ప్రజల పెట్టుబడితో... ప్రత్యామ్నాయ మీడియా గా ఎన్నో ఆశలను కల్పించిన 10 టీవీ రూపశిల్పి అరుణ్ సాగర్ ఆ ఛానల్ ను నిన్న వీడారు. 10 టీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీ ఈ ఓ) పదవికి రాజీనామా చేసిన సాగర్ గారు
వెంటనే టీవీ 5 లో చేరారట. ఒకటి రెండు రోజులలో ఆయన డ్యూటీ లో చేరబోతున్నట్లు సమాచారం.
స్వతహాగా కవి అయిన సాగర్ గారు ముందుగా ఆంధ్రజ్యోతిలో చేరి ఆ తర్వాత ఎలక్ట్రానిక్ రంగం లోకి సకాలంలో దూకారు. టీవీ-9 ఉన్నతికి పాటుపడిన వారిలో అయన ఒకరు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులు చొరవ తీసుకుని ప్రజల పెట్టుబడితో ఒక ఛానెల్ పెట్టలనుకున్నప్పుడు... కమ్యూనిస్టు కుటుంబానికి చెందిన సాగర్ తమ్మినేని వీరభద్రం గారి లాంటి వారికి ఫస్ట్ ఛాయిస్ అయ్యారు.
అనారోగ్యం బాధిస్తున్నా...కొత్త ఛానెల్ కోసం అన్నీ తానై రూపకల్పన చేశారు. ప్రోమో దగ్గరి నుంచి లోగో దాకా నిశిత పరిశీలనతో సాగర్ రూపొందించారు. "గ్లాస్ డోర్స్ దగ్గరి నుంచి... డిజైన్ వరకూ అన్నీ అయన దగ్గరుండి చూసుకున్నారు. మంచి మనిషి అయిన ఆయన... ఈ రోజుల్లో టీవీ ఛానెల్స్ కు కావలసిన దుందుడుకు, దూకుడు ధోరణి ప్రదర్శించలేక దెబ్బతిన్నారు," అని ఆయనను చాలాకాలంగా గమనిస్తున్న ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారు.
మృదు స్వభావి అయిన సాగర్ గారు తాను పనిచేసిన టీవీ 9 నుంచే పెద్ద సంఖ్యలో...జర్నలిస్టులను, టెక్నీషియన్లను 10టీవీ కి తెచ్చారన్న అభియోగం ఉంది. నిజానికి అది అభియోగం కావడానికి వీల్లేదు. ఎందుకంటే...మంచి ఛానెల్ నుంచి పనిచేస్తారని అనుకున్న వారిని పట్టుకురావడం తప్పుకాకపోవచ్చు. ఆ తెచ్చిన వాళ్ళు పనిచేయకపోయినా, వారితో పనిచేయించలేకపోయినా బాధ్యత సాగర్ గారిదే కదా! అయినా.. తమ్మినేని వీరభద్రం గారికి సన్నిహితుడైన సాగర్ పెద్దగా ఇబ్బంది లేకుండానే ఇన్నాళ్ళూ పనిచేశారు.
సాగర్ మనుషులుగా ముద్ర పడినవాళ్ళు మళ్ళీ పాత గూటికో, వేరే ఛానెల్స్ కో వెళ్ళిపోవడం ఆరంభమయ్యాక... పరిస్థితి తీవ్రత గుర్తెరిగిన తమ్మినేని గారు ముందుగా 'ఈనాడు' లో తర్వాత 'ఎన్ టీవీ' లో పనిచేసిన ఖమ్మం జిల్లాకే చెందిన వడ్డే వేకటేశ్వర రావు గారిని 10 టీవీ కి తీసుకువచ్చి పెద్ద బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఛానెల్ పరిస్థితి మెరుగుపడడం ఆరంభమైనా... సాగర్ గారి ప్రాముఖ్యం తగ్గుతూ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సాగర్ గారు వెళ్ళిపోయారు. తెలుగు మీడియాలో... నారుపోసి నీరుపోసి కాపుకు కారణం నేనేనని ఎవ్వరూ అనుకోవడానికి వీల్లేదని మరొకసారి నిరూపితమయ్యింది.
ఉయ్ విష్ సాగర్ అండ్ 10 టీవీ అల్ ద బెస్ట్.
(Note: We have taken the above picture from Mr.Arun Sagar's facebook page. Thank you sir.)
నోట్: ఇదే పోస్టును మరొక వెబ్ సైట్ వారు మక్కీకి మక్కీ లిఫ్ట్ చేసి ప్రచురించారు. ఇది పధ్ధతి కాదని, కనీసం అక్నాలెడ్జ్ చేయండని మేము పంపిన ఒక కామెంట్ కూడా కిల్ చేశారు. ఇది మేము అనైతికంగా భావిస్తున్నాం. పేరు చెప్పుకునే దమ్మూ ధైర్యం లేని వారితో డీల్ చేయడం ఇష్టం లేక ఈ వివరణ ఇస్తున్నాం. ఆ వెబ్ సైట్ కు మాకూ సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాం. ఈ ముసుగు వెబ్ సైట్ విషయంలో అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్ చేసిన వారికీ, మెయిల్స్ పంపిన మిత్రులకు థాంక్స్.
నోట్: ఇదే పోస్టును మరొక వెబ్ సైట్ వారు మక్కీకి మక్కీ లిఫ్ట్ చేసి ప్రచురించారు. ఇది పధ్ధతి కాదని, కనీసం అక్నాలెడ్జ్ చేయండని మేము పంపిన ఒక కామెంట్ కూడా కిల్ చేశారు. ఇది మేము అనైతికంగా భావిస్తున్నాం. పేరు చెప్పుకునే దమ్మూ ధైర్యం లేని వారితో డీల్ చేయడం ఇష్టం లేక ఈ వివరణ ఇస్తున్నాం. ఆ వెబ్ సైట్ కు మాకూ సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాం. ఈ ముసుగు వెబ్ సైట్ విషయంలో అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్ చేసిన వారికీ, మెయిల్స్ పంపిన మిత్రులకు థాంక్స్.

nijanga 10tv lo sramaku taggina prthifalam ledhu entha kasta padda kuda paniki chethakani kondru dhochukune valllu srma padevarini thokkestunnaru idhi nijam.............
ReplyDeleteఅరుణ్ సాగర్ అక్కడ జాయిన్ అవడం పెద్ద విషయం కాదు .. ఎందుకంటే ఎప్పట్నంచో ఆయనకు అక్కడ ఎర్త్ పెట్టేవాళ్లు ఎక్కువ అయ్యారని చెప్తున్నారు..అందులోనా స్వయంగా ఆయనే ఫేస్ బుక్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు..నమ్మి పైకి తీసుకొచ్చిన వాళ్లే దుష్్రచారం చేస్తున్నారని
ReplyDeleteచెప్పారు..
అవసరమో..అనవసరమో..ఇంకో గుసగుసలాంటి నిజం...ఎక్స్ ప్రెస్ ఛైర్మన్ కి జ్నానోదయం అయిందో.(.స్పెల్లింగ్ లో తప్పేం లేదు..ఆయనకి ఉందందే...)ఎక్కడిక్కడ ఆపీస్లు మూసేస్తున్నారట..స్టాఫ్ ని తీసేసారట...మరి ఇప్పుడెక్కడ ఆ జర్నలిస్ట్ సంఘాలు. హెచ్ ఎం లో తీసేయగానే తొడ గొట్టారని అందరూ బ్లాగ్ లో రాసుకున్నారుగా... ఢిల్లీ ఆఫీస్ మూసేసి..ఇక్కడ హైదరాబాద్ లోకూడా 10మందిని తీసేశారు..అలానే.. ఇఁకా భారం అనే సాకుతో ఇంకొంతమందిని పంపిస్తున్నారు..డొంక తిరుగుడు ఎందుకు రోజా అనే ఏంకర్ ని పంపించింది ఇదే సాకుతో...అసలు తీసుకునేటప్పుడుశాలరీ తేలిదా.. ?అలానే..ఐ న్యూస్ లోనూ...పోయేవాళ్లు పోతున్నారట.. పొగపెడుతుంటే.. హచ్ ఎంలో తొలగించబడ్డవారెవరూ చేరిన దాఖలాలు లేవు.abn లో విలేఖర్లు. హ్యపీగా పేపర్ కి వెళ్తే బావుంటుందని ఆలోచిస్తున్నారట..మజీదియా సిపార్సులు అమలు చేయకతప్పని స్తితిఉంది కాబట్టి..
ReplyDeletentv లో వార్షికోత్సవం సందర్భంగా ఏమైనా కొత్త నిర్ణయాలు ప్రకటిస్తారని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు..(వారి కంటే బయట పని చేస్తున్నవాళ్లు)శాస్త్రి సైలెంట్ గా వయెలెన్స్ లేకుండా..(శబ్దపాతమే లెండి) పని చేస్కుపోతున్నారట.. శివప్రసాద ఏం చేస్తున్నాడో..ఏం రాస్తున్నాడో ఎవరికీ తెలీదని..అందులో పని చేస్తున్న డెస్క్ సభ్యుని సమాచారం..కొంతమంది రిపోర్టర్ మిత్రులు..అటు ఐన్యూస్..ఇటు ఎన్టీవీ వారు..హెచ్ఎం కి వెళ్లారు..వారి కంటే పిలిస్తే వెళ్లని వారే ఎక్కువమంది ఉన్నారు..కొన్ని బ్లాగులు రాసుకున్నట్లు కామయ్య కనుక ఎక్స్ ప్రెస్ కి వెళ్తే.. ఈ సారి..తన పాత పరిచయస్తులను కాకుండా..కొత్తవారి వేటలో ఉన్నాట.అంటే ఎన్, హెచ్ ఎం కు తీసుకెళ్లినవారు కాకుండా మిగిలినవాళ్లు.( కానీ.అతనివెంట వెళ్లి బాధలు పడే కంటేఖాళీగా ఉండటమే ఉత్తమం అని వాళ్లూ..ఖాళీ గా ఉండటం కంట వెళ్లడమే మేలు అి కొంతమంది పీలింగ్)
ఇక మహా ఛానల్ లో కొత్త (ఆల్రెడీ 8నెలల అయింది కాబట్టి పాతే) సీఈఓ ధాటికి స్క్రీన్స్ బద్దలు అవుతున్నాయట..జీతం ఎప్పటిలానే పడుతోందిట.. ఏంకర్స్ ని మాత్రం జాగ్రత్తగా చూస్కుూంటూ మిగిలిన డిపార్ట్ మెంట్స్ కిలేట్ గా ఇవ్వడంపై అంతా ఫీలవుతున్నారు..
tv9,mahaa, inews, n tv చివరిగా రాజ్ న్యూస్ లో చేసిన దేశిరాజు శ్రీనివాస్..ఈ మధ్యనే ఏపీ సిఎం చంద్రబాబు మీడియా పేషీలో ఓ మేధావి చలవతో జాయిన్ అయ్యాట్ట..ఇక శ్రీనివాస్ కి తిరుగుండదు..లైఫ్ సెటిల్..
studion లో మళ్లీ నార్నె ప్రవేశం జరుగుతుందంటూ వార్తలు వస్తున్నా..అసలు అమ్మకమే జరగలేదనే వాళ్లున్నారు..ఏదైనా..ప్రస్తుతాినికి అంతా సేఫ్ గా నే ఉన్నారు..కొంతమంది పెద్ద తలకాయలను బైటికి పంపిస్తారని చెప్పుకున్నా..జరగలేదు..
సాక్షి సంగతి చెప్పేదేముంది.. మీసాలమసాలా రామ్ అన్నయ్య ఫారిన్ టూర్లో ఉన్నా..తన వారితో టచ్లో ఉన్నాట్ట..కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగుల తొలగింపు..మామూలే.అసలు ఓ ఏ డాది నుంచి థర్డ్ పార్టీ రిక్రూట్మెంట్ జరుగుతోందిక్కడ..కాంట్రాక్ట్ బేస్డ్ గానీ.ఎవరికీ పర్మినెంట్ ఉద్యోగాలు కావు..కొత్తగా తీసుుకునే వారికి..పేపర్ కి వెళ్లాలనే ఆలోచనే ఇక్కడ కూడా..
tv9, tv5గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం ఉండదు..అంతా గుంభనగా సాఫీగా సాగిపోతుంది కదా ఇక్కడ...ఏదో అరుణ్ సాగర్, లేదంటే అప్పట్లో మురళీకృష్ణ,రజనీకాంత్ వెళ్లొచ్చినసందర్బాలు తప్ప..మార్పులు వ్యవస్థని ప్రభావితం చేయవిక్కడ..అప్పుడప్పుూడ టీవీ9 అమ్మకం వార్తలు వింటుంటాం...అంతే..
ఇక మిగిలిన సీవీఆర్ లో మార్పేం ఉఁడబోదు..వ్యక్తులు మారుతుంటార..అందులో బాగంగా పేపర్ సురేష్..కృష్ణసాయి డెస్క్ కు. ex tv9 tv5 , ex hmనుంచి వచ్చినవారు ఇన్ పుట్ కు జాయినయ్యారు..పొలిటికల్ గా ఎవరో ఉండే ఉఁటారు. వీళ్లకి ఇక్కడ పెద్దగా పనేం ఉఁడదుట.. చైర్మన్ ఆదేశాలను ( న్యూస్ ఫ్లోర్ లో ఓవరాక్షన్ చేస్తూ) పాటించడమే..
పైన నేను చెప్పినవన్నీ పచ్చినిజాలు..వీటిలో ఎవరికైనా నొప్పించేవి ఉఁటే...మార్చుకోండి.బాయ్ కాకా..
ledu aa site variki nenu reminder petta..adi post chesaru chudadni
ReplyDelete10 టీవీ పీడ వీడిందన్నమాట. అరుణ్ సాగర్ కమ్యూనిస్టు ముఖం కప్పుకున్న కుళ్ళురకం. అనుభవంతో చెబుతున్నాను.... బాధతోనూ చెబుతున్నాను.
ReplyDelete