ఆంధ్రజ్యోతి, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలలో స్పోర్ట్స్ జర్నలిస్టు గా పనిచేసి...మంచి క్రికెట్ విశ్లేషకుడిగా పనిచేస్తున్న రేవెల్లి నరేందర్ గారు నిన్న మరణించారు. ఆయన వయస్సు 49 సంవత్సరాలు. ఆయన సతీమణి ఉష గారు ఆల్ ఇండియా రేడియో లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్నారు.
సొంత పట్టణమైన కరీంనగర్ లో 'జీవగడ్డ' అనే పత్రిక ద్వారా జర్నలిజం లోకి అడుగుపెట్టిన నరేందర్ గారు 1996 లో ఆంధ్రజ్యోతి లో స్పోర్ట్స్ విభాగం లో చేరారు. 1996 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లను ఆయన కవర్ చేసారు. ఆ తర్వాత హైదరాబాద్, భువనేశ్వర్ లలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ కోసం పనిచేసారు.
ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లలో ఫ్రీలాన్సర్ గా, అసోసియేటెడ్ ప్రెస్ కు కంట్రి బ్యూటర్ గా సేవలు అందించారు. ఆయన మూర్తి పట్ల ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన సంతాప సభను వచ్చే శనివారం ప్రెస్ క్లబ్ లో సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

may his soul rest peace. mr narender is very friendly person. sad to learn about his sudden demise.
ReplyDeletegollapudi srinivasa rao, senior journalist.