Friday, March 11, 2011

ఆ విగ్రహాలకు ప్రాణం లేదా?: ఒక బ్లాగర్ ఆవేదన

టాంక్ బండ్ మీద విగ్రహాలను 'మిలియన్ మార్చ్' నిరసనకారులు ధ్వంసం చేసారన్న వార్త నాకూ గుండెలో ముల్లులా దిగబడింది. ఇది నిజంగా ఉద్యమానికి ఉపకరించే పనేనా? శ్రీ శ్రీ కొటేషన్లు లేకుండా  ఉద్రేకపూరిత ప్రసంగం చేయలేని వారు...ఆయనకు కూడా ప్రాంతం ఆపాదిస్తే? అమృతం లాంటి తెలుగుకు అంతటి గౌరవం తెచ్చిపెట్టిన వారి విగ్రహాలను అలా పెకళించి మురికి హుస్సేన్ సాగర్ లో తోసేస్తారా? మన మతిమాలిన చర్యలతో ఇపుడు తెలుగు నెల మీద భారత్-పాకిస్తాన్ సరిహద్దు పరిస్థితి సృష్టిస్తే చివరకు మిగిలేది బూడిదే. నాడు-నేడు అంటూ...ఫోటోల ద్వారా భావావేశాలు రెచ్చగొట్టాలని చూసిన 'ఈనాడు' పత్రిక ఉన్మాదం కూడా అంతే ఖండించదగినది.  

ఆ ఆగ్రహానికి అర్థం ఉండవచ్చు కానీ....పధ్ధతి మాత్రం ఇది కాదు. ఆ రోజున ఆ ప్రకటన చేసిన చిదంబరం, చేయించిన సోనియా, మన్మోహన్ లను ఏదైనా చేయండి గానీ...తెలుగు ప్రజలు మురిపెంగా చూసుకుని గర్వపడే  విగ్రహాల మీద దాడి ఏమి సమంజసం? తెలంగాణా కోసం నా తమ్ముళ్ళు, అన్నలు బలిదానం చేసినప్పుడు ఎంత బాధ వేసిందో...విగ్రహాల కూల్చివేత కూడా అంతే ఆవేదన మిగిల్చింది. ఈ విగ్రహాలలో ప్రాణం ముమ్మాటికీ ఉంది సార్.
విగ్రహాల కూల్చివేత మీద 'మనసులో మాట' బ్లాగర్ గారు రాసిన పోస్టును సంగ్రహించి ఇక్కడ అందిస్తున్నాను.
--------------------------------------------------------------------------
"టాంక్ బండ్ మీది విగ్రహాలను ధ్వంసం చేసేస్తున్నారు! కృష్ణ దేవరాయల విగ్రహాన్ని విరగ్గొట్టి హుసేన్ సాగర్ లో పడేశారు" అని ఒక ఫ్రెండ్  నుంచి ఫోన్ రాగానే గుండె నిజంగానే ఆగిపోయింది.  వెంటనే టివి పెట్టాను. 

గద్దర్ నిన్న సాయంత్రం టీవీలో మాట్లాడిన మాట విని కళ్ళలోంచి వచ్చింది హృదయం ఛిద్రమై కారిన రక్తమే!

"ఆ విగ్రహాలకు ప్రాణముంటదా? పోతే మళ్ళీ పెట్టుకోవచ్చు"

మళ్ళీ పెట్టుకునే అవకాశం ఎలాగూ లేదని తెలుసు! కానీ విగ్రహాలకు ప్రాణముంటదా అంటే?

ఉండదా? ఆ విగ్రహాలకు ప్రాణమే కాదు,  తెలుగు ప్రజల ఆత్మ ఆ విగ్రహాల్లో ఉంది. తెలుగు ప్రజల సంస్కృతిని నిర్వచించి, తెలుగు జీవితాల్ని సంస్కరించి తెలుగు జీవనంలో వెలుగులు నింపిన వైతాళికులు వాళ్ళు! అందుకే ....అందుకే ఆ విగ్రహాల్లో మా అందరి ఆత్మ ఉంది. నిన్న ధ్వంసం చేసింది కేవలం విగ్రహాలని కాదు, కోట్లాది తెలుగు ప్రజల ఆత్మలను, ప్రేమని,భక్తిని,గౌరవాన్ని, హృదయాలను!
గుర్తించండి విధ్వంస కారులారా గుర్తించండి!
సిద్ధేంద్ర యోగికీ,ఎర్రాప్రగడకీ,శ్రీకృష్ణ దేవరాయలకీ ప్రాంతీయతను అంటగట్టి వారి ప్రతిమల్ని ధ్వంసం చేసిన ఉన్మాదులారా....గుర్తించండి! తెలుగు గుండె ఘోష గుర్తించండి!

కాంగ్రెస్ ని ఎదిరించి నిలబడ్డ ఒక్క మగాడు NTR ఆ విగ్రహాలను పెట్టించినందుకు ఆయనకు  తెలుగు జాతి అంతా ఋణపడి ఉండాలని అనుకుంటూ ఉండేదాన్ని! టాంక్ బండ్ మీద వెళుతుంటే కావాలని నెమ్మదిగా వెళుతూ ప్రతి విగ్రహాన్నీ ఇప్పటికీ ఎంతో అబ్బురంగా చూస్తాను. మొదటి సారి ఎనిమిదో తరగతి  సెలవుల్లో వాటిని చూడ్డానికి వెళ్ళినపుడు నన్నయ విగ్రహం చూడ్డానికి పరుగెడుతుంటే "నన్నయ దగ్గరికి చెప్పుల్తో వెళ్తార్టే?" అని నాన్న పెట్టిన కేక మనసులో అలా ఉండిపోయిందేమో ఆ తరవాత ఎన్ని సార్లు వెళ్ళినా అప్రయత్నంగా చెప్పులు విడిచి మరీ వెళ్ళి కూచుంటాం మేము!
కృష్ణ దేవరాయలు, బ్రహ్మనాయుడు విగ్రహాల్లో తన పోలికలు వచ్చేట్లు NTR చెక్కించుకున్నట్లు అప్పట్లో గుసగుసలొచ్చాయిట. అవును, ఆ ఇద్దరి రూపాలూ మాకు NTR తోనే పరిచయం! వాటిల్లో ఆయన పోలికలు లేకపోతే నిరాశ పడేవాళ్ళం!  
ఒక అంబేద్కర్ విగ్రహానికో, రాజశేఖర్ రెడ్డి విగ్రహానికో వేలో కాలో విరిస్తేనో,చెప్పుల దండ వేస్తేనో ఎందుకు గర్హిస్తాం? ఎందుకు "పాలాభిషేకాలు" చేసి పవిత్రీకరిస్తాం? ఆ విగ్రహాల్లో ప్రాణం ఉందని నమ్మబట్టేగా? ఆయా వ్యక్తుల పట్ల ప్రేమ గౌరవం ఉంటుంది కాబట్టేగా? మరి విగ్రహాలకు ప్రాణం ఉంటదా అని ఏ ధైర్యంతో, ఏ హక్కుతో అడుగుతున్నాడో గద్దర్ నాకు అంతుపట్టడం లేదు.

నిజమే! నా ప్రశ్నలోనే జవాబుంది. ఆయా వ్యక్తుల మీద ప్రేమ, గౌరవం ఉండాలి.వాళ్ళు ఎవరో, వారి సాహిత్యంతో తెలుగు ప్రజల జీవితం ఎంతగా పెనవేసుకుపోయిందో,వారి సంస్కరణలతో ఎన్ని లక్షల జీవితాల్లో వెలుగు నిండిందో,తెలుగు జనజీవితంతో వారెలా మమేకమయ్యారో,మరణించినా  మా గుండెల్లో ఎలా అమృత మూర్తులై  కొలువున్నారో......ఇవన్నీ వాళ్ళకు, ఆ ఉన్మాదులకు తెలీదు..అర్థం కాదు! అర్థం చేసుకోరు!
నన్నయ మిమ్మల్నేం  చేశాడు? జాషువా ఏం చేశాడు? లాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడగను. వాళ్ళు ఎవరో, తెలుగు జాతికి వారికి ఉన్న అనుబంధం ఏమిటో మీకు తెలీదు. మీ దృష్టిలో వాళ్ళ గుర్తింపు కేవలం సీమాంధ్రులుగానే కదా! ఎలా అడుగుతాను?
శ్రీ శ్రీ కాళ్ళు విరగ్గొట్టి కూల్చేస్తారు. కృష్ణదేవరాయలని, ఎర్రాప్రగడని,బ్రహ్మనాయుడిని మురుక్కాలవలో పారేస్తారు,వేమన నోటికి ప్లాస్టర్ వేసి మెళ్ళో గులాబీ జెండా వేస్తారు.

దీనివల్ల ఆ వైతాళికులకు తగిన శాస్తి జరిగిందనో,సీమాంధ్రులను అవమానించామనో మీరు సంతృప్తి పడొచ్చు! కానీ మీరు చేసింది ఒక్కటే...

నడి వీధిలో మీ సంస్కృతిని మీరు నగ్నంగా నిలబెట్టి నిర్వచించారు!
మీరేమిటో  ప్రపంచానికి చాటారు !
మీ సంస్కారాన్ని బట్టలు విప్పి టాంక్ బండ్ మీద ఊరేగించారు.  !
మీ అంతిమ  లక్ష్యమేమిటో చూపించారు.మీరు హుసేన్ సాగర్లో వేసింది కేవలం విగ్రహాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మని!
తెలుగు వెలుగులారా..! క్షమించండి! 
తన ముద్దు బిడ్డలకు పట్టిన గతి చూసి అల్లంత దూరాన ప్రభుత్వ భవనం ముందు.... నోట్లో చెంగు కుక్కుకుని గోలుగోలున ఏడుస్తున్న తెలుగు తల్లి సాక్షిగా
మేము...చచ్చిపోయాం!
మా రక్తంలో వేడి చల్లారిపోయింది.
మిమ్మల్ని కాపాడుకోలేక ఇళ్ళలో టీవీల ముందు కూచుని కళ్ళు తుడుచుకున్నాం! 
 NTR.... క్షమించు మమ్మల్ని! 
తెలుగు ఆత్మగౌరవం నినాదాన్ని నువ్వు వినిపించినా, దాన్ని ఇవాళ మేము నినదించలేకపోయాం! ........
ఆత్మలు చచ్చిన వాళ్లకు గౌరవం ఎందుకని!
 పోలీసుల సాక్షిగా సాగిన దమనకాండ ని చూస్తూ కృష్ణ దేవరాయలకు,బ్రహ్మనాయుడికి హుసేన్ సాగర్ నీళ్లతో తర్పణాలు విడిచాం!
మహనీయులను సదా స్మరించుకునే అవకాశం నువ్విచ్చినా మేము నిలుపుకోలేకపోయాం!
ఎముకలు కుళ్ళి,శక్తులు చచ్చిన వాళ్ళం...క్షమించు

26 comments:

critic said...

ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ !

విగ్రహాలను ‘నిరసనకారులు ధ్వంసం చేశారన్న వార్త నాకూ గుండెలో ముల్లులా దిగబడింది’ అంటున్నారు మీరు. ‘మతిమాలిన చర్యలతో...’ అని కూడా నిరసిస్తున్నారు మీరు. ‘ ఆ విగ్రహాలకు ప్రాణం లేదా?’ అంటూ నిలదీస్తూ రాసిన ఆవేదనాపూరిత టపా మొత్తాన్నీ కోట్ చేశారు. అంటే జరిగిన సాంస్కృతిక విషాద తీవ్రతను మీరు బాగానే గ్రహించారనే కదా?

మరి- కేవలం విధ్వంసానికి ముందున్న విగ్రహాల ఫొటోలను ఇచ్చినంత మాత్రానే, జరిగిన ఘోరానికి పూర్తిగా అద్దం పట్టినంత మాత్రానే ‘ఈనాడు’ చేసింది ‘ఉన్మాదం’ అయిపోయిందా? ‘జరిగింది పెద్ద విషయం కాదు’ అంటూ ఉద్యమనేతలు పశ్చాత్తాపం కూడా ప్రకటించటం లేదని మీరు గమనించారా ?

Pavani said...

..అసలు విషయాలను వదిలేసారు మీరు. అసలు మేము తెలుగు వాళ్ళమని ఎవరు చెప్పారు మీకు. తెలంగాణా వాళ్ళం. శ్రీ క్రిష్ణ దేవరాయలు కన్నడిగుడు (తుళు వంశీకుడు అనుకుంటా, నిజానికి విజయనగర సామ్రాజ్యాపు తొలి మూల పురుషులు తెలంగాణా వాళ్ళు..), త్యాగయ్య తమిళనాడు లో పుట్టిన తెలుగు వాడు, సర్ ఆర్థుర్ కాటన్ ఆంగ్లేయుడు అయితేనేమి మా తెలంగాణా వాళ్ళు కారు. పోతన్న కూడా నిజానికి ఓరుగల్లు లో పుట్టినా ఒంటిమిట్టలో పెరిగాడు..సరిగా చరిత్ర తెలియక పోవటం చేత వొదిలేసాం. లేక పోతేనా ఈపాటికల్లా హుస్సేన్ సాగర్ మురికిలో ..గజేంద్ర మోక్షం పద్యాలు పాడుకుంటుండె వాడు..గద్దర్ వచ్చి రక్షించటం కోసం.

బుద్ధుడిని కూల్చనందుకు, బిర్లా మందిర్ ని, హైటెక్, సిటీని, రామోజి,అన్నపూర్ణా స్టూడిఒస్ ఇంకా అంధ్రా వాసన వుండే అన్నిటిని తన్ని తగలెయ్యనందుకు మా మంచితనం చూసి సంతోషించక ఈ బాధేమిటి. ఎందుకు మీకీ దురహంకారం.

హైదరాబాద్ అందరికీ కాపిటల్, అది ఒక్కళ్ళ సొత్తెలా అవుతుంది..అంటారా..లేదా అనాలనుకుంటున్నారా..జాగ్రత్త! ఆ విగ్రహాలను పెట్టినప్పుడు అందరూ కీర్తించారే..ఇప్పుడెందుకు కూల్చారు..నిజానికి ఏ దేశ చరిత్ర అయినా ఎప్పుడూ ఒక్కలా వుంటుందా..అసలు మనదనుకున్న సమస్త నాగరికతా అమెరికావాడి మోజులో ఎలాగూ వదిలేసుకుంటున్నప్పుదు.. దేనికేడవాలో కాస్తైనా తెలుసుకోవాలి కదా..అంటార..అందుకే మాకు మీలాంటి వాళ్ళంటె అసహ్యం.

ఏ దేశ చరిత్ర అయినా ఏనాడూ కాదొక స్థిర బిందువు.
అది నైక నదీ నదాలు కలిసిన అంథస్సింధువు ..అనంటాడు తిలక్..ఇంకో అంధ్రా సన్నాసి.

అడ్డొస్తే నరుకుతాం..ఎదురు మాట్లాడితే పొడుస్తాం
మాది కాని దేదైనా, దేన్నైనా కూలుస్తాం, చంపేస్తాం
విశాల సాగరపు నిరంతర చేతన కాదురా
కుది మట్టసంగా..కదలక మెదలక
చచ్చిన శవం లాంటి(!) మా హుస్సేన్ సాగరు సొగసు చూడరా..

అనంటాం మేము. దిష్టి చుక్కల్లంటి ఆ విగ్రహాలని పెట్టి మా హుస్సేన్ సాగర్ గత వైభవాని నాశనం చెస్తే ..ఇంకా ఎన్నాళ్ళని ఇలా భరిస్తాం.

Praveen Mandangi said...

ప్రాంతీయతత్వం రెండు ప్రాంతాలవాళ్లలోనూ ఉంది. మొదట పొట్టి శ్రీరాములు పేరు చెప్పి తెలంగాణాని వ్యతిరేకించారు. పొట్టి శ్రీరాములు ఉద్యమించింది మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం కానీ తెలంగాణా విలీనం కోసం కాదు. తెలుగు జాతి గౌరవం అంటూ అరిగిపోయిన రికార్డ్ తిప్పి తెలంగాణా రాష్ట్రానికి భాష ప్రధాన అవరోధం అనే అభిప్రాయం కలిగించారు. తెలంగాణా ప్రజలకి భాష మీద ద్వేషం పెరిగి జాతి నాయకుల విగ్రహాలు ద్వంసం చెయ్యడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి పేరు లాగడం ఎందుకు? ఆయన విగ్రహాలతో పాటు ఇతర జాతి నాయకుల విగ్రహాలు ద్వంసం చేసే స్థితి తేవడం ఎందుకు?

Aakasa Ramanna said...

"నాడు-నేడు అంటూ...ఫోటోల ద్వారా భావావేశాలు రెచ్చగొట్టాలని చూసిన 'ఈనాడు' పత్రిక ఉన్మాదం కూడా అంతే ఖండించదగినది"
ఎందుకు? ఉన్మాద చర్యల్ని ఉన్నదున్నట్లు చూపితే అది ఉన్మాదమెలా అవుతుంది??

నండూరి వెంకట సుబ్బారావు said...

నిజమే సర్, మీరు చెప్పింది. విగ్రహాల ధ్వంసం కన్నా, దాన్ని సమర్ధించుకొనేందుకు చేసే వ్యాఖ్యానాలు చూస్తుంటే, వింటుంటే కడుపు రగులుతోంది. ప్రభుత్వాలు చేవచచ్చి, ప్రభుత్వాధినేతలు సిగ్గుచచ్చి ఉన్నారు కనుక కొందరు మూర్ఖులు "కర్ర ఉన్నవాడిదే బర్రె" అన్న సిద్ధాంతాన్ని అమలుచేసి అదే తమ విజయం అనుకుంటున్నారు. వారికి కూడా అదే గతి పట్టడానికి ఎన్నోరోజులు పట్టదు. వారికి ఆ శాస్తి జరగాల్సిందే కానీ ఇంతలో జాతి గౌరవం ఎంత దిగజారుతుందో, ఎంత మంది అమాయకులు బలవుతారో, సామాన్యులు ఎన్ని ఇక్కట్లపాలవుతారో తలుచుకుంటే చేతుల్లోకి ఆయుధాలు తీసుకోవాల్అని పిస్తుంది. అలా చేయలేకపోతున్న మనం నిజంగానే చేతకాని వాళ్ళం

chomskyist said...

Sir, I was there at Tankbund yesterday and saw the Toppling of statues, It was the Proudest moment of my Life as a Telanganite, perhaps it the first step we are taking Towards Demolishing Andhra Cultural Hegemony perpetuated on Telanganites under the carefully Constructed Facade called Telugu Pride.

Sir the protesters issued a Ultimatum for Kondaram to be released within 1 hour or else the statues would be destroyed and they kept their word.

Sir the Statues you Hold so dear were Hollow really Hollow like those cheap POP statues, before i thought they were some expensive Granite, so it Didnt take more than 3 minutes for each statue to be demolished and Dumped in to Husseinsagar, Call it a Nimajanam.


Sir, when u are a Imperial Power and Conquer a New Colony, the first step You take is to Build Statues of Your own Heroes and make the locals worship them, the British,french every body did that, andhras are no exception.

Sir Despite of the Tension in Hyderabad yesterday not a Single Andhra person was assualted, despite of 1 lakh people rounded up and locked down in Prisons, and the Checkpoints between the TG zillas and Hyderabad reminded me of the Israeli occupied Palestine.

<<<జీవనోపాధికి ఏ పనీ చేయకుండా జనం మీద బతికేసే గద్దర్.

Dont Insult our Living telangana Heroes sir, ( i know that he did many land Kabjas) .

Sir , u missed a Great opportunity yesterday u should have been to Tankbund and witness History being made.

Unknown said...

@chomskyist

How about destroying Birla Mandir?? [Hes not telangana god anyways]

How about destroying countless Shirdi Saibaba Mandirs? [Hes a maharashtrian, not telanganite!]

How about destroying Hitech City and other IT hubs? [Not built by Telangana CM right]

How about destroying Shamshabad Airport? [Not built by Telangana CM!]

How about destroying every flyover in the city? [None of them were built by Telangana Govts]


Its not history that is in making...Its end of Hyderabad as we know it...

Last ki migiledi...smashanam...Yes..the great Hyderabad graveyard...happy ga elukovachu...aatma gauravam toh!!

Anonymous said...

/Dont Insult our Living telangana Heroes sir, ( i know that he did many land Kabjas) /

హ్వాహ్వాహ్వాహ్ ఇది బాగుంది. వాళ్ళు లీడర్లు, మీరు గొర్రెలు.

kiran said...

ఈనాడు పేపర్ ని విమర్శించకుండా మీ పోస్ట్ లు ఉండవేమో. అయిన దానికి కాని దానికి ప్రతి చిన్న విషయం బుతద్దంలో చూపి మీ గౌరవాన్ని మీరే తగ్గించుకుంటున్నారు

SHAM... The Inspiration said...

ఓ కుటుంబంలో చిన్న కొడుకు వయసొచ్చాక బుద్ది తెలిశాక ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోతాను, వేరు కాపురం పెట్టుకుంటాను అన్నాడు. దానికి పెద్ద కొడుకు వద్దంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. తండ్రి కూడా పెద్దోడికే వంతపాడాడు. కలిసుందాం అంటున్న పెద్దోడి ఉద్దేశానికి తప్పు ఆపాదించాలా.. లేక విడిపోతాను అంటున్న చిన్నోడిని తప్పుబట్టాలా... విడిపోడానికి ఒప్పుకోని పెద్దోడి మీద కత్తిగట్టే వరకు తండ్రి ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు..

నేటి తెలంగాణా ఉద్యమం కూడా ఇదే పరిస్థితిలో ఉంది. చివరకు చిన్నోడు ఉన్మాదిలా మారి తండ్రినే నువ్వు నా తండ్రివి కాదు పో అంటున్నాడు(తెలుగు తల్లి ఎవనికి తల్లి అన్న కేసీఆర్ మాటలు). తోడబుట్టినవాడిని శత్రువులా చూస్తున్నాడు (ఆంధ్రోడు తమ్ముడే - అడ్డొస్తే నరుకుడే అన్న నినాదం). విడిపోవాలి అన్న కాంక్ష ఎంతవరకు సమంజసమో.. కలిసుండాలి అన్న పెద్దోడి అభిప్రాయం కూడా అంతే సమంజసం కాదా.. గొడవలు లేకుండా సర్దిచెప్పాల్సిన తండ్రి(కేంద్ర ప్రభుత్వం) ఏం చేస్తున్నాడు... చివరకు ఒకరినొకరు నరుక్కుని చచ్చే వరకు అంపశయ్య మీద భీష్ముడిలా వ్యవహరిస్తాడా...

KumarN said...

Mr Chomskyist,
You are unbelievable!!What did you say again?

Andhraites are "cut from the same cloth" as British Imperialists!!!!.

Have you lost your mind?

Words like these suggest that you are corrupt to the core with the hatred of Andhraites, a stage at which you can not see the world objectively. Therefore nothing that you say will have any credibility.

You wanna fight..fine...play hardball.. but stay away from making those stupid statements. It doesn't do you any good.

As to the proudest moment of your life...It's probably the most shameful moment of my life as a person from Telugu land.

>>Israeli occupied Palestine>>
Excuse Me..you are comparing Telangana land with Palestine!!!

Geez..this is probably the most insulting comment I have ever come across about Telangana..

Pavani said...

Praveen Sharama,

Now I know why your name causes terror among many bloggers. I never had any encounter with you before but had to agree with my fellow bloggers...you are different . You can drag anything and everything outofcontext and trivialize the brutal act has something to with something utterly trivial. Please refrain yourself from answering me ..I had enough from those thugs already. Thanks in advance.

chomskyist said...

Sir, I thought your blog was like a Media watchdog but You failed the Purpose of Your Blog Miserably.

Lets look what International Media has to say about thursdays events:

BBC head line: India: Arrests before Telangana 'million-man' rally.

Reuters: India's Hyderabad shut down as thousands demand new state.

Sadly the National media followed the suit of our Andhra media and it Was Only BBC that reported that over 100,000 Telangana people were detained claiming police sources and Only International media was reporting that 50,000 attended the march.

Its sad that Intellectuals like You didnt find anything "odd" about Our Main-steam media totally Ignoring about the Detention of 1lakh people from Your own TELUGU jathi.

Ennadu devoted 3 whole Pages including the Front page Just about the Importance and the Distruction of statues, i searched the Whole paper no mention even of some foot notes of 1 lakh telangana people taken in to custody.

Thirmal Reddy said...

టాంక్ బ్యాండ్ ఫై విగ్రహాల కూల్చివేత నిజంగా దురదృష్టకరం. అది చాల హేయమైన చర్య. కాని ఈ వంకతో మళ్లీ తెలుగు జాతి గౌరవం అనే పాతపాట మొదలైంది. అత్యంత జాగ్రత్తగా selective pride ని పాటించే తెలుగు జాతి వారసులు విగ్రహాల కూల్చివేత ఎందుకు జరిగిందో ఓసారి ఆలోచిస్తే ఎంత బాగున్ను. cultural hegemony ని పతాక స్థాయికి తీసుకెళ్ళిన విషయం మర్చిపోయి, ఇప్పుడు విగ్రహాల వంకతో దాన్ని cultural oppression గా మార్చే ప్రయత్నం మొదలైంది. ఇంతకీ విగ్రహాల కూల్చివేతకు బాధ్యలు ఎవరు?

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Raj Karsewak said...

Telangana washes off Symbols of Seemandhra oppression into Husain Sagar . Remembering Lord Hanuman's Brave act, Telanganites too did an Symblolic "Lanka Dahanam" to teach Seemandhra 'Ravanasura Jaati' a Lesson. If Lanka dahanam by hanuman is a Crime , then what our T-Vanara Sena did is also crime.

I personally opposed and fought against those who tried to uproot the statues. I have great respect for those great personalities. last year when TJAC opposed boycotting of SriKrishna Devaraya celebrations i condemned it and posted same on my blog (http://karsewak.blogspot.com/2010/07/telangana-leaders-call-to-boycott-sri.html )

But recent attack on Statues is directed more against Seemandhra Plutocrats rather than those Great personalities. Iam Proud what our Boys did .

anywayz ...
నిన్నటి దాక .... ట్యాంక్ బాండ్ మాది - విగ్రహాలు వాల్లవీ .
నేడు ........... ట్యాంక్ బుండ్ మాదే - విగ్రహాలు మావే . :)

A. Kalidasu said...

జాతి రత్నాలు అంటున్నావ్, ఎవడి జాతి..
బొమ్మలు తగలబడితేనే నీకు చరిత్ర, సంస్కృతీ గురుతోచ్చిందా..
అసలు నీకు 'ఆత్మ' ' గౌరవం' అంటే అర్థాలు తెలుసా..
కూలిన నీ చరిత్ర కారులని అడిగి తెలుసుకో బ్రదర్
తెలుగు జాతి తగల బడింది అని కుల్లుతున్నావ్
తెలంగాణా జాతి మాటేప్పుడైనా వినపడిందా

వారు గొప్ప వారు కావొచ్చు..
కాని నా తల్లి గుండె మీద
నిప్పులై మండుతున్నారు
ఎపుడైనా నీ ఎసి కార్లల్ల తిరుగుతుంటే
కనపడిందా మా గోస

హుస్సేన్ సాగర్ నిండా నా తల్లి కంటి నీరే కదా..
భాషని, యాసని హేళన చేసి చూసే నీకు
ఎక్కడిదిరా హక్కు
జాతి గురించి ఊసెత్తడానికి

అందమైన హైదరాబాద్ ను తయారు చేసిన
నా రాజుల చరిత్ర ఏది?
ప్రపంచ పటంల నా జాతి ని నిలబెట్టిన
నా నిజాం పరిమళాలు కలుషితం చేసి
మా కొమరం భీమ్ ధైర్యానికి , వీర చరిత్రకు మసి పూసి,
అయిలవ్వను , యాదగిరిని , బందగిని బొందపెట్టి
ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నావ్..

రాయి బద్దలయితే రాద్ధాంతం చేస్తున్నావ్,
బొమ్మ పగిలితే గుండె పగిలినట్టు
గంటలూ గంటలూ రొద పెడుతున్నావ్
నువ్వు నిలబడ్డ జాగా నాది,
నా జాగా చరిత్ర ఏది? సంస్కృతీ ఏది?

నా బిడ్డలు ఏరి..
ఓ గురజాడా, ఎర్ర ప్రగడ, ఇంకా ప్రజా కవులారా..
మీరు చేసిన తప్పంతా..
రక్త మాంసాలు తినే నర రూప రాక్షసుల చేతుల్లో పడడమే,
మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మా జాతి ని మట్టు బెట్టి,
మా చరిత్ర సమాధుల మీద మిమ్మల్ని నిలబెట్టడమే

మేము గురి పెట్టింది మిమ్మల్ని కాక పోవచ్చు,
మీరు చేసిన కృషిని కాకపోవచ్చు..
మా ఆక్రోశం బద్దలు అయింది
భాల్ల్లున పగిలింది మీ బొమ్మల పైన..

మీ జాగా ఖాళి అయితేనే కదా
మా చరిత్రలు నిలబడేది

ఒకటి అంతం అయితేనే మరొకటి మొదలు..
మా జాతి కోసం ప్రాణాలు అర్పించిన
అమర వీరుల సమాధులకు కూడ
జాగా లేదు, వారికి చోటియ్యనియండి,
బొమ్మలకి బాద పడే మీరు..
బిడ్డలు కళ్ళముందు కాలుతుంటే
ఒక్క కన్నీటి బొట్టు కూడ రాల్చ లేదే?
కవితలు రాల లేదే, పుస్తకాలు అచ్చు కాలేదే ?

మీ మాటలు కత్తుల్ల దిగుతుంటే
ముక్కలైన మా మట్టిని ,
బూడిదైన మా సంస్కృతిని
మళ్లీ నిలబెట్టుకున్దామనే
చరిత్రని మల్లా తిరగ రాస్తున్నాం,

ఇక్కడ మీకు , మీ గొప్ప చరిత్రలకు
స్తానం లేదు..అందమైన విగ్రహాలకు
విడిది కాదు నా ఇల్లు,
ఆగమైతున్న బతుకు చిత్రాలకు
కొలువు..

భుతల్లి కన్నీట మునుగుతున్నాం
గర్భ శోకంతో కుంగి పోతున్నాం..
మోసాలకు ఎత్తులకు జిత్తులకు
విసిగి వేసారి ఉన్నాం..
కొలిమిల్లాగా మండుతున్నాం..
దగ్గర కొస్తే ఆగం అయితారు..

మాట్లాడే సహనం లేదు,
బ్రతిమిలాడే క్వాయిష్ అంత కన్న లేదు
మిగిలినవి చేతలు , చేతులే ..
ఆవేశం అంటుకున్నది
ఆవేదన అలుముకున్టున్నది..
మంచి చెడుల మధ్య
చెరిగిన రేఖ..
న్యాయ అన్యాయాల మధ్య నలిగిన
సత్యం..

ఇప్పటికైనా ...
నా భూమ్మీద నా బిడ్డలకే హక్కు..
మేమూ ప్రజా కవులను ప్రేమిస్తాం..
మీ చరిత్రనూ నిలబెడతాం..
మా చేతుల మీదుగా
మేము ప్రశాంతంగా
స్వేచ్చగా గాలి పిలచిన రోజు..



Right Said

Source:

http://nanokiran.blogspot.com/2011/03/blog-post_4586.html

A. Kalidasu said...

i think you may not publish telangana voice

నండూరి వెంకట సుబ్బారావు said...

తెలంగాణా ఉద్యమం ఎంత పక్కదారి పట్టిందో ఇక్కడ వ్యాఖ్యానాలు చూస్తే తెలుస్తుంది. తెలంగాణా ఉద్యమం లక్ష్యం ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఇది ఏ రకంగా తెలంగాణా సాధనకు ఉపయోగిస్తుంది ? అనే ఇంగితజ్ఞానం ఉన్నవారు అరుదుగా కనిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నాటినుండి ఇప్పటివరకూ తెలంగాణా ప్రజాప్రతినిధులుగా అక్కడిఅభివృద్ధిని విస్మరించిన వారే ఇప్పుడు సామాన్యులను రెచ్చగొడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమవుతుంది. పేరుమారుతుంది. మళ్ళీ అదే నాయకులు, మళ్ళీ అదే పాలన. ఈ మాత్రం అవగాహన లేకుండా పోయినప్పుడు ఇంకా మాట్లాడేముంది? నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఏం పీకావు అని ఒక్క నాయకుణ్ణి నిలదీసేవాడు లేడు. నోరులేని విగ్రహాల మీద శౌర్యప్రతాపాలు.

Unknown said...

@Kumar Your Andhra media is calling US telangana people talibans, well I saw many 3 or 4 year old Talibans on tankbund they came with their parents to Protest.

I really Hate every Andhra person but iam not that Mad at them that I would physically or verbally assault a Random Innocent Andhra person, I will certainly throw Rocks at a Samykhandhra rally.

After the protests on 10th i was on my way Back and a person asked me for lift, I asked i he was from telangana he said he is from Hyderabad so i gave lift, On the way he was trying to Maskafy me by saying that ee Andhrollane narkalee that sort of statements, I asked him whether he was Rayalseema he said he was from Kammam migrated to Hyd, He asked me why did I come to protest I explained for 20 minutes and that we Organized on a Face book group to protest, He gave me a wicked Grin and asked me whether we were getting paid to attend Million March, I was Dissapointed more than Angry with this guy i chatted for a Halfan hour , I thought these Andhra Guys think that everything revolves around money, I thought of asking the Guy to Get off my Bike, But the roads were really empty and I didnt want the pathetic fellow Deserted, so i dropped him near his place.

Naagarikuda Vinu said...

ఆహా హా వచ్చారండి వచ్చారు తెలుగు జాతి పరిరక్షకులు వచ్చారు.
ఆత్మ గౌరవ నినాదం తో మళ్ళీ మన ముందుకు వచ్చారు.
పాలామూరు లో పంటలు లేక ప్రజలు లక్షల్లో వలస వెళ్ళి
కూలిన భవన శిథిలాల కింద బ్రతుకు ఛిద్రమై కుంగిపోయినపుడు ఏమైంది ఆత్మ గౌరవం?
రాజోళిబండ తూమును రాయలసీమ రెడ్లు పేల్చి వేసి కర్నూలుకి నీరు మరల్చినప్పటి కన్నా రాయల వారి విగ్రహ కూల్చివేత ఎక్కువగా బాధిస్తున్నదా?
తలా తునా గోదారి పారుతోన్నా బ్రతుకే యెడారై
విష జ్వరాలకు వినమ్రంగా ప్రాణార్పన చేస్తున్న అదిలబాదు అడవి బిడ్డలను చుసినపుడైనా
గుర్తుకు రాలేదా ఆత్మ గౌరవం?
నల్లగొండ నడ్డి విరిచి, నీరు మరల్చి, మాయదారి ఫ్లోరైడ్ కి మా బతుకుల్ని బలి ఇచ్చి
విరిగిన మా అన్నదమ్ముల ఎముకలతో వెలిగించిన మీ సంక్రాంతి భోగి మంటలో నైనా కనపడలేదా ఆత్మ గౌరవం?
కాకతీయ కళాప్రభల విస్మరించి "తెలుగు" పాఠ్య పుస్తకాలలో ఎక్కడా రాణి రుద్రమ ప్రస్తావనే రాకుండ చరిత్రను కాల రాసి నేడు జాతి జాతి అని వాపోతున్నారా?
తెలుగు సాహితీ పరిమళాలు విరాజిల్లిన విజయవాడ సాక్షిగ కళాశాలల్లో ప్రతి కులానికి ప్రత్యేకంగా స్వాగత కార్యక్రమాలు జరిపినపుడు ఎమైంది ఆత్మ గౌరవం?
కాళోజి ని కాల రాసి, దాశరథి ని దాచివేసి, కొమురాన్ని, ఐలమ్మ ను తెలుగు చరిత్రలోంచే కడిగేసి
భళ్ళారి రాఘవ సాక్షిగా మా భాష ను యాస ను కించపరచి, తెలంగాణ వారిని చిల్లర మల్లర రౌడీలుగా చిత్రీకరించినప్పటికన్నా నిన్నటి సంఘటన ఎక్కువగా బాధిస్తున్నదా?
"సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడు పడవోయి" అన్న గురజాడ వారి ఆదర్శాలను అధహ్ పాతాళానికి తోసి, ఒక రాతి విగ్రహం పై రాధ్ధాంతమ?

సిగ్గు సిగ్గు

ఉస్మానియా లో మీ సాటి అక్క చెల్లెళ్ళను రక్షక భటులే రాక్షస భటులై చెప్పరాని చోట లాఠీలతో దెప్పి పొడుస్తూ హింసించినపుడు ఏమైంది ఆత్మ గౌరవం?
ఆ నాడు కాదా తెలుగు జాతికి చీకటి రోజు?
ఆవేదన తో ఆక్రోషం తో ఆరు వందల ప్రాణాలు ఆత్మార్పణ చేసుకున్న ఇవి కావా చీకటి రోజులు?

premade jayam said...

తెలుగు జాతి ఆత్మగౌరవం అనే బ్రమల్లో బతికే కొద్దిమంది కృష్ణ మూర్తి లను పట్టించుకో నక్కరలేదు. తమిళ నాడులో తమిళుల కన్నా ఎక్కువ సంక్యలో ఉన్న తెలుగు వారిని గాలికి వదిలేసి వచ్చి నపుడు తెలుగు సోదర భావం ఎక్కడ ...బ్బింది? ఆంద్ర రాష్ట్రం ఏర్పడిందే సామ్రాజ్యవాద భావనలతో. దాని విస్తరణ కాంక్షే ఆంద్ర ప్రదేశ్. కమ్యునిస్ట్ లకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే గొప్ప సిద్దంతమేది లేదు. వాళ్లకు తెలిసిందల్లా రష్యా ఆదేశాల మీద చేత నైనన్ని రాష్ట్రాల్లో అధికారం సంపాదించుకోవడం. అందుకోసమే మొదట తాము బలంగా ఉన్న ప్రాంతాలతో ఏర్పడిన ఆంద్ర రాష్ట్రాన్ని, తర్వాతr తాము ఉద్యమాలు నడిపిన తెలంగాణను కలిపి ఆంద్ర ప్రదేశ్ ను సమర్ధించారు.

౩౩ మంది తెలుగు ప్రముఖుల్లో తెలంగాణా ప్రాంతపు వారు ఎందరు? కొమురం భీం విగ్రహానికి చోటుకోసం ఎందుకు అడుక్కోవాల్సి వచ్చింది. ట్యాంక్ బుండ్ విగ్రహాల ఎంపికలో తెలంగాణా వాళ్ళ పాత్ర ఎంత. కుటుంబంలో వాటాల గొడవలు వస్తే అన్ని లెక్కకు వస్తాయి.

ఇక కులగొట్టుడు విషయానికి వస్తే అది తెలంగాణా చెరిత్ర మీద పడ్డ మరకను తుడుచుకున్న మహత్తర క్షణం. ఆంధ్రా ప్రాంత మేధావులారా మీకో బంపర్ ఆఫర్. మీ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణా సామ్రాజ్య వాద గుర్తుల్ని (ఉంటె) చేడిపేయండి. విగ్రహాలు కులగోట్టండి. వందలు వేల ఎకరాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యాల్ని ఆక్రమించుకోండి. మీకు మా మద్దతు సదా ఉంటుంది.

Unknown said...

uddam cheyakunda saamrajyam dakkadu. talalu tegipadalsinde raktam erulai paaralsinde.telangana slogan ANNADAMMULUGA VIDIPODAM enti comediga dammunte, kaleja unte satruvuluga vidipodam satruvuluga batukudam anandi.telanganalo vunna andhravadimida cheyeeveyee dammunte appudu telangana vastundi.tondaraga kottuku chavandi, hyderabad prasantanga vuntundi.

Unknown said...

what is this "okka magadu ntr"sir.exploiting an emotionally surcharged atmosphere to reinforce stereotypes is more dangerous than demolition of statues.

Venu said...

Somehow you never fail to hide your hatred towards "Eenadu". I never saw any provocatory remarks in Eenadu's story.Please do not cast any aspersions on my comment as being sympathetic to that news paper.I am a regular reader of your blog and this is the first time i am commenting in your blog. This Eenadu hatred is really showing up "adnauseum" in your posts.It is better for you to seriously introspect.Cheerios.

Anonymous said...

/హుస్సేన్ సాగర్ నిండా నా తల్లి కంటి నీరే కదా../
యాక్ థూ.. హుసేన్సాగర్ నీళ్ళా!
దృష్టికళ్ళు బాగా కుళ్ళిపోయివున్నాయేమో, ఓ సారి సరోజినిదేవి, ఎల్.విప్రసాద్ కంటి దవఖానాలో చూపించండి. ఖర్చు సమైఖ్యాంధ్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇస్తుంది. :P

kiran said...

వ్యాస కర్త ఒక దాడిని కండించే ముసుగులో అనేక మూడ భావనలను చొప్పించాలని ప్రయత్నం చేసారు .ఇది చాలా అభ్యంతరకరమైన విషయం."ఒక్క మగాడు NTR"అనే ప్రయోగం మధ్య యుగాల మనస్తత్వాన్ని ప్రతిబింబుస్తుంది.ఇటువంటి మూడ భావనల తో ప్రజలని వారి సంస్కృతులని అవహేళన చేస్తూ మా కులం లేదా మా ప్రాంతానికి చెందిన కొద్ది మందిని "heroes"గ మీ మీద రుద్దుతం .మీరు మీకు ఇష్టం లెకపొఇన వారిని బలవంతంగా భరించాలి,మీ ప్రాంతాలకి మీ కులాలకి చెందిన వాళ్ళు నిజమైన నాయకులైనా మీరు మరిచి పోవాలనే ఆధిపత్య భావజాలమే ప్రస్తుత సమస్యలకు ప్రధాన కారణం.మాములు సందర్బాలలో ప్రతి రోజు వ్యాస కర్త లాంటి వాళ్ళు ,వాళ్ళకు వత్తాసు పలికే మీడియా ఆ పని చేస్తూనే ఉంటుంది కాని ఈ విగ్రహ ద్వంస సందర్భంలో చేయటం శవాల మీద పేలాలు ఏరుకొన్నట్లు ఉంది.
మేము చాలా అంబేద్కర్ విగ్రహాల స్థాపనని దగ్గరి నుండి చూసాం .నాకు తెలిసినంత వరకు అంబేద్కర్ విగ్రాహాల స్థాపనకు ప్రబుత్వం సొంతంగా పూనుకొన్నది చాలా తక్కువ .ఎక్కువ చోట్ల ప్రజలు స్వచ్చందంగా ముందికి వచ్చి కమిటి లు వేసుకొని చేసుకొన్నవే.because ambedkar is relevant to their lives.విగ్రాహాలకి ప్రాణం ఉండటం ,ఉండకపోవటం ఆ మహనీయులకి ప్రజల జీవితాల్లో ఉండే relevance మీద ఆధారపడి ఉంటుంది.గద్దర్ ఎ ఉదేశ్యం తో "విగ్రాహాలకి ప్రాణం ఉంటుందా " అని అన్నారో కాని ఇది చాలా పెద్ద ప్రశ్నే .మనం కొంచం సావధానంగా ఆలోచించాల్సిన విషయమే .డాం ,డీమ్,డుశ్యుం అనేస్తే సరిపోదు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి