Studio-N గురించి నాకు తరచూ మెయిల్స్ వస్తూ ఉంటాయి. నిజానిజాలు తెలియక వాటిని పోస్ట్ చేయను. మొన్నీ మధ్యన ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఒకరు ఆవేదన తో ఈ కింది మెయిల్ పంపారు. ఇలాంటి బాధితులు నిజంగా తమకు జరిగిన అన్యాయాన్ని ఈ బ్లాగు ద్వారా నలుగురితో పంచుకోవచ్చు. పెద్ద మనసుతో యాజమాన్యం వారు వివరణ పంపినా సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని మాట ఇస్తూ... రాము
---------------------------------------
నేను స్టూడియో ఎన్ మాజీ ఉద్యోగి. గత ఏడాది అక్టోబర్ లో అర్థాంతరంగా నాతో పాటు పదుల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది స్టూడియో ఎన్ యాజమాన్యం. చెప్పాపెట్టకుండా కారణం లేకుండా మమ్మల్ని తొలగించారు. యాజమాన్యం నైజమే అంతని ఊరుకున్నాం.
ఫోన్ చేసి చైర్మన్ మిమ్మల్ని రేపటి నుంచి రావద్దన్నారు. జీతం ఎప్పుడు ఇస్తామో ఫోన్ చేసి చెబుతాం అప్పుడు వచ్చి తీసుకోండని చెప్పిన ఆఫీసు యాజమాన్యం ఇప్పటి వరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. లెక్కలేనన్ని సార్లు వెళ్లినా ఇవాళ రేపు అంటూ తిప్పిస్తున్నారు తప్ప డబ్బులు సెటిల్ చేయట్లేదు. ఎందుకు తీశారని అడగలేదు. మా డబ్బులు మాకివ్వండి అన్నా స్పందన లేదు. కొన్ని సార్లయితే గేటు బయటనుంచే పంపించేశారు. ఫోన్ చేసినా స్పందన లేదు. మెసేజ్ లు పెట్టినా బదులు లేదు. స్టూడియో ఎన్ యాజమాన్యం తీరును ఎండగట్టండి. నా లాంటి వారికి మీ తోడ్పాడునివ్వగలరని వేడుకుంటున్నాను.
awful!
ReplyDeleteగత కాలంలో నేను కూడ ఓ ఈ రంగానికి వద్దామని అనుకుని, రాజమండి ఈనాడు ఎడిషన్ కి సబ్ ఎడిటర్ గా సెలెక్ట్ అయ్యి ఇంటర్ వ్యూ లో వారి తీరు నచ్చక మానుకున్నా. మంచి పని చేసానని 30 ఏళ్ళ తరవాత అనుకుంటున్నాను.
ReplyDeleteఉద్యోగులను వాడుకుని వదిలేయడం, వీధిన పడేయడమనే విష సంస్కృతిని ప్రారంభించిన దిక్కుమాలిన ఛానల్. ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఇదే తీరున నడుస్తున్న ఛానల్ ఇది. ఇలా కూడా ఉద్యోగులను వీధిన పీకేయచ్చని అనేక ఛానళ్లకు రోల్ మోడల్ గా నిలిచిన పనికి మాలిన ఛానల్. తెలుగు ఛానళ్లలో అత్యంత అథమ నికృష్ట నీచ మీడియా హౌస్ ఇదే. సరేకానీ ఈ ఛానల్ బాబు గారి ఆధ్వర్యంలో నడిచినప్పుడు... ఆయన కొడుకు వీధిన పడేసిన యాభై మంది ఉద్యోగులకు న్యాయం చేయలేని చంద్రబాబు, ఇప్పుడు రాష్ట్రం అన్యాయమైపోయింది-న్యాయం చేస్తానంటున్నాడు. తెలివి తక్కువ దద్దమ్మ...
ReplyDeleteబాబును కాదు, ఓటర్లను ఆయన అలా అనుకుంటున్నాడా అనే డౌట్
--
శ్రీనివాస్
అన్నట్లు నేను కూడా 2010 అక్టోబర్ బాధితుడినే
అలా సడెన్‌గా ఉద్యోగంలోంచి తీసెయ్యడానికి వీలులేదు. కోర్టులో కేసెయ్యమనండి. ఉద్యోగంలోంచి తొలగించాలంటే కంపెనీవారు కనీసం ఒక నెల ముందే నోటీస్ ఇవ్వాలి. మరి జాయినయ్యేటప్పుడు ఎలాంటి ఒప్పందం ఉందో ఇద్దరి మధ్యా?
ReplyDeleteఆ బాధితుల్లో నేను కూడా ఉన్నాను..చెత్త ఛానెల్..ఎదో ఒక రొజు సర్వ నాశనం అవుతుంది..
ReplyDeleteWhat other journalists are doing ca't you people join together to get your dues, Hope you have a union for take care of these,
ReplyDelete