గత ఏడాది జనవరి లో ఎక్స్ ప్రెస్ టీవీ కి రాజీనామా చేసిన సీనియర్ జర్నలిస్టు నేమాని భాస్కర్ గారి చొరవతో ప్రారంభమైన మీడియా 24 తెలుగు ఛానల్ పరిస్థితి అంత బాగున్నట్లు కనిపించడం లేదు. ఆయనకు మద్దతుగా... ఎక్స్ ప్రెస్ ఛానల్ కు రాజీనామా చేసిన మీడియా 24 లో చేరిన జర్నలిస్టుల పరిస్థితి దీంతో అగమ్యగోచరంగా తయారయ్యింది.
ఇరవై ఒక్క మందితో జనవరిలో చిగురుపాటి వారి ఛానల్ ఎక్స్ ప్రెస్ ను వీడిన నేమాని కొంత బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసుకుని మార్చి కల్లా మార్కెట్ లో ప్రవేశించారు. డబ్బులు పెడుతున్నది ఎవరో తెలియకుండా...M.S.Mediahouse India Pvt Ltd ఆధ్వర్యంలో మొదలయిన ఈ ఛానల్ కు షేక్ ఖాజా మొహియుద్దీన్ అనే సారు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు లో... కొత్త రాజధాని అమరావతి కేంద్రంగా వస్తున్నమంటూ లోగో కూడా ఆయన లాంచ్ చేసారు. నిత్యం ఆఫీసుకు వచ్చి మంచీ చెడ్డా చూసుకున్న ఈయన ఒకటి రెండు నెలల నుంచి రాకపోవడం... ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన రాలేకపోతున్నారన్న ప్రచారం జరగడం జర్నలిస్టులను బాధిస్తున్నాయి.
ఒక నలభై మంది జర్నలిస్టులు, శిక్షణ కోసం తెసుకున్న మరొక 30 మంది ఈ పరిణామాలతో కంగు తిని కంగారు పడుతున్నారు. జీతాలు ఇస్తున్నారో ఇవ్వడంలేదో ఎవ్వరూ చెప్పలేదు. ఇవ్వకపోయినా తెలుగు నేల మీద వీళ్ళను అడిగే వాడు ఎవ్వడూ లేడు.
ఈ లోపులో నేమాని గారు తానూ పనిచేసిన ఎన్ టీవీ కి వెళ్ళిపోయారన్న ప్రచారం కూడా జరిగింది కానీ ఆయన మీడియా 24 ఆఫీసుకు వస్తున్నారని ఆయన సహచరులు చెప్పారు.

Great post, keep up the good work! Telugu Gossips
ReplyDelete