పత్రికాలోకంలోని ఏదైనా తప్పును ఎత్తిచూపాలంటే భలే సమస్యగా వుంది. ఉదాహరణకు...'ఈనాడు' గురించి చర్చ జరిపిన మర్నాడు 'ఆంధ్రజ్యోతి' లో తప్పుల గురించి రాస్తే...'కమ్మోళ్ళకు నువ్వు వ్యతిరేకం' అని ముద్రవేస్తారు. అదే పోజిటివ్ గా రాస్తే...'మీ కమ్మోళ్ళకు అనుకూలంగా ఎక్కువ రాస్తున్నావు' అంటారు. విషయానికి మాత్రమే చర్చను పరిమితం చేయకుండా, రచయితకు దురుద్దేశాలు ఆపాదించడం ఈ బ్లాగు లోకంలో ఎక్కువయ్యిందని అనిపిస్తున్నది. ఇలా 'బ్లాంకెట్/ స్వీపింగ్ స్టేట్మెంట్స్' చేయడం మానుకుని, విషం చిమ్మకుండా....సహనంతో మంచి చర్చ జరిపేవారే మరొకసారి ఈ బ్లాగ్ కు విచ్చేయాల్సిందిగా మనవి. 'ఈనాడు' శీర్షికల మీద రాసిన పోస్టుకు ఆ హెడింగ్ పెట్టిన వారి తాలూకు వారు కూడా దొంగ పేర్లతో కామెంట్స్ రాయడం ఎంతైనా హర్షణీయమే.
మొత్తంమీద సంకుచిత భావాలు, కుల దూషణలను మనం అధిగమిస్తే మంచిదని సూచిస్తూ...శుక్రవారం 'ఆంధ్రజ్యోతి' లో వచ్చిన ఒక రెండు శీర్షికలు తెలుగును ఎలా సంకరం చేసాయో మీ దృష్టికి తేదలచాను.
ఒకటి) నవ్య అనే పేజీలో వచ్చిన శీర్షిక
చొక్కాలు చూడబుల్ గా..
రెండు) మొదటి పేజీలో వచ్చిన శీర్షికహస్తంతో గులాబీయింగ్
మూడు) హైదరాబాద్ మినీ మొదటి పేజీలో..
క్రికెట్ ఫీవర్
శీర్షికలు సూటిగా, సరళంగా ఉంటే మంచిది. తెలుగులో ఆ ప్రయత్నం చేయడం చేతకాక...ఆ ఓపిక, సమయంలేక పరభాష, ముఖ్యంగా ఆంగ్లం, పై ఆధారపడడం మంచిదికాదని సూచన. దీనికైనా ఒప్పుకుంటారా?
20 comments:
ఒకప్పటి ఆంధ్ర జ్యోతి వార పత్రిక ఇప్పుడు కొత్త అవతారంలో "నవ్య" అయ్యింది. పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు సంపాదకుడిగా ఉన్న రోజుల్లో ఆంధ్ర జ్యోతి అత్యున్నత స్థితికి వెళ్ళింది. ఇప్పుడు నవ్య పరిస్తితి పెద్ద గొప్పగానూ లేదు, అంత తీసికట్టుగానూ లేదు. మధ్య రకం. వాళ్ళు ముఖ చిత్రం విషయంలో కక్కుర్తిగా ఎప్పుడూ అర్ధ నగ్న బొమ్మలే వెయ్యకుండ మార్పు చూపించి మంచి మంచి బొమ్మలు వేస్తే ఎంతైనా బాగుంటుంది. ముఖ చిత్రం చూసి మురిసి కొనేవాళ్ళు అతి తక్కువ ఈ సంగతి నవ్యే కాదు అందరు పత్రిక వాళ్ళు గమనించుకోవాలి. లోపల వ్రాసిన సరుకుతో ఆకట్టుకోవాలికాని ముఖ చిత్రం ఏదో చెత్త బొమ్మవేసి బేవార్సుగాళ్ళని ఆకర్షించి కాదు.
తెలుగు సరిగ్గా రాకే కదా ఇప్పుడు తెలుగు జర్నలిజం (??!!) హింగ్లీషులో పడి కొట్టుకుంటున్నది. మీరు మరీ ఆశపడిపోతున్నారు, సూటిగా తేట తెలుగులో శీర్షికలు ఉండాలని. మొన్న తుఫాను సందర్భంగా ఆడిపోయిన టివి రిపోర్టర్లు వాగిన అనవసరమైన వాగుడులో ఎంత తెలుగు ఉన్నది. పతివాడూ కూడ సైక్లోను కోస్టు క్రాస్ చేస్తుంది అనటమే. ఇందులో తెలుగు మాట ఒక్కటంటే ఒక్కటి!! అదేమిటి అంటారా? బాగు! బాగు!!
పట్టణాలలో మాట్లాడే ఇంగ్లిష్ కలిపిన తెలుగు పల్లెటూరివాళ్లకి అర్థం కాదు. మా పట్టణానికి మూడు కిలో మీటర్ల దూరం నుంచి వచ్చే చాకలి ఆమెతో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్ పదాలు కలవకుండా జాగ్రత్త పడుతుంటాను. ఇంగ్లిష్ బాష అవసరమే కానీ స్థానికులతో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్ పదాలు కలిపిన బాష మాట్లాడడం ఎందుకు? పత్రికలు పల్లెటూరివాళ్లు కూడా చదువుతారు. పత్రికలు ఇంగ్లిష్ ప్రయోగాలు చేస్తే పల్లెటూరివాళ్లకి అర్థం కాదు.
తెలుగు సగానికి పైగా చెడిపోవడానికి కారణం ఈ ప్రసార, ప్రచార మాధ్యమాలే. వీళ్ళకి ప్రాస ముఖ్యం అది ఏభాషైనా పరవాలేదు.
హస్తంతో గులాబీయింగ్
what is the context of this? couldnt understand a bit..
గురువుగారూ!
ఏది ఏమైనా మన నిజ జీవితంలో వచ్చిన మార్పులు పత్రికలూ, ఎలెక్ట్రానిక్ మీడియాపైనా కొంతవరకు ప్రభావం చూపుతాయనేది వాస్థవం. ఆల్రడీ న్యూస్ చానల్స్ లో టింగ్లీషు వాడకం ఎంతగా పెరిగిపోయిందో చూసాం. కాకపోతే పత్రికలలో తక్కువ అనే చెప్పవచ్చు. శీర్సికలు, ఆ మాటకొస్తే కధనం మొత్తం కూడా అచ్చ తెలుగులో (అలాగని గ్రాంధికంగా కాకుండా!) ఉంటేనే మంచిదనేది నిర్వివాదాంశం. అయితే కాలాణుగుణంగా ఇలాంటి చిన్న చిన్న తప్పులను! అంగీకరించవచ్చేమో?
1.నవ్య అనే పేజీలో వచ్చిన శీర్షిక "చొక్కాలు చూడబుల్ గా.."
నవ్య అంటేనే ఫ్యాషన్ కు సంబంధించిన విషయాల పేజీ. ఇది కాస్త మోడరన్ గా పెట్టలనుకొంటే తప్పు కాదేమో?
2. మొదటి పేజీలో వచ్చిన శీర్షిక "హస్తంతో గులాబీయింగ్" - ఇది కుడా అర్ధవంతంగానే ఉంది.
3. హైదరాబాద్ మినీ మొదటి పేజీలో.."క్రికెట్ ఫీవర్" - ఇందులో కూడా తప్పు పట్టవలసిందేమీ లేదు.
అయితే సమస్యంతా మనం తెలుగు పత్రికలైనంత మాత్రాన అవి రామాయణ్, మహాభారత కావ్యాల వలె అచ్చ/ గ్రాంధిక తెలుగులో ఉండాలని కోరుకొంటున్నామా? లేదు కాబట్టి ఇలాంటి పరిమితమైన 'సంకరాలు ' ఆమోదయోగ్యమేనేమో? కాకపోతే మరీ శ్ర్శృతిమించకుండా చూసుకోవాలి:)
తెలుగు పత్రికల్లో వస్తున్న శీర్షికల మంచి చెడ్డల గురించి మీరు చర్చ లేవనెత్తటాన్ని అభినందిస్తున్నాను.
సరే గానీ, ‘దీనికైనా ఒప్పుకుంటారా?’ అనటం ఎందుకూ? అందరినీ ఒప్పించాలనే తాపత్రయం లేకుండా మీ అభిప్రాయాలను మీరు రాసెయ్యండి! వాటిని విభేదిస్తూ విమర్శలు వస్తే రానివ్వండి.
సాక్షి, ఈనాడులు నిబందనలకు దొరకకుండా ఒక గంట వర్కింగ్ అవర్స్ పెంచాయని తెలిసింది. ఈ జర్నలిస్టులకు వెన్నెముక ఉందా.
హస్తంతో గులాబీయింగ్
భాషా పరంగా ఆలోచిస్తే తప్పేనేమో కాని, ఒక శీర్షికగా ఇది తప్పు కాదేమోననిపిస్తుంది. శీర్షిక అంటే వీలైనంత తక్కువ పదాలు ఉపయోగించి వార్తాకథనం లోని ముఖ్యవిషయాన్ని వ్యక్తీకరించడం. హస్తం తో అంటే కాంగ్రెస్ పార్టీతో గులాబీ దళం అంటే టీ.ఆర్.ఎస్ పార్టీ లాబీయింగ్ చేస్తుంది అనే అర్థం కేవలం రెండు పదాలను ఉపయోగించి చెప్పారు సదరు ఎడిటర్. ఈ రకమైన పోకడలు మనం ఇంగ్లీష్ పత్రికలలో కూడా చూస్తుంటాం.
బయట తెలుగులో బాగానే మాట్లాడుతారు. టివి, ఇతర మీడియాల వాళ్లకే తెలుగు సరిగా రాదు. మొన్న మా ఊర్లోనే ఒక వ్యక్తి ఒక ఆటో డ్రైవర్ ని 'మీ ఆటోలో ఎంత మంది పడతారు?' అని అడిగాడు. 'ఎనమండుగురు' అని డ్రైవర్ చెప్పాడు. బాష కరక్టే కానీ వ్యక్తికి అర్థం కాలేదు. పక్కనే ఉన్న నేను 'ఎనిమిది మంది' అని చెప్పిన తరువాత అర్థమయ్యింది. కొంత మందికి మన బాష పదాలే స్పష్టంగా అర్థం కావు. ఇంగ్లిష్ ప్రయోగాలు చేస్తే సాధారణ పల్లెటూరివాళ్లకి అర్థం కావు.
అందర్నీ విమర్శించే మీరు వాటికి భయపడితే ఎలా సార్.
durga prasad.Ch
Nenu kuda meto ekeebhavistanu.kakapote konnisarlu anipistundi vallu prajalaku marinta cheruva kavadaniki vaduka bashani upayogistunnaremonani.
కొంతవరకూ మీతో ఏకీభవిస్తాను నేను. శీర్షికలు ఆకర్షణీయంగా వుండాలి అనే ప్రయత్నం మంచిదే, కానీ, భాషను సంకరం చేస్తేనే అది సాధ్యం అనుకోవడం అమాయకత్వం. సందర్భాన్ని, పాఠకులను దృష్టిలో పెట్టుకుని ప్రయోగం చేస్తే, ఆ శీర్షిక రాసినదానికి వన్నె తెస్తుంది. న్యూస్ చానెల్స్ లో వార్తకి తగిల్చే పంచ్ లైన్ సంస్కృతి వార్తా పత్రికలకు, వార పత్రికలకు అంతగా సరిపడదేమో అని నా అభిప్రాయం.
Andhra Jyothi uses too casual language. They, along with some news channels,keep Hyderabadis in view. I agree with Praveen Sharma garu.
Ram garu..Eenadu gurinchina charchalo...Abhiprayalu raasina vaarandaru...Eenadu loni vaare.anadam..YEmi baagaledhu...
Nenu kudaa..Eenadu ki support ganee rasaanu...I can show you 100 members (atleast to who i have spoken)..who know the meaning and are happy with the wordings...
Bagalekunte baagaledhani raastharu..daniki kulala perlu yenduku pedtaaru...Annattu...nenu Kamma vadini kaanu baabu...
There is a funny ad in the district edition of Andhra Jyothi on 14/11 on the ocassion of 12th day ceremony of person which is as follows.
REPU SAMA RAJI REDDY GARI NIRYANAM.
JP.
'గులాబీయింగ్' శీర్షికలో ఒక పార్టీ చేస్తున్న లాబీయింగ్, 'క్రికెట్ ఫీవర్' లో పూర్తి ఆంగ్ల పదాలు కొంతవరకు పరవాలేదు. కాని "చొక్కాలు చూడబుల్" మాత్రం ఎందుకో చదవబుల్ గా లేదనిపిస్తోంది.
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
నూటికి ఎనభై మంది ఇంగ్లీష్ మీడియం లో చదువుతుంటే ఇంగ్లీష్ రాక ఏమి వస్తుంది. ఎనభై శాతం వెబ్ సైట్స్ మనం చూసేవి ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. ఇవి మనం మాట్లాడే బాష మీద ఎఫ్ఫెక్ట్ పడవా. ఇంకా తెలుగు వర్డ్స్ మద్య మద్యలో వాడుతున్నారు అంటే అది సొసైటీ మరియు ఫ్యామిలీ ఇంపాక్ట్. ఎవ్వడూ ఏమి చెయ్యలేడు
అన్నా తిరుమల్, ఇయ్యాల్ల రాజు రాణి జగపతి లొ వచ్చినావేటి?
@ఎనానిమస్సు
అవును బ్రదర్
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి