మన ఈ 'తెలుగు మీడియా కబుర్లు' బ్లాగు ముందుగానే అంచనా వేసినట్లు... "నమస్తే తెలంగాణ" పత్రిక ఎడిటర్ గా సీనియర్ జర్నలిస్టు కట్టా శేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయనకు మా అభినందనలు.
"ప్రస్తుతం 'నమస్తే తెలంగాణ' ఎడిటర్ గా ఉన్న అల్లం నారాయణ గారు ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా చేరుతున్న నేపథ్యం లో శేఖర్ రెడ్డి గారు ఆ పదవిని భర్తీ చేసే అవకాశం కూడా లేకపోలేదు" అని జూన్ 27 న "నెగ్గిన కే సీ ఆర్ పంతం: పత్రికను వదులుకున్న రాజం" అన్న శీర్షికతో మేము ప్రచురించిన విషయం రెగ్యులర్ రీడర్స్ కు గుర్తుండే ఉంటుంది.
శేఖర్ రెడ్డి గారికి శుభాభినందనలు తెలుపుతూ ఆ పత్రిక వెబ్ పేజీలో వాడిన స్ట్రిప్ ను ఈ పైన ఇచ్చాము. ఇప్పటికే తెలంగాణ ప్రజల మనసులు చూరగొన్న 'నమస్తే తెలంగాణ' పత్రిక సీనియర్ జర్నలిస్టు, కవి, మృదు స్వభావి, వ్యాసకర్త, వ్యూహకర్త అయిన శేఖర్ రెడ్డి గారి సంపాదకత్వంలో మరింత పురోగతి సాధించాలని కోరుకుంటున్నాం. తెలంగాణా పునర్నిర్మాణంలో... ఈ పత్రిక నిజమైన పాత్రికేయ విలువలతో వెలగాలని ఆశిస్తున్నాం.
ఆణిముత్యాల లాంటి కార్టూనిస్టులను, జర్నలిస్టులను ఎందరినో అందించిన ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లా తెలంగాణాకు అందించిన మొట్ట మొదటి ఎడిటర్ గా కట్టా చరిత్రలో నిలిచిపోతారు.
కంగ్రాట్స్... కట్టా శేఖర్ రెడ్డి గారు.

మృదు స్వభావి? ఆంధ్రా వాళ్లని తిట్టడమే కదా ఇతని పని
ReplyDeleteHearty Congrats Katta Sekhar Reddy garu
ReplyDelete