసుకు వచ్చిన 'సాక్షి' ...నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ దుర్మరణం తర్వాత గతి తప్పి వీక్షకులకు, రీడర్లకు పరమ చీకాకు కలిగిస్తున్నది. ఆంధ్రుల అభిమాన నటుడు రామారావుకు 'ఈనాడు' పిచ్చపిచ్చగా కవరేజ్ ఇస్తే జనం ఇరగబడి చదివారు. ఇప్పట్లా కాకుండా...అప్పట్లో...ఆ పత్రికే మహా వృక్షం. పైగా..రామారావుకు ఉన్న కరిష్మా అలాంటిది. 

ఇప్పుడు కూడా అదే ఫిలాసఫీ ఆధారంగా 'సాక్షి' పోతున్నది. ఎంత పార్టీ మీడియా అయినా మరీ ఇంత దారుణమా? ఇరవై నాలుగు గంటలూ జగన్ ను చూపించి....బాకా కొడితే..అలనాటి సూత్రం పని చెయ్యకపోగా వికటించే ప్రమాదం ఉంది. 'సాక్షి' ఛానెల్ ఇస్తున్న నాసిరకం, మొరటు కవరేజ్ వల్ల...పాపం...ఈ యువనేతకు నష్టం జరుగుతున్నది. ఇది ఆయన గమనించే పరిస్థితిలో లేదు. కెమెరా తిమ్మిరి, అక్షరాల కిక్కు అలాంటిది. "తన పర్యటన మొదలైన నాటి నుంచి రికార్డు అయిన టీ.ఆర్.పీ.రేటింగ్ చూసినా...జగన్ కు వాస్తవం తెలుస్తుంది," అని ఒక విశ్లేషకుడు అన్నారు.


మీడియాను తెలివిగా వాడుకోవడం ద్వారా...జనంలో సానుకూల అభిప్రాయం సృష్టించుకోవడం ఒక కళ. ఆ విద్య తెలియకపోతే....అది  భస్మాసుర హస్తం అవుతుందని చాలా చోట్ల రుజువయ్యింది. 'సాక్షి' లో ఒక సీనియర్ మిత్రుడు అన్నట్లు...రాజీవ్ గాంధీ...మీడియా మిస్ మ్యానేజ్మెంట్ (దూరదర్శన్ ను భజన మండలి గా మార్చుకోవడం) వల్లనే అప్పటి ఎన్నికలలో బొక్కబోర్లా పడ్డారు.

వార్తలు జాగ్రత్తగా ప్లాంట్ చేసే మీడియా ప్రొఫెషనల్స్ లేకపోవడం 'సాక్షి'కి ప్రధాన లోపం. ఉన్న ఛానెల్స్ లో రెండో మూడో స్థానంలో ఉన్న వాళ్ళను...లాబీ చేయగలిగే వారిని...ఒక కులపోళ్ళను ఎక్కువ డబ్బు ఇచ్చి వాళ్ళు నియమించుకున్నారు. వాళ్ళు మీడియా ప్రాథమిక సూత్రాలు తెలియక....బండ కొట్టుడు కొడుతున్నారు. 

లైవ్ వ్యాన్లతో...జగన్ ను ఇంద్రుడు చంద్రుడు అని పొగడడం...పాటలు వినిపించడం...రిపోర్టర్ సార్లు కార్యకర్తల్లా...'అయన పర్యటన బ్రహ్మాండంగా సాగుతోంది' అని చెప్పడం! ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా ఇదే సీను, రొడ్డ కొట్టుడు. ఇది జనంలో వెగటు కలిగించే వ్యవహారం. ఇది తాత్కాలికగా భజనపరుల ఆహో..ఓహో...వల్ల జగన్ కు సంతోషం కలిగించినా...దీర్ఘకాలంలో కచ్చితంగా నష్టం కలిగిస్తుంది. 

నిజానికి మీడియాను దరి చేరనీయకుండా ఉంటేనే జగన్ కు మేలు. "ఇది ఆత్మీయ కలయిక...కాబట్టి...మీడియా అవసరం లేదు.." అని ప్రకటించి...చిత్తశుద్ధితో కలవాలనుకున్న వారిని కలిస్తే...ఎన్నో రెట్లు ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. 'సాక్షి' లో కూడా వార్త వేసుకోకుండా వుంటే...ఇంకా మంచిది. దానికి భిన్నంగా...'సాక్షి' బృందం చేస్తున్న హడావుడి జగన్ పుట్టి ముంచే పనే. అతనిపై లోపల కోపంతో...తెలివిగా సలహాదార్లు చేయిస్తున్న...సెల్ఫ్ గోల్.