మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎన్-టీ.వీ యాంకర్ శ్వేతారెడ్డి ని ఇంటరాగేట్ చేయడంతో మన తెలుగు చానళ్ళ పంట పండింది. కాస్త అందంగా, శరీర సౌష్టవం బాగా ఉండే అమ్మాయిలు, మహిళలు ఏదైనా వివాదంలో ఇరుక్కుంటే...పండగచేసుకునే ఛానెల్స్ శ్వేత విషయంలోనూ అదే పనిచేసాయి. టీ.ఆర్.పీ రేటింగు పరంగా ఆంధ్రుల అభిమాన ఛానెల్ TV-9 ఒకడుగు ముందుకేసి ఆ అమ్మాయిని నిన్న రాత్రి స్టూడియోకి పిలిచి రెండున్నర గంటల లైవ్ షో నిర్వహించింది. ఆ షో నిర్వహణ బాధ్యతను మన జర్నలిస్టు కమ్ జడ్జ్ రజనీకాంత్ గారికి అప్పగించారు. ఇంకేం... కథ అనుకున్న ప్రకారం బాగా పండింది.
ఈ కార్యక్రమం ఒక అర డజను చిన్న బ్రేకులతో 'సరదాగా' సాగింది. నేను కాన్ఫిడెంట్ గా వున్నాను...అంటూనే అక్కయ్య మధ్యలో ఒకసారి కన్నీళ్లు తెచ్చుకున్నారు. ఆ అదను కోసం వేచిచూసిన మన కెమెరా సారు క్లోజ్ అప్ షాట్ కోసం జూమ్ ఇన్ చేశాడు కానీ...ఛత్...శ్వేత ఏడవలేదు. రజనీ అడిగిన నాసిరకపు ప్రశ్నలు, శ్వేత చెప్పిన బుర్రతక్కువ సమాధానాలు జనరంజకంగా సాగాయి. ఈ ప్రోగ్రాం కు మాంచి టీ.ఆర్.పీ.రేటింగ్ వస్తుందని నేను రాసిస్తాను. నిప్పులేనిదే పొగరాదనీ, ఛానెల్స్ వాళ్ళు కొద్దిగా ఉంటే 'మసాలా జోడించి' ఎక్కువ చేసి చూపిస్తారని స్టూడియోలో ఈ ప్రముఖ యాంకర్లు ఇద్దరూ ఒప్పుకోలు తీర్మానం చేయడం విశేషం.
టీవీల్లో అటు పక్క దక్షిణాఫ్రికా-భారత్ వన్ డే క్రికెట్ మాచ్, ఇటు రజనీ చెడిగుడు మాచ్ మార్చి మార్చి జనం చూసినట్లు నాకు అర్థమయ్యింది...పలువురితో మాట్లాడాక. "ఆ ఇంటర్ వ్యూ, క్రికెట్ మాచ్ చూడ్డం వల్ల లేటయ్యింది సార్..." అని క్లాసుకు ఆలస్యంగా వచ్చిన ఒక జర్నలిజం విద్యార్థి ఫ్రాంక్ గా చెబితే...ఏమీ అనలేకపోయాను.
ఈ రజనీ బాబు ఈ కేసులో చచ్చేన్ని లా పాయింట్లు పీకడానికి ట్రై చేశాడు. ఆ అమ్మాయి అయినా విసుగుపుట్టి....'ఆపరా నాయనా...ఇంటికి పోతా..' అని ....పోవాల్సింది. ఈ ఇంటర్వ్యూ వల్ల ఆమెకు ఏమి ఒరిగిందో నాకైతే అర్థం కాలేదు. ఈ రజని కన్నా...ఆ సీ.సీ.ఎస్.పోలీసోళ్ళే నయమని మాత్రం శ్వేత అర్థరాత్రి ఇంటికి పొయ్యక అనుకుని ఉంటుంది. ఆరోపణలను ఖండిస్తూ...ఆమే ఆ షో లో పదేపదే చెప్పినట్లు చట్టం తన పని తాను చేసుకుపోవాలి....అది N-TV శ్వేతారెడ్డి అయినా...TV-9 రవిప్రకాష్ అయినా.
ఇదే ఛానెల్ లో అంతకుముందు ఒక మాజీ మంత్రి నాగిరెడ్డి గారి దీనగాథ పై వచ్చిన లైవ్ షో చాలా బాగుంది. ఈ షో పుణ్యాన రెడ్డి గారికి కొంత ఆర్థిక సాయం లభించింది. అందుకు ఈ ఛానెల్ కు అభినందనలు చెప్పకుండా ఉండలేము.
7 comments:
రెండున్నర గంటల లైవ్ షో????నిజమా???
OMG :)
some of the comments made in MAHA TV are not at all acceptable, words like 'JANA', i think they are not at all concerned about her personal life, she might be having number of affairs, why they are concerned?
ఆమె ఇంగ్లీష్ ని రాక పోయినా ధైర్యం గా బూతులతో మాట్లాడిన తీరు అభినంద నీయం
వినలేక చచ్చాం ఆమె ఇంగ్లీష్ బూతులు .రానప్పుడు చక్క గా తెలుగు లోనే మాట్లాడి ఉండొచ్చు గా .
ఇంకా సివిల్ సర్వీసెస్ రాస్తా నంటోంది ముందు భాష మీద పట్టు సాధించాలి ఆమె .
మరి రజనీకాంత్ పై కుడా కొంత మంది తొ ఉన్న ఎఫైర్స్ పై వస్తున్న విషయాల పై కుడా ఇలాగె చేస్తె బాగుంటుంది కదా..?
నేను కూడా చూసాను ఈ ఇంటర్వ్యూ ఆ అమ్మాయి సమాధానాలు చెప్పిన పద్ధతి, కాదు అని వెంటనే ఖండించాల్సిన విషయాలకు ఒకటి రెండు క్షణాలు తీసుకుని చెప్పటం వంటివి చూస్తుంటే అమాయకురాలు కాదని అనిపించింది.
ఏది ఏమైనా పోలీసులకన్నా టి విలో లైవ్ ఇంట్రాగేషన్ ఎక్కువగా జరిగింది. ఇలాగే మరికొంతమందికి పోలీసు వారికి బదులు టి వి వాళ్ళని చెయ్యమంటే అటు రేటింగులకు రేటింగులు, ఇటు థర్డ్ డిగ్రీ లేకుండా లక్షలమంది చూస్తుండగా అనేక విషయాలు ఆ వ్యక్తి చేత చెప్పించ వచ్చేమో. ఇక ఆలస్యం దేనికి, పోలీసు చట్టం మార్చేసి, అంతా మీడియాకు అప్పచెబితే సరిపోతుంది.
మద్దెలచెరువు సూరి హత్య కేసులో మొట్టమొదట వినిపించిన ప్రముఖుడిపేరు మన హోంమంత్రి గారి కుమారుడిదికదా? మరి ఆయననెందుకు సంప్రదించలేకపోయిందీ మెరుగైన సమాజపౌ మెంటల్ చానెల్?
Dear Ramu!
టపా అంతా బాగుంది.
కాస్త అందంగా, శరీర సౌష్టవం బాగా ఉండే అమ్మాయిలు, మహిళలు మాత్రం బాగాలేదు.
అందం సంగతటుంచితే శరీర సౌష్టవం అనే మాట అనవసరంగా వాడారేమో:)
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి