హైదరాబాద్ కేంద్రంగా వెలువడుతున్న 'ది హన్స్ ఇండియా' ఆంగ్ల దినపత్రిక జులై 16, 2021 నాడు పదేళ్ల జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందదాయకం. రోజురోజుకూ నాణ్యత పరంగా వృద్ధిచెందుతున్న ఈ పత్రికకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం. సీఎల్ రాజాం గారి నేతృత్వంలో, అప్పరసు శ్రీనివాస రావుగారి సంపాదకత్వంలో హైదరాబాద్ కేంద్రంగా 'మెట్రో ఇండియా' అనే పత్రిక వచ్చింది కానీ మూడు ఏళ్లకే మూతపడింది. ఎదుకంటే... దినపత్రిక నిర్వహణ అంత తేలికైన వ్యవహారం కాదు. అయినా.... మొక్కవోని దీక్షతో నాణ్యతకు పెద్దపీట వేస్తూ, ఆర్ధిక సమస్యలను అధిగమిస్తూ పదేళ్లు పూర్తిచేసుకోవడం మామూలు విషయం కాదు.
కపిల్ చిట్స్ అధిపతి వామనరావు గారి పెట్టుబడిలో సీనియర్ జర్నలిస్టు కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి మానస పుత్రికగా "ది హన్స్ ఇండియా' పత్రిక పురుడుపోసుకున్నప్పుడు నేను ఆ సంస్థ వారి 'ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం' వ్యవహారాలు చూసేవాడిని. దీన్ని మంచి టాబ్లాయిడ్ గా తేవాలని భావించినా ప్రింటింగ్ కు సంబంధించి వచ్చిన సాంకేతిక సమస్య వల్ల బ్రాడ్ షీట్ గా తెచ్చారు. ఎడిటర్ గా, డెక్కన్ క్రానికల్ మాజీ ఎడిటర్ నాయర్ ఉండేవారు. సీనియర్ జర్నలిస్టు, ది హిందూ లో ఒక వెలుగు వెలిగిన సాయశేఖర్ రిపోర్టింగ్ కు నేతృత్వం వహించారు. భాస్కర్, పెన్నా శ్రీధర్, మంజులతా కళానిధి తదితర మంచి జర్నలిస్టులు ఉన్న ఈ బృందం చాలా కష్టపడి దీన్ని ఆరంభించింది. వృత్తి విలువలు, నైతిక నిబద్ధత వంటి అంశాలలో 'ది హిందూ' కు దీటుగా ఉండాలని సంకల్పం చెప్పుకున్నారు. లోకల్ వార్తలకు పెద్దపీట వేయడం ఇందులో కనిపిస్తుంది. అలాగే ప్రత్యేకించి బిజినెస్ ఎడిషన్ ఉండడం ఒక ప్రత్యేకత.
అప్పటికే జర్నలిజం పటుత్వం తగ్గిపోయిన నాయర్ గారికి పూర్ణకుంభ స్వాగతం పలికి బాధ్యతలు మొదట్లో ఎడిటర్ బాధ్యతలు అప్పగించారు గానీ, అది వర్కవుట్ అయినట్లు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి హయాంలో పత్రిక ఒక ఊపు అందుకుంది. వారు వెళ్ళిపోయాక సీనియర్ జర్నలిస్టు రామూ శర్మ గారి నేతృత్వంలో కొత్తపుంతలు తొక్కుతున్నది. పత్రిక రెండో రోజు బ్యానర్ స్టోరీగా నేను నల్గొండ లో ఫ్లోరైడ్ సమస్య మీద రాస్తే వేశారు. మే 2021 నుంచి ప్రతి బుధవారం 'Moot Point' అనే కాలమ్ రాసే అవకాశం ఇచ్చిన ప్రస్తుత ఎడిటర్ రామూ శర్మగారికి ధన్యవాదాలు.
పది వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రామూ శర్మ గారి సైన్డ్ ఎడిట్ ఇదీ:
Crossing the decade milestone is a moment of pride for The Hans India. The 10-year-old journey began with an intention to serve the Telugus with wholesome, pure and unbiased news. This made the Hyderabad Media House Limited launch The Hans India simultaneously from Hyderabad, Visakhapatnam, Vijayawada, Warangal and Tirupati on July 16, 2011. The launch took off under the leadership of veteran journalist K Ramachandra Murthy, who took the newspaper from the pre-Telangana movement to separate Statehood. Since then The Hans India was driven by the credible Editors PNV Nair and Prof K Nageshwar bringing the unbiased reportage to the readers.
The Team Hans promises to continue its journey in the new decade upholding the core values and remain connected with the readers by taking up issues that matter to them the most. The Hans India has seven editions in the two Telugu States and one edition in the National Capital to reach Telugus, policymakers and opinion leaders. With Hyderabad, Warangal and Khammam editions in Telangana and Amaravati, Visakhapatnam, Tirupati and Kurnool edtions in Andhra Pradesh, The Hans India has a unique distinction of having readers in the age group of 18 to 45 years. It has started attracting readers from Mumbai, Delhi, Bengaluru and Chennai.
With growing readership over a broad spectrum, The Hans India has launched two e-Papers riding the digital trends. A full-fledged edition has a special focus on Bengaluru. The second one on the young entrepreneurs with Bizz Buzz and the business sections explore all aspects from start-ups, macroeconomy to information for small investors. The core of the newspaper is its unbiased content serving various sections of society, especially the marginalised society and rural regions, not ignoring the urban happenings. The urban content is amply covered in City Hans pages, which is the source of strength in reaching the readers. Besides national news with a special focus on diaspora from abroad, in-depth articles from experienced experts in the field is the hallmark of The Hans India. An exclusive section Womenia covers various aspects of women. Young Hans provides the space for GenNext to give utility news from education to opportunities. Illustrated Sports pages give priority to the local news as important as popular games in the arena of sports.
As part of social responsibility, The Hans India has initiated awareness programmes among citizens like Jagore, Freedom from Plastic, Half Marathon and Retail Ratna Awards etc. With the focused coverage, The Hans India has created an impact on the administration by taking up action on civic issues. These responsive actions from the administration are covered under the brand: The Hans Impact.
Giving platforms to women and young aspirants to showcase their talents by organising contests like Ghar Ki Biryani, focus on the gourmets of Deccani cuisine with the Hans Haleem, where visitors to the Haleem centres gave ratings to the ever-popular dish and Draw A Dream – “Swecha Bharath.” Hans India will always be your best News Partner.
No comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి