ప్రభుత్వాలు మారినప్పుడు కొందరికి పదవులు పోవడం, కొందరికి కిరీటాలు రావడం సహజం. 'ఆంధ్రప్రదేశ్' మాగజీన్ చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల, ఎడిటర్ నరేష్ నున్న గార్ల మీద ప్రచురిస్తున్న కథనాలు బాధకలిగిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా రాయాలనుకున్నా ... వారి వివరణ లేకుండా ఏకపక్ష దాడి చేయడం మంచి పధ్ధతి కాదు.
కావాలని ప్రభుత్వ పత్రికలో కొత్త ముఖ్యమంత్రిని గేలి చేసేవిధంగా వార్తలు లేదా ఫోటోలు ప్రచురించేంత కుసంస్కారులు గానీ బుద్దిహీనులు గానీ వీళ్ళు కాదు. కేవలం జర్నలిజాన్ని నమ్ముకుని ఉన్న వారు వాళ్ళు ఇద్దరూ. వాళ్ళమీద లేనిపోని కథనాలు ప్రచురించడం భావ్యంగాలేదు. భార్య వైద్యురాలైన రమేష్ గారి విషయం పర్వాలేదు కానీ ఉద్యోగం లేకుండా నెలైనా గడవని జర్నలిస్టు నరేష్ గారు. వృత్తిలో ఒక్క రూపాయి అదనంగా సంపాదించలేదు. కేవలం జర్నలిజాన్ని నమ్ముకుని ఆయన సాగించిన, సాగిస్తున్న బతుకు పోరాటం గొప్పది. జర్నలిస్టులకు అన్యాయం చేసిన సంస్థ పై స్థోమతకు, తాహతుకు మించి పోరాటం చేసిన యోధుడు ఆయన. సంస్థలు అన్యాయం చేస్తున్నా బూట్లు నాకుతూ బతికే మెజారిటీ లో చేరి భజన చేసే రకం కాదిది. ఇలాంటి వారికి వృత్తిలో తలవంపులు తెచ్చేలా రాయడం సబబు కాదు.
కందుల రమేష్ గారికి చంద్రబాబు మీద అభిమానం ఉండవచ్చు. ఆ సంబంధాల కారణంగా ఆయనకు 'ఆంధ్రప్రదేశ్' పత్రిక నిర్వహణ బాధ్యత లభించి ఉండవచ్చు. అదేమన్నా తప్పా? నిజానికి ఆ పదవికి తగినట్లు సరిపోయే సంపత్తి జర్నలిస్టు ఆయన. వెబ్ సైట్లలో అయన గురించి లేనిపోనివి రాస్తున్న వాళ్లకు తెలుసో తెలియదో గానీ... కొందరికి మెయిల్ ఐడీ లు లేనికాలంలోనే అయన వెబ్ జర్నలిస్టు. ఇలాంటి వాళ్లకు కులం ముద్ర వేయడం మంచిది కాదు. అదే సమయంలో, రమేష్ కందుల గారు తన వివరణలో వాడిన పదజాలం అయన స్థాయికి తగినట్లు మాకు అనిపించలేదు.
కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని పొగడాలంటే పొగుడుకోవచ్చు గానీ జర్నలిజం లో సీనియర్లు గా సేవలందించిన ఇలాంటి వాళ్ళ మీద అక్షర దాడి చేయడం పొరపాటు. 30 సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్న ఇలాంటి వారిని గురించి పిచ్చిపిచ్చి కథనాలు ప్రచురించి బద్నాం చేయాలనుకోవడం మంచిదికాదని భావిస్తున్నాం. దయచేసి ఈ వెబ్ సైట్లు తమ కథనాలను తొలగించడమో, లేదా పూర్తి స్థాయిలో వారి వివరణ ప్రచురించడమో చేయడం ఉచితం.

జర్నలిజంలో విలువల కోసం ఆది నుంచి పోరాటం చేయడమే కాకుండా, మీ Ph Dలో కూడా అదే అంశాన్ని ఎంచుకున్న చెదరని నిబద్ధత మీది, రామూ గారూ. Thank you
ReplyDeleteతెలుగు జర్నలిజం ఇప్పుడు చేసిన పొరపాటులను సరిచేసుకుని ఆత్మవిమర్శచేసుకునే స్థాయిని ఏనాడో దాటిపోయింది. ప్రభుత్వ చర్యలను కాకుండా పాలకపక్షానికి భజనచేసే జర్నలిస్టులను తయారు చేసే కార్యక్రమాలను ఇరవై ఏళ్ళ క్రితమే అవిభక్త రాష్ట్రంలో మొదలయ్యాయి .ప్రజాస్వామ్య హక్కుల రక్షణ పేరుతో పత్రికలు ఒక పార్టీ కోమ్ముకాయడమో వ్యతిరేక ప్రచారం చేయడమో మొదలెత్తినప్పటినుంచే తెలుగు జర్నలిజంలో నైతిక పతనం మొదలింది. సోషల్ మీడియా రావడంతో పత్రికలు వార్తా చానళ్ల నిజాయితీ కి అగ్ని పరీక్ష ఎదురయింది. ఇదే జర్నలిస్టులు యూ ట్యూబ్ ను ఆశ్రయించి స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని జనంలోకి చొచ్చుకెళుతుంన్నారు.కానీ జర్నలిస్టుల క్రెడిబిలిటీ విశ్వసనీయత మాత్రం అధపాతాళానికి అడుగంటి పోతున్నాయి.
ReplyDelete