Saturday, September 11, 2010

TV-9 అతి కి ఇది మరొక నిలువెత్తు నిదర్శనం....

TV-9 ప్రసారం చేసిన ఒక ముఖ్యమైన వార్తపై ఒక సీనియర్ జర్నలిస్టు ఒక రెండు రోజుల కిందట ఇది పంపారు. రిపోర్టర్, యాంకర్, ఛానల్ బాధ్యతారహితంగా ఉంటే ఎంత ప్రమాదమో ఇది తెలియజేస్తుంది. ప్రజల మనోభావాలతో ముడిపడి వున్న ఒక అంశాన్ని ఇలా ట్రీట్ చేయడం దారుణం.
-------------------------------------------------------------------  
టీవీ నైన్కు చెందిన కవిత అనే రిపోర్టర్ఇవాళ ఉదయం శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వి.కె. దుగ్గల్ను ఇంటర్వ్యూ చేసింది. అది వాళ్ల ఎక్స్క్లూజివ్‌. ప్రశ్నల్లో భాగంగా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండ్పై మీరేమంటారు అని అడిగింది ఆ రిపోర్టర్‌. అందుకు బదులిచ్చిన దుగ్గల్‌ - అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు. అన్నివర్గాల డిమాండ్లను పరిశీలించడానికే కమిటీ ఏర్పడిందన్న విషయాన్ని గుర్తుచేశారు కూడా. ఇక దాన్ని పట్టుకుని టీవీ నైన్బ్రేకింగ్మీద బ్రేకింగ్నడిపింది.
దీన్ని గమనించిన టీవీ ఫైవ్‌, ఎన్టీవీ, సాక్షి, మహా, -న్యూస్ తదితర సీమాంధ్ర పెట్టుబడిదారుల ఛానళ్లు నానా హంగామా చేశాయి. ఇక వీటన్నింటికీ సోర్స్గా మారిన టీవీ నైన్సంగతి చూద్దాం. కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్అని క్వొశ్చన్మార్క్పెట్టి బీజీ ( యాంకర్బ్యాక్గ్రౌండ్స్క్రీన్‌ ) పెట్టారు. ఇంకేముంది యథావిథిగా ద గ్రేట్రజనీకాంత్రంగంలోకి దిగాడు. చెప్పిందే చెప్పాడు... జనాన్ని గందరగోళంలో ముంచెత్తాడు. దుగ్గల్సౌండ్బైట్లో స్పష్టంగా ఇలా ఉంది....

హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండ్పై మీరేమంటారు అని అడిగింది రిపోర్టర్‌. అందుకు బదులిచ్చిన దుగ్గల్‌ - అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు. అన్నివర్గాల డిమాండ్లను పరిశీలించడానికే కమిటీ ఏర్పడిందన్న విషయాన్ని గుర్తుచేశారు. సమస్య పరిష్కారానికి అనేక ఆప్షన్స్ను కమిటీ సూచిస్తుందని ఆయన చెప్పారు. దానిపై కేంద్రమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇదీ దుగ్గల్ఇంటర్వ్యూ సారాంశం...

ఇక దీన్ని పట్టుకొని ఏదో కొంపలు అంటుకుపోయినట్లో లేక ఏదో ఘన విజయం సాధించినట్లో నానా హంగామా చేసింది టీవీ నైన్‌. ఏమనుకుందో ఏమో కాసేపటికి తెలంగాణకు చెందిన సీనియర్జర్నలిస్ట్జకీర్ను ప్రవేశపెట్టింది టీవీ నైన్. స్టూడియోలో రేవంత్రెడ్డి, వరంగల్.ఎఫ్‌.సి.లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇక ఫోన్ఇన్ల సంగతి చెప్పనక్కర్లేదు... లగడపాటి, చలసాని శ్రీనివాస్‌, హరీశ్రావు తదితరులను లైవ్ఫోన్ఇన్లు తీసుకున్నారు. అయితే - దుగ్గల్ఇంటర్వ్యూ చూసిన ఎవరికి కూడా... కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్అన్న అర్థం స్పురించలేదు. మరి టీవీ నైన్అత్యూత్సాహం ఎందుకో....మిగతా ఛానల్స్లోని రిపోర్టర్లకు సహజంగానే... పెద్దల నుంచి వార్నింగ్లు. మీరు ఎందుకు ఇంటర్వ్యూ మిస్సయ్యారని అక్షింతలు... ఇంతలో శ్రీకృష్ణ కమిటీతో సీమాంధ్ర కాంగ్రెస్ఎంపీల భేటీ జరిగింది. తర్వాత జూబ్లీహాల్లో ప్రెస్బ్రీఫింగ్జరిగింది.

అప్పుడు దుగ్గల్స్పష్టంగా చెప్పారు..... కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ను పరిశీలిస్తామని తానెప్పుడు చెప్పానని దుగ్గల్వివరణ ఇచ్చాడు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చురకలు అంటించారు. రాష్ట్రంలో ఎవరు ఏ డిమాండ్చేసినా... దాన్ని పరిశీలించడం కమిటీ ఉద్దేశమని చెప్పారు. విమర్శకులపై ఎదురుదాడికి దిగుతూ....
మాది పనికిమాలిన కమిటీ కాదు... పనికివచ్చే కమిటీ, సమస్యకు దారిచూపే కమిటీ అని తెలుగులో సెలవివ్వడం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేసింది.

సరే ఇంతవరకు బాగానే ఉంది..... ప్రెస్కాన్ఫరెన్స్లైవ్దాదాపు అన్ని ఛానల్స్ఇచ్చాయి. ఆ తర్వాత కూడా టీవీ నైన్యాంకర్జకీర్ఆ అంశాన్ని వదల్లేదు.
ఆయన మాటల్లోనే..... మొత్తంమీద వి.కె. దుగ్గల్‌ - తాను అలా అనలేదని వివరణ ఇచ్చాడు. కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ను పరిశీలనలోకి తీసుకుంటామని తానెప్పుడు చెప్పలేదంటూ మీడియాలో వచ్చిన వార్తల్ని ఖండించారు అని ముక్తాయించారు. ఇంతటితో ఊరుకుంటే కాస్త మర్యాదగానైనా ఉండేది. అయితే నెంబర్వన్ఛానల్కదా....
భావోద్వేగాలను రెచ్చగొట్టి రేటింగ్పెంచుకొని... ఆ తర్వాత నీతి వాక్యాలు, శాంతి సామరస్యాలు వల్లె వేసే ఛానల్‌... ఆ అంశాన్ని సాగదీస్తూనే ఉంది....

మొత్తంమీద ఈ వ్యవహారం, గందరగోళం మీద మీరేమనుకుంటారు అని స్టూడియోలో ఉన్న రేవంత్రెడ్డిని, ఫోన్లైన్లో ఉన్న లగడపాటిని జకీర్అడగటం హాస్సాస్పదం అనిపించింది. ఎందుకుంటే అతను సీనియర్జర్నలిస్ట్‌. ఆ మాత్రం తెలుసుకోలేక ఇష్టమున్నట్లు ప్రశ్నలు అడగడం ఏమిటి... ఎవరి ప్రయోజనాల్ని కాపాడటానికి...

వ్యవహారాన్ని గందరగోళం చేసింది టీవీ నైన్‌. చేసింది చేసి, చివరికి - ఈ గందరగోళంపై మీరు ఏమనుకుంటారు అని నాయకుల్ని అడగటం - ఆ ఛానల్ఓవరాక్షన్కు అద్దం పడుతోంది.

19 comments:

సుజాత వేల్పూరి said...

కొన్నాళ్ళు పోతే మీడియా ఛానెళ్ళకు ఎవరూ ఇంటర్వ్యూ ఇవ్వం పొమ్మనే రోజులూ, ఈ ఛానెళ్ళ వల్ల రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి, తద్వారా ప్రజా జీవనం కూడా సంక్షోభానికి గురవుతోంది కాబట్టి వీటిని నిషేధించాలని పిల్స్ వేయడాలూ మొదలవుతాయేమో!

ఉద్వేగాలను రెచ్చగొట్టే పనులు గాక ఏమిటివి? అసలే హైద్రాబాదులో ఇప్పుడు బయట కొంచెం బిగ్గరగా ఏ మాట మాట్లాడాలన్నా ఎవరి మనోభావాలు ఏ స్థాయిలో గాయపడతాయో తెలీకుండా ఉంది.

చేసినదనతా చేసి "మీడియాలో వచ్చిన వార్తల్ని ఖండించారు" అని దుగ్గల్ మీదికే తోసేశారన్నమాట. శభాష్!

సుజాత వేల్పూరి said...

మీడియా ధోరణిని వివరించే క్లాసులో భాగంగా ఒకసారి వరదాచారి గారు ఒక సంఘటన చెప్పారు. పోప్ గారు లండన్ పర్యటన కి వచ్చారు. ఆయన బయలుదేరుతుండగానే అనుయాయులు "లండన్ టాబ్లాయిడ్స్ చాలా ప్రమాదకరం! ఆచి తూచి సమాధానం ఇవ్వాలి సుమా మీరు" అని చెప్పి పంపారు.

ఆయన ఎయిర్ పోర్ట్ లో దిగుతుండగానే విలేకరులు చుట్టుముట్టారు.అందులో ఒకడు "లండన్ లోని వేశ్యా వాటికలను మీరు సందర్శించి జ్ఞానబోధ చేసే అవకాశాలున్నాయా?"అని అడిగాట్ట. దానికి పోప్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయినట్లు నటించి "ఏమిటీ, లండన్ లో వేశ్యా వాటికలున్నాయా?" అన్నాడు. అంటే లండన్ గొప్ప ఎంతో అభివృద్ధి చెందింది కదా, అక్కడి స్త్రీలు పడుపు వృత్తి లో కూడా జీవిస్తున్నారా, అని ఆశ్చర్యం ప్రకటిస్తే తమనగరం గురించి అంత మంచి అభిప్రాయం ఉన్న్నందుకు వదిలేస్తారనుకున్నట్లున్నాడు ఆయన.

ఆ సాయంత్రం పేపర్లో "ఎయిర్ పోర్ట్ లో దిగుతునే పోప్ గారు లండన్ లో వేశ్యా వాటికలెక్కడుంటాయని" వాకబు చేశారు.."అని వచ్చింది వార్త.

అది అప్పట్లో జోకు, ఇప్పుడు నవ్వు రాదు. ఎందుకంటే రోజూ అవే చూస్తున్నాం కాబట్టి!

Sudhakar said...

TV9 is a shame to telugu media industry. PERIOD !

Saahitya Abhimaani said...

"........మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చురకలు అంటించారు......" ఇలా చురక వేయటం కాదు. చెయ్యని వ్యాఖ్యలను చేశారేమో అన్న భ్రమ కలిగించేట్టుగా వ్యవహరించే ఈ నాటి రిపోర్టింగుకు అడ్డువేసే శిక్షా స్మృతి ఏర్పరచాలి. ఇటువంటి సంపాదకీయ వైఖరులకు తక్షణం అడ్డుకట్టవెయ్యాలి. లేకపోతే వీళ్ళ చౌకబారు చేష్టలు మీడియా స్వాతంత్ర్యానికి గొడ్డలిపెట్టు కావటానికి సోపానాలుగా మారే అవకాశం ఉన్నది.

ఎక్కడో ఎవరో వక్కలు లెక్కపెడుతూనే ఉంటారు, ఆ వందా పూర్తవ్వగానే సుదర్శన చక్రం ప్రయేగించబడుతుంది. అందుకనే, అలా వక్కలు లెక్కపెట్టే అవసరాన్ని కలుగచేసే శిశుపాల ప్రవృత్తిగల రిపోర్టర్లు, సంపాదకులను (!!!???) వెంటనే శిక్షించే ఒక వ్యవస్థ ఉండి తీరాలి. అటువంటి వ్యవస్థ ఫిర్యాదు కోసం ఎదురు తెన్నులు చూడకుండా స్వతంత్రంగా మీడియా మొత్తాన్ని మోనిటర్ చేస్తూ, ఇటువంటి అవక తవక తిక్క ప్రసారాలను చేసినప్పుడు, తమంతట తామే చర్యలు తీసుకోగల సత్తా నిస్పక్ష వైఖరి గల పెద్దలతో ఉండాలి. అలాంటి వాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారా మనకు??

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

shayi said...

హైదరాబాదు ’కేంద్ర పాలిత ప్రాంతం’ అవుతుందని ఆశించే వాళ్ళకు ఒక్క లాజిక్ ఎందుకు తోచదో అర్థం కాదు.
తెలంగాణ కొరకు 1969 నుండి ముందుండి పోరాడుతున్నది O.U. విద్యార్థులు. O.U. ఉన్నది హైదరాబాదు నడి బొడ్డున. అది లేకుండా తెలంగాణ ఏర్పడితే ఆ విద్యార్థులు ఊరుకొంటారా ? ఉద్యమ మూలాలను, స్వరూప స్వభావాలను అర్థం చేసుకోలేని మూర్ఖులు అలా ఆశిస్తున్నారు.

Thirmal Reddy said...

@Ramu


Sir jee, మంచి అంశాన్ని ప్రస్తావించారు. జర్నలిజం లోకి వచ్చే వారికి ఇదొక గైడ్లైన్ కావాలి. కోడి గుడ్డు మీద ఈకలు పీకడమే బ్రేకింగ్ న్యూస్ లా భావించే నేటి తరం జర్నలిస్టులకు, టిఆర్పిల కోసం వెంపర్లాడే టీవీ చానెళ్లకు కనీసం తాము ఎంచేస్తున్నమో కూడా ఆలోచించే తీరిక, ఓపికా లేకుండా పోయాయి. Self Introspection అనేది మచ్చుకు కూడా వీళ్ళల్లో కనిపించడం లేదు. అయితే ప్రేక్షకులు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మీరు చెప్పిన చౌకబారు జర్నలిజాన్ని లైట్ తీసుకుంటున్నారు. గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. ఇకపోతే ఇలాంటి పని చేస్తున్న జర్నలిస్టులు నిజంగానే "ఏదో ముఖ్యమైన వార్త" అనుకుంటున్నారా, లేక విషయం లేకపోయినా తప్పదు కాబట్టి (అంటే ఉద్యోగం, భుక్తి వగైరా) అలా ఈకలు పీకుతున్నారా అనేది డిస్కస్ చేయాలి.

Thanks for putting this issue up for discussion.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

మాగంటి వంశీ మోహన్ said...

భలేవారే - సపోసు ఫర్ సపోసు పాండవోద్యోగ విజయం నాటకంలో తిరుపతోరు ఇలాగంటారు...దీనిలో పూర్ణ విరామాలు, అర్ధ విరామాలు, అర్థానుస్వారాలు అవీ ఎత్తేసాననుకోండి ఇప్పటికి...ఎత్తేసాక ఈ రూపు సంతరించుకున్నదనుకుందాం...

పతితులు కారు నీ యెడల భక్తులు
శుంఠలు కారు విద్యలం జతురులు

పై రెండు వాక్యాల్ని ఇప్పుడు మీకు నచ్చిన చోట విరవండి...ఎంతటి విపరీతార్ధాలొస్తాయో మీరే చూడండి....

ఖర్మమేమనగా, మీర్రాసిన మాటల్ని బట్టి చూస్తే పై "ఉపమా" (అసలుగా కాదనుకోండి!) కవితగారు, మీ జాతి స్నేహితుల్లో కొంతమందికి ఉప్మా లాగా వినపడీ, కనపడీ ఆబగా బానలోకి తోసేద్దామన్న కుతితోని ఇలాగయ్యిందన్న నామాట "పాదరక్ష ప్రయోగేన శరీరం పీడ వర్జయేత్" అన్నంత సత్యం...ఆపైన "టివి నైనునందు పుట్టిన చిగురు వేప కొమ్మైన చేదే" యన్న విధం మరి...

ఇంతే సంగతులు చిత్తగించవలెను...

mlm leader said...

రాము గారు కామెంట్స్ పేర్లు లేకపొతే పబ్లిష్ చెయ్యం అంటారు కద,మరి ఆ సీనియర్ జర్నలిస్ట్ పీరు ఎందుకు పబ్లిష్ చెయ్యలేదు?ఆయన "సీమంద్ర పెట్టుబడుదారులు అని వ్యాక్యనించడం భాగలేదు. ఆంటె అయన గారి ద్రుష్టిలో రాజ్ టి వి చేస్తున్న అతి కనిపించడం లేద? టి ఆర్ స్ వారికి తనకి తేడ లేదు .టీ వీ 9 చేసింది తప్పె.ఐతె వా రు చే సిని దానికి అతను అందరిని ఒకే గాటన కట్టడం బాగలేదు.

కళాపిపాసి said...

sadharana prajalaku edi nijamo,edi abaddamo ardham kakunda poindi

Anonymous said...

డియర్ రాము!
శివగారన్నట్లు శిశుపాల ప్రవృత్తిగల రిపోర్టర్లు, సంపాదకులను, ముఖ్యంగా మీడియా హౌజు లను నడిపేవారిని వెంటనే శిక్షించే ఒక వ్యవస్థ ఉండి తీరాలి. గతంలో అనేక సంధర్భాలలో నేను ఇదే పాయింట్ మీద 'మీడియా ఆంబుడ్స్‌మన్ ' వంటి వ్యవస్థ వుండాలనీ, ఫిర్యాదు కోసం ఎదురు చూడకుండా స్వతంత్రంగా మీడియా మొత్తాన్ని మానిటర్ చేస్తూ, తిక్క తిక్క ప్రసారాలను చేసినప్పుడు నిస్పక్ష వైఖరతో చర్యలు తీసుకోగల సత్తా గల పెద్దలతో ఉండాలి అనే దానిపై చర్చను ఆహ్వానించండి. బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ ఆంబుడ్స్‌మన్ వ్యవస్థలు పటిష్టంగానే పనిచేస్తున్న అనుభవం మన దేశంలో ఉంది కనుక, మరియు మీడియా లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నిఖార్సైన జర్నలిస్ట్‌లు ఇంకా మిగిలే ఉన్నారు కనుక అటువంటివారి ఆధ్వర్యంలో మీడియావారే అందరికీ అమోదయోగ్యంగా 'ఆంబుడ్స్‌మన్ ' లాంటి వ్యవస్థ ఏర్పరుచుకొని తీరేలా ప్రభుత్వం ఒక చట్టం తీసుకువచ్చినా తప్పుకాదేమో? అంటే ఇదేదో అనవసర ప్రభుత్వ జోక్యానికి దారితీస్తుందనో లేక మీడియా స్వేచ్చకు భగం వాటిల్లుతుందనో భావించనవసరం లేదు. ఈ అతి స్వేచ్చకు బ్రేకులు వేస్తుంది. ఎందుకంటే నిర్ణీత గడువులోగా వ్యవస్థను ఏర్పరుచుకునేలా నిర్దేశించడం మాత్రమే ప్రభుత్వ పని. అందరికీ ఆమోదయోగ్య విధి విధానాలతో మీడియ స్వయంగానే అలాంటి వ్యవస్థను ఏర్పరుచుకునే స్వేచ్ఛ ఎటూ వారికుంటుంది.

chinna said...

tv9 is very dangerous.cat not fox on the wall.if it would be there in dwaaparayuga kurukshetrasangraamam wouldbe in aadiparvam only .lane 'news.useless subjects.purposeless discussions.transmittitting the poor common viewers ,patients of

phobia of society..no consistancy ,no commitment at all.

Saahitya Abhimaani said...

My vote is for R.S.Reddy. Let there be a proactive Media Onbudsman.

Krishnarjun said...

అందుకే గామోసు, మన స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్ .ఆర్ గారు G.O 938 (మీడియా వాచ్) - తేవడానికి ప్రయత్నించారు.

భండారు శ్రీనివాసరావు said...

వార్తా వంటకాలు - భండారు శ్రీనివాసరావు
విషయం ఒక్కటే. కానీ చూసే ఇద్దరికీ రెండు రకాలుగా కనిపిస్తే - వైద్య పరిభాషలో ఆ జబ్బుని యేమని పిలుస్తారో తెలియదు. ఒకే వార్త - వివిధ పత్రికల్లో వివిధ రూపాల్లో వస్తే - అందుకు కారణాలు ఏమిటో యిట్టే తెలిసిపోతున్నాయి. ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి - వేర్వేరు పత్రికలు వేర్వేరు కోణాల్లో - వార్తలు 'వండి వారుస్తున్న' తీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా . ఏ చానల్ మార్చి చూసినా యిదే వరస.

ఎవరయినా తాము చదివే పత్రిక, చూసే చానల్ వైవిధ్య భరితంగా ఉండాలనే కోరుకుంటారు. మూసపోసినట్టుగా వుండాలనుకోరు. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేటు చానళ్ళ శకం మొదలయినప్పుడు జనం ఆ మార్పుని సాదరంగా స్వాగతించారు. కానీ తాము కోరుకున్న మార్పు తాము కోరిన రీతిలో సాగకుండా గాడి తప్పుతున్న పద్దతిని మాత్రం వారు జీర్నిన్చుకోలేకపోతున్నారు.

యిరవై నాలుగ్గంటల నిరంతర వార్తా చానళ్ళ పుణ్యమా అని ఈ రోజు సమాచారం టన్నుల లెక్కల్లో ప్రజలకు చేరుతోంది. ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు ఏ మేరకు హరాయించుకోగలదో ఆ టీవీ చానల్ల వాళ్ళే ప్రసారం చేస్తే బాగుంటుందేమో. ఎన్ని విషయాలు విన్నా మెదడు మాత్రం దానికి వీలయినంతవరకే నిక్షిప్తం చేసుకుని మిగిలింది వొదిలేస్తుందంటారు. యిదే నిజమయితే- టీవీ చానళ్ళ ద్వారా క్షణక్షణానికీ జనాలకు అందుతున్న సమాచారంలో చాలా భాగం గుర్తుకు రానంతగా వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే చూసిందీ ఎక్కువ కాలం గుర్తుండి పోతుందనే సిద్దాంతానికి - ఈ సమాచార విస్పోటనం చిల్లులు పొడుస్తుందనే అనుకోవాలి. ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తుండదు అన్న ధీమాతో - రాజకీయ నాయకులు తరచూ స్వవచనఘాతానికి పూనుకుంటూ ఉండడానికి కూడా బహుశా యిదే కారణమేమో!

భండారు శ్రీనివాసరావు said...

స్కోలింగులలో నిజానిజాల సంగతి దేముడెరుగు తెలుగు భాషను నిలువునా ఖూనీ చేస్తున్నారు.
“కోర్టు ఆదేశాలమేరకు జాతీయ జెండాని అవమానించాడని అల్లు అరవింద్ పై జూబిలీ హిల్స్ పీ ఎస్ లో కేసు నమోదు చేసారు” – ఇదీ ఆ స్క్రోలింగ్.
కోర్టు ఆదేశాల మేరకే జాతీయ జెండాని అవమానించినట్టు అర్ధం వచ్చే ఈ స్క్రోలింగ్ దాదాపు ఒక రోజల్లా నడిచినా టీ వీ – 9 లో పట్టించుకునే నాధుడు లేడు. –భండారు శ్రీనివాసరావు

Ravikrishna said...

TV9 is the most dangorous channel in AP.... Ap ni aa devude kapadali ee sutti media nunchi.... monna eakkadi chusa... tala noppi ga vunda??? ite oka sari sex lo palgonandi.. mee talanoppi hamfutt ani HEADLINES lo cheppadu.....

Anonymous said...

some times i hear a parody program in a popular fm radio channel..."camera man degarao tho reporter baburao...tv 007...over to pushpa" i think its indirectly poking tv9...sorry its my personal opinion...it resembles these unnecessary hypes of tv9 often...!

Unknown said...

yes, tv-9 fully changed the meaning of what mr duggal sad,not only this one many news changing it self and it is behving like dectator.

maharshi said...

పుట్టుకతో వివక్ష పాటించినట్లు... మీడియా పోలసీస్తో సంబంధం లేకుండా... 'సీమాంధ్ర' మీడియా అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్? మీరైనా...? రాజ్ న్యూస్ అయినా...?
-maharshi

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి