సీనియర్ జర్నలిస్టు కూర్మనాథ్ గారు డిసెంబర్ 2 న ఫేస్ బుక్ పేజీలో
పెట్టిన "అంతరంగాలు" ఇది.
జర్నలిస్టు: చిన్నపుడు బాగా చదువుకుని వుండాల్సింది.
ఈ బతుకు తప్పేది.
జర్నలిస్టు తండ్రి: వీడిమీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది.
వీడి జీవితం నా వల్లే పాడైంది.
జర్నలిస్టు తల్లి: అయ్యో, నా తండ్రికి
స్థిమితమైన జీవితం లేదు కదా.
జర్నలిస్టు భార్య: పెళ్ళికి ఒప్పుకునే
ముందు కొంచెం ఆలోచించాల్సింది.
అమ్మా నాన్నల మాటవినివుండాల్సింది.
జర్నలిస్టుల అత్త మామలు: మన కుటుంబంలో ఇంకెపుడూ
జర్నలిస్టుకు పిల్లనివ్వకూడదు.
జర్నలిస్టు పిల్లలు : నాన్న ఇంకేదైనా ఉద్యోగం చేసుంటే సాయంత్రాలు
హాయిగా ఆడుకుని వుండేవాళ్ళం.
జర్నలిస్టు బాసు: ఏమీ చదవకుండా ఫీల్డ్ లోకి వచ్చేస్తారు.
ఇంకేదైనా పని చూసుకోవాల్సింది.
జర్నలిస్టు ఇంటి ఓనరు: జన్మలో జర్నలిస్టుకు ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు.
"నా పిల్లలను జర్నలిస్టు కానివ్వ ను...." అని జర్నలిస్టు భార్యలు
అనుకుంటారన్న విషయాన్ని కూడా రాయమని కూర్మనాధ్ గారి సతీమణి
చెప్పారట. దీనికి ఓ 170 లైకులు, యాభై కి పైగా కామెంట్లు వచ్చాయి.

నేను ఇంకెప్పుడూ జర్నలిష్టుల గురించి తెల్సుకోను?
ReplyDeleteనేను ఇంకెపుదూ తెలుగు మీడియా కబుర్లుకు రాను!
Best piece on journalists.But tragically they are controlling every one in society through their unproffessionalism and unethics.Who bothers bout their qualifications and quality?
ReplyDeleteబాగుంది. బాగా చెప్పారు..
ReplyDelete