Saturday, October 1, 2011

తెలంగాణాపై జాతీయ మీడియా మౌనం: MSO లు

తెలంగాణా కోసం మునుపెన్నడూ లేని విధంగా ఉద్యమం జరుగుతున్నా...జాతీయ మీడియా పట్టించుకోవడం లేదని Federation of Telangana Multi System Operators (MSOs) ఆరోపిస్తున్నారు. వారి ఆవేదనను, వాదనను ఈ మెమొరాండం లో చూడవచ్చు. ఇది పంపిన జీ-టీ.వీ. లో ఉన్న తెలంగాణా సోదరుడికి థాంక్స్...రాము 


19 comments:

Samaikya said...

1. మనము మనకు ఎంత ముఖ్యమో ఇతరులకి అంత ముఖ్యం కాకపోవచ్చు. ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయానికి జాతీయ స్థాయిలో ఎంత కవరేజ్ కావాలి అనేది మన ఆవేశకావేశాల మీద ఆధారపడి ఉండదు.
2. మన తెలంగాణ వాద పేపర్లూ, టీవీ చానళ్ళూ, దందాలూ ఆంధ్రా బిజినెస్ డబ్బులను చేదు గా ఏమీ చూడనప్పుడు, వారి ప్రకటనల సొమ్ము పై ఆధారపడుతున్నపుడు, వేరే చానళ్ళను అధిక్షేపించే అధికారం మనకుండదు.
3. ఆంధ్రా లాబీ సత్తాని మన paranoia లో పడి అతి గా ఊహించుకోవద్దు. లాంకో, జీ వీ కే లాంటి ఓ నాలుగు చోటా మోటా (జాతీయ స్థాయి లో) కంపెనీల ప్రకటనల కోసం పదుల సంఖ్య లో ఉన్న జాతీయ చానెళ్ళన్నీ నోరొ నొక్కేసుకోవు.
4. ఆంధ్రా లాబీ అనేది తెలంగాణ వాదులు కల్పించుకొన్న ఒక self serving myth. ఒక సమైక్యవాది గా ఈ లాబీ ఉండాలని నేను కోరుకొంటున్నాను. కానీ అలాంటి coordinated efforts ఏమీ నాకు కనపడలేదు. ఎప్పుడన్నా డిల్లీ పోయి అధిష్టానం తో నాలుగు మీటింగ్స్ లో పాల్గొనటం తప్పితే ఆంధ్ర పెద్దలు చేసింది సున్నా! అలాంటి లాబీ ఒకటి acive ఉన్నట్లైతే తెలంగాణ వాదం ఇక్కడి దాకా వచ్చేది కాదు.

Pavani said...

....నిజానికి ఆంధ్రా మీడియా అనేది లేనే లేదు. వార్తేదో వ్యాఖేదో తెలియకుండా రాసే ఈనాడు వాడు ఒక్క తెలంగాణా విషయంలోనే వార్తను వార్త లాగా ఇచ్చి ఊరుకుంటాడు. తప్పా ఒప్పా అన్న విశ్లేషణ పొరపాటున కూడా రాయడు. జ్యోతి వాడు తను తెలంగాణా వాదినని మెళ్ళో బోర్డ్ కట్టుకోని మరీ తిరుగుతాడు. సాక్షి వాడు ఏనాడో సమైక్యవాదం గురించి రాయటం మానేశాడు.ప్రస్తుతం దానిది నిర్లిప్త ధోరణి. టీవీల్లో ఎవడెక్కువ గోలచేస్తే వాడి మీదే ఫోకస్. అంటే తె. వాదులదే.చర్చలంటే తె. వాదులు నలుగురు కల్సి మిగిలనవారిని బూతులు తిట్టడం.

As Mr.Samaikya rightly observed, Andhra(and seema) lobby is a myth. They hardly have any say in national politics either in terms of money or muscle. Forget about the lobby, entire political history of AP in last 3 decades is essentially about the so called Andhra media bashing another Andhra politician by party lines. NTR vs Congress, CBN vs YSR, Jagan vs CBN. I never saw politicians in kosta+seema region ever worked together on any issue..till today. They were always divided by party lines. The only exception is united andhra..and that too they dividedly united!

chanukya said...

బాగా చెప్పారు సమైక్యవాది గారు

Anonymous said...

ఆంధ్ర లాబీ అనేది ఒకటి ఉన్నట్లైతే కొందరు తెలంగాణ వాదులకి మూడ్ వచ్చినప్పుడల్లా వాళ్ళకి మామూళ్ళు సమర్పించుకోవాల్సిన ఖర్మ ఆంధ్ర పెట్టుబడిదారులకి ఏమిపట్టింది?

paapam andhra said...

త్రెలంగాణ వాదానికి వ్యతిరేకం గా మాట్లాడాలంటే సొ కాల్డ్ ఆంధ్ర చానల్స్ కి దడ. తెలంగాణ వాదులు భౌతిక దాడులు చేస్తరనే భయం. ఈ చానల్స్ అన్నీ తమ ఆఫీసులని విజయవాడ లో పెట్టుకొంటే ఏమైనా న్యూట్రల్ గా రాస్తాయేమో!

Anonymous said...

అయ్యా, మన టీ.వీ ల ద్వారా ఇక్కడి జనం తలకాయలు తిన్నది చాలదా? ఈ రాష్ట్రాన్ని అధొగతి పాలు చేసినది చాలదా?? ఈ గోలంతా దేశ వ్యప్తంగా చూసి అందరూ తలా ఒక విధంగా విడిపోయి, దేశమంతా కొట్టుకు చావాలా??? దేశం కూడా నాశనం కావాలా???....అందుకనే, దేశ సమగ్రతను దృష్టిలో వుంచుకొని జాతీయ మీడియా చక్కటి సంయమనం పాటిస్తోంది.

paapam andhra said...

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తానొక తె. వాదినని చెప్పుకొంటాడు. కానీ అతనిని తె. వాదులెవరూ తె. వాదిగానే కాదు, తెలంగాణా వాడి గా కూడా చూడరు. (మరి రాబోయే తె. రాష్ట్రం లో ఏమైనా ఆశించి తనను తె. వాది గా చెప్పుకొంటున్నాడేమో అతనికే తెలియాలి!) తెలంగాన అతివాదుల ప్రకారం, శంఖం లో పోస్తేనే తీర్ధమైనట్లు, ఓ నాలుగు వందల ఏళ్ళనుంచీ తెలంగాణా లో స్థిరపడిన కుటుంబాల వారు మాత్రమే తెలంగాణ వారు ఔతారు.

Anonymous said...

అంతమంది తెలంగాన ప్రజలు ఇబ్బందులు పడుతూ, త్యాగాలు చేస్తూ తెలంగాన కోసం పోరాడుతుంటే ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వాన్ని శాశ్వత పరిష్కారం వైపు నడిపించ వలసిన బాద్యత మీడియాపై ఎంతైనా వుంది.

HandsomeMan said...

రాము అన్నా,
ఈ కింది నా కామెంట్ తప్పుగా వేరే పొస్ట్ లో చేశాను. ఇక్కడ మళ్ళీ చేస్తున్నాను.
"ఈ కులదీప్ సహానీ ని ఓ రెండు టీవీ చర్చలలో చూశాను. అందులో సమైక్య వాదం తరపున పల్గొన్న వారిని గద్దించి వారిని బిక్క చచ్చిపోయేటట్లు చేశాడు. అసలు తెలంగాణ వారి కంటే బయటినుంచీ వచ్చిన వారు ఎక్కువ ఆవేశం నటిస్తారనుకొంటా. వారికి తమ తెలంగాణ చ్రెదెంతీల్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ గా ఉంటుంది. తమిళ నాడు లో తెలుగు వాడైన వైకో తమిళ అతివాదాన్ని సమర్ధించినట్లు. "

John said...

/తెలంగాణాపై జాతీయ మీడియా మౌనం: MSO లు/

ఎప్పుడూ వాడు ఏదో చెయ్యాలి...వీడు ఏదో చెయ్యాలనేనా ఏడుపు ? మనం చేసే దాన్లో సరుకు వుంటే..జాతీయ మీడియా ఏం ఖర్మ...అంతర్జాతీయ మీడియా కూడా పరుగెట్టుకుంటూ వస్తుంది.

venu said...

saruku undhi kabatte alzazeera channel lo vachindhi viyathnam papers lo kuda vachindhi, kani mana national media cover cheyyaka povadaniki karanam andhariki thelusu, samaikyandra ane oka kalpitha udhyamaniki pradhanyatha ichina ee hindi vallu telangana lo jarige vasthavanni endhuku chupincharu, HMTV ramachandra murthy garu manjeera rachayithala vedhika varu nirvahinchina kaaryakramaniki velli samaikyandra udhyamam anedhi lene ledhu, telangana lo nijamaina poratam jaruguthundhi annaru, mari akkada ee udhyamam lenappudu endhuku cover cheyyadam, gantalu gantalu charchalu pettadam, edho aashinche kada......

HandsomeMan said...

@Venu,
I haven't seen national media even uttering a single word about Samaikya movement (I agree right now,samaikya movement is not as fervent as Telangana movement.It's dormant. But once telangana is announced, it may explode.Remember the situation in andhra after Dec 9 announcement. Right now we are in a samaikya state. Once that is broken, then only there'll be a trigger for a real samaikya movement. The hate propaganda by KCR and party in these two years has intensified the antagonism among andhrites about T, a lot. So, it will be stronger this time.)
On the contrary, the national media covers Telangana movement whenever it catches the imagination of the national media. How many times Al-jajeera or vietnam news paper have covered T-movement? They might have shown it once and then done with it. But the national channels continue to have discussions whenever it is apt.Atleast I remember around ten such instances. It looks odd to ask the national channels to get obsessed with a state issue. They are not Telangana vaadis like you. Right?

Anonymous said...

జాతీయ మీడియాకి హిందీ మాట్లాడే ప్రాంతం, ఢిల్లీ, ముంబయి లాంటి మహానగరాలు తప్ప ఇంకేమీ పట్టవు.
నోయిడాలో ఒక్కడు చచ్చినా వార్తే కాని, వేరేచోట పదిమంది పోయినా అది వాళ్ళకి వార్త కాదు.
వాళ్ళకి దక్షిణాది అంటే ఎప్పుడూ చిన్నచూపే. దక్షిణాది నుంచి NDTV కి తప్ప ఎంతమందికి ప్రముఖ విలేఖరులున్నారు?

Anonymous said...

Ayyaalaaraa..
mee yoojar nEmkannaa mee AvESam choostE ee mukka cheppaalani Anipinchindi.

@samaikya... : (1) 'manaki enta mukhyamO itarulaki anta kaakapOvaChchu '. nijamE, 7lakshala mandi udyOgulu + itara sekshanlu chEstunna samme kannaa azaaruddeen koDuku vaaDina baik mODal, itara fEEcharla pai ganTalakoddee charchalu avasaramaaa..?

@raadhaakrishNa...: nuvvannadi nijamE.. telangaaNaa anTE dESa samagrataku muppu vaaTillutundi. andukE #BBC# vaaDu prapamcha Saamtini kOrukOvaDam lEdu kaabaTTi anavasaramgaa eerOju sammepai iTaM pablish chEsaaDu. VaaDiki mana jaateeya meeDiyaakunnanta telivitETalu lEvukadaa..

@ jaan : ee link chooDanDi.. (udyamam lO nuvvanukunE saruku undi kaabaTTE..)
#
http://www.bbc.co.uk/news/world-south-asia-15121119#

jarnalijam jarnalijam laagE unDaali. #For the people.#

"evari meeDiyaa vaariShTam.." anTaaraa, ika charchE aKkarlEdu.

evadaite enti said...

ఎంత సేపు మీడియా లో తెలంగాణా వాదాన్ని విన్పించాలేదనో..సమైక్య వాదాన్ని విన్పించాదనో ఏడిచే బదులు
చానల్స్ లో జర్నలిస్ట్ కి జరిగే అన్యాయాన్ని ఎవరు అడగరా? కొన్న్ని చానల్స్ లో ప్రావిడెంట్ ఫండ్ డబ్బు తెగ తింటూ ప్రోప్రైటర్ ఫండ్ గా మర్చేసాయత కదా యాజమాన్యాలు ...అలానే ఎవరు దాని గురించి ప్రశ్నిస్తే వాడిని టార్గెట్ చేసి బయటకు పంపుతున్నాయట. ఈ లిస్టు లో ముందు అగ్ర భాగాన ఐ న్యూస్ ..తర్వాత స్టూడియో-ఎన్ , తెలంగాణా వారికోసమే పుట్టిన ఓ ఛానల్ ఉన్నాయట..పేరులో గొప్పదనాన్ని చాటుకున్న మరొకటి..ఇక ప్రతి వాడి అవినీతి కి సాక్ష్యం గా నిలిచే మరో మీడియా సంస్త కూడా ఇదే బాట లో పయనిస్తున్నాయట . ఈ జాబితా లో మొదట గా చెప్పుకున్న ఛానల్ యాజమాన్యం మారిన దాని తీరులో మార్పు రాకపోగా ఇంకాస్త ఎక్కువ అయిందట..అందుకే అందులో పని చేసి మానేసిన ఓ జర్నలిస్ట్ ..వారి బాగోతమంతా మనవ హక్కుల కమిస్సిఒన్ కి కంప్లైంట్ చేసాడట...త్వరలోనే కంమిస్సిఒన్ ఈ వ్యహారం పై ఎంక్వయిరీ కి ఆదేశించబోతోందిట..మీడియా కి సంబందించిన విషయం కావడంతో ఈ న్యూస్ బయట పెట్టవద్దని ఆ జర్నలిస్ట్ కోరినట్లు తెలుస్తోంది..అదే జరిగితే..ఉద్యోగుల కి ఇవ్వాల్సింది పోగా జరిమానా కింద మరో కోటి రూపాయల దాక కట్టాల్సి వస్తుందని టాక్ ..
ఇదే జరిగితే మిగిలిన చానల్స్ కూడా తమ ఉద్యోగులకి వళ్ళు దగ్గర పెట్టుకుని పీ ఎఫ్ జమ చేస్తారని జర్నలిస్ట్ కాలనీ లో పుకార్లు బయలు దేరాయి..కానీ పోలీసు కి వంద కళ్ళైతే, దొంగ కి వేయి కళ్ళు అన్నట్లు ఏదో వక దొంగ దారి చూసుకుని ఎగ వేయడం ఖాయమని అనుభజ్ఞులు చెప్తున్నారు.

ప్రస్తుత అంశం ..తెలంగాణా ని పట్టించుకోవడం , పట్టించుకోకపోవడఏం జరగదు ..అసలు పట్టించుకోవాల్సిన వెధవలు పట్టించుకుంటే చాలు..

bye

Samaikya said...

95d7c102-ec3c-11e0-82a1-000bcdcb8a73,
"evari meeDiyaa vaariShTam.." anTaaraa, ika charchE aKkarlEdu.
ఏవరికి ఏది లాభమైతే అది చూపిస్తారు. నేషనల్ మీడియాలో తెలంగాన ఉద్యమాన్ని ఎవరు చూస్తారు? అక్కడ దానికి మార్కెట్ లేదు. అక్కడ మార్కెట్ ఉంది బాలీవుడ్ కుప్పిగంతులకీ, లాలూ డయలాగ్లకీ, మాయావతి సోదికీ. వాళ్ళు దాన్నే చూపిస్తారు. అంతే గానీ తెలంగాణ ఉద్యమం జరుగుతుంది కదా అని చూపిస్తే ఏ యూఫీ ప్రేక్షకుడి కో దానిమీద ఏమి ఆసక్తి ఉంటుంది? మనమున్న పెట్టుబడిదారి లో ఇది తప్పదు. "మరి టీ న్యూస్ ఎందుకు చూపిస్తోంది ?" అంటారా? TRS కి రాజకీయం గా లాభం లేకపోతే అది కూడా చూపించదు.
BBC లాంటి చానల్స్ వార్తల సమగ్రత కోసం ఒక సారి చూపించి ఊరుకొంటాయి. అంతే!

srinu said...

పచ్చ కామెర్లు ఉన్న వాడికి లొకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. జాతీయ మీడియా నిస్పక్షపాతంగానే ఉంది. స్టేట్ మీడియా కూడా బాగానే ఉంది. ఎవో కొన్ని ఛానెళ్ళు తప్ప.

srinu said...

పచ్చ కామెర్లు ఉన్న వాడికి లొకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. జాతీయ మీడియా నిస్పక్షపాతంగానే ఉంది. స్టేట్ మీడియా కూడా బాగానే ఉంది. ఎవో కొన్ని ఛానెళ్ళు తప్ప.

vin vin properties said...

dear Ramu,

Why dont you request some freinds of yours in International media like BBC, CNN to cover the Teelanga agitation ???

else please take time and write an article covering how minority voices gets bulldozed by the majority in Indian democracy, Union governments inaction etc.
we will circulate it to chiefs of international media houses.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి