'ఈనాడు' సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గా నియమించింది. ఆయనతో పాటు కాకర్ల చెన్నారెడ్డి కి కూడా పోస్టు దక్కింది.
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ పేర్లను ఖరారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపినట్లు ఒక ప్రకటన వెలువడింది.
హరిప్రసాద్ రెడ్డి కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌నుంచి చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. రెండు దశాబ్దాలుగా పత్రికా రంగంలో ఉన్నారు. అయన భారత రాజ్యాంగ, సామాజిక, ఆర్థిక విషయాలపై ఈనాడు సంపాదకీయపు పేజీలో వేలాది వ్యాసాలు ప్రచురించారు. తన పూర్తి పేరుతోనే కాకుండా, ఇందిరా గోపాల్, శ్రీదీప్తి వంటి కలం పేర్లతో కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాసాలు అందించారు. హోదాలతో సంబంధం లేకుండా అందరితో మర్యాదగా మాట్లాడే మృదుభాషిగా హరి ప్రసాద్ పేరు పొందారు.
ఉత్తమ పాత్రికేయుడిగా నారద సమ్మాన్ అవార్డు, సృజన ఎక్సలెన్స్ అవార్డు వంటి పలు పురస్కారాలు అయన పొందారు. సమాచారాన్ని పారదర్శకంగా సామాన్యునికి చేరువ చేయడంలో, ప్రజలకు ప్రభుత్వ విభాగాలను మరింత జవాబుదారీగా ఉంచే విషయంలో సమాచార శాఖ కమిషనర్ గా తనదైన ముద్రవేసే సత్తా ఉన్న జర్నలిస్టు ఆయన.
అయితే.... ఈనాడు సీఈబీ లో పనిచేసిన లేదా పనిచేస్తున్న వారికి జగన్ ప్రభుత్వంలో పదవి లభించడం ఇది రెండో సారి. ఇక్కడే పనిచేసిన జీవీడీ కృష్ణ మోహన్ 'సాక్షి' పెట్టిన కొత్తల్లోనే అందులో చేరారు. సాక్షిపై 'ఈనాడు' దాడిని పాయింట్ బై పాయింట్ తిప్పికొడుతూ 'ఏది నిజం' పేరుతో రాసిన అయన వ్యాసాలు సంచలనం సృష్టించాయి. తర్వాత జగన్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వానికి కమ్యూనికేషన్ సలహాదారుగా నియమితులై అద్భుతమైన సేవలు అందిస్తున్నారాయన.
కృష్ణ మోహన్ తో కలిసి పనిచేసిన హరిప్రసాద్ కు ఇప్పుడు పదవి లభించింది. నిజానికి, పాఠకులకు సరిగా అర్థంకాని భాషలో సంపాదకీయాలు రాస్తున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్న సీఈబీ ని సంస్కరించేలా సూచనలు ఇచ్ఛే బాధ్యతను రామోజీ రావు గారు ఈ ద్వయానికి అప్పట్లో అప్పగించారు. చాలా శ్రమించి వారిచ్చిన నివేదిక పూర్తిగా కార్యరూపం ధరించినట్లు లేదు!
ఈనాడు ఎడిటోరియల్ బోర్డు నుండి xxx రెడ్డి , xxxx రెడ్డి లని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పదవులలో నియమించారు . they are already qualified by birth.
ReplyDelete🤭🤭
DeleteCongratulations
ReplyDelete“they are already qualified by birth” ..... I like that 😁😁.
ReplyDelete“మనోడే” అన్నది పెద్ద factor అండీ.
అవునూ, సమాచార కమీషనర్ నియామకానికి లా డిగ్రీ (Law) ఉండాలనుకున్నానే, అవసరం లేదా 🤔?