Monday, February 27, 2012

Murdoch launches Sunday edition of The Sun

 Rupert Murdoch launched a new British tabloid Sunday to replace his disgraced News of the World, seven months after the best-selling Sunday paper was shut down over a phone-hacking and bribery scandal.
The "new" newspaper isn't entirely new -- it's a Sunday edition of Murdoch's Sun tabloid, which had been a six-day-a-week paper until now.
Its leading editorial on launch day took a defensive tone in discussing the closure of the News of the World.
"The Sun has been a tremendous force for good," its editors insisted. "It is worth reminding our readers, and detractors, of that as we publish our historic first Sunday edition."
Rupert Murdoch's Sun on Sunday is set to report sales of more than 3m copies on its launch weekend, with the Sunday Mirror and the Peoplesuffering the most from the new title's arrival, while Richard Desmond's Star on Sunday was more resilient.
Early figures from wholesalers and retailers indicate that the Sunday edition of the Sun, which launched at a cut-price 50p backed by a multimillion-pound marketing push, is on track to surpass the 3m sales mark – while sales of its rivals tumbled by 15% to 30%.
If the trend indicated by the early data proves to be correct – newspaper publishers will have a pretty accurate sales picture by later this afternoon – Murdoch will have achieved his aim of returning to the position of market leader on Sunday. When the News of the World was closed last July it was selling about 2.66m copies a week.
The same information indicates that the biggest loser over the weekend will be Trinity Mirror, owner of the Sunday Mirror and the People, which had been the biggest beneficiary after the closure of News of the World.
Early estimates indicate that the People could be down as much as 30% week-on-week to a circulation of about 560,000; while the Sunday Mirror is looking to be down by about a quarter to approximately 1.3m. But both levels are still above the amounts the titles sold before the closure of the News of the World last July – which were 474,000 and 1.09m respectively.
The Sunday Mirror was cut from £1 to 50p in the Carlton (London), Meridian (south coast) and Central (Midlands) regions. Stablemate the People was cut from £1 to 50p in the same regions.
Richard Desmond's Daily Star Sunday, which was cut by 50% to 50p nationally, is on track for a more modest sales decline of the order of 15% to about 550,000. That would leave it almost a quarter of a million ahead of its pre-News of the World closure level, which was 306,000. The Sunday Express looks to be down about 10% to about 520,000, compared with a circulation of 538,000 before the News of the World closed.
The Mail on Sunday, which maintained its cover price at £1.50, is thought to be on track to report sales up slightly by between 1% and 2%.
The MoS, which ran a major ad campaign over the weekend, cut its price last summer to lure former NoW readers but lost financially when it failed to hold on to temporary sales gains.
Rupert Murdoch took to Twitter on Sunday night when the first feedback started to emerge from retailers. "Reports early, but new Sun edition sold 3m!" he said on his official Twitter feed  @rupertmurdoch.
-----
Courtesy: CNN, Guardian

Wednesday, February 22, 2012

veteran war reporter Marie Colvin & photographer killed

Syrian forces murdered journalist Marie Colvin after pledging to kill 'any journalist who set foot on Syrian soil', it emerged today. The 55-year-old Sunday Times reporter died alongside French photographer Remi Ochlik, 28, in a rocket attack on the besieged city of Homs this morning. She had lost her eye in an attack while covering ethnic conflict in Srilanka in 2001. 

Marie Colvin's 30-year career journalism saw her, having graduated from Yale, take up the post of Paris bureau chief for United Press International in 1984 before she moved to the Sunday Times a year later.
There she was Middle East correspondent for a decade, from 1986 to 1995, before becoming foreign affairs correspondent.
Although her area of speciality was the Arab and Persian world, she also worked in Chechnya, Kosovo, Sierra Leone and Sri Lanka, where she was injured and blinded when she was ambushed in 2001 by government soldiers because of her work with the Tamil Tigers.
A grenade attack left her blind in one eye and was forced to wear a black eye patch to cover up the injury.
She won the British press award for 'Best Foreign Correspondent' twice, for her work in reporting the conflict in Yugoslavia, Iran, Sri Lanka and Zimbabwe; the International Women’s Media Foundation award for 'Courage in Journalism' for her coverage of Kosovo and Chechnya, and the Foreign Press Association's Journalist of the Year award.
She is a patron of Reporters Sans Frontieres and Child Hope.
Marie Colvin was born in Oyster Bay, New York.
She lived in Hammersmith, west London, and was married three times, but had no children.

Read more: http://www.dailymail.co.uk/news/article-2104711/Marie-Colvin-dead-Journalist-killed-Homs-Syria-hours-ITN-News-At-Ten-broadcast.html#ixzz1n8CmaQ9Z

Tuesday, February 21, 2012

ఆవిష్కరణ సభలో వేమూరి రాధాకృష్ణ ప్రసంగం....సరదాకి

ఏ టీ ఎం కార్డులో నుంచి పద్దెనిమిది వేలు మిస్ అయిన బాధ, ఆ ఫిర్యాదును ఎవ్వడూ పట్టించుకోలేదన్న కోపం, రెండు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలకు హాజరు కావాలన్న హడావుడి లో పావు తక్కువ పదకొండు గంటలకల్లా బషీర్ బాగ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ కు వెళ్లాను..ఆదివారం నాడు. అక్కడకు వెళ్ళింది...మన వేమూరి రాధాకృష్ణ ఏమి మాట్లాడతారో చూద్దామన్న కుతూహలం, సరదాకి రచయిత రాజగోపాల్ గారిని అభినందించాలన్న సంకల్పం. ఈనాడు జర్నలిస్టులు తప్ప...అన్ని పత్రికలు, చానల్స్ లో పెద్ద జర్నలిస్టులు అక్కడకు వచ్చారు.  


గంజి బాగా పెట్టిన తెల్ల షర్టు తో, జుట్టుకు దట్టంగా పట్టించిన నల్ల రంగుతో రాధాకృష్ణ చాలా ఉత్సాహంగా ఉన్నారు. తన పత్రికలో ఎడిటర్ గా పనిచేసి ఇప్పుడు హెచ్ ఎం టీ వీ కి ద హన్స్ ఇండియాకు ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఉన్న కే.రామచంద్ర మూర్తి పక్కపక్కనే కూర్చొన్నారు. ఈనాడు లో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు  ఎన్..టీ.వీ.లో విశ్లేషణలు చేస్తున్న కొమ్మినేని శ్రీనివాస రావు గారు టక టక మాట్లాడి అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయారు. రాధాకృష్ణ గారు మాట్లాడే వంతు వచ్చింది. తన టీ.వీ.చానల్లో తెగ మాట్లాడే రా.కృ.చాలా సంక్షిప్తంగా మాట్లాడారు. 'చాన్నాళ్ళకు  ప్రెస్ క్లబ్ కు వచ్చాను. కాకపొతే ఒకటే తేడా...ఇదివరకు అక్కడ కూర్చునే వాడిని (వేదిక ముందు ఆహూతుల సీట్లలో), ఇప్పుడు ఇక్కడ (వేదిక మీద) వున్నాను...." తో మొదలయ్యింది ప్రసంగం.

రాజగోపాల్ చాలా కస్టపడి ఆంధ్ర జ్యోతి లో సరదాకి కాలం రాసే వాడని చెబుతూ..."బాగ కష్టపడే వాడు. ప్రసవ వేదన పడే వాడు. రాసిన మర్నాడు బాగా దగ్గే వాడు. దగ్గి దగ్గి...అది నోట్లో కొట్టుకునే వాడు. ఏందయ్యా...అది...(నోటి దగ్గర తన చేయి పెట్టుకుని బొటన వేలు వొత్తుతున్నట్లు సైగ) కొట్ట్కుకునే వాడివి..." అని రచయిత రాజగోపాల్ ను అడిగాడు మన రా.కృ. 

ఆస్తమా ఇన్హేలర్ అని వేదిక మీద ఉన్న ఒకరిద్దరు చెప్పే లోపే...'ఆ...ఆ...అదే...' అని ఇంకొకటి రెండు మాటలు చెప్పి ప్రసంగం ముగించారు. తర్వాత...సభ జరుగుతుండగానే...మధ్యలోనే వెళ్ళిపోయారు రా.కృ.
తర్వాత...మూర్తి గారి వంతు. హాస్య రచయితలూ...సత్తా వున్నా...ఎడిటర్లు కాలేక పోయారని చెబుతూ...వారిలో 'కిల్లర్ ఇన్ స్టింక్ట్' లేకపోవడమే దానికి కారణం కావచ్చని...విశ్లేషించారు. రాధాకృష్ణ, మూర్తి గార్లు కరచాలనం చేసుకుంటున్న ఫోటో ఇక్కడ ఇచ్చాను.
నేను ఇంకొక గంట ఉండి కార్యక్రమం ముగిసాక...ఇంటి ముఖం పడుతుండగా....చేతిలో రెండు సరదాకి ప్రతులతో జర్నలిస్టు ఉద్యమ నాయకుడు దేవులపల్లి అమర్ హడావుడిగా దిగుతూ కనిపించారు. ఎవరో అడిగారు....'రెండు తీసుకున్నారా....?' అని...'అవును...రెండోది కొట్టేసా..' అని ఆయన ఒప్పుకున్నారు. అది నికార్సైన జర్నలిజం అంటే. ఇక ఇంటికి పోదామని...మెట్లు దిగి ప్రెస్ క్లబ్ బైట పెట్టిన బండి దగ్గరకు వెళ్ళాను. దానికి తగిలించిన నా బంగారం లాంటి హెల్మెట్ ను ఎవరో కొట్టాశారు. బతుకంతా...కొట్టేయడమో...కొట్టేయించుకో బడటమో కదా...

Monday, February 20, 2012

మధ్యప్రదేశ్ లో హత్యకు గురైన జర్నలిస్టు కుటుంబం

పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో జర్నలిస్టు దంపతుల హత్య ఉదంతం మిస్టరీ ఇంకా వీడక ముందే...అంతే దారుణమైన రీతిలో మధ్య ప్రదేశ్ లో ఒక జర్నలిస్టును, అతని భార్యను, ఇద్దరు టీనేజ్ పిల్లలను అతని శత్రువులు ఘోరంగా హత్య చేసారు. నవభారత్, ది హితవాద పత్రికల కోసం వార్తలు సేకరించే చంద్రికా రాయ్ కుటుంబం హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. దానికి సంబంధించి 'ది హిందూ' దినపత్రికలో వచ్చిన వార్త:

The brutal murder of a senior journalist and his entire family on Saturday night in Madhya Pradesh's Umaria distict, over 450 km from here, has sent shockwaves across the State with fingers being pointed at the illegal coal mining mafia active in the region.

Journalist Chandrika Rai (42), his wife Durga (40) and their two teenage children — son Jalaj (19) and daughter Nisha (17) — were murdered using a sharp object at their residence, police said. The bodies were found in four separate rooms.
Mr. Rai was a freelance journalist who contributed regularly to the Hindi dailyNavbharat and English daily The Hitavada. He had been writing consistently against the illegal coal mining in the region. He had written a series of articles alleging the involvement of a local BJP leader in illegal mining.
The district is known for the Umaria coalfield under the control of the South Eastern Coalfields Ltd. However, illegal coal mining is also rampant in the region.
“The local illegal mining mafia has resorted to this horrific crime to silence the power of his pen,” said Congress MLA and leader of the Opposition in the State Assembly Ajay Singh. “The BJP government gives open protection to the local mining mafia. Recently Chief Minister Shivraj Singh Chauhan and some of his Ministers were seen sharing the stage with wanted criminals. In such a situation, criminals have no fear of the law and commit such mind-numbing crimes with impunity whenever their interests are harmed.”
The crime came to light when Mr. Rai's brother broke open the door on Saturday evening after he became suspicious on seeing it locked from the outside the entire day.
Linked to abduction?
The Umaria police believe the murders could also be linked to the kidnap of the seven-year-old son of a government official for ransom on Wednesday. He was rescued by the police on Thursday.
“DGP Raut visited the crime scene on Sunday and has ordered an STF probe,” Umaria SP Manohar Singh Jamara told The Hindu. “He also spoke to journalists here and assured them that the criminals would be brought to book as soon as possible. We have constituted a team to look into the crime and assist the STF which will arrive here tomorrow [Monday].”
Land dispute
Another angle the police are investigating relates to a land dispute involving Mr. Rai and another local individual.
Courtesy: The Hindu 

Sunday, February 19, 2012

"సరదాకి" ఆవిష్కరణ లో ఒక ఘట్టం


తొలి ప్రతిని రామచంద్ర మూర్తి గారికి అందిస్తున్న వేమూరి రాధాకృష్ణ గారు. ఎడమ వైపున వున్నది రచయిత ఎం.రాజగోపాల్. ఈ కార్యక్రమానికి పోవడానికి ముందు కొన్ని డబ్బులు పోయాయి. అక్కడికి వెళ్ళాక...నా హెల్మెట్ పోయింది. సభలో రాధాకృష్ణ చేసిన ప్రసంగంతో నా బుర్ర తిరిగి పోయింది. అందుకే నేరుగా యింటికి వచ్చి...పాలకూర పప్పు, బెండకాయ కూర తో అన్నం తిని.."గోల్' అనే ఒక మంచి సినిమా చూసి సాయంత్రం కుటుంబం తో బైటికి వెళ్లాను సరదాగా.... 

Saturday, February 18, 2012

"బ్లాగు పుస్తకం" పరిచయం కూడా ఆదివారం నాడే

ప్రముఖ బ్లాగర్లు సుజాత, రెహ్మాన్ గార్లు రచించిన బ్లాగు పుస్తకం పరిచయ కార్యక్రమం ఈ ఆదివారం (19 న) హైదరాబాద్ లోని మధురానగర్ లో ఏర్పాటు చేశారు. ఇది ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకూ జరుగుతుందని నిర్వాహకులు పంపిన ఆహ్వానపత్రంలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ ఆహ్వానపత్రాన్ని చూడండి.

రెహ్మాన్ గారిని కలిసిన గుర్తు లేదు కానీ సుజాత గారు నేను బ్లాగు మొదలుపెట్టినప్పడు పరిచయం అయ్యారు. బ్లాగు పరంగా సాంకేతిక సమస్యలు వచ్చినా, కొన్ని అంశాల విషయంలో నైతికపరమైన సందేహాలు తలెత్తినా ఒక మంచి సోదరీమణిలాగా ఆదుకున్నారు. వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ రహ్మాన్ గారికి, సుజాత గారికి అభినందనలు. ఉదయం రాజగోపాల్ గారి సరదాకి పుస్తకావిష్కరణ కార్యక్రమం చూసుకుని మధ్యాహ్నానికి ఈ ప్రోగ్రాంకు హాజరుకావాలని నేను అనుకుంటున్నాను. వేణువు గారు వస్తారని ఆశిస్తున్నాను. అటు వెళ్లే ఒక నలుగురైదుగురికి ఖైరతాబాద్ నుంచి వాహన సౌకర్యం కల్పించబడును. కేరాఫ్ అడ్రస్...ఆల్ఫా హోటల్, ఖైదరాబాద్ చౌరస్తా.

Friday, February 17, 2012

రాజగోపాల్ గారి పుస్తకం "సరదాకి" ఆవిష్కరణ 19 న

జర్నలిజంలో హాస్యరచన లేదా వ్యంగ్య రచనలు కనిపించేంత తేలికైన ప్రక్రియలు కావు. సీరియస్ విషయాల నుంచి హాస్యరసం పిండాలంటే నేర్పరితనం చాలా అవసరం. ఈనాడులో ఉండగా మానుకొండ నాగేశ్వర రావు (ప్రస్తుత ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్), పర్వతం మూర్తి (సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డు నిర్వాహకుడు) గార్ల ప్రోత్సాహంతో నేను ఎన్నికల పేజీల్లో, ఎడిటోరియల్ పేజీలో వ్యంగ్య రచనల ప్రయత్నం చేశాను. చాలా వ్యాసాలు ప్రచురించాను కూడా. ఈ రకమైన రచనలకు సాహిత్యంలో కొంత ప్రవేశం ఉండాలనీ, డొక్కశుద్ధిలేని నా బోటి జర్నలిస్టు వల్ల అది కాదని ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

ఈ కారణంగా ఎవరైనా వ్యంగ్య రచనలు చేస్తే...శ్రద్ధగా చదవడం అలవాటైంది. ఇలాంటి వ్యంగ్య రచనలు చేస్తున్న రాజగోపాల్ గారు హెచ్ ఎం టీవీలో పరిచయం అయ్యారు. కలిసి కూర్చొని మాట్టాడింది పెద్దగా లేకపోయినా ఆయన తింగరిబుచ్చి పేరిట సంధిస్తున్న రాజకీయ, సామాజిక వ్యంగ్యాస్త్రాలు కొన్ని నాకు బాగా నచ్చాయి. రాజగోపాల్ గారు గతంలో ఆంధ్రజ్యోతిలో ఉండగా రాసిన వ్యంగ్య రచనల కాలమ్ నుంచి కొన్ని ఏరికోరి సరదాకి పేరిట ఒక పుస్తకం ప్రచురించారు.


సరదాకి పుస్తకాన్ని వచ్చే ఆదివారం (19 వ తేదీ) ఉదయం పదిన్నరకు బషీర్ బాగ్ ఏపీ‍యూడబ్ల్యూజే ఆడిటోరియంలో ఆవిష్కరిస్తున్నారు. ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ గారు ఆవిష్కరిస్తుండగా, హెచ్ ఎం టీవీ, ద హన్స్ ఇండియా ఎడిటర్ ఇన్ చీఫ్ కొండుభట్ల రామచంద్రమూర్తిగారు తొలి ప్రతిని అందుకుంటారు. ముళ్లపూడి వెంకట రమణ గారు తన చివరి రోజుల్లో ఈ పుస్తకానికి ముందుమాట రాసారని రాజగోపాల్ గారు చెప్పారు. 

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని, దాని డిస్కౌంట్ ధరపై నిర్వాహకులు సరదాగా పంపిన ఒక సూచననూ మీ కోసం ఇస్తున్నాను. వీలుచేసుకుని ఈ కార్యక్రమానికి వెడితే సీనియర్ జర్నలిస్టులను కలుసుకోవచ్చు...సరదాగా.

Wednesday, February 15, 2012

బంగ్లాదేశ్ లో జర్నలిస్టు దంపతుల హత్య

ఒక రెండు రోజలు నెట్ లో ప్రపంచాన్ని జల్లెడ పట్టకపోతే చాలా ముఖ్యమైన వార్తలు మిస్ అవుతాం. బంగ్లాదేశ్ రాజధానిలో ఇద్దరు ప్రముఖ జర్నలిస్టు దంపతులు దారుణ హత్యకు గురవడం నాకు ఆలస్యంగా తెలిసింది.సాగొర్ సర్వార్ (న్యూస్ ఎడిటర్, మాస్ రంగా టీవీ), ఆయన భార్య మెహరున్ రునీ (సీనియర్ రిపోర్టర్, ఏటీఎన్ బంగ్లా) వారి నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. సర్వార్ ఒక జర్ననీ మీడియా సంస్థకు ఢాకా ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు. ఇద్దరి వయస్సూ నలభై ఏళ్ల లోపేననీ, ఉదయం వారి ఐదేళ్ల కుమారుడు మేష్ మృతదేహాలను చూసి పొరుగింటి వారిని అప్రమత్తం చేసే వరకూ ఈ ఘోర హత్యల గురించి ఎవ్వరికీ తెలియలేదని సమాచారం. 


ఈ హత్యల నేపథ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సాధారణ ప్రజలు కూడా జర్నలిస్టుల హత్యను ఖండిస్తూ, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్లకెక్కారు. దీన్ని ప్రతీకార హత్యగా లేదా దోపిడి దొంగల అఘాయిత్యంగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాగొర్ దేహం మీద మొత్తం 22 కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హంతకులు అతని కాళ్లు, చేతులు తాళ్లతో బంధించి పదునైన ఆయుధంతో పొడిచి చంపారట. వీరి అపార్ట్ మెంట్ లో ఆ రాత్రి వీరితో కలిసి భోజనం చేసిన కొందరు వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అంటున్నారు. http://www.nl-aid.org కథనం ప్రకారం....
Bangladesh is among the worst nations in the world in combating deadly anti-press violence. Bangladesh ranks 11th on New York based Committee to Protect Journalists (CPJ) Impunity Index, which calculates unsolved journalist murders as a percentage of each country’s population. Twelve journalists have been murdered in reprisal for their work in Bangladesh since 1992.

First Photo courtesy: BBC
Second Photo courtesy: http://www.nl-aid.org

పత్రికాధిపతులారా...అస్సాం ట్రిబ్యూన్ ను చూసైనా నేర్చుకుంటారా?

1967 నుంచి....జర్నలిస్టుల వేతనాలకు సంబంధించిన వేజ్ బోర్డుల సిఫార్సులను అమలుచేయడంలో ముందున్న అతికొద్ది పత్రికలలో ఈశాన్య భారతం నుంచి వస్తున్న "ద అస్సాం ట్రిబ్యూన్: ఒకటి. జస్టిస్ మజీతియా నేతృత్వంలోని వేజ్ బోర్డు ఇచ్చిన సిఫార్సులు అమలుచేయకుండా ఉండటానికి పత్రికల యాజమాన్యాలు నానా యాగీ చేస్తూ...ఎక్కడ లేని లా పాయింట్లు పీకుతుంటే అస్సాం ట్రిబ్యూన్ మాత్రం ఆ సిఫార్సులను అమలుచేయాలని నిర్ణయించింది. 
జనవరి నుంచి కొత్త వేతనాలను యాజమాన్యం అమలుచేసింది. దాంతో కనీసం పదిహేను వేల రూపాయల అదనపు జీతాన్ని జర్నలిస్టులు పొందారు. ఇది నిజంగా హ్యాపీ న్యూ ఇయరే మన మిత్రులకు. అస్సాం ట్రిబ్యూన్ ఎడిటర్ కం మేనేజింగ్ డైరెక్టర్ అయిన పి.సి.బారువా దీనిమీద అన్న మాట ఏమిటంటే..."We have done our duty and given the employees their due. We don't want to speak for ourselves. Let others talk about our gesture."

 1939 ఆగస్టు నాలుగో తేదీన ఏర్పడిన ఈ పత్రిక ఈశాన్య భారతంలో అత్యధిక సర్క్యులేషన్ తో వర్ధిల్లుతున్నది. ఇందులో దాదాపు నాలుగొందల మంది పనిచేస్తున్నారు. అందులో వంద మంది జర్నలిస్టులున్నారు. ఈ గ్రూప్ వారికే అస్సమీ లో దైనిక్ అసోమ్, అసోమ్ బని, గరియోషి అనే పత్రికలున్నాయని ది హూట్ వెబ్ సైట్ లో వచ్చిన ఒక ఆర్టికల్ పేర్కొంది.

జర్నలిస్టుల రక్తమాంసాలు పిండి మీడియా సామ్రాజ్యాలు నిర్మించుకుంటూ తరతరాలకు తరబడ సంపాదిస్తున్న తెలుగు పత్రికా యాజమాన్యాలు అస్సాం ట్రిబ్యూన్ నుంచి ప్రేరణ పొందాలి. ప్రతికలను అడ్డంపెట్టుకుని చేస్తున్న వ్యాపారాలలో భారీగా ఆర్జిస్తూ, పత్రికా నిర్వహణలో నష్టాలు చూపించి జర్నలిస్టుల, నాన్ జర్నలిస్టుల పొట్టకొట్టడాన్ని ఇప్పటికైనా ఆపాలి. చేవలేని జర్నలిస్టు సంఘాలు మొద్దు నిద్ర వదిలేలా జర్నలిస్టులు కూడా పూనుకోకపోతే మీకు చట్టబద్ధంగా పెరగాల్సిన జీతాలు పెరగవని గమనించాలి.

Tuesday, February 14, 2012

జిల్లాకో యూనివర్శిటీ...ఒక చెత్త ప్లాన్...

వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయం...జిల్లాకో యూనివర్శిటీని ఏర్పాటుచేయాలనుకోవడం, అందులో భాగంగా పలు జిల్లాలలో యూనివర్శిటీలు ఏర్పాటు చేయడం. యూనివర్శిటీ విద్యను ప్రజల చెంతకు తేవాలన్న ఆలోచనలో భాగంగా ఆయనీ నిర్ణయం తీసుకుని ఉంటారు కానీ పలు లాజిస్టికల్ సమస్యలను ఆయన పట్టించుకోలేదు.

అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని వాడుకుని...కనీస మొత్తంలో నిధులు కేటాయించి లోకల్ గా యూనివర్శిటీలను ఏర్పాటుచేశారు. వైస్ ఛాన్సలర్ లు చాలా వరకు రాజకీయ నియామకాలే. అధ్యాపకుల నియామకాల్లోనూ నాణ్యతకు పెద్దపీట వేయలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి.  తాజాగా మచిలీపట్నంలో ఉన్న యూనివర్శిటీలో పోస్టులు ఇప్పిస్తానని ఒకాయన పది లక్షల వరకూ నొక్కేసి పారిపోయాడట. ఇందులో బాధితులు పోలీసు ఫిర్యాదు ఇవ్వడంతో విషయం బైట పడింది.
రాష్ట్రంలో ఉన్న పెద్ద యూనివర్శిటీలలోనే నాణ్యతా ప్రమాణాలు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. బాగా బోధించే ప్రొఫెసర్లు లేక మనం సతమతమవుతుంటే....జిల్లాకో యూనివర్శిటీ అన్నది ఎంత మూర్ఖపు ఆలోచనో చెప్పలేం. పైగా సిబ్బందిని నియమించుకోవడానికి ఈ స్థానిక యూనివర్శిటీలకు నిధులు లేవు. సదుపాయాలూ లేక పంతుళ్లూ లేక యూనివర్శిటీ వాళ్లు కోర్సులను ఎలా నడుపుతారు?

ఈ నిర్ణయం వల్ల పిల్లలకు దీర్ఘకాలంగా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. యూనివర్శిటీ సెటప్ ఏర్పడింది కాబట్టి స్థానికంగా ఉన్న టీచర్లతో బండి నడుపుతారు...పిల్లలకు డిగ్రీలు ఇస్తారు. ఆ పిల్లలు అధిక సంఖ్యలో పోటీ పరీక్షల్లో దెబ్బతింటారు. దీన్ని పట్టించుకునే నాథుడే లేడు.

Monday, February 13, 2012

HM TV= High Morals Television: మూడో వార్షికోత్సవం

కపిల్ చిట్స్ వారి ఆధ్వర్యంలో, సీనియర్ మోస్ట్ ఎడిటర్ కె.రామచంద్రమూర్తి గారి నేతృత్వంలో నడుస్తున్న హెచ్ ఎం టీవీ ఫిబ్రవరి పన్నెండో తేదీన మూడో వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా కపిల్ అధినేత వామన రావుగారికి, మూర్తిగారికి, టీవీ సిబ్బందికి శుభాకాంక్షలు. ‌HM TV  అంటే High Morals Television అని ఛానల్ పేరు తెచ్చుకోవడానికి ఇందులో ప్రతి ఒక్కరూ ప్రయత్నించడాన్ని నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను.

కపిల్ చిట్స్ వారి ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం లో పనిచేస్తున్నా కాబట్టి...ఛానల్ గురించి రాయడం సొంత డబ్బా అవుతుందన్న అభిప్రాయంతో మనసును కట్టడి చేసుకుని ముగిస్తున్నాను. ఛానల్ లో డైనమిజమ్ పెరగాలనీ, మిగిలిన ఛానల్స్ కూడా విలువలకు ప్రాధాన్యమివ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ నిర్వహించిన దశ-దిశ అనే కార్యక్రమం సంచలనం సృష్టించింది. డిసెంబరు 21, 2009 నాడు (
నేను ఐ.ఎస్. జే.లో చేరకముందు) ఒక పక్కన దశ-దిశ కార్యక్రమం జరుగుతుండగానే నేను రాసిన పోస్టు "దశ-దిశ కోసం hm-tv యత్నం..భేష్!" మరోసారి చదవండి.

Saturday, February 11, 2012

టీచర్ల కోసం NCTE వారి "Code of Professional Ethics"

నా స్కూలు జీవితాన్ని ఛిద్రం చేశారని నేను భావిస్తున్న ఇద్దరు నీచ్ కమీనే బేవార్స్ టీచర్లను కేంద్రంగా చేసుకుని నిన్న నేను రాసిన టపాకు మిశ్రమ స్పందన లభించింది. ఒకరిద్దరు సీనియర్ జర్నలిస్టులు ఫోన్ చేసి తామూ టీచర్ల బాధితులమేనని చెప్పారు. కొందరు మిత్రులు మాత్రం...విషయాన్ని గురించి కాకుండా....నాకు సంబంధించిన శారీరక, మానసిక, సైద్ధాంతిక విశ్లేషణలు చేసి, కొన్ని బ్లాంకెట్ స్టేట్ మెంట్లతో కామెంట్లు పంపారు. మర్యాదస్థులు అనుకున్నవారికి ఇక్కడే సమాధానమిచ్చాను. మరి కొందరికి జవాబివ్వడం కూడా వేస్టని ఆ కామెంట్లే పెట్టలేదు. ఇక్కడ మీకో మనవి.

అయ్యలారా...అమ్మలారా....గుండెలో గూడుకట్టుకున్న వేదనను వెళ్లగక్కే క్రమంలో పదాల, వాక్యాల రూపు సంతరించుకుంటున్న భావ పరంపరను మర్యాద అనే ఫిల్టర్లో వడపోసి సర్వ్ చేయడం.... ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ కు మంచి వేదికని నేను భావిస్తున్న నా ఈ బ్లాగ్ లో కుదరదని మీ అందరికీ మనవి.  అంత సాఫ్టుగా రాసుకోవాలనుకుంటే నిన్నటి పోస్టుకు నగిషీలు దిద్ది ఏ తెలుగు పత్రికైనా వేసుకునేలా రాసేవాడిని. రాచిరంపాన పెడుతున్న అత్తగారిని కోస్తా కోడలు తిట్టదలిచినా...."అత్తగారూ...మీరు దొంగ ముండ గారండీ..." అంటుందట. బ్లాగులో అది మన వల్ల కాదు. క్షమించాలి.

అంతగా బాధపడుతున్న మర్యాదస్థుల కోసం, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ ధ్యేయంగా పెట్టుకుని నా ఉద్వేగాల గురించి బాధ పడుతున్న వారి కోసం ఈ కింది సమాచారం. 
తల్లి, తండ్రి తర్వాత భారతీయ సమాజం గురువుకు అంత ప్రాధాన్యమిచ్చింది. గురువంటే దేవుడు. అందుకే గురు దేవో భవ అన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు ఒకటి రెండు మాటలన్నా, చేయి చేసుకున్నా, గోడకుర్చీ, కోదండం వేయించినా పెద్దగా స్పందించడం మంచిది కాదు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు స్కూల్ టీచర్ల కోసం "Code of Professional Ethics" ను అమలు చేయాలని భావిస్తున్నారు. వారి ముసాయిదా పత్రంలో టీచర్ల ప్రవర్తనకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
Preamble
--Recognizing that every child has a fundamental right to education of good quality

--Recognizing that every child has an inherent potential and talent
--Recognizing that education should be directed to the all-round development of the human personality
--Recognizing the need for developing faith in the guiding principles of purity, viz., democracy, social justice and secularism

--Recognizing the need to promote through education the concept of composite culture of India and a sense of national identity
--Recognizing that teachers, being an integral part of the social milieu, share the needs and aspirations of the people
--Recognizing the need to enhance self-esteem of teachers

Obligation towards student

--Treats all students with love and affection
--Respects the value of being just and impartial to all students irrespective of their caste, creed, religion, sex, economic status, disability, language and place of birth
--Facilitates students' physical, social, intellectual, emotional, and moral development
--Respects basic human dignity of the child in all aspects of school life

--Makes planned and systematic efforts to facilitate the child to actualize his/her potential and talent
--Transacts the curriculum in conformity with the values enshrined in the Constitution of India
--Adapts his/her teaching to the individual needs of the students

--Refrains from subjecting any child to fear, trauma, anxiety, physical punishment, sexual abuse, and mental and emotional harassment
--Keeps a dignified demeanour commensurate with the expectations from a teacher as a role model
---------------
Note: మిత్రులారా...నేను ఒక రెండు రోజులు తిరుపతి టూరుకు వెళుతున్నాను. మంగళవారం నాడు కలుద్దాం. అంతవరకూ సెలవ్. నమస్కారం.

Friday, February 10, 2012

కిరాతకపు టీచర్లారా...మా పూవులను చిదిమేస్తారా?

చిన్నప్పుడు స్కూల్లో ఇంగ్లిషు, లెక్కల టీచర్ల వల్ల నేను ఎంత నరకం అనుభవించానో, జీవితంలో ఎంత కోల్పోయానో....నిన్న చెన్నై లో స్కూలు క్లాసు గదిలో ఒక స్టూడెంట్ చేతిలో హత్యకు గురైన టీచర్ ఉదంతం గురించి పేపర్లో చదువుతుంటే గుర్తుకువచ్చాయి. పిల్లల జీవితంలో టీచర్లు, సార్ల కున్న ప్రాధాన్యాన్ని సమాజం, జనం సరిగా గుర్తించలేదని, ఇది మున్ముందు మరిన్ని ప్రమాదాలు తేబోతున్నదని నాకు గట్టిగా అనిపిస్తున్నది.

నేను ఖమ్మం జిల్లా రెబ్బవరం గ్రామంలో ఏడో తరగతి దాకా, తర్వాత వైరాలో పది దాకా చదివాను. మా ఇంగ్లిషు సారు పేరు పాండురంగారావు గారు. రెబ్బవరం పక్కనే ఉన్న మా అమ్మమ్మ గారి ఊరు గొల్లపూడి నుంచి వచ్చి ఆయన పాఠాలు చెప్పేవారు. తమ గ్రామంలో పోలీస్ పటేల్ గా పనిచేసి చనిపోయిన మా తాతయ్య గారంటే ఆయనకు ఎందుకో గౌరవం, కోపం ఉండేవి. నాకు తెలిసి మా తాతకు మంచి పేరుంది. జనాలు పోలీసుల జులుంకు గురికాకుండా, పేదల పట్ల సానుభూతితో ఉండేవారు. రజాకార్లు దాడికి వస్తున్నారని తెలిసి పొరుగున ఉన్న కృష్ణా జిల్లాకు వెళ్లి తలదాచుకున్నారు.


నాకు చిన్నప్పుడు రెబ్బవరంలో ట్యూషన్ చెప్పిన కుసుమ మేడమ్ వల్ల ఇంగ్లిషు పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఈ పాండురంగారావు చేతిలో పడిన తర్వాత నా బతుకు బస్టాండయింది. దరిద్రుడు రోజూ క్లాసులో తిట్టే వాడు. మా తాత ప్రస్తావన తెచ్చేవాడు. వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే చెయ్యిని దొప్ప లాగా ముడిచి ఒంగబెట్టి వీపు మీద  కొట్టేవాడు....చాలా కసిగా. అందుకే వాడికి "దొప్పడ రంగారావు" అని పిల్లలు ముద్దుపేరు పెట్టారు. శ్రద్ధగా పాఠం విననిచ్చేవాడు కాదు, మధ్యలో దేని గురించి అడిగి కొడతాడో అని వణికి చచ్చేవాడిని. పైగా ఒక క్రీడాకారుడిగా, మంచి స్పీకర్ గా, నటుడిగా ఒక గుర్తింపు ఉన్న నాకు దప్పడ రంగారావు ధోరణి అస్సలు మింగుడుపడేది కాదు. అందుకే సాధ్యమైనంత మేర వాడి క్లాసు ఎగ్గొట్టే వాడిని. దాంతో ఇంగ్లిషు చంకనాకి పోయింది, నేను బేవార్సుగా మిగిలాను కొత్తగూడెంలో ఒక మిత్రుడు దొరికేవరకూ.

చెన్నైలో పిల్లవాడు టీచర్ మీద చేసిన అఘాయిత్యం దప్పడ రంగారావు మీద చేయాలని నేను చాలా సార్లు అనుకున్నాను. వాడి వల్ల నా జీవితం దెబ్బతింటున్నదని నాకు అపుడే తెలుసు. చాలా సార్లు ఫిర్యాదు చేసినా ఇంట్లో వాళ్లు  పెద్దగా పట్టించుకోలేదు. అందుకే, వాడు స్కూటర్ మీద వైరా నుంచి గొల్లపూడి వెళుతున్నపుడు మధ్యలో రోడ్డుకు అటూ ఇటూ ఉన్న రెండు చెట్లకు కనిపించని ఒక వైరొకటి అడ్డంగా కట్టి దానికి తట్టుకుని వాడుపడిపోగానే తల మీద పెద్ద బండరాయి వేసి చంపి...మర్నాడు ఏమీ తెలియని వాడిలా స్కూలుకు వెళ్లాలని నాకు చాలా సార్లు అనిపించింది. అప్పట్లో వచ్చిన ఏదో సినిమాలో ఒక హత్య అలాగే జరిగింది మరి. అదీ మరీ బాగోలేదు కాబట్టి, వాడి బండి టైరుకు దబ్బనంతో పంక్చర్ చేసి వాడిని ఇబ్బంది పెట్టాలని అనిపించేది కానీ దొరికితే పరువుపోతుందని, శిక్ష పడుతుందని ఆగిపోయాను. ఒక టీచర్ నా జీవితాన్ని మార్చేశాడు. నేను ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది.

ఇంకొక నికృష్టపు సారు రెబ్బవరం ప్రభుత్వ పాఠశాలలో లెక్కల సారు సోమనర్సయ్య గారు. వాడికి కోపం వస్తే జస్టర్ ముండా కొడకా అని తిట్టే వాడు. నేను పశువుల డాక్టర్ గారి అబ్బాయిని కాబట్టి, క్లాసు ఫస్టు కాబట్టి నాకు పెద్దగా తిట్లు గట్రా ఉండేవి కావు. కానీ ఆ సారు దగ్గరు ఒక తుపాకీ ఉండేది. సాయంత్రం కాగానే ఒకరిద్దరు స్టూడెంట్స్ ను తీసుకుని బైటికి వెళ్లే వాడు. ఆయన పిట్టలను గురిచూసి కాల్చితే...చచ్చి కిందపడిన పిట్టలను ఏరుకు రావడం ఆ పిల్లల పని. నన్ను ఒక రోజు తీసుకువెళ్లిన గుర్తు. ఆ రోజంతా నేను నిద్రపోలేకపోయాను. సారు వారి ఈ మారణకాండను ఆపే వారెవరూ లేరా అని చాలా బాధపడేవాడిని. ఎందుకో మా నాన్నకు తెలిసినా దాన్ని పట్టించుకోలేదు. 


ఇదిలా ఉండగా, మా రెబ్బవరం గ్రామానికి రేషన్ షాపు మా అమ్మమ్మ గారి ఊరైన గొల్లపూడిలో ఉండేది. రేషన్ కార్డు మీద పంచదార తెచ్చేపని (ఆరో తరగతిలో అనుకుంటా) నాకు అప్పగించాడాయన. రేషన్ కార్డు, డబ్బు చెల్లింపు బాధ్యత నాది. మోసే బాధ్యత చాకలి వెంకటేశ్వర్లు ది (పాపం...వాళ్లు బట్టలు ఉతుకుతారు కాబట్టి ఆ పేరుతోనే వాడిని పిలిచేవారు).
కాల్వగట్టు మీద పొలాల మధ్య గుండా ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచివెళ్లి చక్కెర తెచ్చే బాధ్యత మా ఇద్దరిదీ. దరిద్రుడు...స్కూలు టైమ్ లోనే ఆ పనికి పంపాడు. అంతా బాగానే అయింది కానీ ఇంకాసేపటికి సార్ ఇంటికి వస్తామనగా మా వెంకటేశ్వర్లు నెత్తిమీద ఉన్న చక్కెర సంచీ జారి కిందపడింది. అపుడు వెంకటేశ్వర్లు పడిన కంగారు, వాడి మొహంలో వెర్రిభయం నాకు ఇప్పటికీ గుర్తు. "భయపడకు...ఇది నీ ఒక్కడి తప్పు కింద కాకుండా ఇద్దరం కలిసి చేసిన తప్పుగా చెబుదామ"ని ఒకసారి అసలు "ఇది కింద పడ్డట్టే చెప్పకుండా ఉంటే పోలా" అని మరొకసారి అనుకున్నాం. ప్లాన్ బీ అమలు చేయడంలో భాగంగా కింద పడిన చక్కెరను జాగ్రత్తగా సంచీలోకి ఎత్తాం. దాన్ని సార్ ఇంటికి చేర్చి స్కూలుకు పోయాం. 


అప్పుడు సారు మా క్లాసులో ఉన్నారు. చక్కెర తెచ్చామన్న విషయం చెప్పగానే..."వెరీ గుడ్...చూడండ్రా వీళ్లు చెప్పిన పని జాగ్రత్తగా చేసుకొచ్చారు...డాక్టర్ గారి అబ్బాయి చాకు..." అని సారు కితాబు ఇవ్వగా నేనూ వెంకటేశ్వర్లు ఒకరి మొహం ఒకరం బెరుకు బెరుగ్గా చూసుకున్నదీ నాకు ఇప్పటికీ గుర్తే.
సరే...క్లాసు అయింది. సార్ ఇంటికి వెళ్లాడు. చక్కెర రంగు తేడా ఉండటంతో విషయం కనిపెట్టాడు. మర్నాడు...క్లాసుకు రాగానే..."ఏర్రా...ఆ జెస్టర్ ముండాకొడుకుల"ని మా గురించి వాకబు చేశాడు. సార్ కనుక్కోలేదని గట్టిగా నమ్మి క్లాసుకు వచ్చిన మేము అణుబాంబు మీద పడినట్టు ఉలిక్కిపడి...లేచి తప్పు ఒప్పుకున్నాం. ఒప్పందం ప్రకారం...తప్పు ఇద్దరిదీ అని చెప్పాం. ఇక ఆ రోజు నుంచి క్లాసులో నరకం ప్రారంభమయింది. రోజూ...జెస్టర్ ముండాకొడుకులంటూ తిట్టి పాఠం మొదలు పెట్టేవాడు కఠినాత్ముడు. ఈ అవమానం భరించలేక నేనూ వెంకటేశ్వర్లు...లెక్కల క్లాసు ఎగ్గొట్టి ఊరికి దగ్గర్లో రోడ్డుపక్క చెట్ల మీద గిన్నెకాయలు రాళ్లతో కొట్టి తినేవాళ్లం. అలా లెక్కలూ మఠాష్. నేను పదో తరగతి లెక్కల సబ్జెక్టులో ఎలా పాసయ్యానో చెబితే మీరు ఆశ్యర్యపోతారు.
 డాక్టర్ కావాలని మా అమ్మ కన్న కలలు, అయితీరతానని చిన్నపుడు నేనిచ్చిన మాట...ఈ దరిద్రుల వల్ల సఫలం కాలేదని నా నమ్మకం. లెక్కల్లో వీక్ అయి పోవడంతో మిగిలిన సబ్జెక్టులూ గుండె ధైర్యంతో చేయలేక...ఎంసెట్ లో కొన్ని వేల ర్యాంకులు వచ్చి సీటు రాకుండా పోయింది.
ఈ విధంగా స్కూలు టీచర్ల ప్రభావంతో ఎంతో కోల్పోయిన నేను కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాను.


1) నా కూతురు, కొడుకుతో టీచర్ల గురించి వాకబు చేస్తాను. ఎవరైనా హర్ట్ చేస్తుంటే వెంటనే స్పందిస్తాను. నల్గొండలో ఒక తెలుగు సారు మా అమ్మాయిని కొడితే చెయ్యి వాచింది. నేను స్కూలుకు వెళ్లి వాడికిచ్చిన డోసు వాడికి జీవితంలో గుర్తుంటుంది. వాడి చెంప పగలగొట్టబోయి తమాయించుకుని ఆగాను...మనసు గట్టిగా చెప్పడంతో. ఇంకెవర్నీ కొట్టవద్దని వాడిని ప్రాధేయపడుతూ...ఒక గంట పాటు నేను ఏడిస్తే ప్రిన్సిపాల్ కంగారుపడ్డాడు. అలాగే ఆటల కారణంగా ఫిదెల్ అప్పుడప్పుడూ మాత్రమే స్కూలుకు వెళ్లాడా మధ్యన. ఒక టీచర్ "నువ్వేమైనా వీ.ఐ.పీ.వా..." అని అడిగి కించపరచడం మొదలు పెట్టింది. ఆమెనూ జాగ్రత్తగా సెట్ చేశాను. మొన్నటికి మొన్న నా స్నేహితుడి కొడుకును లెక్కల టీచర్ కొడితే...గౌతమ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి..పేపర్ వాళ్లు మీ టీచర్ కిరాతకత్వం గురించి అడుగుతున్నారని అబద్ధంతో బెదిరించాను
2) దాదాపు ట్రబుల్ సమ్ టీచర్లందరినీ కలిసి...నాకు మార్కులు వద్దనీ, మా పిల్లలకు జీవితపు విలవలు నేర్పండనీ, సృజనాత్మకతను చంపవద్దని చాలా పకడ్బందీగా చెప్పివస్తాను. మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే...అటు టీచర్ హర్ట్ కాకుండా, ఇటు మన వార్డ్ బలికాకుండా ఉండాలి. చాలా కసరత్తు అవసరం.

3) గురుదేవో భవ..., దండం దశగుణం భవేత్..అనే సొల్లు సామెతలు నమ్మకండి. ఇవి కలికాలానికి అతకని మాటలు. ఎవరైనా సార్ లేదా టీచర్ పిల్లల మీద చేయి చేసుకుంటే వెంటనే స్పందించండి. కంప్లయింట్ చేయడం వల్ల మిగిలిన టీచర్లు గ్యాంగప్ అవుతారు కాబట్టి స్వయంగా వెళ్లి నేరుగా ఆ కిరాతకులతోనే మాట్టాడటం ఉత్తమం
4)  హత్యలు, ఆత్మ హత్యలు వాటిలో రకాల గురించి మన టీవీలూ ఛానళ్లు పదేళ్ల వయస్సు దాటిని ప్రతొక్కరికీ నేర్పాయి. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు కాబట్టి...పిల్లల ప్రవర్తనను జాగ్రత్తగా గమనించాలి. పిల్లలు బాగా డిస్ట్రబ్డ్ గా అనిపిస్తే...ఆ రోజు స్కూలు మాన్పించటం ఉత్తమం. పిల్లలు హాయిగా ఇంట్లో ఉండి నిద్రపోతే ఎంతో రిఫ్రష్ అవుతారు. మనతో మనసు విప్పి మాట్టాడతారు.


5) స్కూలుకు పోతేనే చదువు వస్తుందని అనుకోవడం మన మూర్ఖత్వం. తల్లో తండ్రో జాగ్రత్తగా పాఠాలు చెప్పినా చాలు. లేదా కథలు చెప్పినా పర్వాలేదు. 

6) బందులు జరగాలి మళ్లీ మళ్లీ...అని పిల్లలు అనుకుంటున్నారంటే వారి మీద ఏదో ఒత్తిడి పనిచేస్తున్నదనే అర్ధం. ఒక ఫ్రెండ్ లా వారితో మాట్టాడితే...వాళ్లు ఎన్నో చక్కని విషయాలు చెబుతారు. చదువు ప్రాధాన్యం చెబుతూనే వారు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం ఇవ్వాళ ప్రతి పేరెంట్ విధి.
 7) టీచర్లారా...మీ  వ్యక్తిగత జీవితంలో కంగాళీతనంతో వచ్చిన నిస్పృహను పిల్లల మీద తీర్చుకోవాలని అనుకోకండి. A tap on their back works wonders. 


ఇప్పటికే ఓవరయింది. ఉంటాను. చెన్నైలో టీచర్ ను కిరాతకంగా చంపిన పిల్లవాడిని కలిసి కాసేపు మాట్టాడాలని నా మనస్సు కోరుకుంటోంది. బిడ్డడు...ఎంత నిస్పృహతో ఆ పనిచేశాడో కదా! 

Tuesday, February 7, 2012

చార్లెస్ డికెన్స్ 200 వ జయంతి-ఒక రెండు పేరాలు

ఇవ్వాళ సమయం చిక్కక మిగిలిన పేపర్లు, ఛానళ్లు చూడలేదు కానీ అటు "ది హన్స్ ఇండియా" ఆంగ్ల పత్రికా, ఇటు "హెచ్ఎం టీవీ" రెండూ అద్భుత రచయిత చార్లెస్ డికెన్స్ రెండు వందలో జయంతి సందర్భంగా చక్కగా స్పందించాయి. హైదరాబాద్ హన్స్ లో Outliving the Information Age అనే శీర్షికతో ఒక మంచి వ్యాసాన్ని రాశారు. చానల్ లోనూ మంచి కాపీతో కూడిన ప్రోగ్రాం ను ప్రసారం చేశారు. ఇది నాకు బాగా నచ్చింది. వసివాడిన బాల్యం, మానవీయ విలువలు, దోపిడీ వ్యతరేక గళం డికెన్స్ సొంతం. 
 
ఫ్రెంచి విప్లవం నేపథ్యంలో...పారిస్, లండన్ ల మధ్య సాగిన "ద టేల్ ఆఫ్ టూ సిటీస్" అనే నవల ఇంట్రో నాకు చాలా చాలా ఇష్టం. మన మాటలతో, వాక్యాలతో పాఠకుల మనోఫలకాలపై దృశ్యకావ్యాలను ఎలా నిర్మించాలన్న దానికి నేను ఈ నవలలో మొదటి రెండు పేరాలను ఉదాహరణగా చెబుతుంటాను...నా జర్నలిజం విద్యార్థులకు. డికెన్స్ జయంతి సందర్భంగా ఆ రెండు పేరాలూ మీరూ చదివి ఆనందించండి. రెండు వైరుధ్యాలను ఎంత చక్కగా వర్ణించాడో...

It was the best of times, it was the worst of times, it was the age of wisdom, it was the age of foolishness, it was the epoch of belief, it was the epoch of incredulity, it was the season of Light, it was the season of Darkness, it was the spring of hope, it was the winter of despair, we had everything before us, we had nothing before us, we were all going direct to Heaven, we were all going direct the other way--in short, the period was so far like the present period, that some of its noisiest authorities insisted on its being received, for good or for evil, in the superlative degree of comparison only.

There were a king with a large jaw and a queen with a plain face, on the throne of England; there were a king with a large jaw and a queen with a fair face, on the throne of France. In both countries it was clearer than crystal to the lords of the State preserves of loaves and fishes, that things in general were settled for ever.

Courtesy: http://www.online-literature.com/
(Note: Please visit this wonderful site for English literature) 

Sunday, February 5, 2012

మౌనపు రోజున...మీ కోసం ఒక మంచి ఇంగ్లిషు కవిత

ప్రతి నెలా ఐదో తేదీన రోజంతా మౌనం పాటించాలన్న స్కీము ప్రశాంతంగా సాగడం వల్ల...ఒక వ్యాసం రాయడానికి, కొంత చదవడానికి టైం చిక్కిందీ రోజు. చింతలబస్తీ మార్కెట్ లో గోంగూర, కొత్తమీర కొనేప్పుడు, బస్సులో కండక్టరుతో, కాలేజీలో సందేహాల నివృతికి నా గదికి వచ్చిన ఒక ఇద్దరు విద్యార్ధులతో, ఆఫీసు బాయ్ తో ఒకటి రెండు మాటలు తప్ప బండి బాగానే నడుస్తున్నది. తీరిక దొరికింది గదాని...సిగ్గూ ఎగ్గూలేకుండా రెచ్చిపోతున్న ఐ.ఎ.ఎస్. అధికారుల మీద వె‍య్యి పదాల వ్యాసం ఒకటి రాసి దాన్ని రెండు రకాల కథనాలుగా మలిచి రెండు దిన పత్రికలకు పంపాను.
తర్వాత తీరిగ్గా ది హిందూ చదువుతుంటే...ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ గారి వ్యాసం ఓపెన్ పేజీలో దొరికింది. తన వ్యాసంలో ఆమె విలియం హెన్రీ డేవిస్ రాసిన లీజర్ అనే పోయమ్ ను ప్రస్తావించారు. దాన్ని గూగుల్ దేవుడి సహాయంతో వెతికి చదివితే బాగుందనిపించింది. ఆ కవిత మీ కోసం...

Leisure

What is this life if, full of care,
We have no time to stand and stare.

No time to stand beneath the boughs
And stare as long as sheep or cows.

No time to see, when woods we pass,
Where squirrels hide their nuts in grass.

No time to see, in broad daylight,
Streams full of stars, like skies at night.

No time to turn at Beauty's glance,
And watch her feet, how they can dance.

No time to wait till her mouth can
Enrich that smile her eyes began.

A poor life this is if, full of care,
We have no time to stand and stare

Friday, February 3, 2012

హమ్మయ్య...ఎట్టకేలకు విజయ దాహం తీరింది ...

ఓడిపోయి...దారుణంగా ఓడిపోయి..ఘోరంగా ఓడిపోయి...భారతీయ క్రీడాభిమానులను అవమాన భారంతో ముంచెత్తిన భారత క్రికెటర్లు ఎట్టకేలకు విజయం రుచి చూశారు. రెండో టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఆటలో అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబరిచి ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచారు. ఇవ్వాళ భారత్ గెలిచి ఉండకపోతే....క్రికెట్ పిచ్చోళ్లు నిజంగా పిచ్చోళ్లయిపోయేవారే. చివరి ఓవర్లో జనాల నరాలు తెగే పరిస్థితి దాపురించింది.
ఈ ఆట ద్వారా భారత్ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఉంది. బ్యాట్ తో బండకొట్టుడు కొట్టడం వల్ల గెలుస్తామనుకుంటే కష్టం. ఇవ్వాళ గెలిచింది...కేవలం అద్భుత ఫీల్డింగ్ వల్ల. విమర్శల జడివానలో తడిసి జడిసుకున్న కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ కీపర్ గా, బ్యాట్స్ మ్యాన్ గా రాణించడం వల్ల.
ఈ దూరదర్శన్ లైవ్ గొడవేంట్రా బాబూ...

అయితే...ఇవ్వాళ్టి మ్యాచ్ ను దూరదర్శన్ లో చూసిన వారికి చీరాకెత్తి ఉంటుంది. దృశ్యం కన్నా ముందు శ్రవణం వినిపించి విసిగించింది. బౌలర్ బాల్ వేయకముందే బ్యాట్స్ మ్యాన్ ఏమి చేశాడో కామెంటేటర్ చెబుతున్నాడు. అక్కడేదో టెక్నికల్ సమస్య ఉన్నట్టుంది. స్టూడియోలో చర్చలో కూడా తేడా ఉంది. అన్ని ఛానళ్లు...టెక్నికల్ గా అద్భుతమైన నాణ్యమైన ప్రసారాలు అందిస్తుంటే మన డీడీ వ్యవహారం ఇట్టా ఏడ్చింది. మొత్తం మీద ఈ విజయంతో క్రీడాభిమానుల కన్నీటి సంద్రానికి అడ్డుకట్ట పడింది. ఏమంటారు?
***********************************

Phone numbers please...

‍నోట్...మొబైల్ ఫోన్ పోవడం వల్ల నా దగ్గరున్న నంబర్లన్నీ పోయాయి. నాకు సన్నిహితులైన, హితులైన బ్లాగర్లు మీ ఫోన్ నెంబర్లు నాకు మెయిల్ చేయండి, ప్లీజ్. మా సంస్థ వారు నా పాత నెంబర్ ను పునరుద్ధరించారు కాబట్టి మీరు నాకు ఒకసారి ఫోన్ చేసినా బాగానే ఉంటుంది.

..రాము

Wednesday, February 1, 2012

"భారత్ గెలిస్తే దిసమొల (naked)తో డాన్స్ చేస్తాం"

భారత్, ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీలో మొదటి టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ చివరి ఓవర్ ముగియగానే...వీక్షకుల్లో ఒకడు...ఒక ప్లకార్డు పట్టుకుని ఉరుకుతూ కనిపించాడు. అప్పటికే ఆస్ట్రేలియా తుక్కురేగకొట్టి...ఇరవై ఓవర్లలో  కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఆ ప్లకార్డు మీద ఈ కింది మాటలున్నాయి:

If India wins...we will dance naked. 

భారత్ చచ్చినా గెలవదన్న ధీమా ఇందులో కనిపించింది. ప్రపంచ ఛాంపియన్లం జనాలకు ఎంత చులకనై పోయాం.  టెస్టు సిరీస్ లో భారత్ ఘోర పరాజయం పొందటంతో మనోళ్ల మీద ధీమా ఏర్పడి ఆస్ట్రేలియన్ క్రీడాభిమాని ఈ ప్లకార్డు దుస్సాహసం చేశాడు. దీన్ని మనోళ్ల వమ్ము చేసి ప్ల కార్డు వీరుడి బట్టలూడతీస్తారో...లేక...తస్సుమనిపిస్తారో ఇంకొన్ని గంటలు వేచిచూడాలి.
మొన్నీ మధ్య అబుదాభిలో ఇంగ్లండ్...పాకిస్థాన్ ల మధ్య టెస్టు మ్యాచు జరుగుతుంటే...ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ప్రస్తుత కామెంటేటర్ అయిన బాయ్ కాట్ ఇలాగే ఒక కూత కూసి దొరికిపోయాడు. ఈ టెస్టు మ్యాచ్ లో మా జట్టు ఓడిపోతే...నాకున్న మూడు ఇళ్లూ అమ్మిపారేస్తా...అని స్టేట్ మెంట్ ఇచ్చాడు...పరమ ధీమాతో. కానీ నాలుగో రోజు పాకిస్థాన్ ను అల్లా కరుణించి ఇంగ్లండ్ ను 72 పరుగుల తేడాతో మట్టికరిపించాడు.
"I have lost all my houses, you stupid England team. I'm kidding but this was a terrible performance," అని బాయ్ కాట్ తర్వాత అన్నాడట. ఈ వ్యవహారం ఎలా ఉన్నా...భారత్ జట్టు కనీసం టీ ట్వంటీ పోటీల్లో అయినా ఇంగ్లండ్ మీద గెలవకపోతే...అక్కడ నగ్న డాన్సుల సంగతేమో గానీ...ఇక్కడకు రాగానే భారతీయ క్రికెటర్ల బట్టలూడేలా కొట్టేట్టున్నారు...క్రికెట్ పిచ్చోళ్లు.