Saturday, December 31, 2011

బూదరాజు మెమోరియల్ లెక్చర్ కమిటీ ఏర్పాటు

మా గురువుగారు బూదరాజు రాధాకృష్ణగారి స్మృత్యర్ధం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటూ ఉన్నాం. ఎవరో చేస్తారని చేతులు కట్టుకుని, మూతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల ఏమీ చేయలేకపోతున్నాం. ఆయన సంస్మరణ సభలో కోతలు కోసిన వారంతా పని ఒత్తిడి పేరుతో కిమ్మనకుండా కూర్చున్నారు. ఆ జాబితాలో నేనూ ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఈ నిష్క్రియకు ఇక తెరపడాల్సిందే.

కొత్త సంవత్సరం ఆరంభంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఏదో ఒకటి చేయాలని కొందరు మిత్రులం సంకల్పించాం. జనవరిలో గురువుగారి పేరిట ఒక మెమోరియల్ లెక్చర్ నిర్వహించాలని తీర్మానించాం. దానికి సంబంధించి ఒక ముగ్గురు సభ్యులతో ఈ రోజున ఒక కమిటీ ఏర్పడింది. దాని వివరాలు ఇలా ఉన్నాయి.
1) ఎస్. రాము

2) ‍యు.సుధాకర్ రెడ్డి (డెక్కన్ క్రానికల్)
3) పి. విజయ్ కుమార్ (హెచ్ ఎం టీవీ)


గురువుగారి శిష్యులు దీన్ని వేరే విధంగా భావించకుండా కలిసిరావాలని అభ్యర్ధిస్తున్నాం. దీనిపై స్పందించాలని, మరిన్ని సూచనలు ఇవ్వాలని అనుకునే వారు ఈ బ్లాగ్ లో కనిపిస్తున్న ఐ.డీ.కి మెయిల్ పంపండి. ఘనంగా ఒక కార్యక్రమం చేద్దాం. అహం వీడి, ఉత్సాహంగా ముందుకు రండి.

4 comments:

శ్యామలీయం said...

శ్రీబూదరాజుగారు ఈనాడు ఆదివారం చిన్నపుస్తకంలో మాటలకు సంబంధించిన ఆసక్తికరమైన చర్చలతో కూడిన శీర్షిక ఒకటి నిర్వహిస్తుండేవారు. మీరు వారి స్మృత్యర్ధం ఒక మెమోరియల్ కార్యక్రమం చేయబూనటం ముదావహం.

వీలయితే ఈ క్రింది కార్యక్రమాలపై దృష్టి పెట్టండి.
1. వారి రచనలను వెలుగులోకి తీసుకురావటం.
2. వారికి సంబంధించె ఒక వెబ్ సైట్ నడిపించటం
3. వారికి సంబంధించిన విచయాలతో ఒక బ్లాగ్ నిర్వహించటం.
4. వారి పేరున ఒక స్కాలర్ షిప్ యేర్పాటు చేసి
యేటా యెంపిక చేసిన విద్యార్ధులకు సహాయం చేయటం.
5. వారి పేరున యేటికి రెండుసార్లయినా యేదయినా స్మారక ఉపన్యాసం యేర్పాటు చేయటం.

6. వారి పేరున యేటా వారం రోజులు / మూడు రోజుల వర్క్ షాప్ నిర్వహించి విషయాలు ప్రచురించటం (ముద్రణ మరియు వెబ్ లో)

ఇటువంటివి బూదరాజుగారి పేరునిలపటానికి తోడ్పడతాయని నా అభిప్రాయం.

Kishor said...

ఆయనకి సంబంధించి వెబ్ సైట్ తయారుచేసే సంకల్పం ఉంటే అందుకు నా సహకారం పూర్తిగా ఉంటుంది. వెబ్ జర్నలిజంలో నేను సంపాయించిన కాస్త ఎక్స్ పీరియన్స్ ఆయన కోసం ఉపయోగపడడం నాకు ఎంతైనా ఆనందకరం.

Ramu S said...

కిషోర్ గారూ...
మీరు చూపించిన చొరవకు థాంక్స్. మనం మెయిల్ లో టచ్ లో ఉందాం.
రాము
srsethicalmedia@gmail.com

प्रवीण् शर्मा said...

మీకు వెబ్‌సైట్ కావాలంటే http://greenhost.net.inలో రిజిస్టర్ చెయ్యండి. ఈ వెబ్‌సైట్లన్నీ నొయిడా (ఉత్తర్ ప్రదేశ్) డేటా సెంటర్లలోనే హోస్ట్ అవుతాయి.