పక్షపాతం ఉండకూడదు.
సత్యమే పరమావధిగా పనిచేయాలి.
విమర్శ సహేతుకంగా చేయాలి.
కక్షతో కూడిన పరుష వ్యాఖ్యలు చేయకూడదు.
ఇవన్నీ చేయకపోబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని సీనియర్ జర్నలిస్టు అని రాయలేకపోతున్నా. కానీ ఆయన తెలుగు జర్నలిజంలో ఒక అధ్యాయం అన్నది వాస్తవం.
సాక్షి టీవీలో వార్తల మీద విశ్లేషణ చేసే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న 70 ఏళ్ల కొమ్మినేని గారిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం బాధ కలిగించింది. ఈనాడు లో నాకు సీనియర్ కలీగ్ అయిన ఆయన్ను నేను చాలా దగ్గరి నుంచి చూశాను. వారి వార్తలు ఎన్నో ఎడిట్ చేశాను. రామోజీ రావు గారు ప్రేమగా గ్రూమ్ చేసిన ఆయన అంటే నాకు గౌరవం ఉంది.
ఆంధ్రుల అభిమాన అన్న ఎన్టీఆర్ నుంచి నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబు గారి చేతికి పవర్ వస్తున్నప్పుడు కొమ్మినేని గారు దగ్గరి నుంచి రిపోర్ట్ చేశారు. ఈనాడు బ్యూరో చీఫ్ గా ఎన్నో కథనాలు రాసారు.
ఆ కథనాలు అన్నీ నిజమా? వండి వార్చినవా? అన్నవి శేష ప్రశ్నలు. వాటికి రామోజీ గారు లేదా చంద్రబాబు గారు లేదా కొమ్మినేని గారు మాత్రమే సమాధానం చెప్పగలరు. చాలా మంది మాత్రం ఆ వార్తలు చంద్రబాబు గారికి మేలు చేసేలా ఒక పద్ధతి ప్రకారం రాశారని అంటారు. వాటి మీద కూయడం, రాయడం ఇప్పుడు అనవసరం.
కొన్ని పరిణామాల మధ్య రామోజీ గారికి కొమ్మినేని గారు దూరమయ్యారు. అది నాలాంటి వాళ్ళకు చాలా ఆశ్చర్యం కలిగించింది. రామోజీ గారు పరమపదించినపుడు కొమ్మినేని గారు వాడిన భాష, చేసిన వ్యాఖ్యలు విన్నాక అనిపించింది...ఇద్దరి మధ్య ఏదో పెద్ద విషయంలోనే తేడా వచ్చిందని.
జగన్ మోహన్ రెడ్డి గారి సాక్షి లో కొమ్మినేని గారి షో చూశాక ఆయన మీద గౌరవం తగ్గింది. అయినా తెలుగు నేల మీద నిష్పాక్షిక జర్నలిజం ఒక పెద్ద భ్రమ అని తెలిసినవాడిగా ఆయన ను దూరం నుంచే గమనిస్తూ ఆయనకు మంచి జరగాలని కోరుకున్నాను. బ్యూరో చీఫ్ గా ఉన్నపుడు ఆయన రెండు బాక్సులు తెచ్చుకుని అందరితో కలివిడిగా ఉంటూ క్యాంటీన్ లో తినేవారు. చాలా సింపుల్ మనిషి. రామోజీ దూరమయ్యాక, చంద్రబాబుతో చెడ్డాక, జగన్ కు దగ్గరయ్యాక కొమ్మినేని గారి జర్నలిజం మరింత దిగజారిందన్న విమర్శ ఉంది.
అయితే, ఎడిటర్ల సంఘానికి హెడ్డుగా చెప్పుకునే ఒకాయన టీవీ షో లో చేసిన సొల్లు వాగుడు మిషతో ఇవ్వాళ కొమ్మినేని గారి అరెస్టు అయ్యింది. కొమ్మినేని గారు ఆ వ్యాఖ్యను ఖండించకుండా...వెకిలిగా డీల్ చేశారన్నది స్పష్టం. ఆ వ్యాఖ్య కొమ్మినేని గారు నేరుగా చేయలేదు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం సమంజసం కాదు. పైగా అట్రాసిటీస్ కేసు పెట్టడం భావ్యం కాదు. లైవ్ షోలలో బూతులు మాట్లాడే వారిని ఆయన నిలువరించడం నేను చూసాను. జర్నలిస్టు సంఘాలను, రాజకీయ పార్టీలను రెంటినీ జాగ్రత్తగా డీల్ చేసే వారిలో మాదిరి లౌక్యం కొమ్మినేని గారికి లోపించింది అనిపిస్తుంది.
పొలిటికల్ భావాలు ఎట్లా ఉన్నా...ఆయన సుదీర్ఘ కాలం పాటు జర్నలిస్టుగా ఉన్నారు. మొదట్లో చంద్రబాబు పక్షాన, ఇప్పుడు జగన్ వైపు ఉన్నారు. దానికి దానికి చెల్లు అయ్యింది. ఈ వయస్సులో ఆయన మీద కక్ష సాధింపు మంచిది కాదు. ఆయన్ని వెంటనే విడుదల చేయాలి.
పొలిటికల్ వైకుంఠపాళి లో చిక్కుకుని..ఆరంభంలో ఉన్న నిష్పాక్షికతని పోగొట్టుకుని చరిత్రలో మంచి స్థానం పోగొట్టుకున్న జర్నలిస్టులు రెండు రాష్ట్రాల్లో ఎందరో ఉన్నారు. రాజకీయుడి చేతిలో బలవుతున్న ఇలాంటి సీనియర్లను, టీవీ డిబేట్లలో చెలరేగిపోతున్న జూనియర్లను చూస్తే జాలేస్తుంది. తెలిసీ తెలియక...పరమ పవిత్రమైన జర్నలిజానికి వీళ్ళు సమాధి కడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలలో నిస్పాక్షికంగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారా (ప్రస్తుతం) .. ఉంటే వారి పేర్లు తెలుసుకోవాలని ఉంది
ReplyDeleteస్త్రీత్వాన్ని అవమానించిన వ్యక్తిని వయసు చూసి గౌరవించాలని అడుగుతున్నారు. భావ్యం కాదు.
ReplyDeleteజూనియర్లను చూసి మీరు జాలిపడటం ఇక్కడ అప్రస్తుత ప్రసంగం. ఈ సీనియరు గారి దుష్ప్రవర్తన చూసి సమర్ధించుతున్న మిమ్ముల్ని చూసి జాలిపడవలసి ఉంది.
రాజకీయ వ్యాఖ్యాతలు, యాంకర్లు ఎవరైనా ముమ్మాటికీ అభ్యంతర కారణమైన వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.
Deleteఅయితే టీవీ5 లో కొంత కాలం క్రితం ఒక యాంకర్ సినిమా పరిశ్రమ పై అసభ్య పదం పలికినప్పుడు మీ వంటి వారు ఎందుకు మౌనంగా ఉన్నారు ?
ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు ?
మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.
ReplyDeleteI am not born yesterday!
Deleteమీరే చాలా తప్పుగా వ్రాసారు.
ప్రస్తుతం ఆంధ్రలో మీడియా రాజకీయ పరిస్థితులు బాగా లేవు.
ReplyDeleteyou support naxals,terrorists,all unlawfuls in the name of journalism, you instigate and incote people by your writings and doings. And say it is freedom of speech, human values,womans rights etc. you have selective amnesia. you are the first antisocial element to be eleminated. Time is not faraway for u to go behind the bars.
ReplyDelete