అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన దీక్ష దేశంలో పెద్ద సంచలనం సృష్టించింది. అవినీతి రాజకీయ నేతల పట్ల ప్రజలకు ఉన్న ఏవగింపు, ఆయనకు లభించిన మద్దతు అద్భుతమనిపించాయి. బీరుకు, బిర్యానీకి ఓటు అమ్ముకునే జనం, మనసు చంపుకుని నేతలకు కొమ్ముకాసే పోలీసులు- అధికారులు, పోలింగ్ రోజు సెలవను ఓటు వేయడానికి కాకుండా మరే పనికో వాడుకునే ఉద్యోగులు, నిమ్మకు నీరెత్తినట్లు ఉండే మేధావులు, న్యాయాన్ని తెగనమ్ముకుంటున్న న్యాయమూర్తులు, ప్రకటనల కోసం...డబ్బుకోసం ఎంతటి నీచానికైనా దిగజారే మీడియా అధిపతులు, జర్నలిస్టులు...ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయేట్లు ప్రవర్తిస్తున్న రోజుల్లో హజారేజీ దీక్ష సదాలోచనపరులకు, దేశభక్తులకు గుండెధైర్యాన్ని ఇచ్చింది.
అబద్ధాలు ఆడటం, అవినీతి పనులకు పాల్పడటం..వంటి పనులు మానుకుని సత్యనిష్ఠతో అందరం ఉంటే....సగం సమస్యలు తొలగిపోతాయని నా అభిప్రాయం. హజారే దీక్ష నేపథ్యంలో ది సండే ఇండియన్ పక్ష పత్రికలో నేను రాసిన కాలమ్..."అయ్య 'బాపు'రే...అన్నా హజారే..." మీ కోసం దిగువనిస్తున్నాను. హజారేకు కోటి రూపాయల అవార్డు ప్రకటించిన ఈ పత్రిక అధిపతి ఆరిందమ్ చౌదరి ఈ సారి హజారే మీద కవర్ స్టోరీ చేశారు. అందులో కొన్ని మంచి కథనాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ది సండే ఇండియన్ కాపీ కొనుక్కోండి...
1 comments:
So nice.
madhuri.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి