Thursday, March 10, 2011

సోంపేట దగ్గర సముద్రుడి హొయలు...అరకులోయలో థింసా

నా పెళ్లిరోజు అయిన మార్చి రెండు మర్నాడు కొందరు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులను  వెంటబెట్టుకుని ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లాను. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో విపరీతంగా తిరిగాను. అక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని పలువురిని కలుసుకుని మేము నిజనిర్ధారణ చేసుకున్నాం. 

అప్పట్లో పోలీసు ఫైరింగ్ జరిగిన సోంపేట, మొన్నీమధ్య మళ్ళీ కాల్పులు జరిగి ఇద్దరు బలైన కాకరాపల్లి వెళ్లి చాలా విషయాలు తెలుసుకున్నాం. సోంపేట దగ్గర ఈ రోజుకూ ప్రజల సత్యాగ్రహం జరుగుతున్నది. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. తమ ఇళ్ళలో మహిళల మీద చేయి చేసుకున్న పోలీసులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అరకులో ఒక బగత తెగ వారి ఇంట్లో పెళ్లి కూడా చూసాము, జీలుగు కల్లు లాగించాము. తేలినీలాపురం అనే గ్రామంలో సైబీరియా నుంచి వచ్చే పక్షులను, వాటికి-గ్రామస్థులకు ఉన్న బంధాన్ని చూస్తే ముచ్చటేసింది. ఇలాంటి కొన్ని వివరాలను ఒక పత్రికలో ఎలాగూ రాస్తాను కాబట్టి...ఆటలో అరటిపండుగా ఈ రెండు చిత్రాలు పోస్ట్ చేస్తున్నాను.  
 
ఇందులో ఈ పైది  సోంపేట దగ్గర సముద్ర తీరంలో ...మియామి లో మాదిరిగా అదే టీ-షర్టు తో పోజిచ్చి బ్లాగులో పోస్టు చేయడం కోసం ప్రత్యేకంగా దిగాను. ఇక రెండోది ఆదివారం సాయంత్రం అరకులో గిరిజనులతో ధింసా డాన్స్ వేస్తున్నది. చూసి ఆనందించండి. ఈ టూర్ లో ఒక సీనియర్ బ్లాగర్ గారిని కలిసాను కానీ...వారి అభ్యర్ధన మేరకు వారి గురించి నేను ఏమీ రాయకూడదని నిర్ణయించుకున్నాను. ఈ టూర్ ముగించుకొని....మా అమ్మాయి మైత్రేయి బర్త్ డే అయిన 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' నాడు తిరిగి ఇంటికి చేరుకున్నాను.

7 comments:

Anonymous said...

Ramujee!
Belated Happy B.Day to మైత్రేయి.
అన్నట్లు అక్కడ మీరు పరిగెత్తితే నేను ఇక్కడ (ఈరోజు) హూస్సేన్ సాగర తీరం లో(ట్యాంక్ బండ్ పై) పరిగెత్తాను:)

Prashant said...

hello,Mr.Ramu.The location looks quite serene and scenic.I wish to visit the place in a near future.How to reach there,may i know...

CH.DURGA PRASAD said...

నమస్తే,
మా ఊళ్ళు చుట్టి వెళ్ళినందుకు సంతోషం.ఇక్కడ మా రాజకీయ నాయకులకంటే మీరే నయం. కనీసం వెళ్ళి వారిని(భాధితులను) కలిసారు.మీరు వస్తున్నట్టు ముందుగా తెలిస్తే మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేసేవాడ్ని.సమయం ఉంటే ఇంకా మా జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి.ఈ సారి వీలు చిక్కినప్పుడు రండి. నేనే మీకు తిప్పి చూపిస్తాను.

దుర్గాప్రసాద్
శ్రీకాకుళం

Ramu S said...

దుర్గా ప్రసాద్ గారు
థాంక్స్
సర్, మా విజిట్ కు సంబంధించి ఈనాడు తదితర పత్రికలు ఆదివారం (March 6) వార్తలు ప్రచురించాయట శ్రీకాకుళం జిల్లా పేజీలలో. మీరు వాటిని సంపాదించగలరా? అవి దొరకబుచ్చుకుని నాకు పంపితే...మేలు చేసినట్లవుతుంది. ఆ కటింగ్స్ యూనివెర్సిటీ వారికి కావాలట. మీ ఫోన్ నంబెర్ ఇస్తే నేను మీతో టచ్ లో ఉంటాను.
రాము

Swarupa said...

Belated Birthday wishes to మైత్రేయి. మహాత్మ పుట్టినరోజు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే... తండ్రయ్యాక కూతురితో కలిసి మహాత్మ జరుపుకున్న మొదటి పుట్టినరోజు. గిరిజన మహిళలతో కలిసి డాన్స్ బాగా చేసినట్టున్నారు.

Raj Karsewak said...

@R S Reddy Ji
నేను కూడా ట్యాంక్ బాండ్ ఫై పరిగెట్టాను ,పోలీసులను పరుగు పెట్టించాను,కానీ "కరసేవ" చేయ లేదు .

రాము జి
తెలంగాణా లో ఉంటున్నావు కాస్త తెలంగాణా జిల్లాలు కూడా పరటించి తెలంగాణా సమస్యలు తెలుస్కోనే ప్రయత్నం చేయండి .

Ramu S said...

అయ్యా...
తెలంగాణా జిల్లాల వార్తలు గతంలోనే భయకరంగా రాసాను. ప్రత్యేకించి నల్గొండ జిల్లా గురించి రాసినవి జాతీయ స్థాయిలో కూడా సంచలనం సృష్టించాయి.
రాము

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి