Friday, July 23, 2010

ఈ నరరూప కీచకులకు బతికే హక్కు ఉందంటారా?

దేశ హాకీ మహిళల జట్టుకు కోచ్ గా ఉన్న కౌశిక్, పార్క్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ సలావుద్దీన్ అయూబ్ లు పాల్పడిన ఘాతుకం చూస్తే ఎంతో ఆవేదన, ఆగ్రహం కలుగుతున్నాయి. కోచ్ ను క్రీడాకారులు, టీచర్ ను విద్యార్థులు దేవుడిలా భావిస్తారు. అలాంటిది ఈ వెధవలు లైంగిక సుఖం కోసం వారిని వాడుకోవడం క్షమించరాని నేరం, అమానుషమైన ఘోరం. కంచే చేను మేయడం ఇదే.

నిన్న రాత్రి ఏదో ఇంగ్లిష్ ఛానల్ లో ఒక జాతీయ క్రీడాకారిణి కౌశిక్ తనతో వ్యవహరించిన తీరు చెబుతుంటే...గుండె రగిలిపోయింది. నేను చూసినంత వరకు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కోచ్ లు క్రీడాకారులతో వ్యవహరించే తీరు చాలా ఆక్షేపణీయంగా ఉంది. ఆటగాళ్ళలో దేశభక్తి, కసి పెంచే సత్తా మన వాళ్లకు శూన్యం. ఎంత సేపటికీ తిట్టడం, ఎద్దేవా చేయడం! డబ్బు పిచ్చి సరేసరి. ఆడపిల్లల విషయంలో ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సినవాళ్ళు గడ్డికరుస్తూ మానవత్వానికి మచ్చ తెస్తున్నారు. ఇక్కడ చాముండి తడుముకోకుండా దొరికే పెద్ద ఉదాహరణ.
స్కూల్స్, యూనివర్సిటీ లలో పిల్లలు టీచర్లను ఎంతో ఉన్నతంగా చూస్తారు. లోకం తెలియని వారికి....పాఠాలు బోధించే వారు ఆదర్శంగా అనిపిస్తారు. ఇలాంటి వారు పిల్లలను బెదిరించి లేదా మాయచేసి శారీరకంగా వాడుకోజూడడం దారుణం. వీళ్ళ కూతుళ్ళకు మరొక బేవార్స్ గాడు గ్రౌండ్ లో లేదా స్కూల్లో ఇలా చేస్తే ఆ బాధ తెలుస్తుంది వీళ్ళకు. యాభై ఏళ్ళ వయస్సు ఉన్న ఈ దరిద్రులు ఎంతో ప్రపంచాన్ని చూసి వుంటారు. అయినా ఈ తెగులు!

ఇలాంటి వారి విషయంలో ఈ కోర్టులు వ్యవహరించే తీరు కూడా దారుణం. ఈ అపర కీచకులు నాలుగు డబ్బులు తమవి కావనుకుంటే...ఏమీ కాదు, రచ్చ చేసిన పిల్లల పరువు పోవడం, తల్లిదండ్రులకు క్షోభ మిగలడం తప్ప. డబ్బు వెదజల్లితే...తిమ్మిని బమ్మిని చేసి కేసులు జీవితకాలం పాటు కొనసాగించే న్యాయకోవిదులకు కొదవే లేదిక్కడ.

"న్యాయం లేదు, తొక్కా లేదు...కౌశిక్ కు, అయూబ్ కు అర్జెంటుగా ఉరిశిక్ష వెయ్యాలి. ప్రజాస్వామ్యంలో ఇది కుదరదని అనుకుంటే...కాబూల్ పంపి తాలిబాన్ల సాయంతో వారి తరహ దండన విధించాలి," అని అబ్రకదబ్ర ఆవేశంగా అన్నాడు. ఆ బాధిత పిల్లల తల్లిదండ్రులకు కూడా అలాగే అనిపించే అవకాశం ఉంది. మరో కోచ్ లేదా స్పోర్ట్స్ అఫీషియల్, మరో టీచర్ లేదా స్కూల్ అడ్మినిస్ట్రెటర్ ఇలాంటి నీచాలకు పాల్పడడానికి భయపడేలా సత్వరమే శిక్ష విధించాలి.

50 comments:

Unknown said...

ayublu,kaushik lu pathrika rangamlo kuda vunnaru. varini gurinchi manam charchinchukovadam entho avasaram.
amayaka sub editorsni vadukuni career lo paiki thesthamani pralobha paruchukonna dagulbajilu ikkada thakkuvem kadhu.
Logada Telakapally Ravi ane sadistu
Prajasakthi editor ga vundaga anekamandhi ammayilanu lobarchukoni, aakariki oka lady sweeper tho RED handed ga doriki poyadu. paluvuru mahila comrades vadiki bali ayyaru. alanti vadini CPM raghavulu siggulekunda kshaminchi prajasakthi daily nunchi thappinchi ippudu book house ki editor ni chesadu. idhi oka example mathrame. ilantivi anni officelonu vunnayi.

Devi

durgeswara said...

ఇంతకంటే ఘోరం రాయపూర్ లో సిజేరియన్ ఆపరేషన్ చేపించుకోలేదని మామూలుగా ప్రసవించిదనే కసితో ్ ఓ నీచుడు పిల్లవాని చేయి కత్తెరించాడట .టేపుతో అతికించాడట . నిన్న ఈరెండువార్తలు చదివి మనసు వికలమైపోతుంది . నిజంగా ఇటువంటీ డాక్టర్లను బ్రతకనీయటం అవసరమా?

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

రామూగారూ ! హోల్డాన్, హోల్డాన్. ఊరికే ఆవేశపడకండి. కాస్త ఆగి నిదానంగా సమతూకంగా ఆలోచించండి. రంజిత గారి ఆరోపణల నేపథ్యంలో కోచ్ గా రాజీనామా చేసిన శ్రీ ఎమ్.కె. కౌశిక్ గారి విషయం కాసేపు మాట్లాడుకుందాం.

ఆయన మీద ఆరోపణలు చేస్తున్న కుమారి రంజితాదేవిగారు స్వయంగా ఆయన గుఱించి చెబుతున్న సమాచారం ఆధారంగానే ఆయన ప్రవర్తనని కాసేపు పరిశీలిద్దాం. శ్రీ కౌశిక్ గారు చేసిన తప్పేంటి ? ఆయన ఆమెని మానభంగం చేయలేదు. కనీసం తాకను కూడా లేదు. ఆమెని దూషించలేదు. బెదిఱించలేదు. ఆమెని అసభ్య భంగిమల్లో వీడియోలూ ఫోటోలూ తీయలేదు. ఆమెకి అశ్లీల SMSలూ, వేగులూ పంపలేదు. ఆమె గుఱించి ఇతరులతో చెడ్డగా మాట్లాడలేదు. ఆమె క్రీడాకెరియర్ ని పాడు చేయలేదు. న్యాయబద్ధంగా ఆమెకి రాగల ఏ ఆధికారిక బెనిఫిట్లనీ చెడగొట్టలేదు.

మఱేం చేశాడాయన ?

ఆమె అందంగా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చాడట. "సెక్సులో ఎప్పుడైనా పాల్గొన్నావా ?" అని అడిగి "సెక్సు ఆరోగ్యానికి మంచిది" అని చెప్పాడట. "నేను నీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. అలాగే నేను మాట్లాడాలనుకున్నప్పుడల్లా నీతో మాట్లాడొచ్చునా ?" అని అడిగాడట. సెక్సులో పాల్గొందామని నాలుగైదుసార్లు మైల్డుగా ప్రతిపాదన చేశాడట.

ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం - "ఈ విధమైన ప్రవర్తనని రంజిత ఆరోపిస్తున్నట్లుగా Sexual harassment అనే ఒక పేద్ద పేరుతో పిలవొచ్చునా ?" అనేది. నచ్చిన ఆడదాని మెప్పు కోసం ఏ మగవాడైనా ఇలాగే ప్రవర్తిస్తాడు. బహుశా ఆడవాళ్ళు కూడా ప్రవర్తిస్తారు. కొన్ని ఎఫైర్లు బాగా పండుతాయి. కొన్ని పండవు. అంతమాత్రాన అందఱూ Sexual harassment అని కోర్టుకెక్కితే ఈ ప్రపంచంలో స్త్రీపురుష సమాగమం అనే ప్రకృతిసహజ కార్యకలాపం గుఱించి మర్చిపోవలసిందే. ఈ కోర్ట్‌షిప్ దశల్ని దాటుకున్నాకే స్త్రీపురుష సమాగమం జఱుగుతుంది. అందుకు ఒక మగజీవిగా మగవాడికి ఒక అవకాశం ఇవ్వాలా ? వద్దా ?

మగవాడు శృంగార విషయాల్లో చొఱవ తీసుకోవడం ప్రకృతిసహజం. అది నేరం. కాదు. అది harassment కాదు. అది బూతు కాదు. అది నేచురల్ Courtship. అది ప్రేమసంపాదనా ప్రయత్నం, అది అలాంటి ప్రయత్న స్థాయిలోనే ఉన్నప్పుడు ఆ ప్రయత్నాన్ని అంగీకరించే/ లేదా తిరస్కరించే హక్కు మాత్రమే ఆడదానికి ఉంది. అంతేతప్ప ఆ మాత్రం దానికి అతన్నొక విలన్ని చేసి అతని పరువు తీసే హక్కు ఆమెకే కాదు, ఎవఱికీ లేదు. మగవాడి ప్రతిపాదనల్ని అంగీకరించే/ లేదా తిరస్కరించే హక్కు ఆడదానికి ఎంత ఉందో ఆమెకి ప్రతిపాదించే హక్కు కూడా మగవాడికి అంతే ఉంది. అది అతనికి ప్రకృతి విధించిన కర్తవ్యం. ఎందుకు అతన్ని శిక్షించాలి, మగజన్మెత్తినందుకు మగవాడుగా తన పని తాను చేస్తున్నందుకా ?

స్త్రీలకున్నట్లే మగవాళ్ళకీ కొన్ని హక్కులున్నాయి. నచ్చిన ఆడదాన్ని courtship చేసే హక్కు అటువంటివాటిల్లో అత్యంత ముఖ్యమైనది,. సృష్టికి మిక్కిలి ఆవశ్యకమైనదీ కూడా. మగవాడు ఆడదానితో సమాగమాన్ని కోరుకోవడం కుసంస్కారం ఎలా అవుతుంది ? అది శిక్షించదగ్గ నేఱం ఎలా అవుతుంది ? అది ప్రకృతిసహజమైన విషయం. భగవంతుడు ఉద్దేశపూర్వకంగా కల్పించినటువంటిది. మగవాడిలో ఆ ప్రేరణ ఉండబట్టే స్త్రీజాతి హాయిగా బతికిపోతోంది. మగవాడికి ఆ అవసరమే లేనప్పుడు ఆమెని పట్టించుకునేదెవఱు ?

మఱో ప్రశ్న. ఒక వ్యక్తి ఒక ఆడదానితో శృంగారంలో పాల్గొనడానికీ అతని హోదాకీ/ డిజిగ్నేషన్ కీ సంబంధం ఏంటి ? గురువులతో సెక్సు కార్యకలాపాలు నడిపే ఆడ స్టూడెంట్లు ఉన్నారు. బాసులతో గడిపే ఆడ ఉద్యోగినులున్నారు. అయితే అక్కడ ఉభయాంగీకారం ఉంది కనుక ఇలాంటివన్నీ రహస్యంగా విజయవంతంగా నడిచిపోతున్నాయి. ఇక్కడ ఎమ్.కె. కౌశిక్ గారు అనవసరంగా తనకు సరిపడని ఒక wrong candidate ని పట్టుకొని పబ్లిక్ లో అభాసుపాలయ్యాడు పాపం ! అంతే తేడా ! ఆ మాత్రానికి మనం కూడా ఆ రంజితాదేవిగారి లాగా బ్యాలన్సు కోల్పోయి ఆవేశపడాల్సిందేమీ లేదు.

అదీగాక ఆరోపణలున్నంత మాత్రం చేత ఏ వ్యక్తీ దోషి కాడు. నిరూపణ కాని విషయాల్ని అయినట్లుగా ప్రసంగించడం సరికాదు ఒక ఘటనకి ఎన్నో కోణాలుంటాయి. కానీ ఈ సత్యానికి విరుద్ధంగా ఆలోచించడాన్నే అలవాటు చేశాయి మన మీడియా, తదితర వ్యవస్థలూ ! ఆరోపితుల వాదనని కూడా సానుభూతితో పట్టించుకోవాలి.

--తాడేపల్లి

Ramu S said...

తాడేపల్లి గారూ...
మీ వాదన దారుణంగా...విచిత్రంగా ఉంది. ఒక్కటే విషయం సర్. ఆఫీసులో ఒకడు సహోద్యోగిని సెక్స్ కోసం వస్తావా? అంటే మీరు చెప్పిన లాజిక్ వర్తించ వచ్చేమో గానీ...సెక్స్ లో పాల్గొందామని కోచ్ గానీ, టీచర్ గానే అడగడం ముమ్మాటికీ తప్పు. ఇక్కడ...హోదాను అడ్డంపెట్టుకుని కెరీర్ నాశనం చేస్తానన్న బెదిరింపుతో లొంగదీసుకోవడం అనే విషయం ఉంది. ఇది పచ్చి నేరమని నా ఉద్దేశం. 'సెక్స్ ఆరోగ్యానికి మంచిది' అని సాటి ప్లేయర్ చెప్పడం వేరు...మంచం చూపిస్తూ అదే విషయాన్ని కోచ్ చెప్పడం వేరు.
మగ వాడు శృంగారం విషయంలో చొరవ తీసుకోవడం...అన్న మీ అభిప్రాయంలో ఒక పెద్ద లోపం ఉంది. పెళ్ళాం దగ్గర భర్త చొరవ తీసుకోవచ్చేమో గానీ...ఇది ప్రకృతి సహజం అని విద్యార్థినులకు సార్లు, ప్రొఫెసర్లు ప్రపోజ్ చేయడం దారుణం, అమానుషం.
రాము

Anonymous said...

రామూగారూ ! మీకు అంత దారుణంగా కనిపిస్తున్నదేంటో నాకర్థం కాలేదు. ప్రపంచంలో చాలామంది విద్యార్థినులు చాలా మంది ఉపాధ్యాయులతో పోతున్నారు. ఈ నీతిసూత్రాలు చెప్పి మనం ఎవఱినైనా ఆపగల్గుతున్నామా ? ఎంతోమంది క్రీడాకారిణులు ఎంతోమంది కోచ్ లతో పోతున్నారు. మనం ఆపగల్గుతున్నామా ?

"...పెళ్ళాం దగ్గర భర్త చొరవ తీసుకోవచ్చేమో గానీ..."

చొఱవ తీసుకోవడానికి అసలు ఒక ఆడా మగా భార్యాభర్తలెలా అవుతారో ఆలోచించండి. ఇండియాలోని అరేంజ్డ్ మేరేజెస్ లో తల్లిదండ్రులు కుదిఱిస్తే అవుతారు. కానీ తక్కిన ప్రపంచమంతటా ప్రేమించుకుంటేనే భార్యాభర్తలవుతారు. అందుచేత పెళ్ళి కావడానికంటే ముందే ఆ దేశాల్లో అందఱికీ అన్నీ అయిపోతాయి. మఱి అప్పుడైనా చొఱవ తీసుకోవాల్సింది మగవాడే కదా ! పెళ్ళి దాకా ఒక రిలేషన్‌షిప్పు పురోగమించాలంటే అలా ప్రేమించే అవకాశాన్ని మగవాడికి ఇవ్వాలా అక్కఱలేదా ? లేదా ప్రేమించిన ప్రతిసారీ అతన్ని Sexual harassment case కింద బుక్ చేసి బొక్కలో తోయాలా ? చెప్పండి. మగవాడి సహజ పురుషత్వ హక్కుల గుఱించి కూడా ఆలోచింఛండి. ఆడదానికి గర్భధారణ చేసే హక్కు ఎంత సహజమైనదో ఆడదాన్ని courtship చేసే పురుషత్వ హక్కు కూడా మగవాడికి అంత సహజమైనది. అది ఆడదాని Reproductive Right అయితే ఇది కూడా మగవాడి Reproductive Right. గర్భధారణ చేసినందుకు ఆడదాన్ని శిక్షించడం న్యాయం కానప్పుడు ఆమెని courtship చేసినందుకు మగవాణ్ణి శిక్షించడం కూడా అన్యాయమే. Man has a right to manliness.

మీకు తెలుసో, తెలియదో గానీ పెళ్ళాం దగ్గఱ చొఱవ తీసుకోవడం కూడా తప్పేనని భావించే ఫెమినిస్టులున్నారు. వాళ్ళు దానికి Rape in marriage అని పేరు పెట్టారు. So, man is always viewed as a rapist, a criminal, in theory, in practice, in law, at home, everywhere. How unjust it is, once care to think of it.. ఫెమినిస్టులు అల్లే సైద్ధాంతిక భావజాలంలో పడి కొట్టుకుపోయి మగవాడి హక్కుల గుఱించి మనం మర్చిపోతే ప్రతి మగవాడూ ఒక క్రిమినల్ లాగానే కనిపిస్తాడు.

ప్రేమకీ, పెళ్ళికీ, సెక్సుకీ, వెంటపడ్డాలకీ హోదాలూ, వయసులూ, డిజిగ్నేషన్ లూ అడ్డం కావు. I have profound respect for Mr.M.K. Koushik on account of his previous record as as a world class olympian. I have little or no complaint against him except that he is a poor judge of female psychology. His only fault is he tried for wrong incompatible women.

ఆయనకి వ్యతిరేకంగా రంజితాదేవిగారితో పాటు ఇంకో ముప్ఫైమంది మహిళా క్రీడాకారిణులు కూడా సాక్ష్యమివ్వడానికి సిద్ధంగా ఉన్నారని విన్నాను. దీనర్థం - బహుశా ఆయన వాళ్ళందఱి కోసం కూడా ప్రయత్నించి విఫలమయ్యాడని ! ఇది ఇంకో విషయాన్ని కూడా తెలియజేస్తున్నది. వాళ్ళు తిరస్కరించినంత మాత్రాన వాళ్ళ క్రీడాకెరియర్ ని ఆయనేమీ దెబ్బ తీయలేదని ! ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ ఇండియా తరఫున ఆడుతూనే ఉన్నారు.

--తాడేపల్లి

శరత్ కాలమ్ said...

@ తాడేపల్లి
మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ప్రపోజల్ చేసినంత మాత్రాన పాపమై పోదు - నచ్చకపోతే లాంటి ప్రతిపాదనలని సున్నితంగా తిరస్కరించవచ్చు. ఏదో ఒక రకంగా పరిచయం వుంటేనే ప్రతిపాదన చేయడానికి అవకాశం వుంటుంది. ఇలా తప్పు కాదా, అలా తప్పు కాదా అని మినహాయించుకుంటూపోతే చివరికి మళ్ళీ పెళ్ళాం దగ్గర మాత్రమే ప్రపోజల్ చేయగలుగుతాము! నేను చెబుతున్నది మైనర్ల విషయంలో కాదు - మేజర్ అయిన అమ్మాయిల విషయంలో.

Krishnarjun said...

..... వితండవాదం. స్రుష్టి సహజ వాదనతో సభ్యత అసభ్యతలకు, సామాజిక అసామాజికాలకు మధ్య సరిహద్దులు తుడిపేసేస్తే ఎలా ??... ఆదిమానవుడి అంతరంగం.

Anonymous said...

తాడేపల్లి కి స్త్రీ ద్వేషం మెండు. అని మధ్య ఆయన బ్లాగులో రాసిన పోస్టులు ఒక బ్లాగులో లింక్ ఇస్తే చదవగా తెలిసింది. స్త్రీలను దారుణంగా అవమానిస్తూ రాశారు! ఇలాంటి వాళ్ళు తల్లిని,భార్యనూ మాత్రం ఏమి గౌరవిస్తారో అర్థం కాదు.


గురువై ఉండి "నాతో వస్తావా?:"అని శిష్యురాలిని అడిగే వాడి దురాలోచనను "ప్రేమ సంపాదనా ప్రయత్నంగా" భావించాలని చెప్పేవాడితో చుట్టు పక్కల స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.

మగవాడు శృంగార విషయాల్లో చొఱవ తీసుకోవడం ప్రకృతిసహజం. అది నేరం. కాదు. అది harassment కాదు. అది బూతు కాదు. అది నేచురల్ Courtship..!

ఈ లెక్కన రేప్ చేయాలనుకునే వాడు కూడా దాన్ని ప్రేమ సంపాదనా ప్రయత్నంగానే చెప్పుకుంటాడు.వాడి ప్రతిపాదనని అంగీకరించాలా?

ఇలాంటి వారిని ఏం చేయాలో కొన్నాళ్ల తర్వాత సమాజమే నిర్ణయిస్తుంది.

Anonymous said...

రాము గారూ, వాల్లకు బతికే హక్కు వుంది.. జైల్లో. ప్రతీదానికి చంపేయండి అనడం బాధ్యతాయుతంగా మెలగవలసిన జర్నలిస్టులు అనదగ్గ మాటేనా? చచ్చేంత నేరం వాల్లు ఏమిచేశారో చెప్పండి? వారు చేసిన నేరానికి శిక్ష ఉంది. ఆ శిక్షవాల్లకు త్వరగా పడాలని కోరుకోవాలి. దానికి ప్రస్తుతమున్న వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి అన్నదాని మీద మీరు వ్యాసం రాసివుంటే బాగుండేది.

vipravinodi said...

ఈ శీర్షిక కూడా `కర్కషం` గానే ఉంది. కీచకుడు కూడా నరుడే మరి..

katta jayaprakash said...

Extramarital and illegal relationships betwen men and women are very comon in almost all proffessions of the society and is nothing new.Some get adjusted with mutual agreement and understanding and some revolt at the proposals of sexual relationships.It isvan open secret that the film industry is notorious for sexual relationships among many artists,technicians,directors,producers,junior artists etc and it is necessity for them to get recognition in the industry and to get roles and it has become a routine for them and no one objects or protests in nthe film industry except a few who get differences with one another and no one bothrs about them.But sexual harassment is highly condemnable and punishable when the other party is not willing and this type of indecent behaviour in the educational institutions like schools,welfare hostels,residential schools is criminal and deserves strong action and punishment.
But the most interesting thing in the Parkwood School is the prolon silence of the teenaged girl to the sexual harassment by the DFirector.Why she did not resist and inform her parents or her guardian in Mumbai is really baffling.Let the police come out with all evidence with the role of the girls as well as the Director and if proved the Director must be punished severely.
It looks Tadepalli had made a generalised statetement without any reference to any specific incident and it appliers correctly to the film industry but not to the educational institutions,games and sports.Extra marital relationships with mutual consent does not create any problem but society does not agree for it.Anyhow the incident at Parkwood School is a black spot to the international type of educational institutions in Hyderabad and othervinstitutions have tobe more careful and alert.
The most surprising paet of the Parkwood incident is the silence maintained by MIM and other muslim leaders even though a muslim was a victim!Probably both nthe parties belong to muslim community.Had the Director of the school been a non muslim one the things would have been entirely different as there would be violent agitations by the MIM leaders of old city as seen in a number of cases in the pasat in Hyderabad like St Ann's college in Mehdipatnam.But the most surprising part is non muslims have been fighting against the school and director vshowing sympathy to the teenaged victim.Hope our MIM leaders take a leaf out of this incident of getting support from non muslims as a gesture of humanity and civic sense unlike MIM leadersc who always target the peole on religious grounds without any hman values.
JP.

Malakpet Rowdy said...

Tadepalli and Sarat,

I am surprised you took such a stance. Making inappropriate advances at workplace is definitely against work ethics.

Having said that, I assume that the guy propositioned the girl at the workplace. If my assumption is wrong and if the above incident had happened at a pub, bar or a disco that had nothing to do with work then the argument takes a completely different turn. However, even in that case, it doesnt sound really ethical for the coach to seek sexual favors from the trainee.

My argument remains the same even if the coach is a woman and the trainee is a man.

Saahitya Abhimaani said...

@విప్రవినోదిని, మీరు సరిగ్గా చెప్పారు. రామూగారూ, కీచకుడు రాక్షసుడు అయ్యి ఉంటె. మీరు పెట్టిన "నర రూప కీచకులు...." సరిగ్గా అమిరేది. కాని కీచకుడు,మనకు తెలిసిన మహా భారతం ప్రకారo విరాట రాజు బావమరిది, మనిషి(నరుడు). కాబట్టి, శీర్షిక "అపర కీచకులను...." అని పెడితే సరిపొయ్యేది.

తరువాత "కీచకుల" పని బట్టే ముందుగా వాళ్ళు నిజంగా కీచకులో కాదో చూడలిసిన పని తప్పనిసరిగా ఉన్నది. మీడియా ట్రైల్స్ తప్పనిసరిగా తప్పు. ఆ తరువాత ఇలాంటిది ఒకటి జరగ్గానే, మైకు గొట్టాలు పుచ్చుకుని ఆయా వార్తల్లో ఉన్న వాళ్ళ వెంటపడి పీడించే సంస్కృతి కూడ కట్టడి చెయ్యాలి.

Ramu S said...

విప్రవినోది, శివ గారూ....
ఉద్దేశపూర్వకంగానే ఆ శీర్షిక పెట్టాను. పరస్త్రీ వ్యామోహం ఒక రాక్షస భావన కాబట్టి, అది కలిగిన కీచకుడు ఆ జాతి వాడన్న కవి హృదయంతో పెట్టాను. నిజమే...'అపర' అనేది అతికినట్టు సరిపోయేది.
రాము

Saahitya Abhimaani said...

@JP GARU.

".Had the Director of the school been a non muslim one the things would have been entirely different as there would be violent agitations by the MIM leaders of old city as seen in a number of cases in the pasat in Hyderabad like St Ann's college in Mehdipatnam...."

You are perfectly correct in your perception. This kind of selective protests are quite unhealthy in a society.

Thirmal Reddy said...

@Ramu

Sir jee, speak up.... and let me believe in you. Over and Out...

Q1). I say you are not biased against bossism or gender or any other discrimination. What's your UN-BIASED ANSWER TO LBS'S QUESTIONS. If he is an idiot come up with constructive criticism. Why should I expect an immature first reaction from you as you've did?

Q2). A feminist is considered a feminist and we still give them good mileage in media. But, a male chauvinist is always considered a RAPIST BY ANY MEANS (good or bad). How do you differentiate between them.

Q3). I can give you live examples of OUR OWN MEDIA - ANCHORS-COPY EDITORS-JOURNALIST females (with names and identity) who have been into their one-sided adultery. How would you defend yourself or your article. Are you being a fair-sex chauvinist?

Q4). I was a journalist in Telugu media for several years and worked with several FEMALE ANCHORS AND I HAVE BEEN A FIRST HAND WITNESS TO SEVERAL MUTUALLY-AGREED SEXUAL ARRANGEMENTS between anchors and bulletin producers who are now in other channels. What's your say?

Q5). Did you NEVER come across any incident in your entire media experience about SEXUAL FEMINIST OR SEXUAL MALE CHAUVINIST. BE TRUE TO YOURSELF?

Q6). Just being simple.... if you are mature enough why did you overreact to LBS'S first post.

And let me be confident that you are not that run-of-the-mill kind of media bloggers but a proper say-it-as-you-see-it media blogger.

LET TRUTH PREVAIL

Thirmal Reddy Sunkari
thirmal.reddy@gmail.com
mobile: 9848621931
twitter: twitter.com/thirmalreddy
facebook: facebook.com/thirmalreddy

bobby said...

Dear Ramu

So far as Kaushik is concerned , these are allegations by one player out of 30 players in the camp.Let the enquiry go on. Some of the papers reported that out of 30 players 29 said he has not misbehaved with them. He has been Indian Team Coach since 1999.There were no complaints against him. Pl do not jump to the conclusions as some channels do and let there not be judgement with out enquiry.

Of late we are finding ,especially the media instead of reporting the incidents under the guise of investigative journalism resorting to what is called ~trial by media~ and also coming to conclusions as if they are already guilty. In the process if some body who is really innocent is facing all sorts of embarasment and his reputation is tarnished in the eye of public.So my opinion is let us not come to conclusions on the basis of initial reports.

శరత్ కాలమ్ said...

@ మలక్
అందుకే వర్క్ ఎథిక్స్ మారాలంటాను :) హరాస్ చేయడం వేరు , ప్రపోజ్ చేయడం వేరు. ప్రపోజ్ చేయడాన్ని అభ్యంతరకరంగా భావించవద్దు. దానిని సాధారణంగా తీసుకోవాలి. ఒకసారి నో అని చెప్పినా పదేపదే రిక్వెస్ట్ చేయడం హరాస్‌మెంట్ అవుతుంది.

మన ఖర్మగాలి నాగరికత నేర్చుకొని మరీ సున్నితం అయిపోయాము కానీ పల్లెటూర్లలో ఇలాంటి విషయాలు సులభంగా తేలిపోతాయి! ఏం సంగతి అని మగాడు ఆర్ధోక్తితో అడుగుతాడు. సంగతేం వుంది అని ఆడది చిరునవ్వుతోనో, అరనవ్వుతోనో అందనుకోండి - పని అయిపోయినట్లే. సంగతేం వుంది అని ఆడది గద్దించినట్లో, కరకుగానో అందనుకోండి ఆమెకు ఇష్టం లేదన్నమాట. సింపుల్. ఓ మనలాగా వాళ్ళు ఇలా కిందా మీదా పడరు. ఎథిక్స్ అంటూ కేసులూ వెయ్యరు.

ఇహ ఎథిక్స్ మాటకోస్తే పరాయి ఆడదాన్ని కామించడం మాత్రం ఎథిక్సా? తాడేపల్లి గారన్నట్లు పెళ్ళాన్ని అన్ని వేళలా కామించడం కూడా ఎథిక్స్ కాదు కదా. పెళ్ళానికి మూడ్ వున్నప్పుడు, ఆరోగ్యం బావున్నప్పుడు, ఆ మూడు రోజులు కానప్పుడు, ఆమె ఓఖ్ఖే అన్నప్పుడు, ఆమె వంగోబెట్టి తన్ననప్పుడు, ఆమె మనోభావాలు గాయపడనప్పుడు, సగౌరవంగా, సున్నితంగా చేసేదే ఎథికల్ సెన్స్/సెక్స్ అనిపించుకుంటుంది మరి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆమెకు ఎందుకన్నా, ఎక్కడన్నా మండి నా మొగుడు బలాత్కారం చేసేడని పోలీసు కంప్లయింట్ ఇచ్చినా ఇవ్వచ్చు. మళ్ళీ మూసుకొని కూర్చోవాల్సింది మగడే.

ఇన్ని ఎథిక్స్ నాకొద్దు బాబూ - కొన్ని చాలు ఈ ఆల్ప ప్రాణికి.

karthik said...

Extramarital and illegal relationships betwen men and women are very comon in almost all proffessions of the society and is nothing new

ఒక సమాజం గా మనం ఎక్కడికి దిగజారామో చెప్పడానికి ఈ ఒక్క లైన్ చాలు..

Anonymous said...

నేను తాడేపల్లి గారి తో 100% పూర్తి గా ఏకీభవిస్తున్నాను. మలక్ గారు ఇండియా లో ఒక్కోక్క కంపెనీ 9 గం|| పనిని అఫిషియల్ గా చేశారు. నిద్దర లేచిన మొదలు రాత్రి వరకు ఉద|| 9 నుంచి రాత్రి 9 వరకు కాలం ఆఫిసులో గడుపుతుంటె వర్క్ ప్లేసులో ప్రపోసల్ చెప్పటం పెద్ద తప్పు గాదేమో.

Anonymous said...

ఫెమినిస్టులు మన మేధో ఆవరణాన్ని ఎంతగా దురాక్రమించేశారో ఇక్కడ ఒకాయన నా గుఱించి చేసిన కామెంటు చూశాక అర్థమవుతున్నది. నేను స్త్రీలని ద్వేషించడానికి వారు నాకేం అపకారం చేశారండీ ? నా బ్లాగులో ఒకే ఒక టాపిక్కు ఉండదు. వందలాది టాపిక్కులు ఉంటాయి. నేను స్త్రీల గుఱించి వ్రాయడమే చాలా అఱుదు. వాస్తవ పరిస్థితి ఇది కాగా నేను స్త్రీద్వేషినని వ్యాఖ్య వ్రాయడం ఉద్దేశపూర్వక దుష్ప్రచారం కాక మఱేంటి ? తద్విపర్యాసంగా - అసలు స్త్రీల వల్ల నాకంటే ఎక్కువ లాభపడ్డవారెవఱూ లేరేమో ! అయితే దానికి స్త్రీ-ఆనుకూల్యం గల నా వ్యక్తిగత జాతకలక్షణం కూడా ఒక కారణం కావచ్చు. సరే, అది విషయాంతరం. పబ్లిక్ కి సంబంధం లేదు.

ఆర్యా ! ఫెమినిస్టుల తప్పుడు ప్రచారాల్ని, తప్పుడు సిద్ధాంతాల్నీ ఖండించడమూ, స్త్రీలని ద్వేషించడమూ ఒకటి కాదు. ముందు ఈ ABCD నేర్చుకోండి. ఫెమినిస్టులు స్త్రీల హక్కుల ముసుగేసుకొని మగవాళ్ళ గుఱించి రోజూ కూసే పురుషద్వేషపు కాఱుకూతలన్నింటికీ నోరు మూసుకొని గొఱ్ఱెలా తలూపితేనే నేను మంచివాణ్ణవుతానా ? అభ్యుదయవాది నవుతానా ? స్త్రీలందఱి తరఫునా వకాల్తా పుచ్చుకుని తమ సంకుచితత్వాల్ని తీసుకొచ్చి అవి యావత్ స్త్రీజాతి యొక్క అభిమతంగా ప్రచారం చేసే ఏకచ్ఛత్రాధిపత్యపు హక్కు ఫెమినిస్టులకి లేదు. ప్రతిస్త్రీ ఒక విశిష్టమైన వ్యక్తి. స్త్రీలందఱినీ ఫెమినిస్టులు చిత్రించే మూస-స్టీరియోటైప్ లో చూసే సంకుచితత్వం నాకు లేదు. వారిలో, వారి వ్యక్తిత్వాలలో, వారి అవసరాలలో అనంతమైన వైవిధ్యం ఉన్నది. వారంతా బఱ్ఱెల్లా గొఱ్ఱెల్లా ఒకే విధమైన వ్యక్తులని ప్రచారం చేస్తూ పాపం మూటగట్టుకుంటున్నది ఫెమినిస్టులే.

మగవారి న్యాయమైన హక్కుల కోసం వాదించడం స్త్రీలని కించపఱచడం అవ్వదు. నేను గత నాలుగేళ్ళుగా బ్లాగులలో వ్రాస్తున్నాను. నేనెప్పుడూ స్త్రీలని కించపఱుస్తూ ఏమీ వ్రాయలేదు. నా అభిమానులలో అనేకమంది మహిళా పాఠకురాళ్ళు కూడా ఉన్నారు. నా బ్లాగు ఆన్‌లైన్ లోనే ఉన్నది. అందఱూ వచ్చి హాయిగా చదువుకోవచ్చు. నా బ్లాగు URL :

http://www.tadepally.com

నా అభిప్రాయాల్ని నా జీవితకాలంలో ఎవఱూ అర్థం చేసుకోలేకపోవచ్చు. ఆ మర్యాద సమకాలీనుల నుంచి ప్రతివారికీ అందేదే. ఫర్వాలేదు. ఎందుకంటే మన చారిత్రిక అనుభవాల దృష్ట్యా మూస-అభిప్రాయాలకి భిన్నమైన అభిప్రాయాలు గలవారు ముందస్తుగా ఎల్లప్పుడూ అపార్థం చేసుకోబడుతూనే ఉంటారు. అదో పెద్ద సమస్యేమీ కాదు. మంచి విషయాల పురోగతి స్వాభావికంగానే మిక్కిలి నెమ్మది.

శుభమ్. స్వస్తి

critic said...

రంజితాదేవిగారితో పాటు ఇంకో ముప్ఫైమంది క్రీడాకారిణుల కోసం కూడా కౌశిక్ ప్రయత్నించి విఫలమయ్యాడని ఊహిస్తున్న తాడేపల్లి గారికి ఆయన మీద profound respect! కానీ పాపం, ఫిమేల్ సైకాలజీ తెలియకే అభాసుపాలయ్యాడని ఆయన మీద జాలి. క్రీడాకారిణుల కెరియర్ ని దెబ్బతీయకుండా, పట్టు వదలని విక్రమార్కుళ్ళాగా ‘ప్రేమ ప్రతిపాదనలు’ చేస్తూ పోతుంటే మాత్రం ఏమీ తప్పు పట్టకూడదన్నమాట. భేష్!

ఓ పిడకల వేట- బండీ ర (ఱ)ని కూడా మర్చిపోకుండా పట్టుదలగా రాసే భాషావేత్త తాడేపల్లి గారు ‘ఆడ ఉద్యోగినులు’, ‘మహిళా క్రీడాకారిణులు’ అంటూ పునరుక్తులనదగ్గ ప్రయోగాలు చేయటం..ఆయన వాదన మల్లే విచిత్రంగా తోస్తోంది.

dhana said...

This is just atrocious to read for supporting a coach trying for a sexual relationship with a student.
In view of mr. Tadepalli and Sarat its nothing wrong for sending signs for a relationship for common girl or a women who is not relate professionally.

If Mr Sarat's wife or sister went outside and face the same humiliation and explains the pain what they had may realize to situation.

I strongly support your view Ramu garu , at same time you should write about how a women has to face these type of murky episodes.
What we are doing is condemning the bad but not creating how it should be handled

Unknown said...

na abiprayam prakaram ee vishayam lo ranjitha thappu kuda unde untundhi anukuntunnanu. endhu kante rendu chethulu kalisthe gane chappatlu. sex lo participate chedham ani kousik adigadu ante ranjitha chanuvu isthe ne kadha kousik adigedhi.aa liniance aame ivvakunda swyamyamga kousik adige behaviour kousik dhi anukunte itlanti vishayam eppudo bayata padedhi. nijamga valla idhari madhya relation ela vundendho,gatham lo vallu ela unde vallo manaku poorthiga theliyadhu .vallu ela unde vallo manam anni chudaledhu.kabatti manam okkarine blame cheyyalem. ranjitha nijamga right person ayithe atlanti probs kousik nunchi vachina starting lone complaint cheyyali. kani ipudu scene create chesthe ela. nenu oponion mathram ranjitha,kousik ki vere vishayallo differences vachi untay.ranjitha ee vishayalnu advantage ga theesukoni scene create chesthindhi anukuntunna.

Vinay Datta said...

I agree with Malakpet garu. I was shocked to read the statements empathizing those people.
In the name of 'freedom' of many kinds the society is moving towards unethical way of living. If such kind of freedom should prevail, let's all together abolish the institution of marriage. Then nobody can question another.

WitReal said...

LBS & Sarat:

I agree with you & your argument is valid in most of the contexts, except for "certain" situations.

A teacher/coach is _expected_ to be above the "ordinary" crowd.

Now that dictum is framed by society.

if you question the society norms, then that will be a different discussion.

Ramu S said...

తిరుమల్ అండ్ అదర్స్...
అయ్యా...నేను ఆడా, మగా సంబంధం గురించి, consensual sex గురించి మాట్లాడడం లేదు. ఒక కోచ్ కు క్రీడాకారిణికి, టీచర్ కు విద్యార్ధినికి మధ్య ఉండకూడని సంబంధం గురించి మాట్లాడుతున్నాను. కోచ్ లు, టీచర్స్ పిల్లలను exploit చేస్తే మొత్తం వాతావరణం పాడై ఆ వ్యవస్థలు దెబ్బతింటాయి.

ఆ క్రీడాకారిణి ప్రమేయం ఉండి ఉండకపోదు అని బాబీ గారు అన్నారు. ఇలాంటి ఘటనలు గమ్మత్తుగా జరుగుతాయి. కోచ్ ప్రపోజ్ చేస్తే...ఆరంభంలో ప్లేయర్ అయోమయానికి, అమాయంకంగా ఆనందానికి గురికావచ్చు. ఇతరులకు తెలియకుండా...కోచ్ చెప్పినట్లు విని కొంత ఎంజాయ్ కూడా చేసే అవకాశం ఉంది. అది మంచిదో కాదో తెలుసుకునే లోపు ఆ రొంపి లోకి దిగబడిపోవచ్చు. కలీగ్స్ మధ్య గానీ...ఎవరో ఆడ, మగ మధ్య గానీ ఇలాంటి సంబంధం వారి వ్యక్తిగతం కానీ...ఒక వ్యవస్థను నడిపే వాడు (కోచ్, టీచర్, బాస్) కింది ఉద్యోగినులను (ప్లేయర్, స్టూడెంట్, ఎంప్లాయ్) లను exploit చేయడం ముమ్మాటికీ తప్పు. ఒక వేళ ఈ సంబంధం బైట పడి రచ్చ అయినా...ఎక్కువగా తప్పు పట్టాల్సింది ఆ కోచ్, టీచర్, బాస్ నే అన్నది నా నిశ్చిత అభిప్రాయం.
రాము

Praveen Mandangi said...

తాడేపల్లి గారు ఇంతకు ముందు ఇలాగే మాట్లాడారు. ఆడవాళ్లు తాగితే చెడిపోతారని, మగవాళ్లు తాగితే చెడిపోరని వాదించారు. సెక్స్ చెయ్యడం తప్పా, కాదా అనే విషయం అటుంచితే సెక్స్ కి పిలిస్తే రాలేదని డబల్ మీనింగ్ లు మాట్లాడడం సంస్కారం కాదు. ఈ విషయంలో కోచ్ చేసినది తప్పే.

Anonymous said...

ప్రవీణ్ శర్మా ! ఈ జాలంలో పనిగట్టుకొని నా మీద దుష్ప్రచారాలు చేసేవాళ్ళలో నువ్వున్నావని నాకు పదే పదే గుర్తు చేయనక్కఱలేదు. నువ్వు ఈ విషయమై నీ సైటులో ఏకంగా ఒక టపానే రాశావని నాకు గుర్తు. మనుషుల మధ్య అభిప్రాయభేదాలు ఉండడంలో తప్పులేదు. కానీ ఆ ప్రాతిపదిక మీద అననివి అన్నట్లు చెప్పడం ఏ రకమైన సైద్ధాంతిక భావజాలం కిందకొస్తుందో వీర మార్క్సిస్టువైన నువ్వే ఆలోచించుకోవాలి.

నేను వాస్తవంగా అన్నది ఇది : "మగవాళ్ళు తాగితే సమాజం సగం చెడిపోయినట్లు. ఆడవాళ్లు కూడా తాగితే పూర్తిగా చెడిపోయినట్లు."

కేవలం ఆడ-మగ జనాభా నిష్పత్తిని దృష్టిలో ఉంచుకొని పరిశీలించినా ఇది నిజమే కదా ! నేనన్నదాంట్లో రాజకీయంగా సాధువు కానిది ఏముందో నాకర్థం లేదు. But don't expect me to be poltically correct everytime, because I am not going to run for Andhra's Presidency in the coming elections. Speaking out what I deem and understand to be a fact is more important to me than gaining popularity, even if it does not fall within the accepted degree of political correctness. Admittedly, there's is an inherent risk in it because people always prefer to listen to what they think music. Unfamiliar music is always an object of hatred.

Workplace ethics గుఱించి ఊరికే నీతులు చెప్పడం కాదు. నీతులు నాకూ తెలుసు. వాటిని ఇతరుల విషయంలో మనం ఏ మేఱకు అన్నిపార్టీలకూ నష్టం లేకుండా అమలు చేయగలమనేది కూడా ఆచరణాత్మకంగా ఆలోచించుకోవాలి. నేఱాలనేవి ఎక్కణ్ణుంచో హఠాత్తుగా ఊడిపడవు. నేఱస్థులనేవాళ్ళు ఎక్కణ్ణుంచో హఠాత్తుగా దిగిరారు. మనం రోజూ చేసే పనులే కొన్ని అనూహ్య సందర్భాల్లో వికటించి నేఱాలుగా మారతాయి. మన Workplaces లో రోజువారీగా జఱుగుతున్న ఆ పనులేంటనేవి నాకు కావాలి. కొందఱు మగవాళ్ళని నేఱస్థులుగా మారుస్తున్నఅసలుసిసలు పరిస్థితుల గుఱించిన నిజాయితీ చర్చ నాకు కావాలి. నేఱాలు జఱక్కుండా చూడ్డమే మన లక్ష్యం కావాలి. అంతే తప్ప జనాల నైతికతని అదుపు చేయడం కాదు. ఎందుకంటే ఈ రెండో పని అసాధ్యం. That's why, I don.t basically find fault with Mr.M.K.Koushik. Given an opportunity, almost everyone will behave like him.

శరత్ కాలమ్ said...

@ rajbommareddy
నా భార్య అయినా మీ భార్య అయినా, నా సోదరి అయినా మీ సోదరి అయినా, ఎవరయినా కాస్త అందంగా, ఆకర్షణీయంగా వుంటే క్యూస్ వస్తూనేవుంటాయి. ఇష్టం లేకపోతే వాటికి స్పందించరు - ఇష్టం అయితే ముందుకువెళతారు. ఆ క్యూస్ అన్నది సహజం. అలా క్యూస్ రాలేదంటే ఆ స్త్రీలో విషయం లేదని అనుకోవాల్సివుంటుంది. క్యూలకు స్పందించకున్నా కూడా వేధిస్తే మాత్రం పొరపాటే.

అలా ఎవరెవరి దగ్గరనుండి క్యూస్ వచ్చాయో నా భార్య నాకు చెబుతూనేవుంటుంది. తేలిగ్గా నవ్వేసి ఆ విషయాన్ని మరచిపోయి ఆ వ్యక్తితో క్యాజువల్గా వుంటాం. ఆ మాత్రం దానికే కేసులు పెట్టం. వేధించడం అన్నది ఇంతవరకు జరగలేదు. అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలో మాకు బాగా తెలుసు.

WitReal said...

>> తాడేపల్లి గారు ఇంతకు ముందు
>> ఇలాగే మాట్లాడారు.
>> ఆడవాళ్లు తాగితే చెడిపోతారని,

Contrary to popular belief, Marthanda brings interesting cross references sometimes ;)

I agree with LBS on that above statement.

I extend LBS's reasoning (on that previous topic) to this current context. A teacher/coach has to "behave".

period.

What do you tell when your loved one is going to work?
Something like: ఆఫీస్ లో 'మగాడి'ద లుంటాయ్ జాగ్రత్త!

What do you tell when your loved one is going to school/learning classes?
Something like: మాస్టారు చెప్పినట్టు వినాలి

LBS & Sarat: Did you see now?

Anonymous said...

There's no scarcity for perverts like these ppl in india...these issues came into limelight just bcoz those victims had enough guts to project these rotten minded bastards! (Sorry sir!But these ppl deserve to be called as bastards...!) But there are many more in our society which r yet to come into limelight...!

I wonder if this wud ever change!!

krishna said...

http://timesofindia.indiatimes.com/sports/more-sports/hockey/Coach-Kaushik-told-me-its-good-to-have-sex-Ranjitha/articleshow/6204136.cms

it doesnt seem to be sexual harassment sir!

బాలు said...

నమస్తే రాము గారు, నా పేరు బాలకృష్ణ నేను మీ బ్లాగ్ చూసి చాల సంతోషించాను ఎందుకంటె నిజమేనా జర్నలిజం అంతే ఎలాఉండాలో చుపిస్తున్నందుకు, న్యూస్ కి బ్రికింగ్ న్యూస్ కి తేడ తెలియని ఎన్నో టీవీ చానాల్స్ మన చుట్టూ వున్నాయి...... ఒక సామన్యుడు గురించి పట్టించుకోవటానికి ఒక్క చానాల్ కూడా లేదు, నాకు చిన్నప్పటి నుండి జర్నలిస్ట్ కావాలి అనేది నా కోరిక i have to do something to society sir. అందుకు మీలాంటి మంచి మనుసుల సలహాలు నాకు అవసరం రాము గారు.ఎక్కువగా మాట్లాడితే క్షమించండి.

-బాలకృష్ణ

Vinay Datta said...

Instead of showing concern for our way of living like spending more ours in office than at home with family... increasing extra marital affairs...the degeneration of values...I'm again and again shocked to read discussions on 'a man is right or a woman is right'. Don't you (most of you) all feel bad about all this? If extra marital affairs are right, why shouldn't a coach, trainer, teacher or a guru have it with a student? We cannot get into the subtleties of any issue without discussing the base of it.

WitReal said...

@ Madhuri

>> why shouldn't a coach, trainer,
>> teacher or a guru have it with
>> a student?

you just stopped short of including incest in the list.

thats where the norms come guide.

katta jayaprakash said...

It is true that every one must show concern at the degeneration of human,ethical values in our society about the way of living as there are more and more extra marital relationships,sex with mutual consent etc.Infact majority of people are against this trend of the day and no respectable family nor a respectable citizen will make friendship with such degraded people.But can any one prevent it?What about film stars?They are all in the sea of unethical life with all sorts of illegal thngs etc.But still they occupy the seats beside President and Prime Minister,Chiefministers,governors and at all important events irrespective of their extra marital and other affairs.It does not mean that we all support it,encourage and patronise it.But such type of peole are being honoured and given respect.If caughtthief vand if not caught he is lord.There are many people like the Director of Parkwood School and coach Kaushik an the incident of the school is only a tip of iceberg.Even though Nityananda was involved in sexual afairs with his devotee he is still giving sermons and a good number his devotees arev attending it.How to take all these things?
But such type of people are in minority only and one need not worry and it is the media which is highlighting but it has to be condemned and the concerned people of such scandals must be severly punished.But Iam afraid it might not end thrre!
The subject of human and spiritual values must be included from KG to PG and all proffessional education levels atleast to bring awareness among the youth the need of these values in their lives.
JP.

kattashekarreddy said...

dear sir,

once u use your position to exploit women, what smooth it is, what ever languse u use, it is atrocious on women. perversions will have no logic.

shekar

ప్రేమిక said...

hi ramu sir how r u??

@ tadepalli
i am asking only one question..? sex is not a sin but it has some limitations. our ancients had put some ethics regarding sex. they should be carried with generations. if the coach really needs sex he should marry him.. is not necessary to maintain the ethics?

Malakpet Rowdy said...

Workplace ethics గుఱించి ఊరికే నీతులు చెప్పడం కాదు. నీతులు నాకూ తెలుసు.
_____________________________________

I think this is directed at me, so lemme answer :))


నేను చెప్తోంది కేవలం నీతులు కావండీ. దాదాపు అన్ని కంపెనీల్లో ఉండే మార్గదర్శకాలే. ఇదే సంఘటన నేను పని చేసిన, చేస్తున్న చోట జరిగుంటే, అతన్ని ఉద్యోగంలోంచి తీసెయ్యడానికి అట్టే సమయం పట్టదు.

But again, this is based on my assumption that this thing had happened at work.


Given an opportunity, almost everyone will behave like him.
___________________________________


Dont generalize the things please.


Srikar,

Spending 9 hours at work together cant justify inappropriate behavior. Of course its a different issue if the academy allows such kind of behavior, but I really doubt it would.

Malakpet Rowdy said...

Speaking of the radical feminists, I oppose them more than you do and you know it well.

I dont think this would really interest the feminists, for those feminists are more interested in hating males than helping the females out.

Malakpet Rowdy said...

Sarat,

Does your HR dept allow you to say the same things at your work place?

తెలుగు వెబ్ మీడియా said...

సెక్స్ కి పిలిస్తే రాలేదని డబల్ మీనింగ్ లు మాట్లాడడం సంస్కారం ఎలా అవుతుంది? ఏ కీచకుడైనా తాను పిలిచిన ఆడది రాకపోతే డబల్ మీనింగ్ లు మాట్లాడుతాడు. కౌశిక్ చేసినది అదే అని హాకీ క్రీడాకారిణి చెప్పింది. ఇక్కడ సెక్స్ తప్పు అని అనడం లేదు కానీ ఎవరిని పడితే వారిని సెక్స్ కి పిలిస్తే రారు తాడేపల్లి గారు.

శరత్ కాలమ్ said...

@ మలక్
మా ఆఫీసులో కూడా లైంగిక వేధింపులు సహించరు. క్యూస్ ఇవ్వడం, క్యాజువల్గా ప్రపోజ్ చెయ్యడం సెక్సువల్ హరాస్మెంట్ క్రిందికి వస్తుందా రాదా అన్నది నాకు తెలియదు. నాకు ఇంతవరకు అంతటి అవసరం రాలేదు కాబట్టి దాని గురించి రెసెర్చ్ చేయలేదు. ఒహవేళ అలాంటి చిన్న చిన్న విషయాలను కూడా వేధింపు అనుకునే పాలసీ మారాలని, జనాల్లో మార్పు రావాలని కోరుకుంటాను. పరిస్థితి ఇలాగే పోతే కసిగా చూసినా కేసులు పడే పరిస్థితి దాపురిస్తుంది. అప్పుడు మగాళ్లందరరూ కాస్ట్రేషన్ చేయించుకోవడమో లేక కళ్ళకు గంతలు కట్టుకోవడమో లేక వర్క్ ఫ్రం హోం చేస్తూ పాతచింతకాయ పచ్చడి పెళ్ళాన్నే కసిగా చూస్తుండమో చేయాలి.

జనాలకి వేధింపులకి, విజ్ఞప్తిలకు తేడా అర్ధం కాకపోవడం నాకు విచిత్రంగా అనిపిస్తోంది. రెండింటినీ ఒక్క గాతనే కట్టివేస్తే ఇలాంటి సున్నితతత్వం ఎక్కువయ్యి "కంటి చూపుతో చూసావంటే కేసేస్తా" అన్న డవిలాగులు ముందుముందు సాధారణం అయిపోతాయి.

శరత్ కాలమ్ said...

@ మలక్
మా ఆఫీసు సెక్సువల్ హరాస్మెంట్ పాలసీలో ఏం వున్నా తరువాత ఎలా అన్వయిస్తారో తెలియదు కనుక ఎందుకయినా మంచిదని అందమయిన ఆడాళ్ళు ఎదుట వస్తుంటే తలవంచుకొని ఓరచూపులు చూస్తూ 'ఎ పి మీడియా కబుర్లు రాముడు ' మంచి బాలుడు అన్న లెవల్లో తెగ బుద్ధిమంతునిగా నడుస్తా, నేను వెనక వుంటే మాత్రం కళ్ళతో వాళ్ళను చంపేస్తా. ఇలా ఆడాళ్లని దొంగచాటుగా వెనుక నుండి చూడటం కూడా నైతికంగా తప్పని నీ పెళ్ళాన్నో, సొదరినో అలా వెనుక నుండి చూస్తే నీకెలా వుంటుంది అని అడిగేవాళ్ళుంటారని, నీతి బోధకులు వుంటారని నాకు తెలుసు. అందుకే మా ఆవిడకి ఘోషా వేయిద్దామని చూస్తున్నాను లేదా ఇంటినుండి బయటకి రావద్దని ఫత్వా ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నాను. మా ఆవిడ ఇండియా నుండి రాగానే బుర్కా తగిలించాల్సిందే. ఇవాళే ఆర్డరిస్తా. ఎందుకంటే దేశంలో వున్న మొగాళ్ళందరివీ .... నలగ్గొట్టడం నావల్ల కాదు కాబట్టి నావల్ల అయేపని పెళ్ళానికి ముసుగేయడమే.

శరత్ కాలమ్ said...

@ మలక్
పైన క్రిష్ణ ఇచ్చిన లింక్ చూసాను. ఇది ఇండియాలో జరిగింది కాబట్టి ఈ వార్త మీద నాకు అంత అవగాహన లేక తాడేపల్లి గారిచ్చిన వివరణ మీద ఆధారపడి అభిప్రాయం ఏర్పరచుకున్నాను. క్రిష్ణ ఇచ్చిన లింకులో వున్న విషయాలు నిజమయితే రంజిత మౌనంగా వున్నా పదే పదే ఆ విధంగా సూచించాడు కాబట్టి ఇది విజ్ఞప్తి కాదు ఖచ్చితంగా వేధింపే. విజ్ఞప్తి అనేది ఒకటి రెండు సార్లు వుంటుంది. మహా అయితే మూడు సార్ల వరకు ఓకే. అంతకుమించితే అది వేధింపు క్రిందికి లెక్కే.


@ అందరికీ

ఈ విషయంలో సరి అయిన సమాచారం చదవక అనౌచిత్యంగా ఇప్పటివరౌ స్పందించినందుకు అందరూ నన్ను క్షమించగలరు. సెక్సువల హరాస్మెంటుకి నేను ఎప్పుడూ వ్యతిరేకమే. శ్రంగారం అనేది కాన్సెసువల్ గా వుండాలి. ఇలాంటిది మా ఆఫీసులో జరిగితే తక్షనం ఉద్యొగం నుండి పీకెస్తారు. అది సబబు కూడా.

సత్యేంద్ర said...

సమాజానికి దిశానిర్దేశం చేయవలసిన వారు, మనోవికారాలు ప్రదర్శిస్తూ, తప్పులు చేస్తే, వారికి పడే శిక్ష, మరోసారి అటువంటి తప్పు చేయడానికి అవకాశం లేకుండా ఉండాలి. మరెవ్వరూ ఆ తప్పులు చేయడానికి భయపడేలా ఉండాలి. ఆటువంటి రోజులు రావాలి.

krishna said...

@ శరత్ గారు, @ రాము గారు,
నేను సరిగా ఆలోచించటం లేదేమో? కొంత కంఫ్యూజన్ గా వున్నాను.ఈ విషయం లో నాది స్ట్రాంగ్ స్టాండ్ కాదు. నేను తప్పు కావచ్చు. ఇవి నా అనుమానాలు మాత్రమే!
మౌనం గా వుంటే ఆ ప్రతిపాదన తిరస్కరించినట్టు ఎలా అవుతుంది?
మౌనం అర్ధాంగీకారం, అర్ధానంగీకారం!
డైరెక్ట్ గా కేసు పెట్టేకంటే ఆవిడ నాకు ఇలాంటివి ఇష్టం లేదు అని చెప్పుండాల్సింది.
కౌశిక్ గారు కూడా రంజిత గారు సిగ్గు పడుతుంది కామోసు అని మాటి మాటికి అలా అనుండొచ్చు కదా! డబుల్ మీనింగు అన్నది ప్రశ్నే కాదు!పచ్చిగా మాట్లాడక పోవడం కూడా డబుల్ మీనింగే!(అంత కన్నా బెటరు కూడా)
మాటి మాటికి అలా మాట్లాడారు అన్నది.. సెక్సువల్ అబ్యూజ్ అవుతుందా?
రంజిత గారు మైనర్ కాదేమో కదా!
కోచ్ ని గురువు అనుకోడం వేరు.. ఒక నిపుణుడూ అని కూడా అనుకోవచ్చు. వర్క్ ప్లేసులో కూడా మన సీనియర్లు మనకి పని నేర్పిస్తారు. ఒక టీం లీడర్ కొత్తగా జాయిన్ అయిన ఫ్రెషర్ కి ప్రపోజ్ చెయ్యడం తప్పా?
ఒక కాలేజ్ లో కొత్తగా లెక్చరర్గా జాయిన్ అయ్యిన ఫ్రెష్ పొస్ట్ గ్రాడ్యుయేట్ , ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కి ప్రపోజ్ చెయ్యడం తప్పా ?
పెళ్లి చేసుకోమని అడిగి వుంటే ఎథిక్స్ పాటించినట్టునా? లేక వర్క్ ప్లేస్ లో సెక్స్ కోసం ప్రపోజ్ చెయ్యడం ఎథిక్స్ పాటించకపోవడమా?
వివాహేతర సంబంధం చట్ట బద్ధం కాదు... పరస్పర అంగీకారం తో సెక్స్ ఇద్దరు మేజర్ల మధ్య చట్ట బద్ధమే కదా! మరి పరస్పర అంగీకారం తో సంబంధం ఏర్పరుచుకోవాలంటే మరి ప్రపోజ్ చెయ్యాలి కదా! ప్రపోజ్ చెయ్యడం కాకుండా ( ఒకటి కంటే ఎక్కువ సార్లు ) ఇంకా ఎక్కువ ఏమైనా చేసుంటే అది కౌశిక్ గారు చేసిన నేరం ..అప్పుడు ఆయన శిక్షార్హుడే!

Saahitya Abhimaani said...

RAMUJI,

The discussions in your blog are normally confined to Media and its ability or inability to cover news and other matters. The discussions have created two schools of thought. If the minority school of thought takes credence, it would become still more horrible for womenfolk to come out of their houses leave alone working in an Office etc.

Because there is some fear among men that they would become unpopular and more importantly there is a law against their misbehaving with women, the incidents about which you wrote are uncommon in a country of 110+ crore population.

My concern is that the discussion has not focussed on media's role in reporting such incidents. Reading some of the comments, we can understand that exploitation of women sexually is very common in media circles. While media is over enthusiastic to pounce on such incidents to broad/telecast, is it not necessary to cleanse its own backyards first. Who shall report about such KEECHAKAs in media. Just because they are in Media,they go scot free!!!???

Kathi Mahesh Kumar said...

హ్మ్ చర్చ చిత్రంగా ఉంది.
తాడేపల్లి గారికి కుహానా,twisted హిందూ విలువలేతప్ప భారతీయ రాజ్యాంగం, మానవత్వం అనే విషయాల మీద పెద్దగా నమ్మకం లేదు. కాబట్టి ఈ చర్చంతా వ్యర్థం.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి