జర్నలిస్టుల వేతన సంఘం పెద్దగా ఊడపొడిచేది ఏమి వుంటుంది?...పైగా అనుక్షణం ఉల్లంఘనలకు గురవుతున్న జర్నలిస్టుల హక్కుల విషయంలో దీని పాత్ర సున్నా....అని అనుకున్న నాకు "నేషనల్ ప్రెస్ డే" & 'ఈనాడు' చీఫ్ ఎడిటర్ చెరుకూరి రామోజీ రావు గారి బర్త్ డే అయిన ఈ పవిత్ర దినాన ఒక జ్ఞానోదయం అయ్యింది. ఒక బాధితుడు చొరవ చూపితే...అన్యాయాలకు వ్యతిరేకంగా స్పందించే వారు కూడా ఉంటారు సుమా....అని బోధపడింది. నిజానికి ఇది....వందలాది 'ఈనాడు' కార్మిక సోదరుల శ్రేయస్సు కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఒక నికార్సైన జర్నలిస్టు యోధుడి విజయానికి సూచిక, ఒక బాధ్యతాయుతమైన పదవిలోని ఒక వ్యక్తి మానవీయ స్పందనకు రుజువు.
ఆ బాధ్యతాయుతమైన వ్యక్తి....జర్నలిస్టుల వేతన సంఘం పెద్ద జస్టిస్ (రిటైర్డ్) జీ.ఆర్.మజిఠియ. ఆ 'ఈనాడు' ఉద్యోగి గడియారం మల్లికార్జున శర్మ. యాజమాన్యం సాధింపులు, వేధింపులలో భాగంగా ఇప్పుడు భువనేశ్వర్ లో ఉద్యోగం చేస్తున్న మల్లికార్జున్ ఏప్రిల్ చివరి వారంలో...అక్కడికి వచ్చిన మజిఠియ బృందాన్ని కలిశారు. వేజ్ బోర్డుల సిఫార్సులను తుంగలోతొక్కి ఉద్యోగులను 'ఈనాడు' చేస్తున్న మోసాన్ని ఒక నివేదిక రూపంలో సమర్పించారు. దాన్ని 'వేతన సంఘానికి ఈనాడుపై రెండు ఫిర్యాదులు' శీర్షికన ఈ బ్లాగు ప్రచురించింది. పోరాడే ఉద్యోగులపై యాజమాన్యం తొత్తులు... పిచ్చోడు/షార్ట్ టెంపర్ గాడు/ సెన్సిటివ్ మనిషి వంటి ముద్రలు వేస్తే నిస్సిగ్గుగా...నిజమే..నిజమే అని ఎగురుతూ వంతపాడే 'ఈనాడు'లో కొందరు దద్దమ్మలు...మల్లికార్జున్‌ను ఎద్దేవా చేశారు అప్పట్లో. (note: ప్రెస్ డే రోజు సెన్సార్ లేదని మనవి.)
అయితే...కాస్త ఆలస్యం అయినప్పటికీ....జస్టిస్ (రిటైర్డ్) జీ.ఆర్.మజిఠియ స్పందించి ఆంధ్రప్రదేశ్ లేబర్ కమిషనర్ కు ఈ కింది లేఖ పంపారు. ఈనాడు/ ఉషోదయ పబ్లికేషన్స్ లో సర్విస్ కండిషన్స్ గురించి వచ్చిన ఈ ఫిర్యాదును పరిశీలించి, అవసరమైన చర్య తీసుకుని, తనకు మళ్ళీ సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఆ లేఖ మీ కోసం ఇక్కడ ఇస్తున్నాం.
'నేషనల్ ప్రెస్ డే' అయిన ఈ రోజు మాకు అందిన ఈ లేఖ 'ఈనాడు' లో ఉద్యోగులకు మనోబలం ఇస్తుందని నిజంగానే నమ్ముతున్నాం. కష్టనష్టాలకు ఓర్చి 'ఈనాడు' పై ఒకే ఒక్కడు గా న్యాయపోరాటం చేస్తున్న మల్లికార్జున్ కు ఆ సంస్థ ఉద్యోగులు మానసికంగా, నైతికంగా, ఆర్థికంగా మద్దతు పలికి తమ హక్కులను కాపాడుకుని, తాము ఇన్నేళ్ళు గురవుతున్న దోపిడీకి చరమగీతం పాడతారని ఆశిస్తున్నాం.
Tuesday, November 16, 2010
Subscribe to:
Post Comments (Atom)
22 comments:
hindi lo aayana peru choodandi... majeeThiyA ani undi. meeremiti peru marchesaru?
థాంక్స్ అండీ...బాలా గమనించారు. మీరు కామెంట్ రాసాక చూసుకుని పోస్టులో మార్పులు చేసాను.
రాము
రామూ గారు,
దేవర వారు (అంటే ఎవరో మీకు తెలుసు) మల్లికార్జునశర్మ గారిని ఉద్యోగం లోంచి పీకెయ్యరు కదా?
అలా జరక్కూడదని ప్రార్ధిద్దాం.
~శశిధర్ సంగరాజు.
www.sasidharsangaraju.blogspot.com
నిజంగానే ఇది ఒక మహా విజయం. ఒకే ఒక్కడులా పోరాడుతున్న మల్లికార్జున శర్మ గారికి అభినందనలు. "పోరాడే ఉద్యోగులపై యాజమాన్యం తొత్తులు... పిచ్చోడు/షార్ట్ టెంపర్ గాడు/ సెన్సిటివ్ మనిషి వంటి ముద్రలు వేస్తే నిస్సిగ్గుగా...నిజమే..నిజమే అని ఎగురుతూ వంతపాడే 'ఈనాడు'లో కొందరు దద్దమ్మలు...మల్లికార్జున్‌ను ఎద్దేవా చేశారు అప్పట్లో..." చాలా బాగా చెప్పారు. ఇది ఒక్క పత్రికా రంగానికో, ఈనాడుకో మాత్రమే పరిమితం కాదు. తెల్లవాణ్ణి పారదోలినా ఇంకా ఆనాటి బానిసత్వపు లక్షణాల్ని నరనరానా జీర్ణించుకునే ఉన్న మన జనాలు (చాలామంది) అన్యాయాలపై ఎదురుతిరిగే వాణ్ణి పిచ్చోడులా చూడటం సహజాతి సహజమైపోయింది. పైగా వాడికి జరిగిన అన్యాయం వీళ్ళ దృష్టిలో చాలా చిన్నదిలా కనిపిస్తుంది. ఈమాత్రం దానికే అంత ఇష్యూ చెయ్యాలా అంటూ సూటిపోటిగా మాట్లాడే జనాలు, తమదాకా వస్తే మాత్రం గగ్గోలు పెడతారు. కానీ, శర్మగారిలా పోరాడరు. యాజమాన్యాన్ని బ్రతిమాలుకొనో, ఎవడికో చెంచాగిరీ చేసి వాడితో లాబీయింగ్ చేయించుకోవడమో చేస్తారు. పైగా తమలా సమస్యను సింపుల్ గా పరిష్కరించుకోవాలిగానీ ఫలానావాడిలా ఇష్యూ పెద్దది చేసుకోవద్దు అంటూ సుద్దులు చెబుతారు. కానీ, తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పుగానే చూడాలి, ఖండించాలి అంతేగానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని తనవరకు వస్తే తన సమస్యవరకు ఏదోలా పరిష్కరించుకోవచ్చులే అనుకోవడం తప్పు అంటే ఎవడి తలకూ ఎక్కదు.
నిజానికి ఈ సమస్య మా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో కూడా చాలా ఎక్కువ. అదీ రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాలలో చాలా ఎక్కువ. నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజునుండీ ఇదే గొడవ. అయిదేళ్ళలో ఆరు చోట్లకు మార్చారు. వాళ్ళ 'ప్రయోజనాలకు ' భంగం కలగకుండా ఉండేందుకు కాంట్రాక్టర్లకు సహకరించాలట? మనమేమో ఎన్నెన్ని సార్లు ఎక్కడెక్కడికైనా మార్చుకోండి, నేను మాత్రం మారను. నాకు నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి మాత్రమే పని చేయిస్తాను. ఇష్టం ఉంటే చేయమనండి, లేదంటే వాడిష్టం/ మీ ఇష్టం అంటాం. తరువాత జరిగేది ఎవరైనా ఊహించవచ్చు. కానీ, ఏదో ఒకరోజు వాళ్ళకు ఙానోదయం కాకపోతుందా అనుకుంటూ వచ్చా. కానీ, ఆ ఆశ అత్యాశగా మారడంతో చివరికి నేను కూడా రివర్స్ గేర్ లో వెళ్ళాల్సొచ్చింది. ట్రాన్స్ఫర్లు బ్యాన్ ఉన్న టైంలో డెప్యుటేషన్ పేరుతో మీ ఇష్టం వచ్చినట్లు నన్ను మారుస్తూపోతే గమ్మున ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీ పద్ధతిలాగే ఉంటే నేను మానవ హక్కుల సంఘానికి లేదా లోకాయుక్తాకు వెళ్తాను అని ఘాటుగా హెచ్చరించాను. బిడ్డలు దెబ్బకు దిగి వచ్చారు. గత సంవత్సరంకాలంగా హైదరాబాద్‌లో ఉండనిచ్చారు. కాకపోతే కొసమెరుపేమిటంటే - ఏ పనీ లేని అప్రాధాన్య పోస్టింగ్ ఇచ్చారు. పైగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖనుండి కోట్లాది నిధులతో వివిధ పట్టణాలలో పనులు జరుగుతుంటే, ఒక పక్క స్టాఫ్ లేరని గగ్గోలుపెడుతూనే నా లాంటివారి సర్వీసులు ఉపయోగించుకోకపోవడం ధారుణం అంటూ మా ఆఫీసర్లకు చివరికి ప్రిన్సిపల్ సెక్రటరీకి వ్రాసినా ఉపయోగంలేకపోయింది. ఏ పనీ చేయకుండా జీతం తీసుకోవడం నాకు ఇష్టం లేక రెండేళ్ళు లాంగ్ లేవు పెట్టి జే.ఎన్.టీ.యు లో ఎం.టెక్ లో జాయిన్ అయ్యాను. వచ్చే సోమవారంనుండి నేను మళ్ళీ స్టూడెంట్ ను కాబోతున్నాను. బహుశా రెండేళ్ళ తరువాతకూడా పరిస్థితులు ఇలాగే ఉంటే ప్రభుత్వోద్యోగానికి శాశ్వతంగా వీడ్కోలు చెబుతానేమో!
కానీ, నాకొక సంతోషకరమైన విషయమేమంటే: నేను కూడా పై అధికారులకు వ్యతిరెకంగా వెళ్ళినప్పుడు చెవులు కొరుక్కున్న వాళ్ళంతా నేడు నేను చేసిందే కరక్టంటున్నారు. ఆఫీసనేది అధికార్ల ఇలాఖా కాదు, వాళ్ళ ఇష్టారాజ్యంగా చెయ్యడానికి అంటున్నారు. సంతోషమే కదా. రేపు మరొకరికి నాకులాగా జరిగితే నిస్సంషయంగా ఎదురుతిరగగలిగితే, అందుకు శ్రీనివాస రెడ్డియే మాకు స్పూర్థి అంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది??
అన్నట్లు శశ్ధర్ గారు చెప్పిన విషయం శర్మ గారికి తెలియకుండానే ఆయన దేవర వారితో పెట్టుకోలేదు. పైగా ఒక విషయం పై పోరాడ దల్చుకున్నప్పుడు మనదేమిపోతుందో అని భయపడేవాడు అసలు పోరాటానికే దిగడు. నాటి గాంధీజీ నుండి నేటి శర్మగారి వరకౌ. కాబట్టి బాధపడకండి. ఈ పరిస్థితిలో ఏదైనా గెలికితే దేవరవారికి దెయ్యాలు కనబడతాయి.
mallikarjun u r great!!!
//ఒక బాధితుడు చొరవ చూపితే...అన్యాయాలకు వ్యతిరేకంగా స్పందించే వారు కూడా ఉంటారు సుమా....//
super!
ప్చ్..అల్ప సంతోషులు...
@Vipravinodini
నీ గురించి నీవు భలే వర్ణించుకున్నావే!
మహారాజశ్రీ మాజీ జడ్జి గారికి కొలువులో అన్యాయం జరిగిందని భావిస్తోన్న ఒకానొక శర్మ గారు మహజరు సమర్పించుకొన్నారు. ఆ మహజరును సదరు మాజీ జడ్జి గారు మూడు సింహాల బొమ్మ ముద్రించి ఉన్న కాగితం మీద వ్రాసిన వివరాలు ఏమాత్రం లేని లేఖతో జత కలిపి ఆంద్రప్రదేశ్ శ్రామిక శాఖ ఉన్నత అధికారికి బట్వాడా చేసారు. ఇదీ రాము గారి ఆర్టికల్ క్షుణ్ణంగా చదివిన నాకు అర్ధమైన విషయం.
ఏ ఒక్క ప్రభుత్వ శాఖ గాని, అధికారి గాని శర్మ గారి ఆరోపణలను పరిశీలించినట్టు గాని విచారణ జరిపి నిబధనలు అతిక్రమించబడినట్టుగా నిర్ధారణకు వచ్చినట్టుగాని ఎక్కడా నాకు బోధపడలేదు. శర్మ గారికి అద్వితీయ విజయం అందినట్టుగా, ఈనాడు వారికి కోలుకోలేని శిక్ష పడినట్టుగా, రాము గారు ఎంతగానో ఎదురుచుస్తున్న ఉదయం ఈనాడే ఎదురైనట్టుగా ఆయన సంబరపడిపోతున్నారేమో అనిపిస్తోంది నాకు. ఎందుకనబ్బా?
ఎందుకనబ్బా....అనా మీ అనుమానం. కొద్దిగా బుర్ర పెడితే, మానవత్వంతో ఆలోచిస్తే ఈ సందేహం వచ్చేది కాదు.
ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వనందుకు 'ఈనాడు' లో పనిచేసే ఒక ఉద్యోగి పోరాటం చేయడం గొప్ప విషయం. దాని మీద మొదటిసారిగా ఇలాంటి స్పందన వచ్చింది. దీనివల్ల ఇప్పటికిప్పుడు మేలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ...అందరి కోసం అతను పడుతున్న తపన స్ఫూర్తిదాయకం. అన్నిచోట్లా దోపిడీ ఉంది...అంటారు తమబోంట్లు. ఒక ఐ.టీ.కంపనీ తన ఉద్యోగులను దోచుకోవడం వేరు, జనాలకు, సర్కార్లకు సుద్దులు చెప్పే 'ఈనాడు' లాంటి సంస్థలు దోచుకోవడం వేరు.
రాము
As Confucius stated "A journey of a thousand miles begins with a single step"
సమస్య పరిష్కారం దిశగా కనీసం ఒక్క అడుగైన పడింది అని సంతోషిద్దాం. మల్లిఖార్జున శర్మ గారి ప్రయత్నాన్ని కొనియాడకుండా ఉండలేం. కాని అలా ఓ అడుగు పడిందో లేదో వెంటనే సమస్యలన్ని తీరిపోవాలంటే ఎలా కుదురుతుంది. శర్మ గారి మీద పిచ్చి వ్యాఖ్యలు రాస్తున్న వారు కావడి బరువు కళ్ళతో కాకుండా భుజాలతో మోస్తే తెలుస్తుంది. మనం చెయ్యము, చేసే వాడిని మెచ్చుకోము.
@ RSReddy
You have an interesting version. Do keep us updated.
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
@Ramu,
I have my support and sympathy to the" fighter" Sharma.However,I am very much irritated by this constant bombarding of a single organisation.The journos has a very bad habit of contempting the organisation in which they have served in the past.In corporate structure this is considered as a "sucks" factor on the part of employee.
Moreover you have clearly violated the "golden rules" envisaged by you own "reverend" self!
Maintain integrity on your part while conduting this blog.You are supposed to highlight the issues plaguing the journos in all organisations.
Dear Prashant,
Stop this bloody sarcasm and read the previous posts. I wrote about TV-9, Studio-N, I-news and other organisations. We touch the core problems as and when they crop up. before writing any comment read the previous posts, OK?
Ramu
@Thirmal Reddy
"శర్మ గారి మీద పిచ్చి వ్యాఖ్యలు రాస్తున్న వారు కావడి బరువు కళ్ళతో కాకుండా భుజాలతో మోస్తే తెలుస్తుంది. మనం చెయ్యము, చేసే వాడిని మెచ్చుకోము" -Well Said.
@"You have an interesting version. Do keep us updated"
Yes, dear Thirmal. This is a different way of fighting with the problems posed by the ugly bosses who expect the honest employees to leave all their morals for the sake of their (bosses) interests. how can they expect 4m the people like us, who not even dare to do so for our own (illegal) prospers to loose all the morals set forth by and for our own selves? The question here is why not they let those who wish to keep himself away 4m such practices? why should they harass us with whatever the bloody powers they have? do they really have any absolute powers or are they not supposed to act as per the rules/ the established conventions? are they not questionable 4 what they do out of procedure? when an ex-prime minister himself stood in the court of law in a cheating case, in what way these ppl think exceptional they are?
(Note: I am going to describe fully on my war against the department in short while in my blog, i.e., soon after the commencement of my leave. coz still being an employee it may not be proper for me to expose the things open)
కొలువులోనే ఉండి యజమాని పద్ధతులు సక్రమంగా లేవనో తనకు న్యాయం జరగలేదనో శర్మగారు చేస్తున్న ఒంటరి పోరాటాన్ని ఆక్షేపించడానికి ఏమిలేదు, సరే ఒప్పుకున్నా. శర్మ గారి ఆరోపణలని పరిశీలించి రెండు పార్టీల వివరణలను తీసుకొని సరియైన విచారణ జరిపి తగిన న్యాయం చేస్తే నాబోంట్లు సంతోషిస్తారు కదా. కాని ఆ సదరు మాజీ జడ్జి గారు వారి ప్రస్తుత అధికారాలను ఏమాత్రం వినియోగించకుండా, కూస్తంత ఆశ్చర్యం వెలిబుచ్చి కాస్తంత జాలి ఒలకబోసి చివరికి కేవలం బట్వాడా కార్యక్రమంతో సరిపెట్టారు కదా. మరి ఈమాత్రం దానికి జర్నలిస్ట్ పక్షపాతి, పత్రికాధిపతుల పరమ విరోధి అయినటువంటి మన రాము మహాశయులు శత్రు మూకలను ఒంటిచేత్తో
తుదముట్టించిన సైనికుడి మాదిరి అంబరాన్నంటిన సంబరం జరుపుకోవడం ఏమిటో నా మట్టి బుర్రకి బొత్తిగా అర్ధమై చావడంలే!
తన విలువలికి కట్టుబడి, ప్రలోభాలకు లోనుకాకుండా ప్రభుత్వోద్యోగం కొనసాగిస్తున్న ఆర్. ఎస్. రెడ్డి గారు కూడా స్ఫూర్తిదాయులే కదా, వారికి నా అభినందనలు!!
It is most tragic that some of the news channels are exaggerating the incidents in Osmania and around Tarnaka by giving sensational and inciting scrolls.Media has no social and proffessional responsibility for a peaceful society and it has become a sadistic proffession by wishing more violence,bloodshed and civil war in the society so that it has got good food 24x7 to telecast.What a sorry state of our media!
JP.
@Edge gaaru
@"ఆర్. ఎస్. రెడ్డి గారు కూడా స్ఫూర్తిదాయులే కదా, వారికి నా అభినందనలు!"
ధన్యవాదాలు. నేను చేస్తున్నది అంత గొప్ప పని అని నేనేమీ అనుకోవట్లేదండీ. నాకు నచ్చనిది, నా మనసుకు తప్పనిపించినది నేను చేయకుండా ఉండడమే కాక ఖండిస్తున్నాను. పడిపోతున్న నైతిక విలువలు, వ్యక్తుల సామాజిక భాద్యతలపైన నేను వ్రాసిన వ్యాసా లు నా బ్లాగు http://dare2questionnow.blogspot.com/లో చూడగలరు.
@"ఆ సదరు మాజీ జడ్జి గారు వారి ప్రస్తుత అధికారాలను ఏమాత్రం వినియోగించకుండా...." మీ ఈ అభిప్రాయం తప్పు. ఆ జడ్జి గారి పూర్వోత్తరాలగురించి నాకు పెద్దగా తెలియకపోయినా, ఆయన స్పందించిన తీరు మాత్రం కరక్టే అని చెప్పగలను. ఎందుకంటే ఆయన నేషనల్ వేజ్ బోర్డ్ చైర్మన్-కానీ సమస్య ఒక రాష్ట్ర లేబర్ కమీషన్ కు సంభందించినది& వారి ద్వారా ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకున్నాక నేషనల్ వేజ్ బోర్డ్ స్పందించవలసి ఉంటుంది. వారు ఆ విధంగా ప్రాపర్ చానల్ లో విచారిస్తారు.
మరో విషయం-మనలో చాలామంది అక్కడికి రామోజీ రావు గారేదో వ్యవస్తకు అతీతుడైనట్టుగా సమర్ధించడం చాలా ఆక్షేపణీయం. ఆయన గారు ఎప్పుడైతే తను ఇన్నాళ్ళూ భోదిస్తూ వస్తున్న నీతి నియమాలను తుంగలో తొక్కి మార్గదర్శి వ్యవహారంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడో, అనేక భూ ఆక్రమణలకు పాల్పడ్డాడో అప్పుడే ఆయన సచ్చీలత సచ్చిపోయింది. పేరు ప్రఖ్యాతులు మాత్రం మిగిలే ఉండవచ్చుగాక, కానీ విలువలు నిశ్శేషమైన పేరు ఎంతగా భజాయించినా వినపడే శబ్ధాలు గాడిద గాండ్రింపుల్లా ఉంటాయేకానీ వేద పారాయణంలా జనుల మనసులను శ్ప్రుషించవు. ఓ అబ్దుల్ కరీం తెల్గీ, హర్షద్ మెహ్తా ల పేర్లుకూడా పాపులర్‌గానే ఉంటాయి, కానీ ఏం లాభం?
మరో విషయం: ఎంత సచ్చీలుడుగా పేరు గడించినా మన్మోహనుల వారు తప్పులను/ తప్పుడు మనుషులను ఉపేక్షించి నేడు సుప్రీం కోర్ట్‌తో అక్షింతలు వేయించుకుంటున్నాడు. అంతకంటే గొప్పవాడా ఈ రాజ గురివింద?
@RS Reddy gaaru
"ఆయన నేషనల్ వేజ్ బోర్డ్ చైర్మన్-కానీ సమస్య ఒక రాష్ట్ర లేబర్ కమీషన్ కు సంభందించినది& వారి ద్వారా ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకున్నాక నేషనల్ వేజ్ బోర్డ్ స్పందించవలసి ఉంటుంది. వారు ఆ విధంగా ప్రాపర్ చానల్ లో విచారిస్తారు."
మరదే నేనూ చెప్పేది. శర్మ గారు ఒక పిల్లర్ నుంచి ఇంకో పోస్ట్ కి వెళ్లారు, అంతకు మినహా మరేమీ జరగలేదిక్కడ. దానిని శర్మ గారి పోరాటంలో మరో అంకం గానో లేక ముందడుగు గానో అభివర్ణిస్తే కొంతవరకు సమజసంగా ఉండేది. అయితే దీనికి రాము గారు, మీరు, మరికొంతమంది, ఈనాడు యాజమాన్యం వారి నియంతృత్వ దాస్య సృంఖలాలలో మగ్గి పోతున్న యావన్మంది ఉద్యోగులు పండగ చేసుకోవలసినంత మహా విజయంగా ఉప్పొంగి పోవడం తొందరపడి ఒక కోయిల ముందే కూసిన చందంగా ఉంది. విప్రవినోది గారు "ప్చ్..అల్ప సంతోషులు..." అని నిట్టూర్చడంలో తప్పేమీ కన్పించడం లేదు మరి.
ఇంకో విషయం, ప్రస్తుత నేషనల్ వేజ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి మాజీ జడ్జి గారు తమ అధికారానికి లోబడి అంతకన్నా ఎక్కువ స్పందిచలేరు అని సర్దుకుపోయే మీబోటివారికి టి. ఎన్. శేషన్ గారిని గుర్తుచేయాలి. ఆయన సి.ఇ.సి గా అయ్యేంతవరకు భారత ప్రజాస్వామ్యం అనే స్వర్ణనిధిని కాపాడవలచిన ప్రధాన ఎన్నికల కమిషన్ అనే నాగు పాముకి కోరలున్నాయనే విషయం ఎవరికి తెలియలేదు.
@Edge garu
నేనొక విషయం సూటిగా అడగదలిచాను మిమ్మల్ని. పై విషయంలో మాజీ జడ్జి గారు స్పందించాల్సిన దానికన్నా తక్కువ స్పందించారా, రాము అవసరానికి మించి (యావన్మంది ఉద్యోగులు పండగ చేసుకోవలసినంత మహా విజయంగా) అభివర్ణించారా అనేది పక్కనబెడితే రామోజీ రావు గారి ఇలాఖాలో ఉద్యోగులకు అన్యాయాలు జరుగుతున్నాయనేది వాస్థవమా కాదా? మీరొకవేళ జర్నో అయినట్లైతే పైన చెప్పిన విధంగా శర్మ గారు వివక్షను ను ఎదుర్కున్నది నిజమేనా కాదా? ఆయన కంప్లైంట్ న్యాయమైనదేనా కాదా? చెప్పగలరు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో చదువుకున్న పాపానికి బాండ్లు వ్రాయించుకుని నాలుగైదేళ్ళుగా కొద్దిపాటి జీతంతోనే వెట్టి చాకిరీ చేయించుకుంటూ, బయటపడదామా అంటే సర్టిఫికేట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉందనేది వాస్థవమా కాదా?
@" టి. ఎన్. శేషన్ గారిని గుర్తుచేయాలి"
బాగా చెప్పారు. కానీ, అందరు ఐ.ఏ.ఎస్ లూ శేషన్లు కాగలిగితే, మనలాంటి ప్రజలందరమూ గాంధీజీలమూ కాగలిగితే అసలీ సమస్యలెలా వస్తాయండీ. అందుకే ఆయన శేషన్ లా కాకపోయినా ఆయన పరిధిలో ఆయన బాగానే స్పందించారని నేనభిప్రాయపడ్డాను.
@" మహా విజయంగా ఉప్పొంగి పోవడం...."
ఇది కొంతవరకు కరక్టే కావచ్చు. అయితే "జర్నలిస్టుల వేతన సంఘం పెద్దగా ఊడపొడిచేది ఏమి వుంటుంది?...పైగా అనుక్షణం ఉల్లంఘనలకు గురవుతున్న జర్నలిస్టుల హక్కుల విషయంలో దీని పాత్ర సున్నా...."అన్న అభిప్రాయంలో ఉన్న రామూ గారికి అందుకు విరుద్ధంగా కొంత రిజల్ట్ కనిపించేసరికి కాస్త ఎక్కువ సంతోషించియుండొచ్చు.
ఏది ఏమైనా ఒకవేళ మన లేబర్ కమీషన్ వారు కూడా మజీఠియా గారిలాగే స్పందించి నిస్పాక్షిక విచారణ గానీ జరిపితే రాముగారితోపాటూ మనందరికి కూడా అమితానందం కలుగుతుందని ఆశిద్దాం:)
barkadutt+nira radia+2g scam episode meeda mee opinions rayandi ..please
Let all of us take pledge to end discrimination against GIRL Child. More on this pl.Read @ http://dare2questionnow.blogspot.com/2010/11/blog-post_24.html
గవురవనీయులు రాము గార్కి,
మేము ఒక ప్రైవేత్ కంపెనీలొ పని చేస్తున్నాం.
సదరు కంపెని కి రిజిస్త్రేషన్ కూదా లేదని మేము ఉద్యొగం నుంచి బయతకు వచాక తెలిసింది.
మాకు ఒక నెల జీతం కుదా ఇవ్వలి.
ఈ కంపని సికింద్రబదు లొ ఉంది కాని అమెరిక అద్రస్సు తొ కర్యకలాపలు సాగిస్తున్నరు .
పది వేలు జీతం ఇస్తె అందులొ రెందు వేలు సెక్యురితి దిపజిత్తు కింద లాకునంతున్నదు .
ఆద ఉద్యొగినునల తొ అసభ్యంగా ప్రవర్తిస్తదు .
దాదాపు వంద మందిని ఒక చిన్న అద్దె ఇంతిలొ ఉంచి పని చెయిస్తున్నదు .
పనిచెసె వారికి కనీస వసతులు కుదా లేవు.
కంపెనికి లెబరు లైసెన్సు కుదా లెదు. పరిమిథికి మించి కరంతు కనక్షన్లు అన్యంగా వాదుతున్నదు.
కనిసం కంపెనికి బొర్దుకుదా పెత్తలెదు.
దీనికి తొదు విసఖపత్నం నుంచి అంధ్ర విస్వ విద్యలయం నుంచి 20 మందిని క్యంపస్ రిక్రుతుమెంతు చెసారు. గీతం కలసల నుంచి కుదా ఇధె పద్దతిలొ రిక్రుతు చెసారు.
ఒక తదు బొంగరం లెని కంపెని ఇది.
నాకు 30వేలు బకయి ఉన్నరు. నా పరిస్థితి ఎవరికి చెప్పుకొవలొ తెలియక మీకు విన్నవించుకుంతున్నను.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి