ఒక ఐదారేళ్ళ కిందట... ఎవరైనా వచ్చి... "అన్నా... ఒక సలహా కావాలి. ఏ పార్టీలో చేరితే బాగుంటుంది?" అని అడిగితే... "కళ్ళు మూసుకుని బీ జే పీ లో చేరు. భవిష్యత్తు ఆ పార్టీ దే," అని చెప్పేవాళ్ళం. అప్పట్లో నరేంద్ర మోడీ ప్రభంజనం లేకపోయినా...హిందుత్వ పార్టీ పట్ల జనంలో రూపుదిద్దుకుంటున్న సానుకూల అభిప్రాయం అలాంటిది. దానికి తోడు, సోనియా గాంధీ రిమోట్ తో పనిచేసిన మేధావి మన్మోహన్ సింగ్, ప్రభావం లేని రాహుల్ గాంధీ కమల వికాసానికి ఇతోధికంగా తోడ్పడ్డారు.
కౌంటింగ్ జరుగుతున్న ఈ రోజు (మే నెల 16, 2014) ఉదయం పది గంటల వరకు అందిన సమాచారం ప్రకారం... బీ జే పీ ప్రభంజనం కనిపిస్తున్నది దేశవ్యాప్తంగా. మోడీ ప్రధాని కావడం ఖాయం.
ఆంధ్ర ప్రదేశ్ లో మా మిత్రులు జనం నాడిని పసిగట్టడం లో దెబ్బ తిన్నారు. రాజకీయ చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడు ఒక నెల రోజుల వ్యవధిలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కలలు కల్లలు చేసారు.
అనుకున్న ప్రకారం... తెలంగాణా లో ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూసుకు పొయారు.
దేశ రాజధానిలో మోడీ, ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు, తెలంగాణలో చంద్రశేఖర్ రావు అధికారం లోకి రాబోతున్నారు. వాళ్లకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.
4 comments:
I think you must be disappointed. Patha cycle speed ki fan gali agi poyindi. I don't know what happened to your so called friend's predictions.
we don't have any favourites, sir. As we mentioned in our post, our friends' predictions fell flat.
Than how you posted junk cycle? It shows how much you hate Chandra Babu.
We don't hate anyone, sir. We clearly mentioned in our post that Chandrababu has the capacity of building a State.
As we mentioned it in the first line, we got the fan-cycle photo in facebook. We didn't create it.
cheers
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి