Friday, September 10, 2010

మీడియాలో ఈ మధ్య పరిణామాలు...అవీ...ఇవీ...

రాజకీయ ఛానెల్స్ వల్ల ఇదీ సమస్య
రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా ఛానెల్స్ నడిపితే....జర్నలిజం మంటగలిసి పోతుంది. దీనికి మంచి ఉదాహరణ కాంగ్రెస్ ఎం.పీ.జగన్ మోహన్ రెడ్డికి చెందిన 'సాక్షి' ఛానల్ కు, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ స్వీయ పర్యవేక్షణలో నడుస్తున్న 'స్టూడియో-ఎన్' కు మధ్య బుల్లితెర మీద నడుస్తున్న యుద్ధం.

జగన్ ఇంద్రభవనం లాంటి ఇల్లు ఒకటి కట్టుకుంటున్నాడట హైదరాబాద్ లో. దాన్ని చిత్రీకరించి...'జగన్ బండారం' బట్టబయలు చేయాలని స్టూడియో-ఎన్ ఇన్-పుట్ ఎడిటర్ రేవతి బృందం కెమెరాలతో వెళ్లిందట. అక్కడ ఆమె పైనా, కెమెరా పైనా దాడి జరిగిందట. దాన్ని చూపి...రాత్రి పూట పోలిస్ స్టేషన్ లో రేవతి వెళ్లి కంప్లైంట్ చేయడాన్ని కూడా స్టూడియో-ఎన్ ఛానల్ వాళ్ళు లైవ్ లో ఇచ్చారు. ఇక పచ్చ పేపర్స్, ఛానెల్స్ అని రెండు మూడు రోజులుగా 'సాక్షి' వాళ్ళు దంచుకుంటున్నారు. 

బాగా తెగ బలిసిన రెండు రాజకీయ పార్టీల మధ్య ముదురుతున్న యుద్ధం ఇది. ఈ ఛానెల్స్ లో పనిచేసే జర్నలిస్టులను ఇది నిజంగానే ఇబ్బంది పెడుతుంది. కాస్త బాగా డబ్బులు వచ్చే పెద్ద స్థాయి జర్నలిస్టులు (రెండు ఛానెల్స్ లో వాళ్ళూ) ఇప్పటికే ఆయా పార్టీల కార్యకర్తల లాగా పనిచేస్తున్నారు. ఒకడిది రెడ్డి అజెండా, ఇంకొకడిది కమ్మ అజెండా. ఇది జర్నలిజానికి మంచిది కాదు. ఈ దుస్థితి చూడాల్సిరావడం నికార్సైన జర్నలిస్టులు ఎన్నడో చేసుకున్న పచ్చి పాపం. 

ఉద్యోగాలు పీకేస్తున్న నరేంద్రనాథ్ చౌదరి 
ఎన్-టీ.వీ.లో తిక్క తిక్క బాసులను, తల తిక్క మానేజ్ మెంట్ ను భరించలేక చాలా మంది వివిధ ఛానెల్స్ లో చేరారు. కొందరిని ఆ సంస్థ యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా ఇళ్ళకు పంపింది. ఒక పధ్ధతి పాడూ లేకుండా....పర్సనల్ డిపార్టుమెంటు వాళ్ళు  జర్నలిస్టులను, టెక్నీషియన్లను ఇళ్ళకు పంపుతుంటే...చవట బాసులు...'సారీ మేమేమీ చేయలేకపోతున్నాం' అని మొసలి కన్నీళ్లు కార్చి ఊరుకుంటున్నారు. పాపం వాళ్ళ ఆత్మలు ఎప్పుడో చచ్చిపోయాయి, వారిని అని లాభం లేదు. అలా విచ్చలవిడిగా ఉద్యోగాలు తీసేయకూడదని చెప్పే దమ్ము లేని దద్దమ్మలు కొలువు తీరారు. పైగా...ఉన్న వాళ్ళను ఇళ్ళకు పంపి...తన మనుషులను భర్తీ చేసుకునే నంగనాచి పాపాత్మ రాజాలు చెలరేగి పోతున్నారు. 

సరే...కదా అని అప్పట్లో ఎన్-టీ.వీ. నుంచి వచ్చి పలువురు ఐ-న్యూస్ లో చేరారు. ఇప్పుడు చౌదరి గారు దాన్ని కూడా కొన్నారు. దాంతో...మాజీ ఎన్-టీ.వీ.వాళ్ళకు బిక్కుబిక్కు మంటూనే ఉంది. ఈ లోపు చౌదరి గారు అనుకున్న పని చేశారు. ఐ-న్యూస్ లోని నలభై మందికి పైగా జర్నలిస్టుల ఉద్యోగాలు పీకేశారు. అందులో మాజీ ఎన్-టీ.వీ.వాళ్ళు కూడా పలువురు వున్నారు. 'చావనీలె అని వచ్చి ఇక్కడ చేరితే...శని లాగా దాపురించాడు. మా ఉసురు ఊరికే పోదు,' అని (ఎన్నో ఆశలతో జర్నలిజం లోకి వచ్చిన) ఒక జర్నలిస్టు వాపోయారు. 
ఇలాగే...డబ్బు బలుపుతో చౌదరి గారి కన్నా కొమ్ములు తిరిగిన ఒక  మీడియా బ్యారన్ ఉద్యోగాలు పీకి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారనీ, వారికి కన్న సంతానం వల్ల కడుపు కోత మిగిలి ప్రత్యక్ష నరకం చవి చూసారని అబ్రకదబ్ర అనవసరంగా నాకు చెప్పాడు. 

టీ.వీ.-ఫైవ్ లో చేరిన సూరజ్ 
క్రైం రిపోర్టింగ్ లో వినిపించే పేర్లలో సూరజ్ ది ఒకటి. కొమ్ములు తిరిగిన జర్నలిస్టు రాజశేఖర్ ను నమ్మి ఐ-న్యూస్ లో చేరినప్పటి నుంచి అతన్ని చూస్తున్నాను. అదే రాజశేఖర్ ను నమ్మి N-TV లో చేరాడు. తాను ఇప్పుడు టీ.వీ.-ఫైవ్ లో చేరినట్లు ఒక ఎస్.ఎం.ఎస్.పంపాడు. అవీ సంగతులు.

9 comments:

katta jayaprakash said...

If he channels belonging to any political party or politician continues to behave like the official spokes person of them it is just an end of the channel as people get bored,irritated and intolerant to the selfish interests of the channel.It is better if the ratings of these channels are looked into if any one surveyed.But ultimately the fate of these political channels is in the hands of the viewer as he has got liberty with the remote and so the viewers are th better judges.
JP.

Anonymous said...

గురూజీ! స్టూడియో-ఎన్ వాడు చూపించిన జగన్ ఇంద్రభవనం లాంటి ఇల్లు హైదరాబాద్ లో కాదు 'బెంగళూరులో' అనుకుంటా? స్టూడియో-ఎన్ 'జగన్ బండారం' బట్టబయలు చేయాలని కంకణం కట్టుకుంటే నిజంగానే సంతొషించేవాళ్ళం - ఎప్పుడూ అంటే, 1) అది నాయుడుగారి పుత్ర రత్నం ఆధ్వర్యంలో నడవకుంటే 2) మొత్తం పొలిటీషియన్ల ఆస్తుల (బాబుకు ఆయన బాబిచ్చిన ఆస్థి నుంచి) బండారం గురించి వీరకంకణం కట్టుకునుంటే?
మరో కోణంలో చూస్తే జనాల్లో సెన్సిటివిటీ చచ్చిపోయి చానాళ్ళయ్యింది కాబట్టే వీడు వాణ్ణి వాడు వీణ్ణి తిట్టుకుంటుంటే మనం అదో సరదాలాగా చూస్తున్నాం.
నిరక్షరాసులైనా ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులా అన్ని ఎన్నికలలో తోకబారు క్యూలలో నిలుచునీ మరీ వోట్లేసివచ్చే, మరియు ఎన్నోసార్లు నాయకుల దిమ్మతిరిగే తీర్పులిచ్చిన వోటర్లను నోట్లకు వోట్లేసే ఎర్రి జనాలు అంటూ గేలిచేసే మన సో కాల్డ్ మేధావులే ఎం ఎల్ సి ఎలక్షన్లలో ఓటుకింత అని అమ్ముకునేంత స్థాయికి దిగజారాయి మన విలువలు. వీటన్నింటికి వర్తించే సమాధానం ఒక్కటే - అప్పటికీ ఇప్పటికీ మారింది మనిషి మాత్రమే, క్షీణించింది అతనిలోని విలువలు అని. పేదవాని పరిస్థితి పెనం మీదనుండి పొయ్యిలోన పడ్డట్లయ్యిందని అర్ధమవుతుంది. ఎందుకంటే మనల్ని దోచుకుంటున్నారని బ్రిటీష్ వారిని వెళ్ళగొట్టి మనను ఎలా బాగు చెయ్యాలా అని అనుక్షణం అలోచించిన నేతల స్థానంలో ఇప్పుడు మా ప్రజలను దోచుకోవడానికి మీరెవరు(పరాయి దేశస్తులు), మా ప్రజలను మేమే దోచుకుంటాం అనే ప్రస్తుత నేతల స్తాయికి ఒకవైపు దిగజారితే; ఒకప్పుడు ఏదైనా చిన్న స్కాం జరిగితే గుండెలు బాదుకున్న జనాలు (ముఖ్యంగా చదుకున్న వారు) ఇప్పుడు ఫలానా వాడు అంత తిన్నాడట అని
ఎవరైనా అంటే 'ఆః, ఎవడు తినట్లేదూ? తినకుండా పనిచేసేవాడెవడూ? లేదా ఫలానా ఎల్లిగాడికన్నా ఈ పుల్లిగాడు కాస్తా నయమేలే అని మాట్లాడే స్తాయికి దిగజారిపోయాం అనేది కాదనలేని వాస్తవం.

Alapati Ramesh Babu said...

రాము గారు,
ఆ మీడియా బ్యారన్ రామోజి గదా, మీరు కూడ పరొక్షంగా వ్రాయవలసిన ఆవసరం వున్నదా? ఇక మీడియా అతి కి వస్తె ప్రజలదె తప్పు.డబ్బు మహిమ, కాల మహిమ ఆయనా కాని అతి సర్వ్థా సామెత మననము ........ డబ్బు ,అధికారం ,సెక్ష్స్, అన్నిరకాల ఆవినీతి కీ మూలకారణం

Krishnarjun said...

అబ్రకదబ్ర కూడా ఏదైనా బ్లాగ్ సైట్ నిర్వహిస్తూంటాడా ?? ఉంటే చెప్పండి.

kvramana said...

ప్రత్యక్షంగ రాజకీయాలతొ సంబంధం ఉన్న ఆ రెండు చానల్స్ సరే ఎటువంటి రాజకీయలతొ సంబంధాలు లేని చానల్స్ పరిస్థితి కూడ దిగజారుడుగానే ఉంది. నిజానికి జర్నలిజం ఎంత పతనావస్థలొ ఉందొ తెలిపే ఒక స్టోరీ ఒక చానల్ గురువారం రోజు ప్రసారం చెసింది. శ్రీ క్రుష్ణ కమిటీ కార్యదర్శి దుగ్గల్ ప్రెస్ కాంఫెరెన్స్ కు కొన్ని గంటల ముందు ఈ తెలుగు చానల్ తొ మాట్లాడుతూ "సంచలన వ్యాఖ్యలు" చెసారు. ఆ చానల్ రెపొర్టెర్ ఒక ప్రశ్న అడిగారు. "హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీ చేయాలన్న ఒక సూచన కూడ ఉంది కదా దీని మీద మీరేమంటారన్నది" ఆ ప్రశ్న సారాంశం. దానికి దుగ్గల్ గారు "ఆ విషయాన్ని కూడ మేము పరిశీలిస్తున్నాం" అని అన్నారు. అంతె...కోతికి కొబ్బరికాయ దొరికింది. బ్రేకింగ్ న్యూస్ వొచేసింది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయలన్న ప్రతిపాదనను కమిటీ పరిశీలిస్తున్నట్టు స్క్రోల్ నడిపారు. వివిధ వర్గాల అభిప్రాయలు కూడ సేకరించారు. ఒక గంట సేపట్లో అంతా గందరగోళం. ఇది ఏ స్థాయి జర్నలిజం? దుగ్గల్ అన్నదేంటి మనం చెప్పిదేంటి? అన్ని అంశాలు పరిశీలనలో ఉన్నాయన్నరు. హైదరాబాద్ విషయం కూడ పరిశీలనలో ఉందన్నారు. ఇందులో బ్రేకింగ్ ఎముందో విగ్నులైన ఆ చానల్ వారే చెప్పాలి. అనవసరంగా ఒక వర్గాన్ని రెచ్చ కొట్టే ప్రయత్నం జరిగిందన్నది నా అభిప్రాయం. మీరు చెప్పిన రెండు చానల్స్ సరే మరి ఇలాంటి చానల్స్ పరిస్థితి ఏంటొ వివరించే ప్రయత్నం చేయండి.

Unknown said...

పగిలే వార్త .. కేసీఆర్ ని ఇన్నాళ్ళూ తమ వ్యాసాల్లో తెగ తిట్టిపోసిన ఇద్దరు జర్నలిస్టులు `నీ కాల్మొక్త` అంటూ ఇప్పుడు కేసీఆర్ పంచన చేరుతున్నారు. ఒకరు..కట్టా శేఖర్ రెడ్డి(మహా టీవీ)కేసీఆర్ పేపర్లొ సీ ఈ వో గా, మరొకరు అల్లం నారాయణ(ఆంధ్ర జ్యొతి)ఎడిటర్ గా ... ఇద్దరి జీతాలు చెరో లక్షన్నర అట.. జ్యొతి,సాక్షి లొని తెలంగాణా జర్నలిస్టులు జంపింగ్ కి రెడీ గా ఉన్నారట.

Big Data Enthusiast said...

RSReddy గారు చెప్పిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. గురివింద నైజం వున్నంతవరకూ నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు.

ఇంకా , రెడ్డి గారు చెప్పినట్టు జనాల్లో సెన్సిటివిటీ పోయి చాలాకాలం అయ్యింది. జనం ఈ వార్తలనన్నింటినీ ఎంటెర్టైన్మెంట్ గా భావించి చూస్తున్నారు.

Prashant said...

@Ramu(or the so called host of the blog)..
My Dear,The post clearly contradicts the values and authenticated sources which has been proclaimed in the guidelines.The host doesn't even have guts to mention the name of so called"baaga balisina media baron"...If you want to project a point, do it fearlessly without pissing off in you pants.The honourable Supreme Court has placed some restrictions citing anonymous or reliable sources as information.So don't mention abrakadabra or any bra/cheddi whereafter.Mentioning anonymous sources also casts doubt upon the character of the person citing the source.Hence if you want to prove yourself that you don't have any self serving interests just stand tall and drive the point with guts and gumption.take care...

Anonymous said...

@Prashant
I too did not like Ramu writing "baaga balisina media baron"... instead of mentioning Ramoji's name directly. But, I disagree with you on "the host doesn't even have guts to mention the name..." because I know Ramu is not that coward and on many other occasions on Ramoji and Eenadu affairs he called a spade a spade. May be in this occasion he went on a lighter vein assuming every one will keep guessing who is/ they all know he is Ramoji. In ABRAKA DABRA case I see that a poetic expression rather than anything else assumed by you. Anyway my sincere advice to Ramuji is 'you may not to hesitate to mention the names of anybody on any issue as long as they are the facts'

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి