రెచ్చగొట్టే మాటలు, అభ్యంతరకర వ్యంగ్యాస్త్రాలు, చులకన-ఛీత్కార భావనలు లేకుండా... మతిస్థిమితం-నిగ్రహం కోల్పోకుండా... కేవలం వాస్తవాలతో కూడిన వాదన చేయడం హుందాతనం, ప్రయోజనకరం. తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర్ రావు గారు శనివారం ఈ పని చేసారు.
రజనీకాంత్ యాంకర్ గా TV-9 ఈ రాత్రి రెండుగంటలకు పైగా కే.సీ.ఆర్.తో స్టూడియో లో జరిపిన లైవ్ కార్యక్రమం చాలా అద్భుతంగా సాగింది. నిమ్స్ లో నిరాహార దీక్ష తర్వాత...ఎందుకో గానీ...కే.సీ.ఆర్.గారిలో పరిణితి ఎక్కువగా కనిపించింది. రజనీ ప్రశ్నలు...కే.సీ.ఆర్. జవాబులు...కొందరు ప్రజలు ఫోన్ లో లేవనెత్తిన అంశాలు...అదిరిపోయాయి.
"అన్నా...నేను కరుడుగట్టిన సమైక్య వాదిని. ఈ ఇంటర్వ్యూ చూశాక...తెలంగాణా విషయంలో అభిప్రాయం మారింది, కే.సీ.ఆర్.వాదన సరైనదే అనిపించింది," అని విజయనగరానికి చెందిన ఒక సన్నిహిత మిత్రుడు ఫోన్లో చెప్పాడు.
పూర్వాశ్రమంలో జర్నలిస్టు అయిన ఈ మిత్రుడు...ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందిగా ఒక డజను మందికి ఎస్.ఎం.ఎస్.లు ఇచ్చాడు. కే.సీ.ఆర్. నిగ్రహం కోల్పోకుండా..ఎవ్వరినీ దూషించకుండా వాస్తవాలను ప్రజెంట్ చేయడం...దానికి ఆధారం చెప్పడం...మన మిత్రుడికి నచ్చింది.
నాకు కూడా "కే.సీ.ఆర్. ఎట్ హిజ్ బెస్ట్" అన్న భావన కలిగింది...ఈ ఇంటర్వ్యూ చూశాక. నేను కే.సీ.ఆర్.గారి ప్రెస్ కాన్ఫరెన్సులు, ఒకటి రెండు మీట్-ది-ప్రెస్ లు హాజరై రిపోర్ట్ చేశాను గాని....ఈ రోజు కార్యక్రమంలో ఆయన కనబరిచిన హుందాతనం, తర్కం బాగా నచ్చాయి. ఆంధ్రా ప్రాంతం వారిని పిచ్చి పిచ్చి మాటలతో తిట్టకుండా..వారిని మాటిమాటికీ దోపిడీ దార్లని, వలస వాదులని నిందించకుండా ఉండి...ఇంతే లాజిక్ గా వాదన చేసి ఉంటే...ఈ రాజకీయ పరిణామాలు ఈ భుగభుగల స్థాయికి వచ్చి ఉండేవి కాదు కదా అనిపించింది. ఏకమొత్తంగా ఒక ప్రాంతాన్ని దూషించడం, కించపరచడం సభ్యత కాదు.
రజని అడిగిన కొన్ని ప్రశ్నలు ఇరిటేట్ చేసివిగా ఉన్నా...కే.సీ.ఆర్. బ్యాలెన్స్ కోల్పోకుండా సమాధానాలు ఇచ్చారు. లగడపాటి రాజగోపాల్ గారి మాట ఎత్తితేనే ఏదో ఒక వ్యంగ్య వ్యాఖ్య చేసే ఆయన..."నా సహచర ఎం.పీ.గారికి దేశంలోనే ఉత్తమమైన చికిత్స అందించాలి. అది నిమ్స్ అయినా సరే..మరేదైనా సరే," అని సీరియస్ గానే చెప్పారు. భాగో, భీగో, చంపుతా, నరుకుతా అనడం కన్నా...ఇలా మానవత్వం తో మెలగడమే గొప్ప. ఇదే స్ఫూర్తి తో గులాబి దళం ముందుకు సాగాలని, వర్క్ ప్లేస్ లలో మనం కూడా కొట్టుకు చావకుండా...స్నేహాన్ని కొనసాగించాలని ఆశిద్దాం.
కే..సీ.ఆర్. ఇంటర్వ్యూ మీరు కూడా చూస్తే...నిష్కర్షగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. సరదాగా దీనిపై చర్చ సాగిద్దాం. మనం కూడా వ్యక్తిగత దూషణలకు దిగకుండా చర్చించుకుందాం...రండి.
