ఈమధ్య టెలివిజన్ యాంకర్లకు కూడా అవార్డులేవో ఇచ్చారు- ఒక కలర్ఫుల్ ఫంక్షన్లో. అక్కడ టిప్టాప్ గా కనిపించిన ఎన్.-టీ.వీ.యాంకర్ శ్వేతారెడ్డిని చూసి ఫీల్డులో సీనియర్, అందరితో కలివిడిగా ఉండే ఒక మేల్ యాంకర్ తనతో మాట్లాదామనుకున్నాడు. "బాసూ...ఆమెను నాకు పరిచయం చేయకూడదూ..." అని ఎన్-టీ.వీ.లో వున్న ఒక మిత్రుడిని అవార్డుల ఫంక్షన్ దగ్గరే అడిగాడు మనవాడు. దానికి వచ్చిన సమాధానం చూసి అవాక్కయ్యాడు సదరు సీనియర్.
"అన్నయ్యా...బాగుంటే...చూసి ఆనందించు. ఆమె అసలే సూరి చెల్లెలు. తేడా వస్తే...కోసేస్తారు--నీ పీక" అని సమాధానం వచ్చిందట.
సూరి తన అన్నయ్య అనీ, ఆయన భోజనానికి పిలిస్తే వెళ్లివస్తున్నానని శ్వేత గర్వంగా చెప్పుకునేదని జర్నలిస్టు మిత్రులు చెబుతున్నారు. 'ఆయన మా అన్నయ్య' అని శ్వేత టీ.వీ-నైన్ ఛానెల్ లో అంతచేటు చెప్పుకుంటే....'ఆమె అసలు మా బంధువే కాదు...అబద్ధాలు చెబుతోంది,' అని సూరి భార్య గంగుల భానుమతి తెగేసి చెప్పింది. ఇక్కడ ఏదో తిరకాసు ఉందని అనిపిస్తున్నది. శ్వేత అబద్ధం చెబుతున్నదో, లేదో...ఆ సూరికి, భగవంతుడికి తెలియాలి...కానీ...నేరగాళ్ళు తమకు బంధువులని, సన్నిహితులని చెప్పుకోవడంలో జనానికి మజా ఉంది. అదొక గర్వకారణమైన అంశంగా వారు భావిస్తారు. ఈ తరహా భావనను 'స్టాక్ హోం' సిండ్రోం అంటారనీ, ఇలాంటి జబ్బు జనంలో మరీ పెరిగి వ్యవస్థను నాశనం చేస్తున్నదని వాపోతూ.....నేను 'ద సండే ఇండియన్' లో రాసిన కాలం మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను. నిజానికి శ్వేత పేరు బైటికి రావడానికి ముందే నేనీ వ్యాసం రాసాను.
ఇక్కడ అక్షరాలు చదువుకోలేకపోతే...నన్ను తిట్టుకోకుండా 'ద సండే ఇండియన్' కాపీ ఒకటి కొనుక్కోండి. దీంతో పాటు మంచి వ్యాసాలు దొరుకుతాయి మీకు.

4 comments:
ఈ నేరగాళ్ళందరినీ హీరోలను చేసి వాళ్ళెక్కడ ఉన్నారో ఆ అజ్ఞాత ప్రదేశాలకెళ్ళి మరీ వాళ్ళను ఇంటర్వ్యూలు చేసిందెవరో, వాళ్ళని అందరి డ్రాయింగ్ రూముల్లోకీ తీసుకొచ్చిందెవరో, చివరికి నలుగురు బంధువులు కల్సినా ఈ హీరోలని point of discussion గా మార్చిందెవరో అ ఎలక్ట్రానిక్ మీడియా ఛానెళ్ళకి నాలుగు చురకలేయకపోయారా?
రామూ గారూ. ఈ స్టాక్ హోమ సిండ్రోం స్వీడన్ లో ఒక బాంకు దోపిడీ జరిగినప్పుడు కొంతమంది ఉద్యోగులను బందీలుగా పట్టుకున్నారు. బ్యాంకు స్ట్రాంగ్ రూం లో దొంగలు, బందీలు కొంతకాలం ఉండిపోయారు. అతి దగ్గిరగా ఉండటం వల్ల బందీలకు, తమకు తెలియకుండానే తమను బంధించిన వారి మీద అభిమానం ఆపేక్ష ఏర్పడిందట. దీనినే స్టాక్ హోమ్ సిండ్రోం అంటారని తెలిసిన వారు చెప్పారు.
ఇక మీరు వ్రాసిన విషయానికి వస్తే, మీ కోణం కూడా సరిగ్గా ఉన్నది. చెత్త పని చేసే వాళ్ళను అభిమానించే వాళ్ళను ఏమనాలి? ప్రతి వాళ్ళూ అవినీతి గురించి మాట్లాడే వాళ్ళే. కాని వారి వారి బంధువులలో స్నేహితులలో ఉన్న అవినీతి అధికారులు, దొంగ వ్యాపారులు (ఈ విషయం తమకు తెలియదని బూకరిస్తారు కానివాడి ఇన్ని డబ్బులు ఎక్కడివి అని ఆలోచిస్తే అసూయ అంటారేమో అని భయం) ఇళ్ళకు వెళ్ళకుండా ఎవరన్నా ఉంటున్నారా. వెళ్లి వారిచ్చే ఆతిధ్యాన్ని హాయిగా అనుభవించే వస్తుంటారు, కొండకచో వారిచే కానుకలు కూడా తీసుకుని, గొప్పగా ప్రదర్శింస్తుంటారు.
ఈ విషయం ఇప్పటికే మరొకొన్ని చూట్ల కూడా వ్రాసాను. ఉదాహరణకి ఒక వ్యక్తీ తన కూతురికి పెళ్లి సంబంధం చూస్తున్నాడు అనుకుందాం. రెండు సంబంధాలు వచ్చాయి, ఒకతను పి జి చేసాడు, కేంద్ర ప్రభుత్వ సెన్సస్(జనాభా లెక్కల) ఆఫీసు లో ఆఫీసరుగా పని చేస్తున్నాడు. మరొక కుర్రాడు ఇంటర్ చదివాడు, సేల్స్ టాక్స్ వారి చెక్ పోస్టులో గుమాస్తా. వీళ్ళిద్దరిలో ఆ తండ్రి ఎవరిని ఎన్నుకుంటాడు. దానికి కారణం ఐన ఆలోచనా విధానాన్ని ఏ సిండ్రోం అనాలి? అందరికీ అవినీతి అంటే అక్కడెక్కడో ఉన్నదనే. ముందు మన ఆలోచనలను సరిచేసుకుంటే, దృక్కోణాలు సవ్యంగా ఉంటే, ఈ అవినీతి జాడ్యం మీద ఒక ఏకాభిప్రాయం వస్తుంది. లేకుంటే ఒకరు అవినీతి పరుడు అంటే, మరొకడు అదే మనిషిని అద్భుతమైన వ్యక్తీ అని సమర్ధవంతంగా జీవితం గడపగలడని భావిస్తారు. ఈ ఆలోచనా సరాళే ఈ నాటి అవినీతికి మూలం.
Shweta Reddy or any other charming personality who seemingly look like any other active girl but they have other side with an extreme overzealous ambition to scale up in life in short span of time which makes them deviate from their designated path.
Links with politicos and other anti-social elements and flamboyant boasting of their presumed connections is only a part of the game.
The sad part is they get cornered easily and fall prey into those hands which she has manipulated before for herself.
@siva ఈ స్టాక్ హోమ సిండ్రోం స్వీడన్ లో ఒక బాంకు దోపిడీ జరిగినప్పుడు.....
ఆ బ౦దీలు వారితరుపున కోర్టులో వాది౦చారు కూడా! చాలారోజులక్రిత౦ చదివిన గుర్తు .మీ వల్ల పునరుశ్చరణ అయి౦ది. కృతజ్ఞతలు.
దానిపేరే స్టాక్ హో౦ అని మరిచితిని.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి