Wednesday, December 9, 2009

i-news అవుట్ పుట్ ఎడిటర్ గా బుడన్

ఇన్నాళ్ళు TV-5 లో అవుట్ పుట్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన బుడన్ మంగళవారం నాడు i-news అవుట్ పుట్ ఎడిటర్ గా చేరాడు. మదనపల్లి లో 'ఈనాడు' లో కంట్రిబ్యుటర్ గా జర్నలిస్టు జీవితం ఆరంభించిన బుడన్ 1992 లో 'ఈనాడు జర్నలిజం స్కూల్' లో జర్నలిజంలో డిప్లొమా పొందాడు.

ఆనాటి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ బూదరాజు గారు బుడన్ ను బాగా అభిమానించేవారు. ఎన్ని ప్రతికూల పరిస్ధితులు ఎదురైనా...కష్టపడి పనిచేసిన బుడన్ 'ఈనాడు' లో 'ఈ-టీవీ' లో కీలక బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాత TV-5 లో చేరాడు. కొమ్మినేని శ్రీనివాసరావు, కందుల రమేష్, వెంకట కృష్ణయ్య, బుడన్ తదితరుల సమన్వయంలో బండి బాగానే నడిచింది. శ్రీనివాస రావు, రమేష్ గార్ల నిష్క్రమణ తో..ఆ ఛానల్ లో కొన్ని మార్పులు జరిగాయి.

కారణాలు ఏవైనా...బుడన్ ఇప్పుడు i-news లో మంచి పదవిలో చేరాడు. ఐ-న్యూస్ కు కళ్ళూ, ఒళ్ళూ తనే అయి నడిపిన రాజశేఖర్ అనూహ్య పరిస్థితుల నడుమ ఎన్-టీవీ కి వెళ్ళిపోవడం...తాను నమ్మిన బంట్ల లాంటి సిబ్బంది కొందరిని తనతో పాటు తీసుకుపోవడంతో ఐ-న్యూస్ లో ఏర్పడిన పెద్ద అగాధాన్ని పూడ్చే బాధ్యత ఇప్పుడు బుడన్ పైన కూడా వుంది.
విష్ యు గుడ్ లక్ బుడన్ భాయ్.

4 comments:

Anonymous said...

venkata said...

Budan anna
Good luck.
ramana

Anonymous said...

Introverts like Budan cannot do any good for any channel.He is good for print media,and electronic media demands a bit of dynamisum and aggression.However.my best wishes to him whereever he is.

Naresh said...

Ramu garu... chivariki Budan meeda kooda nalugu manchi mukkalu rayagaligarantey, mee goppadananni abhinandincha kunda vundaleka potunnaa.

ravi said...

అంత సీన్ లేదు అక్కడ బుడాన్కు. అసలు ఎలక్ట్రానిక్ మీడియాలో ఏం తెలువది. అయినా కందుల రమేష్ గారు ఎలా దగ్గరికి రానిచ్చుకున్నారో అర్థం కావడం లేదు. బుడాన్ అక్కడ పొడిచేది ఏమీ లేదు. అయినా బుడాన్ లాంటి వారి గురించి మీ బ్లాగ్ లో రాసారంటే... మీ మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థమవుతోంది.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి