ఫేస్ బుక్ లో ఒక చోటి నుంచి ఈ పై బొమ్మ లేపెసాం. జోస్యం చెప్పడం, అంచనా వేయడం...లో భలే మజా ఉంటుంది. ఇప్పుడు మీడియా మీద, వ్యవస్థ మీద ఇంకా అసహ్యం పుట్టని వాళ్ళు, ప్రజాస్వామ్య హితైషులు, పొద్దుపోని వాళ్ళు లెక్కల మీద లెక్కలు కడుతున్నారు. ఇది ఆక్టోపస్ ల కాలం. దేని అంచనాలు దానివి.
అందరు అధినేతలు తమ పార్టీదే విజయం అని బల్ల గుద్ది మరీ ప్రకటిస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా నవ్వులు కురిపిస్తున్న చంద్రబాబు కూడా ధీమాతో ఉండగా, పెదాన మంత్రి వోడైనా... మన కాడికి రాల్సిందే...అని జగన్ బాబు గట్టి నమ్మకంతో ఉన్నారు.
రాష్ట్ర విభజన ఆగుతుందని... గట్టిగా నమ్ముతున్న కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే ఆ మాట అనట్లేదు. 102 దేశం పార్టీ కి, 62 జగన్ పార్టీకి వస్తాయని ఒకరు, అది 75 (బాబు) -95(జగన్) అని ఇంకొకరు, 69- 105 కాకపోతే చూడండి.... అని మరొకరు అంటున్నారు.
"అన్నా... జగన్ క్లీన్ స్వీప్. 115 సీట్లు ఖాయమ్. రాసి పెట్టుకో.." అని సీమాంధ్ర లో చాప కింద నీరులా సర్వే చేస్తున్న ఒక మిత్రుడు ఘంటాపథం గా వాదిస్తున్నాడు. కానీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి మాత్రం దేశం వైపే పవనం ఉన్నట్లు చెప్పారు.
ఒక ప్రఖ్యాత మానేజ్మెంట్ సంస్థ లో పనిచేస్తున్న ప్రొఫెసర్ మాత్రం రెండు చోట్లా 'క్లీన్ సీప్స్' ఉండవని ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ ఉంటుందని, దేశ వ్యాప్తంగా మోడీ వేవ్ ఉన్నదని కూడా తానూ అనుకోవడం లేదని చెప్పారు. చూద్దాం.
మాకు మాత్రం.... అక్కడ జగన్, ఇక్కడ వాళ్ళను లాగి... వీళ్ళను లాగి కే సీ ఆర్ ముఖ్యమంత్రులు అవుతారని అనిపిస్తున్నది.

Well said...!
ReplyDeletenice comment ramu
ReplyDeleteGood Analysis... your Articles seem Non Partial... Please keep up the Good articles like this Thanks!!
ReplyDeleteReally good without partiality..keep up same tempo..u can rock..
ReplyDelete