ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ సీ ఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దేశ రాజధానికి వెళ్లి ప్రధాన మంత్రి మోడీ గారిని కలిశారు నిన్న. ఆ సందర్భంగా ఒక పద్నాలుగు పాయింట్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. అందులో ఆరో పాయింటు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని. అది ఇంగ్లిష్ లో ఇలా ఉంది:Take steps to develop Hyderabad into a world class city and to make it slum free.
దీన్ని 'ఈనాడు' (హైదరాబాద్ ఎడిషన్, రెండో పేజీ) ఇలా అనువదించింది:
హైదరాబాద్ నగరాన్ని ప్రముఖ వృద్ధి కేంద్రంగా, విశ్వ నగరంగా అభివృద్ధి చేయాలి. మురికివాడల నగరంగా మార్చడానికి తగిన మౌలికవసతులు కల్పించాలి.
"స్లం ఫ్రీ" అన్న మాటను సబ్ ఎడిటర్ పొరపాటున ఇలా ఘోరంగా "మురికివాడల నగరం" గా అని అనువదించారు. మురికివాడల రహిత నగరంగా అని ఉండాల్సింది.
"గ్లోబల్ సిటీ గా, ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారిన హైదరాబాద్ ను మురికి వాడలు లేని నగరంగా తీర్చి దిద్దేందుకు అనేక పట్టణ సదుపాయాలు కల్పించాలి" అని "ఆంధ్రజ్యోతి" గురికి బెత్తెడు దూరంలో అనువదించింది.

ఆంధ్రజ్యొతి అనువాదం గురికి బెత్తెడు యెలా అవుతుంది, పెడర్ధం లేనంత వరకూ అనువాదం లో పొరపాటు రానట్టే గదా!దానికి కూడా వాత వేశారేం?
ReplyDeleteనిజమేనండీ! వెబ్ సైట్ లో మామూలుగానే ఉంది. ఈ-పేపర్ లో చూస్తే మీరు చెప్పినట్టుగానే ఉంది.
ReplyDeleteనిన్న హిమాచల్ ప్రదేశ్ ప్రమాదం గురించిన కథనాలలో అనేక చానెళ్ళు "ప్రమాదంలో చిక్కుకున్న తెలుగు విద్యార్తులు" అంటూ రాయబతం ఎబ్బట్టుగా ఉంది. వారి పేర్లే తెలియనప్పుడు తెలుగు వారో, తెలుగేతరులో తెలిస్తుందా? సింపుల్గా హైదరాబాదు విద్యార్తులు అంటే పోయేదానికి తెలుగు రంగు పులమడం అనవసరం.
ReplyDeletejai garu..
ReplyDeleteakkada matter adi kaadu.. andhra and telangana ani vadakunda undataniki telugu vidyarthulu annaru..
@shrigo:
ReplyDeleteహైదరాబాదు విద్యార్తులు అంటే సరిపోతుంది.