Tuesday, December 21, 2010

జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఎన్నికలకు రంగం సిద్ధం

ఐదేళ్లకొకసారి జరిగే 'జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్  సొసైటీ లిమిటెడ్' ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది.769 మంది సభ్యులు తొమ్మిది మంది డైరెక్టర్స్ ను బుధవారం హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ లో ఉన్న సొసైటీ కార్యాలయంలో జరిగే ఎన్నికల్లో ఎన్నుకోబోతున్నారు. ఇప్పుడు అధ్యక్షుడిగా వున్న దివాకర్, కార్యదర్శి గా వున్న వేణుగోపాల్ ల నాయకత్వాలలోని ప్యానల్స్ హోరాహోరీ తలపడుతున్నాయి. నాన్-అలాటీస్ పక్షాన పోరాడతామని చెబుతున్న వీరాంజనేయులు ప్యానల్ కూడా రంగంలో వుంది. దివాకర్ ప్యానల్ లో జీ-ఛానెల్ హెడ్ ఆర్.శైలేష్ రెడ్డి వుండగా, వేణు గోపాల్ ప్యానల్ కు 'ఈనాడు' న్యూస్ ఎడిటర్ హోదాలో వున్న ఎన్.రాహుల్ కుమార్ మద్దతు ఇస్తున్నారని చెబుతున్నారు. తాను పనిచేస్తున్న ప్రజాశక్తి లో వున్న 29 ఓట్లకు తోడు 'ఈనాడు' జర్నలిస్టుల ఓట్ల తో తాను నెట్టుకు రాగలనని వేణుగోపాల్ వర్గం భావిస్తున్నది. 

"దివాకర్ ది బ్రాహ్మణ-రెడ్డి ప్యానల్ కాగా, వేణుగోపాల్ ది పక్కా కమ్మ ప్యానల్. వీరాంజనేయులు వీకర్ సెక్షన్ ప్రతినిధిగా ప్రచారం చేసుకుంటున్నారు. దివాకర్ ను తిట్టిపోసినా...ఇండియన్ ఎక్స్ ప్రెస్, ది హిందూ లోని బ్రాహ్మణ జర్నలిస్టులు దివాకర్ కు ఓటు వేస్తారు. ఆ ప్యానల్ కే విజయావకాశాలు ఎక్కువగా వున్నాయి," అని ఈ ప్రచారాన్ని దగ్గరి నుంచి చూసిన ఒక సీనియర్ పాత్రికేయుడు చెప్పారు. 

గత ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు గోపనపల్లి స్థలాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీరేమి చేశారు? అని అడిగితే అటు దివాకర్ గానీ, ఇటు వేణుగోపాల్ గానీ ఏమీ చెప్పుకోలేరు. అక్కడ ఒక ఆర్చ్ నిర్మించాలన్న ప్రతిపాదన ఒక అడుగైనా ముందుకు సాగలేదు.

గోపనపల్లి దగ్గర జర్నలిస్టుల కోసం స్థలం కేటాయించి పదహారు ఏళ్ళు అయినా...ఇంతవరకూ అక్కడ జర్నలిస్టులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. "అధునాతన షాపింగ్ కాంప్లెక్స్, స్కూల్ నిర్మాణం జరగాలి. లేకపోతే....జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడం వెనుక ఉద్దేశం నెరవేరదు," అని శైలేష్ చెప్పారు. నాన్-అలాటీ లకు స్థలం పొందడం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తేవడం, ప్రత్యామ్నాయం గా సభ్యులకు అపార్ట్ మెంట్స్ నిర్మించడం...వంటి ప్రణాళికతో తాము ప్రచారం చేసామని ఆయన చెప్పారు. తాము చేసిన అభివృద్ధి ను చూసి తమను గెలిపించాలని వేణుగోపాల్ బృందం కోరుతున్నది. ఓటర్ల వివరాల కోసం ఈ వెబ్సైటు చూడండి. 

3 comments:

చిలమకూరు విజయమోహన్ said...

జర్నలిస్టులలోకూడా" బ్రాహ్మణ-రెడ్డి ప్యానల్ , కమ్మ ప్యానల్, వీకర్ సెక్షన్ ప్రతినిధి"
మరి వీళ్ళే ప్రజలకు కులాలు,మతాల గురించి నీతులు బోధించేది.

astrojoyd said...

chennai loni TEJOUS koodaa peruku maatrame oka association tappa,ippati varaku oragabettindi emee ledu mari.edaadilo 4-saarlu hyderabad tour vesi raavadam tappinchi vaaru chesindemi ledu...

విజయ్ అనంగి said...

రింగ రింగా.. రింగ రింగా.. కులం, మతం వీటిపై మనకున్న ప్రేమను ఆదేవుడే కాదనలేడు. పీతశాస్త్రంలా మనల్ని మనమే చుట్టుకుని కుంచించుకు పోడంలో మనల్ని మించినోళ్లెవరు...? ఇంతకంటే... జర్నలిస్టులగా సమాజానికి ఏంచెబుతాం..? అందుకే రింగ్ శాస్త్రాన్ని బోధిస్తున్నాం.నీతులు చెప్పేటందుకు భలేగా ఉంటాయన్నది నిత్యసత్యం మరి!!