ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకునేసరికి...ఆంధ్రా ప్రాంతం వారు పెట్టుకున్న టీ.వీ.ఛానెల్స్ తమ నిజ స్వరూపాలను క్రమ క్రమంగా ఆవిష్కరిస్తున్నాయి. ఇందులో...TV-9 ప్రముఖంగా వుందని సీనియర్ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. ఇతర ఆంధ్రా పెట్టుబడిదారుల ఛానెల్స్ ఆచి తూచి అడుగు వేస్తూ...మాటర్ అఫ్ ఫ్యాక్ట్ గా వార్తలు ఇస్తుంటే...ఈ ఛానల్ బాహాటంగా ఆంధ్ర ప్రజలకు అజెండా నిర్దేశిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జర్నలిజంలో 'అజెండా సెట్టింగ్' అనే మాట ఒకటి ఉంది. సమాజ సేవ, జనోద్ధరణ పేరిట...ప్రజలు ఏమి చేయాలో మీడియా అజెండాలు నిర్దేశించే ప్రక్రియ అన్న మాట. ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకు చెరుకూరి రామోజీ రావు గారు ఇలానే సారాకు వ్యతిరేకంగా అజెండాను నిర్దేశించి 'ఈనాడు' సాధనంగా కొన్ని రోజుల పాటు ఉద్యమం నడపటం మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి కార్యక్రమమే మీడియాలో ఆరంభమవుతున్నది.
ఒక పక్క విశ్వ విద్యాలయాలు రగిలిపోతుంటే...తెలంగాణా వాదులు బలిదానాలు చేసుకుంటుంటే...ఛానెల్స్ బాధ్యతతో జాగ్రత్తగా డీల్ చేయాల్సింది పోయి రెచ్చగొట్టే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. "TV-9 వారు తెలంగాణాకు సమాంతరంగా ఆంధ్రా ఉద్యమాన్ని తేవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నిన్న 'సై ఆంధ్ర' అన్న ప్రత్యేక కార్యక్రమం, అందులో యాంకర్ రజనీకాంత్ అడిగిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యం," అని శనివారం నాడు హైదరాబాద్లో ధర్నా చేసిన జర్నలిస్టులలో ఒకరు అన్నారు.
'సై ఆంధ్ర' అన్న కార్యక్రమాన్ని రెండు సార్లు చూసిన నాకు ఈ వ్యాఖ్యలు నిజమే అనిపించాయి. రజనీకాంత్ మాటిమాటికీ..."ఆంధ్ర ప్రాంత నేతలు అక్కడి ప్రజలలో ఉన్న అభిప్రాయాలను ఎందుకు ప్రతిబింబించలేక పోతూ ఉన్నారు? ఎందుకు అర్థం చేసుకోలేక పోతూ వున్నారని మీరు భావిస్తూ ఉన్నారు?" అని ప్రశ్నించారు. ఒక దశలో...'జై ఆంధ్ర' ఉద్యమానికి మీలో ఎవరు నాయకత్వం వహిస్తారు? అని వసంత నాగేశ్వర్ రావు గారిని, టీ.జీ.వెంకటేష్ గారిని గుచ్చి గుచ్చి అడిగాడు రజనీకాంత్.
తెలంగాణాకు సమాంతరంగా అక్కడ ఎందుకు ఉద్యమం రావడంలేదు అన్న తపన, బాధ, దుగ్ద రజనీకాంత్ లో స్పష్టంగా కనిపించాయి. ఒకటి రెండు సార్లు స్టూడియోలో నేతలు చురకలు వేసినా మనవాడు పట్టించుకునే స్థితిలో లేడు. రజనీకాంత్ ఏ ప్రాంతం వాడా? అని నేను ఆలోచిస్తుండగానే...ఫోన్ లైన్లో కి వచ్చిన ఒక ఆంధ్రా నేత ఆయనను "మనం", "మనం" అని అనడం రెండు మూడు సార్లు వినిపించింది.
రజనీకాంత్ తీరు ఈ రోజు గన్ పార్క్ వద్ద ధర్నా చేసిన జర్నలిస్టు ల మధ్య చర్చకు వచ్చింది. TV-9 ప్రసారం చేసే చర్చలలో పాల్గొనకుండా వుంటే మంచిదన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తం అయ్యింది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే...తెలంగాణా కోసం ప్రాణాలు తీసుకున్న నల్గొండ విద్యార్ధి శ్రీకాంత్ ఆత్మహత్యకు పత్రికలు, ఛానెల్స్ ఇచ్చిన నామ మాత్రపు కవరేజ్.
ఇలా ఆత్మహత్య చేసుకున్న వారి గురించి ఎక్కువగా రాస్తే/ చూపిస్తే..అది ఇతరులను ప్రోత్సహించినట్లు అవుతుందని యాజమాన్యాలు భావించే...ఈ వార్తకు ప్రాముఖ్యం ఇవ్వలేదా? లేక...అవి ఈ బలిదానాలను తృణప్రాయంగా భావిస్తున్నాయా? అన్న ప్రశ్న కూడా చర్చకు వచ్చింది.
Saturday, December 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
20 comments:
mitrama..
andhra media pakshapatha dorani kallaku kattinattu kanipisthondi, kani deenni bayatapettenduku sariayina vedika ledhu. vere edaina issue ayithe ippudu govt paina unna badhyatha enti? emi cheyali? pariskaralu enti? ee samasya eppatinunchi undi? evaru evariki anyayam chesar? supreme court sakshiga telangana ela mosapoyindi.. ilanti kathanalu enduku ravadam ledho?
rajanikanth okkadi comments choosi comment cheste elaa brother. telanagana pai the best coverage only on tv9. ntv tv5, inews, sakhi andaru trs nu down play cheyadaniki try cheesaaru. kaani tv9 coverage choosi daariloki vachaaru.
నేను కూడా ఆంధ్రావాడినే కానీ ప్రత్యేక తెలంగాణాకి వ్యతిరేకం కాదు. ప్రత్యేక తెలంగాణా వస్తే హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించిన ఆంధ్రావాళ్ళ ఆస్తుల విలువ తగ్గిపోతుంది. మాకు హైదరాబాద్ లో ఎలాంటి ఆస్తులూ లేవు. హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించిన ఆంధ్రావాళ్ళు మహా అయితే 1% మంది ఉంటారు. ఆ 1% మంది ఆంధ్రావాళ్ళ ప్రయోజనాల కోసం 3 కోట్ల మంది తెలంగాణా ప్రజల సెంటిమెంట్లని కించపరచాలా?
"ఒక పక్క విశ్వ విద్యాలయాలు రగిలిపోతుంటే...తెలంగాణా వాదులు బలిదానాలు చేసుకుంటుంటే...ఛానెల్స్ బాధ్యతతో జాగ్రత్తగా డీల్ చేయాల్సింది పోయి రెచ్చగొట్టే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. "
ముందు మీరు తెలంగాణా ఉద్యమకారులు అంధ్రా సంస్థల మీదా, వ్యక్థుల మీదా చేస్తున్న దాడులను "బాధ్యతా రాహిత్యం" అని ఖండించి ఉంటే మీ బాధ ను అర్ధం చేసుకొనేవాడిని. తెలంగాణా వాళ్ళకు లేని బాధ్యత అంధ్ర వాళ్ళకు ఎందుకు. త్వరలోనే అంధ్ర ఉద్యమం ప్రారంభం కాబోతోంది. అప్పుడు మీడియా, రాజకీయులూ, బిజినెస్ మెన్ అందరూ నిశ్చయించుకోవాల్సి వస్తుంది వారు ఎటు వైపో.
హైదరాబాదు లో ఉండే అంధ్ర ఇండస్ట్రీలిస్ట్లు, తెలంగాణా లో వారి బిచణా ఎత్తక పోతే వారిని ఆంధ్ర లో నుంచీ తరమాలి. తెలంగాణా వాళ్ళకి అంధ్ర వాళ్ళ పెట్టుబడి కావాలి, వాళ్ళు సృష్టించే ఉద్యోగాలు కావాలి, కానీ అంధ్రా వాళ్ళు అంటే కడుపుమంట.
Dear,
I take objection to Rajani-kind of provocative journalism. He is a good journalist but he was too biased while dealing with this issue. Why should media dictate terms and put words in the mouths of leaders?
I condemn attack on any establishment or individuals. We must blame the government for messing up things. To the best of my knowledge, no individual from Andhra region was targeted by the Osmania students so far. Don't spread such canards.
--Ramu
Hi,
Please refer my post above.I have not told Osmania students targeted Andhra individuals. I told "udyama kaarulu". I can post umpteen links to this effect. A constable/police in kukatpally, another person in ameerpet and so on..
@Anonymous,
బాబు, నాకు అర్థం కానిది ఒక్కటే, తెలంగాణా కి మద్దత్తు తెలిపితే దాని పర్యవసానంగా ప్రత్యేక అంధ్రా ఒస్తుంది కదా, మల్లీ దానికి ప్రత్యేక ఉద్యమం ఎందుకు, తెలంగాణా రావడానికి కృషి చెయ్యండి, అంధ్రా దానంతట అదే ఒస్తుంది.
మీ కుట్రలు ఎవరికి తెలియవు సారు, ఇలా ఇంకో ఉద్యమం లేవదీసి తెలంగాణా విషయాన్ని పక్క దారి పట్టిచే కుట్ర ఇది
Phani
రామూగారూ
టీవీ-9 పై మీ బాధ అర్ధం అయింది. మరి మిగతా చానల్స్ ఉద్యమ చేస్తున్న వారికన్న ఎక్కవుగా వారి అభిప్రాయాలు వీరే చెప్పేస్తున్నప్పుడు గుర్తుకురాలేదా? తెలంగాణా ఉంద్యమం అంటేఏమిటో తెలియనివారికి మైకులిచ్చి తెలంగాణా అగ్నిగుండం అయిపోతుందని చెప్పించినప్పుడు ఏమయింది? పక్షపాత ధోరిణి మీ మాటల్లో ఎలా ఉందో మీడియలో కూడా ఉండడం సహజం.
అయ్యా ఫణీ,
మీ తెలంగాణా వస్తే మాకేంటి రాకపోతే మకేంటి. తెలంగాణా ఎంత తొందర గా విడిపోతే అంత మంచిది. మాకు కావలసింది ప్రత్యేక ఆంధ్రా. దాంట్లో మళ్ళీ మాకు రాయలసీమ వద్దు. వాళ్ళని చేర్చుకొంటే మళ్ళీ తరవాత మీ లాగే లొల్లి మొదలెడతారు. తెలంగాణా వచ్చినంత మాత్రాన ఆంధ్రా వచ్చినట్లు కాదు. రాయలసీమ వద్దు అంటం మళ్ళీ ఓ ఆంధ్రా కుట్ర అంటే నేనేమీ చెప్పలేను. ఇంకో విషయం ఏమిటంటే రాష్ట్రం విదిపోయే సమయంలో, ఆస్థుల పంపకాలు ఉంటాయి కదా, తెలంగాణా ఉద్యమానికి కౌంటర్ వెయిట్ గా ఇక్కడ ఒక ఉద్యమం లేక పొతే, ఆంధ్రా కు దగా జరుగుతుంది ఖచ్చితం గా. ఇప్పటికే మా నాయకమ్మణ్యులు రాజకీయ ఇంపొటెన్సీ తో బాధ పడుతున్నారు. కె సీ ఆర్ లాంటి వాడి మాటల్ని మౌనం గా భరిస్తున్నారు. వాళ్ళ కు కొంచం కదలిక రావాలంటే ప్రత్యెక ఆంధ్రా ఉద్యమం అవసరం.....
Ramu: you are definitely biased on this topic. Better leave the topic for the sake of the agenda - Naitika Journalisam - of your blog.
Remember, when you refer to Srikanth's suicide as "balidaanam", you are not even thinking like a journo, forget abt ethical journalism. Just think about his age, his social situation, his academic background, his employability, his maturity of thinking. If a foolish, immature and irresponsible kid of devastated parents dies for a completely irrelevant reason, no human should call it as "balidaanam".
You, the self proclaimed journalist, should educate these kind of students on the irrelevance of these agitations to student bodies.
i came across this copy of your blog.
http://voiceofjasmine.blogspot.com/2009/12/tv-9.html
fyi
టీవీ 9 ఆంధ్రా వాళ్ళను సపోర్ట్ చేస్తుందని మీరు బాధపడుతున్నపుడు మీరు నిష్పక్షపాతంగా ఉండాలి. కానీ ఆంధ్రా జనంపై విషం కక్కుతున్నారు మీరు. మీకు ఇంకొకరిని వేలెత్తి చూపే హక్కూ లేదు, మీడియా పక్షపాతాన్ని విమర్శించే హక్కూ లేదు. ఈ విద్వేషానికి మీరేమీ అతీతులు కాదుగా!
If telangaana students resort to suicides, it'smore of the responsibility of the students' parents and lecturers to persuade then not to resort to such drastic steps. Media has some responsibility.But it is only secondary to that of parents and lecturers. If parents and lecturers themselves are proud of the suicides,(this means that they have overcome their affection to the kids lives in favor of Telangana movement) then why should media bother.
"balidaanam gurinchi"
Ayya/amma..
I've taken utmost care while drafting this particular post. If you read my post again, you will understand that I was only referring to the discussion that had taken place at Gunpark. I sincerely suggest you to observe the usage of words in the last but one paragraph (aatmahatya) and the last paragraph (balidaanam). Don't come to quick conclusions brother/sister
Cheers
Ramu
రాము సార్,
రజని అలా చెయ్యడం వెనుక యాజమాన్య ప్రమేయం లేదంటారా? ఈ రోజు చుడండి.. త్వ్ 9 బిగ్ బాస్... తెలంగాన పెద్దల తో చర్చ పెట్టి క్చ్ర్ దీక్ష విరమంచడానికి చేసిన ప్రయత్నం.. నాకు అర్దం అయ్యింది ఎమంటే .. ప్రభుత్వానికి ఈ విషయం లొ రవి ప్రకష్ అమ్ముడు పొయాడంటాను .. మీరెమంటారు? మీడియ ఎం చెయ్యాలి.. ఎం జరిగిందొ.. ఎం జరుగుథుందొ చెప్పాలి.. అంథె కాని దీక్ష విరమణ మేటర్ లొ ట్వ్ వేలు ఎందుకొ.. నాకర్దం కావట్లా
www.voiceofjasmine.co.cc
ayya: point taken.
But, still you are biased.
When you see Rajanikant's talk, you find fault with him & Tv9.
But when you see journo's talking at gunpark, you just "reported" that. You didnt find "fault" with their thought process.
/brother.
Brother Ramu
I think you should try and do a post on the comments you are receiving with regard to Telangana. Look at the intolerance. I find that most of the journalists posting their comments as 'anonymous'have complete hatred towards the issue of Telangana. What is interesting is the way the so called journalists have ignored to do their home work. If they want to stay beyond emotions and do justice to the profession, they should know a bit of history. Without understanding the reason for the Telangna movement, if they start participating in debates like these, it is waste of your time. If you think you are from Andhra and not from Andhra Pradesh, please leave this place. Get the message straight and clear.
ramana
Brother Ramana:
Talking abt history, reminds me Vajpayee's famous statement. "if you want to make kashmir as mool muddha (core issue) then muddha ka mool taq jaana padega"
So, all those who are talking abt 1950, 60s 70s etc.. go back till Satavahana Kingdom, when all this area was ruled from krishna/guntur/amaravati.
Next, you un-biased journalists find fault with raj thakrey, but ask for 610 GO here. You great telangana supporters, please clarify how different a 610 go is from mulki?
also, when you ask for mulki & other pre 1950 system, why dont you ask for all Nizam atrocities? Why dont you want your pre 1950 tragedies along with Telangana for you? Why dont you see any reason in Owaisi's arguments.
Those morons Owaisi/Nizam etc were Royals in the pre 1950 jamana! shall we restore their royalty and you all be the secondary citizens under muslim power.
next, if non-development is the reason for the Telangna movement please understand that, your (adilabad/karimnagar etc) plights are nothing different from the plights of the people in Srikakulam or Kurnool, prakasam.
And for the lack of development, pl. strip your KK, VH, DS, Kaka and many such great Telangana fighters. These idiots are great at licking high command and try to groom/save their next generation.
Finally, if you are on a forum, dont expect that everyone will have sweet words for you. and dont assume that all those who speak against you did not get the message straight and clear.
ennatikaina dharmame jayisthundi.. chattam chethullo undani virraveeginavaalla paristhithini charithralo chaduvukondi. dharmaniki, nyayanike anthima vijayam
Very interesting observation. I do agree that like all other media outlets, TV9 is playing concealed bias towards to seperation (i think for Telangana or Andhra).
I would like to point some observation a week after YSR death, please watch KCR interview on TV9 right after the YSR death where KCR was in dilemma how to lead movement and he slipped his tongue on live TV9 interview that he would consult TV9 Ravi Prakash for strategies. I don't remember the date, but it was right after YSR death. Somebody please bring that clip out and see the nexus between TV9 and KCR.
Well, if Telangana seperatists blames all other media outlets for bias I would say TV9 is no exception. Why do it in concealed fashion.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి