Sunday, April 29, 2012

హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల Vantage

నేను విజిటింగ్ ఫాకల్టీ గా ఉన్న హైదరాబాద్ యూనివర్సిటీ లో ప్రతి ఏడాది నా విద్యార్థులు రెండేళ్ళ కోర్సు పూర్తి చేసే ముందు ఒక మాగజీన్ తెచ్చే సంప్రదాయాన్ని నేను ఒక మూడేళ్ళ కిందట ప్రవేశ పెట్టాను. దీని పేరు వాన్టేజ్. ముచ్చటగా మూడో పత్రిక ఈ వారం తెచ్చాము. ఈ సారి హైదరాబాద్ మీద తెచ్చిన సంచిక ఇది. దాని కాపీలతో విద్యార్థులూ, మేము కమ్యూనికేషన్ డిపార్టుమెంటు ముందు ఇచ్చిన పోజు ఇది. హృదయ రంజన్, స్వయంసిద్ధ మిశ్రా, దివ్యా చౌదరి, ప్రియాంకా ప్రవీణ్ అనే చురుకైన పిల్లలు దీనికి ఎడిటర్లుగా వ్యవహరించారు. రహూఫ్, సంశీర్ అనే కేరళ పిల్లలు మంచి ఫోటోలు అందించారు. 

జర్నలిజం పిల్లలు తెచ్చే ఇలాంటి పత్రిక దేశం లో ఏ యూనివెర్సిటీ లో లేదని మిత్రులు అంటారు. మీకు కాపీలు కావాలంటే నాకు రాయండి.
  

Saturday, April 21, 2012

సారా దునియా....పూరా....PR భాయ్...

(నేడు జాతీయ పౌర సంబంధాల దినోత్సవం)
ఈ మధ్యనే ఒక హిందీ సినిమా చూశాను. పేరు గుర్తు లేదు. మందు కొట్టకుండా...శీలం కోల్పోకుండా...మోడలింగ్ రంగంలో రాణించాలని అనుకునే ఒక ముద్దుగుమ్మకు కారులో పోతూ లిప్ స్టిక్ రాసుకుంటూ ఒక సీనియర్ మోడల్ అద్భుతమైన విషయం చెబుతుంది. వెయిట్ ఫర్...సహీ వఖ్త్...సహీ ఆద్మీ...సహీ పీ.ఆర్.  

ఆ డైలాగ్ వినగానే...ఆణిముత్యంలా అనిపించి ఆ మాటలను, సినిమా పేరును ఒక పేపర్ మీద రాసుకున్నాగానీ అది ఎక్కడో పోయింది. ఇందులో మొదటిది (సహీ వఖ్త్) మనకున్న అదృష్టాన్ని బట్టి ఉంటుంది. నసీబ్ బాగోలేకపోతే...ఎంత బాగా పనిచేసినా విలన్లమయిపోతాం. మనకు జీవితంలో చాలా సార్లు చేదే ఎదురవడానికి ఈ వఖ్తే కారణం. అందుకే...ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ ఓన్ డే అనీ...ఉందిలే మంచి కాలమ్ ముందు ముందున...అంటుంటారు ఆశాజీవులు. మనుషులుగా మన టైం కోసం మనం ఎదురుచూడటం తప్ప మనమేమీ చేయలేం. అంతదాకా...టైం బాగోలేదు బ్రదర్...అని నలుగురికి చెబుతూ బతకడమే. నాకు కూడా ఒక వారం రోజుల నుంచీ టైం బాగోలేదు. 
 
ఇక రెండోది సహీ ఆద్మీ. ఇక్కడ మనం తెలివిగా వ్యవహరించాలి. ప్రతొక్కడితో గొడవలు పెట్టుకుంటే పనికిరాకుండా పోతాం. ఎవడు ఎలా ఎదుగుతాడో, ఎవడికి ఎంత పలుకుబడి ఉంటుందో చెప్పలేం గదా. నేను పనిచేస్తున్న వ్యవస్థలో ఒకే ఒక ఆద్మీ తనను పొగిడేవాళ్లను, తన ప్రతిభను చాటేవాళ్లను, తనకు ఇతరుల మీద పితూరీలు చెప్పేవాళ్లను ఎన్ని తీరాలకు తీసుకుపోతున్నాడో చూస్తే ఆశ్చర్యమేస్తున్నది. పొగిడేవాళ్లు, బాకా ఊదేవాళ్లు, చాడీలు చెప్పేవాళ్లను నమ్మకూడదన్న కనీస భావం కూడా మన సారుకు లేకపోవడం నిజంగా వింతే. నిజానికి ఏవడో ఒక ఆద్మీని నమ్ముకుని బతకడం ఆత్మాభిమానం ఉన్నవాళ్లకు కష్టమైన పని. వాడు చేసే ప్రతి చెత్త పనినీ ఎలా ఆమోదిస్తాం...చెప్పండి. ఆ ఆద్మీ చేసే సవాలక్ష తుక్కు పనులను ఆహో...ఓహో...అని పొగడాలంటే ఆత్మ ఉండకూడదు. ఇలాంటి అమాం బాపతుగాళ్లు అన్ని రంగాల్లో కన్నా జర్నలిజంలో ఎక్కువగా ఉంటున్నారు. 

ఇక మూడోది సహీ పబ్లిక్ రిలేషన్. చాలా మంది ఉద్యోగులు రోజూ కుంగిపోవడానికి ప్రధానంగా ఇదే కారణం. పి.ఆర్. ఒక అద్భుత విద్య, కళ. పండగలూ, బర్త్ డేలూ, చావులూ, పెళ్లిళ్లూ...ఒకటేమిటి పీ.ఆర్. జీవికి ప్రతి సందర్భమూ ఒక వరమే. పీ.ఆర్. లో భాగంగా వాటిని వాడుకుని బాసును పట్టేయవచ్చు. నేను ఈనాడులో ఉండగా...ఒక జూనియర్ ఒకనాడు బియ్యపు గింజపై రామోజీరావు అనే పేరు చెక్కించి తెచ్చి చూపించాడు. ఇది మన లెక్క ప్రకారం కాకాపట్టడం కిందకు వస్తుంది. అలాంటివి మనం చేయం. కానీ...ఆ రోజు రామోజీరావు బర్త్ డే అని తెలుసుకుని వాడు అది తెచ్చి...సమయం చూసుకుని ఫిఫ్త్ ఫ్లోర్ కు వెళ్లి ఆయన్ను కలిసి అది ప్రజెంట్ చేసి వచ్చాడు. మరీ అద్భుతమైన బుర్రలేకపోయినా...సదరు జర్నలిస్టు ఆ తర్వాత ఈ టీవీలో మంచి పొజిషన్ కు పోయి...కాస్త కష్టపడి ఒక ఇంగ్లిషు న్యూస్ పేపర్లోకి వెళ్లి...తర్వాత సొంత జిల్లాలో ఒక ప్రముఖ దిన పత్రికలో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

ఎక్కడ పనిచేసినా...మనసులో అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పడం... దురద కొనితెచ్చుకోవడం మా సోదరులకు చాలా మందికి అలవాటు. ఇది చూసి మంచి పాఠాలు నేర్చుకుని రెండేళ్ల నుంచి నేను కూడా పండగలకు ఎస్ ఎం ఎస్ లు ఇవ్వడం, బాగోలేకపోయినా మీ ఆర్టికల్ బాగుందని పొగడటం లాంటి చీప్ ట్రిక్స్ చేయాలనుకుంటున్నా గానీ చాలా సార్లు మనసొప్పక ఆగిపోతున్నా. పది మంది పొట్టకొడుతూ బైటి ప్రపంచానికి అద్భుతమైన జర్నలిస్టులమని పోజిచ్చే వారి భజన ఎలా చేయగలం, చెత్త జర్నలిజం చేస్తూ గ్రూపులు పోషిస్తూ ఇతరులను పనికిరానివారిగా ముద్రవేసే వారిని ఎలా ఆకాశానికి ఎత్తగలం అన్న సందేహం చాలా మందిని పీడిస్తున్నది. ఇలాంటి సందేహ జీవులు జీవితాంతం నానా తంటాలు పడుతూనే ఉంటారు. అలాంటి సోదరులను ఓదార్చడానికి నా భుజం ఎప్పుడూ సిద్ధమే.  

ఇలాంటి సందేహాల గురించి మదనపడటానికి, తీరిగ్గా కూర్చుని పీ.ఆర్. విషయంలో ఒక వ్యూహం పన్నుకోవడానికే ఈ రోజు పౌర సంబంధాల దినోత్సవం జరుపుకుంటున్నారు. మీరు కూడా...గతాన్ని మరిచిపోయి మనశ్శాంతి కోసం, సొంత ప్రయోజనాల కోసం, పొట్ట కూటి కోసం, కుటుంబం కోసం, మంచి భవిష్యత్తు కోసం పీ.ఆర్. చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేం తప్పు కాదు. బాసులు నికార్సయిన యాస్ (గాడిద) లు. ఈ గాడిదల ముందుకు పోతే...మనకు తల పొగరనుకుంటాయి, వెనక ఉంటే కాలుతో తంతాయి. అందుకే...బాసులతో పెట్టుకోకుండా వారిని యాస్ లుగానే మనసులో ఊహించుకుంటూ మంచి ఎత్తుగడలతో బుట్టలో వేసుకుంటూ....అద్భుతమైన పీ.ఆర్.తో మీరంతా వెలుగొందాలని, సుఖశాంతులతో బతకాలని కోరుకుంటూ...హ్యాపీ నేషనల్ పీ.ఆర్. డే.  

Friday, April 13, 2012

పత్రికా విలేకరి ఉద్యోగం పాడు...పాడు...

వేగంగా మారిన కాలమాన పరిస్థితుల మధ్యన జర్నలిజం గొప్పదైన అతి చెత్త ఉద్యోగమని నాకు ఎప్పుడో బోధ పడింది. అక్షరం ముక్కరాని తిక్క వెధవల మధ్యన, మన బుర్ర పెరగడానికి ఉపకరించని బుర్ర తక్కువ చెత్తగాళ్ళ తో కలిసి రిపోర్టింగ్ చేయాల్సి రావడం దౌర్భాగ్యమని బోధపడి ఎకడమిక్స్ వైపు వచ్చాను. 

ఒక పాతిక ఏళ్ళ కిందట నేను చూసిన జర్నలిజం వేరు...ఇప్పుడు వేరు. అప్పుడేదో ప్రతిభావంతులు ఉన్నారని గానీ, అవినీతిపరులు లేరని గానీ కాదు. జనాలకు సేవ చేయాలన్న తపన విలేకరుల్లో కనిపించేది. చానల్స్ వచ్చాక పరిస్థితి మారి పోయింది. మీడియా అంటే జనం అసహ్యించుకుంటున్నారు. అమెరికా లో కెరీర్ కాస్ట్ అనే సంస్థ వెలువరించిన చెత్త ఉద్యోగాల జాబితాలో పత్రికల రిపోర్టింగ్ ఉంది. బాగా ఒత్తిడి ఉండే ఉద్యోగాలలో ఫోటో జర్నలిస్టు ఉద్యోగం ఉంది. ఇది బాధాకరమే అయినా జీర్ణించుకోక  తప్పని నిజం. విలేకర్లకిది నిజానికి ముళ్ళ ప్రపంచం.  Best, Worst, Most stressful jobs జాబితా మీ కోసం. 
  1. Software Engineer
  2. Actuary
  3. Human Resources Manager
  4. Dental Hygienist
  5. Financial Planner
  6. Audiologist
  7. Occupational Therapist
  8. Online Advertising Manager
  9. Computer Systems Analyst
  10. Mathematician


 Worst Jobs
  1. Lumberjack
  2. Dairy Farmer
  3. Enlisted Military Soldier
  4. Oil Rig Worker
  5. Reporter (Newspaper)
  6. Waiter/Waitress
  7. Meter Reader
  8. Dishwasher
  9. Butcher
  10. Broadcaster


  1. Enlisted Soldier
  2. Firefighter
  3. Airline Pilot
  4. Military General
  5. Police Officer
  6. Event Coordinator
  7. Public Relations Executive
  8. Corporate Executive (Senior)
  9. Photojournalist
  10. Taxi Driver
(Cartoon courtesy: http://inlandpolitics.com)
(Ramu photo by: S.Maitreyee)

Thursday, April 12, 2012

డెక్కన్ క్రానికల్ లో ఫిదేల్, తేజ ల మీద స్టొరీ

డెక్కన్ క్రానికల్ వారికి టేబుల్ టెన్నిస్ మీద ప్రేమ ఎక్కువ అయ్యింది. ఈ క్రీడలో ఆంధ్రప్రదేశ్   ఆడ పిల్లలు జాతీయ స్థాయిలో రాణిస్తున్నా, మగ పిల్లలు మాత్రం నేషనల్ రాంకింగ్ పొందలేకపొతున్నారు. మొట్ట మొదటి సారిగా ఫిదేల్ క్యాడేట్స్ విభాగంలో నేషనల్ నంబర్ ఫోర్ కాగలిగాడు. ఆ మాట రాయకుండా...వేరు వేరు మంచి విషయాలతో సాగిన డీ.సీ. స్టొరీ మీ కోసం. మా వాడి మంచి ఫ్రెండ్ సాయి తేజేష్ గురించి కూడా రాయడం సంతోషం కలిగించింది.

  

Tuesday, April 10, 2012

మీడియాలో నియామకాలు- కుల ప్రభావం


1998 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్ అఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎం.సీ.జే.) చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ లో భాగంగా 'ఈనాడు జర్నలిజం స్కూల్' కేస్ స్టడీ చేశాను. దళితులు, తెలంగాణా ప్రాంతం వారికి ఆ సంస్థలో ప్రాధాన్యత దక్కడం లేదని నా అధ్యయనం లో తేలింది. దగ్గరి నుంచి చూసిన వాడిగా అది ముమ్మాటికీ నిజమే అని నాకు తెలుసు.  అందుకే నేను చేసిన నియామకాల్లో ఎస్.సీ.లు, ఎస్.టీ.లు వున్నారు. వారు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆ అధ్యయనానికి 'ఉర్దూ అకాడమీ గోల్డ్ మెడల్' వచ్చిందనేది వేరే విషయం. అప్పటి నుంచీ మీడియాను కులం దృక్కోణం నుంచి చూస్తూ వస్తున్న నాకు నిన్న ది హిందూ లో వచ్చిన రాబిన్ జాఫ్రీ ప్రసంగ పాఠం Missing from the Indian newsroom చదివాక పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. 

సమాజంలో కులం ఉంది, మీడియాలో కులం ఉంది. మీడియా అగ్రవర్ణ ధనిక స్వాముల చేతులో ఉంది. లాభాలు, వ్యాపార విస్తరణ ధ్యేయంగా ఉండే వారు...తమ సామాజిక వర్గానికి, తమ ప్రయోజనాలు కాపాడే వర్గానికి  పెద్ద పీట వేయకుండా సమ సమాజం గురించి, దళితుల గురించి ఆలోచిస్తారని అనుకోవడం తప్పు. దేవుడు ప్రత్యక్షమై అందరికీ వారు కోరుకున్నవి ఇస్తే బాగు...అని అనుకోవడం ఎంత అత్యాశ  అవుతుందో....దళితులకు, ముస్లిం లకు మీడియా యాజమాన్యాలు పెద్ద పీట వేస్తే బాగుంటుందని, మంచి పదవులు ఇవ్వాలని ఆశించడం కూడా అలాంటిదే అవుతుంది. ఇది జరగని పని. కులాన్ని బట్టి మాత్రమే ప్రతిభ ఉంటుందని అనుకోవడం నిజానికి దారుణమే. ఒక అవకాశం ఇస్తే అద్భుతంగా రాణించే వారు అన్ని కుల్లాల్లో వున్నారు. ఈ మధ్యన వస్తున్న ఒక ఛానెల్ అందుకేనేమో బీ.సీ.లకు అందునా ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నది. బీ.సీ.ల కోసం అని నూకారపు సూర్యప్రకాశ రావు గారు 'సూర్య' అనే పత్రిక పెట్టి పెత్తనం మాత్రం శర్మ గారికి ఇచ్చారు. 

నేను కళ్ళారా చూసిన రెండు విషయాలు పంచుకోవడానికి ఇది రాస్తున్నాను. 
ఒకటి) ఇప్పుడు మీడియాలో కులం తో పాటు ప్రాంతం లాయల్టీ ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. రామోజీ రావు ను పొగిడే కమ్మ జర్నలిస్టులకు పెద్దగా ప్రతిభ లేకపోయినా ఉన్నత పదవులు దక్కుతాయి. అది సత్యం. అలాగే...తనకు వీర విధేయుడిగా ఉండే చెత్త రెడ్డి జర్నలిస్టుకు రవి అందలం అందిస్తాడు. తమ ప్రయోజనాలు కాపాడతారనుకునే వారికి, భార్య తరఫు బంధువులకు ఉన్నత పదవులు కట్టబెట్టి, వారు అత్యంత ప్రతిభావంతులని నమ్మబలికే పరమ వీర ఎథికల్ జర్నలిస్టులు మన రాష్ట్రం లో వున్నారు. 

తాను ఎక్కడో పనిచేస్తున్నప్పుడు చెప్పు కింద పడి వున్న ఒక సెక్షన్ కు, మసాజ్ చేసే చెత్త జర్నలిస్టులకు స్థాయికి తగని పదవులు ఇచ్చే మహానుభావుల కథలు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ పుస్తకం కింద అచ్చు వేస్తే...నయ వంచకుల బండారం  బట్ట బయలవుతుంది. అయితే...కులం కన్నా...లాయల్టీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని నా పరిశీలన. 

రెండు) ఈ మధ్యన మీడియాలో ఎస్.సీ., ఎస్.టీ.లను నియమించడానికి యాజమాన్యాలు జంకుతున్నాయనేది నిష్ఠురసత్యం. ఛానెల్స్ పెరిగాక కెమెరామెన్ గా చేరిన ఒక వర్గం వారు....రిపోర్టర్ లను, బాసులను కులం పేరుతో బెదిరించడం ఇందుకు కారణం. కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ బాసులు ఎస్.సీ.,ఎస్.టీ. అట్రాసిటీస్ కేసుల భయంతో వణుకుతున్నారు. లోపల కుల వాదం వంటబట్టించుకున్న వారు పైకి మాత్రం దళిత, ముస్లిం జర్నలిస్టులను ప్రోత్సహిస్తున్నట్లు నటిస్తున్నారు. 

ఇక్కడ ఇంకో సమస్య ఉంది. దళితులు మీడియాలో ఉంటే...దళితుల సమస్యలు ఎక్కువ హై లైట్ అవుతాయని అనుకోవడం ఒక భ్రమ. ఎందుకంటే...ఏ కులం వాడైనా తాను చెప్పినట్లు చేసేలా మలుచుకోవడం...మన యాజమాన్యాలకు బాగా తెలుసు. ఈ పరిస్థితులలో ఎస్.సీ. కోటీశ్వరులు ఎస్.సీ.జర్నలిస్టుల కోసం, ఎస్.టీ. కోటీశ్వరులు ఎస్.టీ.ల కోసం పేపర్స్, చానల్స్ పెట్టడం ఒక్కటే ఉత్తమమైన మార్గంగా నాకు కనిపిస్తున్నది. మీరేమి అంటారు? 

Sunday, April 8, 2012

కోతి పనులు...కోతి వ్యవహారాలు...



ఏంటీ ఫోటోలు? ఎవరు తీశారు? ఎక్కడ తీశారు?....త్వరలో.
ఈ లోపు...ఈ ప్రదేశం ఎక్కడిదో సరిగా రాసిన వారికి ఖైరతాబాద్ చౌరస్తా లో ఇరానీ కఫే లో తిన్నన్ని ఉస్మానియా బిస్కెట్స్...తాగినంత చాయ్...సీ యూ 

Thursday, April 5, 2012

NBA నుంచి వైదొలగిన TV-9: 'corrupt politicians' పై వ్యాఖ్యలు

కారణాలు ఏమిటో నిర్దిష్టంగా తెలియడంలేదు కానీ...నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ (ఎన్.బి.ఏ.) నుంచి టీ వీ-నైన్ చానెల్ ప్రస్తుతానికి వైదొలగింది. జగన్ మోహన్ రెడ్డి చానల్ సాక్షి తన పరువు పంచనామా చేసే వార్తలు కావాలని ప్రసారం చేసిందని రవి ప్రకాష్ గారు ఫిర్యాదు చేస్తే...రెండు చానెల్స్ క్షమాపణలు చెప్పాలని ఈ సంస్థ ఆదేశించడం టీ.వీ.-నైన్ కు నచ్చి ఉండకపోవచ్చు. (ఇంతకూ...ఒక పోస్టులో నేను రాసినట్లు...మార్చ్ చివరి రోజున రెండు చానెల్స్ సారీలు చెప్పాయా? మీరెవరైనా చూసి వుంటే నాకు రాయండి).


ఈ మేరకు టీ.వీ.-నైన్ లీగల్ ప్రతినిధి ఎన్.బీ.ఏ.వారికి రాసినట్లు చెబుతున్న లేఖను ఒక సీనియర్ ఎడిటర్ నాకు పంపారు. వారికి థాంక్స్. ఈ లేఖలో అవినీతి పరులైన రాజకీయ నేతలు మీడియాలోకి రావడం పై టీ.వీ.-నైన్ యెంత బాధ పడుతున్నది కూడా వుంది. ఆ లేఖ మీ కోసం...

Dear Ms Annie,
This is in reference to your mail dt 22.03.2012  for renewal of the annual
subscription for the year 2012-13.
We regret to inform you that, we would like to stay out of NBA for the time
being.

We once again draw your attention towards the  issue of the  corrupt
politicians coming into Media field  and launching their own News Channel.
These politicians, under the guise  of journalism, telecasting / reporting
News in their  News Channels attacking other genuine journalist
professionals. These forces are  not only using various forums  to attack
the unbiased  Media  but also are funding certain News  organizations in
Delhi to buy support for further biased communication.

We urge NBA and its partners to fight against such 24/7 paid news unleashed
by these corrupt politician owned media houses.

Thank you for all your support.
Thanks & Regards,

Studio N లో మహిళా లీడర్లపై చెత్త స్టోరీ

ఈ మధ్యన బూతు పాటలతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న studio N ఛానల్ నిన్న జయప్రద, రోజా, జీవిత ల మీద "ఐరన్ లెగ్' శీర్షికన ఒక అభ్యంతరకరమైన  కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఇది మరీ దారుణమైన జర్నలిజం. మహిళలను కించపరచడం, ఒక అశాస్త్రీయమైన వాదనను ప్రచారం చేయడం. 

పుట్టిన రోజు నాడు...తిరుమల కు వెళ్ళిన జయప్రద చంద్రబాబు ను పొగుడుతూ తాను వచ్చే ఎన్నికల నాటికి తెలుగు దేశం లోకి వస్తున్నట్లు ఫీలర్ ఇవ్వడం ఈ ప్రోగ్రాం రూపకల్పనకు కారణం. ఈ మహిళలు కాలు పెట్టిన పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందన్న చెత్త వాదనకు అనుకూలంగా క్లిప్స్ పెట్టి, ఎవరి మీదనైనా అద్భుతంగా అభిప్రాయాలు చెప్పే కొందరు మహిళా నేతలను ఫోన్ లైన్ లోకి తెచ్చి చాలా సేపు ఈ కార్యక్రమం నడిపారు. 

తెలుగు దేశం అధికారం లో ఉన్నప్పుడు పార్టీ పనుల్లో జయప్రద పాత్ర, చంద్రబాబు మంత్రాంగం గుర్తుకు వచ్చి మరో విపత్తు రాకుండా ఉండాలన్న అజెండాతో పచ్చ ఛానెల్ వారు కావాలని ఈ కార్యక్రమం ప్రసారం చేసారేమో అనిపించింది. నిజానిజాలు ఆ పెరుమాళ్ళ కెరుక గానీ...కష్టపడి ఎదుగుతున్న మహిళా నేతల పై మరీ ఇంత దారుణమైన ప్రోగ్రామ్స్ చేస్తూ బురద చల్లడం బాధాకరం. నార్నే గారూ...ఇది మంచి పద్దతి కాదు సార్...  

Wednesday, April 4, 2012

దౌర్భాగ్యపు టీచర్లూ....మీకిదేం పోయే కాలం?

ఇంగ్లిషు పద్యం అప్పజెప్పలేదని నెల్లూరు జిల్లాలో పన్నెండు మంది ఏడో తరగతి విద్యార్థులను 150 చొప్పున సిటప్స్ (గుంజీళ్లు) తీయించిన టీచరమ్మ గురించి చదివి బ్లడ్డు బాయిలై...అది కనిపిస్తే కాల్చివేయాలని నేను అనుకుని వెబ్ సైట్లు తిరగేస్తుండగా 'ద సన్' లో వచ్చిన ఒక వ్యాసం నిర్ఘాంతపరిచింది. పని ఒత్తిడి, హడావుడితో చిన్న పిల్లలను ఎవరికి పడితే వారికి అప్పగించి వెళితే...జరిగే దారుణాలు ఘోరాలు చూస్తే గుండె చెరువయింది. 

ఆధునికీకరణకు మారుపేరుగా చెప్పుకునే బ్రిటన్ లో వారానికి 400 మందికి పైగా చిన్నారులు సెక్స్ సంబంధ వేధింపులకు గురవుతున్నారట. అంటే ఇరవై నిమిషాలకొక చిన్నారి బలవుతున్నట్లు లెక్క. National Society for Prevention of Cruelty to Children (NSPCC) ఈ వివరాలను వెలువరిస్తూ...ఇంకొక దిగ్భ్రాంతికరమైన సంగతి చెప్పింది. పిల్లలను లైంగికంగా వేధిస్తున్న దుర్మార్గుల్లో పది మందిలో తొమ్మిది మంది ఎలాంటి శిక్షా లేకుండా తప్పించుకుంటున్నారట. పిల్లలపై ఇలాంటి దాడులు ఒక మాయదారి రోగంలా ప్రబలుతున్నదని, ప్రభుత్వం తక్షణం స్పందించాలని అక్కడి నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

గత ఏడాది 23,097 ఛైల్డ్ సెక్స్ అఫెన్సులు నమోదయితే, అందులో ఐదేళ్ల లోపు బాధితుల సంఖ్య 1,470 అని ఆ సంస్థ తెలిపింది. ఐదు నుంచి పదేళ్ల వయస్సుగల బాధితుల సంఖ్య 4,973 కాగా, 11 నుంచి 17 సంవత్సరాల మధ్య వారి సంఖ్య 14,819 అని తేల్చింది. మరి మనదేశంలో, రాష్ట్రంలో కూడా ఇలాంటి లెక్కలు తీసి విశ్లేషణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే...మానవ మృగాలు లండన్ లో అయినా ఒకటే, హైదరాబాద్ లో అయినా ఒకటే.   

Tuesday, April 3, 2012

దుర్భాషలాట/ దోబూచులాట మరియు సంపర్కించు/ సంప్రదించు


మార్చి 31 వ తేదీన...తారా చౌదరి అనే మహిళ గురించి HM TV ఒక మారథాన్ కథనాన్ని ప్రసారం చేసింది. మాయలేడి తారా చౌదరి చేతిలో మోస పోయిన ఒక అమాయకపు అమ్మాయి ధైర్యంగా స్టూడియోకి వచ్చి గుట్టు విప్పడంతో పోలీసులు కూడా స్పందించక తప్పలేదు. ఇంత మంచి మసాలా దినుసులున్న కథనాన్ని అదే వేరే ఛానల్ అయి ఉంటే బూతు జోడించి రక్తి కట్టించి ఉండేది. టూ దీ పాయింట్ రిపోర్టింగ్ చేసి ఒక దారుణమైన వ్యవహారాన్ని బట్టబయలు చేసినందుకు HM TV ని అభినందించాల్సిందే.
 

అయితే...ఈ హడావుడి, కంగారులో యాంకర్ అన్వయం లేని మాటలు చాలా మాట్టాడి విసిగించడం సంగతి అలా ఉంచితే..."దుర్భాషలాడారు"కు, "దోబూచులాడారు"కు మధ్య తేడా తెలియని ఒక రిపోర్టర్ జనాలను గందరగోళ పరిచారు. HM TV ప్రసారం చేసిన కథనంతో పోలీస్ స్టేషన్ కు రాకతప్పని తారమ్మ సదరు ఛానల్ రిపోర్టర్, కెమెరామ్యాన్ లపై రంకెలేసిందన్నది విషయం. దానికి లైవ్ లో ఆదరాబాదరా మాట్లాడుతూ..."తారా చౌదరి రిపోర్టర్లతో దోబూచులాడింది..." అని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు రిపోర్టర్ అనడం నేను విన్నాను. దుర్భాషలాడారని చెప్పడానికి బదులు రిపోర్టర్ ఆ పదం వాడుతున్నారని కాంటెక్స్ట్ ను బట్టి అర్ధమయింది. తెలిచ్చావక కొన్నిసార్లు, హడావుడిలో కొన్నిసార్లు ఇలాంటి తప్పులు దొర్లుతాయి. ఉచ్ఛారణ సరిగా ఉండకపోయినా మనకు అలా వినిపించిందేమో చూడాలి.


మా తమ్ముడి ఐ.టి. కంపెనీలో ఆ మధ్యన ఎప్పుడో ఒక తెలుగు వాడు చేరాడట. ఢిల్లీలో పుట్టిపెరిగి ఇంట్లో తెలుగు నేర్చుకుని...ఒక ఇరవై ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చాడు. తనకు తెలుగులో మాట్లాడాలని ఒకటే తపన. అలాంటి ఆయన ఏదో ఒక విషయం మీద తన సీనియర్ కలీగ్ అయిన అమ్మాయితో డిస్కస్ చేయాల్సి వచ్చింది. మనవాడు ఆమె ఛాంబర్ కు వెళ్లాడు, డిస్కస్ చేశాడు, వచ్చాడు. "హమ్మయ్య...ఆమెను సంపర్కించాక...సందేహం తీరిపోయింది..." అని అంటూ ఉత్సాహంగా వచ్చి తన బాసైన మా తమ్ముడికి చెప్పాడట. నవ్వాలో ఏడ్వాలో తెలియక ఇబ్బంది పడటం మా వాడి వంతయింది. 

"బాబూ...నువ్వు ఆ ఛాంబర్ లో ఇంతసేపూ ఏమి చేసావో కాస్త ఇంగ్లిషులో చెప్పి పుణ్యం కట్టుకో..." అని తమ్ముడు అడిగినప్పుడు...."డిస్కషన్...అదే తెలుగులో సంపర్కించడం అంటాం గదా" అన్నాడట అమాయకంగా. హిందీలో సంపర్క్ అనే పదాన్ని తెలుగులో యథాతథంగా ప్రయోగించాడేమో...మనకు తెలియదు.


ఇదిలావుండగా,  చాలా ఏళ్ల తర్వాత కలిసిన మా మామయ్య (తెలుగు టీచర్) ఒకాయన...హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లిన మా బంధువుల ఏడేళ్ల అమ్మాయిని ఒక ప్రశ్న అడిగాడు: "మీ బడి పేరు చెప్పు...." అని.  చాలా చురుకైన, చలాకీ అయిన ఆ అమ్మాయి..."ఏమిటీ..." అని అడిగి...తన పేరు మాత్రం చెప్పి వెళ్లి పోయింది. "బడి" అనే పదానికి అర్ధం తెలియకపోవడం వల్ల ఇది జరిగింది మరి. 

"పద్దెనిమిది", "పందొమ్మిది" వంటి మాటలు ఎవరైనా వాడితే...మన వైపు తిరిగి..."అంటే..." అంటూ ఇంగ్లిషులో చెప్పమని బేలగా అడిగే పిల్లలను చూస్తే భయమేస్తుంది. పిల్లలకు తెలుగు నేర్పడానికి ఈ ఎండాకాలానికి మించిన సమయం లేదు గదా!

ప్రింట్ మీడియాకు ఇప్పట్టో ఢోకా లేదట...


నిజం చెప్పాలంటే ప్రింట్ జర్నలిజం అంత సుఖం మరొకటి లేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉద్యోగం వస్తే...టీవీలో మాటిమాటికీ మనం కనిపిస్తామనే గానీ...అక్కడ అరవ చాకిరీ ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగితే...ఆ న్యూస్ లో ఉన్న వ్యక్తి కొంప ముందు కాపలా కాయాలి. వాడు దయతలిచి బైట్ ఇస్తే..సరే. లేదంటే, బాసు గాడు కుక్కలా మనల్ను కరుస్తాడు. వాడికి మన ధోరణి నచ్చకపోతే...ఇది సాకుగా చూపించి పనికిరాని చెత్తగాడివని ప్రచారం చేసి పొట్టమీద కొడతాడు. పైగా ఫోన్ ఇన్ లు, ఎక్స్ క్లూజివ్ స్టోరీలు, మాల్ మసాలా, రాజశేఖర్ మార్క్ ప్రత్యేక కథనాలు...వెరసి తడిసి మోపెడవుతుంది, గాడిద చాకిరీ అవుతుంది. అందుకే...బోడి గుండంత సుఖం లేదు...ప్రింట్ జర్నలిజం అంత ఉత్తమం లేదని మా అబ్రకదబ్ర అంటుంటాడు. నా ఫీలింగూ అదే. 

అయితే...అమెరికాలో న్యూస్ పేపర్లు మూత పడటం చూసి ఇక్కడి ప్రింట్ జర్నలిస్టుల గుండె గుభేల్ మంటున్నది. అందుకే...కాస్త తల మీద జుట్టు, డొక్క శుద్ధి, అవకాశాలు ఉన్నవారు చాలా మంది ప్రింట్ నుంచి టీవీ జర్నలిజం వైపు మళ్లారు. నేనూ ఒకప్పుడు ఆ ప్రయత్నం చేశా కానీ పథకం పారలేదు, నా అదృష్టం బాగుండి. అయితే...భారత దేశంలో మరొక పది, పదిహేనేళ్ల వరకూ ప్రింట్ జర్నలిజానికి ఢోకాలేదని జర్నలిజంలో తలపండిన ప్రొఫెసర్ రాబిన్ జాఫ్రీ అంటున్నారు. ఆయన మార్చి 31 న చేసిన ప్రసంగం మీ కోసం...

'Indian print media will flourish for 15 years'


NEW DELHI: In contrast to the steep fall in newspaper circulation in the US, the Indian newspaper industry will witness strong growth for the next decade and a half due to growing literacy, says international media watcher Robin Jeffrey.

"My prediction is that newspapers will continue to grow for at least another 10 years and television will consolidate - painfully," Jeffrey said delivering the Rajendra Mathur memorial lecture at the India International Centre here Saturday  evening.

"I think print in India has 10 to 15 years to go before it hits the sorts of downturn that is changing the print landscapes in the US and elsewhere," said Jeffrey, author of "India's Newspaper Revolution" book.

He was speaking on "Media Meditation: History, Prospects and Challenges for India", organised by the Editors Guild of India.

He attributed the continued growth of the print media in India to rising literacy.

Pointing to the 30 percent illiterates, Jeffrey said, "more than 300 million people are still to be equipped with the ability to read a newspaper".

Re-use value of the old newspaper is another factor that Jeffrey thinks would not shrink the newspaper industry in the country unlike in the West where many media establishments have shut down.

He says in India, where hundreds of millions live without luxuries, newsprint is so useful because it can be recycled and "can be used for so many things - from lining walls and ceilings to packaging bhel puri".

Jeffrey, who has been a journalist in Canada, and has also lived and worked in India, Australia and Singapore, said the challenges the media faces in India were both "uncomfortable" and "exhilarating".

Cautioning the media to guard against paid news, Jeffrey said: "None of this is to say that the society - or the media industries - should tolerate 'paid news'." He described as abhorring the practice of "selling the news pages for propaganda masquerading as reporting".

He advised Indian media publications to be vigilant against the invasion of privacy.

Industry should not "tolerate the tasteless, cruel and illegal invasion of privacy that brought the downfall of the UK's News of the World", Jeffrey said.

He added: "The contest over ethics, taste and security in Indian media are similar to those that have gone on in the US, UK and other English speaking countries for more than 200 years."

Why is India not having a respected, "global Indian voice" like Al Jazeera, BBC and CNN?

Jeffrey said an Indian global news presence could become a world standard because India has it all and "there is no country in the world better able to reflect the world" than what India could do.

"India has a huge pool of talented, multilingual, English speaking journalists" coupled with the Indian diaspora on every continent who can provide both journalists and contacts. 

(Courtesy: IANS)