Sunday, December 20, 2009
Subscribe to:
Post Comments (Atom)
27 comments:
ramu garu really kcr interview chala bagauandi but rajani anchoring very babadabada
yes, it was very convincing. But, it was not all true.
1) he did ridicule seemandhra
udyamas as sponsored udyamas
2) GO 1853 act was also rebuffed in blogs.
3) avg. rain fall has decreased. which statistics was he quoting. it is very easy to quote selective stats to support arguments
4) he said, "forming a state is very easy". really, i wonder?
5) he said, "chidambaram made the announcement with UPA knowledgeb blah....." but upa allies were furious that they were not consulted on that matter....
and many more like this...
if you watch carefully, there will be a lie in every sentence he uttered...
but it was a very very convincing interview. i will be surprised if there will any samikhya telanganites left after this speech.
and btw, restoring the status-quo to 1951/52 is just impractical. hyd. and surroundings socio-eco- profile has changed very much. in a nut-shell, separation is not game of lego blocks.
he painted a very much rosy picture for telangana. he is super smart in declaring dalit-CM if a new state is formed.
GOD, save this country....
మీకు ఎందుకు అంత బాగా నచ్చిదంటే..
మీరు జర్నలిస్టు కోణంలో చూడ్లేదు. తెలంగాణ అబిమానిగా చూశారు. దీక్ష తర్వాత కేసీయార్లో పరిణతి అంటున్నరు.. దీక్ష తర్వాత ఇంటి దగ్గర అతడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాడిన పదజాలం కేసీయార్ పరిణతికి నిదర్శనమని మీరనుకుంటే నేనేమీ చెప్పలేను. టీవీ 9 ఇంటర్వూ లో ఎక్కడా సంయమనం కోల్పోలేదన్నారు. ముంబయి నుంచి శాస్త్రి అనే వ్యక్తిని మూర్కుడు, అవివేకి అని దూషించాడు. . కేసీఆర్ తెలివైనోడు సందేహం లేదు. కానీ పరిణతి అనే మాట సరికాదు. అతడో ఫక్తు రాజకీయ నాయకుడు.
ఇక కేసీయార్ మాటలు ప్రత్యక్షంగా వినడం మీ విజయ నగరం మిత్రుడికి కొత్తలా ఉంది. కాస్త పాత క్యాసెట్లు పంపించండి. అక్కడ కూడా ప్రత్యేక ఉత్తరాంధ్ర అంటాడు ఇక వాస్తవాలు సారీ.. ఫ్యాక్ట్స్ అని పదం కూడా ఓ చోట వాడారు. ఓ రాజకీయ నాయకుడు మాట్లాడినవే వాస్తవాలు.. ఎలా అనుకుంటున్నారో నాకర్థం కావడం లేదు. వాటిని ఎవరు వెరిఫై చేయాలి. . అతడి మాట్లాడితే చరిత్ర కారుడు మాట్లడినట్టే అనుకుంటున్నరా ఏంటి. మీరు జర్నలిజంలో ఉన్నారు. అలాంటి వ్రత్తిలో ఉన్న మీరు నాణేనికి ఒక వైపు చూడడం.. ఆ ఒక వైపున్నది సత్యమన్నట్లు రాయడం ఎంత వరకు సమంజసం.
ఏం చేస్తాం అందరూ రెండు వర్గాలగా విడిపోయారు. నేను కూడా విడిపోయానంటే ఏం చెప్పలేను. కేసీయార్ ఆడి కారు గుర్తుందా మీకు. దాని మీద టైమ్స్ ఆప్ ఇండియా స్టోరీ. ఇక ఎన్నికల్లో అతడు డబ్బులకు టిక్కెట్లు ఎలా అమ్ముకున్నది నేను మీకు చెప్పక్కర్లేదనుకుంటా.. దీనికి మిగతా పార్టీల మినహాయింపని నేను అనడం లేదు. కానీ ఒక ఉద్యమకారుడిలో ఉండాల్సిన నిజాయతీ కేసీయార్ కి ఉందా లేదా మీరో నిష్కర్షగా చెప్పండి. అతడు రాజకీయమంతా దారి తప్పే సాగిందని నేను చెప్కక్కర్లేదు. మీకు కూడా తెలుసు. కాబట్టి కళ్లకు కట్టుకున్న వాదం గంతలు.. అది ఏ వాదమైనా సరే.. ముందు తీయండి. రాముగారిలా ఆలోచించండి. ఈ టపా రాయడం సరైందో కాదో తేలుతుంది.
ఇక చివరగా ఎస్సెమ్మస్లు గురించి రాశారు. చందమామ కథలు పిల్లగాళ్లకి చెబితేనే బాగుంటుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత ఈ సంక్షిప్త సందేశాలు ఎవరు.. ఎందుకు పంపిస్తున్నరో అందరికి తెలిసిందే. మీకు కూడా తెలియదని అని నేను అనుకోను. అయినా ప్రస్తావించారు. కాస్త టపాలు రాసేటపుడు మీరు పెట్టుకున్న కొన్ని నిబంధనలకు లోబడి ఉందా లేదా అని చెక్ చేసుకుని రాయండి. అప్పడు టపాకి విలువంటుంది. మీకు కూడా.
ఇక చివర్లో నిష్కర్షగా రాయండి అని ముగింపిచ్చారు. ఆ పనేదో మీరు ముందు చేసి.. అప్పడు చర్చకు ఈ అంశాన్ని పెడితే బాగుండేది.
కేసీఆర్ టీవీ 9 ఇంటర్వ్యూ (డిసెంబర్ 19 ) మీరన్నట్టు చాలా హుందాగా, అర్ధ వంతంగా వుంది.
తెలంగాణా సమస్యను అర్ధం చేసుకోవాలని నిజాయితీగా ప్రయత్నించే వారికి అదొక నిఘంటువే.
చెన్నయ్ లో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి, ముంబైలో అమెరికాలో పనిచేస్తున్న మరో ఇద్దరి భయాలను పటాపంచలు చేస్తూ, వారి ఆరోపణలను ఖండిస్తూ చెప్పిన సమాధానాలు చాలా ఆలోచింప జేసేలా వున్నాయి.
చెన్నయ్ లో పనిచేసే వ్యక్తికీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందట ఇక్కడికి రావాలంటేనే భయంగా వుందట. అతను తమిళ రాజధాని చెన్నయ్ లో మాత్రం ఏ భయం లేకుండా వుండగలుగుతున్నాడు. Amazing.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ను పాకిస్తాన్ దేశ ఏర్పాటుతో పోలుస్తూ, తెలంగాణా ప్రజల్ని తెలబాన్లు గా చిత్రిస్తూ , సాక్షాత్తూ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా తెలంగాణా ఏర్పడిన తరువాత మీరు హైదరాబాదు వెళ్ళా లంటే వీసాలు తీసుకోవాల్సి వస్తుంది అని చేసిన గోబెల్ ప్రచారాలు ఆంద్ర ప్రాంతం వారి మనసులను ఎంతగా భయకంపితులను చేసాయో, వారికి తెలంగాణా పట్ల ఎంత ద్వేషాన్ని కలిగించాయో కదా అనిపించింది.
ఇప్పటికీ సమైక్య ఆంద్ర రాజకీయ అవకాశవాద నేతలు తెలంగాణా వస్తే హైటెక్ సిటీ లో మీకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు రావు, అక్కడ ఇప్పటికే వున్న ఆంధ్రా వాళ్ళంతా వెనక్కి వచ్చేయాల్సి వస్తుందని దుర్మార్గమైన ప్రచారం చేసి విద్యార్ధులను రెచ్చ గొడుతున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు హైదరాబాద్, చెన్నయ్, బెంగుళూరు అమెరిక అనే తేడ ఏమీ వర్తించదని ఈ మూర్ఖులకు తెలుసు. అయినా కావాలని ఈ దుష్ప్రచారం. చాలా మంది అమాయకులు వారి మాటలు నమ్మడం బాధాకరం గ వుంది.
డియర్ ఫ్రెండ్స్,
నమస్తే
వ్యక్తిగత దాడులు వద్దు సార్. నేను...నాకున్న కొద్దిపాటి అవగాహనా శక్తితో పోస్ట్ రాసాను. చర్చకు ఆహ్వానించాను. "నువ్వెందుకు అలా రాసావ్?" అని అనడం...ఏదో బురదజల్లడం కన్నా...కే.సీ.ఆర్.వాదనలో మెరిట్, డీ మెరిట్ గురించి రాయండి, దయచేసి. ఆయన తప్పుడు డాటా ఇస్తే...దుమ్ము దులపండి. సత్యమే మన ఆయుధం, సత్యమే మనం పలుకుదాం.
పైన ఒక మిత్రుడు పాయింట్స్ వారీగా రాయడం నాకు బాగా నచ్చింది. ఇలా ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరుపుదాం. తెలంగాణా ఉద్యమం అంటేనే కే.సీ.ఆర్. కాదు. నేను కే.సీ.ఆర్. అభిమానినీ కాదు. (ఒక వేళ నిజంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే) "ముఖ్యమంత్రి ఒక దళితుడు" అని ఆయన పునరుద్ఘాటించడం హర్షణీయం అనిపించింది.
"బంగారు తునక''గా కే.సీ.ఆర్. వర్ణించిన తెలంగాణా తర్వాత స్వర్గధామం అవుతుందన్న దుర్భ్రమ నాకు ఏ మాత్రం లేదు. రాష్ట్రంలో ఇప్పుడు ఇంత ఉద్రిక్త స్థితి రావడానికి కారణం...పిచ్చి ప్రేలాపనలని నేను కూడా నమ్ముతున్నాను. దయచేసి...నన్నో..తమ అభిప్రాయలు వెలిబుచ్చిన ఇతర మిత్రులనో తిట్టడం ధ్యేయంగా పెట్టుకోకుండా...ఒక చర్చకు ఉపకరించే నాలుగు మంచి ముక్కలు రాయండి సార్. ప్లీజ్.
మీ...రాము
Yes, the way KCR reacted to questions from anchor was good. Poor fellow there were two other persons, ostensibly for discussion I suppose, who could not help just sitting silent.
Let there be such a live programme with KCR on one side and one Leader (is there one!)representing Samaikya Andhra, discussing threadbare dispassionately the issue of dividing the state of Andhra Pradesh. Let the TV channels and the Leaders take initiative, instead immobilising the state.Let all issues be discussed the results of which although would not be binding on any party, but would definitely enlighten the general public.
కెసిఆర్ ఇంటర్వ్యూ చాల ఆలోచించే విదంగా వుంది ....అతను కాల్స్ receive చేసుకోనేవిదానం చాల బాగుంది ......అతను గోడవలలో పడి అతని లాంగ్వేజ్ మారింది అయింది కానీ ఈ ఇంటర్వ్యూ లో అతని నిజమైన టాలెంట్ బయటికి వచ్చింది తెలంగాణా గురించి....... అతను చెప్పే విషయాలు ఆంధ్ర పీపుల్ ఆలోచించు కోవాలి.
kcr tounge is two edged sword.
1.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ముస్లిములకు భద్రత ఉండదని మజ్లిస్ పార్టీ చేసే వాదన నిజమేనా?
2.అలాగైతే తెలంగాణా లోని మిగతా జిల్లాల ముస్లిములు తెలంగాణా కావాలని ఉద్యమాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు?
3.సమైక్య రాష్ట్రంలో ముస్లిములకు వచ్చిన 4% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణాలో పెరిగే అవకాశం ఉంటుందా?
Siva gaaru,
Namaste.
Y've made a good suggestion.I am sending a mail to Ravi Prakash gaaru to organise a debate with KCR and Undavalli Arunkumar type of reasonable orators. Its really good. Both sides should shun violence and they are expected to engage in democratic conversation. Let peace be prevail in the state.
Cheers
Ramu
రామూ గారూ,
నా వ్యాఖ్య చూసి స్పందించి వెంటనే కార్య రంగంలోకి దూకినందుకు ధన్యవాదములు. మీరు పేర్కొన్న ఉండవల్లి గారు మంచి వక్త, ఈ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు కూడ ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. టి.వి 9 కాకపోతే మరొకళ్ళు. రెండువైపులా ఆమోదయోగ్యమైన వ్యక్తులతో, ఏదో ఒక చానెల్, ఇటువంటి లైవ్ చర్చ కనుక పెడితే, అది జరుగుతున్నంతసేపు, అదే చానెల్ తప్పక చూస్తారు అందరూ.
ఊరికే అందరూ చూడటమే ముఖ్య ఉద్దేశ్యం కాకుండా, ప్రస్తుతం రాష్ట్రంలో విబిన్నమైన వాదనలతో జరుగుతున్న ఉద్యమాల వెనుక ఉన్న నిజమైన కారణాలను విశ్లేషించి ఒక తరుణోపాయాన్ని రూపొందించుకోవటంలో ఏదైనా టి.వి. చానెల్ ఉపయోగపడితే, ఇప్పటికె మీడియా మూటకట్టుకున్న చెడ్డ పేరును (అత్యుత్సాహం చూపించటం, అనవసర వార్తలను బ్రేకింగు వార్తగా పదే పదే చూపటం, లేని వివాదాలను సృష్టించటం మొదలగునవి) కొంత సరిచేసుకునే అవకాశం ఉన్నది. మన రాష్ట్ర విషయాలు మనమే చూసుకోగలం అని మిగిలిన అందరికి తేల్చి చెప్పగలిగే అవకాశం. మన రాష్ట్ర వ్యవహారాలు తీర్చి దిద్దటానికి మరో రాష్ట్రానికి చెందిన మొయిలీలు, చిదంబరాలు అవసరంలేదూ, మనలో మనం చర్చించుకుని పరిష్కరించుకోగలం అని మిగిలిన వారికి మార్గదర్శకత్వం చెయ్యగల అవకాశం.
అప్పుడెప్పుడో పెద్దమనుషుల ఒప్పందం అని మాటి మాటికి ఉట్టంగిస్తూ ఉంటారు అన్ని వర్గాలవారూను. ఆ ఒప్పందం వ్రాత ప్రతి ఎవరన్నా చూశారా, దానిమీద ఎవరెవరు సంతకాలు చేశారు. , అందులో ఏమున్నది, ఆ ఒప్పందం విలువ ఏమిటి వంటి మూల విషయాల దగ్గరనుంచి మొదలయ్యి నిన్న మొన్న వచ్చి, ఇప్పటి చిచ్చుకు లేటెస్ట్తు కారణమైన స్పెషల్ జోన్ వరకూ కూలంకషంగా చర్చించాలి. మళ్ళి ఇక ముందు ముందు రెండు/మూడు దశాబ్దాలకొకసారి ఇలా ఉద్యమాలు రావలిసిన అగత్యం లేకుండా పకడ్బంది ఐన , నిజాయితీ గల ఒక పరిష్కారం సాధించాలి. ఇటో పుల్ల అటో పుల్ల వేస్తూ వివాదాలను మరింత రెచ్చగొడుతూ రేటింగులు పెంచుకుంటున్నారు అన్న అపప్రధ మీడియా తొలగించుకోగలగాలి.
ఇదంతా ఒక రొమాంటిక్ అలోచన, దురాశ కాకూడదని నా అభిమతం.
ఈ ఇంటర్ వ్యూ నేను కూడా చూసాను. కెసిఆర్ చాలా హుందాగా వ్యవహరించారు. మొదటి నుండి ఇలాగే ఉంటే ఇవాళ ఇంట గొడవ జరక్కపోవునేమో
కొందరు సమైక్య వాదాన్ని మనసులో పెట్టుకొని KCR ఇంటర్వ్యు చూసినట్టున్నారు, అందుకే నచ్చలేదు. ఏవి వాస్తవాలో, అవాస్తవాలో తేల్చి చెప్పగలిగే అవకాసం, భాద్యత మీడియాకుంది. KCR చెప్పిన 'వాస్తవాల' దిశగా రజినీకాంత్ గారు ప్రశ్నలు అడగపోవటం మన దురదృష్టం. రజిని గారు కేవలం ఒక వైపు నుండే ప్రశ్నలు అడిగి తన వాదాన్ని బయటపెట్టుకున్నారు. ఉదాహరణకు '' తెలంగాణా వచ్చాక జాతుల వైరం పెరిగే అవకాశం లేదంటారా ?" అని ప్రశ్నించటం వెనుక తెలంగాణేతరుల్ని ఆలోచనలోనో , ఆందోళనలో పడేయటమే. ఒకప్పుడు నేను రజినీకి అభిమానిని కానీ ఇప్పుడు అతని పద్దతి చూస్తుంటే ఒక 'వాదానికి' పరిమితం అయినట్టుంది. అయినా ఇదంతా TV9 'అజెండా సెట్టింగ్' లో భాగమే కావొచ్చు. కెసిఆర్ పరిణితితో మాట్లాడాడన్నది మాత్రం నిజం.
సార్ ! మీడియా అందరిని విమర్శిస్తుంది, కానీ మీడియానే విమర్శిస్తే ఎవరికి మాత్రం నచ్చుతుంది! పాపం మీడియాలో ఉన్నవాళ్లు, తమని తాము దేవుళ్ళుగా భావించుకుంటూ, జీవిస్తున్నారు. వారి రాతలు, కథలు, కథనాలు మన రాజకీయాలనే మార్చేయగలవు అని ధృడంగా నమ్మి వృత్తిని కొనసాగిస్తున్నారు. కానీ ప్రజల ఆకాంక్షలకు, అభిప్రాయాలకు అద్ధంపట్టేవిదంగా ( ప్రాతినిధ్యం) వ్యవహరంచాల్సింది పోయి. లేని పోనీ అనుమానాలను సృష్టిస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలను, సమాచారాన్ని అందిస్తున్నారు. ఇప్పడు మీడియా వ్యాపారం అయింది, అప్పుడు లాభాలే దాని పరమోన్నత లక్ష్యాలు అవుతాయి.
జై హో ap media..!!
సంతోష్ పడాల , UoH.
రాము గారు.
వ్యక్తిగతంగా దాడి చేయకండన్నారు. నేనేమీ చేయలేదు కూడా. మీరు టపా ఎలా రాశారో చూసుకోమన్నానంతే. కేసేయార్ వాక్పటిమ అని శీర్షిక పెట్టారు. మీరో జర్నలిస్టు. అతడి వాక్పటిమ ఏ పాటిదో ఈ రోజు మీరు కొత్తగా చెప్పక్కర్లేదని నా భావన. ఎందుకంటే కేసీయార్ మాట్లాడితే శత్రువుకైనా వినబుద్ధి అవుతుంది. కేసీయార్ ఎట్ హిజ్ బెస్ట్ అన్నారు. అద్భుతమనే పద ప్రయోగం కూడా వాడారు. ఇలా పొగడ్తల వర్షం కురిపించారు. ఇందుకు నా అభ్యంతరమల్లా ఏజ్ ఏ జర్నలిస్టుగా టపా రాసేటపుడు రెండో కోణాన్ని చూడకుండా.. మిగతా వాళ్లలానే మీరు రాయడం.. అంతే తప్ప ఇదేదో వ్యక్తిగత దాడిగా మీరు భావిస్తే నేనేమీ చెప్పలేను. ఇక నేను అడిగిన సూటి ప్రశ్న. కేసీయార్ నిజాయతీ గల వ్యక్తా కాదా..
అసలు ఓ ఉద్యమకారుడికి ఉండాల్సిన నిజాయతీ కేసీయార్లో ఉందా లేదా..
ఆడి కారు తీసుకోవడం అతడి నిరాడంబరతకు ఉదాహరణగా మీరు భావిస్తున్నారా...
విలాసవంతమైన భవనాల్లో నివసించడం.. టికెట్ల అమ్ముకోవడం అతడిలోని ఉద్యమ కారుడి లక్షణాలని మీరు అనుకుంటున్నారా లేదా..
ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే. కాదు.. తెలంగాణ వాదం ముసుగులో కేసీయార్ వ్యక్తిత్వం గురించిన చర్చను పక్కన పెట్టేద్దామంటే నేనేమీ చెప్పలేను.
మీరు అద్భుతం.. అదరహో లాంటి పదాలు వాడారు కాబట్టి నేను ఉద్యమకారుడిగా కేసీయార్ వ్యక్తిత్వంపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను. టీవీ 9 కార్యక్రమంలో ప్రశ్నలడిగిన ముంబయి శాస్త్రిని అవివేకి... మూర్కుడు.. అని కేసీయార్ తిట్టినట్టు మీరు కూడా దీన్ని వ్యక్తిగత దాడిగానే పరిగణిస్తే నాకేమీ అభ్యంతరం లేదు.
రెండు దశాబ్దా ల పాటు జర్నలిజంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడిగాను. అంతే తప్ప మీరు కూడా మీ విజయ నగరం మిత్రుడిలా కేసీయార్ వాక్పటిమకు ఆశ్చర్యపోతే ఎలా.
ఎస్. ఎమ్. ఎస్ బాగోతం గురించి కూడా మీరు వివరణ ఇవ్వలేదు. వివరణ ఇస్తే మీరు రాసిన ఎస్. ఎమ్. ఎష్ యవ్వారానికి ఎంత పస ఉందో ఈ బ్లాగు చదివే పాఠకులకు అర్థమయ్యేది.
చర్చకు ఆహ్వానించడం బాగుంది. కానీ అందుకు మీరు రాసిన ఉపోద్ఘాతం సరిగ్గా లేదనేది నా భావన. నిజాయతీగా మీరు రాయలేదనేదే నా ఘోష. తెలంగాణపై మీరు రాసే రాతలకు ముందు వాదమనే గంతను తీయండి.
మీకు సలహాలిచ్చేంతవాడిని కాను. కానీ బ్లాగు టైటిల్లో నైతిక జర్నలిజమే ధ్యేయంగా అనే పదం వాడారు కాబట్టి ఇంత నేను రాయాల్సి వచ్చింది. అన్యధా భావించకండి.
ఇట్లు
మొదటి ఎనానిమస్.
Truth can be partially exposed to win an argument. KCR did that. He may not have put forth a false argument. But he just concealed some part of truth.
He argued that "telangana state" was much prosperous prior to 1949.
Firstly, it was not Telangana state. It was princely state of Hyderbad (Hyd Samsthanam).
Next, the princely state of Hyd has sold the "circar" districts to British and used the money (whatever little it was) for the lavishes of Hyd state.
Next, it "ceded" the rayalaseema district to British, for its survival.
So, the rest of Andhra has contributed to the prosperity of Hyd.
Further, in the interview, he tried to reason out that a Charminar & Kutubshahi Tombs are the icons of Hyd. Is it not an attempt to raise passions?
His arguments on Sagar/Joorala/Palamuru are real convincing. But these plights are same as the plights of rayalaseema or uttara kosta farmers
He exclaimed the govt's apathy on Dubai Telugu people. Now, my question to "Dubai Sekhar" is, why did he not go on a fast-unto-death to get some revival package fot these dubai telugu's. Infact, he has built his empire by sending people to Dubai. So he has a good reason to solve their problems
Next, He was sorry about the plights of flouride affected people in Nalgonda. Question to him: why did he not go on a fast-unto-death to resolve the water crisis to these people?
by shedding crocodile tears on telangana's problem, he just appeared as another politician, trying to build his new empire.
and, while reading the past few posts, I tend to believe that Ramu is taking a T stand
piece. (not peace! piece is perfect for this occasion of splitting the state)
Siva gaaroo,
namaste..
Ravi prakash gaariki nenu pampina mail ikkada istunnanu. aayana spandistaarane aasiddam.
--------------------
dear mr.ravi,
good morning
KCR's live show was very good. Can't you organise a debate between KCR and Undavalli (or other reasonable orator from Andhra/ Rayalaseema)? It'll bring down temperaments on both sides. Please do some thing to cool people's emotions instead of stoking them.
All the best
Ramu
Inni rojula nunchi matladakunda eeroju andhra vallu dochesthunnarani antunnaru.Inthamandhi rajakiya nayakulu inno rojulu emipoyaru.
Telangana prajalara meeru vidipoina mee gathis ee rajakiya nayaklul chethilo balaipothundhi.
compare to any other state we are well developed and people are well aware and they know what they want.
Because of this awareness SONIA wants to separate us to get profit from them.
Telangana vidipothe prajala kanna first verri vangallappa iyyedhi KCR.
Telangana vidipothe,hyderabad definate ga vidipothundhi.Without hyderabad telangana is big ZERO.
all the best to them whoever wants Telangana.
Telangana vidipoyaka vallaki 10 years tharuvatha ardham authundhi vallue entha thappu chesaro.
Chandra sekhar chowdary
guntur
కెసిఆర్ వాదన కరెక్ట్ గానే ఉంది. నిజం చెప్పాడా ,అబద్దం చెప్పాడా అనేది తేల్చాల్సింది సమైక్యాంద్ర రాజకీయ నాయకులు .కెసిఆర్ ని నమ్మడమా లేదా
అనేది పక్కన పెడితే సమిక్యంద్ర వాదులు ఎవరు దీనిని ఖండించక పోవడం అచ్చర్యం ,అనుమానం కలిగిస్తోంది.
కెసిఆర్ ని ,తెలంగాణ వాళ్ళని విమర్శించడం మాని అసలు వాళ్ళు చెప్పినట్టు నష్టపోయారా ? లేదా అనేది అలోచించి ,ఒకవేళ నష్టపోతే దానికి బవిష్యత్తులో మేము హామీ ఇస్తామని ఎ ఒక్క రాజకీయ పార్టి ముందుకు వచ్చినా విభజన కొంత
అగోచ్చేమో కాని ,సరైన రీసొన్ లేకుండా జరిగే సమైక్య ఆంద్ర ఉద్యమం ఫెయిల్ అవుతుంది.
కెసిఆర్ ని విమర్శించే వారు ఎవరైనా రామోజీని మార్గదర్శి విష్యం లో ,ఇతర రాజకీయ నాయకుల విషయములో నిజాలు ఎంతవరకు తెలిసికొన్నారు ?ఎంతవరకు పట్టించుకొన్నారు ?
కెసిఆర్ కాకపోతే ఇంకో నాయకుడు దీనిని తేగెడాకా లాగుతారని నా అభిప్రాయం
kcr mentioned that
"charminar, some khilla's etc are symbols of pride....development can not substitute independence blah.... they want self-ruleetc.."
but when one of the callers talked about "hi-tec city" kcr made a fool out of him
we all agree Nijam is a fascist but monuments constructed by them are a symbol of pride. why it does not apply to the ones done by kosta-seema people?
1) what about the tank-bund renovaiton by NTR. he restored the pride of telugu.
2) what about Babu's clean-green-city Hyd and his infra. developemnt in hyd. one of the reasons is lost because of draught and his too much focus on hyd. how short people's memory is?
3) what about ramoji film city and all other big studios
4) what about those numerous kosta-seema poeple. development is not about construction projects. it is these small individuals who build societies and the support systems. like ant colonies.
all the above 4 will become historical landsmarks after 100 years. KCR ridiculed them. he can not respect future "history"
Does it not show how cunning he is?
శ్రీనివాస్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
తెలంగాణావాదులకు ఒక విన్నపం.
ప్రత్యేకరాష్ట్రం డిమాండ్ నూటికి నూరుపాళ్ళు సరైనదే అని మీరు భావిస్తే...ఈ కామెంట్స్ లోని -
మొదటి అజ్గాత, సినీవ్యాలీ - వ్యాఖ్యలకు నిజాయితీగా జవాబివ్వండి.
--నారాయణ
kcr oka mata chepparu... natho kapuram chestava leka acid attack cheyamantava ...yess eenati samaikyandrodyamam chusthe alage anipistondi... swayam palana nu korukuntunna prathi telangana bidda pratyeka rashtram kosam paritapistunnadu. adhipatyam potundano... akramarjanalu bahirgatamautayano anukune... lagadapati lanti vedhavalu chese vidwamsa rachananu prati telangana vadi serious gane teesukuntunnadu.. kalisi undamanenduku pratipadika kevalam telugu aithe aa tegulu makoddane stai lo undi ma telangana gosa. memilage anagadokkutuntam... meeru telugu vare kabatti bharinchalannattundi samaikya vadula vadana. ma abhiprayala merak separate state adugutunte... vere pranteeyul abhiprayalatho ma bhavishyattuni nirnayinchadamento artham kavadam ledu... anduke telangana udyama karudu prakash cheppinatlu... memu pratyeka rashtram kosam kadu... UNO lo pending lo unna nijam petition nu thiragadodi.. pratyeka desham kosam udyaminchalemo.. endukante.. ee desham lo telangana prajala akakshalaku, abhiprayalaku viluva ledanipistondi... vere prantham nayakulu, pettubadidarulu, parishramika vettalu ma telangana future ni thelche vallainapudu.. valla abhiprayalane kendra prabhuthwam parigananloki theesukuntu thana nirnayanni marchukune paristhithi uthpannamainappudu.. memenduku ee desham lo undali ?
ALOCHINCHANDI TELANGANA BIDDALLARA ? EE DESHAM LO TELANGANA PRAJALU DWITHIYA SHRENI PRAJALA ? LEKA VARI ABHIPRAYALAKU VILUVUNDA ? IDE QUESTION NI PALAKA CONGRESS VARINI VEYANDI... ANSWER RABATTANDI..
JAI TELANGANA... JAI JAI TELANGANA..
SHARMA S.R.
రామోజీ తెలంగాణను ఎందుకు సమర్ధిస్తున్నట్లు? డీప్ ఎనాలిసిస్ చేయండి.
పెద్దమనుషుల ఒప్పందం
వికీపీడియా నుండి
1956 లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి - కోస్తా, రాయలసీమ, తెలంగాణా - అన్ని ప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారు. అయితే తెలంగాణా నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది. ఇటువంటి ఇతర సందేహాల నివృత్తికై అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి 1956 జూలై 19 న ఒక ఒప్పందానికి వచ్చారు. దీనినే పెద్దమనుషుల ఒప్పందం అన్నారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:
* కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవిన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి. తెలంగాణా ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి
* తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్ధులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి.
* సివిలు సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.
* ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోను, న్యాయ విభాగం లోను ఉర్దూ వినియోగం కొనసాగాలి.
* రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలి. ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి ఇతర ప్రాంతాల నుండి ఉండాలి.
* ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణా అభివృద్ధి మండలికి ఉండాలి. మండలి సభ్యులు తెలంగాణా ప్రాంతం నుండి ఎన్నికైన శాసన సభ్యులు ఉండాలి.
* తెలంగాణాలో మద్యపాన నిషేధాన్ని తెలంగాణా శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చెయ్యాలి.
* తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్ళపాటు నివసించి ఉండాలని నిబంధన రూపొందించాలి.
* కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.
completely irresponsible role played by TV 9. simply encouraging battle between coastal andhra and telangana, do not conduct these live programmes again this critical situation.
పెద్దమనుషుల ఒప్పందం గురించిన కొన్ని వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. కాని ఆ డాక్యుమెంటు ఇప్పుడు ఎక్కడ ఉన్నది, దానిమీద సంతకాలు చేసిన పెద్దమనుషులు ఎవరు, ఆ పెద్దమనుషుల ఒప్పందం copy కావాలంటే Right to Informarmation Act కింద ఏ శాఖకు దరకాస్తు పంపాలి వంటి వివరాలు ఉంటే బాగుంటుంది.
Dear sir it is a part of constitution of india.
you can get details of signaturies
http://en.wikipedia.org/wiki/Gentlemen%27s_agreement_of_Andhra_Pradesh_(1956)
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి