Friday, October 5, 2012

V 6 కు పసునూరి శ్రీధర్ బాబు గుడ్ బై...

తెలుగు జర్నలిజం రంగంలో నాణ్యమైన జర్నలిస్టులలో ఒకరైన పసునూరి శ్రీధర్ బాబు వీ సిక్స్ ఛానెల్ కు రాజీనామా చేశారు. అక్కడ ఆయన ఎగ్సిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఆ ఛానెల్ కు కొద్ది కాలంలోనే గుర్తింపు రావడంలో శ్రీధర్ పాత్ర ఎంతో ఉంది. ఈ పరిణామానికి కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ....సీ.ఈ.ఓ. అంకం రవికి శ్రీధర్ కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. మంచి కవి కూడా అయిన శ్రీధర్ మానవ సంబంధాలకు గౌరవం ఇచ్చే జర్నలిస్టు గా పేరుంది. 

ఇదే ఛానెల్ లో ఫీచర్స్ ఎడిటర్ గా వున్న చల్లా శ్రీనివాస్ కూడా మూడు రోజుల కిందట వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. చల్లా శ్రీనివాస్, అంకం రవి ఐ-న్యూస్ లో కలిసి పనిచేసారు. శ్రీనివాస్ ను రవి ఏరికోరి వీ-సిక్స్ కు తీసుకువచ్చారు. 


శ్రీధర్ బాబు చెన్నై లో ఇండియా టుడే లో చాలా కాలం పాటు పనిచేసారు. హెచ్. ఎం. టీ వీ ఆరంభంలో ఆ ఛానెల్ ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి మీద ఎంతో నమ్మకంతో ఆ ఛానెల్ లో చేరారు. అక్కడ కోర్ కమిటీ లో ఆయన ఒక సభ్యుడిగా ఉండేవారు. అంకం రవి చొరవతో...మూర్తి గారి బృందం నుంచి శ్రీధర్ వెళ్ళిపోయి వీ సిక్స్ లో చేరారు.

"ప్రాంతం, కులం వంటి అంశాలకు ప్రాముఖ్యమిస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. ఆ రెండు అంశాలకన్నా బలమైన వ్యక్తిగత అహంకారాల వల్ల శ్రీధర్ ఇబ్బంది పడ్డారు," అని ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.     

రవి, శ్రీధర్ ల గురించి కిందటేడాది ఆగస్టులో నేను రాసిన పోస్టు చూడండి.

3 comments:

Ravi said...

Sir, plz write about 10TV.. Recruitment lo Khammam vaariki pradhanyata istunnarani samacharam. Recent ga Anand Vardhan(from TV9), Bureau Chief ga Goparaju(from Zee 24) kuda khammam vaare... enno ashalu pettukunna prajasakti vallaki mondicheyi chuputunnaarata... oke organisation kinda ok complex lo 1st floor lo panichese variki thakkuva salaries, 3rd floor lo panichesevariki ekkuva salaries... pi prajasakti sodarullo asmptrupti vyaktamavutunnadani samacharam....plz write abt this..

Ravi said...

సార్, 10 టీవీ గురించి రాయగలరు. అక్కడ ఎక్కువ ఖమ్మం వారినే తీసుకుంటున్నారట. ఇటీవల తీసుకున్న ఆనంద్ వర్దన్(టీవీ 9 నుండి), బ్యూరో చీఫ్ గా గోపరాజు(జీ 24 గంటల నుండి)... కూడా ఖమ్మం వాసులే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజాశక్తి మిత్రులకు మోండి చేయి చూపుతున్నారట. వీటీ గురించి రాయగలరు.

JE said...

v6 లో కాస్త పరవలేదనుకునే సరికి ఇలా జరగడం ఉహించనిడెం కాదు..ఎందుకంటే..ఔట్పుట్ లో ఎవరు ఉంటె వారిని పంపే అలవాటు అంకం రవి డి..
..ఇప్పుడు ఓ గాడి లో పడేసరికి ..ముక్యులని బయటకు పంపే పనిలో పడ్డాడు లా ఉంది ...అందులో అందరు హీరోలే..వాళ్ళ దృష్టిలో..
రిపోర్టింగ్ లో ఒక్క ముక్క అర్ధం కాకుండా మాట్లాడే..ఉప ముఖ్యమంత్రి పేరిటి వ్యక్తి హీరో నే..ఈ బ్లాగ్ సృష్టికర్త పేస్ కట్ లో చర్చలు చేసే..బురో చీఫ్ కూడా హీరో నే..పనికి మాలిన stammering తో డిస్కో లాంటి diskussions చేసే ప్రతి ఒక్కళ్ళు అక్కడ హీరోలే..అసలు అంకం ముందు ఉంది అక్కడ..

ఇక టెన్ టీవీ లో ఆనంద వర్ధన్ తో పటు మరికొందరు వెళ్తారు అని tv9 లో ప్రచారం జరుగుతుంది,,కానీ tv9 ని వదిలి ఎవరు వెళ్లారు..అని కూడా కొందరు అంటున్నారు..ఇక్కడ సలరీస్ తక్కువే ఇవ్వబోతున్నారు. అయితే ఇదంతా బయట వారికే..పెద్దోల్ల batch కి లక్ష, 60 belu కూడా ఇచేయబోతున్నారు

తులసి టీవీ కి పెద్దిరాజు తో టచ్ లో ఉన్న etv , సాక్షి batch వెళ్తారు..ఇది sure . సాక్షి ఇందుకోసం ఆల్రెడీ ఓ ప్లాన్ అఫ్ ఆక్షన్ ఉంచుకుంది..కాకపోతే..ఈ లోపు ఆ ఛానల్ ని govt ..handover చేస్కోకపోతే..ఈ ఛానల్ ప్రస్తుతానికి డిసెంబర్ లో కొత్త employeelaki కొలువులు
ఇవ్వబోతోంది..తర్వాత మళ్లీ మార్చ్ కి వాయిదా వేసిన వేయొచు

tv5 లో బ్రహ్మానందరెడ్డి, విజయకుమార్ ఇద్దరు తిస్కోచిన candidates ని చైర్మన్ reject చేయడం తో కొన్ని recruitments ఆగిపోయాయి.

జీ 24 లో కొత్త ఉద్యోగులు కావలెను అది కూడా ఓ 5 ఏళ్ళ experience వాళ్ళు కావాలి..జీతం మాత్రం 15vele ..

abc ..ఇప్పుడే బెగిన్ చేసారు కట్టడం ..ఇక ఎప్పటికి పుర్తయ్యేనో పాపం...

కవర్..అదే cvr న్యూస్ లో టెన్షన్ మొదలయిందట..చైర్మన్ పెద్ద తలకాయలకి రోజు తలక పోస్తున్నట్ట. పాపం పెద్ద తలకాయలు వాళ్ళ అనుచరులకి
మంచి జీతాలు ఇప్పించి..దాంతో..ఊరుకున్నారు ..పని చేస్తే ఎక్కడ అరిగిపోతారో అన్నట్లు వాళ్ళ శిష్యులు behave చేస్తున్నారట. ఇక ఈ frustration కింది స్తాయి వాళ్ళపై చుపిస్తున్నార్త..వాళ్ళే కనుక అంతా ముకుమ్ముడి గ వెళ్ళిపోతే ..ఇక ఆ ఛానల్ ని కాపాడటం ఎవరి వాళ్ళ కాదు..ఎందుకంట్ వాళ్ళ సాఫ్ట్వేర్ పై కోతవాళ్ళు పనిచేయడానికి కనీసం ఓ పది రోజులు పడుతుందట ...మరి ఇలాంటి సాఫ్ట్వేర్ ని ఎందుకు తెచుకున్నారో మరి

ఇక inew s..కేశవ్ -బాబు కోసం -యాత్ర బట పట్టడం తో ఇది నిజం ప్రోగ్రాం అటక ఎక్కింది ..కొత్త recruitment ఆగిపోయింది..దాదాపు సగం మంది
కొత్త చానల్స్ కి అప్లై చేస్కున్నారు..వచ్చి రాగానే ఇక్కడ ఖాలీ చేస్తారు...కానీ ఇక్కడ ఆ లోటు ఉండదు..ఎందుకంటే...మహా నుంచి కేశవ్, ఉద్యోగాలు లేని వాళ్ళని వెతికి మరి తెచే వాసుదేవన్ ఉన్నంత కలం ..ఇక్కడ కొత్త employeelu వస్తూనే ఉంటారు..టాలెంట్ గురించి ఇక్కడ అడగొద్దు.

గేమిని ...సారీ జెమిని నే ..అది..ఓ అరడజను కొత్త ఉద్యోగులని దిన్చుకున్నారు..ఎక్కువ మాట్లాడొద్దు ఈ ఛానల్ గురించి

స్టూడియో-న, మహా లలో తీసేయడం..తెచుకోవడం..శాలరీ గురించి అడగొద్దు..

abn , etv ..ఈ రెండింటి కి ఇప్పుడో కొత్త మసాల ఐటెం దొరికింది..మూడు నెలలు కేక పుట్టిస్తాయి..భజనలో తరిస్తాయి..జగన్ పై మండిపాటు,
బాబు పై ఆదరణ ఇదే ఏకైక అజెండా ...చూస్కోండి రోజుకో బ్యానర్ ఐటెం ...ఇక employeela గురించి పట్టించుకోవడం మానేసాయి...

ఇక చిన్న చిన్న చానల్స్ కూడా వస్తున్నాయి..టీవీ 19 , గుడ్ హెల్త్ టీవీలు పార్ట్ టైం మంచి శాలరీ ఇస్తే ...చాల మంది జాయిన్ అవుతారు

ఇక ఈ updates చాలు

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి