Wednesday, July 2, 2014

హెచ్ ఎం టీవీ రాజశేఖర్ vs జర్నలిస్ట్స్ యూనియన్

"వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ డే" అయిన ఈ రోజు (జులై 2, 2014) తెలుగు జర్నలిజం చరిత్రలో ఒక అపూర్వమైన ఘట్టానికి తెరలేచింది. జర్నలిస్టులు చేతులెత్తి దండం పెట్టే ఒక మాంచి పనిని వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ చేసింది. హాట్స్ ఆఫ్ టు యూనియన్ లీడర్స్. మీకిదే మా లాల్ సలాం. 

ముందుగా టీవీ 9 లో రవి ప్రకాష్ తో పనిచేసి అవాంఛనీయ పరిస్థితుల్లో ఉద్యోగం పోగొట్టుకుని... ఐ న్యూస్ ఛానెల్ ఆరంభించి ఫీనిక్స్ పక్షిలా లేచి, ఆ తర్వాత ఎన్ టీవీ ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించి... ఈ మధ్యనే హెచ్ ఎం టీవీ లో భారీ ప్యాకేజ్ తో చేరిన రాజశేఖర్ ఊహించని పరిణామం ఈ రోజు జరిగింది. రాజశేఖర్ హెచ్ ఎం టీవీ లో చేరిన తర్వాత ఆ ఛానెల్ లో ఉద్యోగాలు పోయిన 20 మంది లో (అందులో అత్యధికులు తెలంగాణ ప్రాంతీయులు) ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అద్భుతంగా స్పందించింది.  

యూనియన్ నేతలు ఒక సారి ఫోన్ చేస్తే... సింగపూర్ వెళుతున్నానని, మరొకసారి చేస్తే బోర్డు మీటింగ్ లో ఉన్నానని చెప్పిన రాజశేఖర్ యూనియన్ ఆఫీసులో ఈ రోజు జర్నలిస్టు సంఘం నేతలతో భేటీ జరపక తప్పలేదని సమాచారం. శ్రీనివాస రెడ్డి, అమర్, శేఖర్, సురేష్, కోటి రెడ్డి, యాదగిరి గార్లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు పక్కా సమాచారం. గంటన్నరకు పైగా ఇది సాగినట్లు తెలిసింది. 

 "ఎడాపెడా ఉద్యోగాలు తీసేయడం గురించి యూనియన్ నేతలు రాజశేఖర్ ను ప్రశ్నించారు. ఇది పధ్ధతి కాదని చెప్పారు. ఆ 20 మందిని విధుల్లోకి తీసుకుంటానని ఆయన మాట ఇచ్చారు," అని ఒక సీనియర్ జర్నలిస్టు వెల్లడించారు. నేతలు చెప్పింది విన్న రాజశేఖర్... రామచంద్ర మూర్తి గారు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తే స్పందించని మీరు... ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారని... ఒక దశలో అడిగినట్లు చెబుతున్నారు. దానికి నేతలు సరిగానే స్పందించారట. 

అలాగే... రాజశేఖర్ వచ్చాక హెచ్ ఎం టీవీ ఉద్యోగుల జీతాల నుంచే ఉద్యోగుల వాటా తో పాటు... యజమాని వాటా  ప్రావిడెంట్ ఫండ్ కట్ కావడం గురించి కూడా చర్చ జరిగిందని తెలిపారు. అన్ని టీవీ ఛానెల్స్ లో చేసినట్లే తనూ చేస్తున్నానని... రాజశేఖర్ వివరణ ఇచ్చారట. ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకోవాలని నాయకులు కోరారు. "రాజశేఖర్ గారితో ఒప్పంద పత్రం రాయించుకోలేదు. కానీ... ఈ రెండు విషయాల్లో (ఉద్యోగాలు పీకడం, పీఫ్ దోచేయ్యడం) దిద్దుపాటు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు," అని ఆ జర్నలిస్టు వెల్లడించారు. 

వేల మంది జర్నలిస్టులు వీధిన పడినా పట్టించుకోలేదని అపవాదు మూటగట్టుకున్న యూనియన్ నేతలు... ఇప్పుడు గట్టిగా వ్యవహరించడం హర్షణీయ పరిణామం. ఇక నుంచి ఏ ఛానెల్ లో నైనా జర్నలిస్టులు, టెక్నీషియన్ల ఉద్యోగాలు పోకుండా యూనియన్ పట్టించుకోవాలని విన్నపం. ఉద్యోగులను పూచిక పుల్లల్లా ఏరి పారేసిన యాజమాన్యాల కొమ్ములు వంచండి. జర్నలిస్టులను ఆదుకోండి సార్.  

జర్నలిస్టులారా...మంచి రోజులు వచ్చాయి. మీరంతా ఏకంకండి. కులం, మతం వంటి పిచ్చి భావాలు వదలండి. కడుపు ఆకలి ఎవరిదైనా ఒకటే. మీలో ఒకడు...వాడి డబ్బు కోసం, దర్పం కోసం ఉద్యోగాలు పీకుతూ మీ కుటుంబాలను వీధిన వేస్తే కళ్ళల్లో నీళ్ళు కుక్కుకుని కిమ్మనకుండా పడి ఉండకండి. మీ హక్కుల కోసం పోరాడండి. గతం గతః. తెలంగాణ రాజ్యంలో జర్నలిస్టు సంఘాలు మీ కోసం పోరాడతాయి. ఆల్ ద బెస్ట్. 

3 comments:

Unknown said...

journalist mahanubavulandharaki vignapthi
Cameraman,Video editor,drivers,PCR operators etc
aney punadhi meda meru nunchani unnaru.
vari andarani jagrathaka kapadukondi
mee punadhulani patistam cheskondi

I, me, myself said...

Are they removing the journalists just to harass them or to curtail the losses.

Is it suggestible to continue employees even if the firm is running in losses and make the whole firm bankrupt.

Ideally firms should terminate employes as per the employment agreement, if they deviate compensation should be paid and unions should work at enforcing this (to avoid long court battles). or else unions should stay away.

JE said...

సందర్భం వచ్చింది కాబట్టి ..ఇక్కద ఓ విషయం చానల్స్ గురించి చెప్పక తప్పదు .హెచ్ ఎం లో ఎవరిని ఎంతమందిని? తిసేసారో నాకైతే లెక్క తెలిదు కానీ ... హెచ్ ఎం =CVR అని తెలుస్తోంది ఎందుకంటే .ఽక్కద పికేసిన వాళ్ళలో చాలామంది cvr లో జాయిన్ అయ్యరు. అలానే cvr లో నుంచి వెళ్ళే వాళ్ళు హెచ్ ఎం లో జాయిన్ అవుతున్నారు ..సొ జర్నలిస్ట్ జాబ్స్ పికేసారు అని ఇప్పుడు కొత్త గ బాధ పదేవల్లందర్కి ఓ వినతి ..స్టూడియో-n , మహా , టీ న్యూస్ , v 6, లో తిసేసినప్పుడు ఎందుకు ఎవరు ( ఈ సదరు నేతలు స్పందించలేదు ) inews , మహా , స్టూడియో n , లో జీతాలు ఎప్పుడు సక్రమంగా ఇవ్వనప్పుడు ఎందుకు మాట్లాడలేదు/? అంటే ఇప్పుడు తెలంగాణా angle ని ముందుకు తెస్తే ఎవరు ఎం మాట్లాడలేరానా? ఎవరు కొత్త గ సీఈఓ నో ఎడిటర్ గానో జాయిన్ అవగానే వాళ్ళ టీం ని తెచుకుంటారు ..నొ డౌట్ .. చేతనైతే దాని మిద పోరాదే సతా ఉందా ?కొత్త గ ఈ రెండేళ్లలో పుట్టిన చానల్స్ లో గాడిద చాకిరీ చేయించుకుంటూ సాలరీ లు అడ్డ దిద్దం గ కట్ చేస్తూ ... ఎంట్రన్స్ లో నే ఫోన్స్ లాక్కుని వాళ్ళంతా చెక్ చేసి పంపించే చానల్స్ గురించి ఎందుకు మాట్లాడారు? ఒక నైట్ షిఫ్ట్ చేస్తే 24 గంటల తర్వాత కానీ ఇంకో షిఫ్ట్ వెయకుదధు. ఇన్సెంటివ్ ఇవ్వలి. అది ఎవరైనా ఫాలో అవుతున్నార? అసలీ _________ చానల్స్ లో పీ ఎఫ్ పేరుతో ప్రోప్రైటర్ ఫండ్ ల మింగేస్తుంటే ఒక్కడిన కంప్లైంట్ చేసారా? అల చేసిన్వల్లని జాబ్స్ రాకుండా చేసే ముండమోపి, కొజ్జ వెధవలే కానీ ( ఎం పర్లేదు ఎ మాటలు వాళ్ళకి కరెక్ట్ గ సరిపొతయి. లేదు అనుకుంటే ఇంకో _________ పెట్టుకోండి) .. అసలు ESI అని మనీ కట్ చేస్తున్నారు ఎవరికీ ఎంతమందికి కార్డ్స్ ఇచారు? ( మొన్న మద్య మన మిత్రులు సో కాల్డ్ ఘనమైన ఇమేజ్ సొంతం చేస్కున్న ఛానల్ లో hr ఇదే ప్రశ్న అడిగితే ఎవరు esi హాస్పిటల్ కి వెళ్ళటం లేదు అండీ అన్నట్ట ... అలాంటప్పుడు డబ్బులు ఎందుకు కట్ చేస్తున్నావ్ రా అని మనోడు అడగలేకపోయట్ట ) జనరల్ హెల్త్ ఇన్సురంచె ఏమైనా తగలబెదతర అంటి అది లేదు> ఇలా బెహవె చేసే వాళ్ళని ఎం చేయాలి? ప్రతి వాడు ఫేస్బుక్ లో ఓ తెగ నీతి కబుర్లు చెప్పి తగలబడుతుంటారు .. మనిషి పుటక పుట్టినోడేవాడు ఇలా చేయరు .. పైగా అందరు చేస్తున్నారు అని సమర్ధించుకుంటే ..ఽసుద్దమ్ తినే వెధవే ఇలా employee ఉసురు పొసుకున్తరు. అయితే ఇక్కడో విన్నపం
చేతనైతే ఈ అంశాల మిద మిగిలిన సో కాల్డ్ 24 చానల్స్ గురించి మత్లదలి. అంతే కానీ తెలంగాణా ఆంధ్ర అంటూ descrimination తిస్కురవడం దోర్జ్యన్యానికి ,,భావ దారిద్ర్యానికి , మింగలేక మంగళవారం కబుర్లు చెప్పడమే అవుతున్ది. కొన్ని బ్లాగ్స్, సైట్స్ ఓ తెగ కొన్ని చానల్స్ పై పది ఏడవడం కొన్ని చానల్స్ ని ఆకాశానికి ఎతేయడం తెగ చెస్తున్తయి. ఎవడి సైట్ వాడి ఇస్తమ్.. కాకపోతే ఇక సైబర్ క్రైమ్ పోలీస్ కాస్త ఆక్టివ్ గ ఉన్నారు కాబట్టి ..వితికి త్వరలోనే అడ్డుకట్ట పడుద్ది లెండి

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి