Wednesday, September 26, 2012

సత్తిబాబు చేతికి జీ..24 గంటలు?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ జీ 24 గంటలు చానెల్ ను కొన్నట్లు సమాచారం. 75:25 లెక్కన చానెల్ కార్యక్రమాలను ప్రసారం చేయాలని బొత్స, జీ గ్రూప్ నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే....ఆ చానెల్ కార్యక్రమాలు మూతపడకుండా కొనసాగుతున్నట్లు అక్కడి ఉద్యోగులు తెలిపారు. ఇప్పటికే...జీ గ్రూప్ యాజమాన్యం అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టుల నుంచి రాజీనామా పత్రాలు స్వీకరించి అకౌంట్లు సెటిల్ చేసే పనిలో వున్నది.  శైలేష్ రెడ్డి వర్గీయులుగా ముద్ర పడిన సీనియర్లు కొందరు మినహా చాలా మంది జర్నలిస్టులు వేరే చానెల్స్ కు వెళ్ళిపోయారు. పూర్తి  వివరాలు అందాల్సి వుంది.

4 comments:

NIRANJAN RAO said...

ఏంటి రాము..ఎక్కడకి వెళ్ళావ్?
అదేమని అడిగితే మండి పడతావ్..ఇంకా వార్తలు అందే దేంటి..జీ ఇరవై నాలుగు గంటల్ని సత్తి బాబు తీస్కుని కూడా పదిహేను రోజులు ఐంది. అందులో employees సీవీ ఆర్ న్యూస్ లో , gemini లో , హేచ్చెం లో జాయిన్ అయ్యారు..జాయిన్ అయిన రెండు రోజుల్లో నే .జీ ఇరవై నాలుగు గంటలకి మల్లి వెళ్లారు..అంత ౩౦ వేలకి పైఅనే ఉండటం తో ...మళ్లీ జి నుంచి బయటకి వచ్చారు..తిరిగి కొత్త చానల్స్ లో కంటిను అవుతున్నారు..ఇంకో అదనపు సమాచారం.. సీవీ ఆర్ లో శివ వాళ్ళో మరో పిట్ట పడిందట..జీ లో కొత్త స్టాఫ్ recruitment రేపు ఒకటి నుంచి ఉంటుంది. 25 థౌసంద్ లోపు కుర్రాళ్ళని తిస్కోవాలని సత్తిబాబు ప్లాన్.
ఇక టెన్ టీవీ కి టీవీ నైనె నుంచి అనాధవర్ధన్ వెళ్ళాట్ట. టీవీ 99 కి లేడీస్ నే ఎక్కువ తిస్కున్తారట..తులసి లో పెద్దిరాజు ఆధ్వర్యం లో interviewlu
జరుగుతున్నాయి.

మొతానికి నువ్వు చాల లేట్ గురు..అందరికి అందిన తర్వాత..ఓ గంట తర్వాత న్యూస్ ఇచే etv ల ఉంటే ఎలా .

ఇక మరో మూత బడ్డ abc అనే అంకబాబు ఛానల్ ని తోట రాముడు అదే భావనారాయణ తీస్కుని ...ప్రేక్షకుల పై దాడి కి రెడీ అవుతున్నాట్ట. ఇందులోలో కూడా జీ ఉద్యోగులు జాయిన్ అయ్యారట..9 లక్షలకి 22 మండి ఉద్యోగులని డెస్క్ కి తిస్కున్నార్త ...అంటే ఇద్దరు యాభై వేల వాళ్ళు అనుకుంటే..మిగిలిన వాళ్ళు కొంత మంది ౩౦ వేలు , కొంతమంది 10 వేలు వాళ్ళు కావచ్చు

ఇక inews లో కందుల రమేష్ వదిలి వెళ్ళిన పాత్ర ని కేశవ్ అనే కుర్రోడు బీభత్సం గ పోషిస్తున్నాట్ట. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ..chariman చౌదరి సదరు కే శ్సావ్ ని ఎందుకో తెస్తే..ఆటను తలతిక్క నిర్ణయాలతో..డెస్క్ లో పాత్రలని మార్చేసాడట... అన్నట్లు inews ఎప్పట్లాగానే అమ్మకాని కి రెడీ..ఓ 50 కోట్లు ఉంటే ట్రై చేయండి

మహా ఛానల్ లో ఇస్తున్న చెక్కులు బౌన్సు అవుతున్నాయట..అసలు శాలరీ సంగతి ఏమో కానీ..ఎ చెక్కు ఇవ్వగానే వేసుకుంటే సరి.. లేకపోతె వెంటనే చెక్కు బౌన్సు అవుతుందట. కొత్త వాళ్ళ కోసం వెంకట్రావు ట్రై చేసిన ఎవరు రావడం లేదుట.

అబన్ ఆంధ్రజ్యోతి లో కొత్త కుర్రాళ్ళని తిస్కోడం లేదు..అంత etv వాళ్ళని మాత్రమే encourage చేస్తున్నారు. tv5 లో ఎప్పుడు ఎవరు పోతారో అని విజయకుమార్ కంగారు పడుతున్నట్ట..ఇప్పటికే rating పడిపోఎసరికి చైర్మన్ ఆగ్రహం గ ఉన్నాట్ట. సాక్షి లో జుంప్ జిలనిలు ఎవరో తెలిసి టైం కోసం
యాజమాన్యం వెయిట్ చేస్తోంది..పోగానే..కాస్ట్ అఫ్ ప్రొడక్షన్ తగ్గినట్లే అని..బెంచ్ పీపుల్ ని కూడా రెడీ గ పెట్టుకుంది..ఇటు వీళ్లు పోగానే. ఆ కొత్త వాళ్ళని తిసేస్కుంటుంది. అరవింద్ యాదవ్ కి ఉద్వాసన పలికింది. ఎన్న్ టీవీ కి మాత్రం ఇవేం పట్టవ్..ఎవరిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తిసేసుకుంటుంది..అంతే కానీ ఎవరిని పంపదు. సో హ్యాపీ ఇన్ ఎన్ టీవీ అని ఆ ఉద్యోగులు ఫీల్ అవుతున్నారు

ఇవాల్టి ఈ ముచట్లు చాలు

Ramu S said...

నిరంజన్ గారూ...
థాంక్స్. నేను ఈ మధ్య ఊళ్ళో లేను, ఉన్నా..జ్వరం దగ్గులతో మంచం పట్టాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. అందుకే లేటు.
ఇలాంటి సమాచారం తెలియగానే నాకు రాయండి. పోస్ట్ చేస్తాను.
థాంక్స్
రాము

Adi Narayana said...

నిరంజన్ గారూ మీ సేకరణ నిజంగానే సేక‘రణ’మే

Adi Narayana said...

niranjan ji mee sekarana super