Thursday, July 7, 2011

మల్లికార్జున శర్మను ఈటానగర్ బదిలీ చేసిన 'ఈనాడు'

హక్కుల గురించి నోరు తెరిచి అడిగిన ఉద్యోగులపై కత్తి కట్టే 'ఈనాడు' సంస్థ మరొక దారుణానికి పాల్పడింది. జర్నలిస్టుగా తన హక్కుల గురించి, న్యాయంగా రావలసిన పదోన్నతి గురించి అడిగిన పాపానికి ఇప్పటికే ఒరిస్సా రాజధానికి బదిలీ చేసిన సీనియర్ జర్నలిస్టు మల్లికార్జున శర్మను 'ఈనాడు' నిన్న సాయంత్రం ఉన్నపళంగా ఈటానగర్ బదిలీ చేసింది. మర్నాడే (అంటే ఈ రోజు) రిలీవ్ అయి ఈ నెల పద్నాలుగో తేదీన అక్కడ జాయిన్ కావాలని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది.
కిందటి నెల పదిహేను రోజులకే జీతం ఇచ్చి ఇబ్బంది పెట్టడంపై మల్లికార్జున్ లేబర్ శాఖ కు ఫిర్యాదు చేయడం, ఈ నెల పందొమ్మిదవ తేదీన శ్రీకాకుళం లో అసిస్టంట్ లేబర్ కమిషనర్ ముందు జాయింట్ మీటింగ్ ఉండడం  తో శర్మను మానసికంగా దెబ్బ తీయడానికే ఈ బదిలీ చేసినట్లు ఆయన స్నేహితులు చెబుతున్నారు. 

"పిల్లల విద్యా సంవత్సరం ఆరంభం అయ్యాక ఇలా బదిలీ చేయడం దారుణం.  తమకే పుట్టిన పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. అయినా ఈనాడు యజమానులు ఇలాంటి నీచానికి పాల్పడ్డారు. దీనికి వారు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు," అని ఒక మిత్రుడు కాస్త పరుషంగా అన్నారు. 


"న్యూస్ టుడే" అనే సంస్థను నెలకొల్పి దాని నుంచి 'ఈనాడు' వార్తలను కొనుక్కుంటూ పత్రిక నడుపుతున్నట్లు.... లోకానికి పొద్దున్న లేచిన దగ్గరి నుంచి సుద్దులు చెప్పే రామోజీ రావు, ఆయన కొడుకు పేపర్ల మీద చూపించారు. ఇదీ కాక జర్నలిస్టులకు వేజ్ బోర్డు ప్రకారం రావలసిన జీతాలు ఇవ్వకుండా 'ఈనాడు' దోచుకోవడాన్ని మల్లికార్జున్ కోర్టులలో ప్రశ్నించారు. 

దానికి ప్రతీకారంగా ఈ బదిలీ వేటు వేసినట్లు భావిస్తున్నారు. ఢిల్లీ లోని  ఆర్.టీ.ఐ. అధికార్లకు, ఈనాడు యాజమాన్య ప్రతినిధులకు, మల్లికార్జున్ కు మధ్య  వీడియో కాన్ఫరెన్స్ జరిగిన కొద్ది సేపట్లోనే ఈ జర్నలిస్టు పై బదిలీ వేటు వేసారని సమాచారం. 

మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మల్లికార్జున్ ను దెబ్బతీస్తున్న 'ఈనాడు' చర్యను ప్రతి జర్నలిస్టు ఖండించాలి. 'ఈనాడు' పై న్యాయ పోరాటం చేస్తున్న మల్లికార్జున్ కు ఆర్ధిక సాయం చేయడంలో భాగంగా ఈ బ్లాగ్ తరఫున రెండు వేల రూపాయలను ప్రకటిస్తున్నాం. ఈ డబ్బు అతని ఖాతాలోకి వెళ్ళే ఏర్పాటు చేస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఆయన తన ఒక్కడి కోసం కాకుండా జర్నలిస్టులు అందరికీ మేలు జరగాలని పోరాడుతున్నారు. మల్లికార్జున్ కు ఏళ్ళ తరబడి జరుగుతున్నది అన్యాయమని భావించిన వారు, 'ఈనాడు' బాధితులు స్పందించి అతనికి అండ దండలు అందించాల్సిందిగా కోరుతున్నాం. జర్నలిస్టులను పూచిక పుల్లలను చూసినట్లు చూసే యాజమాన్యాలకు మల్లికార్జున్ ఒక గట్టి గుణపాఠం నేర్పాలని ఆశిద్దాం.     

7 comments:

Srinivas Kusumanchi Journalist said...

Ramojirao could have earned crores of rupeers but could not win hearts of a single employee. At least in his last stage, he should do justice his employees. Otherwise, there is no value for his life. Everyone will die oneday. But dying with satisfaction is possible only when we help others. I hope Ramoji will rectify all his misdeeds...

రాజేష్ జి said...

$రాము గారు

మంచి(?) వార్తను పంచుకున్నారు. ధన్యవాదాలు.
శాపానార్ధాలు షండుడికి తగులునా..తగిలినా ఒహ లెక్కా.. జమా! అది పక్కన బెడితే శర్మగారు బయటికి వచ్చి పోరాడవచ్చు కదా? లేక వేరే ఉద్యోగం చూసుకోవచ్చుకదా? అక్కడే ఉండి బాధలు పడటంలో ఆంతర్యం? కులంతో సంబంధ౦ లేకుండా నిష్పక్షపాతంతో చూస్తే పత్రికలు..అంటే సాక్షి, డెక్కన్ క్రానికల్ వంటివాటిలో చేరితే పోలా? [ఏంటో అన్నీ పెసినలే..బుర్ర ఫ్రై! ;)]

వారు న్యాయపోరాటం చేస్తున్నారని చెప్పారు.దీనిమీద మరింత సమాచారం పంచుకోగలరు. మీరు దానికి చేస్తున్న సాయానికి అభినందనలు.

we4telangana said...

yajamanya dhoranini prashnisthunna prathi udogi ide paristhithi.roju neethulu cheppe ramojirao kothina nithika viluvalnu,manavathavanni pradarsisthe manchidi.

astrojoyd said...

very gd post sir..

Anonymous said...

@"తమకే పుట్టిన పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు"
Well said :)

sandeepreddykothapally said...

good artcle...mallikarjun sir hats off

Kishor said...

ఏదీ ప్రశ్నించకండి.
ఎందుకంటే అది ఈనాడు.
ప్రశ్నించినా ఏమీ జరగదు.
ఎందుకంటే అది ఈనాడు.
పైన ఎవరో ఓ అమాయకుడు ఈనాడు మారాలన్నట్టు, మారుతుందన్నట్టు ఆశాభావం వ్యక్తం చేశాడు. జర్నలిస్టుల్లో కూడా ఇంత అమాయకులు ఉన్నారని నేను అనుకోలేదు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి