ప్రత్యేక తెలంగాణా ఎప్పుడు వస్తుందో...అసలు వస్తుందో..రాదో తెలియదు కానీ...వర్క్ ప్లేసులలో, కాలనీలలో, వీధుల్లో, పార్కుల్లో, క్యాంటీన్లలో, పబ్బుల్లో, క్లబ్బుల్లో...ఎక్కడపడితే అక్కడ ఇది పెద్ద చర్చనీయాంశమయ్యింది. బ్లాగుల్లో తెలంగాణా అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వాడివాడిగా, వేడివేడిగా రాతల యుద్ధం జరుగుతోంది.
ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్న సహోద్యోగులు...ఇప్పుడు ప్రాంతాల వారీగా విడిపోతున్నారు. కొన్ని చోట్ల వాదప్రతివాదాలు జోరందుకున్నాయి. సాక్షాత్తు హైకోర్టు ఆవరణలో లాయర్లు ప్రాంతాల వారీగా విడిపోయి...చొక్కాలు చించుకునే వరకూ వెళ్లారు. జర్నలిస్టు సొంత అభిప్రాయాలు కలిగి వున్నా...వృత్తిలో వాటిని ప్రతిబింబింపకూడదు...నిష్పాక్షికంగా వార్తలు నివేదించాలి...అని గట్టిగా నమ్మేనన్ను....'నువ్వు అటా? ఇటా?' అని కొందరు సన్నిహిత మిత్రులు సంభాషణకు ముందే గట్టిగా అడిగారు. వారి వాదనలు వింటే... ఆవేశకావేశాలు పెచ్చరిల్లాయని అవగతం అయ్యింది. ఎన్నడూలేనిది....ఈ మధ్య జర్నలిస్టులలో కూడా ప్రాంత పరమైన చీలిక కనిపించింది.
ఇన్నాళ్ళూ...హైదరాబాద్ కేంద్రంగా వున్న దాదాపు అన్ని పత్రికలు/ ఛానెల్స్ లో యాజమాన్యాలు ప్రాంతాలను బట్టి నిర్ణయాలు చేశాయన్న విమర్శ ఉంది కానీ...జర్నలిస్టుల మధ్య ఇలాంటి బేధాభిప్రాయాలు భారీగా ఉన్న దాఖలాలు గతంలో లేవు. ఇప్పుడు అది ప్రారంభమయ్యింది, ప్రమాదకర స్థితికి చేరుకున్నది. ఇలాంటి చర్చలలో ఎవరి వాదన వారు బలంగా వినిపించి...ఎవ్వరూ పైచేయి సాధించలేక... ఆ తాలూకు ఉక్రోషంతో బుసలు కొడుతూ ఆ పూటకు వీడ్కోలు పలుక్కుంటున్నారు.
జార్జ్ బుష్ "మీరు అటు వైపో...మా వైపో తేల్చుకోండి" అని హూంకరించినట్లు ..ఇప్పుడు ప్రాణ మిత్రులు సైతం..."నువ్వు ప్రో నా? యాంటీ నా?" అని బాహాటంగా అడుక్కుంటున్నారు. వాదులాడుకుంటున్నారు. ఇతరుల వాదనలలో లాజిక్, మెరిట్ లను వినే తీరిక, ఓపిక....అభిప్రాయాలు మార్చుకునే పెద్ద మనసు ఎవ్వరికున్నా యిప్పుడు?
ఇక బ్లాగుల్లో ఇన్నాళ్ళు సరదా సరదా విషయాలు రాసి అలరించిన వాళ్ళు...ఉద్యమంపై తమ అభిప్రాయాలు నిర్మొహమాటంగా రాసి పెద్ద చర్చకే దారి తీస్తున్నారు. ఉద్యమం-మీడియా గురించి నేను రాసిన పోస్ట్ కు ఏ ఇతర పోస్టుకు రానన్ని కామెంట్స్ వచ్చాయి. పేరు రాసుకోడానికి జంకే...'అనానిమస్ రాయుళ్ళు' అన్ని బ్లాగుల్లో చెలరేగిపోతున్నారు.
ఈ బ్లాగుల్లో వివిధ అంశాలపై అద్భుతమైన పోస్టులు వచ్చినా చాలా తక్కువ కామెంట్స్ వచ్చేవి. అదే తెలంగాణా, ఆంధ్ర గురించి రాస్తే...పెద్ద సంఖ్యలో వ్యాఖ్యలు వస్తున్నాయి. అగ్గిరేపుతున్నాయి. ఇప్పుడు ఏమి రాద్దామన్నా...అది ఎవరి మనోభావాలను నొప్పిస్తుందో....అనిపిస్తున్నది.
ఇది "చిదంబర రహస్యం"... ఇది ఎప్పుడు తేలి...అందరి మనసులు ఎప్పుడు తెలికపడతాయో వేచి చూడాల్సిందే. ఈ గొడవ మూలంగా సుదీర్ఘ స్నేహాలు, మంచి బంధాలు విడిపోకూడదని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.
Sunday, December 13, 2009
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
అన్ని రకాల రాతలు రాసి పెద్ద రచయిత అనిపించుకున్దామని
అవునండి. కొంతమంది నా బ్లాగు మిత్రులు కూడా నాకు దూరం అవుతున్నట్టున్నారు. వ్యక్తిగత భావాలు ఎలా వున్నా స్నేహాల మీద ప్రభావం వుండకూడదు. ఏది వ్రాస్తే ఎవరి మనస్సు నొప్పిస్తామో అన్న మీ సంశయం అర్ధం చేసుకోదగ్గదే కానీ ముందు మన భావాలు వెల్లడించలేకుండా మన మనస్సుకి నొప్పి కలిగించకుండా చూసుకోవడమే బ్లాగు వ్రాస్తున్నప్పుడు ప్రధానం కావాలి. నేనయితే వ్యక్తిగత స్నేహానికన్నా భావస్వేఛ్ఛకే ప్రాధాన్యత ఇస్తాను.
ఎంతటి ప్రాణమిత్రులకైనా ఏదో ఒక విషయంలో బేదాభిప్రాయాలు రాక తప్పదు. కేవలం బ్లాగ్ మిత్రుల సంగతి సరేసరి. రాష్ట్ర విభజన విషయంలోనూ అంతే. కాకపోతే ఇవి అంత తేలికగా తేలే వివాదాలు కాదు కాబట్టి తెగేదాకా లాగకుండా అనుబంధాలని పటిష్టపరుచుకోవాలన్నది నా అభిమతం. అందుకనే నా బ్లాగులో అసలు ఈ అంశం గురించి టపా రాయనే లేదు.
టి.వి. చానెళ్ళు లేని సమైక్యవాదాన్ని ఉన్నట్టు చూపించాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో బంద్ అంతగా జరగలేదు. నేను ఉండేది శ్రీకాకుళం పట్టణంలోనే. పట్టణంలో రాజకీయ గూండాలు రోడ్ల మీద కనిపించిన తరువాత షాపులు మూసి, గూండాలు వెళ్ళిపోయిన తరువాత షాపులు తెరిచారు. విజయనగరంలో కూడా అదే జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో బంద్ పాక్షికం అనే "వార్త" దిన పత్రికలో మాత్రమే వ్రాసారు. టి.వి. చానెళ్ళలో మాత్రం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో బంద్ సంపూర్ణం అని చెప్పారు. టి.వి. చానెళ్ళ ఓనర్లు కోస్తా ఆంధ్రవాళ్ళు కావడం వల్ల చానెల్స్ లేని సమైక్యవాదం ఉన్నట్టు చూపించాయి. "వార్త" దిన పత్రికలో మాత్రం కొన్ని నిజాలు వ్రాయడం జరిగింది. ఎందుకంటే ఆ పత్రిక పబ్లిషర్ గిరీష్ సంఘీ కోస్తా ఆంధ్రవాడు కాదు.
Ninnati daaka leni godava ippude enduku vacchindi..? ramu nee opiniontho nenu ekeebhavisthanu. Jouranist ku prateeya vadalu undaradu. Mundu manamanta Indians. aa mata marachi jillala vareega kottukune paristhithi techukovadam sochaneeyam. Rastram vidipoyinaa leka kalasi unna mana bandhalu vidipotayaa mitrulara..? Eee rajakeeeya vasanalu manakenduku..?
Hari
Dear Ramu, Congrats for maintaining a good blog. The leaders of ‘four’ rich districts feel people of North Andhra are also human beings and Telugus whenever they want to implement their hidden agenda in the name of so called self respect. Big brothers never allowed growth either in Andhra or in Telangana.
The so called United Andhra leaders are real victims with the fall in value of their properties in Hyderabad. They encouraged KCR agitation with the support of Andhra media to unpopular Rosaiah. With the sudden announcement of Telangana, they were shocked and clueless on how to respond to the move. Plz post it in the blog since everybody should know the feelings. It will lead to a healthy discussion.---
ks
Dear Ramu, Congrats for maintaining a good blog. The leaders of ‘four’ rich districts feel people of North Andhra are also human beings and Telugus whenever they want to implement their hidden agenda in the name of so called self respect. Big brothers never allowed growth either in Andhra or in Telangana.
The so called United Andhra leaders are real victims with the fall in value of their properties in Hyderabad. They encouraged KCR agitation with the support of Andhra media to unpopular Rosaiah. With the sudden announcement of Telangana, they were shocked and clueless on how to respond to the move. Plz post it in the blog since everybody should know the feelings. It is a healthy discussion.
anna
You are right. I feel sorry for being in this kind of a situation. Best of the journalists too are taking extreme stands. The other day I had an argument with a senior journalist in an English daily. Just for argument, I suggested that Andhra with about 970 kms of coast line, four airports and three well developed ports has a potential to grow 10 times and overtake Gujarat in terms of investments. Andhra (read AP) is the only state which is not able to utilise the potential of having the long coast line. No where in the world a port is so misused. Look at some of the 'towns' like Kakinada, which are actually being turned into slums despite being on the coast. My feeling is that the poor development is purely due to the politicians focusing completely on Hyderabad and real estate. On hearing this argument, the senior journalist immediately said that I was presenting an argument only to send away the people from Andhra. I never meant that.
Ramana
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి