Tuesday, November 9, 2010

జుట్టుపీక్కున్నా అర్థం కాని....'ఈనాడు' పతాక శీర్షికలు

1) ఒబామా...ఒబామా...
ఓ వణిక్ ప్రముఖ్

2) బలంపోయే..
హజం పోయే!
"మీరే గనక నిజంగా గనక తెలుగు తల్లి ముద్దుబిడ్డలైనట్లయితే ఈ పై వాటిలో 'వణిక్' కు, 'హజం' కు అర్థం చెప్పండి. చెప్పలేకపోయారో...మీరు తెలుగు వారికింద లెక్క కాదు..." అని ఎవడైనా రూలు పెడితే...మనలో 98 శాతం మంది ఆంధ్రా వదిలి పెట్టేబేడా సర్దుకుని నైమిశారణ్యం వెళ్ళాల్సి వస్తుంది. 

అయితే...ఈ ఖైరతాబాదులో విద్యుత్ సౌధ పక్కన ఉన్న 'ఈనాడు' ఆఫీసులో జనరల్ డెస్క్ లో ఉన్న ఒక రెండు మూడు జీవులు మాత్రం కచ్చితంగా ఇక్కడే ఉండిపోతాయి. ఎందుకంటే...ఆ మహానుభావులే...ఆ పత్రికలో ఆదివారం నాడు మొదటి శీర్షికను, సోమవారం నాడు రెండో శీర్షికను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించారు.    

'ఈనాడు' పత్రికలో సంపాదకీయాలు గంధర్వ భాషలో ఉండి మానవ మాత్రులకు అర్థం కావని మనం బాధపడుతుంటే....ఇక్కడ ఇంకొక మహనీయుడు...నేను తక్కువ తిన్నానా...అని..ఈ శీర్షికలతో పొడిచేస్తున్నాడు. రెండో శీర్షిక సంగతి అలా ఉంచితే..."ఈ వణిక్ ఏమిటో చెప్పి పుణ్యం కట్టుకోండి. అది వణక్కం నుంచి వచ్చిందా ఎట్లా.." అని 'ఈనాడు' ఆఫీసుకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయట. తానెప్పుడూ ఈ మాట వినలేదని ఒక సీనియర్ జర్నలిస్టు ఒప్పుకుంటే, ఇంతకూ సంస్కృతంలో దాని అర్థం 'వాణిజ్య' అని చెప్పాడు ఒక మిత్రుడు. 

ఈ బ్లాగు చదువుతున్న వారిలో ఎవరైనా...'నాకు ఆ శీర్షిక అర్థమయ్యింది...నీదేమి పొయ్యేకాలం...అర్థం కాలేదా?' అని నిజం చెబితే వారికి ఒక మంచి ప్రైజ్ వుంటుంది. ఆ బహుమతి ఏమిటంటే...అదే 'ఈనాడు' ఆఫీసు ముందు వున్న ప్రెస్ క్లబ్ లో మందంటే మందు...విందంటే విందు. బస్తీ మే సవాల్!

53 comments:

Sujata M said...

Unfortunately naku aa first Title ardham ayyini sir. :D Rendodi matram ardham kale.

Anonymous said...

వణిక్ అంటే వ్యాపారి అని ! కులపరంగా కూడా వాడతారు. హజమ్ ఉర్దూ పదం. తెలంగాణలో చాలామంది పాతతరంవారికి అర్థమవుతుంది.

ఎవరైనా కొత్తపదాలు వాడితే ఉలిక్కిపడకుండా సాదరంగా ఆహ్వానించి నేర్చుకుందాం. ఒక కొత్తపదాన్ని మనకు పరిచయం చేసినందుకు నెనర్లు చెబుదాం. The Hindu ని వార్తల కంటే కూడా కొత్త ఇంగ్లీషుపదాల/ వాడుకల అవగాహన కోసం కొందరు చదవట్లే ? "అలాగే తెలుగుపత్రికలలో తెలుగుపదాలు కూడా" అని అనుకుందాం.

shankar said...

online edition lo chustunnappudu..Vanik ane title artham kaledu...varta chadivaka telisindi daanrtham :-)

shankar said...

kaani naaku Eenadu tappa vere paper edi chadava budhi kaadu....

Srinivas said...

ఆ పదాలు వాడడంలో ఔచిత్యాన్ని ప్రశ్నించవలసిందే కానీ ఆ పదాలకు అర్థాలు తెలియవనడం నమ్మశక్యం కావడం లేదు.
వణిక్ ప్రముఖ్ అంటే ప్రముఖ వ్యాపారవేత్త అనీ, హజం అంటే యాజమాన్యపు హక్కు అనీ ఆ వార్త చదవకుండానే, నిఘంటువు చూడకుండానే నాకు తట్టిన అర్థాలు. తప్పయితే చెప్పండి. వొప్పయితే వదిలేయండి.

ఇందు said...

సరిగ్గా ఇదే నేను మొన్న తలబద్దలు కొట్టుకున్నా! ఈ 'వణిక్' ఏంటీ? ఎప్పుడూ వినలేదే! అని.పొన్లెండీ దాని అర్ధం చెప్పి పుణ్యం కట్టుకున్నారు. పోకిరి సినిమాలో చెప్పినట్లు ఈ ప్రాసల కోసం పాకులాడడం ఎప్పుడు వదులుతుందో మన పత్రికలవాళ్ళకి :)

DesiApps said...

ఈ మధ్య ఈనాడు వారు ఈ మధ్య ఈనాడు వారు entrepreneur / బిజినెస్ మాన్ అనే అర్ధం లో వణిక్ అని వాడుతున్నారు. నేను కూడా ఆ వార్త చదవగానే గూగుల్ చేసి అదే విషయం సరి చూసుకున్నా. మంచిదే కదా. కొన్ని కొత్త పదాలు తెలుగు కి లేదా మన వొకాబులరీ కి కలుస్తున్నాయి/ బిజినెస్ మాన్ అనే అర్ధం లో వణిక్ అని వాడుతున్నారు. నేను కూడా ఆ వార్త చదవగానే గూగుల్ చేసి అదే విషయం సరి చూసుకున్నా. మంచిదే కదా. కొన్ని కొత్త పదాలు తెలుగు కి లేదా మన వొకాబులరీ కి కలుస్తున్నాయి

Satyam said...

వణిక్ప్రముఖులు అని తెలుగులో వాడుతాము కదండి.

Satyam said...

హజం అని మన పెద్దవాళ్ళు వాడేవారు. ఒళ్ళు పొగరు అన్న అర్థంలో.

Sasidhar said...

Ramu garu,

Unfortunately, I understood both the words without any hiccups.
I am ready for the Press club party.

~Sasidhar Sangaraju
www.sasidharsangaraju.blogspot.com

మేధ said...

హ్హహ్హ.. మొదట చూడగానే వణికించే ప్రముఖుడు అనే అర్ధంలో వ్రాశాడేమో అనుకున్నా. :P
తరువాత పేపర్ అంతా చదవడం పూర్తైన తరువాత వెలిగింది అది వాణిజ్యానికి సంబంధించిన పదం అని.. హజం అమాత్రం అర్ధమవలేదు..

astrojoyd said...

vanik frm sanskrit nd hajam frm urdu..bth words have their own good meanings,but for a ordinary reader these 2 words were nutty..thats why,the poste writer said..these words were seems to b gaandhaarvick...

సుజాత వేల్పూరి said...
This comment has been removed by the author.
aks said...

తెలుగులోనే వ్యహరమంతా ఉండాలన్న ఈనాడు ఉద్దేశం బానే ఉంది కానీ ఇలాంటి కొన్ని విపరీతాలు,కొన్ని అనవసర translations చిరాకు కలిగిస్తాయి
మచ్చుకు కొన్ని
గుత్తేదారులు ( అది వరకు లేదు , కాంట్రాక్టర్లు అనే రాసేవారు.గత రెండు మూడేళ్ళుగా ఇది మొదలుపెట్టినట్టు ఉన్నారు )
అంతర్జాలం (ఇంటర్నెట్ ని ఈనాడు వారు ఇలా రాస్తారు !)
సామాజిక నెట్వర్కింగ్ (సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ని ఇలా అంటారు ఈనాడు లో ,నా బొంద )

oremuna said...

మాకా రెండు శీర్షికలూ బాగానే అర్థం అయ్యాయి, నచ్చాయి కూడా!

vinod said...

eenadu abimanulu okka sari ee blog lo unna posts anni chusthe meku ee post ki pedda importance ivvabuddi kadu. Telugu basha ni savyamga upayoginche ekaika pathrika eenadu, kani mana blog owner gariki Eenadu telugu ni kuni chesthunnattu kanipisthundi...

సుజాత వేల్పూరి said...
This comment has been removed by the author.
Naagarikuda Vinu said...

manaku arthamu telvananta maatraana raasinodidi tappante etla baasu???

tarakam said...

రామూ గారూ,
ఈనాడు అంటే మీరు చాలా బయాస్డ్ గా ఉన్నారు.మీరు చెప్పిన రెండు మాటలూ అందరికీ అర్థమయ్యేయే.మీరు సెన్సేషనైలిజ్ చేశి దీని నుంచి లబ్ధి పొందాలనుకోవడం కరెక్ట్ కాదేమో అని నాకనిపిస్తోంది.

పూర్ణప్రజ్ఞాభారతి said...

వణిక్ అను సంస్కృతశబ్దమునకు తెనుగున వ్యాపారియని భావము. అట్టి సంస్కృత ప్రాతిపదికను ప్రముఖ్ యను మరియొక సంస్కృత ప్రాతిపదికతోడ జోడించి తెనుగున సమాస్త శబ్దమును సృజించునెడ అద్దానికి ఆంధ్రభాషయందలి ప్రథమావిభక్తి ప్రత్యయంబును కూర్చవలెను జ్ఞానము ఈ వార్తాపత్రికయందు కార్యరతులైన విద్వన్మణులు ఎరుంగకబోవుట కడు శోచనీయమని మదీయ భావన.
(ఫరవాలేదు. నేనూ గ్రాంథిక భాషలో రాయగలను)

ఇక హజం అనే అరుగుట. తెలుగులో దాన్ని అహంకారమనే భావంలో వ్యావహారికంలో వాడుతున్నారు. ఇలాంటి పదాల వాడకం నిరసించాల్సినంత తప్పేం కాకపోయినా, ఇవి కొంతమంది పాఠకులకి కాస్త కఠినంగానే ఉంటాయన్నిది నిర్వివాదాంశం.
ఇవి కొత్త పదాలేంకాదు. ఎవరూ ఇప్పుడు పుట్టించి మనకు అందిస్తున్నవి కావు. కాని సంస్కృత పదాలని వాడాల్సిన పరిస్థితి వస్తే వాటికి తగిన ప్రత్యయాలను చేర్చుకుని వాడాలనేది వ్యాకరణం తెలిసిన వారందరూ అంగీకరిస్తారు.

Anonymous said...

@Vinod&NagarikuDa Vinu
తెలుగు భాష పట్ల ఈనాడు వారు తమ నిబద్ధతను చాటుకోవడమంటే పెద్దగా చదువుకోకపోయినా లోక ఙానంకోసం పత్రికలు చదివే మామూలు జనాలకు ఈ ఇనప గుగ్గిళ్ళ భాష తప్పక కాసేపు విసిగిస్తుందని మర్చిపోవద్దు.
మనకు తెలివి తేటలు ఉన్నాయిగదాని నక్షత్రాలు ఎన్ని అని అడిగినవాడికి సమాధానం చెప్పడంకోసం చుక్కలు లెఖ్ఖబెడుతూ పోతే సబబేనా? అలాగే అనవసరపు పదాడంబరాన్ని ప్రదర్షించకుండా ఉంటేనే మంచిది.

Ram said...

emi dourbhagyam manaadi...

English lo vocab penchukodaniki Hindu lanti papers chaduvutharu..paigaa...ahaa, ohoo ani pogudutharu...

Telugu ki vachchesariki edupu modaledutharu

Kavanoor Dayalan said...

meeku teliyanantha maatranaa, eenaadu nu tappu pattalaa? ayinaa mee kemduku eenaadu meeda amtha kopam? I have been asking this question but no answer from you?

Ramu S said...

కవనూర్ జీ...
'ఈనాడు' మీద నాకు కోపం ఉండాల్సిన పనిలేదు. పై రెండు పదాల అర్థాలు చాలామందికి తెలియవు. సామాన్య జనాలకు అర్థమయ్యే మాటలే వాడాలని, మన భాషాపాటవాన్ని ప్రదర్శించేందుకు పత్రికను సాధనంగా చేసుకోకూడదని నా అభిప్రాయం. కఠిన పదాలు హిందూ వాడినా, ఈనాడు వాడినా పధ్ధతి కాదు.
రాము

నండూరి వెంకట సుబ్బారావు said...

రామూ గారూ,
తెలుగు వాడకంలో ఈనాడు కొన్ని ప్రయోగాలు చేస్తున్న మాట నిజం. భాషాభిమానం ఉంటే దాన్ని స్వాగతించాల్సిందే. మొదట్లో అర్థంకానివి నిదానంగా అర్థమవుతాయి. మీ గురువుగారు బూదరాజుగారు కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్మేవారనుకుంటున్నాను. అయితే ఆ శీర్షికలను ఇంకా బాగా సరళంగా పెట్టవచ్చు. ఉదా:"వాణిజ్యవేత్తగా ఒబామా" "ఒబామా ఒక వర్తక ప్రతినిధి" కానీ పత్రికల్లో పనిచేస్తున్నప్పుడు ఉండే సమయాభావాలూ, పనిఒత్తిడులూ మీకు తెలియనివి కావు. అప్పుడు అది తోచకపోయి ఉండవచ్చు. మీరు మెరుగైన శీర్షిక సూచించాల్సింది పోయి, ఆంగ్లేతర పదాలు వాడినందుకు విమర్శించడమే బాగోలేదు. చొక్కా, కంచం లాంటి పదాలకు బదులు ఆంగ్లపదాలు వాడుతున్నాం మనం. కొన్నాళ్ళకు (బహుశా మరో పదేళ్ళకు)వీటిని మీరనే సామాన్యులు మర్చిపోతారు. అప్పుడు ఇవి కూడా మీ దృష్టిలో కఠినపదాలుగా మారిపోతాయి. ఈ మార్పుకి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయాలికదా. అందుకు ఈనాడు ప్రయత్నం చేస్తోంది. అక్కడక్కడా ఎత్తుపల్లాలు, పొరపాట్లు జరగవచ్చు. ఆలోచించండి. ఈనాడులో కొన్ని విధానాలు, కొందరు మనుషులు అభ్యంతరకరమైనంత మాత్రాన అన్నిటినీ ఒకేగాటన కట్టడం మీలాంటి విజ్ఞులు చేయాల్సినపని కాదు.

Anonymous said...

'కమలాకుచ చూచుక కుంకుమతో' అని సుప్రభాతంలో ఉందికదా అని ఎరుపు గురించి వర్ణించాలన్నప్పుడల్లా 'కమలాకుచ చూచుక కుంకుమ' లా ఉంది అని మాత్రం అనలేం కదా! అన్నట్లు అందులో ఓ పెద్ద బూతు పదం ఉంది తెలుసా?

Sudhakar said...

వణికుడు అంటే వ్యాపారి అని చిన్నప్పుడు మా స్కూల్లో చెప్పారే...మెట్రో నగరాల్లో తెలుగు ఉపాధ్యాయుల బుర్ర అంతంత మాత్రం...అర్ధం కాకపోవటానికి అది కారణం కావచ్చు.

Sudhakar said...

@Ramuji : పదాలు వాడితేనే కదా వాటి గురించి ప్రజలకు తెలిసి వాడేది. అలా చూస్తే ఈనాడు చేస్తున్నది చాలా మంచి పని. ఎలా పదాలను నరుక్కుంటూ పోతే చివరికి మనకి, మన పిల్లలకి మిగిలేది టీవి9 తెలుగే...పల్లె జనాల యాస పదాలు ఎలాగు చచ్చి పోతున్నాయి మన సినిమా వాళ్ళ అపహాస్యం తో..మిగిలిన వాటినైనా బతకనిద్దామ్...

vinod said...

RS Reddy garu,
chinnappudu kurchi ante idi ani chebithe ne manaki telisindi adi kurchi avuthundi ani....
manam pathrikalu loka gnanam mariyu basha gnanam penchukovadaniki viniyoginchali...

Iropa lo unna chinna chinna desalu, aa vishayamaina tama bashaloke tarjuma chesukuntai...


atlage, oka pathrika lo vachhina kotta achha telugu padalani swagathinchali...
contractor ante gutthe darlu ani naku eenadu chadive varaku teliyadu...,
oka rendusarlu kottaga undiddi tarvata alavatu iddi..

ee vidamga anna mana basha bathukuthunnanduku santhoshinchandi....

oka kotta vishayam telisthe danini nerchukovali kani, naku artham katalledu ani danini apeyyakudadu... apeyyadaniki praythninchkudadu...

inka asalu ee blog owner garu telugu lo blog enduku rayali , computer use chese valla andariki english vachhu kada ani english lo raya vachhu kada...


pradanamga ee blog owner gariki Eenadu ante koncham kopam undi, adi anni postlanu chusthe telisiddi....
ee vishayanni nenu inthakumundu kuda Quote chesanu...

Unknown said...

Some how I am in a dilemma about the two words used in EENADU banners. English may be a global language but one can't and shouldn't forget his mother tongue. In any language word's would exist until they are in use. Similarly Vanik and Hazam are of yester years words no doubt. But coining a telugu word shouldn't be artificial. A small anectdote... One senior sub in EENADU has written a word Step mother in the sentenece and he has introduced this word's telugu form in brackets (Savithi talli) thats apathy of telugu. I would sincerely ask all readers to excuse me for writing this comment in english as I am not well versed with lekhini type keyboard

Anonymous said...

సవతితల్లి కొత్తపదసృష్టి కాదండీ బాబూ ! తెలుగులో ఆ పదం శతాబ్దాలనుంచి ఉంది. నిజానికి తెలుగుమీడియాలో బ్రాకెట్స్ లో పెట్టాల్సింది ఇంగ్లీషుపదాలనే. దాని బదులు తెలుగుపదాన్ని పెట్టడం చేత మీరు తెలుగుపదమే కొత్తదని భ్రమించినట్లున్నారు. ఏంటో అంతా తెలుగుజాతి చేసుకున్న ఖర్మ. మనకు తెలుగుపదాలే విదేశీయమైపోయాయి.

karlapalem Hanumantha Rao said...

వణిక్ అంటే వ్యాపార సంబంధమయినది ...
హజం అనే పదం ఉర్దూదే అయినా మన పాతకాలం వారు వాడుతూనే వుంటారు
ఈ రెండు పదాలని పట్టుకుని మీరు అంత చాకిరేవు పెట్టినందువల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అనుకుంటాను రాము గారూ!
ఇలాంటి నిరాధారమయిన బలం లేని వాదనలకు పూనుకోవటం వల్ల రేపు నిజంగానే మీరూ ఏదైనా మంచి విషయం వెలుగులోకి తీసుకుని రావాలనుకున్నప్పుడు విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం వుంది గమనించారా సర్!
ఇలా రాసానని నన్ను ఈనాడు మూర్ఖ భక్తుడి క్రింద జమ చేయకండి ..ఆలోచించండి !

Ramu S said...

అయ్యా..కర్లపాలెం హనుమంత రావు గారూ..
ఆ రెండు పదాలు...శీర్షికలలో వాడడం తప్పే కాదు, నేరమని నా అభిప్రాయం. జనం పేపర్ చదివేప్పుడు నిఘంటువు దగ్గర పెట్టుకునే పరస్థితి ఉండకూడదు. మరీ ముఖ్యంగా శీర్షికలలో అలాంటి పదాలు వాడకూడదని నా అభిప్రాయం. మీలాంటి వారికి అర్థమయ్యాయి కానీ....చాలా మంది జర్నలిస్టులకు కూడా అవి అర్థం కాలేదు. ఒక వేళ వాటిని వాడాల్సి వస్తే వార్తలో అయినా సూచనప్రాయంగా అర్థం ఇచ్చి వుంటే కొంత బాగుండేది. వాటి గురించి రాసినంత మాత్రాన నేను 'ఈనాడు' వ్యతిరేకిని కాదు....మీరు 'ఈనాడు భక్తశిఖామణి' కాదు. అలాంటి అభిప్రాయాలకు వచ్చే వారు...అల్పబుద్ధులు. భళక్..భళఖ్ లు...ఖరం..ఖరం..లు.
రాము

vinod said...

Ramu garu,
meru eenadu vyathireki kanu ani meru anukunta unda vachhu...
kani me blog post lo vachhe vishayalannitini sarigga review chesi chusthe adi mamulu janalaki ardam avuthundi....

Eenadu vythireki ante me bava jalaniki eenadu bava jalaniki difference undi ani...

andari bavajalalu okate ayi undalsina avasaram ledu...

daniki meru alpabuddulu ani vadarante...inka mee istam...

ఆ.సౌమ్య said...

వణిక్‌ప్రముఖుడు అన్నమాట చాలా సార్లు విన్నామండీ. అదేదో వరలక్ష్మీ వ్రతం కథలో అనుకుంటా వణిక్ ప్రముఖుడు అన్న పదం వసుంది (అని గుర్తు).

హజం అంటే ఏమిటో తెలీలేదు.

Ramu S said...

అయ్యా...వినోద్ గారు...
నేను 'ఈనాడు వ్యతిరేకిని' అనే ముద్ర వేయడానికి మీరు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది మీ గత కామెంట్స్ చూస్తే. నా గురించి కాకుండా...ఆ రెండు పదాలకు చర్చను పరిమితం చేస్తే బాగుంటుంది. అవి నిజంగా జనాలకు అర్థం కాని మాటలు సార్. దానిపై మీ అభిప్రాయాన్ని గౌరవించాలనే...మీ కామెంట్స్ ప్రచురిస్తున్నాను.
థాంక్స్
రాము

హరి said...

పైనెవరో గుత్తేదారు పదాన్ని వింతగా చూస్తున్నారు. ఇంకొకరు తమకు నచ్చదని కూడా చెపుతున్నారు. కాని ఈ పదం తెలంగాణలో మొదటినుండి ఉన్నదే. కొత్తగా వచ్చింది కాదు.

మొదట్లో నిర్మాణపు పనులను రోజు కూలీ ఇచ్చి చేయించుకొనే వారు. తర్వాత మేస్త్రీలు 'గంపగుత్త' గా పనులకు రేటు కట్టి మాట్లాడుకోవడం జరిగింది. అలా తీస్తుకోవదాన్ని గుత్తకు తీసుకోవడం అంటారు. ఇలా గుత్తకు తీసుకున్న వాడే గుత్తేదారు.

గంపగుత్త అనే పదం కూడా ఎలా వచ్చిందో ఊహించ వచ్చు. పళ్ళు కాని, కూరగాయలు కాని గ్రామాల్లో గంపల్లో మోసుకుని అమ్మడం సర్వసాధారణం. పండు ఒకటికి ఇంట అని అమ్ముతుంటారు. కాని ఎవరైనా పెద్ద బేరగాడు మొత్తం గంపెడు పళ్ళు కావాలనుకొన్నప్పుడు మొత్తం గంపకు ఉజాయింపుగా ధర లెక్కగట్టి బేరమాడుతారు. ఇలా వచ్చిందే గంపగుత్త.

Tejaswi said...

రామూగారి వాదన నూటికి నూరుపాళ్ళూ కరెక్ట్. బ్యానర్ వార్తకు అటువంటి పదజాలం ఖచ్చితంగా తప్పే. సామాన్య పాఠకుడికి కూడా సులభంగా అర్ధమయ్యేలా పత్రికాభాష ఉండాలన్నది రామోజీరావుగారే పెట్టిన నియమంకదా. అయినా భాషను పక్కకు పెట్టినా ఆ వార్తలోని కంటెంట్ కు అంతకంటే మెరుగైన హెడ్డింగు దొరకదా...భావ దారిద్ర్యం కాకపోతే.(ఉదా...భారత్ తో రు.లక్షకోట్ల వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న ఒబామా-స్వదేశంలో 50వేల ఉద్యోగాల సృష్టికి భరోసా) నండూరి సుబ్బారావుగారి వాదనతో నేను విబేధిస్తున్నాను. సమయాభావం అనేది ఏ ఇతర వార్తలకయితే అనుకోవచ్చు. బ్యానర్ వార్తకు హెడ్డింగ్ పెట్టేటప్పుడు ఎంతో కొంత బ్రెయిన్ స్టార్మింగ్ చేయకుండా ఏదోఒకటి పెట్టేయొచ్చా సుబ్బారావుగారూ...

Sudhakar said...

"జర్నలిస్టులకు కూడా అర్ధం కాలేదు" అన్న మాట వింతగా వుంది. ఏమిటి జర్నలిస్టులు ఏమైనా పుడింగులా అన్నీ తెల్వాలనటానికి :-). నాకు తెలిసిన జర్నలిస్టులు ఎవరికీ సరిగా తెలుగు రాదు...ఆ మాటకొస్తే వారిది తెలుగు మీడియం చదువులే కావు..కానీ తెలుగు జర్నలిస్టులు...అలా తగలడింది మీడియా మరి.

భాషా సౌలభ్యం అవసరం అన్న మీ మాటతో నేను ఏకీభవిస్తాను కానీ, మనకు తెలియని భాష అందరికీ తెలియదనుకోవటం తప్పు. తెలుసుకోవటం అస్సలు తప్పు కాదు. "ఏమి హాయిలే హలా..." అన్న పాట విని రాసిన వాడికి మతి లేదా..."హలా" అనే పదం అసలున్నదా అని హాశ్చెర్యపోయే రోజులు వస్తున్నాయి...ఈ టపా కూడ అంతే..

సుజాత వేల్పూరి said...
This comment has been removed by the author.
Anonymous said...

కొత్త ఇంగ్లీషుపదాల్ని మారుమాట్లాడకుండా అంగీకరిస్తున్న మనకు కొత్త తెలుగుపదాల విషయంలో అదే సంస్కారాన్ని చూపించడం ఎందుకు చేతకావడంలేదు ? అనేది శేషప్రశ్న. తెలుగు ఇంగ్లీషుకంటే హీనభాష అనీ, దాని గురించి శ్రమ తీసుకునే అవసరం మనకు జీవితంలో ఎప్పుడూ ఏ విధంగానూ కలగకూడదనీ ఒక తక్కువ అభిప్రాయం మనలో చిన్నప్పట్నుంచి లోతుగా పాతుకుపోవడం వల్లనా ?

ఇంగ్లీషు నిఘంటువుల్లో గత సంవత్సరం అచ్చయిన పదాలకు మరో పదిశాతం అదనంగా ఈ సంవత్సరం జతవుతాయి. మరి ఇంగ్లీషులో మాదిరి తెలుగులో కూడా కొత్తపదాలు ఎందుకు రాకూడదు ? వాటిని మనం ఎందుకు నేర్చుకోకూడదు ? వాటిని మనం ఎందుకు విమర్శించాలి ? నాకు ఖచ్చితమైన సమాధానం ఎవరైనా ఇవ్వగలరా ?

Ramu S said...

సుజాత గారు,
నా అజ్ఞానానికి మన్నించాలి. నేను కూడా ఆ పదాన్ని ఎన్నడూ వినలేదు. 'హజం' విన్నాను కానీ...ఇది నాకు తెలియదు. అయితే...తెలుగు తెలియని వాళ్ళు 'ఈనాడు' వంటి పత్రికలో పనిచేయలేరు. ఏదిఏమైనా...ఆ పదాన్ని మొదటి పేజీ శీర్షికలో వాడడం అంత సమంజసంగా లేదు. ఇలాంటి కొత్త పదాలు వాడినా...వార్త లోపల ఈ అర్థాన్ని సూచించే విధంగా కొంత వివరణ ఇస్తే బాగుంటుంది.
థాంక్స్
రాము

నండూరి వెంకట సుబ్బారావు said...

ఆ శీర్షికలు పెట్టడంలో కొంత అతి జరిగినమాట నిజం. అయితే అభ్యంతరమంతా అసలు ఆ మాటలు ఎవరికీ తెలియవనీ వాదించడంలోనే ఉంది. శీర్షికలు సామాన్య పాఠకుడికి అర్థం కాకుండా పెట్టకూడదని రామూగారి ధృఢాభిప్రాయం. ఇక సమయాభావం, ఒత్తిడి పతాక శీర్షికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మేధోమథనం జరిగిన తర్వాత ఎంపికే అలాగుండి ఉంటుంది. అందుకే రామూగారి ఆగ్రహం. అయితే అది వ్యక్తం చేసిన తీరులో ఆ శీర్షిక మీద కాక దాన్ని పెట్టిన వ్యక్తుల మీద ఎక్కువ ఆగ్రహం కనబడింది(నాకూ, చాలా మందికి). వ్యక్తిగత అభిప్రాయాలకు ఉండే స్వేచ్ఛను పరిగణించుకుంటే ఇక్కడి వాదనలలో తొంభై శాతం సరైనవే. తమ అభిప్రాయం మిగిలినవాళ్ళకి తెలియజేయడంతో దానిని వదిలి పెట్టక అందరూ దానితో ఏకీభవించాలని పట్టుదలతో సాగదీస్తేనే పెడదోవపడుతుంది.

SHANKAR.S said...

"నాకు ఆ శీర్షిక అర్థమయ్యింది...నీదేమి పొయ్యేకాలం...అర్థం కాలేదా?"
నిజమే చెప్తున్నా. మందా? విందా? మీ ఇష్టం. :)

అయినా ఈనాడులో ఈ మధ్య ప్రాస కోసం పాట్లు ఎక్కువవుతున్నాయి. నేనేమి విలేఖరిని కాదండి బాబూ. ఒక సాధారణ పాఠకుడిని మాత్రమే.

Anonymous said...

@ దేవనకొండ ఓబుల్ రెడ్డి & others
ఇక్కడ విషయం తెలుగుకు ఇంగ్లీషుకు మద్య కానేకాదు. భాషాభిమానం ఉండకూడదని కాదుగానీ బ్రతుకుతెరువుకోసం ఇంగ్లీషును ఆశ్రయించక తప్పని స్థితిలో నేడు మనమున్నాం. తెలుగు పై వీరాభిమానమున్న వాళ్ళలో ఎంతమందిమి మన పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తున్నం? ఈనాడు వారికి అంతగా భాషాభిమానముంటే సు-డొ-కు టైపులో ఓ బాక్స్ పెట్టి రోజుకు మూడో నాలుగో అలాంటి కొత్త తెలుగు పదాలిచ్చి వాటి అర్ధం కూడా ఇవ్వమనండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇక హిందూ విషయానికి వస్తే-మరీ అంత హై-ఫై పదాడంభరాన్ని ప్రదర్షిస్తుంది కనుకనే ఒక స్థాయి నాలెడ్జ్ లేదా సివిల్స్ లాంటి పోటీ పరీక్షలు వ్రాసేవారు ఎక్కువగా చదువుతారు. ఆంగ్లం పై అంతగా పట్టులేని వాళ్ళు ఇతర ఆంగ్ల పత్రికలు చదువుతారు. ఇంకా కొంతమంది ఆ పదాలు తెలియవంటూ రామూ గారు వ్రాయడాన్ని తెగ తప్పు పట్టేస్తున్నారు-ఈ మాత్రం తెలుగు తెలియదా అంటూ+మీకు తెలియనంతమాత్రాన అందరికీ తెలియదనుకుంటే ఎలా అంటూ మరికొందరు చలాకీగా ప్రశ్నిస్తున్నారు:) మీరు చెప్పేదే నిజమనుకుంటే మన బ్లాగర్ మిత్రులలోనే దాదాపు సగంకన్నా ఎక్కువమంది తెలియదనో, ఇబ్బందిగా అనిపించిందనో, తెలిసినా అంత పదాడంభరం అవసరంలేదనో వ్రాసారంటేనే రామూ గారి ఆవేదనలో అర్ధం ఉందనుకోవచ్చు. ప్రతిదానికి అడ్డంగా వాదించడం, విమర్శించడం అంత కరక్ట్ కాదేమో?

karlapalem Hanumantha Rao said...

@రాము గారూ!
వణిక్ ...హజం అన్న మాటలు వాడటం ఏవిధంగా నేరం అవుతుందో నా బోటి చిన్న వాళ్ళకి అంతు బట్టని విషయం. జనవ్యవహారం లో వున్న పదాలనే కాక జనం వాడుకనుంచి మరుగున పడిపోయిన పదాలను కూడా తిరిగి ప్రాచుర్యం లోకి తెచ్చే ప్రయత్నాన్ని మనం హర్షించాలని నా అభిప్రాయం.అవతల అలా సినిమాలలో టీవీ చానళ్లలో తెలుగు ని రాచి రంపాన పెడుతుంటే వాటినన్నిటిని వదిలేసి ఇలా ఏదో తెలుగు కోసం తనకు చేతనయినంత తంటాలు పడే వారిని విమర్శించుకోవటం వల్ల ఏమి లాభమని నా భావన . ఒక అకడెమిక్ చర్చ జరిగే సందర్భం లో వాదన విషం వరకే పరిమితమయితే ఆ చర్చ వలన కొంత ప్రయోజనం వుండవచ్చు. మీరు బ్లాగు వుద్దేశాలలో చెప్పినట్లు మంచి జర్నలిజం కొరకు కష్ట పడుతున్నారు అన్న అభిప్రాయంతో తెలియక ఇందులో నేను వేలు పెట్టాను.తప్పు నాదే అయి వుండవచ్చు. మీ బ్లాగు...మీ ఇష్టం!సెలవు.

Anonymous said...

తొలినాళుల కావ్యార్థము
తెలియనిచో పాఠకునిది తెలియమి- ఈ నా
ళుల , వ్రాసిన కవి దోషము
కలి ముదిరిన కొలది వింత గతులన్ చెలగున్
- " విశ్వనాథ "

nvijaykumar said...

See all the comments..that came here..almost every one is praising Eenadu..except the person who is writing this piece of comment...

Vaniks pramukhudu ante ardham kakpov adiniki yendundhi...Hazam anedhi kotta padam manaku..Nerchukondam tappemundhi...Yenthasepu yela..tittudhamaa ani chuudam tappa vere pani lekapothe yela sir..Dont waste your time ...

akula naresh said...

surprising that there r many that understood that,after da day obama left i asked one sr. eenadu reporter in vizag abt those 2 wrds nd his face turned pale,later i understood that he was not aware of that news item also keeping news in that aside

Satya Gopal said...

evaru vadakunda... ute.. padajaalalu marugu padati kada... veyyandi veera tallu anna paddatilo.. eenadu prayogalu swagadinchali... marachipotunna mana bhashani parirakshinchukovali

సుజాత వేల్పూరి said...

రాము గారూ, వణిక్ అనే మాట తనెప్పుడూ వినలేదని ఒక సీనియర్ జర్నలిస్ట్ అన్నారని మీరు రాశారు. సీనియర్ జర్నలిస్టులు ఇలాంటి తెలుగు మాటలు తెలీదంటారని ఊహించలేదు. అందుకే ఆశ్చర్యం వ్యక్తపరిచాను తప్ప మిమ్మల్ని ఎత్తి చూపాలని కాదు.

Anonymous said...

emito ee భళక్..భళఖ్ లు...ఖరం..ఖరం..లు.

PRITHVI said...

తెలుగు తెలుగు అని తెగ వాదించేస్తున్నారు మన మిత్రులు చాలా మంది. ఆ రెండు పదాలూ తెలుగు కాదు. ఒకటి సంస్క్రతం, మరోటి ఉర్దూ అని పలువురు పండితులు ఇదే కామెంట్స్లో చెప్పినా వారి చెవికెక్కదే. తెలుగుకు పూర్తిగా అన్యభాషలైన ఆ రెండు భాషల పదాలనూ పూర్వ తెలుగుగా అంగీకరించినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఇంగ్లిష్ పదాలు కొన్నింటిని నవీన తెలుగుగా అంగీకరించటానికి అభ్యంతరమేమిటో. అదే అడిగితే మాత్రుభాష అనే్ మ్రుత సెంటిమెంట్ ఒకటి ముందుపెట్టి నాటకాలు. అంతరించిపోయిన పదాలను స్మశాన నిఘంటువుల నుంచి తవ్వి తీసి జనం నెత్తిన రుద్దకపోవటం ఈనాడుకైనా ఏనాడుకైనా మంచిదన్నది నా అభిప్రాయం.

ఇక ఆ రెండు పదాలకు అర్థాలు తెలుసుకోవటానికి పది మందికి ఫోన్ చేయాల్సి వచ్చింది.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి