Wednesday, September 5, 2012

తప్పులో కాలేసిన 'వాషింగ్టన్ పోస్ట్'

ఎవరి గురించైనా వ్యాసం రాయాల్సి వస్తే...మనం రాసేది రాస్తూనే...ఎవరి గురించి రాస్తున్నామో వారి వివరణ తీసుకోవాలనేది జర్నలిజం లో మౌలిక సూత్రం. చివరకు ఈ బ్లాగులో పోస్టు రాస్తున్నా...ఇలా వివరణ తీసుకోవాలని నియమం పెట్టుకున్నాను నేను. అయితే...ఆ ప్రయత్నాలకు సరైన స్పందన రాకపోగా...దురహంకారులైన జర్నలిస్టుల/సంపాదకుల/ యజమానుల తలబిరుసు కారణంగా ఆ నియమానికి స్వస్తి పలికాను. నిజానికి అది మంచి జర్నలిస్టు లక్షణం కాదు. ఈ విషయంలో నేను చేసేదీ తప్పే అని నేను అపుడప్పుడూ వగస్తుంటే...అలాంటి తప్పునే ఘనత వహించిన వాషింగ్టన్ పోస్ట్ కూడా చేసింది.
మన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మీద ఒక వ్యాసం ప్రచురిస్తూ....ఆయన అసమర్ధతను ఎత్తి చూపుతూ ఆయన్ను ఒక 'tragic figure' అని వర్ణించింది. 'silent' PM.....the shy, soft-spoken 79-year-old is in danger of going down in history as a failure  అని కూడా అది పేర్కొంది. deeply corrupt government, కు మన్మోహన్ నాయకత్వం వహిస్తున్నారని స్పష్టం చేస్తూ...."But the image of the scrupulously honorable, humble and intellectual technocrat has slowly given way to a completely different one: a dithering, ineffectual bureaucrat presiding over a deeply corrupt government." అని కూడా రాసింది. 
 భారత ప్రభుత్వం ఈ ధోరణిని ఖండించింది. ఇది 'ఎల్లో జర్నలిజం' అని పేర్కొంది. ఒక దేశ ప్రధానినే ఇలా అంటారా అని గర్జించింది. దాంతో...వాషింగ్టన్ పోస్ట్ సారీ చెప్పినట్లు సమాచారం. 'ఆయన వివరణ కూడా తీసుకుని వుంటే బాగుండేది. మేము రేపు ఒక ఖండన ప్రచురిస్తాం,' అని ఆ పత్రిక తెలిపినట్లు వార్తలు వచ్చాయి. 
ఎన్నో పులిజర్ అవార్డులు గెలిచిన పత్రిక ఇంత తప్పు చేయడం విస్మయం కలిగిస్తున్నది   

6 comments:

Anonymous said...

రాముగారు,
ఆ పేపర్ అలా రాయటానికి దాని కారణాలు దానికుంటాయి. ఈ మధ్య మన్మోహన్ గారు అలీన సదస్సుకు హాజరయ్యారు. తమ మాట వినకుండా అలా హాజరయినందుకు వాళ్లు పేపర్ ద్వారా ఇలాంటి రాతలు రాయిస్తారు. అయినా ఇన్ని రోజులు పత్రికారంగం లో ఉన్నారు. ఈ మీడియా వార్ గురించి మీకు తెలియదా? భారతదేశం, మనదేశ ప్రధాని గురించి, ఆయన పాలన గురించి వారికెందుకు అంత బాధ? ప్రపంచంలో ఎన్నో ఆఫ్రికా దేశాలలో పరిస్థితి బాగా లేదు వారి గురించి ఎమైనా బాధపడుతున్నారా? ఆ పేపర్ రాయటం ఇంత లోపే మన వాళ్లు ( NDTV ) దానిని తీసుకొచ్చి చర్చించటం, ఇంకా మనం మన మీద నమ్మకం లేకపోవటంవలన ఈ పరిస్థితి ఎదురౌతున్నాది. ఈ విదేశి పత్రికలొ వచ్చే వార్తలకు పెద్ద ప్రాముఖ్యతను ఇవ్వవలసిన అవసరంలేదు.

buddhamurali said...

ఓరి నాయనోయ్ గారు చెప్పింది బాగుంది. వాడిష్టం వాడేదో రాసుకున్నాడు అనుకోవాలి కానీ రాసిన వాడు మహనీయుడు అని బాధ పాడడం ద్వార వాళ్ళకు మరింత ప్రాదాన్యత ఇచ్చినట్టు అవుతుంది. ఒక విదేశీ పత్రిక మెచ్చుకుంటే పలానా దేశ పత్రిక మెచ్చుకుంది అని ఆ పార్టీకి చెందినా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, అలానే విమర్శిస్తే మనం అదిక ప్రాధాన్యత ఇస్తాం .. ఆ రెండు మనలోని బానిస లక్షణాలే ... ఈ స్తాయిలో మన దేశం లోని ఎన్ని పత్రికలూ విమర్శించలేదు . మరి అప్పుడెందుకు స్పందించలేదు .. బాబు అధికారం లో ఉన్నప్పుడు ప్రపంచం లోని ప్రముఖ పత్రిక లన్ని ఆయన పాలనను కీర్తించాయి. ఎన్నకల్లో ఏమయింది

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

Am not proficient in Hindi, but I learned one Hindi word "निकम्मा"from the then notorious Congress President Sitaram Kesari.
(Below is excerpt from online dictionary)
"निकम्मा" के लिये पर्यायवाची शब्द

1.) अयोग्य, अनुपयोगी, अप्रयत्नशील
2.) अयोग्य, अप्रयत्नशील, अनुपयोगी
3.) अयोग्य, अनुपयोगी, अप्रयत्नशील
4.) अयोग्य, अप्रयत्नशील, अनुपयोगी

Have read Washington Post's article and not a single word is objectionable.

As you mentioned in your post, Washington post is not apologized, but expressed its willingness to publish 'his' version as well..!!

Ramu S said...

నిన్న వచ్చిన ఒక ఏజెన్సీ కథనం ప్రకారం...మన్మోహన్ వెర్షన్ తీసుకోనందుకు సారీ చెప్పిందట ఆ పత్రిక. అందులో రాసిన అంశాల పట్ల 'సారీ' చెప్పలేదు.

Anonymous said...

/ but expressed its willingness to publish 'his' version as well..!!/

:)) I read somewhere..

"Never fight with a pig
both will get mud
and Pig likes it!"

The reporter would love to drag the spat for months! :))

Jai Gottimukkala said...

"10:22 Washington Post issues correction: The Washington Post has published a clarification on its report on the prime minister. It says: Correction:
An earlier version of this article failed to
credit the Caravan, an Indian magazine, for two statements that it originally published in 2011. The assertion by Sanjaya Baru, a former media adviser, that Singh had become an object of ridicule and endured the worst period in his life first appeared in the Caravan, as did an assertion by Ramachandra Guha, a political historian, that Singh was handicapped by his �timidity, complacency and intellectual dishonesty.� While both men told The Post that the assertions could accurately be attributed to them, the article should have credited the Caravan when it used or paraphrased the remarks.
The article has been updated. You can read the original article"

Source: Rediff (Sep-6-2012)

It appears the Post was using the assertions of Guha & Baru, not making an allegation.

This may soothen Singh & the Indian minions but open up a Zakaria type controversy!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి