Wednesday, July 4, 2012

ఈ తెలుగు నేల మీద...ప్రతొక్కడూ జర్నలిస్టే


నిజం మాట్లాడాలంటే...మన ఆంధ్ర దేశంలో జర్నలిజం ఒక వృత్తిగా స్థిరపడలేదు. ఇక్కడ ప్రొఫెషనలిజం కొరవడింది. ఇది రొడ్డకొట్టుడు జర్నలిజం. మన యజమాని కి రాజకీయ తీట ఉన్నా, ఏదైనా పదవి మీద ఆశ ఉన్నా, వ్యాపార ప్రయోజనాలు ఉన్నా....ఆయన అభిరుచికి అనుగుణంగా...అయన అవసరం తీరే విధంగా మన వార్తా సేకరణను, రాత తీరును మార్చుకుంటాం. స్టోరీ యాంగిల్ మొత్తం యజమాని అభిరుచిని బట్టి మారిపోతుంది. ఇది తప్పని జర్నలిస్టులు చెప్పలేని పరిస్థితి. యూనియన్ నేతలు వేరే పనుల్లో ఉండబట్టి...ఆదుకునే వాళ్ళు లేక నిజమైన జర్నలిస్టులు కుళ్ళి చస్తున్నారు. క్రమేణా తెలుగు జర్నలిజం లో తాలు సరుకు వచ్చి చేరుతున్నది.    

తెలివిగల ఈ యజమానులు పథకం ప్రకారం ఎడిటర్ల వ్యవస్థను కుప్పకూల్చారు. యాజమాన్యాలు ఎప్పుడూ 'మన పాలసీ' ఏమిటో  డైరెక్ట్ గా చెప్పవు. మనసు అర్థంచేసుకుని మెలిగే జర్నలిస్టులకు అర్హతతో నిమిత్తం లేకుండా ఉన్నత పదవులు ఇచ్చి పనులు చేయించుకుంటారు. తాము నిజంగా ప్రతిభావంతులమని భ్రమించి ఆ జర్నలిస్టులు యజమానికి సేవకుల్లా మారతారు....వృత్తి నిబద్ధత ను పక్కనపెట్టి. లేకపోతే...చదువు సంస్కారం లేని వాళ్ళు ఎడిటర్లు, సీ.ఈ.ఓ.లు కావడం ఏమిటండీ? 

ఇప్పుడు 'సాక్షి' లో పనిచేస్తున్న ఒక జర్నలిస్టును నేనీ మధ్యన అదే ఛానెల్ లో చూశాను. బాగా ఒళ్ళు చేశాడు. సాక్షి రిపోర్టర్ పై కేసుకు వ్యతిరేకంగా తను స్పీచ్ ఇస్తున్నాడు.  నేను ది హిందూ లో ఉన్నప్పుడు ఒక తెలుగు పత్రికలో పనిచేసే వాడు. కులాన్ని, ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుని కాబోలు ఇప్పుడు హైదరాబాద్ సాక్షికి ఒక పెద్ద పదవిలో వచ్చాడు. నల్గొండ లో ఆ అబ్బాయి ది డామినేంట్ కాస్ట్. లోకల్ గా  వ్యాపార ప్రకటనలు సేకరించే పని కూడా తను చేసే వాడు...కులం సాయంతో. నాకు తెలియక తన బండి మీద ఒకటి రెండు సార్లు ఎక్కి కలెక్టరేట్ కు పోయాను. ఒక సీనియర్ అధికారి నన్ను పిలిచి ఆ జర్నలిస్టు గురించి చెబితే అసలు విషయం తెలిసింది. తన కాపీ గానీ, మాట్లాడే విధానం గానీ జర్నలిజానికి అతకనివి. 

ఇలాంటి జర్నలిస్టులను కాస్ట్ లాయల్టీ ఆధారంగా నియమిస్తే...జర్నలిజానికి మచ్చ వస్తుంది. ఆత్మస్థైర్యం, సత్యం పట్ల విశ్వాసం, వృత్తి నిబద్ధత లేని ఈ తరహా జర్నలిస్టులు...లోకల్ గా తమ కులస్థులైన రాజకీయ నేతలను, అధికారులను, పోలీసులను, గూండాలను, కాంట్రాక్టర్లను మచ్చిక చేసుకుని వృత్తిని బ్రష్టు పట్టిస్తారు. ఇది నా కళ్ళ ముందు నిజంగా జరిగింది. ఈ జర్నలిస్టు అందరు సొంత కుల ఎం.ఎల్.ఏ.లను బుట్టలో వేసుకునే వాడు. ఒక యువ ఎం.ఎల్.ఏ.వీడు చెప్పినట్లు చేసేవాడు. ఆ జర్నలిస్టు పత్రిక యజమాని గుడ్ బుక్స్ లో ఉండే లా చూసుకునే వారు ఈ రింగులోని వివిధ రంగాల వారు. యజమానులకు కావలసింది వ్యాపార ప్రకటనలు. రిపోర్టర్ టార్గెట్ ను ఈ రింగు పూనుకుని పూర్తి చేసేది. దానివల్ల ఈ రిపోర్టర్ కు హైదరాబాద్ లో మంచి పేరు వుండేది. మంచి వార్తలు రాస్తాడన్న పేరు కాదు...పత్రికకు కావలసిన ప్రకటనలు ఇప్పిస్తాడన్న  పేరు. ఇలాంటి తుక్కుగాళ్ళకు అండగా...స్వ కులానికి చెందిన జర్నలిస్టు నేతలు! ఇది ఈ జర్నలిస్టు తప్పు కాదు. ఏదో బతకాలి కాబట్టి, జేబులు కొట్టడం నేరం కాబట్టి జర్నలిజం లో చేరాడు. ఎంగిలి మెతుకులతో పెళ్ళాం బిడ్డలను పోషిస్తున్నామని, అది తగని పని అని ఇలాంటి వాళ్ళు అనుకోలేరు.   
జర్నలిజాన్ని బాధ్యతా యుతమైన వృత్తిగా తీర్చి దిద్దడంలో యాజమాన్యాల అసమర్ధత వల్ల ఇది జరుగుతున్నది. 

ఈ పధ్ధతి వల్ల సమాజానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇక్కడ నీతికి విలువ లేదు. నీతి గురించి మాట్లాడే వారికి ప్రమోషన్లు రావు. బాకా బాబులు, కాకా రాయుళ్ళ స్వర్ణ యుగమిది. మొన్నీ మధ్యన టీ.వీ.-నైన్ జర్నలిస్టు ఒకరు ఆవేదనతో నాకు ఫోన్ చేశారు. కంట్రిబ్యూటర్లు బాగా సంపాదిస్తున్నారని...దీన్ని ఆపలేమా? అని ఆమె ఆవేదన చెందారు. యాజమాన్యాలే ప్రభుత్వాల నుంచి భూముల రూపంలో వేల కోట్లు సంపాదిస్తుంటే....కింది స్థాయి ఉద్యోగులు సత్య హరిచంద్రుల్లా ఉంటారా? వారూ...సందట్లో సడేమియాలాగా వ్యాపారం చేస్తారు. కొందరు మంచి జర్నలిస్టులు ఉన్నా...వారి సంఖ్య స్వల్పం. అలాంటి వారు కంపు భరించలేక వేరే వృత్తి వ్యాపకాలకు మరలుతున్నారు. తెలుగు జర్నలిజం ప్రమాదంలో ఉంది. తెల్ల దొరలకు వ్యతిరేకంగా భారత ప్రజలను చైతన్య పరచిన బాధ్యతాయుత మీడియా ఇప్పుడు అదే ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నది.  

మీడియా నియంత్రణకు ప్రభుత్వం చట్టం తెచ్చే పనిలో ఉంది. కానీ...జర్నలిస్టులు పత్రికా స్వేచ్ఛ పేరుతో ఆ పని కానివ్వరు. అందుకే..ప్రభుత్వం జర్నలిస్టుల నియామకానికి గట్టి నిబంధనలు తయారు చెయ్యాలి. ప్రతి అమాంబాపతు గాడు జర్నలిస్టు కాకుండా చర్యలు తీసుకోవాలి. మీడియా హౌజులు నడిపే జర్నలిజం స్కూల్స్ ను రద్దు చేయాలి, యూనివెర్సిటీ లలో జర్నలిజం విద్యను మెరుగు పరిచి...నైతిక జర్నలిజం పాఠాలు నూరిపోసి ఆ డిగ్రీ ల ఆధారంగా నియామకాలు ఉండాలని నిబంధన విధించాలి. లేకపోతే...ప్రజాభిప్రాయ రూపకల్పనకు ముఖ్య సాధనమైన మీడియా మరింత నీచానికి దిగజారి ప్రజాస్వామ్యాన్ని మరింత బ్రష్టు పట్టిస్తుంది.  

18 comments:

trinethrudu said...

రామూ గారూ,

ఎందుకండీ అంత ద్వేషం మీకు అందరి మీదా? ఇంతకుముందొకసారి ఇదే మాట కాస్తా కామెంటు రూపం లో రాస్తే నేను ఇలాగే రాస్తాను ఇంతే అన్నట్లుగా సమాధానమిచ్చారు.

నిన్న మీ "సాములోరి భక్తి" టపా మీద కూడా ఎవరో నా లాగే వ్యాఖ్యానించారు. మళ్ళీ మామూలే ఈరోజు ఈ టపా మీ బ్లాగులో.

www.apuroopam.blogspot.com said...

నిజానికీనాడు జర్నలిస్టులూ లేరు. వార్తాపత్రికలూ లేవు
ఉన్నవి యాజమాన్యాల బాకా కరపత్రాలూ , వారి సేవకబృందాలున్నూ.వృత్తి గౌరవమన్నది లేకుండా పోయింది. వీటిగురించి మాట్లాడక పోవడమే మేలని పిస్తున్నది.

Bendalam KrishnaRao said...

meeru cheppindi nijamee sir

- Bendalam Krishna Rao (Srikakulam)

astrojoyd said...

ur 100% correct ramu jee

shrigo said...

ఈ కుల జాడ్యం జర్నలిజంలోనే కాదు అంతటా తగలబడి చచ్చింది. అసలు కులమంటూ తెలియని(లేని) అమెరికాలోనయితే ఈమధ్య ఈ జాడ్యం విపరీతంగా జడలు విప్పింది. ఆంధ్రా ప్రాంతంలోని ఒక డామినేట్ కాస్ట్, తెలంగాణాలోని ఒక డామినేంట్ కాస్ట్ (ఈ కాస్ట్ రాష్ట్రమంతా ఉంది కాని తెలంగాణాలో ఇదే 'అగ్ర' భాగంలో ఉంది) వాళ్ళయితే పరాకాష్టా. తమ కులం వాళ్ళకే ఉద్యోగాలు ఇప్పించడం, సిఫారసు చేయడం లేదా రెస్యూములు పిక్ చేయడం(మార్కెటింగ్ ప్లేస్మెంట్ లో ఉన్నవాళ్ళు) లాంటివి చేస్తున్నారు. ఇక వారాంతపు పార్టీలలో అంతా వాళ్ళ వర్ణం వారే కలుసుకుంటారు. ఆంధ్రా వంతు అయింది ఇక అమెరికాను బ్రష్టు పట్టిస్తున్నారు, ఖర్మ...

విశ్వామిత్ర said...

మీడియలో నిజాలు ఒక్కొక్కటే బైటపెడుతున్నారే!! ఒకప్పుడు మీడియా గ్రేట్..జర్నలిస్టులు గొప్పవాళ్లు అంటున్నప్పుడు ఇవి గుర్తొచ్చే ఒళ్ళు మండేది. ఇంకా బైటపడవలసినవి ఉన్నాయి : ).... మీరు ఉదహరించే గొప్ప జర్ననిస్టులు ఉద్యోగాలు చేయలేక అక్కడ ఇక్కడ స్వంతంగా రాతలు రాసుకుంటూ బతుకుతున్నారు. మీడియాలో మిగిలింది పూర్తిగా ఇలాటి జాతే!!

Unknown said...

నమోన్నమహ:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

A very good and revealing post. We ant more such from your key board.

katta jayaprakash said...

A very good suggestion for the school of journalism.Let the universities increase the seats in the journalism course.All the schools of journalism run by media houses must be banned as these schools teach to become corrupt journalists.

Recently 0neTV journalist ha covered the activities by sand mafia and he was offered lakhs for silence the CDs but he bluntly refused.But they managed the higher people in the channel and prevented the telecast by offering him lakhs!

JP.

SHAM... The Inspiration said...

అసలిప్పుడు జర్నలిజం ఉందని ఎవరన్నారు..???

ఇప్పుడున్నదంతా కమ్యూనికేషన్ బిజినెస్. బిజినెస్ అంటేనే లాభార్జన. విలువలు, నైతికత అంటూ కూర్చుంటే లాభార్జన సాధ్యమా...???

పోనీ లాభార్జన వదులుకుని విలువలతో మీడియా సంస్థ మనుగడ సాధ్యమా...???

I, me, myself said...

unable to understand how government intervention will improve the situation...?!

K V Ramana said...

Very true anna. But, this is not limited to Telugu journalism alone. It's there in all languages including English. A media owner knows how to use the "shield" to get his things done either in politics or in business. Following their footsteps are the editors of these media houses. Then why exclude journalists? Which owner or editor will spare a journalist if what he wants is not done? One of our journalist friend confessed that he would do anything the boss wants as long as his salary is paid. No wrong. If you are looking pre independence journalism, then we need Gandhis to set up newspapers.

Sudhakar said...

trinetrudu : why are you so worried? this blog has all the stuff..may be you are reading only from one-perspective. Think lateral and neutral.

castro said...

ramu garu.. apuwj patrika "pratispandana" july issue lo varta udyogula kashtalapi vachina item blog patakula kosam ivvachu kadha...

evadaite enti said...

guru..emayyav guru...? no new threads? ...........

Kishor said...
This comment has been removed by the author.
Unknown said...

ప్రత్యర్థి మీడియా యాజమాన్యం మీద సహచర జర్నలిస్టుల మిత్రులకు ఎందుకు అంత అక్కసు. ఎవరిదగ్గర పని చేస్తే వారి గుండెను అమర్చుకుంటాం. రామోజీ దగ్గర పని చేస్తే మన గుండె రామోజీ రామోజీ అంటూ పలవరిస్తుంది. అలాగే జగన్ దగ్గరైతే గన్. గన్ అని రాధాకృష్ణ దగ్గరైతే రాధాకృష్ణ అని. సూర్య అయితే సూర్యప్రకాష్ అని వార్త అయితే సంఘీ అనో కొట్టుకుంటుంది. పేపర్ మా రిన మరుక్షణం గుండె కొట్టుకోవడంలో తేడా వస్తుంది. చానల్ అయినా అంతే. ఇది అనివార్యమైన పరిస్థితి. ఈ నిజాన్ని మనస్సు అంగీకరించదు . యాజమాన్యాల స్వేచ్చే మన స్వేఛ్చ అని తెలిసినప్పటికీ ఈ నిజాన్ని జీర్నించు కోలేమ్. మనం చేసేది డిబాచింగ్ అని మనకు తెలిసినా సమాజంలో మనకు ఫోర్త్ ఎస్టేట్ గా మంచి గౌరవం ఉంది. మేం లేని సమాజాన్ని ఉహించ లేరు అని గొప్పగా చెప్పుకునేంత సపోర్ట్ మనకు ఉంది. అందుకనే మనతోనే తెల్లారుతుంది అని చెప్పుకునే అంత ఎత్తులో ఉన్నాం. అధికార కేంద్రాలన్నీ మీడియా మీదే ఆధారపడటంతో అంతిమ తీర్పు మనదే అవుతుంది. మీడియా మీద ఎవరు ఎంత ఘీ పెట్టిన వారి పప్పులు మన దగ్గర ఉడకవు. మనం చెప్పే స్వీయ నియంత్రణ ఏమిటో అర్ధం కాక ప్రెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా జుట్టు పీక్కొవడం చూస్తున్నాం. స్వీయ నియంత్రణ యజమాని చేతిలో ఉందనే వాస్తవం మనం యాక్సెప్ట్ చేయలేం. అందువల్ల మన బతుకంతా నటనగా మారిపోయింది . ఏ యజమానికైనా స్వప్రయోజనలే ప్రధానం. అధికారం, కీర్తి ,సంపదలో ఎలా ఎలా పై పైకి వెళ్ళాలి. ఆదాయ పన్ను ఎలా ఎగ్గొట్టాలి . కార్మిక చట్టాల్ని ఎలా తుంగలో తొక్కాలి. అడ్డదారుల్లోనైన యాడ్ లు ఎలా సంపాదించాలి. .సంపాదనను ఎలా పెంచుకోవాలి.నిలుపుకోవాలి. ఈ స్వభావం కనబడకుండా నిస్పక్షపాతంగా ఎలా కనపడాలి. మనం చేసే ఏ పనికైనా జర్నలిస్టు సిబ్బందిని క్రియాశీలకంగా ఎలా ఉంచాలి (మనం ఎప్పుడూ క్రియాశీలకంగా కంగానే ఉంటాం) ఇలా అన్ని కోణాల్లో యజమానులు ఎంత పక్కా తెలివితేటలతో ఉండటం మనకు తెలిసిందే . ఇవన్నీ తెలిసినా మనకుండే యాన్బిషన్లు మనకున్నాయ్ . బతుకు తెరువే గాకుండా అధికారం. గుర్తింపు. హోదా .. ఇలా సమాజం నిర్దేశించిన విలువలు మనలను నడిపి స్తూ ఉంటాయి. మనలనే కాదు అన్ని వ్యవస్థలను ఈ విలువలే నడ్పిస్తున్నాయ్. మన రాతలు, చర్యలు ఇంత కంటే భిన్నగా ఎలా ఉంటాయనేది పెద్ద క్వస్చిన్ మార్క్గ గా ఉంది . ప్రజలను బాదేయడంలో గ్రామస్థాయిలో పోలీసులు, రెవిన్యూ సిబ్బందిని దాటి ఎంతో ముదుకు వెళ్లిపోయారని విజయవాడలో మీడియా మిద జరిగిన సదస్సులో ఓ జర్నలిస్టు పితామహుడు తీవ్రంగా ఆవేదన చెందారు. నిజానికి గ్రామా స్థాయి . పట్టణ . నగర స్థాయి అంటూ విడిగా చూడలేం. అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయి అనడం కంటే అందులో మనం కూడా ఏమి భిన్నం కాదు అనే పచ్చి నిజాన్ని అంగీకరించ గలిగినా కూడా యజమానుల కోసం బట్టలు చించుకోకుండా ఉండలేం. మనకున్న ఈ నయిజాన్ని కనిపించకుండా అద్బుత భాషా శైలితో, నడకతో సునిశితంగా . మానవీయ కోణంలో మనల్ని మనం ప్రదర్శించుకోగలం. చింతామణి కి పాఠాలు చెప్పగలం . ఇది సినిసిజం . పెస్మిసిజం కాదు. తిరుగులేని వాస్తవం . అత్యున్నత విలువలతో సమాజాన్ని ముందుకు నడిపించే బ్రహ్మాస్త్రం అనే భావన ఉన్న జర్నలిజం నడక మన ప్రవృత్తికి భిన్నంగా ఎలా ఉంటుంది.

telugunews said...

మిత్రులు మీరు చెప్పింది నిజాం నిరంకుశం కన్నా ఎక్కువగా ఆంధ్రప్రభ లో నడిపిస్తున్నారు.
ఎడిటర్ మారాక సూర్య నుంచి వచ్చిన శర్మ ఇష్టానుసారం సీనియర్స్ని వేధించి మరీ సగనంపేసారు. తనగతం తెల్సిన డిటిపి సెక్షన్ అమ్మైల పరిస్తితి మరీ దుర్భరం. జీతాలు తెగ్గోసి పనిచ్చేయుంచుకొని... అదనపు పనివారంటూ మరీ పీకేశారు. ఈ విషయం జర్నలిస్ట్ సంఘాల భాద్యులమని చెప్పుకుని తిరిగే నేతాశ్రిలు ఆంధ్రప్రభలో పనిచేస్తున్న తోటి జర్నలిస్త్లకి జరిగిన అన్యాయం నిలదీసి అండగా నిలవలేదు సరికదా... వత్తాసు పలుకుతూ జైకొట్టడమే భాదాకరం.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి