Friday, January 21, 2011

ఒకనాటి నా ప్రాణమిత్రుడికి....ఒక ప్రేమపూర్వక లేఖ....

ఒకనాటి ప్రియ నేస్తమా....

ఇప్పుడే ఒక మిత్రుడు కలిసి విషయం చెప్పాడు. చాలా బాధవేసింది. నీ ఉద్యోగం పోయిందని వీడికి ఎవరో మెసేజ్ ఇచ్చారట. "ఉద్యోగాల నుంచి తీసేయడం" అనే మాటే నాకు పరమ రోత, ఆగ్రహం కలిగిస్తాయి. కొన్ని రోజులుగా ఈ 'ఉద్యోగాలు తీసేయడానికి' సంబంధించి వార్తలు వింటూ నేను ఎంత తల్లడిల్లుతున్నానో ఎవరికీ తెలియదు. అత్యంత అమానుషంగా మీడియా హౌసులలో జరుగుతున్న ఈ అఘాయిత్యాన్ని ఎవ్వడూ ఆపలేకపోతున్నాడు. అది వేరే విషయం.

నీ గురించి నాకు ఈ సమాచారం ఇస్తూనే....ఈ మిత్రుడు వృత్తిలో తనను నువ్వు ఇబ్బంది పెట్టిన వైనాన్ని చెప్పాడు--రెండో సారి. గతంలో కూడా పూసగుచ్చినట్లు చెప్పాడనుకో. నీ ఉద్యోగానికి సంబంధించిన ఈ సమాచారం నిజమా కాదా అని మరొక మిత్రుడికి ఆందోళనతో ఫోన్ చేశాను. అతను కన్ఫాం చేశాడు. చాలా మందికి 'రక్త కన్నీరు' తెప్పించేవాడు మీ వాడు....అని అన్నాడు. 'మీ వాడు' అన్న పదం ఎద్దేవాగా తోచింది. అయినా...నీ మీద నాకింకా చావని ప్రేమతో...భారమైన హృదయంతో ఈ లేఖ రాస్తున్నాను.  నువ్వు ఎవరో రీడర్స్ కు చెప్పాల్సిన కనీస బాధ్యత నాకు ఉన్నా...ఆ పని చేయడంలేదు. ఎందుకంటే...హృదయవేదనతో రాసే ఈ లేఖ వల్ల నిన్ను ఎవరూ విలన్ గా ఊహించకూడదు. నా మిత్రులు ఎవరూ విలన్లు కాకూడదనే నేను ఎప్పుడూ కోరుకుంటాను.
అటు ఇటుగా వృత్తిలోకి ఒకేసారి వచ్చాం మనం. 'ఈనాడు' జనరల్ డెస్క్ లో శర్మ గాడి చేతిలో మేము నరకయాతన పడుతున్నప్పుడు నువ్వు మంచి ఆత్మీయ పరిమళాన్ని వెదజల్లుతూ నా జీవితంలోకి ప్రవేశించావు. నీ స్ఫురద్రూపం, అబ్బురపరిచే నీ విజ్ఞానం, భాషా సామర్ధ్యం, సమయానికి తగినట్లు వేసే జోకులు...ఇవన్నీ నాకు ఎంతో నచ్చాయి. కులం, ప్రాంతంతో మొదలు పెడితే...ఏ అంశం తీసుకున్నా మనిద్దరివి ఏ మాత్రం కలవని అభిప్రాయాలు. అయినా...నేతో మాట్లాడితే సంతోషంగా వుంటుంది....సారీ...వుండేది. నువ్వో "ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ వి" అని స్పష్టంగా తెలిసినా....నేను అభిమానించే నా బాచ్మేట్స్ కు ఇబ్బంది కలిగితే ఎంత బాధపడతానో నీ విషయంలోనూ అంతే బాధనిపిస్తుంది...జర్నలిజం స్కూల్లో నువ్వు నాకు జూనియర్ వి అయినా.

  జర్నలిజం ఆరంభం రోజుల్లో 'ఈనాడు'లో ఒక నెలాఖరు రోజున జీతం తీసుకోవడానికి పోతున్నప్పుడు...ఏదో అంశం గురించి మాట్లాడుతూ మిడిమిడి జ్ఞానం తో 'సావర్జినిటీ' అని నేను అన్నప్పుడు పెద్దపెట్టున నువ్వు నవ్విన నవ్వు నాకు బాగా గుర్తుకు వస్తుంది. ఆ నవ్వు నిజంగా నాకు ఎలా ఎంత మేలు చేసిందో తెలుసా? అదే నేను నీ స్థానంలో ఉంటే...పక్కకు పిలిచి...'అరె బాస్...అది సావర్నిటి' అని చెప్పేవాడిని. నువ్వు నవ్విన నవ్వు దయచేత నేను ఆంగ్లంపై కొంత కసరత్తు పెంచాను. నిన్ను చూడగానే...'సావర్జినిటి' గుర్తుకువస్తుంది. నువ్వు నా కన్నా ముందు ఇంగ్లిష్ జర్నలిజం లోకి వెళ్లాలని నాకు బలంగా వుండేది. ఈ మాట ఎన్నిసార్లు నీతో అన్నానో గుర్తుందా? నువ్వు మంచి ఎడిటర్ అయి ఉండేవాడివి. 

నాగుపాములు, ముళ్ళపందులు, ఎనుబోతులు, గుంటనక్కలు పుష్కలంగా వున్న తెలుగు జర్నలిజం నుంచి నువ్వు ఎంత తొందరగా బైటపడితే అంత మంచిదని నేను, హేమ ఎన్నోసార్లు అనుకున్నాం. మెడపై ఎల్లవేళలా వేలాడే కత్తిలాంటి 'ఈనాడు' ను నమ్ముకోవద్దురా...అని చెప్పిచెప్పి విసిగిపోయాను.  
మనం కలిసి అర్ధరాత్రివేళల్లో డ్యూటి అయ్యాక...అటు నిమ్స్ వైపొ, ఇటు నాపల్లి వైపో వెళ్లి బజ్జీలు తిని టీ తాగి వచ్చిన రోజులు నా మదిలో పదిలంగా గుర్తు వుంటాయి. 

డ్యూటీ మధ్యలో డిన్నర్కు వెళ్లి కిళ్ళీ వేసుకుని, వెంట ఒకటి స్టాకు తెచ్చుకుని రాజసంగా నడుస్తూ కూనిరాగాలు తీస్తూ వస్తుంటే శర్మ గాడు నీ వైపు చూసిన చూపులు నాకు గుర్తు. "సార్...మీరు మానవత్వంతో మెలగండి. మీరు డ్యూటీకి రారని తెలిస్తే....సెలవలో వున్నవారు కూడా వచ్చి డ్యూటీ చేస్తారు..." అని నేను శర్మ గాడికి ధైర్యంగా చెప్పడానికి తెలీకుండానే నువ్వు ఇచ్చిన గుండె ధైర్యం కారణం. నువ్వు రాకపోతే...నేను ఎదురు తిరగకపోతే....శర్మ గాడు ఇంకా చెలరేగేవాడు. చాలా మంది రోజూ చస్తూ ఉద్యోగం చేయాల్సి వచ్చేది. నువ్వు ఢిల్లీ పోకుండా నాతో కొన్నిరోజులు అక్కడ ఉండి ఉంటే...ఇప్పటికీ జర్నలిస్టులను వేధించుకు తింటున్న శర్మగాడిని మార్చేవారం.  విచిత్రం ఏమిటంటే...నువ్వు శర్మకు తీసిపోని విధంగా వ్యవహరించావని చాలా మంది నాకు చెప్పినప్పుడు బాధేసింది. మనం మారాలి బ్రదర్.

నేను 'ఈనాడు' ను వదిలి వెళుతున్నప్పుడు నీకు చెప్పికూడా ఉండను. ఇలాంటి వెంచర్లు, పోరాటాలు నీకు నచ్చవు. తర్వాత హిందూ లో చేరాక కలిసాం. 'ఈ-టీవీ' నుంచి నువ్వు బైటికి వచ్చాక నేను నల్గొండ నుంచి నీతో ఫోన్ లో సుదీర్ఘంగా జరిపిన సంభాషణలు నాకు గుర్తు. నువ్వు మానసికంగా కుంగి పోకూడదని నేను ప్రయత్నించేవాడిని. నువ్వు, భాస్కర్ గారు గంటలతరబడి ఫోన్ లో మాట్లాడేవారు. మీ ఇద్దరికీ త్వరగా మంచి ఉద్యోగాలు రావాలని నేను అనుకునేవాడిని. మొత్తం మీద నువ్వు ఎన్-టీ.వీ.లో చేరడం, హేమ కూడా జీ నుంచి వచ్చి నల్గొండలో ఎన్.-టీ.వీ.లో చేరడం జరిగాయి. ఆ ఛానెల్ లో ఉద్యోగ భద్రత గురించి నువ్వు ఎప్పుడూ చెప్పేవాడివి. 

హైదరాబాద్ వచ్చాక ఎన్-టీ.వీ. నుంచి హేమ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసీ నన్ను అలర్ట్ చేయకపోవడం నాకు ఎంతో వేదన కలిగించింది. అందుకే...ఆ రోజు అంత హార్ష్ ఎస్.ఎం.ఎస్. ఇచ్చి నీతో బంధం తెంచుకున్నాను. హేమ జాబ్ కారణంగా మాత్రమే నేను ఆ పనిచేయలేదు...బ్రదర్.
నువ్వు ఒక మంచి పొజిషన్ లో ఉన్నచోట...హేమ ఒక సీనియర్ రిపోర్టర్గా ఉన్నందున...నువ్వు కనీసం మా ఇంటికైనా రాలేదు. స్నేహాల మధ్య ఇలాంటి పొజిషన్ తాలూకు అడ్డుగోడలు ఉంటాయని నేను తెలుసుకోలేకపోయాను. వాషింగ్టన్ స్టోర్స్ లో నీ బిడ్డ కోసం ప్రత్యేకంగా నేను కొన్న చాక్లెట్స్ దార్లో వున్న మా ఇంటికొచ్చి తీసుకుపొమ్మని మూడు సార్లు అర్థించాను. బహుశా నీ హోదా అడ్డురావడం వల్ల కావచ్చు...నువ్వు ఆ పనిచేయలేదు. ఇది సాధారణంగా చూస్తే...ఒక కరిగిపోయే చాక్లెట్లా అనిపించవచ్చు. కానీ...నాకు అది ఒక పెద్ద మెసేజ్. ఒక షాక్.

అప్పటికే...నీ బాధితులమంటూ కొందరు చేసిన వాదనకు, నీ ప్రవర్తనకు మధ్య పొంతన కుదిరింది. వీటి నేపథ్యంలో ఆ ఎస్.ఎం.ఎస్.ఇచ్చాను. నువ్వు కష్టకాలంలో వున్నప్పుడు ఆదరించి అక్కున చేర్చుకున్న వాడిని నువ్వు 'ప్రత్యక్ష దైవం' అని అన్నావు. కానీ...అదే వ్యక్తి చేసిన చిన్న తప్పు (నీ దృష్టిలో అది తప్పు) తో అతనితో మాట్లాడడమే మానేసావు. అది నాకు ఒక షాక్. 


మిత్రమా....నీ లాంటి వారికి ఇది తగని ప్రవర్తన. ఏ శర్మకు వ్యతిరకంగా మనం పోరాడామో...వాడి లక్షణాలే మనం పుణికిపుచ్చుకుంటే ఎలా? కింది ఉద్యోగులను వేధిస్తే ఎలా? అందరం మనుషుల్లా బతకాలి కదా...కాకుల్లా, పందుల్లా కాట్లాడుకోవడం ఈ చిన్న జీవితంలో అవసరమా? 

ఆర్యవైశ్య సత్రంలో 'ములంగ కాడల' సాంబారుపై, చట్నీలపై మన దాడి,
నా పెళ్ళికి నువ్వు, నీ పెళ్ళికి మేము వచ్చినప్పటి గుర్తులు, ఎంతో సహృదయురాలైన మీ అమ్మగారి పలుకులు, మీ ఇంట్లో మంచి ఆతిధ్యం ఇచ్చిన మేడం, నా పక్కనే వున్న స్టూడియోలో నీ కూతురు పాడిన పాట వంటివి ఇంకా ఎన్నో గుర్తుకు వస్తున్నాయి. తను క్యాజువల్ గా అన్నదో... ఏమో కానీ...'అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం అంకుల్...' అని చిన్న పిల్ల అడిగింది  గుర్తుకువస్తే మనసు ఆర్ధ్రమవుతుంది.
చాలా రాయాలని వుంది కానీ...నిగ్రహించుకుంటూన్నాను. 'ఈ-టీ.వీ.' నుంచి బైటికి వచ్చాక నువ్వు ఎంత తల్లడిల్లి పోయావో నాకు గుర్తు ఉంది. నీ కన్నా...ఎక్కువ తల్లడిల్లిపోయాను నేను. అప్పటికి ఇప్పటికీ మీడియా రంగంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మీడియా బాగా విస్తరించింది. అవకాశాలు పెరిగాయి. నీకు ప్రతిభ ఉంది. ధైర్యంగా ఉండు. ఈ కష్టాలు తాత్కాలికం. Be brave and confident.

బాబా...నీకు వెంటనే...ఒక మంచి హోదాతో కూడిన వుద్యోగం రావాలని, ''మీ వాడు చాలా మారిపోయాడు. అతనితో పనిచేయడం నిజంగా అదృష్టం...'' అని కనీసం కనీసం ఒక్కరైనా నాకు చెప్పే రోజు తొందరగా రావాలని నేను కోరుకుంటాను. ఆ రోజు కోసం నేను ఎదురుచూస్తాను. కచ్చితంగా ఆ రోజే....నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పటిదాకా నీ కోసం....యాజమాన్యాల వల్ల అర్థంతరంగా ఉద్యోగాలు పోయినవారి కోసం నా గుండె రక్త కన్నీరు కారుస్తూనే వుంటుంది. 
ఆల్ ది బెస్ట్
ఒకప్పటి నీ మిత్రుడు
రాము 

16 comments:

జర్నో ముచ్చట్లు said...

రామూ... నీ ఈ లేఖ రామబాణం. సరిగా గురిచూసుకుని మన మిత్రుని అంతరంగానికి తగిలి తీరుతుంది. ఈ అస్త్రం తీవ్రత దెబ్బకు.. మనవాడిలోని మలినపు నిషాల మనిషి హతుడై.. మన స్వచ్ఛమైన మిత్రుడు మనకు దక్కుతాడని నాకెందుకో అనిపిస్తోంది. మనవాడు మారాలి.. మంచి పొజిషన్‌కి త్వరలోనే చేరుకోవాలి. నీతోపాటూ నా ఆకాంక్ష కూడా ఇదే. చూద్దాం.. కాలం ఎలాంటి మార్పులు తెస్తుందో..!?
విజయ్‌

ఆర్.ఎస్ రెడ్డి(డేర్2క్వశ్చన్ బ్లాగర్) said...

@"నేను శర్మ గాడికి ధైర్యంగా చెప్పడానికి తెలీకుండానే నువ్వు ఇచ్చిన గుండె ధైర్యం కారణం Vs నువ్వు శర్మకు తీసిపోని విధంగా వ్యవహరించావని చాలా మంది నాకు చెప్పినప్పుడు బాధేసింది"-నిజమే బ్రదర్. మనం టేబుల్‌కు ఇవతలివైపున్నప్పుడు దేన్నైతే అసహ్యించుకుంటామో అటువైపు పోగానే దాన్నే పాటించడమంటే అంతకన్నా రోత విషయం మరోటుండదు. ఆ రెండింటినీ చూసిన నీలాంటి అంతో ఇంతో మంచి మనిషి ఎదుర్కొనే సంఘర్షణ కూడా వర్ణనాతీతం.
పైగా మీరు చెప్పిన ఇతర విషయాలను బట్టి అతనూ మీరూ కుటుంబ సమేతంగా చాలా ఆత్మీయులుగా ఉండికూడా అతను పొజిషన్ తాలూకు అడ్డుగోడలు పాటించడం నిజంగా బాధాకరం. అయినా అతనికి త్వరగా మంచి హోదాతో కూడిన వుద్యోగం రావాలని, మంచివాడుగా మారిపోయాడని ఎవరో ఒకరి ద్వారా వినే రోజు రావాలనీ కాంక్షిస్తుండటం మంచి విషయం.
నాకు మీ ద్వారా పరిచయమైన ఆ వ్యక్తే ఈయన అయ్యుంటాడేమో అని నా డౌట్:)

Tejaswi said...

ఇప్పుడు ఎవరికి తెప్పిస్తాడో 'రక్త కన్నీరు'. నేను వారి ఫ్యాన్స్('బాధితులు' అని చదువుకో ప్రార్ధన)లో ఒకడిని లెండి.

saamanyudu said...

మీరు మీ మిత్రుడికి ఇలా ఒక బహిరంగ లేఖ ఎందుకు రాసారో అన్న విషయం నాకు ఒక అర్ధంకాలేదు.... బహుశా మీరు దత్తన్నని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు .... అయినా, ఆయన మీ ఈ బహిరంగ లేఖకే మారతారు అని అనుకుంటున్నరా ఒక వేళ అలా అనుకుంటే వ్యక్తిగతంగా మీరు ఆయనతో మాట్లాడాల్సింది. ఈ లేఖ నిజంగా మీ ఇద్దరి మధ్యనా దూరం పెంచదా ?? సరే ఇలాంటి మరెన్నో ప్రశ్నలు నా మదిలొ ఉన్నాయి .....కానీ తెలుగులో రాయలేక వదిలేస్తున్నాను...
ఇకపొతే, ఇలాంటి ఒక వేదిక మీద మీరు ఒక వ్యక్తిని "గాడు" (శర్మ అనే వ్యక్తిని )అని సంబొధించడం ఎంతవరకు సబబు అన్నది మీకే వదిలేస్తున్నాను

Ramu S said...

వాడిని వాడు అనకుండా...ఇంకా ఏమి అన్నా అది చాలా తప్పు అవుతుందని నా అభిప్రాయం. మీరు మరోలా అనుకోకండి
థాంక్స్
రాము

Prashant said...

The article doesn't stand up to the commandments envisaged by the host of the blog.
The article depicts an undercurrent tone of sweet poison where the host is trying to settle personal grudge for mistreating him(in his assumption),even though he wishes his "dear" friend to be brave and confident in troubled times.
Questionable integrity?

Swarupa said...

Mee e bahiranga lekha chaduvuthunte nakoo konni vishayalu kalla mundu meduluthunnai. ETV nunchi aayana kannillatho veluthunna roju naakoo edupochindi. peddayana antha kshobhaku guravadam chusi chala badhesindi. mee snehithudilo marpu kori meeru chesina e prayatnam thappaka phalistundi.

Ilavarasi said...

ఏ లక్షణాలనైతే అసహ్యించుకుంటామో అవే లక్షణాలను పుణికిపుచ్చుకున్న వాడి బాగు కోరుకోవడం మీ మంచితనాన్ని సూచిస్తున్నది. అయితే ఆ వ్యక్తి రాక్షసుడిగా మారి చాలా ఏళ్లయింది, ఇప్పుడు రాముడిగా మారడం సాధ్యం కాదు. అతను చాలా దూరం వెళ్లాడు. మూసారాంబాగ్ లో అతని అపార్టుమెంట్ కింది అంతస్తులో ఉండే ఇంకో జర్నలిస్టు మిత్రుడిని అతను తీవ్ర వేదనకు గురిచేస్తున్నాడు. అతనే కాదు, అతని భార్య వైఖరి కూడా అలానే తయారయింది. కింది అంతస్తులోని జర్నలిస్టు తల్లిదండ్రులను ఆవిడగారు వేధిస్తున్నారు. గర్వం తలకెక్కితే ఇలాగే తయారవుతారేమో

Sasidhar said...

రామూ గారు,

చిమ్మచీకటిలో దుప్పటి ముసుగెట్టి మరీ కొట్టినట్లుంది, మీ పోస్ట్ . ఇంతకూ, మీ స్నేహితుడు ఈ పోస్ట్ చూసే అవకాశం ఉందా?
జనరల్ డెస్క్ శర్మగారిని అంతచేటున ఆడుకున్నారు. అంత దుర్మార్గుడా? మాకు ఒకటి, రెండు క్లాసులు తీసుకున్నారు, జర్నలిజం స్కూల్లో.

~శశిధర్ సంగరాజు.

www.sasidharsangaraju.blogspot.com

Sitaram said...

Dear Sasidhar,
He troubled many people, including me. To get more information about this inhuman personality, please contact any journalist working in Surya newspaper.
Ramu

vijay kurra said...

Hai Ramu Garu

keep it writing

we keep it reading too
regards

vijay kumar kurra, vizag

Sasidhar said...

సూర్య పత్రికలో నాకెవరూ తెలియదుకానీ, వేరే పత్రికల్లో పనిచేసే జర్నలిస్టు మిత్రులకు ఫోన్ చేసి అడిగాను. శర్మగారి పేరు చెప్పగానే, బూతులు మొదలెట్టారు. ఈలెక్కన చూస్తే, శర్మ సబార్డినేట్స్ కు పెట్టింది మామూలు పొగ కాదు, కారప్పొగే.
మీ ఫ్రెండ్ ఎవరైఉంటారో కొంతవరకూ ఊహించా. మీకు తర్వాత ఈమైయిల్ పంపుతాను.

~శశిధర్ సంగరాజు

www.sasidharsangaraju.blogspot.com

Thirmal Reddy said...

@Ramu Sir jee
మీరు మరీ మంచివారు కాబట్టి పేరు చెప్పకుండా వాడి పరువు నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. కాని మీ "గాడు" గాడి లాగా వీడు మరో పెద్ద "గాడు"లా తయారయ్యాడు. ETV లో ఉండగా కొన్నాళ్ళు అతని డెస్క్ లో పని చేసే మహద్భాగ్యం నాకు కలిగింది. వాడు నన్ను పెట్టిన టార్చర్ తక్కువేమ్కాదు. Of course మీకు ఇంతకు ముందే చెప్పినట్టు శాస్త్రి గాడు వీడికంటే పెద్ద సాడిస్ట్ అనుకోండి. (అచ్చు మీ శార్మగాదిలాంటి వాడన్నమాట. ఇద్దరు సమకాలికులు గదా 'దొందు దొందే' ) ఇక ఫై పోస్టులో మీరు ప్రస్తావించిన మహానుభావుడు ETV నుంచి వెళ్ళలేదు, మెడ పట్టుకుని గెంటేసారు. అందుకు కారణం వాడి టార్చర్ శృతి మించడమే. పోనీ NTV లో చేరాక బుద్ది మారిందా, గతంలో చేసిన తప్పులు తెలుసుకున్నాడ అంటే అదీ జరగలేదు. "అది కాదు బాసు" అంటూ చిరుద్యోగులను రాచి రంపాన పెట్టాడు. ఇంకో విషయం... మహమ్మద్ ప్రవక్త కార్టూన్ల వివాదం సాగుతున్న రోజుల్లో... ఆ విజవల్స్ ని ఒక ట్రైనీ జర్నలిస్తుకి చేత ప్రసారం చేయించి... దానిపై రామోజీ రావు సీరియస్ అయ్యాడని తెలిసి "నాకు తెలియకుండా జరిగింది" అని అబద్దం చెప్పి ఆ ట్రైనీని ఉద్యోగం లోంచి తీసేయించిన ఘనత వీడి సొంతం. ఇప్పుడు మళ్లీ ఉద్యోగం ఊడిపోయి మరో సంస్థలో చేరినా బుద్ది మారుతుందని గారేంటి ఎంత మాత్రం లేదు. వాడు మారడని నేను రాసిస్తాను. కాకపోతే మారతాడనే మీ నమ్మకం మీది. ఏమి అనుకోకండి సర్ జీ.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Thirmal Reddy said...

@swaroopa

స్వరూప... అంత తేలిగ్గా వాడి కన్నీళ్ళని నమ్మకు. నిజంగా కన్నీళ్ళ విలువ తెలిసినవాడైతే, చేరిన ప్రతిచోటా అంతేసి మందికి రక్తకన్నీరు ఎందుకు కార్పిస్తున్నట్టు. వద్దు తల్లీ నువ్వూ, మీ మహాత్మా పొరపాటున కూడా వాడిని నమ్మొద్దు. గతంలో మీకు ఓ గురువు లాంటి వాడితో ఎలాంటి చెడు అనుభవం ఎదురైందో వీడు అంతకన్నా ముదురు. తస్మాత్ జాగ్రత్త.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Anonymous said...

ramu garu, namaste

ninna oka roju kuchuni mee blog lo ee madhya chudani posts anni oka stretchlo chadivanu. oka nati mee prana mitrudiki rasina mee prema purvaka lekha baavundi. daaniki maa mitrudu tirumal reddy raasina comment kuda chadivanu.

aa kinda... ntv narendranathki dharmika varenya birudu karyakramam gurinchi raasina post lo... mee oka naati eenadu seniors raghu babu, v.s.r. sastry garlato kasepu matlade avakasam chikkindi ani raasaru. aa sastry gari gurinche gatamlo mee ide bloglo tirumal reddy raasina posts gurtuku vachayi.

7 yella nunchi etv lone pani chestunna vaadiga, mee blog ni dadapu regulargaa follow avutunna vaadigaa, sastry gari gurinchi mee abhiprayam telusukovalani undi. eenadu samstha ante kopam tappa, daniloni paluvuru udyogulapai meeku sadabhiprayalu unnattu meere chala sarlu chepparu kada. andukani ee curiosity.

regards

phaneendra
etv-2

Ramu S said...

డియర్ ఫణీంద్ర,
మీ కామెంట్ కు ధన్యవాదాలు. చాలా మంది శాస్త్రి గారి గురించి అంతే ఘాటైన మాటలు చెబుతారు. ఆయన కటువుగా చెప్పినా...వృత్తిలో నాకు చాలా మెళకువలు నేర్పారు. వేగంగా పనిచేయడం, పద డాంభీకం లేకుండా స్టోరీ లు రాయడం....ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. నిజానికి నాతో ఎప్పుడూ అంత ఘోరంగా ప్రవర్తించలేదు. నా మిత్రుడు సత్యకుమార్ తో ఆయన ప్రవర్తన అభ్యంతరకరంగా వుండేది. అదే విషయాన్ని నేను ఆయనకు చెప్పాను కూడా. అలా చెప్పే స్పేస్ ఇచ్చేవారు ఆయన. శర్మ వేధిస్తున్నప్పుడు....తను ఎంతో మనోధైర్యం ఇచ్చారు. 'డోంట్ వర్రీ, నువ్వు వృత్తికి పనికి వస్తావు' అని శాస్త్రి, ఖత్రి గార్లు చెప్పకపోతే టీచర్ ఉద్యోగానికి వెళదామని అనుకున్నాను అప్పట్లోనే. నిజానికి నేను జనరల్ డెస్క్ నుంచి వెళ్ళిపోవాలని గట్టిగా అనుకోవడానికి శాస్త్రిగారు ఫస్ట్ ఎడిషన్ అయిపోయాక నన్ను అపార్థం చేసుకుని అన్న ఒక కటువైన మాట కారణం. సందర్భం వచ్చినప్పుడు అది వివరిస్తాను.

సర్, వృత్తిలో భాగంగా బాసులు ఒకటి రెండు మాటలు కటువుగా చెప్పినా, విసుక్కున్నా పర్వాలేదు కానీ...డ్యూటీ అయిపోయాక కూడా అదే కసిని, కోపాన్ని ప్రదర్శిస్తూ ఈసడించుకోవడం దారుణమని నా అభిప్రాయం. డ్యూటీ అయ్యాక...శాస్త్రి గారు భలే సరదాగా ఉండేవారు అందరితో. ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. ఎంత తిక్కగా ప్రవర్తించినా శర్మ గారు కూడా అలా ఉంటే బాగుండేది కానీ...మాటి మాటికీ కించపరిచి మనసు గాయపరిచే వాడు. పైగా...ఎల్.ఐ.సీ.పాలసీ ఏడుపు ఒకటి వుండేది. శర్మ గారి వేధింపుల వల్ల నాకు కొన్ని ఏళ్ళ పాటు నత్తి వచ్చింది. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని వేరు వేరుగా చూస్తే బాగుంటుంది. చూడండి...చివరకు వీరేమి సాధించారో?
రాము