తెలుగు జర్నలిజాన్ని, రాజకీయాలను విడివిడిగా కలివిడిగా కొత్త పుంతలు తొక్కించిన వ్యాపారవేత్త 'ఈనాడు' గ్రూపు చైర్మన్ శ్రీ చెరుకూరి రామోజీ రావు గారికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. సెప్టెంబర్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేరును ఈ అవార్డుకు సిఫార్సు చేయగా ఈ రోజు కేంద్రం ఈ ప్రకటన చేసింది.
రామోజీ గారితో పాటు, సినీ స్టార్ రజనీకాంత్, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, ఆథ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవి శంకర్ లను పద్మ విభూషణ్ వరించింది.
అవార్డు గ్రహీతలతో పాటు రామోజీ రావు గారికి ప్రత్యేక అభినందనలు. ఈ అవార్డుకు ఆయన అర్హుడు కాడని అనే వారితో ఈ బ్లాగు బృందం ఏకీభవించడం లేదు. తెలుగు జర్నలిజం ప్రమాణాలు ఈ రోజు ఈ స్థాయిలో-మంచో చెడో- ఉండడానికి కారణం... రామోజీ గారి తెగింపు.. దాంతో పాటు ఆయన ముందు చూపుతో ఏర్పాటు చేసిన 'ఈనాడు జర్నలిజం స్కూల్' అనే జర్నలిస్టుల కర్మాగారమ్.
కంగ్రాట్స్... రామోజీ జీ.
రామోజీ గురించి కారవాన్ పత్రిక ప్రచురించిన సుదీర్ఘ వ్యాసం ఇక్కడ చదవండి: Chairman Rao
Photo courtesy: my firstshow.com

"జర్నలిస్టుల కర్మాగారం" చాలా కరెక్టు గా చెప్పారు.
ReplyDeleteనా దృష్టిలో రామోజీరావు గారికి వచ్చిన పద్మ విభూషణ్ జర్నలిజానికి ఇచ్చిన గౌరవం కాదు. పత్రికను ఒక వ్యాపారంగా ఎంత బాగా నడపవచ్చు అనే ఒక టాలెంట్ కు ఇచ్చిన గౌరవం.
ReplyDeleteSir,
ReplyDeletenamaste
Running newspaper is nothing but business. we respect your observation.
రామోజీ రావు కేవలం ఒక వ్యాపారస్తుడు కాదు. రాజకీయ ఆర్ధిక రంగాలలో ప్రశ్నార్ధక విలువలను పాటిస్తూ వివాదాస్పద పనులద్వారా పబ్బం గడుపుకుంటూ వచ్చిన ఒక నయా చాణుక్యుడు. తన దారికి అడ్డొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా అణిచి వేసి అందలం ఎక్కిన మహా ఘనుడు.
ReplyDeleteramojiki padmavibhushanaa! shame!! shame!! arthika neracharitra kaligina, udyogulanu jalagalaagaa peelchi pippichesina ghanudu romoji.
ReplyDeleteపత్రికా రంగంలో విలువలను కాపాడుతున్న పత్రికాధిపతిగా, పేపర్ ద్వారా సమాజానికి మేలు జరుగుతోందంటే ప్రస్తుతం చెప్పుకోడానికి రామోజీ రావు గారు మాత్రమేనని విష్వసిస్తున్నాము.
ReplyDelete