Monday, January 25, 2016

'ఈనాడు' రామోజీ గారికి పద్మ విభూషణ్; కంగ్రాట్స్!!!

తెలుగు జర్నలిజాన్ని, రాజకీయాలను విడివిడిగా కలివిడిగా కొత్త పుంతలు తొక్కించిన వ్యాపారవేత్త 'ఈనాడు' గ్రూపు చైర్మన్ శ్రీ చెరుకూరి రామోజీ రావు గారికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. సెప్టెంబర్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేరును ఈ అవార్డుకు సిఫార్సు చేయగా ఈ రోజు కేంద్రం ఈ ప్రకటన చేసింది. 


రామోజీ గారితో పాటు, సినీ స్టార్ రజనీకాంత్, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, ఆథ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవి శంకర్ లను పద్మ విభూషణ్ వరించింది. 
అవార్డు గ్రహీతలతో పాటు రామోజీ రావు గారికి ప్రత్యేక అభినందనలు. ఈ అవార్డుకు ఆయన అర్హుడు కాడని అనే వారితో ఈ బ్లాగు బృందం ఏకీభవించడం లేదు. తెలుగు జర్నలిజం ప్రమాణాలు ఈ రోజు ఈ స్థాయిలో-మంచో చెడో- ఉండడానికి కారణం... రామోజీ గారి తెగింపు.. దాంతో పాటు ఆయన ముందు చూపుతో ఏర్పాటు చేసిన 'ఈనాడు జర్నలిజం స్కూల్' అనే జర్నలిస్టుల కర్మాగారమ్. 
కంగ్రాట్స్... రామోజీ జీ. 
రామోజీ గురించి కారవాన్ పత్రిక ప్రచురించిన సుదీర్ఘ వ్యాసం ఇక్కడ చదవండి: Chairman Rao  
Photo courtesy: my firstshow.com

Sunday, January 24, 2016

ఈ పీ డబ్ల్యు ఎడిటర్ గా పరంజోయ్ గుహ ఠాకూర్త

నాణ్యమైన విశ్లేషణలకు, పరిశోధన పత్రాల ప్రచురుణకు వేదికైన ఈ పీ డబ్ల్యు (ఎకానమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ) నూతన ఎడిటర్ గా జర్నలిజం లో సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు, రచయిత, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, జర్నలిజం బోధకుడు పరంజోయ్ గుహ ఠాకూర్త ఎంపికయ్యారు. 

పదకొండు సంవత్సరాల పాటు ఆ పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించి నాణ్యతను మరింత పెంచిన తెలుగు బిడ్డ సీ రామ్మనోహర్ రెడ్డి గారి స్థానంలో ఠాకూర్త ను పత్రిక యాజమాన్యం (సమీక్ష ట్రస్టు) నియమించింది. ఏప్రిల్ ఫస్టు నుంచి కొత్త ఎడిటర్ బాధ్యతలు స్వీకరిస్తారు .

పత్రిక యాభై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తీసుకురాదలచిన ప్రత్యేక సంచిక విషయంలో  రామ్మనోహర్ రెడ్డి గారికి, ట్రస్టు అధిపతులకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.  రామ్మనోహర్ రెడ్డి గారి ని వదులుకోవద్దని సూచిస్తూ దేశ విదేశాల నుంచి 101 మంది మేథావులు, ప్రొఫెసర్లు, సామాజిక కార్యకర్తులు ట్రస్టు కు ఒక లేఖ కూడా రాసారు. ఈ లేఖను ది వైర్ ప్రచురించిన లింక్ ను ఇక్కడ చూడండి,
http://thewire.in/2016/01/15/a-letter-to-the-sameeksha-trust-from-the-epw-community-19389/

వివిధ పత్రికలలో వ్యాసాలు ప్రచురించే పరంజోయ్ గారు తెలుగు నేల మీద వెల్లివిరిసిన పెయిడ్ న్యూస్ జాడ్యం పై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమించిన సబ్ కమిటీ లో సభ్యుడు. ఆయనతో పాటు అప్పట్లో విశాలాంధ్ర లో సీనియర్ పొజిషన్లో ఉన్న జర్నలిస్టు యూనియన్ లీడర్ శ్రీనివాస రెడ్డి కూడా అందులోని రెండో సభ్యుడు. 'మీడియా ఎథిక్స్' మీద పరంజోయ్ గారు రాసిన పుస్తకం విశేష ఆదరణ పొందింది. http://www.paranjoy.in/ లో ఆయన వ్యాసాలు ప్రచురిస్తారు.

ఆయన నియామకంపై 'ది హిందూ'ఈ రోజు ప్రచురించిన వార్త ఇది:

Tuesday, January 19, 2016

'ది హిందూ' లో అసలేమి జరుగుతోంది?

1889 నుంచి దినపత్రికగా వస్తూ... నైతిక జర్నలిజానికి ప్రతినిధిగా జనం నమ్మే స్థాయికి ఎదిగిన 'ది హిందూ' పత్రికలో పరిణామాలు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. కుటుంబ కలహాలు, అహం పోరాటాల మధ్యన పత్రిక, అందులో పనిచేసే జర్నలిస్టులు నలిగిపోతున్నారు. 

'ది హిందూ' మొదటి మహిళా సంపాదకురాలిగా.. ఫిబ్రవరి 1, 2015 న బాధ్యతలు స్వీకరించిన మాలినీ పార్థసారధి  ఏడాది తిరగకుండానే...కొత్త సంవత్సరం జనవరి మొదటి వారంలో రాజీనామా చేసారు. తన పదవీ కాలంలో.. సీనియర్ఎడిటర్లు, జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత లేకుండా దడదడలాడించిన మాలిని గారి రాజీనామా కు కారణం కుటుంబ సభ్యుల మధ్య మనఃస్పర్ధలని చెబుతున్నారు. ఆమె రాజీనామా గురించి జనవరి  5 వ కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ బోర్డు చైర్మన్ ఎన్. రామ్ చేసిన ప్రకటన ఇది:

Malini Parthasarathy has resigned as Editor of The Hindu with immediate effect.
Suresh Nambath, National Editor, The Hindu, has been entrusted with the responsibility of managing the news and editorial operations of The Hindu until a new Editor is appointed.
The KSL Board has placed on record its appreciation of the contribution of Malini Parthasarathy as Editor of The Hindu. She will continue as a Wholetime Director of Kasturi & Sons Ltd.
N. Ram
Chairman of Kasturi & Sons Limited & Publisher of The Hindu


ముకుంద్ పద్మనాభన్ లేదా వేణు లేదా నిర్మలా లక్ష్మణ్ తదుపరి ఎడిటర్ కావచ్చని అంటున్నారు. అయితే, కారణాలు ఏవైనా... మాలిని ఆ పదవికి రాజీనామా చేయడంతో ఆ పత్రిక ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమె హయాం లో ముంబాయి ఎడిషన్ ఆరంభం కావడం ఒక్కటి మినహా మిగిలినవన్నీ బాధాకరమైన నిర్ణయాలే అని చెన్నై ఆఫీసు లో అనుకుంటున్నారు. ఎడాపెడా బదిలీలు చేసి ఉద్యోగ అభద్రత సృష్టించడాన్ని జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. 
సీనియర్ ఎడిటర్లు సైతం మేడం ఎప్పడు సైతాను నిర్ణయం తీసుకుని ఇంటికి వెళ్ళిపొమ్మని అంటారేమో అని భయపడిన వారు ఇప్పుడు కొద్దిగైనా మార్పు వస్తుందని భావిస్తున్నారు. 
ముంబాయి ఎడిషన్ తేవడంలో ఎంతో కృషి చేసిన తెలుగు బిడ్డ శ్రీనివాస రెడ్డి గారిని వదులుకోవడం ఆమె చేసిన పెద్ద తప్పిదాల్లో ఒకటి. ఆమె బాదితుడైన మరొక సీనియర్ జర్నలిస్టు మురళీధర్ రెడ్డి గారు మాత్రం ఇంకా హైదరాబాద్ ఆఫీసులో రిపోర్ట్ చేస్తున్నారని భోగట్టా.  సాధారణ ప్రజానీకం గురించి ఇప్పటికీ పట్టించుకుంటూ... రూరల్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తున్న 'ది హిందూ' కు మంచి రోజులు రావాలని ఆశిద్దాం. 

Sunday, January 17, 2016

శ్యాం రావ్ హర్నూర్ గారికి ఘన నివాళి

జర్నలిజం ఒక గమ్మత్తైన వృత్తి. బుర్రలో గుజ్జు లేకపోయినా... దీన్ని అడ్డం పెట్టుకుని తెగ సంపాయించి మేథావులుగా పోజు కొడుతూ బతికేస్తున్న అధికసంఖ్యాక మహానుభావులు ఒక రకం. నిజంగానే ఈ వృత్తిని పవిత్రంగా భావించి జీవితాంతం నికార్సైన జర్నలిస్టులుగా బతికిన వారు కొందరే అయినా ఇతరుల మది పొరల్లో కలకాలం నిలిచి పోతారు.

ఈ రెండో రకానికి చెందిన వారిలో ఒకరు శ్యాం రావ్ హర్నూర్ గారు అని సీనియర్ జర్నలిస్టుల వల్ల తెలుస్తున్నది. ప్రసిద్ధి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీ టీ ఐ) లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన జనవరి 12 న 87 ఏళ్ళ వయసులో మరణించారు. వారి గొప్పతనాన్ని స్ఫురించుకుంటూ... సీనియర్ జర్నలిస్టు ములుగు సోమశేఖర్ గారు తన ఫేస్ బుక్ పేజీ లో ఘన నివాళి అర్పించారు. 1952 లో పీ టీ ఐ లో చేరడానికి ముందు... హర్నూర్ గారు రయ్యత్, ఇమ్రోజ్, సెంటినల్ అనే పత్రికలలో పనిచేసారు. ఇందులో మొదటి రెండు పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించిన షోయబుల్లా ఖాన్ రాజాకార్ల చేతిలో హత్యకు గురైన సంగతి జర్నలిస్టులకు తెలుసు.
సీనియర్ డిప్యూటీ ఎడిటర్ హోదాలో బిజినెస్ లైన్ పత్రిక బ్యూరో చీఫ్ గా పనిచేసున్న సోమశేఖర్  గారికి పీ టీ ఐ లో కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఆ నివాళిని యథాతథంగా మీ కోసం అందిస్తున్నాం. వారికి థాంక్స్.
A Tribute
Sham Rao Harnur, the former Manager of the PTI, who passed away on Tuesday morning was one of the last of the complete wire service Journalists from Hyderabad. He was a gentleman, soft spoken and thorough professional. He was among my first bosses in Journalism. In good measure, he was instrumental in encouraging me with reporting on virtually all subjects as a rookie reporter at PTI in the mid-1980s. 
The 87 year old Sham Rao was a linguist, who could read Urdu, Telugu, Kannada, Hindi which helped him and also the agency in exhaustive coverage of events from the city. He was an efficient man-manager and loved to wear his coats and formals to events and assignments. He commanded respect in the political circles with CMs like Marri Chenna Reddy, Kasu Brahmananda Reddy, Vengala Rao etc on first name basis. Leaders like Rosaiah (governor of TN now), V Hanumantha Rao, Quereshi etc would often come to the office. 

For four decades, starting from the formation of the combined AP, he served the agency with commitment and guided its growth. With PTI being an office with home attached, he was always at hand when any development took place. For most Cong(I) leaders and State Governors, a report from PTI was a must to reach Delhi and high command, and hence the agency was the focal point of lot of action during those times. Sham Rao was seldom swayed by political leanings as he stuck to factual, thoroughly sourced reportage. 

This highly non-controversial Journalist, however, had his share of controversy, when he put out a `scoop', that nearly a dozen MLAs with NTR were shifting to Nadendla Bhaskara Rao, during the 1984 political drama that saw NTR being dethroned for nearly 30 days and dramatically returning to power. The story raised national attention and was debated for sometime. Sham Rao was quick in reporting, fast in typing and could get his team to cover events extensively. It was under his stewardship that me, Dinesh Sharma and G Rajaraman, all classmates in Journalism from Osmania University had the unique opportunity to work and learn the finer aspects of agency Journalism. Proud that Dinesh is an accomplished Science Journalist and Rajaraman an acclaimed Sports Scribe in the country now.

 PTI provided the opportunities and to good measure, I shall be indebted to Sham Rao Harnur for a good part of all the initial learning, assignments and political contacts to whatever progress I have made in the profession. He retired in 1990 in the true sense. Leading a peaceful life away from the media. His son, Sridhar a fellow Nizamian became a crime reporter before moving on to the US. His brother, RV Harnur is a well known News Editor and a close relative P Vaman Rao, a noted Journalist. 

Tuesday, January 12, 2016

మీడియా మహారాజుకు నాలుగో పెళ్లి


వార్తా ప్రపంచం రూపురేఖా విలాసాలు పూర్తిగా మార్చేసి, జర్నలిజాన్ని మంచి వ్యాపారంగా మార్చి కోట్లు గడించిన మీడియా మహారాజు రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) నాలుగో పెళ్లి చేసుకోబుతున్నారు. ఒకప్పటి నటి-మోడల్ జెర్రీ హాల్ (59 ఏళ్ళు) ను ఈ న్యూస్ కార్పోరేషన్ కంపనీ అధిపతి (84 ఏళ్ళు) మనువాడబోతున్నారు.  
తన అధ్వర్యంలో నడుస్తున్న 'ది టైమ్స్' లో జననాలు, వివాహాలు, మరణాల సెక్షన్ లో ఈ జంట ఈ విషయాన్ని ఈ విధంగా (పక్కన చూడండి) ప్రపంచానికి చాటింది. గత అక్టోబర్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య లండన్ లో జరిగిన రగ్బీ ప్రపంచ కప్ ఫైనల్స్ లో వీరిద్దరూ జనాలకు కలిసి కనిపించారు. ఆస్ట్రేలియా లో పుట్టి అమెరికా జాతీయత స్వీకరించిన మర్దోక్ తన మూడో భార్య వెండీ డెంగ్ నుంచి 2013 లో విడాకులు తీసుకోగా, అమెరికాకు చెందిన హాల్ సర్ మిక్ తో 23 ఏళ్ళ బంధానికి 1999 లో తెరదించింది. 

BBC వారి కథనం ప్రకారం రూ. మ. గారి పూర్వాపరాలు, ఘనతలు ఇలా వున్నాయి. 
  • Wealth: According to Forbes in 2015, Rupert Murdoch and his family have a net worth of $11.2 billion (£7.7bn), making him the 77th richest person on the planet.
  • Newspapers: Born in 1931, he inherited two Adelaide newspapers from his father at the age of 22 and built his media empire from there. Now executive chairman of News Corporation, Rupert and his family control 120 newspapers in five countries, including the Sun and the Times in the UK, and also own book publisher HarperCollins.
  • Television: The Murdoch family own a large cable TV network, including the Fox channels in the US. Rupert is also co-executive chairman, with his son Lachlan, of 21st Century Fox, and owns a large stake in broadcaster Sky.
  • Personal life: He married Patricia Booker, a flight attendant from Melbourne, in 1956. They had one child, Prudence, and divorced in 1967. His second marriage to Glasgow-born journalist Anna Torv lasted 32 years, ending in 1999. They have three children, Elisabeth, Lachlan and James. His third marriage to Chinese-born businesswoman Wendy Deng ended in 2013 after 14 years and two children, Grace and Chloe.
  • Controversy: His battles with striking journalists in 1986 outside his newspapers' Wapping headquarters heralded a revolution in Fleet Street. Some 5,000 staff lost their jobs, but the move also spelled an end to over-manning and restrictive practices. More than 20 years later, he was in the spotlight over the phone hacking scandal, infamously being attacked with a foam pie during a meeting with MPs.

Thursday, January 7, 2016

1991 'ఈ జే ఎస్' బ్యాచ్ సిల్వర్ జూబ్లీ మీట్

తెలుగు జర్నలిజానికి ఎందరో మంచి జర్నలిస్టులను అందించిన 'ఈనాడు జర్నలిజం స్కూల్' మొట్టమొదటి బ్యాచ్ (1991) బృందం జనవరి 3, 2016 (ఆదివారం) నాడు కలుసుకుని ఎంతో ఉత్సాహంగా 'సిల్వర్ జూబ్లీ మీట్' జరుపుకున్నారు. 

ఈ బ్యాచ్ నుంచి కాల్వ శ్రీనివాస్ లాంటి రాజకీయ నాయకులు, పొలిటికల్ వార్తలు అద్భుతంగా రాసే నేలకొండపల్లి భార్గవ లాంటి వారు, జర్నలిజాన్ని నమ్ముకునిఅంచెలంచెలు గా ఎదుగుతున్న ఎం.ఎల్. నరసింహా రెడ్డి, డబ్బీరు రాజేంద్ర ప్రసాద్, జీ వెంకటేశ్వర్లు లాంటి వారు, సినిమాల్లో అదృష్టాన్నిపరీక్షించుకుంటున్న శ్రీనివాస్, సతీష్ తదితరులు ఉన్నారు. ప్రతి బ్యాచ్ లో మాదిరిగానే కొందరు టీచర్లు కూడా ఉండి ఉంటారు. 

ఈ పూర్వ మిత్రుల సమ్మేళనం మీద త్వరలో మరొక పెద్ద పోస్టు ఉంటుంది.
మీట్ కు సంబంధించిన ఫోటో ఇది:

Monday, January 4, 2016

అది 'తెలంగాణా టుడే' నే.... వచ్చేది ఉగాదికి!

'నమస్తే తెలంగాణా' తెలుగు పత్రిక వారి ఇంగ్లిష్ పత్రిక పేరు 'తెలంగాణా టుడే' అనీ, సీనియర్ జర్నలిస్టు కె. శ్రీనివాస్ రెడ్డి గారు దానికి ఎడిటర్ అని దృవపడింది. కిందటేడాది (2015) చివరి రోజు (డిసెంబర్ 31) సాయంత్రం 4.59 గంటలకు శ్రీనివాస్ రెడ్డి గారు తన ఫేస్ బుక్ పేజీ లో ఈ కింది నోట్ ద్వారా వారి కొత్త పాత్రను ప్రకటించారు.

Friends. I have joined as Editor of 'Telangana Today', an English daily to be launched shortly from Hyderabad. Wishing you a Happy New Year!

ఇప్పుడు 'నమస్తే తెలంగాణా' ప్రాంగణంలో... శ్రీ సీ లక్ష్మీ రాజ్యం గారి యాజమాన్యంలో వస్తున్న 'మెట్రో ఇండియా' అనే ఆంగ్ల పత్రికనే రూపు రేఖా విలాసాలు మార్చి 'నమస్తే తెలంగాణా' అధ్వర్యంలో తెస్తారన్న ఒక ప్రచారం/ భ్రమకు రెడ్డి గారు ఈ నోట్ ద్వారా తెరదించారు. రెడ్డి గారు షార్ట్లీ అన్నారు కానీ... తెలంగాణా టుడే ఒక నాలుగు నెలల్లో... బహుశా ఉగాది నాటికి వస్తుందని భావిస్తున్నారు.


ఇందుకోసం జర్నలిస్టుల నియామకాల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. శ్రీనివాస్ రెడ్డి గారిని చూసి పత్రిక లో చేరే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. చివరకు 'ది హిందూ'నుంచి కూడా ఒక బృందం అక్కడ చేరబోతున్నట్లు ప్రచారం భారీగా జరుగుతోంది. 'కనీసం ఎనిమిది మంది వెళ్తారట. నిజంగానే అది జరిగితే.. ది హిందూ లో అదే పెద్ద భారీ వలస అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో... కొందరు ది హిందూ నుంచి వెళ్ళే అవకాశం బాగానే ఉంది,"అని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పిన మాట నమ్మదగినదిగానే ఉంది.

ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి ముందు ఉన్న ఒక కఠినాతికఠినమైన సవాలు: నాణ్యమైన జర్నలిస్టులను సత్తా ప్రాతిపదికన ఎంచుకోవడం. మీడియా అనగానే... తప్పులు లేకుండా తన పేరు రాయగలవాడు, నాలుగు మాటలు చెప్పి బతకగలిగిన ఎవడైనా చేయదగ్గ ఉద్యోగం అన్న అభిప్రాయం  పెరిగిన నేపథ్యంలో... మన కులపోళ్ళు, వేలువిడిచిన మేనమామ మనమళ్ళు, భజనపరులు పోలో మంటూ వస్తారు.  ఈ కులాభిమానానికి, మనో వికారాలకు లొంగితే ఇంతే సంగతులు... చిత్తగించవలెను. ఇప్పుడు మన తెలుగు టీవీ ఛానెల్స్ నాశనం కావడానికి ఇలాంటి చెత్త నియామకాలే పెద్ద కారణం.  

నిజానికి పక్కా రీజనల్ ఇంగ్లిష్ పత్రిక ఇంతవరకూ ఒక్కటీ లేదు మనదగ్గర. ఆ లోటును పూడ్చే ప్రయత్నాన్ని 'మెట్రో ఇండియా', 'హన్స్ ఇండియా'లు చేస్తున్నాయి కానీ... అంత్యంత ప్రతిభావంతులైన జర్నలిస్టుల కొరత వాటిని పీడిస్తున్న అంశాల్లో ఒకటి. జీతాలు తక్కువగా ఇస్తూ... ఉద్యోగ అభద్రతను సృష్టిస్తే మంచి జర్నలిస్టులు దొరకరు. శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో 'తెలంగాణా టైమ్స్' ఈ సమస్యలు అధిగమించి చరిత్ర సృష్టించాలని కోరుకుందాం.

కొత్త సంవత్సరం సందర్భంగా... శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కే సీ అర్ గారిని కలిసిన దృశ్యం ఇది. ఇది రెడ్డి గారి ఫేస్ బుక్ నుంచి సంగ్రహించబడింది.  

Friday, January 1, 2016

నూతన సంవత్సర శుభాకాంక్షలతో... హీరోలు, నీరోలు, జీరోలు

ప్రియమైన మిత్రులారా... మా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 
బ్లాగులో రెగ్యులర్ అప్ డేట్స్ గురించి మిత్రులు మెయిల్స్ రాస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. అయినా... మీడియా లో పరిణామాలను తాజాగా అందించడంలో మేము ముందే ఉన్నామండీ. 
కొత్త సంవత్సరం సందర్భంగా వారంలో కనీసం నాలుగైదు పోస్టులు పెట్టాలని మా బృందం కృతనిశ్చయంతో ఉందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. థాంక్స్. 
-----------------------------------------------------
 ప్రతి ఏడాది మాదిరిగానే 2015 కూడా గిర్రున తిరిగి ముగిసి పోయింది. ఈ రోజు పేపర్లో 'ఈనాడు'దీని మీద ఒక భయంకరమైన కవిత రాసింది. అది ఇదీ...

కాలచక్ర భ్రమణంలో.. కరిగింది మరో వసంతం 
కుడ్యంపై చేరాతల డైరీ.. నేడు జ్ఞాపకాల శిలాక్షరం 
కేర్ మన్న సవ్వడి.. వసంతోత్సవ అలికిడి
నడిరాత్రి కేరింత.. కొంగొత్త ఆకాంక్షల గీతిక 
ఆ స్వర గీతికను ఆస్వాదిద్దాం 
నవ ఉషస్సును స్వాగతిద్దాం

కొత్త సంవత్సరం మొదటి రోజు... కుడ్యం ఏమిటో... శిలాక్షరం ఏమిటో... సవ్వడి కేర్ మనడం ఏమిటో.. వసంతోత్సవం అలికిడి ఏమిటో!!! ఈ నవ కవికి... నవ కవనానికి.. థాంక్స్, ఆల్ ది బెస్ట్ లు చెబుతూ... 2015 లో మీడియా లో మెరపులు, మరకల సమాహారమైన వ్యక్తుల కు మేము సరదాగా ఇస్తున్న అవార్డులివీ.

'బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డ్' విన్నర్:  ప్రొఫెసర్ కే నాగేశ్వర్. జర్నలిజం బోధకుడి స్థానం నుంచి టీవీల్లో వీర విశ్లేషకుడిగా పేరు తెచ్చుకుని జనాభిమానంతో ఎం ఎల్ సీ అయి... 10 టీవీ చైర్మన్ గా చేరి ఇటీవలనే 'ది హన్స్ ఇండియా' ఎడిటర్ గా పగ్గాలు స్వీకరించి.. పలు పరిమితులతో అయినా వినూత్న ఆలోచనలతో పత్రికను త్వరిగతిన గాడిలో పెట్టి బహుముఖ ప్రజ్ఞతో మల్టీ టాస్కింగ్ తో స్ఫూర్తి ని పంచుతున్నందుకు. 

'ఓపెన్-షట్-ఓపెన్ అవార్డ్' విన్నర్:  మెట్రో ఇండియా ఓనర్ సీ. లక్ష్మీ రాజం.
'మెట్రో ఇండియా' అనే ఇంగ్లిష్ పేపర్ పెట్టి... మూడ్రోజులు మూసేసి... మళ్ళీ తెరిచి...మళ్ళీ మూస్తారేమో అనిపిస్తున్నందుకు. ఈ ఏడాది మూతపడిన 'ఇండియా టుడే' తెలుగు పత్రిక ఈ అవార్డు కోసం పోటీ పడినా... రాజం గారి సూపర్ ప్లానింగ్ ముందు ఓడిపోయింది.
నోట్:  గతంలో 'బెస్ట్ కమెడియన్' అని ఉన్న ఈ అవార్డు పేరు మార్చామని గమనించగలరు.

'పాపం...పూర్ రిచ్ ఫెలో అవార్డ్ ' విన్నర్: హెచ్ ఎం టీవీ-హన్స్ ఇండియా ఓనర్ వామన రావు. పొందిగ్గా చిట్స్ వ్యాపారం చేసుకోకుండా... మీడియా లో వేలు పెట్టి...కోట్లువెచ్చించి ఛానెల్ పెట్టి, హంసలు ఏవో కాకులు ఏవో తెలియకపోయినా ఆనక ఒక ఇంగ్లిష్ పత్రికఆరంభించి... ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియక ఏమిచేయాలో ఎరగక అలాగే డబ్బు వెదజల్లుతూ ముందుకు పోతున్నందుకు.
నోట్:  గతంలో 'బెస్ట్ బకరా' అని ఉన్న ఈ అవార్డు ను 'పాపం... పూర్ రిచ్ ఫెలో' గా మార్చామని గమనించగలరు.

'పుణ్యం.. పురుషార్ధం అవార్డ్ ' విన్నర్: ఎన్ టీవీ అధినేత నరేంద్ర చౌదరి. జూబ్లీ కొండల సాక్షిగా ఆరుగాలం శ్రమ పడి... కొంగొత్త ఆలోచనలతో.. ఒక మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించి... భక్తి శ్రద్ధలతో రెండోయేడాది కూడా 'కోటి దీపోత్సవం' చేసి ముక్కోటి దేవుళ్ళను, వారి నిత్య ఆరాధకులైన స్వామీజీలను, పీఠాధిపతులను అందులో భాగస్వాములను చేసి, సామాన్య జనాలకే కాకుండా...కావలసిన రాజకీయ నాయకులకు సైతం ఇతోధికంగా ముక్తి ప్రసాదిస్తున్నందుకు. 

'యుధ్ వీర్ అవార్డ్ ' విన్నర్:  ఆంధ్రజ్యోతి గ్రూపు యజమాని వేమూరి రాధాకృష్ణ.  పోట్ల గిత్త లాగా మంచి ఊపు మీద ఉన్న టీ ఆర్ ఎస్ ప్రభుత్వం తో, రాజకీయ ఉద్దండుడు కే సీ ఆర్ తో డైరెక్ట్ గా తలపడి... ఒక్క జర్నలిస్టు సంఘం సహాయం లేకపోయినా కిందపడుతున్నా తలవంచకుండా పోరాడి ఛానెల్ ప్రసారాలు మళ్ళీ ఆరంభించినందుకు... దమ్మున్న మనిషని నిరూపించుకున్నందుకు.

'దొరిపోరా బై దూరిపో... అవార్డ్ ' విన్నర్:  సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్. నెట్ జర్నలిజం గురించి ఎవ్వరికీ తెలియకముందే... వెబ్ సైట్ లో పనిచేసి... ఆ తర్వాత పలు ఛానల్స్ అవలీలగా ఆలవోకగా మారి...తెలుగు దేశం ప్రభుత్వం వచ్చాక... ఎంచక్కా... 'ఆంధ్రప్రదేశ్' ఎడిటర్ గా కుదురుకున్నందుకు.

'కేరాఫ్ ఎర్రగడ్డ... అవార్డ్ ' విన్నర్:  భారత దేశం లో రెండు అత్యంత ప్రముఖమైన పత్రికలు-- ఈనాడు, ది హిందూ-- ఈ అవార్డ్ కోసం గట్టిగా పోటీ పడినా... ఈ ఏడాది ది హిందూ పత్రికనే అది వరించింది. మార్కెట్ ఫిగర్స్ ఇచ్చిన ఉన్మాదంతో పిచ్చిపట్టినట్లు... జర్నలిస్టుల ఉద్యోగాలు పీకుతూ..థూ.. జర్నలిజం... అనిపిస్తున్నందుకు.

'సూపర్ టైం పాస్ అవార్డ్ ' విన్నర్:  సీనియర్ జర్నలిస్టు సుసర్ల నగేష్ కుమార్. అనుకోని పరిస్థితుల్లో 'ది హిందూ' వదిలిన తర్వాత.. తన సేవలు జర్నలిజానికి అవసరమని మనసా వాచా కర్మణా భావిస్తూ... పిలిచిన పలు తెలుగు ఛానల్స్ లో తన అమూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చుతూ... విశ్లేషణలు చేయడమే కాకుండా... తనకంటూ ఒక బ్లాగ్ ఏర్పరుచుకుని అడపా దడపా అద్భుతంగా రాస్తూ కాలక్షేపం చేస్తున్నందుకు.    

'కామన్ మాన్ అవార్డ్ ' విన్నర్:  రాసిపురం కృష్ణస్వామి (ఆర్కే) లక్ష్మణ్. సగటు జీవి కేంద్రంగా దాదాపు ఐదు దశాబ్దాల పాటు చురుకైన కార్టూన్లు వేసి 94 ఏళ్ళ వయసు లో గత జనవరి లో కన్ను మూసారాయన.

ఉద్యోగాలు పీకే స్థాయిలోఉన్న దశలో... ఒక్కసారిగా ఉద్యోగం ఊడగొట్టుకున్నఒకసెల్ఫ్ మేడ్ సీనియర్, నమ్మిన వామనుడి తల మీద కాలేసి తొక్కేసి తాపీగా వేర్వేరు చానెల్స్ లో చేరిన పెద్దమనుషులు, యాడ్ ఏజంట్లుగా మారిన ముదురు ఎడిటర్లు, వాక్యం సరిగా రాయరాక పోయినా బకరా గాళ్ళతో ఒక పత్రిక పెట్టించి.. ఎడిటర్ కావాలని కలలు కన్న ఒక మహానుభావుడు, అంతే వాసులు పలు అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడినా...వారి ఎంట్రీలను వచ్చే ఏడాదికి పరిశీలిస్తామని మనవి చేస్తూ ముగిస్తున్నాం.
Happy New Year-2016