ఎన్నడూ లేనిది ఈసారి ఈ ఈ-తెలుగు వారి వల్ల మాతృభాషా దినోత్సవానికి ఒక వారం పది రోజుల ముందు నుంచే మాతృభాష పై బెంగ మొదలయ్యింది నాకు. తెలుగు గురించి ఇంత తీవ్రంగా జన్మలో ఎప్పుడూ ఆలోచించలేదు.
నేనేమో ఇంగ్లిష్ మీడియం పిల్లలకు పాఠాలు చెబుతున్నాను. నా ఇద్దరు పిల్లలను స్కూల్లో చచ్చినా తెలుగు మాట్లాడవద్దని తరచూ చెబుతూ ఉంటాను. పదో తరగతి చదివే కూతురు గుణించుకోకుండా ఒక రెండు తెలుగు వాక్యాలైనా గబగబా చదవలేదు. ఇలాంటి తప్పు పిల్లవాడి విషయంలో జరగకూడదని...ఐదో తరగతిలో తెలుగు ఐచ్ఛిక భాషగా చేసినందుకు వాడు నన్ను దెప్పుతున్నాడు. 'నేను సాంస్క్రిట్ (సంస్కృతం) తీసుకుంటా అంటే...ఈ తెలుగు తీసుకోమన్నావు,' అని రెండు మూడు సార్లు ఇప్పటికే అన్నాడు.
నాకేమో...ఎవడైనా...తెలుగులోనే మాట్లాడతానని ప్రతిజ్ఞ చేద్దాం...రమ్మంటే ఒళ్ళు మండుతుంది. ఒక తెలుగు పేపర్ ను నమ్ముకోబట్టి నా జీవితమంతా నాశనం అయ్యింది. అదే అప్పట్లోనే ఒక ఇంగ్లిష్ పేపర్లో చేరి వుంటే...ఇప్పటికి కనీసం ఎడిటర్ స్థాయికి వచ్చే వాడిని. 'అరె...ఇంగ్లిష్ తేలిగ్గా నేర్చుకోవడం ఎలానో చెప్పు. ఈ తెలుగు లో స్కోపు తక్కువ,' అని చాలా మంది మిత్రులు అంటూ ఉంటారు. వారన్నది పచ్చి నిజం. పిడకలు అమ్ముకునే వారు, భూ దండాలతో తెగ బలిసిన వారు పేపర్లు/ఛానెల్స్ పెట్టాక...పాపం నా తెలుగు జర్నలిస్టు సోదరుల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అదే గనక వీరు ఏదైనా ఇంగ్లిషు పేపర్లో చేరి వుంటే...మా రమణ అన్నయ్య లాగా అతని లాంటి ఇతరుల లాగా మరిన్ని అవకాశాలకు దగ్గర అయ్యేవారు.
ఈ పరిస్థితులలో...'తెలుగు కై నడక' అని ఒకటి పెట్టారు. శీర్షికలలో ఈ 'కై' అని పెడితే..."'కై...కుయ్' మని ఎవరంటారో తెలుసా? హాయిగా 'కోసం' అని ఏడవచ్చు కదా..!" అని గురువు గారు అన్నట్లు గుర్తు. సరే...HM-TV తో మీడియా భాగస్వామ్యం కోసమని ఉత్సాహవంతుడైన యువకుడు సతీషు, తెలుగు పట్ల మంచి మమకారం ఉన్న సుజాత గారు స్పందిస్తే...ఉడతా భక్తిగా తెరవెనుక కొంత కసరత్తు చేశాను.
"ఇకపై చచ్చినట్లు తెలుగులోనే మాట్లాడతాను, తెలుగే రాస్తాను," అని ప్రతిజ్ఞ పూనిస్తారేమో అని భయపడి 'తెలుగు కై నడక' ఎగ్గొడదామని ప్రయత్నం చేశాను. కానీ...ఇలాంటి విపత్తు వస్తే...తప్పించుకోవచ్చు...పైగా 'వేణువు' వేణు, అమెరికా శరత్, పూణే ఫణి బాబు గార్లకు వస్తా అని చెప్పా... కాబట్టి వెళ్లాను. HM-TV మానేజింగ్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి గారు నిర్వాహకులు చెప్పిన ప్రకారం కచ్చితంగా ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చి...వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక గంటకు ఆరంభమైన కార్యక్రమంలో ఆ ఛానల్ న్యూస్ ఎడిటర్, ఈ-తెలుగు ప్రచారం కోసం సతీష్ కు బాగా సహకరించిన చక్రపాణి గారు ఉన్నారు. నాకు ఆయనతో కాలక్షేపం అయ్యింది. ఇక బాబాయ్ ఫణి గారి బోసి నవ్వుల జోకులు సరేసరి. పెద్దగా ఇబ్బందికరం కాని ప్రతిజ్ఞ రాసి, చదివిన తాడేపల్లి గారిని కలుసుకున్నాను.
"భుక్తి కోసం ఆంగ్లం.." అన్న బ్యానర్ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అది నాకు బాగా నచ్చింది. నేను నమ్మేది కూడా ఇదే. చదువుల సంగతి, ఉద్యోగాల సంగతి ఎలా వున్నా...మన పిల్లలు మన భాషలో మాట్లాడడం, చదవడం, రాయడం చేస్తే...ఎంతో భాషా సేవ చేసిన వాళ్ళం అవుతాం.
"భుక్తి కోసం ఆంగ్లం.." అన్న బ్యానర్ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అది నాకు బాగా నచ్చింది. నేను నమ్మేది కూడా ఇదే. చదువుల సంగతి, ఉద్యోగాల సంగతి ఎలా వున్నా...మన పిల్లలు మన భాషలో మాట్లాడడం, చదవడం, రాయడం చేస్తే...ఎంతో భాషా సేవ చేసిన వాళ్ళం అవుతాం.
అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం... అందరు బ్లాగర్లను కలుపుకు పోయి సమన్వయంతో ఈ-తెలుగు మరింత కృషి చేస్తుందని, తెలుగును బతికిస్తుందని ఆశిద్దాం.
గుడ్ లక్ ఈ-తెలుగు.
జై తెలుగు భాష.
జై తెలుగు తల్లి.
18 comments:
>>సమయాభావం మించిపోతోంది
ఈ వాక్యంపై సంపూర్ణ హక్కులు కశ్యప్ కు చెందాల్సిందే :)
ఏమి సమయాభావామో ... ఏమో :(మీరు చివరిదాకా నడిచారు కాదు , చివరి అంకాలు భలే వున్నాయి .. మీరు ఉండాలసినది.. బాట అనేక కొత్త పదాలు కనుగొన్నాము
--
"బాట అనేక కొత్త పదాలు" అంటే ఏమిటి సార్? ఇక్కడ ఏదో మిస్ అయినట్లు ఉంది. నో ప్రాబ్లం. మార్గమధ్యంలో కొత్త పదాలు కనుక్కున్నారా? అవి కూడా మాతో పంచుకోండి.
రాము
మీరూ, తాడేపల్లి గారూ పరిచయం చేసుకుని, ఒకచోట కూర్చుని మాట్లాడుకోవటం బాగుంది.:) ఈ దృశ్యాన్ని ఫణిబాబు గారు సరదాగా మీకు తెలియకుండా ఫొటో తీయటం కూడా అంతే బాగుంది!
అన్నట్టు- ఇబ్బంది తర్వాత ‘కరం’ రాకూడదని గురువు గారు ‘భాషా స్వరూపం’లో రాశారు, మర్చిపోయారా?
Sleeping with your boss 'can boost your career'
o
Sat, Aug 28 12:30 PM
London, Aug 28 (ANI): Sleeping with your boss can do wonders to your career, especially if you are a woman, new research shows.
In the study, some 37 per cent of office workers said that from their experience those who slept with their superiors were rewarded with a career boost.
The research for the U.S. Centre for Work-Life Policy found that no matter how high achieving, female executives will not reach the very top of their profession unless they find a 'sponsor' who will speak out on their behalf, reports the Daily Mail.ome 34 per cent of women in executive positions said they knew a female colleague who had slept with their boss.
Even at director level or above, 15 per cent of women admitted to having had an office fling.
In terms of morale, 61 per cent of men and 70 per cent of women lose respect for a leader involved in an affair.
The study also showed that 60 per cent of male executives and 65 per cent of female executives suspect that salary hikes and plum assignments are being traded for sexual favours.ome 48 per cent of men and 56 per cent of women feel animosity towards the involved couple, and 39 per cent of men and 37 per cent of women see a fall off in productivity as the team splinters.
Relationships expert Jean Hannah Edelstein said: "Office affairs are a bad idea. Your boss already has a lot of power of you so once your start sleeping with him, how do you know that he's going to fulfil his end of the bargain?
"Even if it happens in the short term, everyone will know what's going on and you'll lose their respect.
"It poisons the atmosphere and in the long run it is not worth it and will follow you around the industry." (ANI)
ఎందుకు కశ్యప్ మళ్ళీ దొరికావ్? అవసరమా మనకు? అహ అవసరమా అంట? :)
రవిచంద్ర---
నీ వ్యాఖ్యతో అరిపించావుగా :)
తెలుగుబాటలో మీరు కూడా పాల్గొన్నందుకు అభినందనలు రాము గారూ! ఇక 'సమయాభావం' మించిపోవటం వల్లే పాపం కశ్యప్ 'జ్ఞానయాత్ర'ను ప్రారంభించాల్సి వచ్చింది. మాతోపాటు బుద్ధప్రసాద్ గారు, మల్లిఖార్జున శర్మ గారు, ఫణి గారు ఓపికగా నడవటం చూశాక, కొంత తృప్తిగా అనిపించింది. వారం రోజులుగా సతీష్, సుజాత గారు పడిన శ్రమ, ప్రముఖుల నుంచి సందేశాలు తీసుకుని టెలికాస్ట్ చేయటంలో సహాయ పడిన హెచ్. ఎం.టీవీ బృందం (రిపోర్టర్లు - దీపిక, వీర్ని శ్రీనివాస్, స్వామినాయుడు, రాములు, ప్రోమో ఎడిటర్ మురళి, మరికొందరు మిత్రులు) చేసిన కృషి మరువలేనిది. అన్నివిధాలా సహకరించిన మూర్తి గారు, చక్రపాణి గార్లకు కేవలం ధన్యవాదములు చెప్పటం మాత్రమే చాలదు.
అయినా మీరు రావటమే ఆలస్యంగా వచ్చారు, తర్వాత చక్రపాణి గారితో టీ కప్పు కబుర్లు. మొత్తానికి తప్పించుకున్నారు.
@seenu
అదేంటండీ! మరేదో బ్లాగు లో వ్రాయవలసిన కామెంట్ ఇక్కడ వ్రాసారా ఏంటి? ఈ Post కు మీరు వ్రాసిన దానికి ఏం సంబంధం?
అయినా వ్రాసారు కాబట్టి ఈ కౌంటర్. ఏమండీ, ఎక్కడో సమాజిక విలువలు అధపాతాళానికి దిగజారి పోయిన బ్రిటీషోళ్ళ విషయాలు మనకెందుకండీ? ఒకవేళ, మనవాళ్ళుకూడా, ముఖ్యంగా అక్కడెక్కడో మన్ సహ బ్లాగర్ గారెవరో వ్రాసినట్లు కొందరు యాంకరమ్మలు etc., అలా చేస్తున్నారనుకున్నా మగవాళ్ళమైన మనం దాన్ని ఖండించాలే గానీ ఇలా సరదా కామెంట్లలో ఒకటిగా చెయ్యవద్దు. ఎందుకంటే బ్రిటీషోడి సర్వేల్లో కూడా మహిళామణులు తమ కెరీర్ కోసం తమంత తాము 'పోతున్న ' ఇతివృత్తాలే ఇచ్చాడు కానీ అది బ్రిటీషోడైనా, తెలుగోడైనా తమ కెరీర్ కోసం భార్యలను పంపించాలంటే మాత్రం (ఎవడో ఒక్కరిద్దరు అణాకాణీ వెధవలు తప్ప) ఎక్కడో 'మగత్వం' కాలుతుంది.
సో, మన మహిళామణుల్లో నూటికి 99.99999999999% శాతం మందికి అలాంటి దరిద్ర ఆలోచనలేమీ వుండవు. కనుక, let us not generalize the things/ view at such surveys humorously and try not to propagate them as if it is applicable for our society also.
Sorry if i hurt you in any manner.
రాము గారు!
వెల్ సెడ్. భుక్తికోసం ఆంగ్ల భాషను నేర్చ్చుకున్నా, అమ్మతో తెలుగులోనే మాట్లాడతాం. అలానే, సాటి తెలుగు వాళ్ళతో తెలుగులో మాట్లాడడానికి సంషయించడం తెలుగు ద్రోహమే కాదు, ఆత్మ ద్రోహం కూడా. నీకు ఆంగ్లం చాలా గొప్పగా వచ్చు అనే విషయాన్ని నీ దగ్గరివాళ్ళకైతే (ఎలాగూ తెలిసుంటుంది కనుక) పదే పదే పాష్ ఇంగ్లీషు లో మాట్లాడి చెప్పనవసరం లేదు. తెలియని వాళ్ళకైతే అసలే అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఆంగ్ల భాషలో ఎంతో ప్రావీణ్యుడై యుండికూడా అచ్చ తెలుగులోనే మాట్లాడుతున్నాడంటే నీ గౌరవం ఇనుమడిస్తుందే కానీ ఏమాత్రం తరగదు. మనకు చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి.
రాము అన్నయ్య
ముందుగా...నా ప్రస్తావన తెచ్చినందుకు ధన్యవాదాలు. ఏదొ ఆరోజు అద్రుష్టం బాగుండి ఇంతో అంతో ఇంగ్లీష్ వొచ్చు కాబట్టి ఇంగ్లీష్ పేపర్లో చేరమని మిత్రులు ప్రోత్సహించారు కాబట్టి అందులోంచి బయట పడగలిగాం. "బతకడానికి ఆంగ్లం" వరకూ పూర్తిగా నిజం. మన బుర్ర, మనసు అంగ్లం కాకుండా వుండేటట్లు చూసుకోవడం ఈ మొత్తం ప్రక్రియలో ముఖ్యం. మీరన్నట్లు చాలా మంది తెలుగు పాత్రికేయులు బతకడానికి ఇంగ్లీష్ పేపర్లొ చేరాలని ప్రయత్నించినా ఆ ఆలోచన చాలా ఆలస్యంగా రావడం పైగ కొత్తలో తెలుగు పేపర్లో చేరినప్పుడు "ఇక మనం జీవితం లో సెటిల్ ఐనట్లే" అన్న అభిప్రాయం ఉండడం కొద్ది కాలం తర్వాత ఆ ఉద్యోగాన్ని ఆ సంస్థనూ ఒక రొంపిగా భావించడం అప్పటికే బయట పడే మార్గాలు మూసుకో పోవడం వల్ల ఉత్తరోత్రా నానా ఇబ్బందులూ పడుతూ వుంటారు. "ఇంగ్లిష్ లోకి ఎలా రావాలి బ్రదర్" అని అడుగుతూ చాలామంది నా దగ్గరకు వొచ్చారు. సమాధానం చెప్పడం చాలా కష్టం. మాత్రుభాష మీద ప్రేమ మంచిదే, ఉండాలి కూడా కానీ అమ్మ తిండి పెట్టకపోతే చాలా కష్టం. నా మటుకు ఇంగ్లీష్ కేవలం బతకడానికే. విచిత్రం ఏమిటంతే...మాత్రుభాష గురించి క్లాస్ పీకేవాళ్ళు తమ పిల్లలు మాత్రం సమాజంలోని పోకడలకు అనుగుణంగా మమ్మి డాడి అనక పోతే చాల బాధ పడతారు. "నేను నాన్న అనే అనమంటాను కాని వాళ్ళ టీచర్ అననివ్వదు" అనే మిత్రుడూ ఈ మధ్యన తగిలాడు.
@Ramana
మీరు చెప్పింది నిజమే,
కానీ నావరకు నేను నా ఏకైక కూతురును అమ్మా, నాన్న అనే పిలిచేలా అలవాటు చేసాను. ఇంట్లో అయినా, బయట అయినా చివరకు వాళ్ళ టేచర్ల ముందయినా నాన్న అనే పిలుస్తుంది.
I, too, insisted that my only son call me and my husband 'amma' and 'naanna'. He tried to very sweetly and cutely call me 'mommy' after outsiders addressed me his 'mommy' but I had put a break to it by not responding. Later he simply told people 'amma palakadhu'.
@ Krishnarjun
Working for a common cause is different from fighting for a different state. At times you might work separately because of difference of opinion but people must come together on occassions like this. Infact, the seriousness shown toward a separate state should also be shown on preserving the mother tongue.
Here in Chennai, The management and staff donot bother to converse in english all the time. Most of the students even at the +2 level cannot constuct a simple sentence in good english. There are teachers who teach the subjects in Tamil. Still the management doesn't care. And when it comes to tamil and tamil culture, they keep aside all the differences including the 'north TN and south TN' issue and work together. This spirit, all the telugus should learn.
I sincerely feel that the languages cannot be preserved unless students are taught in their mother tongue.
common cause = సమైక్యవాదం
తమిళ నాడు లో ఈ తరహా ఉద్యమమేమీ నడవటం లేదు కదా ?
ఐనా మన రాష్ట్రం పేరు కూడా పూర్తిగా తెలుగు లో ఉండదు.
తెలుగు లో వ్రాయటానికి సాఫ్ట్ వేర్ కోసం నేను మొదటసారి 1998 లో ప్రయత్నించాను. అప్పుడు గూగల్ సెర్చ్ లో దొరికింది తెలుగులిపి. http://www.sirigina.com/telugulipi-download.aspx
కంపెనీ నోటీస్ బోర్డ్‌లో నోటీస్‌లు తెలుగు లో వ్రాయటానికి బాగా ఉపయోగపడేదీ సాఫ్ట్ వేర్.
@Krishnaarjun
Guruvugaaru, be cool. Her intention of common cause might be "TELUGU" only, again pl.don't ask which Telugu.
@critic
మీకు సరదాగా అనిపించింది మాకు భావజాల వ్యాప్తి గా అనిపిస్తుంది.
అంతర్జాలంలో భాషా వ్యాప్తి కై మొదలైన E-తెలుగు, ఎక్షిబిషను స్టాల్ పెట్టేవాళ్ళు కాస్తా రాలీలు తీయటానికి కారణం ??
అంతర్జాలంలో భాషా వ్యాప్తి నుంచి రాష్ట్రంలో భాషా వ్యాప్తి కి ఎందుకు పూనుకొన్నారు ?
వీరి తదుపరి కార్యక్రమం తెలుగు బాట, తెలుగు జాతి అంటూ ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నం.భాష పేరుతొ సమైక్యాంధ్ర సందేశం. యాసలను, మాండలికాలను ముట్టుబెట్టటం.
కోస్తా భాషే తెలుగు గానూ, తెలంగాణా యాస ని కించపరిచి, బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం.
@Krishnarjun
ఎందుకని మీరు ప్రతి విషయాన్నీ అనుమానంతో చూస్తున్నారో అర్ధం కావటం లేదు. ఇ-తెలుగు అధ్యక్షుడు, కూడలి, లేఖిని వెబ్‌సైట్స్ నిర్వాహకుడు.. వీవెన్. ఆయన నిజామాబాద్ వాసి. ఆరోజు తెలుగు బాటలో పాల్గొన్న వారిలో కొందరు తెలంగాణ ప్రాంతానికి చెందిన మిత్రులు కూడా పాల్గొన్నారు. మనం మాట్లాడేది తెలుగయినప్పుడు.. ఏప్రాంతమైతే ఏంటి? తెలంగాణ వారు మాట్లాడేది తెలుగు కాదని ఎవరంటున్నారు? తెలిసీ తెలియని వారెవరో.. ఏదో అంటే.. సమాధానం చెప్పలేక మీరెందుకు న్యూనత పడుతున్నారు? ప్రతి విషయాన్నీ ప్రాంతానికి ముడి పెట్టడం మనం అలవాటు చేసుకున్నప్పుడు.. అంతా అన్యాయం గానే అనిపిస్తుంది. ప్రతి అడుగులోనూ అనుమానమే కనిపిస్తుంది.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి