Thursday, July 11, 2013

HY-TV లోకి శైలేష్ రెడ్డి - Studio N కి సాగర్

గత వారం మీడియాలో రెండు మూడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. జీ టీవీ లో దాదాపు 15 సంవత్సరాలకు పైగా పనిచేసి... యాజమాన్యం మారడంతో అక్కడి నుంచి వైదొలిగిన సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డి రాజకీయాల్లోకి వెళతారన్న ప్రచారం జరిగింది. శైలేష్ దాన్ని దృవీకరించారు కూడా. టీ ఆర్ ఎస్ తరఫున మహబూబ్ నగర్ జిల్లాలో ఒక నియోజవర్గం నుంచి ఆయన అసెంబ్లీ కి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంతలో... HY-TV నుంచి ఒక ఆఫర్ రావడంతో శైలేష్ రెడ్డి దాన్ని స్వీకరించారు. ఈశాన్య భారతానికి చెందిన ఒక ఎం పీ స్థాపించిన ఆ ఛానెల్ ఆ మధ్యన మూతపడినంత పనిచేసింది. అక్కడ యాజమాన్య మార్పిడి జరిగి.. రివైవల్ పనిని శైలేష్ కు అప్పగించినట్లు సమాచారం. జిందాల్ గ్రూప్ ఈ ఛానెల్ ను తీసుకున్నదన్న ప్రచారం జరుగుతున్నది. 

HM TV ఛానెల్ ఆరంభించడానికి, నిలదొక్కుకోవడానికి పాటుపడిన ముఖ్యుల్లో ఒకరైన సాగర్ Studio N లో చేరారు. ఈ టీవీ, జీ టీవీ లలో పనిచేసిన సాగర్  HM TV, The Hans India చీఫ్ ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారికి స్వయానా బావ మరిది. ఒక రెండేళ్ళ కిందట... సొంతగా ప్రాజెక్టులు చేసుకుంటానని చెప్పి సాగర్ హెచ్ ఎం టీవీ నుంచి బైటికి వచ్చారు. తర్వాత సాక్షి వారి వెబ్ ఎడిషన్ కోసం పనిచేసి ఇప్పుడు Studio N లో CEO గా చేరారు. మిగిలిన వాళ్ళ కన్నా అద్భుతమైన జర్నలిస్టు అని మూర్తి గారు నమ్మే సాగర్ ఈ ఛానెల్ ను ఏమి చేస్తారో వేచి చూడాలి! 

సాక్షి టీవీ కి గోవింద రెడ్డి రాంరాం

ఈ మీడియాలో ఎప్పుడు ఏమవుతుందో చెప్పడం భలే కష్టం. చాలా సార్లు పనికిరాని సన్నాసులకు పెద్ద పదవులు వస్తాయి, నిజంగా కష్టపడే బుద్ధిజీవులకు బతుకు పోరులో భాగంగా శుంఠల దగ్గర తల వంచుకుని పనిచేయాల్సిన దుస్థితి వస్తుంది. ఇంకొన్ని సార్లు సీనియర్ జర్నలిస్టులకు పలు కారణాల రీత్యా వృత్తి మీద అసహ్యం కలుగుతుంది. ఈనాడు నుంచి బైటికి వచ్చి శైలేష్ రెడ్డి సహాయ సహకారాలతో జీ టీవీ లో వెలిగిన గోవింద రెడ్డి కాలక్రమంలో ఒకటి రెండు ఛానెల్స్ లో పనిచేసి చివరకు సాక్షి టీవీ లో ఇన్ పుట్ ఎడిటర్ గా సెటిల్ అయ్యారు. అక్కడ ఉన్నత స్థాయిలో ఉన్న ఒక మహిళతో బెడిసిన గోవింద రెడ్డి ఆ ఛానెల్ నుంచి బైటికి వచ్చారు. మా వాళ్ళే పంపించారని సాక్షి లో గోవింద్ కు గిట్టని వాళ్ళు ప్రచారం చేస్తుండగా... ఆ మహిళ బాధకు తాళ లేక ప్రశాంత జీవితం కోసం బైట పడ్డానని ఆయన అంటున్నారు. సాక్షి లో కీలక పాత్ర పోషిస్తున్న దిలీప్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నా గోవింద రెడ్డి బైటికి రావాల్సి రావడం చర్చకు దారి తీసింది. శైలేష్-దిలీప్-గోవింద్ రెడ్లు మంచి మిత్రులని అందరికీ తెలిసిందే.  

2 comments:

NIRANJAN RAO said...

హై టీవీ కి శైలేష్ రెడ్డి వెళ్తే వెళ్లారు కానీ అక్కడ పాట ఉద్యోగులకి ఇంతవరకు
జీతాలు ఇవ్వలేదు సొ..కొథ గ ఓపెన్ అవ్వగానే .. మల్లి వాళ్ళు వస్తరు.. పీఎఫ్ ల డబ్బు కోసం ఛానల్ ముందు ధర్నాలు ఇక మల్లి మొదలు అవుతయి. ఇదే సందులో ఉన్న ఐ న్యూస్ ని
ముఖ్యమత్రి వదిలించు కోవాలని చూస్తున్నాడని కాంఫిరం నెవ్స్. ఇక నరేంద్ర కూడా వద్దని
అంటున్నాడని తెలుస్తొన్ది. కాకపోతే నరేంద్ర ఐ న్యూస్ ని వద్దని అనడం వెనక పెద్ద ప్లేన్ ఉంది .. ఫ్రీ గ మల్లి ఐ న్యూస్ ని చేజిక్కించుకునే ట్రయల్ అది. ఆగష్టు 15 కి ఛానల్ తిరిగి ఎన్ గ్రూప్ లో చేరిపోతుంది sure న్యూస్ ఇది.
ఇక స్టూడియో ఎన్ గురించి చెప్పేదేముంది .. సాగర్ కాదు ఎవరు వచ్చిన ఇంతే సంగతులు ..
జీతాలు ఫస్ట్ తారికున ఇస్తే పని చేస్తారు కని.. ఎంత మంది ని మారిస్తే మాత్రం ఎం లాభం .. ఎ నెల మాత్రం 9 న జీతం పడగానే ఫుల్ కుషి అయ్యారు కానీ నెల రోజులు కష్ట పడితే 9 రోజులు
ఆలస్యం గ జీతం తీస్కోవడం కూడా ఓ పండగ..ఎమ్ బతుకులు మనవి?

srikanth said...

sakshi lo aa aadadi swapna anenaaa mee uddesham...?

alage redlu redlu manchi mitrulavutarannattu undi inko uddesham... :)