Tuesday, January 31, 2012

మంత్రుల జీతాలు రెట్టింపు. టైమ్స్ స్కోర్ చేసిన స్టోరీ

ధరలు ఆకాశానికి అంటుతుంటే...సాధారణ జనంతో పాటు మన మంత్రులు కూడా అల్లల్లాడతారు కదా. అందుకే కామ్ గా  తాజా మంత్రివర్గ సమావేశంలో తమ జీతాలను రెట్టింపు చేసుకున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక మొదటి పేజీలో ఒక వార్త ప్రచురించింది. మరీ వార్త సర్కారు వ్యతిరేక తెలుగు పత్రికల్లో సైతం కనిపించకపోవడం నాకు విడ్డూరంగా అనిపించింది. ఇప్పటిదాకా లక్ష రూపాయలుగా ఉన్న జీతాలను 2.15 లక్షలకు పెంచుకున్నారట మన సార్లు. ఇవి కాక..భత్యాలు కూడా భారీగానే పెరిగినట్టు కనిపిస్తున్నది. మంత్రులు ఖరీదైన ఫోన్లు కొనుక్కోవడానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. దానికి వన్ టైమ్ గ్రాంటు ఇస్తారట. మంత్రులా మజాకా.

అధికారిక పర్యటనలకు మంత్రులు ఇక నుంచి తమ భార్యలను కూడా తీసుకుపోయేందుకు, ఆ ఖర్చు కూడా జనం నెత్తిన రుద్దేందుకు నిర్ణయం జరిగిపోయిందని ఆ పత్రిక కథనం. భార్యలు ఎందుకట అంటే...
“The presence of spouse with the minister will go a long way in ensuring stability and focus,” is how the cabinet note justified the perk.

అదీ సంగతి. అయితే...భార్యలను మంత్రులతో పోనివ్వడమే మంచిదని ఒక సీనియర్ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు. "వీళ్లు ఒంటరిగా పోతే...పోయినచోటల్లా ఎవరు దొరుకుతారా అని చూస్తారు. వీళ్ల కక్కుర్తిని ఆసరాగా చేసుకుని అవినీతిపరులు ఫైళ్ల మీద సంతకాలు చేయించుకునే అవకాశం ఉంది. అందుకే వీళ్ల వెంట భార్యలుంటేనే మంచిది," అని ఆయన అన్న మాట సమంజసంగానే ఉంది. దీనికి సంబంధించిన టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ఇదీ...

Mantris help themselves to double pay-hike

Salary Hiked From 1L To 2.15L

B Krishna Prasad TNN

Hyderabad: The Kiran Kumar Reddy government has been so far indifferent to the demand of Junior government doctors demanding a hike of Rs 5,000 in their salary, but wasted no time in doubling the salaries of its ministers. At its meeting here on Monday, the state cabinet decided to hike the salary of the ministers from the current nearly Rs one lakh a month to Rs 2.15 lakh per month! This includes various allowances as well as telephone and office expenses. Significantly, the hike has been made effective from December 2011, implying that they are in for a big packet of arrears on February 1. 

    The basic pay of the ministers was increased from Rs 5,000 to Rs 14,000 while for the chief minister, it would be Rs 16,000 per month. The special allowance was increased from Rs 3,200 to Rs 8,000, sumptuary allowance from Rs 3,000 to Rs 7,000, Camp Office allowance from Rs 5,000 to Rs 10,000, attender allowance from Rs 5,000 to Rs 20,000, security car allowance from Rs 15,000 to Rs 25,000, own car allowance from Rs 10,000 to Rs 30,000, fuel charges from Rs 7,000 to Rs 15,000. 

    The Dearness Allowance while on tours was hiked from Rs 300 per day to Rs 1,500 while outside the state and Rs 1,000 within. Mileage allowance was hiked from Rs 10 per km to Rs 20 per km. And from the earlier policy of giving each minister Rs 15,000 once in three years to buy mobile phones, the cabinet decided to give them a one-time grant of Rs 35,000. “Since the ministers use high-end phones, it was decided to give them a one-time grant so that the phones need not be returned,” the cabinet note said. 

    It was also decided that henceforth, the spouses of ministers will also be allowed to travel with them on official tours. “The presence of spouse with the minister will go a long way in ensuring stability and focus,” is how the cabinet note justified the perk. 

    “Apart from these, there is a constituency allowance which is around Rs 83,000. Ministers are also allowed to have three domestic helps at their homes at a payment of Rs 2,000 salary each and three attenders with each of them being paid Rs 6,700 as salary,” detailed a senior official in the government. The cabinet meeting unanimously cleared the proposal as every minister set to benefit with the steep increase. The hike is expected to cost the state exchequer an additional Rs 5.5 crore per year.

Monday, January 30, 2012

ఆత్మ బంధువుల్లారా...మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి పెట్టగలరా...

డియర్ ఫ్రెండ్స్,
ఇదొక విషాద ఘట్టం.
ఈ బ్లాగులో చాలా సార్లు నా ఫోన్ నంబర్ ఇచ్చాను. పలువురు నాతో ఫోన్ లో మాట్లాడారు. అయితే...ఈ ఉదయం మా అబ్బాయిని లాల్ బహదూర్ స్టేడియం కు తీసుకుపోయినప్పుడు నా మొబైల్ పోయింది. Nokia E-63 అది. March 2, 2011 నాడు మా పెళ్లి రోజు సందర్భంగా బైటికి డిన్నర్ కు తీసుకుపోయి....నా భార్య మా పిల్లలిద్దరికి కూడా తెలియకుండా నాకు  ప్రేమతో ఇచ్చిన surprise gift అది. 

దాన్ని నేను స్టేడియం కు తీసుకుపోలేదని, పోతూ పోతూ టీ వీ పక్కన పెట్టి పోయానని  నా నమ్మకం. మరి ఆ తర్వాత ఒక పని మనిషి మాత్రమే ఇంట్లోకి వచ్చింది. నేను ఇరవై ఏళ్ళ కిందట నవీన్ నగర్ లో ఉన్నప్పుడు...మా పెళ్ళైన కొత్తల్లో మా ఇంట్లో మనిచేసిన ఆమె కాబట్టి...కొడుకులు చూడడం లేదన్న సానుభూతితో...నాలుగు డబ్బులు ఇవ్వవచ్చని హేమ ఆమెను పనిలో పెట్టింది. పొద్దున్న వచ్చి బైట ఊడ్చి, నీళ్ళు చల్లి పోతుంటూ వుంటుంది. నాతో కలిసి టీ తాగుతూ మాట్లాడుతుంది...రామయ్యా అంటూ. అలాంటి ఆమె నా ఫోన్ తీసుకుంటుందని నాకైతే అనిపించడం లేదు. కానీ...ఆమె credentials బాగా లేవని నాకీ మధ్యనే కాలనీలో కొందరు చెప్పారు. కాబట్టి....ఇప్పుడు నేను డైలమా లో పడ్డాను. 

మీలో టెక్నాలజీ బాగా తెలిసిన వారు...ఫోన్ ను ట్రాక్ చేయడం లో అనుభవం ఉన్నవారు నాకు సహకరిస్తే...ఖైరతాబాద్ చౌరస్తా లో ఉన్న ఇరానీ కఫే లో మీరు తిన్నన్ని ఉస్మానియా బిస్కెట్స్ తినిపించి, తాగినన్ని టీలు తాగిస్తాను. మొదటివి ఇష్టం లేవు, రెండో పార్టు మాత్రమే రాత్రివేళ వేరే చోట కాస్త తీరిగ్గా స్వీకరిస్తామనే వారిని కూడా ఈ విషయంలో నిరుత్సాహ పరచవద్దని అబ్రకదబ్ర చెప్పాడు. పది వేల రూపాయల ఫోను మరి. పైగా ప్రియురాలి బహుమానం. 

హేమ మాత్రం...గూగుల్ తిరుమల్ రెడ్డి గారికి ఫోన్ చేయమని పొద్దటి నుంచీ చంపుతున్నది. తిరుమల్ గారు గానీ...మరెవరైనా ఆదుకుంటామన్న నమ్మకం ఉంటే స్పందించండి. థాంక్స్.     

Sunday, January 29, 2012

...ఓ ఐదేళ్లు క్రికెట్ ను భారత్ లో నిషేధిస్తే సరి...

గత రెండు రోజులుగా పత్రికలు, టెలివిజన్ ఛానల్స్ చూస్తే...ఏదో సునామీ వచ్చి దేశాన్ని ముంచెత్తినట్లు, జరగరాని పరమఘోరమేదో జరిగినట్లు అనిపిస్తున్నది. జాతి యావత్తూ కోల్పోకూడనిదేదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతోంది. కొందరికి నిజంగానే ఆ ఫీలింగ్ ఉంటే....మీడియా వాళ్ల అత్యుత్సాహం వల్ల ఇంకొందరికి ఆ జబ్బు సోకుతున్నది. ఇవ్వాళ దేశం మొత్తం విషాద సాగరంలో మునిగి ఉంది.

క్రీడాభిమానులు ఇదేదో జాతీయ సమస్య అయినట్టు చర్చించుకుంటున్నారు. పరిస్థితిని బాగుచేయడానికి ఏమి చేయాలన్నదానిపై ఎవడికి తోచింది వాడు సలహాగా ఇచ్చి పారేస్తున్నాడు. చిన్న పిల్లల నుంచి తాతయ్యల వరకూ అంతా విశ్లేషణలతో బిజీగా ఉన్నారు. ఆడ స్త్రీలు, మగ పురుషులు, పిల్లాపాపా, గొడ్డూగోదా అంతా ఈ విషాదంతో ఉన్నారు. గుంపులో గోవిందా మాదిరిగా ఈ విషాదంలో పాలుపంచుకోని వాడు అసలు భారతీయుడిగా చెలామణీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 

ఛీ...ఛీ...ఇలా జరగడానికి వీల్లేదు...దరిద్రులు దేశం పరువు తీశారు...వాణిజ్య ప్రకటనల పిచ్చిలో పడి చెడ దొబ్బారు...వంటి వ్యాఖ్యలు జోరుగా వినవస్తున్నాయి. ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ వీరులు కుదేలై వైట్ వాష్ కు గురికావడం ఇంత చర్చకు కారణం.

దేశాన్ని పతనం చేస్తున్న ఏ అంశాల గురించీ, అవినీతి గురించి అస్సలే పట్టని వారంతా క్రికెట్ దగ్గరకు వచ్చేసరికి పరమ వీర దేశభక్తులై పోతున్నారు. సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ కోసం కళ్లు, పళ్లు, ఒళ్లు కాయలుకాచేలా చూసే జనం ఎంతమంది లేరు? నా పీహెచ్ డీ, సచిన్ టెండూల్కర్ ఒకేలా ఉన్నాయి. అవి ఎంతకూ తెగని ముడిపడని వ్యవహారాలు. అసలు క్రికెట్ తోనే ఛస్తుంటే...తగదునమ్మా...అని సినీస్టార్లు వారితో పాటు హీరోయిన్లు ఊపుకుంటూ క్రికెట్ మైదానంలోకి దూకుతున్నారు. వారిని చూడటానికి కూడా వెర్రిజనం ఎగబడుతున్నారు. ఛానళ్ల వారు, ముఖ్యంగా టీవీ నైన్ వాడు, గత కొన్ని రోజులుగా ఈ తెలుగు వారియర్స్ ను ఎత్తడంతోనే కాలక్షేపం చేస్తున్నాడు.

అసలు...ఆటలన్న తర్వాత ఓడిపోరా? అయినా...భారత క్రికెటర్లకు ఓటమి ఇదేమైనా మొదటి సారా? దీని మీద అటు జనం, ఇటు మీడియా గుండెలు బాదుకోవాల్సిన అవసరం ఉందా? ఏమో నామటుకునైతే...ఇదొక వ్యర్ధ వ్యవహారం అనిపిస్తున్నది. దీని బదులు...జనం క్రికెట్ పిచ్చిని వదులుకుని అన్ని ఆటల పట్లా ఆసక్తి కనబరిస్తే బాగుంటుంది. మనం, అంటే క్రీడాభిమానులం, ఎక్కువగా క్రికెట్ కు ప్రాధాన్యమివ్వడం వల్ల...మీడియా కూడా దానికే పెద్దపీట వేస్తున్నది. ఈ క్రికెట్ పిచ్చిలో పడి మిగిలిన ఆటలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందుకే...అన్ని అంతర్జాతీయ పోటీలలో పతకాల పట్టికలలో మనం వెనుకబడి ఉంటున్నాం. 

మన క్రికెటర్లు క్రమం తప్పకుండా దేశాన్ని విషాదసాగరంలో ముంచుతున్నారు. ఆ మాటకొస్తే ఏ క్రికెట్ జట్టూ ఎప్పుడూ విజయాలను నమోదు చేయలేదు. క్రికెట్ జట్టు ఓడిపోతే...ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ తదితర దేశాల్లో జనం కూడా మనలాగానే కుళ్లి కుళ్లి ఏడిచ్చస్తున్నారా అన్నది పరిశోధించాల్సిన అంశం. ఈ ఏడుపులు పెడబొబ్బలు మాని ఒక ఐదేళ్ల పాటు క్రికెట్ ను నిషేధిస్తే భారత దేశానికి పలు రకాలుగా ఎంతో మేలు జరుగుతుందని నాకు గట్టిగా అనిపిస్తున్నది. ఇంతకన్నా ఉత్తమమైన ఆలోచన వస్తే నాతో పంచుకోండి.

Saturday, January 28, 2012

ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోజగన్నాథ్ దాస్ గారు రాసిన వ్యాసం

రెండున్నర దశాబ్దాలుగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ స్పోర్ట్స్ రిపోర్టర్ గా ఉన్న జగన్నాథ్ దాస్ గారిని నేను రాజమండ్రిలో సౌత్ జోన్ నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ సందర్భంగా కలిశాను. ఆయన అప్పటికే రాష్ట్రానికి చెందిన ఆడపిల్లలు జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్నారని పెద్ద వ్యాసం రాశారు. చాలా ఏళ్ల తర్వాత మొదటి సారి రాష్ట్రానికి చెందిన ఒక పిల్లవాడు కేడెట్ విభాగంలో ఇండియా నెంబర్ ఫోర్ అయ్యాడనీ, అతని గురించి  మీ వ్యాసంలో రాయలేదేమిటని అడిగాను. బాధతోనైనా నేనేదో కాజువల్ గా అడిగితే...తను చాలా బాధపడ్డారు. "నిజమేనండీ....నేను కనీసం ఆ యాంగిల్ లో నిర్వాహకులను, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వారిని అడిగి ఉండాల్సింద"ని చెబుతూ...నాకు సారీ చెప్పారు. రైట్ టైమ్ లో ఫిదెల్ గురించి రాస్తానన్నారు. నేను ఆయన మర్యాదకు అద్దిరిపోయాను. జర్నలిస్టులంటేనే....ఒక 70 % తలపొగరు, 20% కొవ్వు, 10% అతి తెలివితో తయారైన జీవులని నాకు తెలుసు. పైగా సీనియర్ మోస్టు జర్నలిస్టు. అలాంటిది తను సారీ చెప్పేసరికి అయ్యో అనిపించింది.

ఫిదెల్ మీద ఫీచర్ చేస్తామని పత్రికలు, ఛానళ్ల మిత్రులు, సన్నిహితులు చెప్పినా...పొగరు పెరుగుతుంది..వద్దు అని చెబుతూ వచ్చిన నేను జనవరిలో కావాలనే ఇంగ్లిషు పేపర్ల మిత్రులకు తన కెరీర్ గ్రాఫ్ ను తెలిపే డాక్యుమెంట్లతో మెయిళ్లు పంపాను. డెక్కన్ క్రానికల్ స్పోర్ట్స్ ఎడిటర్, ది హిందూ స్పోర్ట్స్ స్పెషల్ కరెస్పాండెంట్ లు వెంటనే కంగ్రాచ్యులేటరీ మెసేజీలు పంపారు. వ్యాసం సంగతేమిటో గానీ వారి స్పందన నాకు చాలా ముచ్చటేసింది. తర్వాత ఇద్దరూ రాసిన వ్యాసాలు ఈ బ్లాగులో నా సొంత సొద కింద మీరు చదివ ఉంటారు. వారికి థాంక్స్.

ఆ రెండు వ్యాసాలకు భిన్నంగా జగన్నాథ్ దాస్ గారు...వ్యాసం రాశారు.ఇది చదివి నా క్రీడా జీవితం గురించి గుర్తుకొచ్చి కళ్ల వెంట నీళ్లొచ్చాయి. ఇంకొక మాట...ఒకే వి‍షయాన్ని మూడు పత్రికలు ఎంత భిన్నంగా రాశాయో అధ్యయనం చేయడానికి ఈ మూడు వ్యాసాలు పనికొస్తాయి. జగన్నాథ్ దాస్ గారు రాసిన వ్యాసం ఇక్కడ ఇస్తున్నాను...ఆయనకు ప్రత్యేక థాంక్స్ తో.

ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియాల మధ్య ప్రకటనల యుద్ధం

 లలితా సహస్ర నామ పారాయణం చేసి పట్టుచీర కట్టుకుని సాయంత్రం కాగానే దేవళానికి వెళ్లే ఆడపడుచు లాంటి ది హిందూ పత్రికకు, నాలుగైదు బొక్కలు పడిన బ్రాండెడ్ షార్ట్ వేసుకుని చేతులో సిగరెట్ తో సాయంత్రం బార్ లో మాత్రమే కనిపించే సుందరాంగి లాంటి టైమ్స్ ఆఫ్ ఇండియాల మధ్య ప్రకటనల యుద్ధం తారస్థాయికి చేరుకుంటున్నది. మార్కెట్ గిమ్మిక్కులలో ఆరితేరిన టైమ్స్ దక్షిణాత్యుల ఆరాధ్య దైవం లాంటి ది హిందూను సద్దివార్తల భోషాణమని అర్ధమొచ్చేలా ఒక ప్రకటన విడుదల చేయడంతో పోరాటం ఆరంభమయింది. దానికి ప్రతిగా ది హిందూ....టైమ్స్ పాఠకులు బుర్ర తక్కువ జనాలనే అర్ధం వచ్చేలా ఒక ప్రకటన గుప్పించింది. ఆ పోరాట పరంపరలో ఒక భాగం ఇది. చూడండి. 

Thursday, January 26, 2012

"ది హిందూ" పత్రికలోఈ రోజు ఫిదేల్ గురించి వచ్చిన వ్యాసం


Making waves in the table tennis circuit

V. V. SUBRAHMANYAM  
Fidel Rafeeque Snehit
Fidel Rafeeque Snehit
His name might spell funny.
But this young talent in table tennis is pretty serious when it comes to competing across the table, often unfazed by the reputation of the opponents. That is Suravajjula Fidel Rafeeque Snehit for you.
This young boy, whom the regulars in table tennis circuit believe to have the potential to go a long way, is now India No. 4 in the cadets category.
A distinction which he achieved by virtue of his bronze in the Sub-junior nationals recently in Kochi.
For the record, Snehit also won the team bronze in the above National in the sub-juniors and cadet categories.
A student of Bharatiya Vidya Bhavan, Snehit also helped his team win the silver in the National-level CBSE tournament held in Varanasi (Uttar Pradesh).
The fact that this youngster has become the first one in boy's category to reach this level is perhaps an indication of his commitment, talent and dedication.
Snehit's coach Somnath at the Global Table Tennis Academy where he trains, believes that the young champion paddler might well get a chance to attend some of the big-time coaching camps which should help him a long way.
Incidentally, Somnath being himself State No. 2 in men's singles should know what Snehit needs exactly. “It is because of Somnath bhayya I could achieve this. He taught us many new strokes to compete at national level. We both are working hard to perform well in the coming season,” acknowledges Fidel.
For someone who admires Ma Long and Achanta Sharat Kamal, Snehit has every reason to dream big including representing India one day in Olympics.
“I am grateful to the GTTA vice-president Ramdoss Bharatan, another coach Vedam Ajay Kumar and the Bharatiya Vidya Bhavan School principal Rama Devi for all their support in my endeavour to be a champion,” he signs off before joining another rigorous training session. Keep at it.

Wednesday, January 25, 2012

....ISJ ప్రింట్ జర్నలిజం ఇంగ్లిషు బ్యాచ్ లో చేరండి....

వ్యాపారం కొద్దిగా ముడిపడివున్న అంశానికైనా ఈ బ్లాగును వాడుకోవడం తప్పని సంకల్పం చెప్పుకున్నా గానీ పలువురికి ప్రయోజనం కలిగే అంశం కావడంతో ఈ పోస్టు రాస్తున్నాను. ఇది...ఇంగ్లిషు కాస్త వచ్చి తెలుగులో కుమిలిపోతున్న జర్నలిస్టులకు మేలు చేసే అంశమని భావిస్తున్నాను.

తెలుగులో ఉన్న చాలా మంది జర్నలిస్టులకు ఇంగ్లిషు బాగానే వస్తుంది. కానీ వారిలో కొరవడిన ఆత్మవిశ్వాసం వల్ల ఇంగ్లిషు జర్నలిజం వైపు చూడరు. నేను "ఈనాడు జర్నలిజం స్కూల్" లో చేరి...కీలకమైన జనరల్ డెస్క్ లో పనిచేశాను. అక్కడ ఇంగ్లిషు వార్తలను అనువదించాల్సి ఉండేది. ట్రాన్స్ లేషన్ అంటే...ఒక కాపీ చూసి మక్కీకి మక్కీగా అనువదించడం కాదు. కుప్పలు తెప్పలుగా వచ్చిన న్యూస్ ఏజెన్సీ కాపీలను చూసి, చదివి, అవసరమైన భాగాలను తీసుకుని, కుదించి అనువదించాలన్న మాట. అది నాకెంతో ఉపకరించింది. అలా మెరుగుపరుచుకున్న భాషా పటిమతో ఇంగ్లిషు జర్నలిజం వైపు వెళ్దామని నిర్ణయించుకుని హేమ (నా భార్య), మూర్తి (తమ్ముడు) ప్రోత్సాహంతో "ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం" కు వెళ్లి తర్వాత...'ది హిందూ'లో ఒక ఎనిమిదేళ్లు పనిచేశాను. నేను 'ఈనాడు'లో ఉన్నప్పుడు..."ఆంగ్లం కాదు కఠినం-ముఖ్యం నిత్య పఠనం" అన్న శీర్షికతో ఆ పత్రిక వారి 'సమీక్ష' పత్రికలో రాశాను. ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. మినిమమ్ ఆంగ్ల ప్రవేశం ఉన్నవారు ఒక్క ఆరు నెలలు నేను చెప్పినట్టు కష్టపడితే వారిని మంచి ఇంగ్లిషు జర్నలిస్టుగా నేను చేయగలనని గట్టిగా నమ్ముతున్నాను. ఆ నమ్మకంతోనే Indian School of Journalism  లో కొత్తగా PG Diploma in Print Journalism అనే కోర్సు ప్రారంభిస్తున్నాను. ఇది పూర్తిగా English medium course. కాల వ్యవధి ఏడు నెలలు.

తెలుగు జర్నలిజం లో పెద్దగా ఎదుగుదల లేదనీ, అక్కడి వ్యవహారం భావిలో కప్ప కన్నా ఘోరమనీ, కులం..భావాలు..తెలివితేటల పరంగా మనకు అక్కడ అనువైన వాతావరణం లేదని నమ్మేవారు ఈ అవకాశాన్ని వాడుకోండి...మీకు ఇష్టమైతే. సాధారణ విద్యార్థులతో పాటు తెలుగు జర్నలిజంలో ఐదారేళ్ల అనుభవం ఉన్న వారు ఈ కోర్సులో చేరవచ్చు. అయితే...ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని మాత్రం వదులుకోవాల్సి ఉంటుంది. వృత్తిలో బాగా అనుభవం ఉన్న వారు శిక్షణ ఇస్తారు. నేను నాకు తెలిసిన విషయాలను పంచుకుంటాను. మొదటి విడతగా ఇప్పటికే కొంత మందిని ఎంపిక చేశాము.

మీకు ఆసక్తి ఉన్నా...మీకు తెలిసిన వారి పిల్లలకు కోర్సు ఉపకరిస్తుందని మీరు భావించినా...ఫిబ్రవరి ఫస్టున ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం లో మేము నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. యువ జర్నలిస్టులకు ఇదొక మంచి అవకాశమని నేను అనుకుంటున్నాను. మా శిక్షణలో రాటుతేలిన వారికి ఇంగ్లిషు జర్నలిజంలో మంచి అవకాశాలు తప్పక ఉంటాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆసక్తి గల యువ జర్నలిస్టులు మీ పెద్దలను, కుటుంబ సభ్యులను, సన్నిహితులను సలహా అడిగి...ఫిబ్రవరి ఫస్టున ఉదయం పదిన్నర కల్లా అణుపురం కాలనీలో ఉన్న మా ఆఫీసుకు రండి. స్పాట్ అడ్మిషన్ లో పాల్గొనండి. అయితే....కనీస స్థాయిలో ఇంగ్లిషు వచ్చిన వారే ఈ సాహసం చేయండి. మరిన్ని వివరాల కోసం హెచ్. ఎం టీవీ లో వచ్చే స్క్రోల్ చూడండి. ఆల్ ది బెస్ట్. 
Graphic courtesy:
armenianweekly.com