Monday, October 17, 2011

మన పాత్రికేయ వెలుగులు-అందరి దగ్గరా ఉండాల్సిన పుస్తకం

'వయోధిక పాత్రికేయ సంఘం' వారు "మన పాత్రికేయ వెలుగులు", "Our Legends of the Fourth Estate" అనే రెండు మంచి పుస్తకాలను ప్రచురించారు...తెలుగులో ఇంగ్లిషులో. తెలుగు పత్రికారంగంలో వైతాళికులు, కీర్తిశేషులు, ప్రముఖులు...చాలా వరకు ఇందులో కవర్ అయ్యారు. "This is the first-of-its-kind book. ఏడాది పాటు శ్రమకోర్చి దీన్ని తీర్చిదిద్దాం," సీనియర్ మోస్ట్ జర్నలిస్టు జి.ఎస్. వరదాచారి గారు నాతో చెప్పారు. ఆయనే ఈ పుస్తకానికి పర్యవేక్షక సంపాదకుడిగా వ్యవహరించారు. ఇంగ్లిషు ఎడిషన్ బాధ్యతలను "ది హిందూ" మాజీ బ్యూరో చీఫ్ దాసు కేశవ రావు గారు తీసుకుని చేశారు. టి.ఉడయవర్లు, కె.లక్ష్మణరావు గార్లు కూడా నలుగురు- సభ్యుల సంపాదక వర్గంలో ఉన్నారు. 

బ్లాగు కోసం సమీక్షించండని గురుతుల్యులు వరదాచారి గారు చెప్పారు. కానీ సమయాభావం వల్ల ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నాను. పైపైన చూస్తే అర్థమయింది ఏమిటంటే...ఇది ఒక చక్కని పుస్తకం, జర్నలిస్టులందరి దగ్గరూ ఉండాల్సిన పుస్తకం. దాదాపు అన్ని పత్రికల మొదటి రోజు మొదటి పేజీలను, ఎక్కడా దొరకని కొన్ని ఫొటోలను ఇందులో ప్రచురించారు.

రేపు (October 18, 2011, మంగళవారం) సాయంత్రం నాలుగు గంటలకు ఆ పుస్తకాలను "విక్రయానికి విడుదల" చేయబోతున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అక్కినేని నాగేశ్వర రావు, సి.నారాయణ రెడ్డి గార్లు పాల్గొనే ఒక కార్యక్రమంలో ఈ విడుదల జరుగుతుంది. ఈ పుస్తకాలను ఆగస్టు 28 న ఆ రోజే గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆవిష్కరించారు.
మంగళ వారం ప్రెస్ క్లబ్ కు వచ్చి కొనుగోలు చేసేవారికి సగం ధరకే ఈ పుస్తకాలను ఇస్తామని వరదాచారిగారు ప్రకటించారు. రేపు దీన్ని మీరు మిస్ కాకూడదనే ఆదరాబాదరా ఇది రాస్తున్నా. పత్రిక కవర్ ను ఈ పోస్టులో చూడవచ్చు.
తెలుగు ప్రతి అసలు ధర- Rs.400
ఇంగ్లిషు ప్రతి అసలు ధర-Rs.300
మంగళవారం నాడు కొనుక్కొని సగం డబ్బు ఆదా చేసుకోండి.

2 comments:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

మంచి ప్రయత్నం. నేటి తరానికి ఒకప్పుడు జర్నలిస్టులు ఇలా కూడా ఉండేవారు అని తెలియజేయవచ్చు.

జైభారత్ said...

ekkada dorukutai sir..

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి