Saturday, June 30, 2012

అక్రమ సంబంధాల కేరాఫ్ అడ్రస్....

మీడియాలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా లో పరిస్థితి ఘోరంగా తయారయింది. పుట్టగొడుగుల మాదిరిగా చానెల్స్ పుట్టుకు రావడంతో పరిస్థితి విషమించింది. సంఘ మర్యాద పరంగా బాగుండదని.... నా దగ్గరకు వస్తున్న కథలను రాయలేకపోతున్నాను. మచ్చుకు ఒకటి.

రాధాకృష్ణ చానెల్ నుంచి ఇమేజ్ చానెల్ లో చేరిన ఒక సీనియర్ ఎడిటర్ గురించి వాకబు చేస్తే....కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అప్పటికే పెళ్ళైన ఈయన నరేన్ చౌదరి గారి చానెల్ లో వున్నప్పుడు ఒక యాంకర్ తో రిలేషన్ పెట్టుకున్నాడు. అప్పటికే ప్రేమ పెళ్ళి చేసుకున్న యాంకర్ భర్త అది భరించలేక యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మనుమడి అకాల మరణం గురించి తెలిసి ఆ అబ్బాయి నాయనమ్మ గుండె ఆగి చేనిపోయారట. ఈ కథంతా నేను పాత పోస్టులలో రాసిందే.

ఆ యాంకర్ జీవితం ఇప్పుడు ఎలా ఉందా? అని వాకబు చేస్తే...ఇప్పుడు ఇమేజ్ చానెల్ లో చేరిన వాడి గురించి పూర్తి వివరాలు అందాయి. భార్యను ఒప్పించాడో, బెదిరించాడో గానీ...ఆ యాంకర్ తో కూడా కాపరం చేసేందుకు ఆ పిచ్చి తల్లి అంగీకరించిందట. వీడి కథ ఆ యాంకర్ కే పరిమితం కాలేదన్న అభియోగాలూ వినిపించాయి. ఇప్పుడు మీడియా లో ఉన్నత పొజిషన్ లలో ఉన్న చాలా మంది జర్నలిస్టుల మీద లైంగిక అభియోగాలు ఉన్నాయి. కెరీర్ యావలో పడి శీలానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వని వాళ్ళ కథలూ ఈ బ్లాగు మూలంగా నా దగ్గరకు చేరుతున్నాయి. ఇవి చూస్తె గుండె తరుక్కు పోతుంది.


Consensual Sex  తో నీకేమి సమస్య అని అడిగితే నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ...నలుగురికి నీతులు చెప్పే జర్నలిస్టులు, బతకలేక శరీరం అమ్ముకుంటున్న వ్యభిచారిణుల మీద రోజూ వార్తలు ప్రసారం చేసే జర్నలిస్టులు కాస్తంత నీతి తో ధర్మబద్ధంగా బతికితే  ఆదర్శంగా వుంటుంది కదా...అని అనిపిస్తుంది. ఎవరి జీవితాలు వారివి...మనమేమి చేస్తాం? ఈ యజమానుల కూతుళ్ళనో, చెల్లెళ్ళ నో ఈ జర్నలిస్టులు ఇలానే  వంచిస్తే...వారికి ఓనర్లు ఇలాంటి పదవులే  ఇస్తారా? పుండాకోర్ లకు, వ్యభిచారులకు, నీతి  తక్కువ వెధవలకు, వసూల్ రాజ్ లకు, వృత్తిలో ఆడపిల్లలను కేవలం సెక్స్ వర్కర్లుగా చూసే నయ వంచకులకు యాజమాన్యాలు పెద్ద పీట  వేస్తున్నాయి. తెలుగు మీడియాలో నీతి  నేతి బీరకాయలో నెయ్యే. అనుకోవడం దండగ. 


ఇందుకు సంబంధించి  నాకు వచ్చిన ఫార్వర్డ్ మీతో పంచుకోవడం మినహా నేనేమీ చేయలేకపోతున్నాయి. 


The American and the Indian and their Family Problems

Two men, an American and an Indian were sitting in a bar and discussing
their family problems. Shot after shot.

The Indian man said to the American: "We have problem in India. We can't
marry the one whom we love. You know my parents are forcing me to get
married to this so called homely and domesticated girl from a village whom
I haven't even met once. We call this an arranged marriage. I don't want to
marry a woman whom I don't love. I told my parents that openly and now have
a hell of a lot of family problems."

The American said: "Talking about love marriages, in America we can marry
the one we love. Let me tell you my story. I married a widow whom I deeply
loved and dated her for three years. After a couple of years, my father
fell in love with my step-daughter and married her, so my father became my
son-in-law and I became my father's father-in-law. Legally now my daughter
is my mother and my wife is my grandmother. More problems occurred when I
had a son. My son is my father's brother and so he is my uncle. The
situation turned worse when my father had a son. Now my father's son, my
brother, is my grandson. Ultimately, I have become my own grandfather and I
am my own grandson.

And you say you have family problems?"
The Indian fainted. 

Friday, June 29, 2012

'తులసి', 'ఇమేజ్' ఛానెల్స్ లో పరిణామాలు...

కొత్తగా రాబోతున్నదని  రెండేళ్లుగా ఊరిస్తున్న 'తులసి' ఛానెల్ లో, అతి త్వరలో రానున్న ఇమేజ్ ఛానెల్ లో పరిణామాల గురించి ఒక సీనియర్ జర్నలిస్టు ఇది రాసి పంపారు. ఇవి పూర్తిగా ఆ జర్నలిస్టు వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. 
----------------------------------------

మోస్ట్ ఆన్ వాంటెడ్ పరిణామాలకు ఇటీవలీ కాలం లో తెలుగు విజువల్ మీడియా కేంద్ర బిందువుగా మారుతోంది.... ఏదో పొడుస్తుందునకున్న ఇమేజ్ వారి చానెల్...అన్నీ ఛానెల్స్ విసర్జించిన ముసలి తొక్కులను, వెళ్ళిన ప్రతి చోట గ్రూపులు కట్టే అలవాటున్న సీనియర్ జర్నలిస్టులుగా చలామణీ అయ్యే వారినీ నెత్తి కెక్కించుకుని... అభాసు పాలైంది.... ఫేస్ వాల్యు ఉన్న ఏ.బీ.ఎన్ మూర్తి, స్వప్న కూడా చేరి, తిరిగి సొంత గూళ్ళకు వీళ్లిపోవటం...తో అసలు ఇమేజ్ కి విజన్ ఉందా? లేదా? అనే సందేహం తలెత్తుతోంది....ఇంకా రాకుండానే ..ఇంత అపకీర్తి మూట కట్టుకున్న వీరి సంగతి అలా ఉంచితే, గుంటూరు బిజినెస్ టైకూన్ తులసి రామచంద్ర ప్రభు స్టార్ట్ చేయదలచుకున్న తులసి చానెల్....కులం కంపుతో కునారిల్లుతోంది... ఇంటర్వ్యూ కి వెళ్ళిన వారిని నేరుగా మీరు `ఏమిటి అని అడగటం ద్వారా.. కేవలం ఫలానా సామాజిక వర్గానికే ఆ చానెల్ కొమ్ము కాస్తోందనే ప్రచారం బాహాటంగా నే జరుగుతోంది.
తులసి చానెల్ సీ ఈ ఓ భావన్నారాయణ వెళ్లిపోవటం..వారికి మైనస్సే....ఇంకా మొదలు కాకుండానే ఏమిటీ అపశకునం అని అందరూ వాపోతున్నారు. దీనికి తోడు...మీడియా మీద ఏ మాత్రం అవగాహన లేని ప్రభు గారి కుమారుల సామాజిక వర్గ ప్రాధాన్యాలు ఎవరినీ ఆ చానెల్ గడప తొక్కకుండా చేస్తున్నాయి...ఎవరి మీదా నమ్మకం లేకుండా ..ఒంటెత్తు పోకడలు పోయే `తులసి వారి వ్యవహారం తో సీనియర్లు ఎవరూ అటు వైపే చూడటం లేదనేది ఇప్పుడు వస్తున్న టాక్...కాంపిటెంట్ గానూ, దూకుడు గానూ ఉండే వాళ్ళు కాకుండా...కులం ప్రధానంగా జరిపే నియామకాల ద్వారా `తులసి వారు సమాజాని ఏం మెసేజ్ కన్వే చేద్దామనుకుంటున్నారో అర్ధం కావటం కాలేదు.....
రక రకాల వివాదాల్లో చిక్కుకున్న వారిని అక్కడ కూడా చేరదీసే ఒక వాతావరణం ఏర్పడినట్టుగా చెపుతున్నారు. మీడియా ప్రపంచానికిసంబంధం లేని వారిని `కుల కోణంలో అక్కున చేర్చుకుంటున్నారనే అపకీర్తిని ప్రభు మూట కట్టుకుంటున్నారని ప్రెస్ క్లబ్ సమాచారం. తాను నడిపే ఇతర వ్యాపారాల్లో ఆ కోణం చూపని ప్రభు ఇక్కడికొచ్చే సరికి చేస్తున్న ఆ తప్పు ....కచ్చితంగా చానెల్ భవితవ్యాన్ని ప్రభావితం చేస్తుందేమో ననే సందేహాలు మొదలవుతున్నాయి.... రామ్ మోహన్ నాయుడు, రమణ, హరిప్రసాద్, ఆలపాటి సురేశ్, పెద్ది రాజు లాంటి `సామాజికప్రముఖులను పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుందని తులసి ప్రభు గారు, ఆయన పుత్ర రత్నాలు సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
క్వాలిటీ కన్నా....కేస్ట్ కే ప్రయారిటీ అనుకునే రీతిలో జరపాలనే నియామకాలతో........తులసి ప్రభు కు  అయ్యవారిని చేయబోతే ఏదో అయిందనుకునే పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.....ఇప్పటికే ఎందరినో పిలిచి మాట్లాడి...తీసేసుకున్నామనే ఫీలర్ ఇచ్చిన తులసి ప్రభు, తీరా వారికి మొండి చెయ్యి చూపారనేది....ఆయన `సామాజిక శాఖ నుంచే వస్తున్న మాట. తిన్నగా నియామకాలు జరపకపోతే....`తులసి వారి వనంలో అన్నీ గంజాయి మొక్కలే ప్రత్యక్షమవుతాయి.

Thursday, June 28, 2012

రోజు వేగాన్ని తగ్గించడం లో భాగంగా...


ఓరి నాయనో. కాలం వేగం పెరిగింది. హైదరాబాదు లో ఇది మరీ. పెద్దల సంగతి ఏమో కానీ...పిల్లలను కుమ్మి పారేస్తున్నాం. చదువు...చదువు...చదువు. క్రీడలను సీరియస్ గా తీసుకున్న మా పరిస్థితి ఇంకా ఘోరం. ఇదొక ఎవ్వడికీ అర్థం కాని, మాకే బుర్ర తిరిగిపోయే బిజీ షెడ్యూల్. నేషనల్ రాంకింగ్ లో ఉన్న పిల్లవాడిని ఆరు గంటలకు లాల్ బహదూర్ స్టేడియం కు తీసుకు పోవడం తో రోజు ఆరంభమవుతుంది. అక్కడ గంటన్నర సీరియస్ ప్రాక్టిస్. అందులో భాగంగా కోచ్ ల రుసరుసలు, పదనిసలు ఉన్నా...పిల్లలు ఓపిగ్గా ఆడతారు. తర్వాత...ఎనిమిది గంటలకు స్కూల్ బస్సు అందుకోవాలి. అందుకు అనుగుణంగా హేమ వంటా వార్పూ. అప్పటికే నాలుగున్నరకు లేచి చదివే కూతురు తన పని తాను చేసుకోవడం మొదలవుతుంది. టిఫిన్లు, బాక్సులు సర్దటాలు కూడా జెట్ స్పీడ్ తో చేయడం జరిగిపోతుంది. ఒకవేళ పిల్లవాడు బస్ మిస్ అయితే...కారు లో దింపిరావడం. మనకు యూనివెర్సిటీ సెలవలు కాబట్టి ఇలా. లేకపోతే...మనకు బాక్సూ...టిఫినూ ఆమెకు అదనపు భారం. హోం వర్కులు, అసైన్మెంట్లు, ప్రాజెక్టు వర్కులు, యూనిట్ టెస్టులు, ఫైనల్ పరిక్షలు. మాకు ఉండే పది టోర్నమెంట్లు అదనం. ఒకటే టైట్ షెడ్యూల్. ఊపిరి సలపని వేగం. హే రామ్...ఏమిటీ స్పీడ్? ఇంట్లో ఆడవాళ్ళకు నేర్పు, ఓపిక, ప్రణాళిక...పిల్లలకు ఆసక్తి, అభిరుచి, ఓపిక...మగ వెధవకు బాధ్యత, ఓపిక లేకపోతే కొంప కొల్లేరే.  

ఇలా... మనసుకు ఆగకుండా గిర్రు గిర్రున తిరుగుతున్న గడియారం కనిపించింది ఈ ఉదయం. ఇవ్వాళ రోజును కొత్తగా ఆరంభించాలని అనుకున్నాను. కాలం వేగాన్ని మనం తగ్గించలేమా? అన్న ప్రశ్న తట్టింది.  మార్నింగ్ లాల్ బహదూర్ స్టేడియం పర్యటన కాన్సిల్ అయ్యింది. దీనివల్ల కాసేపు ఎక్కువ నిద్రపోయి... అలవాటు ప్రకారం లేచే ముందు వచ్చి మీద పడి తొక్కుతున్న కొడుకును, అప్పటికే మాకు అర్థం కాని ఫ్రెంచో, ఎకనామిక్సో చదువుతున్న కూతురును, మరో జీవన సమరానికి సిద్ధమయ్యేందుకు సిద్ధమవుతూ దుప్పటి తీసి లేవబోత్తున్న మా అన్నపూర్ణ (హేమే) లో ఒక వీర సైనికురాలిని చూసి ఒక్క సారిగా జాలి వేసింది. అంతే...ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇవ్వాళ ఒక్క రోజు మీరు చదువుకు వెళ్ళకపోతే కొంపలారి పోతాయా? అని పిల్లలను అడిగాను. కుదరదు గాక కుదరదని...మా వాడు అన్నాడు. ఇంకొక సారి అడిగే సరికి ఒప్పుకున్నాడు. ఫ్రెండ్ దగ్గరి నుంచి తెచ్చిన నోట్స్ వాళ్ళ ఇంటికెళ్ళి ఇచ్చి రావాలని చెప్పాడు. 'మరి నాకొక టేస్ట్ ఉంది గా..." అని కూతురు అన్నది. ఇంటర్ లో...తండ్రికి చెప్పకుండా వార్షిక పరీక్ష ఎగ్గొట్టి క్రికెట్ ఆడిన విషయం గుర్తుకు వచ్చింది. 'పరీక్ష రాసి పర్మిషన్ తీసుకుని వస్తే..."అని ప్రతిపాదించా. 'ప్రిన్సి పర్మిషన్ ఇవ్వకపోతే...?" అన్నది మరొక ప్రశ్న. నేనే వచ్చి తీసుకొస్త....అందరం కలిసి లంచ్ చేద్దామని చెప్పాను. 'తొందరగా డెసిషన్ తెసుకుంటే...వంట వాయిదా వేయవచ్చు.." అని మా సైనికురాలు అనడంతో....'డెసిషన్ అయిపోయింది...పిల్లలకు చదువు బంద్' అని అంటే...ఆశ్చర్యం మాత్రమే వెలిబుచ్చుతూ తనూ 'నొ' అనక పోవడం నా డెసిషన్ ను బలపరిచినట్లు అనిపించింది. 

అలా అనుకున్న ప్రకారం....ఫ్రెండ్ ఇంటికి తీసుకు వెళ్లి మా వాడూ..నేనూ నోట్స్ ఇచ్చి వచ్చాం. ఊహించినట్లే ప్రిన్సిపాల్ పర్మిషన్ ఇవ్వలేదని కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. నేను స్వయంగా వెళ్ళడంతో చచ్చినట్లు పర్మిషన్ ఇచ్చారు. అందరం ఇంట్లోనే ఉన్నాం. పోర్చుగల్, స్పెయిన్ ఫుట్ బాల్ మాచ్ రిపీట్ చూసి ఆనందించాం. కాసేపు పీ.ఎస్.పీ. ఆడుకుంటా నని, తర్వాత మాత్స్ చేసుకుంటానని చెప్పిన పిల్లవాడు మాట తప్పలేదు. కాలేజ్ లో టేస్ట్ రాసి వచ్చిన అమ్మాయి చేతలతో, నేను మాటలతో తల్లికి బిర్యాని చేయడంలో సహకరించాం. పన్నెండున్నర కల్లా వేడి వేడి బిర్యాని...అద్భుతమైన కూర (మా అన్నపూర్ణ స్పెషల్) సిద్ధమయ్యాయి. రోజూ తినే గాజు డైనింగ్ టేబుల్ ను కాదని...వేరే రూం లో ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్ అరేంజ్ చేసి....సిద్ధం చేశా. హాయిగా మాట్లాడుతూ...పిల్లల చిన్ననాటి విషయాలు, ఇబ్బందులు...అన్నీ గుర్తుకు తెచ్చుకున్నాం. మది పొరల్లో సిరా తడి ఆరని కొన్ని జ్ఞాపకాలను డ్రమటైజ్ చేసి వారికి వివరిస్తే...కడుపుబ్బ నవ్వారు. వాళ్ళ చిన్ననాటి ఘనకార్యాలను గుర్తు చేస్తే... నిండుగా మురిసి పోయారు. ఒక ముప్పావు గంట పాటు బిర్యానీ...డబల్ కా మీఠా కన్నా ఆనందంగా కరిగిపోయింది కాలం. 

వాళ్ళు ఇంకా తినడం పూర్తి అయ్యిందో లేదో...నేను పిల్లల బెడ్ రూం లో మంచం మీద ఒరిగాను. అలవాటు ప్రకారం క్షణంలో గాఢ నిద్రలోకి జారుకున్నా.  మధ్యలో మూడు గంటలకు ఒక్క సారి మెళకువ  వచ్చి...చూస్తిని కదా....మిగిలిన ముగ్గురూ నిద్రాదేవత ఒడిలో భద్రం గా ఉన్నారు. అప్పుడు అనిపించింది...పొద్దటి డెసిషన్ వృధా పోలేదని. రూం లో స్లోగా నడుస్తున్న గడియారం వైపు విజయ గర్వంతో చూసి ఈ పోస్టు రాయడానికి ఉపక్రమించాను. 

(మితృలారా...ఇది నా సొంత సొద. మీరూ ట్రై చేస్తే బాగుంటుందని అనిపించి రాసాను. మీడియా కబుర్లలో ఇదేమిటని ఎవరైనా అంటే...బిర్యాని నమిలినట్లు నమిలేస్తా. బీ కర్ ఫుల్.)   

మహారాష్ట్ర పాలిటిక్స్ లోకి రవిప్రకాష్!

తెలుగు టెలివిజన్ జర్నలిజంలో చరిత్ర సృష్టించిన ఒకే ఒక్కడు రవిప్రకాష్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని 2009 అక్టోబర్ లో ఈ బ్లాగు రాసింది...'రాజకీయ రంగం వైపు రవి ప్రకాష్ చూపు' అన్న శీర్షికతో.  రవి కనిపించక పోవడంపై ఈ బ్లాగు రాసిన కొన్ని రోజులకే...తొలి తెలుగు టాకింగ్ న్యూస్ పేపర్ ఒకటి రవి రాజకీయాసక్తి పై ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. అయితే ...ఆంధ్రా రాజకీయాల్లోకి మహారాష్ట్ర పాలిటిక్స్ లోకి రవి కాలు పెడతారని అది పేర్కొంది. TV-9 ను, రవిని బాగా పొగిడిన ఆ కథనం యెంత వరకూ నిజం అవుతుందో>?

Wednesday, June 27, 2012

'ఈనాడు' శ్రీధర్ గారి మంచి కార్టూన్

courtesy: Eenadu

Saturday, June 23, 2012

తెలుగు టీ.వీ.చానళ్ళలో మార్పులూ...చేర్పులూ....

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న తెలుగు టెలివిజన్ చానళ్ళలో రోజుకొక పరిణామం జరుగుతున్నది. ఈ రోజు ఒక ఛానెల్ లో వున్న సీనియర్ జర్నలిస్టు మర్నాటికి మరొక ఛానెల్ లో దర్శనమిస్తున్నారు. అది కాక ఇంకొన్ని ఆసక్తి కరమైన విషయాలు జరుగుతున్నాయి. ఆ పరిణామాల సమాహారమే ఇది...


ఇమేజ్ లో చేరిన జకీర్, కందుల:
మళ్ళా ఏ.బీ.ఎన్.
గూటికి మూర్తి

స్వప్న, మూర్తి, వాసుదేవన్, సురేష్ వంటి వారు చేరడంతో ఇమేజ్ వారి ఛానెల్స్ (సీ.వీ.ఆర్.) ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిందనిపించింది. ఆరంభంలోనే..ఇమేజ్ లో చేరినట్టే చేరిన స్వప్న తాను గతంలో పనిచేసిన 'సాక్షి' ఛానెల్ కు వెళ్ళిపోయారు. అక్కడి కొన్ని నియామకాలు నచ్చక కాబోలు మూర్తి తాను వదిలి వచ్చిన 'ఏ.బీ.ఎన్. ఆంధ్రజ్యోతి' ఛానెల్ కు వెళ్ళారు నాలుగు  రోజుల కిందట. వీళ్ళను ఇమేజ్ లోకి తెచ్చిన నరసింహారావు గారు చూస్తూ చూస్తూ ఉండగానే...ఏ.బీ.ఎన్. నుంచి శివప్రసాద్ వచ్చి అవుట్ పుట్ ఎడిటర్ గా, కందుల రమేష్ ఇన్ పుట్ ఎడిటర్ గా జాయిన్ అయ్యారు. టీ.వీ. ఫైవ్ లో అద్భుతంగా పనిచేసిన రమేష్ గారు, ఐ-న్యూస్ లో, స్టూడియో ఎన్ లో పనిచేసి మానేసి తర్వాత ఐ-న్యూస్ లో చర్చలకు పరిమితమయ్యారు. శివప్రసాద్, రమేష్ ల నియామకాలు జరిగిన కొన్ని రోజుల్లోనే మూర్తి మళ్ళీ రాధాకృష్ణ గారి ఛానెల్ కు వెళ్ళిపోయారు. టీ.వీ.-నైన్ లో, తెలంగాణా ఛానెల్ లో, ఏ.బీ.ఎన్. లో పనిచేసిన జకీర్ కూడా సీ.వీ.ఆర్.ఛానెల్ లో చేరినట్లు సమాచారం. మరి వాసుదేవన్ అయినా...అక్కడ ఉంటారో...ఉండరో వేచి చూడాలి.


త్వరలో తులసి ఛానెల్ ప్రసారాలు
తులసి సీడ్స్ వారి ప్రసారాలు త్వరలోనే ప్రారంభమవుతాయని అంటున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నట్లు సమాచారం. అక్కడ భావనారాయణ అనే సీనియర్ జర్నలిస్టు ఉండే వారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారనీ...ఆ స్థానంలో మాజీ 'ఈనాడు' పెద్దిరాజు చేరారని తెలిసింది. దీనికి సంబంధించి సమాచారం ఉంటే పంచుకోవాలని జర్నలిస్టు మిత్రులకు విజ్ఞప్తి. 


ఇంతకూ...రవిప్రకాష్ తెర మీదకు రావడం లేదేమి?
తెలుగు టీ.వీ.జర్నలిజం లో వినూత్న పోకడలతో తనకంటూ ఒక చాప్టర్ ఏర్పాటు చేసుకున్న రవిప్రకాష్ టీ.వీ.-నైన్ తెర మీద చాలా రోజులుగా కనిపించక పోవడం జర్నలిస్టు సర్కిల్స్ లోనే కాదు...సాధారణ పబ్లిక్ లోనూ చర్చనియాంశమయ్యింది. మొదట్లో నిండైన  విగ్రహంతో నవ్వు మొహంతో చీటికీ మాటికీ లైవ్ లో కనిపించిన రవి ఆ తర్వాత కొద్దిగా పెద్ద పరిణామాలు ఉన్నప్పుడు దర్శనమిచ్చేవారు. ఇప్పుడు అదీ లేదు. చాలా నెలల కిందట జగన్ మనుషులు తన మీద దాడి చేసారని నాకు సమాచారం వస్తే...రవి కి మెయిల్ ఇచ్చాను...అది నిజమేనా అని. అలాంటిదేమీ లేదని ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి వార్తలే వస్తున్నాయి. మా సారు...ఛానెల్ విస్తరణ పనుల్లో ముంబాయిలో బిజీగా  వున్నారని కొందరు ఉద్యోగులు చెబుతుండగా...రవికి ఏదో కాబట్టీ తెర మీదకు రావడం లేడని కొందరు అంటున్నారు. బ్రదర్...ఒక సారి తెర మీద కనిపించ కూడదూ...చాలా రోజులైంది మిమ్మల్ని చూసి.


రాధాకృష్ణ కు పెరిగిన బెదిరింపు కాల్స్?
జగన్ పార్టీ మీద, ఆయన పత్రిక, ఛానెల్ మీద చంద్రబాబు కన్నా పరమ కోపం గా ఉన్నది ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ. రూపాయి దారుణంగా పతనమైనా...రాష్ట్రపతి ఎన్నిక విషయంలో పసందైన రాజకీయం జరుగుతున్నా...ప్రపంచం కొట్టుకు పోతున్నా...పట్టించుకోకుండా రా.కృ.రెచ్చిపోయి జగన్ మీద అక్షర దాడి చేస్తున్నారు. ప్రతి రోజు లాగానే ఈ రోజు జగన్ మీద దాడి చేస్తూ...సంతకంతో కూడిన సంపాదకీయం రాసారు. రా. కృ. ఏమి రాసాడా...అని భయపడి హడావుడిగా చదివితే...చెప్పిందే పదిసార్లు చెప్పి కొండవీటి చాంతాడంత వ్యాసాన్ని సృష్టించాడని తేలింది. రా.కృ.కు కోపం వస్తే అంతే. చంద్రబాల గారి గురించి వివరణ ఇవ్వడం మంచిదే. సంఘసేవిక అయిన ఆమె ఒక్క రా.కృ. గారితోనే ప్రెస్ కవరేజ్ గురించి అంత చేటు మాట్లాడారా? లేక అందరు ఎడిటర్లనూ ఇట్లానే సతాయిస్తున్నారా? అన్నది తేలాలి. అయితే...ఈ వ్యాసంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు రా.కృ.రాసుకున్నారు...చాలా చోట్ల. తనకు ప్రాణహాని ఉన్నట్లు చెప్పారు. ఎవరు, ఏమని బెదిరిస్తున్నారో కూడా...ఆయన వెల్లడించాలి. రా.కృ.లాంటి 'దమ్మున్న' జర్నలిస్టు...'దమ్మున్న' యజమానికి ఏమి జరిగినా....అది ముమ్మాటికీ పత్రికా స్వేచ్చకు గొడ్డలి పెట్టే. కాకపోతే...బ్రదర్ రా.కృ.మీ కాపీ లను ఆ డెస్క్ లో వున్న ఎవరితోనైనా...ఎడిట్ చేయించి ప్రచురించుకోండి. ప్లీస్.

Friday, June 22, 2012

విలేకరులపై నింద...'సాక్షి' కి తగని పని


నాసిరకం జర్నలిస్టులు ఇచ్చే చచ్చుపుచ్చు సలహాల వల్ల కాబోలు...'సాక్షి' పత్రిక, ఛానల్ జర్నలిజాన్ని జనంలో మరింత చులకన చేస్తున్నాయి. సీ.బీ.ఐ. జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ గారిని బద్నాం చేసేపనిలో భాగంగా సాక్షి మీడియా సంస్థ ఇతర సంస్థలలో పనిచేస్తున్న విలేకర్లను ఇబ్బంది పెడుతున్నది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు...ఫోన్ కాల్స్ జాబితా ను విడుదల చేయడం...దాన్ని పదే పదే ప్రసారం చేసి విలేకరులను కుట్రదారులుగా చిత్రీకరించడం దారుణం. రెడ్డి-కమ్మ పోరాటంలో క్రైం జర్నలిస్టులను లాగడం తప్పు. ఇది పత్రికా స్వేచ్ఛ మీద ప్రత్యక్ష దాడి. నిన్నటి రోజు తెలుగు జర్నలిజంలో ఒక దుర్దినం.

తెలుగు మీడియా ఒక రాజకీయ మీడియా అనడంలో సందేహం లేదు. ఎల్లో ప్రెస్ మాత్రమే కాదు...అన్ని కలర్ల ప్రెస్ ఇక్కడ..జనాలను వెర్రోళ్ళను చేస్తూ వర్ధిల్లుతున్నది. కమ్మలు, అదీ ఒక ప్రాంతానికి చెందిన కమ్మ కులస్థులు మాత్రమే, ప్రభువులుగా ఉండాలని మీడియా ముసుగులో ఎవరో ఆదేశిస్తారు, ప్రచారం చేస్తారు, నమ్మ బలుకుతారు. ఈ మీడియా లాబీ వెర్రి ముదిరి పిచ్చి గా మారే సంక్లిష్ట సమయంలో 'సాక్షి' పుట్టుకురావడం...ప్రత్యామ్నాయ జర్నలిజం అందిస్తామని అది చెప్పడం మంచిదయ్యింది. అది నిజంగానే చారిత్రిక అవసరం. అది నికార్సైన జర్నలిజాన్ని అందిస్తుందని ఎవరూ ఆశించలేదు. ఎల్లో ప్రెస్ కు అది చెక్ పెట్టడం మంచిదని సత్యాభిలాషులు అనుకున్నారు. కానీ...జగన్ అరెస్టు తర్వాత 'సాక్షి' బాసుల నిస్పృహ, అసహనం పెరగడం...సీనియర్ జర్నలిస్టులు యాక్టివిస్టులుగా మారడం బాధాకరం. ఆ పత్రిక, ఛానెల్ రాతలు, కూతలు మరీ శృతి మించి రాగాన పడుతున్నాయని అనుకోవడానికి నిన్నటి ఆ సంస్థ చేసిన హంగామా ఒక ఉదాహరణ. 

వృత్తి నిర్వహణలో భాగంగా విలేకరులు దర్యాప్తు సంస్థల అధిపతులతో టచ్ లో ఉండడం...సర్వసాధారణం. ఒక చిన్న విషయం కోసం పలు మార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. ఆ కాల్స్ లిస్టు తయారు చేసి విలేకరుల పేర్లతో ప్రకటన విడుదల చేయడం వెర్రితనం. లక్ష్మి నారాయణ గారితో ఫోన్ లో మాట్లాడినంత మాత్రాన జర్నలిస్టులు కుట్రలో భాగం పంచుకున్నట్లా? ఇది విలేకరుల నిబద్ధతను ప్రశ్నించినట్లు కాదా? వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా కష్టపడి సంపాదించుకున్న మంచి పేరును ఒక్క దెబ్బతో కొట్టి పారేయడం ఏ తరహా జర్నలిజం? 

నిజానికి జే డీ గారి కాల్ లిస్టు సేకరించడం మంచి విషయం. అందులో బంపర్ స్టోరీ యాంగిల్ ఒకటి ఉంది. ఆ అమ్మాయి ఎవరితోనో...జే డీ గారు మాట్లాడిందని, ఆమె ఆంధ్రజ్యోతి అధిపతి తో టచ్ లో ఉండని 'సాక్షి' వాదించింది. నిజానికి అది కరెక్టు పాయింటు. జే.డీ. గారితో మాట్లాడిన క్రైం రిపోర్టర్ల మీద కాకుండా ఈ సింగిల్ పాయింట్ మీద దృష్టి పెడితే బాగుండేది. ఇప్పటికైనా...ఆ మహిళ -జే డీ-ఆర్కే లింకును  వదలకూడదు. 

తెలుగు క్రైం జర్నలిస్టులు...నిజానికి కష్టపడి పనిచేసే గుణం ఉన్నవారు. మహాత్మ (టీ.వీ.-నైన్), రమేష్ వైట్ల (ఎన్.-టీ.వీ.) వంటి జర్నలిస్టులను నేను చాలా ఏళ్ళుగా చూస్తున్నాను. వారికి వృత్తి మీద మమకారం ఉంది. లోగుట్లను బైట పెట్టడానికి వారు పడే కష్టం నాకు స్వయంగా తెలుసు. వారి మీద ఏమైనా ఆరోపణలు ఉంటే...యాజమాన్యాలు చూసుకుంటాయి. వారిని కుట్రలో ఇరికించాలని చూడడం అమానుషం. వై.ఎస్.కు కొమ్ము కాసిన జర్నలిస్టులకు తర్వాత ఆయన అధికారం లోకి వచ్చాక తాయిలాలు దక్కడం నిజం కాదా? అప్పట్లో వై .yes.చెప్పినట్లు రాయకుండానే వారు ఇంత మంచి పదవులకు ఎదిగారా? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. కులం, వై.ఎస్.పట్ల భక్తి వుండడం తప్పు కాదు కానీ...అవి మూర్ఖంగా మారి సాటి విలేకరులను బలి చేసే ఉన్మాదంగా రూపు దాల్చడం ప్రమాదం. ఇప్పటికైనా తప్పెరిగి విలేకరులకు 'సాక్షి' క్షమాపణ చెప్పడం సముచితం. 

Thursday, June 21, 2012

బెంగాల్ పర్యటన పై ఈ రోజు 'ది హిందూ' లో వచ్చిన వ్యాసం

బెంగాల్ పర్యటన మధురమైనదిగా నిన్న నేను ఒక పోస్టు రాసాను. ఈ రోజు 'ది హిందూ' పత్రిక రిపోర్టర్ సుబ్రహ్మణ్యం గారు దీనికి సంబంధించి ఒక చిన్న వ్యాసాన్ని హైదరాబాద్ డౌన్ టౌన్ లో ప్రచురించారు. దానితో పాటు బెంగాల్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు ఇస్తున్నాను...సొంత డబ్బా కేటగిరీ కింద. థాంక్స్...రాము  


A memorable experience for Global Table Tennis Academy team

V.V.S.
SHARE  ·   PRINT   ·   T+  
Raring to go:GTTA team received training at the Naihati Youth Association in West Bengal for two weeks braving inclement weather to fine tune their skills under the tutelage of some of the senior coaches out there.
Raring to go:GTTA team received training at the Naihati Youth Association in West Bengal for two weeks braving inclement weather to fine tune their skills under the tutelage of some of the senior coaches out there.
For the seven-member table tennis team from the Global Table Tennis Academy (GTTA) team, including two national ranking players A. Sreeja and S. Fidel R. Snehit, it was an experience which is bound to make them much better players.
For these paddlers trained at the Naihati Youth Association in West Bengal for two weeks braving inclement weather to fine tune their skills under the tutelage of some of the senior coaches out there.
Sreeja, who was in national coaching camp in Indoor, directly came to Naihati TT Club which is famous for producing about dozen internationals and more than 30 national players.
The GTTA chief coach Somnath Ghosh and Balasuri Shanker, Joint Secretary of the GTTA and S. Ramu, secretary of the GTTA, were there too to lend all moral support as the young talent made a sincere effort to improve their skills.
With the academy which took care of the entire expenditure and also the basic needs of the players, the latter had naturally enough time to stay focussed.
“Before the start of the State TT calendar, we thought we should have a camp in Bengal. Despite the fact that we had to spend lot of money for this, we came back with lot of satisfaction. It is a morale-booster for our kids,” Somnath Ghosh observed.
“Our players got an opportunity to play with the top ranking Bengal players for more than 20 sessions and gave their best to brush up their skills. Indeed it is a very good practice session for us,” the vice-president of the GTTA, Ramdoss Bharatan, said.
Sreeja (India No-5 in sub-junior girls) and Snehit (India No-4 in cadet boys) expressed their happiness over the vigorous training sessions. “The Naihati Association chief coach Mr.Mihir Ghosh and his assistants Mr. Uttam and Mr.Amarnath and our coach Somnath Bhayya helped us learn new tricks,” Sreeja remarked. “We should be much better players in the season ahead thanks to the very professional training programme we had undergone,” she pointed out.
V.V.S.







కాప్షన్లు (వరుస క్రమంలో): 1) శ్యాం నగర్ గెస్ట్ హౌస్ టెర్రేస్ పైన శంకర్ దపతుల వంటశాల.  2) గంగా నదిలో నా పుత్రుడు, కోచ్ లతో నేను 3) శంకర్, కోచ్ లతో నేను 4) ఎం.ఎల్.ఏ.అర్జున్ సింగ్ తో మా బృందం. 5) ఒక రాత్రి విందులో మిహిర్ ఘోష్ తో నా మాటామంతి. చికెన్ పీసుల కోసం సోమ్నాథ్ వెతుకులాట. 6) మిహిర్ ఘోష్ సర్ తో ముచ్చట్లు.

Wednesday, June 20, 2012

పక్షం రోజుల బెంగాల్ పర్యటన విశేషాలు


శ్చిమ బెంగాల్ పేరెత్తగానే....కమ్యూనిస్టుల కంచుకోట అని, విప్లవం పురిటిగడ్డ అని అనిపిస్తుంది. ఒకప్పుడు నాకు అది ఆరాధ్య రాష్ట్రం. ఆ ఎర్రకోటను మమతా బెనర్జీ కూల్చేశారు, విప్లవ యోధులను ఆమె కాల్చేస్తున్నారు. బెంగాల్ పరిణామాలను చూసి...కమ్యూనిజం శకం ముగిసిందని చాలా మంది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఏమి జరుగుతున్నది? అక్కడ ఇక కామ్రేడ్ల శకం ముగిసినట్లేనా? పరిశ్రమలు లేకుండా ఈ రాష్ట్రం ఎలా బతుకుతున్నది? వంటి అంశాలను స్థానికులతో చర్చించే అవకాశం కలిగింది...జూన్ మొదటి రెండు వారాలలో. 

మా గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడెమీ (జీ.టీ.టీ.ఏ.) లో ఆడుతున్న ఆరుగురు మెరికల్లాంటి పిల్లలకు బెంగాల్లో రెండు వారాల పాటు శిక్షణ ఇప్పించేందుకు...నేను, కోచ్ సోమనాథ్ ఘోష్ వెళ్ళాము. మాతో పాటు అకాడమీ జాయింట్ సెక్రటరీ బాలసూరి శంకర్, ఆయన భార్య మాధవీలత వచ్చారు. ఒక గాస్ పొయ్యి తీసుకుని నేనే...పిల్లలకు వండి పెట్టవచ్చని మొదట్లో అనుకున్నాను. కానీ...అది తప్పుడు అవగాహన, చారిత్రిక తప్పిదమని అక్కడి దారుణమైన వాతావరణాన్ని చూశాక తెలిసింది. ఒక ఐదు రోజుల పాటు ఉండేందుకు....శంకర్ దంపతులు వచ్చారు. కానీ...పదిహేను రోజుల పాటు మాతో వుండిపోయారు...పిల్లలకు భోజన వసతి కోసం. ఎన్నో అవాంతరాల మధ్య టూరు చక్కగా సాగింది. 

పోయేటప్పుడు రైల్లో సద్ది పప్పును, మధ్యలో వచ్చిన చక్కటి లిచీలను మోతాదుకు మించి లాగించి...కడుపు నొప్పి, విరోచనాలతో కలకత్తా నగరంలో అడుగు పెట్టాను. మా బృందం లక్ష్యం... 24 పరగణాల జిల్లా లోని నైహటి లో వున్న  రిషి బంకిం యూత్ అసోసియేషన్ వారి టీ.టీ.క్లబ్ లో ఆడేందుకు. కలకత్తా నుంచి రెండు గంటల పాటు ప్రయాణించాలి అక్కడకు చేరాలంటే. ఆ క్లబ్ చీఫ్ కోచ్ మిహిర్ ఘోష్ మార్చి లో మా ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చి వెళ్ళారు. ఆయన ఆహ్వానం మేరకు ఆ క్లబ్ కు వెళ్ళాము. ముందుగా...కోల్ కట  లో  మా కోచ్ సోమనాథ్ ఇంట్లో ఒక రెండు రోజులు ఉన్నాము. వారి ఆతిధ్యం మరిచిపోలేనిది. ఆయన పరిచయం చేసిన కమ్యూనిస్టు లీడర్ ఒకాయనతో సుదీర్ఘంగా మాట్లాడాను. మమత మీద కమ్యూనిస్టులు మహా కోపం తో ఉన్నారనీ... జనం మాత్రం కమ్యూనిస్టుల మీద ఇంకా కోపంగా ఉన్నారని నాకు బోధపడింది. 

ఇన్నేళ్ళ పాటు...బెంగాల్ లో పరిశ్రమలు లేకుండా చేయడం కమ్యూనిస్టులు చేసిన తప్పిదం కాదా? అన్నది నా ప్రశ్న. దాన్ని అంగీకరిస్తూనే....అక్కడ భూసేకరణ ఎంత కష్టమో ఆ నాయకుడు చెప్పారు. నందిగ్రామ్, సింగూర్ లను హాండిల్ చేయడంలో ఎర్ర సర్కార్ విఫలం కావడం మమతకు కలిసివచ్చిందని పలువురు చెప్పారు. అయితే...మమతలో వారు ఒక యోధురాలిని చూస్తున్నారు. మరొక సారి ఎన్నికలు వచ్చినా దీదీ నెగ్గుకు వస్తారని అర్థమయ్యింది. ఎందుకంటే...కమ్యూనిస్టులు చేసిన గూండాగిరీ నే తృణమూల్ కార్యకర్తలు ఇప్పుడు చేస్తున్నారని, మమత బలగం లో చాలా మంది మాజీ కామ్రేడ్లని ఒక బెంగాలి విశ్లేషించారు. నాకు బెంగాలీలు చాలా సౌమ్యంగా అనిపించారు. తలపొగరు గిత్తలు అక్కడ పెద్దగా కనిపించలేదు. రాష్ట్ర రాజధాని లో వున్న బార్ లో ఉండీలేనట్లు వున్న జనాలను చూస్తే ఆశ్చర్యమేసింది. ఇక అక్కడి ఎండ తాకిడికి తట్టుకోవడం మా వల్ల కాలేదు. హుమిడిటీ వల్ల తడిసి ముద్దయ్యాం. భానుడి ప్రతాపానికి అక్కడి రోడ్ల మీద వెళుతున్న వారు వెళుతున్నట్లు కొందరు మరణించారు. అందుకే...ఏ.సీ.గది దాటి బైటికి రాలేదు. రాష్ట్ర సమాచార మంత్రిగా పనిచేసి ఇప్పడు కలకత్తా విశ్వ విద్యాలయంలో జర్నలిజం బోధిస్తున్న ఒక ప్రొఫెసర్ తో ఫోన్ లో మాట్లాడాను. కానీ...ఆయన్ను కలవడం కుదరలేదు.  ఆయన్ను కలిస్తే మరింత సమాచారం దొరికేది. అక్కడి మీడియా రాజకీయ పోకడల మీద బ్లాగు కోసం వ్యాసం రాయాలన్న నా ప్రయత్నం ఫలించలేదు. 

నైహటి లో మాకు చౌకగా దొరకాల్సిన బస దొరకలేదు. చివరి నిమిషం లో అది రద్దయ్యింది. అందుకే...అక్కడికి పది కిలోమీటర్ల దూరంలోని శ్యాం నగర్ లో ప్రభుత్వ గెస్ట్ హౌజ్ ను అద్దెకు తీసుకున్నాం. అలా జరగడం నిజంగా మా అదృష్టం. మా విడిది పక్కన...రెండు వందల ఏళ్ళనాటి కాళీ మాత ఆలయం ఉంది. ఎదురుగా...అంత వేసవి లోనూ...హాయిగా పారుతున్న గంగా నది కనుచూపు మేర కనిపిస్తున్నది. ఆ గంగ పెద్ద మురికిగా లేదు. ఒక పూట ఒక దిశలో మరొక పూట మరొక దిశలో అది పారుతున్నట్లు మాకు అనిపించింది. వచ్చీ రాని హిందీ లో మూగ సైగలతో మా శంకర్ మొత్తం వ్యవహారాన్ని చక్క పెట్టాడు. మర్నాడు సాయంత్రం కల్లా...మా వంటలు మేము వండుకునే ఏర్పాటు జరిగింది. పూర్తిగా కొత్తదైన ఆ ప్రాంతంలో...పిల్లలకు మాకు శంకర్ దంపతులు రోజూ ఆంధ్రా భోజనం వండి పెట్టారు. మా కోసం వారు పడిన శ్రమ మరువలేనిది.  

ఉదయం...సాయంత్రం...పిల్లలను ఆ మండే ఎండలో నైహటి కి లోకల్ రైల్లో తీసుకువెళ్ళడం నా పని. టికెట్ కొనాల్సిన పనిలేదని పలువురు వారించినా....రోజూ క్యూలో నిల్చుని పిల్లలకు నాకు రైలు టికెట్స్ కొన్నాను. చాలా మంది టికెట్స్ లేకుండా వెళ్తారట. అక్కడి లావుపాటి బియ్యం వల్ల నా పొట్ట డబలయ్యింది. వీలు దొరికినప్పుడల్లా...గంగ నుంచి వస్తున్న వాటర్తో షవర్ బాత్ చేస్తే గానీ...ప్రాణం కుదుట పడలేదు. అక్కడి రాజకీయా గురించి తెలుసుకోవాలన్న సంకల్పంతో స్థానిక ఎం.ఎల్.ఏ. అర్జున్ సింగ్ (తృణమూల్) ఆఫీసుకు వెళ్లి ఆయన్ను కలిసాను. భాట్పర మునిసిపాలిటి ఛైర్మన్ కూడా అయిన ఆయన ప్రజలతో కలిసి పనిచేస్తున్నాడు. ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళిన కరాచీ బేకరీ బిస్కట్ పాక్ ఒకటి ఇచ్చాను. 'మా విడిది కి వచ్చి దక్షిణాది భోజనం రుంచి చూడ కూడదూ..." అని మాట వరసకు అంతే...మర్నాడు రాత్రి డిన్నర్ కు వచ్చాడు. ప్రజల కోసం పనిచేయడమే విజయానికి మార్గమని, దీదీ  కి మంచి భవిత ఉండని చెప్పాడు. మా అమ్మ ఇచ్చిన గోంగూర పచ్చడి, మాధవీలత గారు వండిన చికెన్, బైటి నుంచి తెచ్చిన చేపల తో మంచి భోజనం పెట్టాం. మా అకాడమీ ట్రెజరర్ రేఖా రామ్దోస్ గారు కూడా వంటలో పాలు పంచుకుని మంచి చెన్నై సాంబార్ వడ్డించారు.  ఒక గంట పాటు ఆయన మాతో గడిపాడు. 

నైహటీ లో ఒకటే ఉక్కపోత. పిల్లలు ప్రాక్టిస్ సెషన్ కు కనీసం నాలుగు టీ షర్టులు మార్చుకునే వారు. అందుకే...నేను, కోచ్ సోమనాథ్ పూనుకుని బాత్రూం లో కూర్చుని రోజూ ఒక పాతిక ముఫై టీ షర్టులు ఉతికి ఆరేసే వాళ్ళం. కోచింగ్ క్యాంపులో అంతర్జాతీయ జాతీయ క్రీడాకారులతో ఆడే అవకాశం మాకు కలిగింది. పేదలను ఆదరించి ఆట నేర్పే నైహటి టీ.టీ.అకాడమీ లో సౌకర్యాలు పెద్దగా లేవు. అయినా అక్కడి నుంచి చాలా మంది నాణ్యమైన క్రీడాకారులు తయారయ్యారు. అందుకు కారణం...మిహిర్ ఘోష్ గారు. మన ఆంధ్రా కోచులకు భిన్నంగా ఆయన నయా పైసా ఆశించకుండా రోజుకు నాలుగు గంటల పాటు రైల్లో ప్రయాణించి వస్తూ పోతూ పిల్లలకు ఆట నేర్పుతున్నారు...గత పద్దెనిమిది ఏళ్ళుగా.  తాగుడుకు, వ్యర్ధ ప్రసంగాలకు, డబ్బుకు బానిసలైన కోచులకు మిహిర్ ఘోష్ ఒక గుణపాఠం.        

మిహిర్ ఘోష్ శిక్షణలో రాటు తేలుతున్న డాలీ అనే ఒక అమ్మాయిని మేము కలిసాము. చిన్నతనం లోనే తల్లిని కోల్పోయింది. రొండో పెళ్లి చేసుకుని తండ్రి వెళ్ళిపోతే...అక్కడి కాలనీ ప్రజల సహకారంతో అమ్మమ్మ ఆ పాపను పెంచుతున్నది. మేము రెండు రోజుల్లో వస్తామనగా ఆమె బర్త్ డే వచ్చింది. వెంటనే...మా కోచ్ సోమనాథ్ తన కోసం ఒక కేక్ ఆర్డర్ చేసి...అక్కడి పిల్లల సమక్షంలో కట్ చేయించాడు. బెంగాల్ కాడేట్, సబ్ జూనియర్ విభాగాలలో చాంపియన్ అయిన ఆ పాపకు ఒక ఐదు వందలు ఇచ్చి డ్రస్ కొనుక్కోమన్నాను. వద్దు అంటున్న డాలీ కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి. "నువ్వు...నా కూతురు లాంటి దానివి...తీసుకో..." అని అన్నాను. భారత టేబుల్ టెన్నిస్ యవనిక మీద భావి ఆణిముత్యం డాలీ. డాలీ కే కాదు...నాకూ నాతో పాటు వున్న బృందానికి ఈ పక్షం రోజుల పర్యటన ఒక మధురానుభూతి. 

Saturday, June 2, 2012

సగంతృప్తితో ఐ.ఎస్.జే.కు రాం..రాం..


తెలుగు నేల మీద జర్నలిజం స్కూల్ నడపడం చాలా కష్టం. అన్ని మీడియా సంస్థలు డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ ఇస్తుంటే...ఫీజులు వసూలు చేసి స్కూల్ నడపడం కష్టం. అందుకేనేమో...రామానుజం గారు కపిల్ గ్రూప్ వారి ఇండియన్ స్కూల్ అఫ్ జర్నలిజాన్ని మొదలు పెట్టి...ఫస్ట్ బ్యాచ్ తయారు కాకముందే పారిపోయారు. స్కూలు ఆరంభంలో నన్ను పట్టించుకోని రామచంద్ర మూర్తి గారు...స్కూల్ నడపమని నన్ను కోరారు రెండేళ్ళ కిందట. అక్కడ చేరాక అర్థమయ్యింది జర్నలిజం స్కూల్ ను నడపడం చాలా కష్టమని. నేను సెకండ్ చాయిస్ కాబట్టి ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సింది లేదు. 

నా అంత తురుంఖాన్ జర్నలిస్టు లేడని రోజూ విర్ర వీగే జర్నలిస్టులతో....ఇవ్వాల్టి మాటను ఎల్లుండికి మార్చిపారేసే పెద్ద మనుషులతో వేగడం కష్టం. అయినా.....ఏదో చేయాలన్న తపన, మన అవసరం దృష్ట్యా మొత్తం మీద మూడు బ్యాచులు నడిపాం. పిల్లలను సాధ్యమైనంత బాగా తీర్చిదిద్దాం. పేపర్లలో ప్రకటనలకు అప్పటికే రామానుజం గారు చాలా ఖర్చు పెట్టారని, ఇక మీదట యాడ్స్ లేకుండానే బండి లాంగించాలని మూర్తి గారు విషమ పరీక్ష పెట్టారు. మొదట్లో హెచ్.ఎం.టీ.వీ, తర్వాత ద హన్స్ ఇండియా ల లో ప్రకటనలు వేసి సరైన స్పందన రాక నానా చావు చచ్చాను. వేరే టీం అయితే స్కూల్ బాగు పడుతుందేమో నేను మార్చ్ లో రాజీనామా పత్రం సమర్పించి జూన్ ఫస్టున బాధ్యతల నుంచి వైదొలగాను. కాస్త ఖర్చు చేసి నడిపితే....నిజానికి దీన్ని బాగా తీర్చి దిద్దవచ్చునని కపిల్ గ్రూప్ ఛైర్మన్ వామన రావు గారికి కూడా చెప్పాను. కానీ...రెండు సంస్థలు నష్టాలలో ఉన్నందున తాత్కాలికంగా ఐ.ఎస్.జే.ను మూసివేశారు. అదొక్కటే బాధ కలిగించే విషయం. అయినా....మూర్తి గారు త్వరలోనే మళ్ళీ దీన్ని తెరుస్తారని అనుకుంటున్నాను. 

నేను విజిటింగ్ ఫాకల్టీ గా ఉన్న యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పిల్లలకు తీసిపోని విధంగా ఇక్కడ పిల్లలను తయారు చేసాం. అదొక తృప్తి. నిన్న ఆఫీసుకు వెళ్లి...అన్ని లాంఛనాలను పూర్తిచేసుకుని, మూర్తి గారిని కడసారి కలిసి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలిపి బైటికి వచ్చాను. కాసేపట్లో వస్తామనగా వామన రావు గారు కనిపించారు. ఆయనకూ ఒక మాట చెప్పి వచ్చాను. మూర్తి గారి లాంటి ఎడిటర్ దగ్గర పనిచేయడం బాగుంటుందని...Osmania University, Administrative Staff College of India లలో మంచి అసైన్మెంట్లను వదిలి ఐ.ఎస్.జే.లో చేరిన నాకు  అక్కడ అద్భుతమైనదిగా అనిపించిన అంశం ఒకటి ఉంది. అదే...వందల కోట్ల విలువ చేసే కపిల్ గ్రూప్ ఛైర్మన్ వామన రావు గారి simplicity. ఆయన నడవడిక, ఇతరులతో మాట్లాడే తీరు, ఇతరులకు ఇచ్చే గౌరవం...నిజంగా అద్భుతం. ఐ.ఎస్.జే. లో నేను నేర్చుకున్న పాఠం....ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని. Hats off to Vamana Rao garu. 

చెపితే...ఎచ్చులు అనుకుంటారు గానీ సరదాకు ఒక విషయం చెప్పాలి. నేను ఐ.ఎస్.జే.లో చేరిన కొన్ని రోజులకే హెచ్.ఎం.టీ.వీ. టాం రేటింగ్స్ లో మూడో స్థానానికి చేరుకుంది. సార్...మీది గోల్డెన్ లెగ్...అని ఒక ఉద్యోగి అంటే...'ఆపు నీ చాదస్తం' అని నేను రెండేళ్ళ కిందట మందలించాను. నిన్న ఫోన్ చిప్ ఇచ్చే ముందు చూసుకుంటే...టాం రేటింగ్స్ తాజా ఫలితాలు వచ్చాయి. అందులో హెచ్.ఎం.టీ.వీ. అన్నిటికన్నా చివరి స్థానం లో ఉండని లెక్కలు చెబుతున్నాయి. నిన్నకాక మొన్న పుట్టిన V6 ఛానల్ కన్నా హెచ్.ఎం.టీ.వీ. పరిస్థితి గణనీయంగా దిగజారడం బాధ కలిగించింది. జగన్ భజన మాని....ఈ చానల్ ఎప్పటిలాగా నైతిక జర్నలిజానికి పెద్ద పీట వేస్తుందని ఆశిస్తాను. ఎంతో ఉత్సాహంతో నమ్మకముంచి వామన రావు గారు పెట్టిన కోట్ల రూపాయల పెట్టుబడికి తగిన ప్రతిఫలం లభించాలని ఆశిస్తున్నాను.  
------
నోట్: నేను ఎల్లుండి నుంచి కలకత్తా లో ఒక పది రోజులు వుంటాను. అక్కడ నివసిస్తున్న తెలుగు బ్లాగర్స్ ఎవరైనా ఉంటే...నాకు మెయిల్ పంపండి. సరదాగా అక్కడ కలుద్దాం.