తెలుగు న్యూస్ ఛానళ్లు తామరతంపరగా పుట్టుకొస్తుంటే...ఇన్నాళ్లూ కుళ్లుకున్న ఇంగ్లిష్ జర్నలిస్టులకు ఇది ఒక శుభవార్త. హైదరాబాద్లో త్వరలో కొత్తగా రెండు ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు రాబోతున్నాయి. కొందరు సాఫ్ట్ వేర్ సంస్థల పారిశ్రామికవేత్తలు కలిసి ఒక మధ్యాన్నం పత్రికను తీసుకురాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. "ఉదయం నుంచి మధ్యాన్నం దాకా జరిగే పరిణామాలను అందించడం దీని ఉద్దేశం. బెంగుళూరుకు చెందిన ఒక జర్నలిస్టును ఎడిటర్ గా నియమించారు," అని ఒక సీనియర్ పాత్రికేయుడు తెలిపారు. జీవీకే సంస్థ పాత్ర కూడా ఇందులో ఉన్నదని చెబుతున్నారు కానీ అధికారికంగా అది తెలియరాలేదు.
కపిల్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో రోజూ ఒక టాబ్లాయిడ్ రాబోతున్నది. దీనికి ఎడిటర్ గా కొమ్ములుతిరిగిన జర్నలిస్టు, డెక్కన్ క్రానికల్ పేపర్ కు జవసత్వాలు ఇచ్చిన వెటరన్ ఎడిటర్ సి.ఎన్.విశ్వనాథన్ నాయర్ నియమితులయ్యారు. న్యూఢిల్లీ కేంద్రంగా 'ఇండియా టుడే' తెస్తున్న మెయిల్ టుడే తరహాలో ఆరంభంలో హైదరాబాద్ పరిధిలో ఈ పత్రిక వస్తుందని చెబుతున్నారు. (తను పనిచేస్తున్న సంస్థ వారి టాబ్లాయిడ్ కాబట్టి...అర్ధం చేసుకోదగ్గ ఇబ్బంది కారణంగా వివరాలు అందించడానికి రాము సహకరించడం లేదు...అబ్రకదబ్ర)
7 comments:
ramu can u give ur mail id pl.
Hi sir
My mail id:
srsethicalmedia@gmail.com
thanks and regards
Ramu
ok sir thank u
who is this "bra"...i mean Abrakadabra..
It's good that two more newspapers/tabloid are coming from Hyderabad.But can they be different fromm the existing newspapers?Can we expect real,ethical,proffessional journalism from them?Will they be identified with any political party or individual?
JP.
Who is this 'Bengaluru ku chendina editor'...? Can anyone please throw light on this? thnx Viren
Nice post.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి